অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

Outreach Volunteers

Outreach Volunteers

బాలల సంక్షేమ పథకాలు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)

ఆరేళ్లలోపు బాలల సమగ్రాభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.)
  • ఆరు సంవత్సరాల లోపు బాలల పోషకాహార పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం
  • బాలల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి రంగాన్ని సిద్ధం చేయడం
  • ఈ వయో పరిమితిలోని బాలల మరణాల సంఖ్యను, జబ్బునపడేవారి సంఖ్యను, పోషకాహార లోపాన్ని, బడి మానివేసే శాతాన్ని వీలున్నంత వరకు తగ్గించడం
  • బాలల అభివృద్ధికి దోహదం చేసే విధంగా, ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య విధాన పరంగా, అమలు పరంగా తగిన సమన్వయం సాధించడం.
  • బాలల సాధారణ ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార అవసరాలను గమనించగలిగే విధంగా, పోషకాహారం, ఆరోగ్య అంశాలలో తల్లులకు తగిన అవగాహన కల్పించడం
పోషకాహారం
  • 6 నెలలు-6 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాహారాన్ని సమకూర్చడంలో భాగంగా, అనుబంధ ఆహారాన్ని అందించడం, ఐ.సి.డీ.ఎస్. పథకంలోని ప్రధాన సేవలలో ఒకటి. పేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
  • లబ్ధిదారులకు, రెండురకాల అనుబంధ ఆహారాన్ని అందజేయడం జరుగుతున్నది.
  • వీటిలో ఒకటి, వెంటనే తినడానికి అనువైన ఆహారం ( రెడీ టు ఈట్ ఫుడ్ మోడల్ ...ఆర్ టి ఇ ) కాగా, రెండవది, స్థానికంగా లభించే ఆహారం ( లోకల్ ఫుడ్ మోడల్....ఎల్.ఎఫ్.ఎం.). ఒక్కొక్క లబ్ధిదారుకు, రోజుకు 2 రూపాయల వంతున ఖర్చుతో, ఈ అదనపు ఆహారాన్ని అందజేస్తారు.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ, " ఏ. పి. ఫుడ్స్ '', ఆర్.టి.ఇ. ని తయారుచేసి, 213 ఐ.సి.డి.ఎస్. కేంద్రాలకు సరఫరా చేస్తుంది. వెనువెంటనే మిఠాయి ఉండలు చేసుకోవడానికి వీలైన పొడి, స్నాక్స్ వంటి వాటిని ఏ. పి. ఫుడ్స్ సరఫరా చేస్తున్నది. ఈ ఆహార పదార్ధాలను గోధుమలు, చక్కెర, సోయా, విటమిన్లతో తయారుచేస్తారు. లబ్ధిదారులకు తినడానికి ఇచ్చేముందు, మిఠాయి పొడికి, కొద్దిగా నీళ్ళు కలిపి, వుండలుగా చేసి అందజేస్తారు. ఎప్పూడూ ఒకే రకమైన ఆహారంతో అందించడం ఆపి, ఇటీవల రకరకాల తినుబండారాలను ప్రవేశపెట్టారు.
  • అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని ( సప్లిమెంటరి న్యూట్రిషన్ ప్రోగ్రాం...ఎస్ ఎన్ పి ) స్థానిక ప్రజల భాగస్వామ్యంతో విస్తరించడానికి, నాణ్యతను మెరుగు పరచి, లబ్ధిదారులకు ఆసక్తిదాయకంగా చేయడానికి వీలుగా, 159 ఐ.సి.డి.ఎస్. కేంద్రాలలో, స్థానిక ఆహారాన్ని సరఫరా చేయడం జరుగుతున్నది.
  • స్థానిక ఆహార విభాగంలో ఈ కింది ఆహార పదార్ధాలను సరఫరా చేస్తున్నారు
    • వేడి పొంగలి
    • గోధుమ రవ్వ కిచిడి
  • స్థానిక ఆహార పదార్ధాల తయారీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంకోసం, కేర్- ఏ.పి. తో కలసి, రాష్ట్రంలోని నాలుగు ఐ.సి.డి.ఎస్. కేంద్రాల పరిధిలో ( వేములవాడ, సిరిసిల్ల, కూనవరం, తిరుపతి) స్థానిక ప్రజల నిర్వహణలో ఎస్ ఎన్ పి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
  • జాతీయ పోషకాహార కార్యక్రమం ( నేషనల్ న్యూట్రిషన్ మిషన్) కింద, మనరాష్ట్రంలో, పోషకాహార పరంగా వెనుకబడిన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో, పోషకాహారలోపం కలిగిన కౌమార (అడొలసెంట్) బాలికలకు ఆహారధాన్యాలను అందించడంకోసం, ప్రణాళికా సంఘం వారు కేంద్ర నిధులను అదనంగా కేటాయించారు. ఈ కార్యక్రమం కింద లభ్ధిపొందే ప్రతి బాలికకు, నెలకు 6 కిలోల బియ్యం ఇస్తారు.
దత్తత

అనాథ బాలలు, తల్లి దండ్రులు వదిలివేసిన బాలలు, నిర్లక్ష్యానికి గురయ్యే పిల్లలను ఎవరైనా దత్తత చేసుకుని, వారికి కుటుంబ వాతావరణాన్ని కల్పించి, ప్రేమను అందించి, వారిని అవగాహన చేసుకుంటూ, వారు సంతోషంగా జీవించగలిగే అవకాశాన్ని కలిగిస్తే, ఆ పిల్లలు వారిలో దాగివున్న నైపుణ్యాలకు, సామర్ధ్యాలకు పదునుపెట్టడానికి ఆ దత్తత ఎంతగానో ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.
ఒక చిన్నారి చక్కగా ఎదగడానికి అవసరమైన ఆత్మీయ, భౌతిక, ఆర్ధిక భద్రతను దత్తత ఆ పిల్లలకు అందిస్తుంది. అనాథ బాలలకు, నిర్లక్ష్యానికి గురైన పిల్లలకు, వదిలివేయబడిన పిల్లలకు ఎదురయ్యే, సామాజిక నిరాదరణ, దోపిడీ, దౌర్జన్యాల నుంచి మిక్కిలి నమ్మదగిన రక్షణ కవచంగా దత్తత వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి బాలలకు కుటుంబవాతావరణాన్ని అందించడమే, దత్తత ప్రథమ ప్రయోజనం.
స్వదేశీయులు దత్తత చేసుకోవడానికి, విదేశీయులు దత్తత చేసుకోవడానికి సంబంధించి, సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలలో భాగంగా, దత్తత వ్యవహారాల వనరుల కేంద్రీయ సంస్థ ( సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ---సి ఏ ఆర్ ఏ) ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1990 జులై మూడవ తేదీన జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సి ఏ ఆర్ ఏ , కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో, దత్తతకు సంబంధించిన అన్ని వ్యవహారాలను నిర్వహించే, నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దేశీయ, విదేశీయ దత్తతలకు సంబంధించి, సి ఏ ఆర్ ఏ ఎప్పటికప్పుడు రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీచేస్తుంటుంది. అనాథ బాలలకు, నిర్లక్ష్యానికి గురైన పిల్లలకు, వదిలివేయబడిన పిల్లలకు దత్తత ద్వారా పునరావాసాన్ని కల్పించే విషయమై, స్వదేశీ, విదేశీ దత్తతలకు అందుబాటులోవున్న బాలల సమాచారాన్ని సేకరించి, వర్గీకరించి, అవసరమైన సమాచారాన్ని సాధికారికంగా అందజేసి , దత్తతలను పర్యవేక్షించి, క్రమబద్ధీకరించే క్లియరింగ్ హౌస్ మాదిరిగా సి ఏ ఆర్ ఏ పనిచేస్తుంది.

దేశీయంగా దత్తత విధానం
  • దత్తత చేసుకోవాలనుకునే తల్లి దండ్రులు, తమ వివరాలను పొందుపరచి, అవసరమైన పత్రాలను జతచేసిన నిర్ణీత దరఖాస్తు పత్రాన్ని మూడు కాపీలు తీయించి, స్థానిక శిశు గృహం/ సంబంధిత జిల్లా మహిళా, శిశు అభివృద్ధి ఏజెన్సీ (డి డబ్ల్యు సిడిఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్ / హైదరాబాదులోని, రాష్ట్ర మహిళా భివృద్ధి , శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లోని దత్తత వ్యవహారాల విభాగ కార్యాలయం (స్టేట్ అడాప్షన్ సెల్ ఆఫీస్) లో అందజేయవలసి వుంటుంది.
  • జిల్లా మహిళా, శిశు అభివృద్ధి ఏజెన్సీ / రాష్ట్ర మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ కు చెందిన సామాజిక కార్యకర్త, దత్తత చేసుకోగోరే తల్లి దండ్రుల కుటుంబ వివరాలపై తన నివేదిక అందజేస్తారు.అనంతరం, దత్తత చేసుకోగోరే తల్లి దండ్రుల దరఖాస్తులను, వారు దరఖాస్తుచేసిన తేదీని బట్టి సీనియారిటీ జాబితాలో ఉంచుతారు. సీనియారిటీతోపాటు, దత్తతచేసుకోవానుకుంటున్నది అబ్బాయినా, అమ్మాయినా, వారి వయసెంత (ఏడాదిలోపు / 1-3 ఏళ్ల మధ్య / 3 ఏళ్లకు పైన) అనే అంశాల ఆధారంగా ఆ దరఖాస్తులను వర్గీకరించి, ప్రత్యేక జాబితాలను తయారుచేస్తారు
  • 11-08-2006 నాటి , జి.ఓ.ఎం.ఎస్ నం.20, డబ్ల్యు.డి.సి.డి శాఖ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం, సంబంధిత జిల్లాలలో శిశు సంక్షేమ సంఘాన్ని ( చైల్డ్ వెల్ఫేర్ కమిటి---సి.డబ్ల్యు.సి) ఏర్పాటుచేసింది.
  • అనాథ బాలలుగా సి.డబ్ల్యు.సి ప్రకటించిన పిల్లలను, దత్తతచేసుకోగోరే తలిదండ్రులకు, పైన పేర్కొన్న వర్గీకరణకు అనుగుణంగా, వారి వంతువచ్చినప్పుడు కేటాయించడం జరుగుతుంది.
  • దత్తతచేసుకోగోరే తలిదండ్రులు, కావాలంటే, ఆ శిశువును వైద్యపరీక్షలకోసం తమవెంట తీసుకు వెళ్ళడానికి అనుమతిస్తారు.
  • అనుగుణమైన తల్లి దండ్రులకుకోరుకున్న దత్తత శిశువు లభించిన తర్వాత, ఆ తల్లి దండ్రులతో, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పేరిట, 10 రూపాయల బాండు పేపర్‌పై హామీపత్రం రాయించుకుని, ఆ శిశువును వారి తాత్కాలిక సంరక్షణ (ఫాస్టర్ కేర్) కు అప్పగిస్తారు.
  • ఆ శిశువును తమ తాత్కాలిక సంరక్షణలోకి తీసుకున్న 15 రోజులలోగా, సంబంధిత చట్టం ప్రకారం, ఆ శిశువును తమకు చట్టబద్ధమైన దత్తత శిశువుగా అప్పగించాలని, కుటుంబ న్యాయస్థానం / సిటి సివిల్ కోర్టు జె జె బోర్డు కు దత్తత తీసుకోగోరే తల్లిదండ్రులు దరఖాస్తుచేసుకోవలసి వుంటుంది. అప్పుడు, న్యాయస్థానం, హెచ్ ఏ ఎం ఏ / జి ఏ డబ్ల్యు ఏ / జె జె చట్టం -2000 ప్రకారం, ఆ శిశువును, చట్టబద్ధమైన దత్తత శిశువుగా ఆ తల్లి దండ్రులకు అప్పగిస్తుంది.
  • దత్తతకు చట్టబద్ధత వచ్చిన తర్వాత, దత్తతను ( రిజిస్టర్) నమోదుచేస్తారు.
  • దత్తత నమోదు తర్వాత, ఆ శిశువుకు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాన్ని (బర్త్ సర్టిఫికేట్) ఇవ్వవలసిందిగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు గాని, జిల్లాలలోని సంబంధిత మునిసిపల్ కార్యాలయానికిగాని, ఫారం-1 లోదరఖాస్తు చేసుకోవలసి వుంటుంది.
దత్తత వ్యవహారాల సమన్వయ సంస్థ ( అడాప్షన్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ---ఏ.సి.ఏ)
  • దేశీయంగా దత్తతలను ప్రోత్సహించడానికి, దత్తతలపై అవగాహనను పెంపొందించడానికి ప్రస్తుతం మన రాష్ట్రంలో, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అజమాయిషీలో, అడాప్షన్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ---ఏ.సి.ఏ అనే ఒక కేంద్రీయ సంస్థ పనిచేస్తున్నది.
  • దత్తత చేసుకోగోరే తల్లి దండ్రుల, దత్తతకు అందుబాటులోవున్న పిల్లల వివరాలు ఈ సంస్థవద్ద లభిస్తాయి
  • ఈ సంస్థ, మన దేశంలోని ఇతర ఏ.సి.ఏ లతో సమన్వయం కలిగి వుంటుంది
  • దేశీయంగా దత్తత సాధ్యంకాని పిల్లల విషయంలో, విదేశీ దత్తతకు అభ్యంతరం లేదంటూ, క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను ఈ సంస్థ జారీ చేస్తుంది
  • ఏ.సి.ఏ సిబ్బంది వేతనాలకు, సంస్థ నిర్వహణకు అవసరమైన నిధులను సి ఏ ఆర్ ఏ అందజేస్తుంది.
బాలికా మండలులు
  • బాలికా మండలులు గ్రామాలలో ఏర్పాటవుతాయి. ఒక్కొక్క బాలికా మండలిలో 25-30 మంది కౌమార బాలికలు ( 11-18 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు ) వుంటారు. వీరిలో బడికి వెళ్ళే బాలికలు, బడి మానివేసినవారు కూడా వుండవచ్చు.
  • 2000 సంవత్సరం నుంచి, ఏడాదికి ప్రాజెక్టుకు 11 ఏ డబ్ల్యు సి ల వంతున, 63 ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి.
  • 2005-06 సంవత్సరంలో, ప్రాజెక్టుకు 11 ఏ డబ్ల్యు సి ల వంతున, మొత్తం 376 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి.
  • ఇప్పటివరకు, మొత్తం 3.40 లక్షల మంది కౌమార బాలికలతో, 11,340 బాలికా మండలులు ఏర్పాటయ్యాయి.
  • ఈ బాలికలను, స్థానిక ఏ డబ్ల్యు సి లకు అనుసంధానిస్తారు. అక్కడ , వారికి, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా వంటి సామాజిక అంశాలపైన; పరిశుభ్రత, ఆరోగ్యం, పోషకాహారం, ఇంటి పనుల నిర్వహణలో నైపుణ్యాలను పెంపొందించుకోవడంపైన అవగాహన కల్పిస్తారు.
  • ఇందిరమ్మ గ్రామాలలోని, 16,312 ఏ డబ్ల్యు సి లలోని , 4,89,360 కౌమార బాలికలకు ఐ ఎఫ్ ఏ టాబ్లెట్లు ఇస్తున్నారు.
  • సమ వయస్కుల బృందాలకు విద్యాకార్యక్రమాల పైన , వివాహ వయస్సు పైన, వివాహాలనమోదుపైన హెచ్ ఐ వి / ఎయిడ్స్ పైన, మనుషుల అక్రమ రవాణా నిరోధక చర్యల పైన, శరీరంలో ఇనుప ధాతువు హెచ్చు తగ్గులవల్ల తలెత్తే సమస్యలపైన, పిల్లలకు ఆహారం అందించవలసిన తీరుపైన అవగాహన కలిగించే, శిక్షణలు ఇస్తారు.
బాలికా సంరక్షణ పథకం

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం (జెజె) శాఖ, 05-05-2005 న బాలికా సంరక్షణకు సంబంధించి జి. ఓ. ఎం. ఎస్ నం. 16 పేరిట, కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో బీమా సౌకర్యం కూడావుంది.

పథకం ఆశయాలు
  • ప్రభుత్వమే నేరుగా కొంత (సొమ్ము) పెట్టుబడి పెట్టడం ద్వారా, ఆడ సంతానంపట్ల వివక్షతను తొలగించడం
  • బాలికలను బడిలో చేర్చేవిధంగా ప్రోత్సహించడం, కనీసం ఇంటర్మీడియెట్ వరకైనా ఆ బాలిక చదువు కొనసాగేలా శ్రద్ధ వహించడం
  • ఆడ పిల్లలు 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్ళి చేసుకునేలా ప్రోత్సహించడం (అది చట్టబద్ధమైన వివాహ వయో పరిమితి)
  • బడిమానేసే బాలికల శాతం తగ్గడానికి కృషిచేయడం
  • ఇద్దరు ఆడసంతానం కలిగిన తలిదండ్రులను కుటుంబ నియంత్రణ పాటించేలా ప్రోత్సహించడం
  • బాలికలకు సామాజిక, ఆర్ధిక సాధికారత కల్పించడం
  • ఆడపిల్లల పట్ల అన్నిరకాల వివక్షతను తొలగించడం
  • ఆడపిల్లలపట్ల వ్యతిరేక భావాన్ని, ఇతర సాంస్కృతిక దురాచారాలను రూపుమాపడం
  • బాలికల హక్కులను ప్రోత్సహించి, పరిరక్షించడం; వారి అవసరాల పట్ల, సామర్ధ్యాల పట్ల అవగాహనను పెంపొందించడం
  • విద్యవిషయంలో బాలికలపట్ల చిన్నచూపును పోగొట్టి, వారి నైపుణ్యాలను పెంపొందించే శిక్షణలు ఇవ్వడం
  • బాలికల ఆరోగ్యానికి, పోషకాహారానికి సంబంధించిన వివక్షతను తొలగించడం
  • కుటుంబంలో ఆడపిల్లల స్థాయి మెరుగుపడేలా, ఆడపిల్లలపట్ల కుటుంబ వైఖరిలో సానుకూలమైన మార్పును తీసుకురావడం
ముఖ్యాంశాలు
  • గ్రామాలలో అయితే, ఏడాదికి 20,000/- రూపాయల లోపు, పట్టణాలలో అయితే ఏడాదికి 24,000/- రూపాయలలోపు ఆదాయం కలిగివుండి, మూడేళ్ళ లోపు వయసు కలిగిన ఒకే ఒక ఆడ సంతానం వుండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కుటుంబాలకు, మొదటి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
  • ఇద్దరు ఆడసంతానం వున్న కుటుంబాలకు రెండవ ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఆ ఇద్దరు సంతానంలో రెండవ బిడ్డ వయసు మూడేళ్లకు మించకూడదు.
  • దరఖాస్తు చేసిన తేదీ నాటికి, ఆ బాలిక వయస్సునుబట్టి, ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హత వున్నదీ లేనిది నిర్ణయిస్తారు.
  • ఒకే ఆడ సంతానమైతే, తనకు 20 ఏళ్ళు నిండగానే, ఒక లక్ష రూపాయలు పొందడానికి ఆ బాలిక అర్హురాలవుతుంది.
  • ఇద్దరు ఆడ సంతానమైతే, వారికి 20 ఏళ్ళ వయసు నిండగానే, వారిద్దరూ చెరి 30, 000/- రూపాయలు పొందడానికి అర్హులవుతారు.
  • ఈ పథకం కింద లభించే మరొక ప్రయోజనం ఏమిటంటే, 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఆ బాలికకు సంవత్సరానికి 1200/- రూపాయలు స్కాలర్ షిప్‌గా ఇస్తారు.
  • మూడేళ్ళ వయసు నుంచి, ఆ బాలికకు జీవిత బీమా వర్తిస్తుంది
  • ఈ పథకం వర్తించే బాలిక, ప్రమాద వశాత్తు మరణిస్తే, ఆమె ఒకే ఒక ఆడ సంతానమైతే ఒక లక్ష రూపాయలు, ఇద్దరిలోఒక ఆడ సంతానమైతే, 30,000/-రూపాయలు ఆమె తల్లి దండ్రులకు లభిస్తుంది. ఇందుకు సంబంధించి, వారు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించవలసి వుంటుంది.
  • తల్లిదండ్రులలో ఎవరో ఒకరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని వుండాలి
  • ఈ వర్గీకరణ కిందకు వచ్చే బాలికలలో, అక్రమ రవాణాకు గురైన, వేశ్యావృత్తిలోకి దింపబడిన బాధితులకు ప్రాధాన్యం ఇస్తారు.
  • 2005-06 సంవత్సరానికి 40,423 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్నిమంజూరు చేయడం జరిగింది.
బాలల సంరక్షణ కేంద్రాల (చిల్డ్రన్ హోమ్స్) లో విద్యా సౌకర్యం

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, రాష్ట్రంలో 81 ' బాలల సంరక్షణ కేంద్రాలను ' నిర్వహిస్తున్నది.అనాథ బాలికలు, పాక్షికంగా అనాథలు, వికలాంగ తలిదండ్రుల, మాజీ సైనికుల పిల్లలకోసం ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 6-10 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలను ఈ కేంద్రాలలో చేర్చుకుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో , 12 ఏళ్ళ వయసు వరకు బాలలకు కూడా , ఈ కేంద్రాలలో ప్రవేశం లభిస్తుంది. 10 వతరగతి వరకు, లేదా 18 ఏళ్ళ వయసు వరకు, ఏది ముందైతే అంత వరకు, బాలలకు ఆహారం / ఆశ్రయం / దుస్తులు / వైద్య సంరక్షణ అందజేస్తారు. బాలల తెలివితేటలను అన్నివిధాల పెంపొందించడంకోసం, కంప్యూటర్ శిక్షణ / క్రీడలు /యోగా / 6 నుంచి పదవ తరగతి వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు / బుల్ బుల్స్, గైడ్స్ / సృజనాత్మక కళలలో శిక్షణ వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు.

అనాథలకు / దిక్కులేనివారికి (డెస్టిట్యూట్స్) అందించే సేవలు
  • బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా...
  • కళాశాల స్థాయి సంరక్షణ కేంద్రాల ద్వారా...
శిక్షణ కార్యక్రమాలు

రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలలో, మహిళా ప్రగతి ప్రాంగణాలద్వారా

ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటు
  • ఏడాదికి, ఒక లక్ష రూపాయలకు మించని కుటుంబ ఆదాయం కలిగిన ఎస్ సి / ఎస్ టి / బి సి / మైనారిటి / వికలాంగ / ఆర్ధికంగా వెనుకబడిన బాలలకు ఫీజు పూర్తిగా తిరిగి చెల్లింపు / స్కాలర్‌షిప్పులు
  • హైదరాబాద్ యూసఫ్‌గూడలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో, డిప్లొమా కోర్సులలో అనాథ బాలలకు / దిక్కులేనివారికి 70 % రిజర్వేషన్లు
బాలల సంరక్షణ సమస్యలు- ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తీసుకున్న చర్యలు
  • బాలలపై హింసాత్మక సంఘటనలు పెరిగిపోతున్న దృష్ట్యా, బాలల హక్కులను పరిరక్షించి, వారికి శారీరక రక్షణ, ఆత్మ గౌరవ సంరక్షణ, వ్యక్తిగతమైన విషయాలకు భద్రత కల్పించడంకోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ కింది చర్యలను తీసుకున్నది:-
  • అన్ని పోలీస్ స్టేషన్లలో , ప్రత్యేకంగా, బాలల వ్యవహారాల పోలీసు విభాగాలను ఏర్పాటుచేశారు. 2006 లో సవరించబడిన, బాలల న్యాయం ( భద్రత, సంరక్షణ) చట్టం, 2000 ప్రకారం , రాష్ట్ర ప్రభుత్వ హోమ్ (పి ఎస్& సి) శాఖ , 5-1-2008 న జారీచేసిన జి.ఓ.ఎం.ఎస్ నం. 5 ఉత్తర్వు మేరకు ఈ ఏర్పాటు జరిగింది.
  • రైల్వే పోలీసు స్టేషన్లతో సహా, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లను / ఎస్.ఐ.లను ‘ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు ’ ( సి డబ్ల్యు ఓ లు) గా హోదా మార్పుచేయడం జరిగింది. పోలీసు స్టేషన్లలో, బాలల వ్యవహారాల ప్రత్యేక పోలీసు యూనిట్ల(ఎస్ జె పి యు) లో, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు అనే గుర్తులను, బోర్డులను స్పష్టంగా కనపడే విధంగా వుంచాలని, అన్ని ఎస్ జె పి యు లలో, పోలీస్ స్టేషన్లలో బాలలు సన్నిహితంగా మసలుకోగలిగే వాతావరణాన్ని కల్పించాలని, ఈ యూనిట్ల ఆఫీసర్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతోను, బాలల సంక్షేమ శాఖలతోను, సంబంధిత ఎన్ జి ఓలతోను సమన్వయంగా పనిచేయాలని ఎస్ ఎస్. పి / ఎస్ ఎస్. ఆర్.పి /సి ఎస్ . పి లను ఆదేశిస్తూ, 28-1-2008 న మెమో నం. ఆర్ సి .నం. 56 / పి ఎల్ / 1 / 2003 సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.
  • భద్రత, సంరక్షణ అవసరమైన పిల్లలతోను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే బాలలతోను వ్యవహరించడంలో పాటించవలసిన పద్ధతులు, అనుసరించకూడని విధానాలపై పోలీసు ఆఫీసర్లకు మార్గదర్శకాలను జారీ చేశారు.
  • ప్రస్తుతం అమలులోవున్న బాలల హక్కుల చట్టాలను పేర్కొంటూ, బాలల సంరక్షణను గురించి రూపొందించిన ఒక కరపత్రాన్ని అన్ని యూనిట్ల ఆఫీసర్లకు పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి, బాలల సంరక్షణ సంఘాలతోను, మానవ సంక్షేమ మండలి ( కౌన్సిల్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్ ) తోను, చైల్డ్ లైన్, దివ్య దిశ, ప్రజ్వల, అంకురం వంటి సేవాసంస్థలతోను సంప్రది స్తుండవలసిందిగా, ఆ కరపత్రంలో ఆదేశించడం జరిగింది. (18-2-2009 న , సర్క్యులర్ మెమో నం. ఆర్ సి నం. 56 / పి ఎల్ / 1 / 2003 గా ఆ కరపత్రాన్ని పంపిణీచేయడం జరిగింది).
  • మహిళలు లేదా బాలలు ఏ పనిమీదనైనా తమవద్దకు వచ్చినపుడు, వారితో నడుచుకోవలసిన తీరును గురించి, డిపార్టుమెంట్ / జిల్లా / డివిజన్ స్థాయి శిక్షణ కేంద్రాలలోను, నేరాల విషయమై జరిగే సమావేశాల (క్రైం మీటింగ్స్) లోను అవగాహన కలిగించవలసిందిగా, ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళలతో లేదా బాలలతో చెడుగా వ్యవహరించే ఎస్ హెచ్ ఓ లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా, 19-3-2008 న జారీ అయిన ఆ సర్క్యులర్ ( మెమో నం. ఆర్ సి . నం. 56 / పి ఎల్ / 1 / 2003 ) లో హెచ్చరించడం జరిగింది.
  • బాలలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలీసు యూనిట్ల ఆఫీసర్లుగా నియమితులైన డి సి ఆర్ బి ఎక్స్ లందరికి, ఏ పి పోలీసు అకాడమీ ప్రత్యేక శిక్షణను నిర్వహించింది.
  • మానవ అక్రమ రవాణా నిరోధక వ్యవహారాల నోడల్ ఆఫీసర్ గా కూడా వ్యవహరించే, ఏ పి, సి ఐ డి, అదనపు డి జి పి , బాలల, శిశువుల సంరక్షణ వ్యవహారాలనుకూడా పర్యవేక్షిస్తారు.
  • బాలల సంక్షేమ వ్యవస్థను, ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో సంస్థాగత అంశంగా చేయడం జరిగింది. యూనిట్ల ఆఫీసర్లు అందరూ, బాలల సంక్షేమ సంఘాలతోను , అన్ని జిల్లాలలోని సంబంధిత సేవాసంస్థలతోను సమన్వయం కలిగి వుంటారు.
  • ఐ టి పి, జె జె సి పి సి, బాల్య వివాహాల నిరోధక చట్టం, పి ఎన్ డి టి, ఇతర అన్ని సంబంధిత చట్టాల పై, ఎస్ ఐ లకు ప్రాథమిక శిక్షణలోనే అవగాహన కలిగించడం జరుగుతున్నది.

ఆధారము: http://wcdsc.ap.nic.in

 

మహిళల సంక్షేమ పథకాలు

(ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు అభివృద్ధి డైరెక్టరేట్)

స్వయం సిద్ధ

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు, మహబూబ్ నగర్ జిల్లా లలోని 14 బ్లాకులలో అమలుజరపడం కోసం, భారత ప్రభుత్వం 1996 సంవత్సరంలో, ' ఇందిరా మహిళా యోజన ( ఐ.ఎం.వై) ' పథకాన్ని మంజూరుచేసింది. క్రమేణా, ఐ ఎం వై పథకాన్ని, ‘ఐ.డబ్ల్యు.ఇ.పి ( ఇంటిగ్రేటెడ్ వుమన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం )’ గా పేరుమార్చి, 2001-07 వరకు అమలు జరిగే విధంగా పొడిగించారు. అమలు జరిపే బ్లాకుల సంఖ్యకూడా 38 కి పెరిగింది.
ఈ ఐ.డబ్ల్యు.ఇ.పి పథకాన్నే ' స్వయంసిద్ధ ' అంటారు. మహిళల స్థాయి, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, చట్టపరమైన హక్కులు, ఆర్ధికంగా పెరుగుదల, ఇతర సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై స్వయం సహాయ సంఘాల (ఎస్ హెచ్ జి ల) సభ్యులలో ఆత్మ విశ్వాసం, అవగాహన కలిగించడం ఈ పథకం ప్రధాన ఆశయం.

ఈ పథకంలోని మొత్తం ప్రాజెక్టులు : 38
మొత్తం సంఘాల సంఖ్య : 3,874
ఈ పథకం అమలుజరిగిన గ్రామాల సంఖ్య : 2,454
సంఘాలలోని మొత్తం సభ్యుల సంఖ్య : 53,598
పొదుపు చేయడం ప్రారంభించిన సంఘాల సంఖ్య : 3874
పొదుపుచేసిన మొత్తం సొమ్ము : 3,28,56,058 రూపాయలు
అంతర్గత అప్పులు ప్రారంభించిన సంఘాల సంఖ్య : 2818
అంతర్గత అప్పుల మొత్తం విలువ : 3,13,18,132 రూపాయలు
బ్యాంకు రుణాలు పొందిన సంఘాల సంఖ్య : 1722
బ్యాంకు రుణాల మొత్తం విలువ : 5,21,35,628 రూపాయలు

  • 3874 సంఘాలు ఆదాయ పెంపుదల కార్యక్రమాలను చేపట్టాయి. 3346 సంఘాలకు, ఒక్కొక్క సంఘానికి 10, 000/- రూపాయల వంతున, మొత్తం 334.60 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్(చక్రనిధి) గా మంజూరుచేశారు.
  • 2005-06 లో రాష్ట్ర స్థాయిలోను, బ్లాక్ స్థాయిలోను ఈ కింది కార్యక్రమాలను చేపట్టారు.
  • ఐ.ఇ.సి( సమగ్ర సమాచార) సామగ్రిని, శిక్షణ మార్గదర్శకాలను రూపొందించడం
  • సమస్యా పరిష్కారం, సమాచార నైపుణ్యాలు, సామర్ధ్య పెంపుదల , ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ, పుస్తకాల నిర్వహణపై శిక్షణలు ఇవ్వడం
  • సంఘాల పట్ల బ్యాంకులకు అవగాహన కలిగించడం, వర్క్ షాపులు నిర్వహించడం, సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించడం
  • సి.డి.పి.ఓ లకు, సూపర్‌వైజర్లకు ప్రాంతీయ స్థాయి వర్క్ షాపుల నిర్వహణ
  • సమన్వయ సమావేశాలు, ఇ డి( విద్యాభివృధ్ధి) కార్యక్రమాల నిర్వహణ
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 60:40 భాగస్వామ్యంతో, సామాజిక ఉపయోగం కలిగిన నూతన ప్రక్రియల పథకాన్ని ( కమ్యూనిటి ఓరియెంటెడ్ ఇన్నొవేషన్ ఇంటర్వెన్షన్ స్కీం ) ప్రారంభించడం
  • ఉత్పత్తి కేంద్రాలుగాకూడా ఉపయోగపడే, సామాజిక కేంద్రాలు, సి సి రోడ్లు, డ్రైనేజిలు, బస్సు షెల్టర్లు, కరకట్టలు,బోరుబావుల నిర్మాణం వంటి సామాజిక ఆస్తుల ఏర్పాటుకు సంబంధించిన 188 పనులను 87.60 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ వాటాతో చేపట్టడం జరిగింది.
పాలిచ్చే తల్లులకు, ఐ.సి.డి.సి ల ద్వారా సంక్షేమ పథకాలు
  • గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, అనుబంధ పోషకాహారం
  • మహిళలకు టీకాలు
  • మహిళలకు ఆరోగ్య పరీక్షలు
  • మహిళలను వైద్యచికిత్సకోసం ప్రత్యేక ఆస్పత్రులకు పంపించడం (రెఫెరల్ సర్వీసులు)
  • తల్లులకు, కౌమార బాలికలకు పోషకాహారంపైన, ఆరోగ్య సంరక్షణ పైన అవగాహన కలిగించడం
దిక్కులేనివారు, వితంతువులు, వదిలివేయబడిన భార్యల సంక్షేమం
  • స్టేట్ హోమ్స్ ద్వారా...
  • స్వాధార్ హోమ్స్ / రెస్క్యూ హోమ్స్ ద్వారా...
శిక్షణలు
  • స్టేట్ హోమ్స్ ద్వారా...
  • స్వాధార్ హోమ్స్ / రెస్క్యూ హోమ్స్ ద్వారా...
  • రాష్ట్రంలోని 23 జిల్లాలలో వున్న మహిళా ప్రాంగణాల ద్వారా...
ఉన్నత విద్య నేర్చుకోవడానికి తోడ్పాటు
  • ఏడాదికి, ఒక లక్ష రూపాయలకు మించని కుటుంబ ఆదాయం కలిగిన ఎస్ సి / ఎస్ టి / బి సి / మైనారిటి / వికలాంగ / ఆర్ధికంగా వెనుకబడిన బాలలకు ఫీజు పూర్తిగా తిరిగి చెల్లింపు / స్కాలర్‌షిప్పులు
  • హైదరాబాద్ యూసఫ్‌గూడలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో, డిప్లొమా కోర్సులలో అనాథ బాలలకు / దిక్కులేనివారికి 70 % రిజర్వేషన్లు
మహిళలకోసం చట్టాలు
  • వివాహాల నిర్బంధ నమోదు / ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాల నిషేధ చట్టం -2006 ద్వారా, బాల్య వివాహాలను నిరోధించడం
  • వివాహాల నిర్బంధ నమోదు చట్టం, 2002 , 2003
  • వరకట్న నిషేధ చట్టం- 1961
  • గృహహింస నిరోధక చట్టం-2005 అమలు

ఆధారము: http://wcdsc.ap.nic.in

 

బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పథకాలు

వీధి బాలల సంక్షేమ పథకాలు

వీధిబాలల సంక్షేమంకోసం, స్వచ్ఛంద సేవా రంగంలో అమలు జరిగే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని, బాలల సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుంది . ఈ పథకం కింద, సేవా సంస్థలు చేపట్టే , వీధి బాలల సమగ్రాభివృద్ధి ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 90 % కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతా, 10 % ఆ కార్యక్రమాలను నిర్వహించే సేవాసంస్థలు భరించవలసి వుంటుంది.

2008 జనవరి నాటికి, బాలల సంక్షేమ కేంద్రాల ( హోమ్స్) లో, బాలల సంఖ్యా వివరాలు

బాలల సంక్షేమ శాఖ నిర్వహణలో, బాలుర కోసం 6 చిల్డ్రన్స్ హోమ్స్, 9 అబ్జర్వేషన్ హోమ్స్ , 3 స్పెషల్ హోమ్స్ ; బాలికలకోసం 3 స్పెషల్ కం -చిల్డ్రన్ హోమ్, మరియు అబ్జర్వేషన్ హోమ్స్ వున్నాయి

క్రమ సంఖ్య

హోమ్ పేరు

2008 జనవరిలో
బాలల సగటు సంఖ్య

1

చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ , విశాఖ పట్నం

180

2

చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ , కడప

155

3

చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ , హైదరాబాద్

102

4

చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ , ఏలూరు

233

5

చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ , తిరుపతి

105

6

చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ , వరంగల్లు

54

7

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , హైదరాబాద్

42

8

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , అనంతపూర్

6

9

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , కర్నూలు

21

10

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , రాజమండ్రి

30

11

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , విశాఖ పట్నం

10

12

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , విజయవాడ

33

13

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , తిరుపతి

17

14

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , వరంగల్లు

29

15

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ , నిజామాబాద్

20

16

స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ , హైదరాబాద్

4

17

స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ , తిరుపతి

16

18

స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ , విశాఖ పట్నం

4

19

స్పెషల్-కం - చిల్డ్రన్ హోమ్ మరియు అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్ ,
హైదరాబాద్

61

20

స్పెషల్-కం - చిల్డ్రన్ హోమ్ మరియు అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్ ,
తిరుపతి

16

21

స్పెషల్-కం - చిల్డ్రన్ హోమ్ మరియు అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్ ,
విశాఖ పట్నం

28

మొత్తం : 1166

అప్పర్ ప్రైమరి ( ప్రాథమికోన్నత ) / హైస్కూల్ ( ఉన్నత ) స్థాయికి , పాఠశాలల స్థాయిని పెంచుట
2005-06 విద్యా సంవత్సరంలో, హైదరాబాద్ , కడప, విశాఖపట్నం లలోని బాలుర చిల్డ్రన్ హోమ్ లలో వున్న పాఠశాలలను అప్పర్ ప్రైమరి స్కూల్స్ గాను ; ఏలూరులోని బాలుర చిల్డ్రన్ హోమ్లోని పాఠశాలను హైస్కూల్ గాను, వాటి స్థాయి పెంచడం జరిగింది.

హొమ్స్ లలో ఉమ్మడి నిర్వహణ ( కో-మేనేజ్‌మెంట్ )

  • 1.4.2001 నుంచి , హైదరాబాదులోని నాలుగు హొమ్స్ లలో , సేవాసంస్థ లతో కలసి, ఉమ్మడి నిర్వహణ విధానాన్ని ప్రయోగాత్మకంగా, ప్రవేశపెట్టడం జరిగింది. అవి : జె హె చ్ బి - హైదరాబాద్ , ఓ హెచ్ బి - హైదరాబాద్ , ఎస్ హెచ్ బి - హైదరాబాద్ , గర్ల్స్ హోమ్ - హైదరాబాద్ . ఈ పథకానికి యునిసెఫ్ నిధులు సమకూరుస్తున్నది. సేవాసంస్థలతో అనుసంధానం ద్వారా, బాలల హొమ్స్ వ్యవస్థ లోను , నిర్వహణలోను సంస్కరణలు తీసుకురావడం ఈ విధానం లక్ష్యం . ఈ పథకం చాలా చక్కగా పనిచేస్తున్నది.
  • జిల్లాలలో మంచి పేరు ప్రతిష్ఠలు వున్న సేవాసంస్థలను గుర్తించి, ఇతర హోమ్స్ లలో కూడా ఈ పద్ధతిని అనుసరించడానికి వీలుగా, ఏ పి జె జె ( సి పి సి ) - 2003 నాటి నిబంధనలో కొత్తగా, ఉమ్మడి నిర్వహణ అధ్యాయాన్ని చేర్చడం జరిగింది.
  • రాష్ట్రంలోని ప్రతి హోమ్ కు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే ఈ పథకం సమర్ధంగా పనిచేస్తున్నది.

ఆధారము: http://wcdsc.ap.nic.in

వికలాంగుల సంక్షేమ శాఖ పథకాలు

రాష్ట్ర ప్రధాన కార్యాలయం
  • వికలాంగుల సంక్షేమ కమీషనర్ ఈ శాఖకు అధిపతి. పాలన, ప్లానింగ్, కార్యక్రమాల అమలు విషయంలో, కమీషనర్‌కు ఇద్దరు డిప్యూటి డైరెక్టర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు సహకరిస్తారు. వీరే కాకుండా, ఇతర వివిధ కార్యక్రమాల నిర్వహణలో, మరో ముగ్గురు అధికారులు ( ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్, ఒక ఫిజికల్ డైరెక్టర్) కూడా కమీషనర్ కు సహకరిస్తారు.
జిల్లా కార్యాలయాలు
  • జిల్లాలలో, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యక్రమాలను, ముఖ్యంగా, కలెక్టర్లే అమలుచేస్తారు. జిల్లా స్థాయిలోని, వికలాంగుల సంక్షేమం అసిస్టెంట్ డైరెక్టర్లు కలెక్టర్‌కు సహకరిస్తారు.
  • జిల్లా స్థాయిలో నిర్వహించే పథకాలలో ముఖ్యమైనవి ఇవి: ప్రభుత్వ హాస్టల్స్, హోమ్స్ నిర్వహణ; వివిధ రకాల స్కాలర్‌షిప్స్ మంజూరు; విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల సరఫరా; పునరావాసం, మొదలైనవి.
సంస్థలు

హాస్టల్స్ / హోమ్స్

  • రాష్ట్రంలో 40 హాస్టల్స్ , 3 హోమ్స్ వున్నాయి.
  • ఈ హాస్టల్స్, హోమ్స్ లోని వారికి (బోర్డర్స్‌కు), సబ్బులు, తలనూనె వంటి కాస్మెటిక్స్ కోసం ఒక్కొక్క అబ్బాయికి ( చిన్నవారైనా, పెద్దవారైనా ) 20 రూపాయలు , ఒక్కొక్క అమ్మాయికి ( చిన్నవారైనా, పెద్దవారైనా ) 25 రూపాయల వంతున చెల్లిస్తారు. ఒక్కొక్కరికి ఏడాదికి దుస్తుల అలవెన్స్ కింద 230 రూపాయలు , కుట్టు కూలీ కింద 40 రూపాయలు మంజూరుచేస్తారు.
  • హాస్టల్స్, హోమ్స్ లోని వారికందరికీ , ఏడాదికి , ఒక్కొక్కరికి 150 రూపాయల విలువైన నోటు పుస్తకాలు, జామెట్రిబాక్స్ , స్కేల్, మ్యాపుల వంటి విద్యార్థులకు అవసరమయ్యే స్టేషనరీ వస్తువులను సరఫరా చేస్తారు. పదవ తరగతి వరకు , వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలనన్నింటిని కూడా, వారికి ఉచితంగా అందజేస్తారు. ట్రంకు పెట్టెలు, పరుపుగా ఉపయోగించుకోదగిన సామగ్రి వంటివి కూడా వారికి ఇస్తారు.
వికలాంగుల, వృద్ధుల సంక్షేమంకోసం ఈ శాఖ అమలుచేసే పథకాలు
విద్యారంగం
  • వికలాంగులు, వృద్ధులకు సంబంధించి, కనుచూపు లోపం వున్న వారికోసం 5, వినికిడి లోపం వున్నవారికోసం 6 స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ప్రత్యేక గురుకుల పాఠశాలల) ను ఈ శాఖ నడుపుతున్నది.
  • కనుచూపు లోపం వున్న వారికోసం ఒకటి, వినికిడి లోపం వున్నవారికోసం మరొకటి,…మొత్తం రెండు... (గురుకుల జూనియర్ కళాశాలలు) రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు (విద్యార్థుల సంఖ్య 120).
  • వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహించే 40 హాస్టల్స్, పాఠశాల విద్యా శాఖ నిర్వహించే 5 ప్రత్యేక పాఠశాలలలో (3 వి హెచ్ + 2 హెచ్ హెచ్ ) విద్యార్థులకు వసతి ( రెసిడెన్షియల్ ) సౌకర్యం కల్పించడం

మెట్రిక్ దిగువ తరగతుల (ప్రి మెట్రిక్) విద్యార్థులకు స్కాలర్ షిప్స్

  • 1 నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న వికలాంగ విద్యార్థులకు, వారి తలిదండ్రుల / సంరక్షకుల సంవత్సర ఆదాయం .1, 00, 000/- రూపాల లోపు వుంటే, వారికి స్కాలర్ షిప్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి కొన్ని అలవెన్సులను, మంజూరు చేస్తారు.
  • ఓ హెచ్ విద్యార్థులకు, అంగ వైకల్యాన్ని తట్టుకోవడానికి ఉపయోగపడే ( ప్రోస్థెటిక్ / ఆర్థోపెడిక్) పరికరాల నిర్వహణ కోసం ఇచ్చే నెలసరి అలవెన్స్ , వి హెచ్ విద్యార్థులకు చెల్లించే నెలసరి రీడర్ అలవెన్స్ వివరాలను ఈ కింద చూడవచ్చు :

నెలసరి
స్కాలర్ షిప్

ఇతర అలవెన్స్ లు

నెలసరి
ట్రాన్స్&పోర్ట్ అలవెన్స్

(ఓ హెచ్ విద్యార్థులకు)

ప్రోస్థెటిక్ / ఆర్థోపెడిక్ పరికరాల నిర్వహణ కోసం నెలకు
(ఓ హెచ్ విద్యార్థులకు)

రీడర్ అలవెన్స్
నెలకు


(వి హెచ్ విద్యార్థులకు)

1

2

3

4

5

 

రూపాయలు

రూపాయలు

రూపాయలు

రూపాయలు

1 నుంచి 5

70/-

50/-

25/-

25/-

6 నుంచి 8

100/-

50/-

25/-

25/-

9 నుంచి 10

182/-

50/-

25/-

50/-

  • 1 నుంచి 10 వ తరగతి (ప్రి మెట్రిక్) వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా బ్రెయిలి పాఠ్యపుస్తకాల అందజేత
  • కాళ్ళు,కీళ్ళ జబ్బులు, వినికిడి లోపాలు కలిగిన హాస్టల్ విద్యార్థులకు ఏడాదికి 150/- రూపాయలు ఖరీదయ్యే నోట్ పుస్తకాలను; కంటి చూపు దెబ్బతిన్న విద్యార్థులకు బ్రెయిలిలో రాయడంకోసం దళసరి డ్రాయింగ్ షీట్లను సరఫరాచేయడం జరుగుతున్నది.
  • ప్రభుత్వ, లేదా ప్రైవేటు లేదా గుర్తింపు పొందిన, సంగీత కళాశాలలలో చదివే విద్యార్థులకు లేదా, వృత్తి నిపుణులకు, వారి తలిదండ్రుల లేదా సంరక్షకుల సంవత్సర ఆదాయం 1, 00, 000 /- రూపాయలకు మించకపోతే, ఒక్కొక్కరికి ఏడాదికి 1,000 /- రూపాయల లోపు విలువైన సంగీత పరికరాలను ఉచితంగా అందజేస్తారు.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం పొందని, సంబంధిత సేవాసంస్థలు నిర్వహించే, ప్రత్యేక పాఠశాలలలో చదివే, మానసిక వికలాంగ విద్యార్థులకు, (వారి తలిదండ్రుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూపాయలు మించకపోతే), ఒక్కొక్కరికి సంవత్సరానికి 1.000 రూపాయల స్కాలర్‌షిప్ ను మంజూరుచేస్తారు.

పోస్ట్ మెట్రిక్ (మెట్రిక్ తర్వాత తరగతులకు) స్కాలర్ షిప్స్

  • తలిదండ్రుల సంవత్సర ఆదాయం 1, 00, 000 /- రూపాయలకు మించని, ఇంటర్మీడియేట్, ఆ పై తరగతులు చదివే, వికలాంగ విద్యార్థులు, ఎస్ సి విద్యార్థులతో సమానంగా, ఈ క్రింద వివరించిన విధంగా స్కాలర్‌షిప్‌లకు అర్హులు:

క్ర.సం.

గ్రూప్

హాస్టల్ విద్యార్థి

విద్యార్థులు నిర్వహించే హాస్టల్

డే స్కాలర్

1

గ్రూప్– I

962

442

429

2

గ్రూప్– II

682

442

429

3

గ్రూప్– III

520

325

240

4

గ్రూప్– IV

520

325

182

  • తలిదండ్రుల, లేదా, సంరక్షకుల సంవత్సర ఆదాయం 1, 00, 000 /- రూపాయలకు మించని, ఐ టి ఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు, పుస్తకాలు, పరికరాల సరఫరా
  • తలిదండ్రుల, లేదా, సంరక్షకుల సంవత్సర ఆదాయం 1, 00,000/- రూపాయలకు మించని,ఎం.బి.బి.ఎస్., బి. ఇ., బి.టెక్., ఎం.బి.ఏ., కంప్యూటర్, బి.ఎడ్, వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే ''ఏ '' కేటగిరి సీట్ల విద్యార్థులకు, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులతో సమానంగా, ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు తిరిగి చెల్లించడం జరుగుతున్నది . (మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మరియు వికలాంగ సంక్షేమ (వికలాంగ సంక్షేమం-ఏ1) శాఖ 3.7.2008 తేదీన జారీచేసిన జి ఓ ఎం .ఎస్ నం. 21 ప్రకారం)
  • తాము కూడా మిగతా తమ తోటి మనుషుల లాంటి వారమే నని, వారికేమీ తీసిపోమన్న స్పృహను వికలాంగులలో కలిగించడం కోసం, ప్రతి ఏటా, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున, అంటే, డిసెంబర్ 3 వ తేదీన, వారికి ఆటలు, క్రీడలు, ప్రతిభా నైపుణ్య పోటీలను నిర్వహించడం జరుగుతున్నది.
  • వికలాంగ బాలికలకు ప్రాథమిక విద్యా సదుపాయం కల్పించడం కోసం, జిల్లా స్థాయిలో ఏడు కి జి బి వి పాఠశాలలను (వి హెచ్ బాలికలకు 2, హెచ్ హెచ్ బాలికలకు 5) ఏర్పాటుచేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ

  • టెక్నికల్ (సాంకేతిక) , నాన్ టెక్నికల్ ( సాంకేతికేతర) , ఒకేషనల్ ( వృత్తి విద్య) కోర్సులకు సంబంధించిన శిక్షణ,ఉత్పత్తి కేంద్రాల ద్వారా, , ఉద్యోగం పొందడానికి అనుగుణమైన వృత్తి శిక్షణను అందించే కార్యక్రమలను చేపడుతున్నారు.
  • అంథులకు దారిచూపే ఊతకర్రలు, హంసపాదులు (క్రచెస్), చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్ళు, కాలిపర్స్, వినికిడి పరికరాలు, వంటి ఉపకరణాలను, పరికరాలను, వాటి అవసరంవున్న ,వికలాంగులకు సమకూర్చడం జరుగుతున్నది.
  • బోధన, అధ్యయన పరికరాల ద్వారా చదువు నేర్పడం
  • కంటిచూపు దెబ్బతిన్నవారికోసం బ్రెయిలి ప్రెస్ ద్వారా పుస్తకాలు, పఠన సామగ్రి ముద్రణ
  • కంటిచూపు దెబ్బతిన్నవారికోసం, జాస్ ( జె ఏ డబ్ల్యు ఎస్ ) సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించుకుని, కంప్యూటర్ విద్యావకాశం కల్పించడం వంటివి చేపడుతున్నారు.
ఆర్ధిక పునరావాసం
  • ఈ పథకం కింద, తలిదండ్రుల, లేదా, సంరక్షకుల సంవత్సర ఆదాయం 1, 00, 000 /- రూపాయలకు మించని, వికలాంగులకు జీవన భృతిగా, ఒక్కొక్కరికి 3,000 రూపాయలకు మించకుండా, సబ్సిడీ ఇస్తారు.
  • 2007-08 సంవత్సరంలో, ఈ పథకం కింద, ప్రభుత్వం 88, 00,000/- రూపాయలు కేటాయించి, 77, 04,000/- రూపాయలు జిల్లాలకు విడుదల చేసింది. 2388 మంది వికలాంగులకు, 71, 64,000/- రూపాయలు ఖర్చుచేశారు.
  • 2008-09 సంవత్సరానికి, ప్రభుత్వం 1, 98,00,000/- రూపాయలు కేటాయించి, మొదటి, రెండు త్రైమాసికాలకుగాను, 99,10,000/- రూపాయలు విడుదలచేసింది. 2405 మంది వికలాంగులకోసం, 72, 14, 000/- రూపాయలు వెచ్చించడం జరిగింది. 3, 4 త్రైమాసికాల బడ్జెట్ ను, ప్రభుత్వం ఇంకా విడుదలచేయవలసివుంది.
అవయవాలు సరిగా వున్నవారు, వికలాంగులను వివాహం చేసుకుంటే, ప్రోత్సాహక అవార్డులు

కనీసం 40 % అంగ వైకల్యం వున్నవారిని, వివాహం చేసుకునే అవయవలోపం లేనివారికి, ప్రోత్సాహక నగదు బహుమతిగా, 10.000/- రూపాయలు అందజేస్తారు. 1.4.2008 తర్వాత జరిగిన ఇలాంటి పెళ్ళిళ్ళకు ఇది వర్తిస్తుంది,

టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలకు, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ.

తలిదండ్రుల, లేదా, సంరక్షకుల సంవత్సర ఆదాయం 1, 00, 000 /- రూపాయలకు మించని, వికలాంగులకు, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు.

పెట్రోలు / డీజిల్ కొనుగోలు

మోటారు వాహనం కలిగివుండి, సంవత్సరానికి 24.000/- రూపాయలకు మించని ఆదాయం వున్న వికలాంగులకు, వారు తమ నివాసం నుంచి, తాము పనిచేసే చోటికి పోయిరావడానికి తమ వాహనాలకు అవసరమయ్యే పెట్రోలు / డీజిల్ కొనుగోలుకు ప్రభుత్వం 50 % సబ్సిడీ ఇస్తున్నది. 2 హార్స్ పవర్ వాహనానికి 15 లీటర్లు , 2 హార్స్ పవర్ మించిన వాహనానికి 25 లీటర్ల వంతున , వాస్తవంగా వారు కొనుగోలుచేసిన పరిమాణానికి ఈ సబ్సిడీ లభిస్తుంది. ఈ పద్దు కింద, 2008-09 సంవత్సరానికి , ప్రభుత్వం 49,000/- రూపాయలు కేటాయించి, 36,000/- రూపాయలు జిల్లాలకు విడుదల చేసింది. ఈ పథకం కింద 20 మంది వికలాంగులకు, 24,000/- రూపాయలు ఖర్చుచేశారు.

పెన్షన్లు

దారిద్ర్య రేఖకు దిగువనవున్న వికలాంగులందరికి, వయసుతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తున్నది. ఈ పథకం కింద, అవయవ లోపాలు వున్న 7,90,471 మందికి , ఒక్కొక్కరికి నెలకు 500/- రూపాయల వంతున పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ పద్దు కింద నెలకు 39,52,35,500/- రూపాయలు, ఏడాదికి 4,74,28,26,000/- రూపాయలు వెచ్చిస్తున్నారు.

అంగవైకల్యం రాకుండా నివారించడానికి, వైకల్యాన్ని గుర్తించడానికి సదుపాయాలు
  • పల్స్ పోలియో టీకాల కార్యక్రమం, కుష్ఠు నివారణ కార్యక్రమం (లెప్రసి ఎరాడికేషన్ ప్రోగ్రాం), అంధత్వ నివారణ జాతీయ కార్యక్రమం, (నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్), మానసిక ఆరోగ్య జాతీయ కార్యక్రమం (నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం), శిశు సమగ్రాభివృద్ధి సేవలు ( ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) , అనుబంధ పోషకాహార కార్యక్రమం ( సప్లిమెంటరి న్యూట్రిషన్ ప్రోగ్రాం)...ఇవన్నీ అంగ వైకల్యాన్ని నివారించడానికి చేపడుతున్న కార్యక్రమాలే.పల్స్ పోలియో టీకాల కార్యక్రమం, కుష్ఠు నివారణ కార్యక్రమం (లెప్రసి ఎరాడికేషన్ ప్రోగ్రాం), అంధత్వ నివారణ జాతీయ కార్యక్రమం, (నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్), మానసిక ఆరోగ్య జాతీయ కార్యక్రమం (నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం), శిశు సమగ్రాభివృద్ధి సేవలు ( ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) , అనుబంధ పోషకాహార కార్యక్రమం ( సప్లిమెంటరి న్యూట్రిషన్ ప్రోగ్రాం)...ఇవన్నీ అంగ వైకల్యాన్ని నివారించడానికి చేపడుతున్న కార్యక్రమాలే.
  • వికలాంగులు, వృద్ధుల సహాయంతో వికలాంగులను గుర్తించడానికి అనేక విభాగాలతోకూడిన గుర్తింపు శిబిరాలను నిర్వహిస్తున్నారు.
వికలాంగులకోసం పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ చేపట్టిన కార్యక్రమాలు
  • సర్వ శిక్ష అభియాన్ ద్వారా, స్వల్పకాలిక శిక్షణ యిచ్చి, సాధారణ పాఠశాలలలో చేర్చడంకోసం, 70 గురుకుల అనుసంధాన విద్యా కేంద్రాలు (బ్రిడ్జ్ సెంటర్స్) పనిచేస్తున్నాయి.
  • అంగవైకల్యం ఎక్కువగా వున్న పిల్లలకు, తలిదండ్రులకు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కింద, ఇంటివద్దనే శిక్షణ అందిస్తారు
  • సేవాసంస్థ ల ఆధ్వర్యంలో 154 పాఠశాలలు నడుస్తున్నాయి. (కంటి చూపు దెబ్బతిన్న వారికోసం 32, వినికిడి లోపం వున్నవారికోసం 40, కాళ్ళు,కీళ్ళ జబ్బుల బాధితులకోసం 20, మానసిక వికలాంగ బాలలకోసం 62 )
  • 18 ఏళ్ళ వయసు వరకు ఉచిత విద్యా సౌకర్యం
  • 1, 34, 000 మంది వికలాంగ విద్యార్థులకు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ( వికలాంగ విద్యార్థులు, మామూలు విద్యార్థులు కలసి మెలసి, ఒకేచోట ఒకే విద్య నేర్చుకోవడం ) కార్యక్రమాన్ని, పాఠశాల విద్యాశాఖ అమలుచేస్తున్నది.
  • వికలాంగ విద్యార్థులకోసం, పాఠశాల విద్యాశాఖ, 5 ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తున్నది. (వి హెచ్ కోసం 3, హెచ్ హెచ్ కోసం 2).
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అన్ని సాధారణ విద్యా సంస్థలలో, వికలాంగ విద్యార్థులకోసం 3 % సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తున్నది. ఇంతేకాకుండా, విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ( రాజీవ్ మిషన్) కింద, మామూలు విద్యార్థులతోపాటు , ప్రత్యేక అవసరాలకు సంబంధించిన విద్యార్థులకు ప్రత్యేక (ఇంటిగ్రేటెడ్) పాఠశాలలను నడుపుతున్నది.
  • జిల్లాకు 5 వంతున ( కంటిచూపు లోపం వున్నవారికోసం 2, వినికిడిలోపం వున్నవారికోసం 3 ) రాష్ట్రంలో మొత్తం 115 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ మంజూరుచేసింది.
  • పదవతరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే అంథ అభ్యర్థులు, ఇతర వికలాంగ విద్యార్థులకు, 27.12.1976. వతేదీ నాటి జి ఓ ఎం ఎస్ నం: 1189, విద్యా (కె) శాఖ ఉత్తర్వుల ప్రకారం, ఈ కింది వెసులుబాటు కల్పించడం జరిగింది. (i) అదనంగా 30 నిమిషాల సమయం కేటాయింపు (ii) డయాగ్రమ్స్ ( రేఖా చిత్రాలు ) గీయడం నుంచి , ప్రదేశాలను, సరిహద్దులను గుర్తించడం నుంచి మినహాయింపు కల్పిస్తూ, కేవలం వాటి వివరాలను పేర్కొంటేనే పూర్తి మార్కులు వేయడం.
  • 19.3.2001 వ తేదీనాటి, జి ఓ ఎం ఎస్ నం: 33, విద్యా శాఖ ( పరీక్షలు) ఉత్తర్వు ప్రకారం, 7 వతరగతి, 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఈ కింది ప్రయోజనాలను కల్పిస్తున్నది:
  • అంథ, చెవిటి, మూగ విద్యార్థులకు,VII వ తరగతి, X వ తరగతి తుది పరీక్షలలో, అన్ని సబ్జెక్టులలో కూడా, ఉతీర్ణతకు కావలసిన మార్కులను 35 నుంచి 20 మార్కులకు తగ్గించారు.
  • ఈ వికలాంగ విద్యార్థులకు, అన్ని తరగతుల పరీక్షలలోను జంబ్లింగ్ పద్ధతిని రద్దుచేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే, వీరి సమాధాన పత్రాలను దిద్దవలసి వుంటుంది.
  • అంథ విద్యార్థులకు పరీక్షవ్రాయడంలో సహకరించే లేఖకుడు (స్క్రైబ్), X వ తరగతి పాసై వుండాలి.
  • హైదరాబాదులోని, ఇంటర్మీడియేట్ బోర్డ్ , కమిషనర్--సెక్రెటరి 9.4.2002 తేదీన జారీచేసిన, 81/ ఇ1 /2001-2002 ప్రొసీడింగ్స్ ప్రకారం, ఇంటర్మీడియేట్ చదివే , వినికిడి లోపం వున్న విద్యార్థులకు ఈ కింది వెసులుబాట్లు కల్పించారు. (ఎ) పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు (బి) ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలలో (I, II సంవత్సరాలకు) 30 నిమిషాల అదనపు సమయం కేటాయింపు (సి) పార్ట్ -I , లేదా పార్ట్-II లలో ఒక భాష మినహాయింపు
  • 18.2.1975 నాటి విద్యా శాఖ (సి 1) ఉత్తర్వు జి ఓ ఎం ఎస్ నం: 154 ప్రకారం, డిగ్రీ చదివే అంథ విద్యార్థులకు, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, రెండూ మినహాయింపు
  • ఇంజనీరింగ్, ఫార్మసి, ఎం బి ఏ, ఎం సి ఏ కోర్సులు చదివే వికలాంగ (అంథులు, వినికిడి లోపంవున్నవారు, కీళ్ల వ్యాధి పీడితులు) విద్యార్థులకు కూడా, పరీక్ష ఫీజు మినహాయింపు, ప్రతి సబ్జెక్ట్‌లో ఉతీర్ణతకు అవసరమైన కనీస మార్కులు10 % తగ్గింపు వెసులుబాటులను ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. 31.8.2006 వ తేదీనాటి, జి ఓ ఎం ఎస్ నం: 150 ఉన్నత విద్యా శాఖ (ఇ సి-2) ఉత్తర్వు, 22.8.2007 వ తేదీనాటి, జి ఓ ఎం ఎస్ నం: 152 ఉన్నత విద్యా శాఖ(ఇ సి-2) ఉత్తర్వుల ప్రకారం ఈ వెసులుబాట్లు కల్పిస్తున్నారు.
  • అంథ విద్యార్థులకు పరీక్షలలో స్క్రైబ్ లను ఏర్పాటుచేస్తున్నారు. ఇంటర్మీడియేట్ స్థాయినుంచి, వృత్తి విద్యా కోర్సుల వరకు, వీరికి , ఒక్కొక్కరికి, నెలకు 50 నుంచి 100 రూపాయల వరకు రీడర్ అలవెన్స్ చెల్లిస్తున్నారు.
రిజర్వేషన్లు
  • వయసుతో నిమిత్తం లేకుండా, తమసంస్థ బస్సులలో ప్రయాణించే వికలాంగులందరికి, సిటిలోను, శివారు ప్రాంతాలలోను పూర్తి ఉచిత పాసులు, గ్రామ ప్రాంతాలలో 50 % రాయితీ కలిగిన పాసులను ఏ పి ఎస్ ఆర్ టి సి అందిస్తున్నది. ఇంతేకాకుండా, కాళ్ళు,కీళ్ళ జబ్బుల విద్యార్థులకు, ఒక్కొక్కరికి ,నెలకు 50 రూపాయలు రవాణా అలవెన్స్ కింద చెల్లిస్తున్నారు.
  • గ్రూప్ సి, డి ఉద్యోగాలలో, వికలాంగులు చేయదగిన ఉద్యోగాలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28.9.1992 వ తేదీనాటి జి ఓ ఎం ఎస్ నం : 145, డబ్ల్యు .డి. సి. డబ్ల్యు. & ఎల్ శాఖ (డబ్ల్యు హెచ్ డెస్క్) ఉత్తర్వులను జారీచేసింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్రూప్-I, గ్రూప్-II సర్వీసులలో, వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నది. ఇందుకు సంబంధించి, వరుసగా, 9.10.2006 వ తేదీనాటి, జి ఓ ఎం ఎస్ నం : 297, డబ్ల్యు డి , సి డబ్ల్యు & డి డబ్ల్యు శాఖ ఉత్తర్వు, 13.4.2007 వ తేదీనాటి, జి ఓ ఎం ఎస్ నం :106, డబ్ల్యు డి , సి డబ్ల్యు & డి డబ్ల్యు (డి డబ్ల్యు) శాఖ ఉత్తర్వును ప్రభుత్వం జారీచేసింది.
  • ఉద్యోగాలలో, వికలాంగులకు 3 % రిజర్వేషన్లు కల్పించారు. వీటిని కనుచూపు లోపం వున్నవారికి, వినికిడి లోపం వున్నవారికి, కాళ్ళు,కీళ్ళ జబ్బులవారికి చెరి 1:1:1 నిష్పత్తిలో విభజించడం జరిగింది. ( 13.4.2007 వ తేదీనాటి జి ఓ ఆర్‌టీ. నం: 106, డబ్ల్యు. డి. సి. డబ్ల్యు & ఎల్ (డబ్ల్యు హెచ్ డెస్క్) శాఖ ఉత్తర్వు)
  • వికలాంగులకు స్వయం ఉపాధి పథకాలకోసం అన్ని శాఖలు తమ బడ్జెట్లలో 3 % ప్రత్యేకంగా కేటాయించాలని, 20.5.2002 నాటి జి ఓ ఎం ఎస్ నం: 24 లో ప్రభుత్వం ఆదేశించింది.
  • ఉద్యోగాలలో రిజర్వేషన్లను, వయో పరిమితిలో రాయితీలను మరి పదేళ్ళపాటు పొడిగిస్తూ, 29.4.2002 నాటి జి ఓ ఎం ఎస్ నం: 21, డబ్ల్యు డి, సి డబ్ల్యు & డి డబ్ల్యు శాఖ ఉత్తర్వును ప్రభుత్వం జారీచేసింది.
  • ప్రభుత్వ శాఖలలోను, ప్రభుత్వరంగ సంస్థలలోను వికలాంగులకోసం రిజర్వుచేసి, భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీలను (బ్యాక్‌లాగ్), స్పెషల్ రిక్రూట్6మెంట్ డ్రైవ్ పేరిట భర్తీచేయడానికి వీలుకల్పిస్తూ, 26.2.2002 నాటి జి ఓ ఎం ఎస్ నం: 9 డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు శాఖ ఉత్తర్వును ప్రభుత్వం జారీచేసింది. ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను 31.3.2010 వరకు , ఎప్పటికప్పుడు పొడిగిస్తూవస్తున్నారు. ఈనాటి వరకు ఈ స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ కింద , 2569 మంది వికలాంగులను ఉద్యోగాలలోకి తీసుకున్నారు.
  • అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు పేదరిక నిర్మూలన పథకాలన్నింటిలోను, వికలాంగులకు సంఖ్యాపరంగాను, ఆర్ధిక పరంగాను 3 % తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశిస్తూ, ప్రభుత్వం 9.1.2002 తేదీనాటి డబ్ల్యు డి & డి డబ్ల్యు (డి డబ్ల్యు ) శాఖ ఉత్తర్వు జి ఓ ఎం ఎస్ నం: 1 జారీచేసింది.
వికలాంగులకు ప్రభుత్వం అందించే ఇతర ప్రయోజనాలు:-
  • రాష్ట్రంలో గృహనిర్మాణ పథకాలలో వికలాంగులకు కొన్ని సదుపాయాలు కల్పిస్తూ, .27.3.2008 నాటి జి ఓ ఆర్‌టి నం:106, హౌసింగ్ (ఆర్ హెచ్ ఐ) శాఖ, ఉత్తర్వు జారీ చేసింది
  • అర్హులైన వికలాంగవిద్యార్థులకు కొన్ని పథకాల మంజూరుకు వీలుగా, వారి తలిదండ్రుల సంవత్సర ఆదాయ పరిమితిని 1, 00,000/- రూపాయలనుంచి పెంచుతూ, 10.4.2008 నాటి, డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు శాఖ ఉత్తర్వు జి ఓ ఎం ఎస్ నం: 9 జారీ చేసింది
  • హాస్టల్స్, హోమ్స్, గురుకుల పాఠశాలలు, టి సి పి సి లకు అనుబంధంగావుండే హాస్టళ్ళలోని వికలాంగ విద్యార్థుల ఆహార చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచుతూ, యూనిఫాంలు, పరుపుగా ఉపయోగపడే సామగ్రి సరఫరాకు అనుమతిస్తూ, 7.6.2008 నాటి, డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు ( డి డబ్ల్యు ఏ-1) శాఖ గి ఓ ఎం ఎస్ నం : 15 ఉత్తర్వు జారీ చేసింది
  • అవయవలోపంలేనివారు, విభిన్న శక్తియుక్తులుకలిగినవారిని (వికలాంగులను) వివాహంచేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహక నగదు పురస్కారాన్ని 3000/- రూపాయల నుంచి .10, 000/- రూపాయలకు పెంచుతూ, 19.6.2008 నాటి, డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు శాఖ జి ఓ ఎం ఎస్ నం: 18 ఉత్తర్వు జారీ చేసింది
  • వికలాంగుల ప్రయోజనం కోసం అందించే వివిధ రాయితీలలో ఎన్నిటినైనా పొందడానికి అవకాశం కల్పిస్తూ, 25.6.2008 నాటి, డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు (డి డబ్ల్యు ఏ-1) శాఖ ఉత్తర్వు జి ఓ ఎం ఎస్ నం: 19 జారీ చేసింది
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు చదివే, ఎక్కువ అంగవైకల్యానికి గురైన విద్యార్థులకు, మోటారు వాహనాలు, అధునాతనమైన కృత్రిమ పాదాలు మొదలైనవి కొనుగోలుచేయడానికి, వారికి నేరుగా రుణాలు అందించడానికి వీలుగా , 30.6.2008 నాటి, డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు (డి డబ్ల్యు ఏ-2) శాఖ ఉత్తర్వు జి ఓ ఆర్‌టి నం: 194 జారీ చేసింది
  • కనుచూపు లోపంవున్న విద్యార్థులు నాణ్యమైన విద్య నేర్చుకొనడానికి, తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా, వారికి పోర్టబుల్ ఎంపి-3 సి డి ప్లేయర్లను సమకూర్చడంకోసం 9.7.2008 నాటి, డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు (డి డబ్ల్యు ఏ-2) శాఖ ఉత్తర్వు జి ఓ ఆర్‌టి నం: 209 జారీ చేసింది
  • వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను వారి వికలాంగ స్థాయినిబట్టి పెంచడానికి, వికలాంగ పెన్షనర్లందరికి, నెలకు ఒక్కొక్కరికి 500 రూపాయలుగా పెంచిన పెన్షన్లను పంపిణీచేయడానికి వీలు కల్పిస్తూ, 14.11.2008 నాటి, పి ఆర్ & ఆర్ డి (ఆర్ డి -2) శాఖ ఉత్తర్వు, జి ఓ ఎం ఎస్ నం: 454 జారీ చేసింది
  • మెట్రిక్ ముందు తరగతుల వికలాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను పెంచుతూ, 24.11.2008 నాటి డబ్ల్యు డి సి డబ్ల్యు & డి డబ్ల్యు శాఖ ఉత్తర్వు జి ఓ ఎం ఎస్ నం: 44 జారీ చేసింది
  • వినికిడిలోపం వున్న ఆరేళ్లలోపు బాలలకు కోచ్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయడానికి వీలుకల్పిస్తూ, ఆ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ-1లో చేర్చడం చేసింది

బంగారు తల్లి పథకము (ఆడపిల్లల ప్రమోషన్, సాధికారత యాక్ట్, ఆంధ్ర ప్రదేశ్ 2013)

బంగారు తల్లి పథకం ఎందుకు:
  • ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మగపిల్లలకి 975 ఆడ పిల్లలు (1991), 961 ఆడ పిల్లలు (2001) మరియు 943 ఆడ పిల్లలు (2011) ఉంది.
  • ఆంధ్ర ప్రదేశ్ లో స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు వల్ల, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడింది. అయితే, ఇటువంటి ఆర్థిక అభివృద్ధి స్త్రీలకు మెరుగుపరచబడిన ఆరోగ్య , పోషణ , విద్య & ఉపాధి అవకాశాలు వంటి సామాజిక వికాసములలో అభివృద్ధి సరిపోయేట్టు చేయలేదు.
  • మహిళలు లింగ వివక్ష వ్యతిరేకంగా బాల్య వివాహాలు, కట్నం , హింస వంటి సాంఘిక దురాచారాలు, బాలిక కుటుంబానికి భారం అని ఒక భావన వ్యాపించింది.
  • ఆడ పిల్లలు 10 వ తరగతి వరకు చదివిన తరువాత చదువులకు స్వస్తి పలకడం ఎక్కువ అయినది.
స్కోప్:
  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో జన్మించిన ఆడపిల్లలు
  • మే 1, 2013 న లేదా తర్వాత జన్మించిన వారు
  • తెలుపు రేషన్ కార్డు
  • గృహానికి మొదటి ఇద్దరు ఆడ పిల్లలకు
ఇన్సెంటివ్స్:
  • సురక్షితమైన సంస్థాగత ప్రసవాలు మెరుగుపరచుటకు
  • మంచి ఆరోగ్యకరమైన ఆహారము, పప్పు దినుసులు తల్లికి అందిచుటకు
  • 3 సంవత్సరాల వరకు అంగన్వాడీ ద్వారా సరైన పోషకాలు కల్గిన ఆహారము మరియు ఆట పాటలు నేర్పించడం
  • 8 సంవత్సరాల వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య
  • 10వ తరగతి వరకు ఉన్నత విద్య
  • 2 సంవత్సరాల జూనియర్ కళాశాల విద్య
  • 3 లేక 4 సంవత్సరాల కళాశాల విద్య అందిస్తున్నారు
  • విద్యాభ్యాసం ముగిసిన తరువాత తగిన ఉపాధి, నైపుణ్యం కొరకు శిక్షణ
ప్రోత్సాహకాలు:
  • 21 సంవత్సరాలు నిండి జూనియర్ కళాశాల లేదా సమానమైన విద్య పూర్తి చేసిన వారికి 50000 రూపాయలు చెల్లింపు
  • 21 సంవత్సరాలు నిండి కళాశాల స్థాయి విద్య పూర్తి చేసిన వారికీ 1 లక్ష రూపాయలు చెల్లింపు
  • ఆధార్ కార్డ్ మరియు బయో-మెట్రిక్ ద్వారా గుర్తింపు
  • ఏ మధ్యవర్తులు లేకుండా బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయబడును

బంగారు తల్లి పథకము మ్యాన్యువల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారు తల్లి పథకము దరఖాస్తు

బంగారు తల్లి పథకం పై తరచుగా అడిగే ప్రశ్నలు

1. బంగారుతల్లి పధకంలో నమోదుకు కావల్సిన అర్హతలు ఏమిటి ?

  • “ఇద్దరు జీవించియున్న పిల్లలు” నిభందన లోబడి మే 1, 2013 నాడు లేదా తర్వాత ఆర్ధికంగా వెనకబడిన లేదా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో జన్మించిన ఆడ పిల్ల/లు
  • ఏదేని తెల్ల రేషన్ కార్డు, అనగా WAP/RAP/TAP/YAP/AAP కార్డులు
  • ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు. (సమీకృత గిరిజనాభివృద్ది ఏజెన్సీలో ఇంటిలో జరిగే కాన్పులలో జన్మించిన ఆడ శిశువులు కూడ అర్హులు)
  • తప్పని సరిగా బంగారుతల్లి వెబ్సైటు లో అప్లోడ్ చేయవలసిన కాపీలు (Xerox కాపీలు మాత్రమే)
    • తెల్ల రేషన్ కార్డు ప్రతి
    • బంగారు తల్లి జనన ధ్రువ పత్రం ప్రతి
    • తల్లి/తండ్రి/సంరక్షకుని బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఉన్న పాస్ బుక్ పేజి ప్రతి (ఇదే వరసలో ముందు వారికి లేనపుడే తర్వాత వారిది ఇవ్వాలి)
    • తల్లి/తండ్రి/సంరక్షకుని (బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఎవరిది ఇస్తే వారి) ఆధార్ కార్డు ప్రతి
    • తల్లి/తండ్రి/సంరక్షకుని సంతంకంతో ఇచ్చిన “అండర్ టేకింగ్” ప్రతి
    • వైధ్యాదికారి, ఏ.యెన్.ఏం సంతకంతో ఉన్న “బంగారు తల్లి డేటా ఇన్పుట్ షీట్” ప్రతి
    • తల్లి బిడ్డ తో దిగిన ఫోటో

2. “ఇద్దరు జీవించియున్న పిల్లలు” నిభందన అనగా ఏమిటి ?

  • కాన్పు సంఖ్యతో సంబంధం లేకుండా మే 1, 2013 తేదికి ముందు జన్మించి మరియు జీవించి ఉన్న ఆడ లేదా మగ శిశువుల సంఖ్య రెండు లేదా ఎక్కువ ఉన్న ఈ పధకానికి అర్హత లేదు.
  • అనగా మొదటి కాన్పులోనే ఇద్దరు కవలలు జన్మించి జీవించి ఉన్న అర్హత లేదు
  • అనగా ఎన్ని కాన్పుల సంఖ్యతో సంబంధం లేకండా జీవించి ఉన్న ఆడ లేదా మగ శిశువు ఒక్కరే ఉన్న, తదుపరి ఒకే కాన్పులో ఒక్కరు లేదా కవలలు లేదా అంతకన్నాఎక్కువ ఆడ బిడ్డలు జన్మించిన ఈ పధకానికి అర్హులు.

3. తెల్ల రేషన్ కార్డు ప్రతిని ఏ ప్రాధాన్యత క్రమంలో సమర్పించాలి ?

  • తల్లి పేరున ఉన్న ఏదైనా రేషన్ కార్డు. తన కుటుంబ తెల్ల రేషన్ కార్డు లేదా తన తల్లి గారి రేషన్ కార్డు లేదా ఉమ్మడిగా ఉన్న అత్తగారి కుటుంబ రేషన్ కార్డు.
  • తల్లి కి రేషన్ కార్డు లేనపుడు తండ్రి పేరున్న రేషన్ కార్డు

4. రాష్ట్ర సరిహద్దుల అవతల ఉన్న ఆసుపత్రులలో తీసుకున్న జనన లేదా జన్మ దృవీకరణ పత్రాలకు చెల్లుబాటు ఉందా?

  • ఉంది. వీటిని సంబందిత లేదా నివాస పరిధి మండలంలో తెలుగులోకి తర్జుమా చేసి, వివరాలు సరైనవిగా దృవీకరిస్తూ సంతకం చేసి అప్లోడ్ చేయాలి.

5. పెళ్లి తర్వాత వివిధ కారణాలతో తల్లి పేరు మార్చుకున్న లేదా వివిధ తప్పనిసరిగా జత పరచవలసిన డాకుమెంట్స్ నందు పేరు లేదా ఇంటి పేరు లేదా మొత్తం పేరు మారిన లేదా తప్పుగా నమోదు అయినా అర్హత ఉంటుందా ?

  • ఉంటుంది. అయితే సంబందిత ప్రతులపై ఆయా కారణాలను నమోదు చేస్తూ, వివరాలు సరైనవే అని ద్రువికరిస్తూ సంతంకం చేసి అప్లోడ్ చేయాలి.

6. బంగారుతల్లి పధకంలో నమోదుకు ఏమైనా టైం లిమిట్ ఉందా ?

  • ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత 21 రోజులలోగా నమోదు చేసుకోవాలి.

7. బంగారుతల్లి పధక నమోదుకు జన్మ దృవీకరణ పత్రాన్ని ఎలా పొందాలి?

  • వైద్యాధికారి ఆసుపత్రిలో ఇచ్చిన పత్రం
  • బిడ్డ జననం నివాస ప్రాంత పరిధి దాటి, అమ్మ గారి ఊరిలో ప్రసవించిన లేదా ఏదైనా పట్టణ లేదా నగర ఆసుపత్రిలో ప్రసవించిన, నివాస ప్రాంతంలో ఉన్న పంచాయతి సెక్రటరీ లేదా మునిసిపల్ కమీషనర్ ఇచ్చిన జన్మ దృవీకరణ పత్రం

8. బంగారు తల్లి పధకంలో నమోదు కొరకు ఎవరిని సంప్రదించాలి?

  • గ్రామంలోని గ్రామ సమాఖ్య లేదా మండలం లోని మండల సమాఖ్య.
  • పట్టణ ప్రాంతాలలో వాడ సమాఖ్య లేదా పట్టణ సమాఖ్య

9. తల్లి రెండవ పెళ్లి చేసుకున్న, భర్తకు ఇదివరకే పిల్లలున్న ఆమెకు జన్మించిన బిడ్డలు అర్హులేనా?

  • ఆమెకు “ఇద్దరు జీవించియున్న పిల్లలు” నిభందన లోబడి అర్హులే.

10. తల్లి మరణించిన ఆమె బిడ్డలకు అర్హత ఉంటుందా?

  • ఉంటుంది. తండ్రి లేదా సంరక్షకులు నమోదు చేయవచ్చును. ఏదైనా ట్రస్టులు లేదా స్టేట్ హోం లు సంరక్షకులుగా కూడ వ్యవహరించ వచ్చును.

11. అనర్హులకు వెళ్ళిన ప్రోత్సాహకాన్ని ఎలా తిరిగి చెల్లించాలి?

  • చలాన ద్వారా దిగువ ఎకౌంటుకు జమ చేయాలి

ఎకౌంటు పేరు : సి.ఈ.వో. సెర్ప్-బంగారు తల్లి

ఎకౌంటు నెంబర్: 62300166260

IFSC కోడు: SBHY0020916

బ్యాంకు : ఎస్.బి.హెచ్., ట్రెజరి బ్రాంచ్, గన్ఫౌండ్రీ , హైదరాబాద్

ఉచిత / రాయితీ బస్ పాస్

  • లక్ష్యం: నిరుద్యోగులైన వికలాంగులకు ఉచిత & రాయితీ బస్ పాస్ అందించడం.
  • అర్హత: 40% పైన వైకల్యం గల నిరుద్యోగ యువత.
  • లబ్దిదారులు: 40% పైన వైకల్యం గల నిరుద్యోగ యువత అందరు.
  • ప్రయోజనాలు: పట్టణ ప్రాంతాల్లో ఉచితం మరియు నగరాలలో 50% రాయితీ.
  • సంప్రదించాల్సిన వివరాలు: గ్రామ పంచాయతి కార్యదర్శి, అసిస్టెంట్ డైరెక్టర్ వికలాంగుల సంక్షేమం /డిప్యూటీ డైరెక్టర్ సామాజిక సంక్షేమం/ డిపో మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ.
  • జి.ఓ నం.: G.O.Ms.No.27 WD & CW (DW)శాఖ, తేది 9-8-2000.

నగర ప్రాంతాలలో మహిళా మరియు పిల్లల అభివృద్ధి

  • లక్ష్యం: బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాలకు 50% సబ్సిడీ తో ఆర్థిక సాయం అందించడం.
  • అర్హత: స్వయం సహాయక బృందాల మహిళలు.
  • లబ్దిదారులు: 18-50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్వయం సహాయక బృందాల మహిళలు.
  • ప్రయోజనాలు: బ్యాంకుల ద్వారా 50% సబ్సిడీ తో ఆర్థిక సాయం.
  • సంప్రదించాల్సిన వివరాలు: మున్సిపల్ కమిషనర్ / జిల్లా కలెక్టర్.
  • జి.ఓ నం.: ఆర్.ఓ.సి నం. 1421/98/N1, తేది 27-1-1998.

పావలా వడ్డీ పథకం (రూ. 0.25 వడ్డీ సబ్సిడీ పథకం)

  • లక్ష్యం: స్వయం సహాయక బృందాలు తీసుకున్న బ్యాంకు వడ్డీ సబ్సిడీ ద్వారా ఉపశమనం అందించడం.
  • అర్హత: పొదుపు మరియు రుణాలలో ఆరు నెలలు పూర్తి అయి, సరైన సమూహంను చూపించు స్వయం సహాయక బృందాలు.
  • లబ్దిదారులు: పొదుపు మరియు రుణాలలో ఆరు నెలలు పూర్తి అయి, సరైన సమూహంను చూపించి అభివృద్ధి కోరుకొనే స్వయం సహాయక బృందాలు.
  • ప్రయోజనాలు: స్వయం సహాయక బృందాల ద్వారా 100% ఋణం తిరిగి చెల్లించే పద్దతికి లోబడి, 3% పైగా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ సబ్సిడీ.
  • సంప్రదించాల్సిన వివరాలు: వాణిజ్య బ్యాంకులు / ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు / వెలుగు కమ్యూనిటీ సమన్వయకర్త / ఎం.పి.డి.ఓ / డి.ఆర్.డి.ఏ.
  • జి.ఓ నం.: GOMs.No.152, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి ఉత్తర్వు (RD-III) తేది 2.5.2005.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

‘తెలంగాణ పల్లె ప్రగతి’

నల్లగొండ: నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన టీఆర్‌ఐజీపీ (తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం)కి ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేశారు. ప్రపం చ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లాకు తొలి విడతలో రూ.50 కోట్లు వెచ్చించనున్నారు.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళిక పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ఈ పథ కం అమలుకు తొలి దశలో జిల్లా నుంచి 13 మండలాలు ఎంపిక చేశారు. డీఆర్‌డీఏ నిర్వహించిన బేస్‌లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన మండలాలుగా వీటిని గుర్తిం చారు. దేవరకొండ ఏరియాలో శిశు విక్రయా లు, మాతా శిశు మరణాలను అరికట్టేం దుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నా రు.

ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్‌డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళల ను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారు.

రైతులను బృం దాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ ఎన్‌ఎంల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు.

గ్రామపంచాయతీల్లో పౌరసేవ కేంద్రాలు

ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పం చాయతీల్లో ‘మీ సేవ’ తరహాలో పౌర సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నా రు. ప్రస్తుతం ఈమండలాల్లో 44 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు మండల కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయి. చందంపేట, డిండి, దేవరకొండ, పీఏపల్లి వంటి మండలాల్లో పలు చోట్ల మీ సేవ కేం ద్రాలు గ్రామాలకు మంజూరైనప్పటికీ సరైన వసతుల్లేక, విద్యుత్ సమస్య కారణంగా మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేశారు.

అలా కాకుండా పౌర సేవా కేంద్రాలను పక్కాగా పంచాయతీల్లోనే ఏర్పాటు చేస్తారు. మీ సేవ కేంద్రాలు అందించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతమైనట్లయితే రెండో దశలో మరిన్ని మండలాలకు విస్తరించే అవకాశం ఉంది.

ఆధారము: సాక్షి

గిరిజనులకు వరం.. 'కళ్యాణలక్ష్మి' పథకం..

నిరుపేద దళిత, గిరిజన యువతుల వివాహాల కోసం రూ.51 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కళ్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రారంభంలో పెళ్లి అయిన తరువాత దరఖాస్తు చేసుకుంటే రూ.51 వేల ఆర్థిక సహాయం చేయాలనే నిబంధన ఉండేది. తాజాగ ప్రస్తుతం ఈ పథకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వల్ప మార్పులు చేస్తూ రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. పెళ్లికి కనీసం 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • జిల్లాలో ఎస్సీ, ఎస్టీల్లో 18 సంవత్సరాలు పూర్తయిన యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'కళ్యాణలక్ష్మి' పథకం ప్రారంభించింది.
  • ఈ పథకం కింద రూ. 51 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.
  • దీనిని అక్టోబర్‌ 2, 2014 నుంచి అమలులోకి తీసుకొచ్చారు.
  • వివాహానికి నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి
  • అర్హులైన యువతులు దగ్గరలోని మీ-సేవ కేంద్రాల నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించరాదు
  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
  • వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
  • 2 అక్టోబరు 2014 నుంచి జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.కావలసిన ధ్రువపత్రాలు
  • పుట్టిన తేదీ (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినదై ఉండాలి)
  • కులం ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీవకరణ పత్రం(వివాహం జరుగు తేదీ నాటికి 6 నెలలలోపు మీ-సేవ ద్వారా సంబంధిత అధికారిచేత జారీ చేసినది)
  • పెళ్లికూతురు, పెళ్లికుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్‌కార్డులు
  • బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)

వివాహ ఆహ్వాన పత్రికమొన్నటివరకు వివాహం జరిగిన తరువాత కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేయాలనే నిబంధన ఉండేది. కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వివాహ సమయంలో ఉపయోగ పడే విషయాన్ని పరిశీలించి స్వల్ప మార్పులు చేసింది. దరఖాస్తు చేసుకున్న తరువాత అన్నివిధాలా దరఖాస్తు ఫారాలను పరిశీలించి నిర్ధరించుకున్న తరువాతే రూ.51 ఆర్థిక సాయం వధువు పేరుమీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమచేస్తాం. ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో, లేదా దగ్గరలోని తహసీల్దార్‌ కార్యాలయంలో పూర్తి సమాచారం పొందవచ్చు. పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.

ఆధారము: న్యూస్ హంట్.కం

స్మార్ట్ విలేజ్ పథకం

గ్రామాన్ని లేదా వార్డును పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన పరిశుభ్రమైన స్మార్ట్ గ్రామం లేదా స్మార్ట్ వార్డు ను నిర్మించడమే స్మార్ట్ విలేజ్ పథకం యొక్క లక్ష్యం.

స్మార్ట్ విలేజ్ / వార్డు విధానం :

మొదటి దశ : గ్రామ పంచాయతి లేదా వార్డు అభివృద్ధి పరిచేందుకు గాను పార్ట్నర్ కావడం ఎలా?

పార్ట్నర్ కాగలవారు బాధ్యతాయుత పౌరులు / సంస్థలు / ప్రభుత్వేతర సంస్థలు / వ్యాపార రంగాల వారు / ప్రజా ప్రతినిధులు దిగువ పేర్కొన్న వివిధ పద్ధతులను అనుసరించి నమోదు చేసుకోవచ్చును.

ఎ. smart.ap.gov.in వెబ్ సైట్ లో గల "Interested in becoming a Partner Register" బటన్ పై క్లిక్ చేసి మీకు ఆసక్తి ఉన్న గ్రామ పంచాయతి / వార్డును ఎంపిక చేసుకోగలరు. వివరాలను నింపి Submit బటన్ ను క్లిక్ చేయగలరు.

( లేదా )

బి. వెబ్ సైట్ లోని "Enter My Village" బటన్ క్లిక్ చేసి చిత్రపటం ద్వారా నియోజక వర్గం వరకు వెళ్ళగలరు. డ్రాప్ డౌన్ బాక్స్ లో మండలం / పురపాలక ను ఎంపిక చేసుకొని గ్రామ పంచాయతి / వార్డు కు సంబంధించిన మౌలిక వివరాలను చూసేందుకు Village Profile ను క్లిక్ చేయగలరు. Partner View పై క్లిక్ చేసినపుడు ఎంపిక చేసిన గ్రామ పంచాయతి / వార్డుకు Partner అనబడే ఆరంజ్ కలర్ బటన్ పై క్లిక్ చేసి వివరాలను నింపి నమోదు పద్ధతిని పూర్తి చేయగలరు.

దరఖాస్తుదారునికి వివరాలతో ఒక acknowledgement ఈమెయిల్ వెంటనే అందుతుంది.

మీరు అందజేసిన వివరాలను పంపిన అనంతరం జిల్లా కలెక్టర్ పరిశీలించి మీ నమోదును ఆమోదిస్తారు. కలెక్టర్ ఆమోదించిన అనంతరం మీ లాగిన్, పాస్ వర్డ్ వివరాలతో పాటు సంప్రదించవలసిన మండలం / మున్సిపాలిటీ / గ్రామ పంచాయతి / వార్డు ప్రతినిధి వివరాలుతో కూడిన ఆమోద ఈ-మెయిల్ మీకు అందుతుంది. గ్రామ పంచాయతి / వార్డు కమిటి అనుమతి పొందిన అనంతరం జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీ ఆమోద ప్రక్రియను ఆమోదిస్తారు. ఇందుకు కొంత సమయం పడుతుంది.

రెండవ దశ : గ్రామ పంచాయతి / వార్డు మరియు దానికమిటీ సభ్యులతో పరిచయస్తులుగా మారండి.

మీ పార్ట్నర్ షిప్ ఆమోదించిన తరువాత, సంబంధిత ఎంపిడిఓ / మునిసిపల్ కమీషనర్, గ్రామ పంచాయతి / వార్డు కమిటీ సభ్యులను సంప్రందించాల్సిన వివరాలు మీకు ఆమోద ఈమెయిల్ ద్వారా పంపుతారు. ఈ వివరాలతో ఎంపిడిఓ / మునిసిపల్ కమీషనర్ మరియు గ్రామ పంచాయతి కమిటి / వార్డు కమిటి సభ్యులను దయ చేసి ఒక్క సారీ సంప్రదించండి. అనంతరం వారితో కలసి మీరు అభివృద్ధి చేయదలచుకున్న గ్రామ పంచాయతి / వార్డులో వ్యక్తిగతంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. గ్రామ పంచాయతి / వార్డు సభ్యులు, పౌరులతో కలసి పరిచయం ఏర్పరచుకొని పరిచయస్తులుగా మారండి. అలాగే మీ ప్రతినిధిని నియమించడం లేదా నెట్ సమావేశం / వీడియో చాట్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా మీరు ఈ దశను చేయవచ్చును.

పోర్టల్ లో సంచరిస్తూ గ్రామ పంచాయతీ / వార్డ్ గురించి గణాంక మరియు ప్రాథమిక సమాచారం తెలుసుకొనవచ్చును. "Enter My Village"పై క్లిక్ చేసి జిల్లా, నియోజకవర్గం, మండలం / మున్సిపాలిటీ / కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతి / వార్డు ఎంపిక కోసం సంచరించండి. "Village Profile Tab" పై దయ చేసి క్లిక్ చేయండి. మీరు మీ ప్రాథమిక అవగాహన కోసం ఆ గ్రామ పంచాయతీ / వార్డులకు సంబంధించి కొన్ని చారిత్రక వివరాలు చూడగలరు. సంబంధిత గ్రామ పంచాయతి / వార్డు యొక్క ఎడమ చేతి వైపు ఉన్న మెనులోని వేర్వేరు అంశాలపై క్లిక్ చేయడం ద్వారా మీరు మరింత అర్థం చేసుకోగలరు.

మూడవ దశ : 20 Non Negotiables పని తీరు సూచికల పై గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను ఏర్పాటు చేయుట.

పార్ట్నర్ గ్రామ పంచాయతి కమిటీ సభ్యులతో కలసి గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి 20 Non Negotiables నిబద్ధతల ప్రకారం ప్రస్తుత పరిస్థితులను పరిశిలిస్తారు. పార్ట్నర్ గ్రామ కమిటీ సభ్యులతో కలసి 20 Non Negotiables అభివృద్ధి నిబద్ధతల వాస్తవాలను సేకరించడం కోసం ఓ బేస్ లైన్ సర్వే చేస్తారు.

వెబ్ సైట్ లోని Download/About సెక్షన్ నుండి గ్రామ / వార్డు సర్వే ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా గ్రూప్ లోబేస్ లైన్ సర్వే ను మానవీయంగా చేసుకొనవచ్చును.గ్రామ పంచాయతి / వార్డు కమిటీ, రేషన్ / ఎఫ్ పి దుకాణ యజమాని, స్వయం సహాయక సంఘం బుక్ కీపర్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఆ గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి చురుకైన సభ్యులు ఒక గ్రూప్ గా ఉండవచ్చును. మానవీయంగా తయారు చేసిన సర్వే షీట్ ను గ్రామ / వార్డు కమిటీ పోర్టల్ లాగిన్ లో పొందుపరచిన డేటా ఎంట్రీ ఫోరం ద్వారా నమోదు చేయవచ్చును.గ్రామ / వార్డు కమిటీ లాగిన్ వివరాలను సంబంధిత ఎంపిడిఓ (రూరల్) లేదా పురపాలక కమిషనర్ (అర్బన్) నుండి పొందవచ్చును.దీనిని సర్పంచ్ / పార్ట్నర్ / గ్రామ పంచాయతి / వార్డు చురుకైన కమిటీ సభ్యులకు అందజేస్తాము.

పోర్టల్ Download Section నుండి స్మార్ట్ విలేజ్ మొబైల్ అప్లికేషను ను డౌన్ లోడ్ చేసుకొని జియో టాగింగ్ ద్వారా కూడా బేస్ లైన్ సర్వే ను చేయవచ్చును.స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డ్ ప్రోగ్రామ్ యొక్క20 Non Negotiables అభివృద్ధి నిబద్ధతల వాస్తవ పరిస్థితులను ఈ సర్వే ఖచ్చితంగా అందిస్తుంది.గ్రామ పంచాయతి / వార్డులోని గృహాలు, ఆస్తులను జియో-ట్యాగ్ చేసి ఈ సర్వే ద్వారా చిత్రీకరించిన చిత్రాలను గూగుల్ మ్యాప్ లో ఉంచుతాము.ఈ సర్వే ఫలితాలు పోర్టల్ ను నేరుగా ప్రతిబింబించి ఆటోమేటిక్ గా నివేదికలు వస్తాయి. గ్రామ పంచాయతి / వార్డు లోని క్రియాశీల ఇంటర్నెట్ / మొబైల్ యాప్ వినియోగదారులు ఈ సర్వే చేయవచ్చును.ఈ విధమైన సర్వే ను నిపుణులు చేత కూడా చేయబడును, దీనికి మీరు smartap@ap.gov.in ను సంప్రదించండి.స్మార్ట్ కార్యక్రమం 20 Non Negotiables పని తీరు సూచికలకు అనుసరించి గ్రామ పంచాయతి / వార్డు యొక్క వాస్తవిక మరియు నిజ సమయ వీక్షణ ఈ రకమైన స్మార్ట్ సర్వే అందిస్తుంది.గ్రామ పంచాయతి / వార్డు సరిహద్దులు, రోడ్డులు, ప్రధాన ప్రజా ఆస్తులు, గృహల చిత్రాలను చిత్రీకరించి, డిజిటైజ్ చేసి మ్యాప్స్ లో ఉంచడం ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆ సంబంధిత గ్రామ పంచాయతి / వార్డు ను వీక్షించవచ్చును మరియు నావిగేట్ చేయవచ్చును. నమూనా తో వృత్తిపరంగా పూర్తి జియో-ట్యాగ్ సర్వే ని వీక్షించండి "Chittoor- Chandragiri- Kandulavaripalle". బేస్ లైన్ సర్వే పూర్తి అయిన వెంటనే Report Card తో కూడిన 20 Non Negotiables Summary Report ఆటోమేటిక్ గా పోర్టల్ లో రుపోదించ పడుతుంది.

నాలుగవ దశ : Donorable Assets/Activities స్థాపించుట.

బేస్ లైన్ సర్వే పూర్తి అయిన తరువాత ఆస్తులు మరియు జీవనాధార పరిస్థితుల అనుగుణంగా దానపుర్వక ఆస్తులు / చర్యలు ఆటోమేటిక్ గా ఏర్పడుతాయి. ఈ దానపుర్వక ఆస్తులు / చర్యలు ప్రతి గ్రామ పంచాయతి / వార్డు వెబ్ సైట్ లో20 Non Negotiables నిబద్ధత సుచికలకు అనుగుణంగా ఆటోమేటిక్ గా పొందుపరచబడుతుంది. గ్రామ పంచాయతి / వార్డులో గుర్తించిన ప్రతి దానపుర్వక ఆస్తి / చర్యల విలువను పార్ట్నర్ తో పాటు గ్రామ పంచాయతి / వార్డు కమిటీ విషయ నిపుణుల సహకారంతో ప్రచురిస్తారు.

ఐదవ దశ : అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలకు దరకాస్తు చేసుకోవడం, సెక్టోరల్ పార్ట్నర్ అర్థం చేసుకొని అవసరమైన నిధుల కొరతను ఏర్పాటు చేయడం.

20 Non Negotiables నిబద్ధత సుచికలలోని ప్రతిదానికి ప్రభుత్వ పథకాలు కలవు. సెక్టోరల్ పార్టనర్లు కూడా కొన్ని ప్రత్యేక రంగాలకు / ఆసక్తి ఉన్నవాటి అభివృద్ధి కొరకు నమోదు చేసుకుని ఉండవచ్చు. మీ పార్ట్నర్ లాగిన్ వివరాలతో మీరు సెక్టోరల్ పార్ట్నర్ కు సంబంధించిన ఈ వివరాలతో పాటు సంప్రదించే వివరాలు కూడా పొందవచ్చును. విలేజ్ / వార్డు కమిటీ మరియు ఎంపిడిఓ / మునిసిపల్ కమీషనర్ తో కలసి ఈ పథకాలకు దరఖాస్తు చేయవచ్చును. నిధుల కొరతలు విశ్లేషణ చేసి, ఏ Donorable Assets/Activitiesకు ఎంత నిధుల కొరత అవసరమో చూడటం. పార్ట్నర్ లాగిన్ వివరాలను ఉపయోగించి, గ్యాప్ నిధులు, అవసరమయ్యే ఆస్తులు / చర్యలు అంచనాలు పాటు జోడించవచ్చు. సబ్జెక్టు నిపుణులను ఉపయోగించుకొని అంచనాలు రూపొందించవచ్చును.

ఆరవ దశ : నిధుల కొరత కోసం సపోర్ట్ పార్ట్నర్ లను తీసుకురావడం .

గ్రామ పంచాయతి / వార్డు లోని Donorable Assets/Activities కు సంబంధించి నిధుల కొరతను పూరించడానికి పౌరులు / ఎన్.ఆర్.వి లు / ఎన్.ఆర్.ఐ లను గ్రామ కమిటీ తో కలసి పార్ట్నర్ ఆహ్వనించవచ్చును. వారు ఏదైన Donorable Assets/Activities కు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చి సపోర్ట్ పార్ట్నర్ గా రిజిస్టర్ కావచ్చును."Enter My Village" పై క్లిక్ చేసి శక్తివంతమైన సపోర్ట్ పార్టనర్లు Donorable Assets/Activities ను వీక్షించవచ్చును. జిల్లా, నియోజకవర్గం, మండల / మున్సిపాలిటీ / కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతీ / వార్డును ఎంచుకొనవచ్చును. అన్ని Donorable Assets/Activities అంచనాలను "Donorable Assets" ట్యాబ్ పై క్లిక్ చేసి చూడవచ్చును. సపోర్ట్ పార్ట్నర్ కావాలనుకునే వారు "Sponsor" బటన్ పై క్లిక్ చేసి సపోర్ట్ పార్ట్నర్ కావచ్చును. సపోర్ట్ పార్టనర్స్ కు కూడా లాగిన్ వివరాలు అందజేయబడుతుంది. సపోర్ట్ పార్టనర్స్ వారి లాగిన్ వివరాలను ఉపయోగించుకొని వారు స్పాన్సర్ చేస్తున్న దానికి సంబంధించిన పురోగతి, గ్రామస్తుల వ్యాఖ్యలను వీక్షించిన పిదప చెల్లింపులు చేయవచ్చును.

ఏడవ దశ : పురోగతి మరియు నివేదిక పర్యవేక్షణ.

పార్ట్నర్ గ్రామ కమిటీతో కలసి దానపుర్వక కార్యాచరణ / పురోగతిని తెలుసుకొని అర్ధ సంవత్సరం నివేదికలను అప్ డేట్ చేయడం.20 Non Negotiables సూచికలు అనుసరించి అభివృద్ధిని పార్ట్నర్ భేరీజు వేసి, అన్ని సక్రమంగా ఉన్నపుడు దానిని స్మార్ట్ విలేజ్ గా స్వీయ ప్రకటన చేయడం జరుగుతుంది. Report Card తో కూడిన గ్రేడింగ్ గ్రేడింగ్ సిస్టం ఆటోమేటిక్ గా పోర్టల్ లో అందించబడుతుంది.20 Non Negotiables సూచికలు అనుసరించి 'A ' గ్రేడ్ చేరడానికి అన్ని పనులు పూర్తి చేయాలి. కమిట్మెంట్ ఇండికేటర్ ను సాధించడానికి ఏదైన ఉత్తమ విధానాలు అనుసరించి ఉంటే. వాటిని పార్ట్నర్ లాగిన్ లోని Best Practices Data Entry Form ద్వారా ప్రచురించవచ్చును.20 Non Negotiables నిబద్ధత సూచికలు అనుసరించి 'A' గ్రేడ్ సాధించడానికి అలవరచిన ఉత్తమ విధానాలు, విజయాలకు ప్రభుత్వ పురస్కారం పొందవచ్చును. పురోగతి పర్యవేక్షించేందుకు మరియు నెలవారీ రిపోర్ట్ తాయారు చేయుటకు ప్రతి గ్రామ పంచాయితీ లేదా వార్డు కోసం ఒక ప్రత్యేక అధికారిని కేటాయిస్తారు.

డౌన్ లోడ్ చేయునప్పుడు వెబ్ సైట్ www.smart.ap.gov.in శిక్షణ విభాగం నందు పొందుపరచిన ట్రైనింగ్ మెటీరియల్ ను పరిశీలించి step by step నిర్ధారించుకొనగలరు. పార్ట్నర్ షిప్ విధానం, పార్ట్నర్ లాగిన్, విలేజ్ / వార్డు కమిటీ లాగిన్ తదితర వాటికి ట్రైనింగ్ మెటీరియల్ చాలా ముఖ్యం.

20 నాన్ నేగాషీయబల్స్

స్మార్ట్ విల్లెజ్ / వార్డు కమ్యూనిటీ యొక్క అన్ని విభాగాల స్థిరమైన మరియు సామూహిక అభివృద్ధిని ఆవరిస్తుంది, కాబట్టి వారు ఉన్నత జీవన ప్రమాణాలను ఆనాంధించగలరు. ఈ క్రింది ప్రాథమిక సదుపాయాలు, పాఠ్య సేవలు సాధనను 100 శాతం ఒక ఖచ్చితమైన సమయం లోపు తీసుకురావడమే స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్ వైపు కదిలే నియమం.

  1. అందరికి గృహ వసతి - మరుగు దొడ్లు, రక్షిత మంచి నీరు మరియు నిరంతర విధ్యుత్ సదుపాయముతో కూడిన వసతి
  2. ప్రతి కుటుంబానికి అనేక జీవనోపాధి అవకాశాలు మరియు సూక్ష్మ సంస్థల సదుపాయం కల్పించుట.
  3. స్వయం సహాయక సంఘ సభ్యులు మరియు యువకుల నైపుణ్యంతో కూడిన శిక్షణ మరియు బ్యాంకు మరియు మార్క్కెటింగ్ అనుసందానముతో కూడిన గ్రామీణ సూక్ష్మ సంస్థల అభివృద్ధి.
  4. బహిరంగ మాల విసర్జన లేకుండా చేయుట.
  5. ఘన / ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ.
  6. ప్రసూతి మరణాలు లేకుండా చేయుట.
  7. నూరు శాతం సంస్థాగత ప్రసవాలు.
  8. 12వ తరగతి వరకు బాల బాలికలు బడి మాని వేయకుండా చూడుట.
  9. అంగన్వాడీ కేంధ్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రము గ్రామ పంచాయతీ / వార్డు భవనములలో మరుగుదొడ్లు, త్రాగు నీరు, విధ్యుత్ సరఫరా, అందుబాటులో ఉంచడం.
  10. పోషకాహార లోపాన్ని నివారించుట (9 సంవత్సరాల లోపు పిల్లలకు).
  11. 18 సంవత్సరాల లోపు ఆడ పిల్లలకు వివ్వహము జరగకుండా చూడటం.
  12. ప్రతి క్షేత్రానికి భూసారా కార్డులు / సూక్ష్మ పోషకాలు , పశుగణము, చెట్లు మున్నగు వాటిలో వైవిధ్యము.
  13. ప్రతి గ్రామ కుటుంబానికి మరియు "ప్రధాన మంత్రి జన ధన బ్యాంకు అకౌంట్" ఉండటం.
  14. గ్రామ పంచాయతీ / వార్డుకు ప్రజా బాగస్వామ్యముతో రూపొందిన బృహత్తర అభివృద్ధి ప్రణాళిక.
  15. భౌగోళిక సరిహద్దులలో పచ్చని చెట్లు పెంచడం.
  16. నీటి సంరక్షణ కొరకు నిర్మించిన కట్టడాలు.
  17. గ్రామ సమాచార కేంద్రము, గ్రామ కంప్యూటర్ లాబ్, మీ సేవ కేంద్రము.
  18. టెలికామ్ మరియు ఇంటెర్నెట్ కనెక్టివిటీ ఉండటము.
  19. సంవత్సరములో మూడింట రెండింతల హాజరుతో, నాలుగు సార్లు గ్రామ / వార్డు సభ నిర్వహణ.
  20. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.

స్మార్ట్ గ్రామం / వార్డు పథకం నిర్వహించు పాత్రలు :

అడ్మిన్(Admin) :
ప్రణాళిక విభాగం మరియు జిల్లా కల్లెక్టరు / సిపిఓ లు నిర్వహణ అధికారులుగా వ్యవహరిస్తారు. ప్రతి జిల్లా కల్లెక్టరు / సిపిఓ లకు లాగిన్, పాస్ వర్డ్ కేటాయించబడుతుంది. ఎన్ఐసి, డిఐఓలతో కలసి జిల్లా కల్లెక్టరు / సిపిఓలు లాగిన్ కాబడి భాగస్వామ్యాన్ని ఆమోదించే విధానాన్ని పాటిస్తారు. ఈ పథకం కొనసాగే పూర్తి విధానాన్ని కార్యనిర్వాహకులు పర్యవేక్షిస్తారు. ఇందుకు గాను ఈ పథకం అమలు మరియు శిక్షణ కొరకు సహకార వనరులను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

పార్టనర్(Partner) :
ప్రతి గ్రామ పంచాయతి / వార్డు కొరకు వచ్చిన దరఖాస్తుల నుంచి జిల్లా కల్లెక్టరు పార్టనర్ ను ఎంపిక చేస్తారు. పార్టనర్లు కాగోరు ఆసక్తి గల ప్రజా ప్రతినిధులు / ఐఏఎస్ అధికారులు / ప్రభుత్వేతర సంస్థలు / ప్రవాస భారతీయులు / ఎన్.ఆర్.విలు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును. పార్టనర్ గ్రామ కమిటీతో కలసి దిగువ కార్యకలాపాలు నిర్వహిస్తారు.

ఎ.20 అనుసంధానేతర నిబద్ధత సుచికలపై మౌలిక సర్వే నిర్వహించి పోర్టల్ లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.

బి.పోర్టల్ లో ఇచ్చిన యాప్ ను ఉపయోగించి దానపుర్వక ఆస్తులు / కార్యకలాపాల ఏర్పాటు కొరకు అన్ని సరిహద్దులు, రోడ్డులు మరియు ఇతర ప్రధాన ఆస్తుల పై జియో ట్యాగ్ సర్వే నిర్వహించాలి.

సి.గ్రామ పంచాయతి / వార్డు అభివృద్ధికి గాను కార్యక్రమాలు / అభ్యాసాల అమలు కొరకు పటిష్టమైన పద్ధతులను ఉపయోగించి స్మార్ట్ గ్రామ పంచాయతి / స్మార్ట్ వార్డు దిశగా పురొగమించలి.

డి.సపోర్ట్ పార్టనర్లను ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమాలను అభివృద్ధి పరచాలి.

ఇ.సబ్జెక్టు నిపుణులతో కలిసి ప్రభుత్వ పథకాలు మరియు అమలు అంచనాల మధ్య స్మార్ట్ అభివృద్ధి ప్రక్రియలో ఒక అంతర విశ్లేషణ నిర్వహించాలి.

ఎఫ్.ఆర్ధిక అంతరాల సమస్యను నివారించడానికి సపోర్ట్ పార్టనర్ నుంచి పార్టనర్ నిధులు సమీకరణ చేయవలసి ఉంటుంది.

సపోర్ట్ పార్టనర్(Support Partner) :
సపోర్ట్ పార్టనర్ ను రెండు పద్ధతులలో నియమించవచ్చును. గ్రామ పంచాయతి / వార్డుకు ఒకరి కంటే ఎక్కువగా పార్టనర్లు కావాలని కోరుకున్నపుడు జిల్లా కలెక్టర్ వారిలో ఒకరిని పార్టనర్ గా నియమించి, మిగిలిన వారిని సపోర్ట్ పార్టనర్లుగా చేయవచ్చును. సపోర్ట్ పార్టనర్లు గ్రామ పంచాయతి / వార్డులో కొంత మేరకు సామూహికంగా అభివృద్ధి చేయవచ్చును. లేదా ఆయా గ్రామ పంచాయతి / వార్డుకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించవచ్చును. స్మార్ట్ గ్రామ పంచాయతి / వార్డు స్థాపనకు విశిష్ట దానపుర్వక ఆస్తి / కార్యకలాప అభివృద్ధి కొరకు సపోర్ట్ పార్టనర్ల నియామకం కోసం పార్టనర్లు వారిని ఆహ్వనించవచ్చును. ఎన్.ఆర్.ఐ.లు / ప్రభుత్వేతర సంస్థలు / వ్యక్తులు పోర్టల్ ద్వారా బ్రౌస్ చేసి ఆయా గ్రామ పంచాయతి / వార్డును ఎంపిక చేసుకొనవచ్చును. దానపుర్వక ఆస్తులు / కార్యకలాపాలను వీక్షించవచ్చును మరియు మద్దతు కొరకు సైన్అప్ చేయవచ్చును.

గ్రామ పంచాయతి / వార్డు కమిటీ(GP/Ward Committee):
జన్మభూమి - మా ఊరు పథకాల కోసం ఏర్పాటు అయిన కమిటీలే స్మార్ట్ విలేజ్ / వార్డుకు కూడా పనిచేస్తాయి. స్మార్ట్ పథకం యొక్క 20 నిబద్ధత సుచికలపై మూలరేఖా సర్వే నిర్వహించేందుకు గాను కమిటీలకు పార్టనర్ తో పాటు లాగిన్, పాస్ వర్డ్ ఇవ్వబడుతాయి. ఈ కమిటీ పార్టనర్ నిర్వహించు పాత్రనే నిర్వర్తిస్తుంది.

గ్రామ / వార్డు పౌరులు (Village/Ward Citizens) :
గ్రామ పౌరులు లేదా వార్డుకు చెందిన వారు వారి సలహాలను, సమస్యలను, అభిప్రాయాలను పోర్టల్ లో ఇచ్చిన క్రౌడ్ సోర్సింగ్ ఫారం లేదా మొబైల్ యాప్ ను ఉపయోగించి తెలుపవచ్చును. ఈ సలహాలను / అభిప్రాయాలను పార్టనర్లు మరియు నిర్వాహకులు అందరు చూసి తగిన చర్యలు తీసుకుంటారు.

స్మార్ట్ విలేజ్ కరదీపిక

స్మార్ట్ విలేజ్ యొక్క కరదీపికను ఈ క్రింద గల లింకులలో చూడవచ్చు.

ఆధారము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate