ఆరోగ్యానికి సంబందించిన పథకాలు మరియు స్కీముల గురించి ఇందులో ఉన్నాయి
‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది.
ఊచిత రోగ నిర్ధారణ పధకములు
పైసా చెల్లించకుండానే ఆధార్ కార్డుతో అన్నిరకాల పరీక్షలు
జననీ సురక్ష యోజన (JSY) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NHM) కింద సురక్షితమైన మాతృత్వం కోసం చేయబడింది.
గర్భిణీ స్త్రీలు మరియు ఆనారోగ్యంతో పుట్టిన శిశువు తలిదండ్రుల కష్టాలు మరియు ప్రసవానికి మరియు వారి చికిత్సకు అయ్యే ఖర్చుల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ (MoHFW) మంత్రిత్వశాఖ వారికి ఉచితంగా చికిత్స అందిచాలని పూనుకుంది. దీనిలో మామూలు ప్రసవం, సిసరీను ఆపరేషను మరియు శిశువు జబ్బు (పుట్టిన 30 రోజూల వరకు)కు ఉచితంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేస్తారు. జననీ శిశు సురక్ష కార్యక్రమము (JSSK), 1 జూన్, 2011 న ప్రారంభించబడింది.
ఆరోగ్యముగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును భారత ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా కొన్ని పథకాలను ప్రవేశపెట్టి దేశ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందిస్తోంది. ఆ పథకాలు మరియు వాటి వివరాలు ఇక్కడ మీకు లభిస్తాయి.
నేషనల్ ఆయుష్ మిషన్ ప్రాథమిక లక్ష్యం ఆయుష్ వైద్య పద్ధతిని ప్రాచూర్యానికి తీసుకురావటం.
ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం మార్చి 2006 లో ఆమోదించబడింది.
మిషన్ ఇంద్రధనుష్, డిసెంబర్ 25, 2014 న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. 2009-2013 ల మధ్య ఇమ్యునైజేషన్ కవరేజ్ 61% నుంచి 65% కు పెరిగింది, ఇది ప్రతి సంవత్సరం కేవలం 1% పెరుగుదలను సూచిస్తుంది. దీనిని 5% నికి పెంచడాకి ఇంద్రధనుశ్ మిషన్ ప్రారంభించారు. ఇమ్యునైజేషన్ ప్రక్రియ వేగవంతం చెయడానికి మరియు 2020 నాటికి పూర్తి కవరేజ్ లక్ష్యంగా ఇది సాగుతుంది.
ఆధునిక వైద్యసౌకర్యాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన పథకాల గురించి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రాథమిక నివారణ, అభివృద్ధి మరియు స్వస్థత సేవల ఏర్పాటు అక్కడి ప్రభుత్వ మరియు నిర్ణయాలు చేసేవారికి ఒక ప్రధాన అంశం అని చెప్పవచ్చు.
మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకునే 2019 నాటికల్లా దేశమంతా స్వచ్ఛంగా కనిపించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.