సరఫరా సమయం అంటే ఏమిటి?
సరపరా సమయం అనేది పన్ను విధింపు లయబిలిటీ ఎప్పుడు చోటుచేసుకొన్నదో తెలుపుతుంది. ఎప్పుడు సరఫరా జరిగినట్టు భావించాలో అది సూచిస్తుంది. నమూనా జీఎస్టీ చట్టం సరుకులు మరియు సేవలకు విడివిడిగా సమయం సూచించే పద్దతిని సమకూరుస్తుంది.
వస్తుసేవల సరఫరాపై జీఎస్టీ చెల్లింపు బాధ్యత ఎప్పుడు ఏర్పడుతుంది?
సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని 12, 13 సెక్షన్లు వస్తు సరఫరా సమయాన్ని నిర్దేశిస్తాయి. వస్తు సరఫరా సమయం కింద పేర్కొన్న అంశాలకు ముందుగా చోటుచేసుకున్నదై ఉండాలి:-
- సరఫరాదారు బిల్లు జారీచేసిన తేదీ లేదా సెక్షన్ 31 మేరకు సరఫరాలపై బిల్లు జారీకి నిర్దేశించిన చివరి తేదీ; లేదా
- సరఫరాలకు సంబంధించి చెల్లింపులు స్వీకరించిన తేదీ.
వస్తుసేవలపై రసీదుల సరఫరాకు సంబంధించి సరఫరా సమయం ఏది?
వస్తువులు సేవలకు సంబంధించి రసీదు సరఫరా సమయం కిందివిధంగా ఉండాలి:-
- సరఫరాను ఆ సమయంలో గుర్తించగలిగితే రసీదు జారీచేసిన తేదీ; లేదా
- ఇతర అన్ని అంశాల విషయంలో రసీదుల విమోచన తేదీ
సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్సస్ 12కింద ఉప సెకన్లు 2, 3, 4 లేదా సెక్సస్ 13 ప్రకారం సరఫరా సమయం నిర్ధారించలేని పక్షంలో మరే విధంగా నిర్ధారిస్తారు?
సెక్షన్ 12(5)తోపాటు సెక్షన్ 13(5)లోని అవశిష్ట (చివరి) నియమం ప్రకారం నియమితకాలపు రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటే దాన్ని సమర్పించాల్సిన తేదీయే సరఫరా సమయం అవుతుంది. ఇతర సందర్భాల్లో సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ/ఐజీఎస్టీ వాస్తవ చెల్లింపు తేదీగా పరిగణించాలి.
నమూనా జీఎస్టి చట్టం సెక్షస్ 12 లోని 2,3,5 లేదా 6 సబ్ సెక్షస్ కింద లేదా సెక్షన్ 13 కింద సరఫరా సమయాన్ని నిర్ధారించడం కుదరని పక్షంలో సరఫరా సమయాన్ని ఎలా నిర్ధారిస్తారు.?
సెక్షన్ 12(7) మరియు 13(7)లో తెలిపినట్టుగా కాలావధి ప్రకారం రిటర్న్ దాకలు చేసే సందర్భాల్లో సదరు రిటర్న్ ఫైల్ చేసే తేదీ సరఫరా సమయం అవుతుంది. ఇతర సందర్భాల్లో సీజీస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ చెల్లింపు తేదీ సరఫరా తేదీ అవుతుంది.
సేవల సరఫరాకు సంబంధించి జీఎస్టీ చెల్లించాల్సిన సందర్భం ఎప్పుడు ఏర్పడుతుంది.?
సరుకుల మాదిరిగా కాకుండా సేవల విషయంలో సదరు సేవల సరఫరాపై నిర్ణీత గడువులో ఇన్వాయిస్ జారీ అయిందా లేక గడువు దాటిన తర్వాత జారీ అయ్యిందా అనేదానిని బట్టి సరఫరా సమయాన్ని నిర్ధారిస్తారు.
ఎదురు చెల్లింపు పద్ధతి కింద పన్ను చెల్లించాల్సినప్పుడు వస్తు సరఫరా సమయం ఏది?
సరఫరా సమయం కింద పేర్కొన్న తేదీలకు ముందు తేదీన చోటుచేసుకున్నదై ఉండాలి
- వస్తువులు స్వీకరించిన తేదీ; లేదా
- చెల్లింపులు చేసిన తేదీ; లేదా
- సరఫరాదారు బిల్లు జారీచేసిన తేదీనుంచి 30 రోజుల తర్వాతి తేదీ.
ఎదురు చెల్లింపు పద్దతి కింద పన్ను చెల్లించాల్సినప్పుడు సేవల సరఫరా సమయం ఏది?
సరఫరా సమయం కింద పేర్కొన్న తేదీలకు ముందు తేదీన చోటుచేసుకున్నదై ఉండాలి
- చెల్లింపు చేసిన తేదీ; లేదా
- సరఫరాదారు బిల్లు జారీచేసిన తేదీనుంచి 60 రోజుల తర్వాతి తేదీ.
వడ్డీ, ఆలస్య రుసుము లేదా జరిమానా లేదా ఆలస్యంగా ప్రతిఫలం చెల్లింపువల్ల జోడించబడే అదనపు విలువకు సంబంధించి వర్తించే సరఫరా సమయం ఏది?
వడ్డీ, ఆలస్య రుసుము లేదా జరిమానా లేదా ఆలస్యంగా ప్రతిఫలం చెల్లింపువల్ల జోడించబడే అదనపు విలువకు సంబంధించి అటువంటి అదనపు ప్రతిఫలాన్ని సరఫరాదారు స్వీకరించిన తేదీయే సరఫరా సమయం అవుతుంది.
పన్ను శాతం మార్పునకు ముందు లేదా తర్వాతి సరఫరాల విషయంలో సరఫరా సమయం మారుతుందా?
మారుతుంది... అటువంటి సందర్భాలలో సెక్షన్ 14లోని నిబంధనలు వర్తిస్తాయి.
పన్ను శాతం మార్పునకు ముందు సరఫరా చోటు చేసుకుంటే ఏది సరఫరా సమయం అవుతుంది?
అటువంటి సందర్భాలలో సరఫరా సమయం....
- పన్ను శాతం మారిన తర్వాత సదరు సరఫరాకు బిల్లు జారీచేసి, చెల్లింపులు స్వీకరించి ఉంటే. బిల్లు జారీచేసిన, చెల్లింపు స్వీకరించిన తేదీలలో ఏది ముందైతే అదే సరఫరా సమయం అవుతుంది; లేదా
- పన్నుశాతం మారకముందు బిల్లు జారీచేసినప్పటికీ పన్ను శాతం మారిన తర్వాత చెల్లింపులు స్వీకరించి ఉంటే.... బిల్లు జారీచేసిన తేదీయే సరఫరా సమయం అవుతుంది; లేదా
- పన్ను శాతం మారకముందు చెల్లింపులు స్వీకరించినా, పన్ను శాతం మారిన తర్వాత బిల్లు జారీచేసి ఉంటే... చెల్లింపు స్వీకరించిన తేదీయే సరఫరా సమయం అవుతుంది.
పన్ను శాతం మారిన తర్వాత సరఫరా చోటు చేసుకుంటే ఏది సరఫరా సమయం అవుతుంది?
అటువంటి సందర్భాలలో సరఫరా సమయం...
- పన్ను శాతం మారిన తర్వాత సదరు సరఫరాకు చెల్లింపులు స్వీకరించినా పన్ను శాతం మారకముందు బిల్లు జారీచేసి ఉంటే.. చెల్లింపు స్వీకరించిన తేదీయే సరఫరా సమయం అవుతుంది; లేదా
- పన్నుశాతం మారకముందు బిల్లు జారీచేసి, చెల్లింపులు కూడా స్వీకరించి ఉంటే... బిల్లు జారీచేసిన, చెల్లింపులు స్వీకరించిన తేదీల్లో ఏది ముందైతే అదే సరఫరా సమయం అవుతుంది; లేదా
- పన్ను శాతం మారిన తర్వాత బిల్లు జారీచేసినా పన్ను శాతం మారకముందే చెల్లింపులు స్వీకరించి ఉంటే... బిల్లు జారీచేసిన తేదీయే సరఫరా సమయం అవుతుంది.
నిరంతర సరఫరాల విషయంలో సరఫరా తేదీగా దేనిని పరిగణిస్తారు.?
కాంట్రాక్టు ద్వారా తెలుసుకోగలిగితే చెల్లింపు జరపాల్సిన గడువు తేదీ సరఫరా తేదీ అవుతుంది. అలా తెలుసుకొనేందుకు వీలుకాకపోతే చెల్లింపు జరిగిన తేదీ, ఇన్వాయిస్ జారీ అయిన తేదీ లేక పని పూర్తికి చెల్లింపునకు లంకె ఉన్నట్టయితే పని పూర్తయిన తేదీ, వీటిలో ఏది ముందు అయితే అది.
పన్ను రేటు 1.6.2017 తేదీ తర్వాత 18 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది అనుకుందాం. పన్ను రేటు మార్పునకు ముందు ఏప్రిల్ 2017లో సేవల సరఫరా జరిగి ఇన్వాయిస్ కూడా జారీ అయినప్పటికీ చెల్లింపు 2017 జూన్ లో జరిగితే ఏ రేటు ప్రకారం పన్ను లెక్కకట్టాల్సి ఉంటుంది
సేవలు 1.6.2O17కు ముందే సరఫరా చేయడం జరిగింది కనుక పాతరేటు 18 శాతం ప్రకారమే పన్ను లెక్కించాలి.
ఉదాహరణకు 1.6.2017 నుంచి పన్ను 18 నుంచి 20 శాతానికి పెరిగిందనుకుందాం. సరఫరాదారు ఇదే నెలలో వస్తువుల సరఫరాతోపాటు బిల్లు జారీ చేసినా సంబంధిత చెల్లింపును మాత్రం ఏప్రిల్ 2017లోనే స్వీకరించి ఉంటే వర్తించే పన్నుశాతం ఏది?
వస్తువుల సరఫరాతోపాటు బిల్లును కూడా 1.6.2017 తర్వాత జారీ చేసినందున పన్నుశాతంలో మార్పు మేరకు 20 శాతం పన్ను వర్తిస్తుంది.
వస్తువుల సరఫరాపై బిల్లు జారీకి నిర్దేశించిన కాల వ్యవధి ఏమిటి?
సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెకన్ 31 ప్రకారం... పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి తాను సరఫరా చేసిన వస్తువులు, వాటి పరిమాణం, విలువ, వాటిపై విధించిన పన్ను తదితర నిర్దేశిత వివరాలతో కింద పేర్కొన్న కార్యకలాపాలకు ముందు లేదా ఆ సమయంలో బిల్లు జారీచేయాలి.
- మరో ప్రదేశానికి పంపాల్సి ఉన్నట్లయితే స్వీకర్తకు సరఫరా చేయడం కోసం వస్తువులు సిద్దంచేసే తేదీ; లేదా
- ఇతర సందర్భాలలో సరుకుల సరఫరా లేదా స్వీకర్తకు అందుబాటులో ఉంచే తేదీ.
సేవల సరఫరాపై బిల్లు జారీకి నిర్దేశించిన కాల వ్యవధి ఏమిటి?
సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం. పన్ను విధించదగిన నమోదిత వ్యక్తి తాను సేవా ప్రదానం చేయడానికి ముందు లేదా తర్వాత బిల్లు జారీచేయాలి. అయితే, దీనికి సంబంధించి నిర్దేశిత వ్యవధిని పాటించాలి. అలాగే బిల్లులో సేవలు వాటి వివరణ, వాటి విలువ, చెల్లించాల్సిన పన్ను సహా ఇతర నిర్దేశిత వివరాలను కూడా నమోదు చేయాలి.
నిరంతర వస్తు సరఫరా సాగేట్లయితే బిల్లు జారీకి నిర్దేశించిన కాల వ్యవధి ఏమిటి?
నిరంతర వస్తు సరఫరా సాగుతూ, వరుసక్రమంలో ఖాతా నివేదికలు లేదా చెల్లింపులు అందులో భాగంగా ఉంటే... అటువంటి ప్రతి నివేదిక సమర్పణ లేదా ప్రతి చెల్లింపు స్వీకరణకు ముందు లేదా అదే సమయంలో బిల్లు జారీచేయాలి.
నిరంతర సేవల సరఫరా సాగేట్లయితే బిల్లు జారీకి నిర్దేశించిన కాల వ్యవధి ఏమిటి?
నిరంతర సేవల సరఫరా సాగుతూన్నట్లయితే...
- ఒప్పందం ప్రకారం చెల్లింపు పరిష్కార తేదీ ఇదమిత్తంగా తెలిస్తే... సదరు చెల్లింపు బాధ్యత పూర్తికి ముందు లేదా తర్వాత స్వీకర్తకు బిల్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, సరఫరాదారు తన సేవలకు చెల్లింపు పొందినా, పొందకపోయినా నిర్దేశిత కాల వ్యవధికి లోబడి బిల్లు జారీ చేయాల్సిందే;
- ఒప్పందం ప్రకారం చెల్లింపు పరిష్కార తేదీ ఇదమిత్తంగా తెలియనట్లయితే... సేవల సరఫరాదారు చెల్లింపు స్వీకరించిన ప్రతిసారి బిల్లు జారీచేయాలి. అయితే, ఇది నిర్దేశిత కాల వ్యవధికి లోబడి ఉండాలి.
- చెల్లింపు ప్రక్రియ ఒక లావాదేవీ పూర్తికావడంతో ముడిపడి ఉన్నట్లయితే సదరు వ్యవహారం ముగిసే ముందుగా లేదా అది ముగిసేటప్పుడు సేవల సరఫరాదారు బిల్లు జారీచేయాలి. అయితే, అది నిర్దేశిత వ్యవధికి లోబడి ఉండాలి.
అమ్మకానికి ఆమోదం లభించాక వస్తువుల సరఫరా లేక స్వీకరణపై ఎంత వ్యవధిలో బిల్లు జారీచేయాలి?
అమ్మకానికి ఆమోదం తర్వాత వస్తువుల సరఫరా లేదా వాపసు, స్వీకరణలకు సంబంధించి సరఫరాకు ముందు లేదా అదే సమయంలో లేదా ఆమోదిత తేదీనుంచి ఆరు నెలల్లోగా ఏది ముందైతే ఆ తేదీన బిల్లు జారీచేయాలి.
ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్