విదేశీ మారకద్రవ్య విభాగం
ఇంతకుముందున్న ఫెరా (ఎఫ్‌ఇఆర్‌ఎ) క్రింద క్యుఎ-22 ఖాతా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 క్రింద ఇంకా కొనసాగింపబడుతోందా?
- లేదు. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 1999 ప్రవేశ పెట్టడంతో భారతదేశంలో నివసించే విదేశీయులచే తెరవబడిన ఖాతాలు స్వదేశీ ఖాతాలుగానే పరిగణింపబడతాయి. ఇతర స్వదేశీ రూపాయలలో ఉండే ఖాతాల మాదిరిగానే సరిసమానంగా ఉన్నట్లు పరిగణింపబడతాయి.
విదేశీయులు భారతదేశంలో ఉంటూ స్వదేశీ ఖాతాను తెరవవచ్చా?
- అవును. విదేశీయులు భారతదేశంలో ఉంటూ స్వదేశీ రూపాయలలో ఉండే ఖాతాను తెరవవచ్చు, నిర్వహించుకోవచ్చు.
క్యుఎ 22 ఖాతాలేని సందర్బంలో విదేశీయులు దేశీయ ఖాతాలను నిర్వహించే స్వదేశీ ఖాతాలను, మానిటర్ చేసేందుకు బ్యాంకులు ప్రత్యేకంగా ఏదేని పద్ధతిని కలిగి ఉండాలా?
- అవసరాన్నిబట్టి, ఖాతాలను సాఫీగా నిర్వహించుటకు, ముఖ్యంగా భారతదేశాన్నుండి ఇతర చోట్లకు అటువంటి నిధులను మళ్ళించమని విజ్ఞప్తులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, విదేశీమారక ద్రవ్య నియంత్రణ కోణంలోంచి చూసినప్పుడు అటువంటి మానిటరింగ్ అవసరం అనిపించదు. అయినప్పటికీ అవసరమైనటువంటి పరిపాలనా పరమైన ఏర్పాట్లను బ్యాంకు వారు తాము స్వేశ్చగా చేసుకోవచ్చు.
అటువంటి ఖాతాలను మూసివేసినప్పుడు ఆధీకృత డీలర్లు (బ్యాంకులు) వాటిలో ఉన్న సమ్మును చెల్లించవచ్చా?
- అవును చెల్లించవచ్చు. కానీ భారతదేశం నుండి విదేశాలకు పంపే నిధులు విదేశాల నుండి స్వీకరించినవిగా కాని విదేశాలకు తిరిగి పంపగలిగే స్వభావంకలవిగా కాని లేదా భారతీయ రిజర్వు బ్యాంకు వారి అధికారిక ప్రకటన నెం. ఫెమా/13/2000, తేదిః 03.05.2000 (ఎప్పటికప్పుడు మార్పుచేసిన విధంగా) ప్రకారము అనుమతి నిచ్చుటకు తగిన విధంగా ఉన్నాయని ఆధీకృత డీలర్లు నిర్దారించుకోవలసి ఉంటుంది.
క్యుఎ 22 లేనప్పుడు విదేశీయుల జీతాలు ఏవిధంగా చెల్లింపబడతాయి?
- భారత ప్రభుత్వం వారి తేదిః 30.3.2001 నాటి అధికారిక ప్రకటన నెం. ఎస్.ఒ.301(ఇ) ప్రకారం పాకిస్థాన్ పౌరుడుకాని భారతదేశములొ శాశ్వత నివాశి కాని విదేశీ పౌరుడు విదేశాలలో ఉండే సమీప బంధువులకు నిఖరంగా వచ్చే జీతాన్ని మించకుండా (పన్నులు, భవిష్యనిధికి కట్టే సమ్ము మరియు ఇతర తగ్గింపులు చేసిన తరవాత) పంపడానికి బ్యాంకులు అనుమతి నివ్వడానికి స్వతంత్రత కలిగి ఉన్నాయి.
విదేశీ పర్యాటకులు తమ స్వల్ప సందర్శన కాలంలో బ్యాంకు ఖాతాను తెరవవచ్చా?
- అవును. విదేశీ మారక ద్రవ్యంలో కర్యకలాపాలు నిర్వహించే ఏ బ్యాంకులోనైనా, విదేశీ పర్యాటకులు తమ స్వల్ప సందర్శన కాలంలో ప్రవాస సాదారన రూపాయి (ఎన్‌ఆర్‌ఒ) ఖాతాను తెరవవచ్చు. అటువంటి ఖాతాలు అత్యధికంగా ఆరు నెలల కాలవ్యవధికై తెరవవచ్చు.
అటువంటి ఖాతాలలో ఏవిధమైన మొత్తాలను జమ చేయవచ్చు?
- భారతదేశం వెలుపలనుండి వచ్చిన నిధులను లేక విదేశీ పర్యాటకులు తెచ్చుకున్న విదేశీ మారకద్రవ్యం భారతదేశంలో అమ్ముకోవడం ద్వరా వచ్చిన సమ్మును ఎన్‌ఆర్‌ఒ ఖాతాలో జమచేయవచ్చు.
స్థానిక చెల్లింపులకోసం ఎన్‌ఆర్‌ఒ ఖాతాను ఉపయోగించవచ్చా?
- అవును. ఈ పర్యాటకులు స్వేశ్చగా ఎన్‌ఆర్‌ఒ ఖాతాల నుండి స్థానిక చెల్లింపులను చేయవచ్చు.
భారతేదశాన్ని వదిలి వెళ్ళిపోయేటపుడు విదేశీ పర్యాటకులు తమ ఖాతాలో మిగిలిపోయి ఉన్న సమ్మును తమ దేశాలకు మళ్ళించుకోవచ్చా?
- విదేశీ పర్యాటకులు తిరిగి వెళ్ళిపోయేటపుడు ఈ ఖాతా 6 నెలల కాల పరిమితికి మించకుండా నిర్వహించినపుడు మరియు దానిపై వచ్చే వడ్డీ తప్ప ఆ ఖాతాలో స్థానికంగా వచ్చే సమ్ము జమచేయకుండా ఉన్నపుడు వారి ఖాతాలో ఉన్న మిగిలిన సమ్మును విదేశీద్రవ్యంలోకి మార్పిడి చేసిన తరువాత తీసుకుపోవడానికి బ్యాంకులు అనుమతినిస్తాయి.
ఆరు నెలలు మించి నిర్వహింపబడిన ఖాతాలో ఉన్న సమ్మును తిరిగి విదేశీయులు తమ దేశానికి మళ్ళించడానికి ఏమి చేయాలి?
- ఇటువంటి సందర్భాలలో అటువంటి మిగిలిపోయిన సమ్మును తమకు మళ్ళించవలసిందిగా ఒక తెల్ల కాగితంపై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ప్రాంతీయ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు