ఇ.ఇ.ఎఫ్.సి ఖాతా అంటే ఏమిటి ? | భారతదేశంలో విదేశీ ద్రవ్యరూపంలో చెప్పగలిగే ఒక ఖాతా, అధీకృత డీలరు విదేశ మారకద్రవ్యంలో కార్యక్రమాలను నిర్వహించే బ్యాంకులు ద్వారా నిర్వహింపబడేదీ మరియు నిర్ణయింపబడిన శాతంలోసంపాదించిన దానిలొ నుండి విదేశీ ద్రవ్యరూపంలొ, మార్పిడి చేయడం, జమచేయడం. |
|
ఈ ఖాతాను ఎవరు తెరువగలరు? | భారతదేశంలో వుండే ఏ వ్యక్తి అయినా, కంపెనీలు మరియు సంస్థలు మొదలగు వాటితో సహా. | |
నిర్ణయింపబడిన పరిమితులు ఏమిటి? | హోదాగల ఎగుమతిదారుడు | సంపాదనలో 100శాతం |
వ్యక్తిగత హోదాలో గల వృత్తి నిపుణుడు @ | సంపాదనలో 100శాతం | |
100శాతం ఎగుమతి చేయు యూనిట్లు ఎగుమతులను నిర్వహించే జోన్లలో ఉండే యూనిట్లు/ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు/ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్కులు | సంపాదనలో 100శాతం | |
ఇతరములు | సంపాదనలో 50శాతం | |
అ వ్యక్తిగత నిపుణుడు అనగా ః (1) విదేశీ కంపెనీ యొక్క బోర్డ్ డైరెక్టరుగా వుండడం. (2) భారతీయ విశ్వవిద్యాలయంలో/ సంస్థలో శాస్త్రవేత్త/ ఎఫెసర్, (3) ఆర్థిక శాస్త్రవేత్త, (4) న్యాయవాది, (5) వైద్యుడు, (6) వాస్తు శిల్పి, (7) ఇంజినీరు, (8) కళాకారుడు, (9) కాస్ట్ / చార్టర్‌డ్ ఎక్కౌంటెంటు, (10) వ్యక్తిగత హోదాలో, వృత్తిపరమైన సేవలనందించే నిపుణుడు లేక భారతీయ రిజర్వు బ్యాంకు కాలక్రమేణా వివరించినట్లుగా. | ||
ఖాతాల రకాలు | వడ్డీయివ్వని కరెంటు ఖాతా | |
చేయు జమ, అనుమతింపబడినంతవరకూ, | సంపాయించిన విదేశ మారకద్రవ్యంలో నిర్ణీత పరిధి వరకు జమ. మరియు అటువంటి ఖాతాల నుండి ఇంతక్రితం తీసుకున్న, వుపయోగించని విదేశీ మారకద్రవ్యాన్ని తిరిగి జమ చేయుట. | |
అనుమతింపబడే అప్పులు | ప్రస్తుత ఖాతా (కరెంటు ఎక్కౌంటు) లావాదేవీల్లో చేయు అన్ని చెల్లింపులు అనగాప్రయాణ, వైద్యానికి, విదేశాలలో చదువులకు, అనుమతింపబడే దిగుమతులు, కమీషను, కస్టమ్సు డ్యూటీ మొ||నవి. ఏమైనప్పటికీ సంవత్సరానికి 5000 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ విలువగల బహుమతులు/ విరాళాలు చేయు ప్రతి ఒక దాతకు ఈ అనుమతి వర్తించదు. అనుమతించబడిన పరిధిలో మూలధన ఖాతా లావాదేవీలకై చెల్లింపులు చేయుట. భారతదేశంలో 100శాతం వుత్పత్తిని ఎగుమతి చేయు యూనిట్లకు /ఎగుమతిని నిర్వహించే జోన్లకు / సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ. పార్కులకు/ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్కులకు, వారు అందించే ఉత్పాదనలకు, సేవలకు అయ్యే ఖర్చులకు చెల్లింపులు చేయుట. వ్యాపార సంబంధిత ఋణాలు మరియు ముందు చెల్లింపులు చేయుటకు. భారతదేశంలో నివాసముండే ఒక వ్యక్తికి వస్తువులను, సేవలను అందించడానికి విదేశీమారక ద్రవ్యంలొ విమాన ఛార్జీలు,హోటలు ఖర్చులతో సహా చెల్లింపులు చేయుట. |
|
చెక్కు సౌకర్యం | ఉంది. | |
నామినేషన్ సౌకర్యం | ఇతర రెసిడెంటు ఖాతాల మాదిరిగానే అనుమతింపబడుతుంది. |
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020