ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు
- భారతదేశంలో విదేశీ కంపెనీలు చేయు వ్యాపారం ఏ రూపాల్లో నిర్వహింపబడుతుంది?
- భారతదేశంలో విదేశీ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకొనడానికి, ఈ క్రింది ప్రత్యమ్నాయాలున్నాయి.
- కంపెనీల చట్టం 1956 ద్వారా నమోదు కాబడిన వ్యవస్థగా ఉండి, ఈ క్రింద చూపబడినటువంటి ద్వారా
- ఉమ్మడి/ సంయుక్త వ్యాపారం, లేక
- సంపూర్ణ ఆధిపత్యం గల సహాయక వ్యవస్థగా
- నమోదు కాని ఒక వ్యవస్థగా, వీటి ద్వారా :
- అను సంధాయక కార్యాలయము / ప్రతినిధి కార్యాలయము
- ప్రాజెక్టు కార్యాలయము
- శాఖా కార్యాలయము
ఇటువంటి కార్యాలయాలు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపిబి) విదేశంలో వ్యాపారం జరుతున్నచోట కాకుండా (భారతదేశంలో వ్యాపార కార్యాలయ శాఖను నెలకొల్పుట) నిబంధనలు 2000 క్రింద తమ కార్యకలాపాలను నిర్వహించుకొనవచ్చును.
భారతదేశంలో ఒక విదేశీ సంస్థ ఏవిధంగా పెట్టుబడిని పెట్టగలదు?
భారతీయ కంపెనీలు విదేశీ సహాకారులకు / పెట్టుబడిదారులకు షేర్లను జారీ చేయడానికి సంబంధించిన నిబంధనలేమిటి?
ఆటోమేటిక్ రూట్
అన్నిరకాల కార్యకలాపాలలోనూ / రంగాలలోనూ, 100శాతం వరకూ ఎఫ్.డి.ఐ ఆటోమేటిక్ రూటు కింద అనుమతింపబడుతుంది. కానీ ఈ క్రిందనుదహరించినవి తప్ప, ఎందుకంటే వాటికి ముందస్తుగా ప్రభుత్వము వారి అనుమతి కావాలి.
- పారిశ్రామిక లైసెన్సు అవసరమయ్యే కార్యకలాపాలు / వస్తువులు
- విదేశీ సహకారం ఇచ్చేవారు ప్రస్తుతం భారతదేశంలో వున్న ఆర్థిక / సాంకేతిక తోడ్పాటు, సహకారం, రంగంలో ఉండి మరల ఇదే రంగంలో పెట్టుబడికి పంపే ప్రతిపాదనలు.
- ఆర్థిక రంగంలో ప్రస్తుతం వున్న భారతీయ కంపెనీలోని షేర్లను స్వాధీనంచేసుకునే ప్రతిపాదనలు: సెక్యూరిటీల మార్పిడి మండలి (చెప్పకోతగ్గ స్థాయిలో షేర్లను మరియు స్వాధీనాలను) నిబంధనలు, 1997.
- ప్రకటింపబడని రంగాల విధానం / పరిధులు లేక ఎఫ్.డి.ఐ.లను అనుమతించని రంగాల్లో ప్రతిపాదనలు
- రిజర్వ్ బ్యాంకు లేకుండా అనుమతింపబడినంత మేరకు ఆటోమేటికట్ రూట్ ద్వారా అనుమతింపబడిన రంగాలు / కార్యకలాపాలు (ప్రత్యక్ష విదేశీ పెట్టుబడికి ప్రభుత్వము నుండి గానీ, లేక భారతీయ రిజర్వుబ్యాంకు నుండి ముందస్తు అనుమతి అవసరం). పెట్టుబడిదారులు ఇన్‌వర్డ్ రెమిటెన్స్‌లు అందుకున్న, 30 రోజుల లోపల సంబంధిత ప్రాంతీయ భారతీయ రిజర్వ్ బ్యాంకు కార్యాలయమునకు అధికారికంగా తెలియజేస్తే చాలు. మరియు విదేశీ పెట్టుబడిదారులకు షేర్లను జారీ చేసిన 30 రోజుల లోపల అటువంటి ప్రాంతీయ కార్యాలయానికి కావలసిన పత్రాలను ఫైలు చేయవలెను.
ప్రభుత్వ రూటు
- ఆటోమేటిక్ రూటులో లేని ఎఫ్.డి.ఐ. కార్యకలాపాలు, ముందస్తూ ప్రభుత్వ అనుమతి ఎందవలసి ఉంటుంది. ఈ దరఖాస్తులు ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎమోషన్ బోర్డు (ఎఫ్.ఐ.పి.బి) ద్వారా పరిశీలించబడుతాయి. దీనికి సంబంధించిన ఫార్మ్ ఎఫ్‌సిఐఎల్ దరఖాస్తులను www.dipp.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకొనవచ్చు. మామూలు తెల్లకాగితంపై ఇచ్చే దరఖాస్తులు, అన్ని వివరాలతో కూడి ఉన్నటువంటివి కూడా స్వీకరించబడతాయి. దీనికేమి రుసుము చెల్లించనక్కరలేదు.
ఎఫ్.ఇ.ఎమ్.ఏ.క్రింద భారతీయ రిజర్వ్ బ్యాంకు వారి నుండి సాధారణ అనుమతి
- ఎఫ్‌ఐపిబి ద్వారా విదేశీ పెట్టుబడుల అనుమతి ఉన్న భారత కంపెనీలు భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ఇంకే విధమైన క్లియరెన్సులు తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి భారత కంపెనీలు ఇన్‌వర్డ్ రెమిటెన్సులు అందిన 30 రోజుల లోపల అలాగే విదేశీ పెట్టుబడిదార్లకు, లేక ప్రవాస భారతీయులకు గానీ షేర్లను జారీచేసిన 30 రోజుల లోపల సంబంధిత రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి తెలియపర్చాల్సి ఉంటుంది.
ఆటోమేటిక్ రూటు అలాగే ప్రభుత్వ రూటు క్రింద ఏఏ రంగాలలో విదేశీ పెట్టుబడులు భారతదేశంలో అనుమతింపబడవు?
ప్రభుత్వ మరియు ఆటోమేటిక్ రూటు క్రింద, ఈ క్రింద నుదహరించిన రంగాలలో విదేశీ పెట్టుబడులు నిషేదించబడినవి :
- చిల్లర వ్యాపారం (రిటైల్ ట్రేడింగ్)
- అణుశక్తి (ఆటమిక్ ఎనర్జీ)
- లాటరీ వ్యాపారం
- జూదం మరియు పందెం కాయడం
- గృహ వసతి మరియు స్థలాల అమ్మకం వ్యాపారం
- వ్యవసాయం (పూల పెంపకం, తోటల పెంపకం, విత్తనాభివృద్ధి, పశుపోషణ, మత్స్యపరిశ్రమ మరియు కూరగాయలను పండించడం, కుక్క గొడుగులు మొదలైనవి. వ్యవసాయ సంబంధిత మరియు అటువంటి రంగాలలో కొన్ని నిర్దుష్ఠ, నియంత్రీకరించిబడిన పరిస్థితులు మరియు సేవలకు లోబడి మరియు తోటల పెంపకం (టీ తోటలు తప్ప).
ఆటోమేటిక్ రూటు లేక ప్రభుత్వ రూటు క్రింద పెట్టుబడి పెట్టిన తర్వాత ఏం చేయాలి?
దీని కోసం రెండు దశలలో సమాచారాన్ని నివేదించే పద్ధతి ప్రవేశపెట్టబడింది.
పెట్టుబడి కోసం డబ్బు అందగానే
- విదేశీ పెట్టుబడిదారుడు నుండి డబ్బు అందిన 30 రోజులలోపల, భారత కంపెనీ ఆ విషయాన్ని సంబంధిత భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆ ప్రాంతీయ కార్యాలయానికి ఈ క్రింది వివరాలనుతెలియచేస్తూ, ఒక నివేదికను పంపాల్సి ఉంటుంది.
- విదేశీ పెట్టుబడిదారుల యొక్క పేరు, చిరునామా
- నిధులు అందుకున్న తేది మరియు దానికి సరిపోయే రూపాయి సమానాంతర విలువ
- నిధులు ఏ ఆఫీసర్ ద్వారా అందుకున్నారో అధీకృత డీలర్ యొక్క పేరు చిరునామా, మరియు
- ప్రభుత్వ అనుమతికి సంబంధించిన వివరాలు, ఏమైనా వుంటే
విదేశీ పెట్టుబడిదారులకు షేర్లు జారీ చేసిన తర్వాత
- షేర్లు జారీ చేసిన 30 రోజులలోపల, ఫారం ఎఫ్.సి.జి.పి.ఆర్.తో ఈ క్రింద వివరించిన పత్రాలను జత చేసి, రిజర్వ్ బ్యాంకు యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పంపవలెను. సంబంధిత కంపెనీ సెక్రటరీ ప్రవాస భారతీయుల నుంచి పెట్టుబడులు స్వీకరించునట్లు ధృవీకరిస్తూ ఒక ధృవపత్రం సమర్పించాలి.
- కంపెనీ చట్టం 1956లోని అంశములన్ని పాటించబడ్డాయి అని.
- ప్రభుత్వ అనుమతికి సంబంధించిన నియమ, నిబంధనలు ఏమైనా ఉంటే, అవి పాటించబడ్డాయి అని,
- ఈ నిబంధనలకు లోబడి, కంపెనీ షేర్లను జారీ చేసే అర్హత కలిగి ఉందని, మరియు
- ప్రతిఫలంగా సమ్ము ముట్టినట్లు ఋజువు చేస్తూ భారతదేశంలోని అధీకృత డీలర్ ఇచ్చిన అన్ని అసలు (ఒరిజినల్) ధృవపత్రాలు కంపెనీ దగ్గర వున్నట్లుగా.
- విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశానికి వెలపల ఉన్న వ్యక్తులకు జారీ చేయబడిన షేర్ల విలువను నిర్ణయించిన విధానాన్ని తెలియజేస్తూ చట్టబద్ధ ఆడిటర్లు లేక ఛార్టర్డ్ ఎకౌంటెంటు ఇచ్చిన ఒక ధృవప్రతము.
ప్రస్తుతం వున్న షేర్లను ప్రవాసీయుల వద్ద నుండి స్థానిక నివాసులకు, అలాగే స్థానిక నివాసుల నుండి ప్రవాసీయులకు బదిలీ చేయడంలో గలమార్గదర్శక సూత్రాలేమిటి?
ప్రవాసీయుల వద్ద నుండి ప్రవాసీయులకే బదిలీ చేయడం
అమ్మకం ద్వారా బదిలీ చేయడం
- భారతదేశానికి వెలుపల ఉండే ప్రవాసీయుడు స్వేచ్ఛగా షేర్లను / మార్పిడి చేసుకోవడానికి వీలయ్యే డిబెంచర్లను, భారతదేశపు నివాసి అయిన వ్యక్తికి అమ్మడం ద్వారా బదలాయించుకోవచ్చు.
- భారతదేశానికి వెలుపల నివాసముండే ఏ వ్యక్తి అయినా (ప్రవాస భారతీయుడు కాకుండా లేక విదేశీ వ్యాపార సంస్థ కాకుండా) భారతదేశంలో నివాసముండే / లేక లేనటువంటి వ్యక్తికి షేర్లను/ మార్పిడి చేసుకోగలిగే డిబెంచర్లను అమ్మకం ద్వారా బదలాయించుకోవచ్చు. అయితే అటువంటి విధంగా షేర్లను అందుకున్నటువంటి వ్యక్తి, బదిలీ చేయబడిన వ్యక్తికి ఇంతకు ముందు ఏ విధమైన వ్యాపారాలు గానీ లేక భారతదేశంలో ఏ విధమైన లావాదేవీలు, ఇదే రంగంలో, ఉండకూడదు.
- ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ) అమ్మకం ద్వారా తనవద్ద వున్న షేర్లను / మార్పిడి చేసుకోగలిగే డిబెంచర్లను, ఇంకొక ప్రవాస భారతీయుడికి (ఎన్.ఆర్.ఐ) మాత్రమే బదలాయించవచ్చు.
- ఏ వ్యక్తి అయినా, భారతదేశానికి బయట వున్నప్పుడు ఎఫ్.ఇ.ఎమ్.ఏ. నిబందనలననుసరించి షేర్లను / మార్పిడి చేసుకోగలిగే డిబెంచర్లను సంపాదించి, తన వద్ద వుంచుకున్నప్పుడు, వాటిని భారతదేశపు స్టాకు ఎక్సేంజిలోని ఒక నమోదిత బ్రోకరు ద్వారా అమ్ముకోవచ్చు.
- ఒక ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ) లేక విదేశ వ్యాపార సంస్థ (ఓవర్సీస్ కార్పొరేట్ బాడీ) షేర్లను కేవలం ఇంకొక ప్రవాస భారతీయుడికి అమ్మకం ద్వారా మాత్రమే బదలాయించవచ్చు.
బహుమతిగా బదలాయించడం
- భారతదేశపు నివాసికి, భారతదేశానికి వెలుపల నివాసముండే వ్యక్తి షేర్లను / మా.చే. డిబెంచర్లను స్వచ్ఛందంగా, బహుమతి రూపంలోఈ క్రింద విధంగా బదలాయించుకోవచ్చు :
- భారతదేశానికి వెలుపల నివాసముండే ఏ వ్యక్తి అయినా లేక విదేశీ నమోదిత సంస్థ (ఓవర్సీస్ కార్పొరేట్ బాడీ) షేర్లను / మా.చే. డిబెంచర్లను బహుమతి రూపంలో, భారతదేశానికి బయట వున్న వ్యక్తికి బదలాయించుకోవచ్చు. అయితే ఆవిధంగా అట్టి షేర్లను ఎందిన వ్యక్తి భారతదేశంలో, అదే రంగంలో ఏ విధమైన వ్యాపారం కలిగి ఉండకూడదు.
- ఒక ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ) షేర్లను మార్పిడి చేసుకోగలిగే డిబెంచర్లను బహుమతి రూపంలో కేవలం ఇంకొక ప్రవాస భారతీయుడికి మాత్రమే బదలాయించవచ్చు.
- భారతదేశానికి వెలుపల ఉన్న ఏ వ్యక్తి అయినా షేర్లను / మార్పు చేయడానికి వీలు కలిగే డిబెంచర్లను, భారతదేశంలో నివాసముండే ఇంకొక వ్యక్తికి ఒక బహుమతి రూపంలో బదలాయించవచ్చు.
స్థానికంగా ఉండే వారి వద్ద నుండి అస్థానికంగా ఉండే వారికి
- అమ్మకం ద్వారా ః అధికార ప్రకటన నెం. ఎఫ్.ఇ.ఎమ్.ఏ. 20/2000 - ఆర్.బి. తేది మే 3, 2000లోని నిబంధన 10 క్రింద సాధారణ అనుమతి.
- భారతదేశపు నివాసి, భారతదేశానికి వెలుపల నివాసం ఉండే వ్యక్తికి భారతదేశపు కంపెనీ ఏ విధమైన షేర్లనయినా / మార్పు చేయడానికి వీలు కలిగే డిబెంచర్లనయినా బదిలీ చేయవచ్చు. కాని అట్టి కంపెనీ యొక్క కార్యకలాపాలు ఆటోమాటిక్ రూట్ ద్వారా పెట్టుబడి విషయంలో అటువంటి రంగానికి చెంది వున్నా పరిమితులకు లోబడి వున్నప్పడు, ఆ షేర్లను / మార్పు చేయడానికి వీలు కలిగే డిబెంచర్లను అమ్మకం ద్వారా ఈ కిందివాటికి లోబడి బదలాయించవచ్చు.
- ప్రతిపాదించిన షేర్లు/ మార్పు చేయడానికి వీలు కలిగే డిబెంచర్ల బదలాయింపు భారతదేశపు కంపెనీకి సంబంధించినవై వున్నప్పుడు అట్టి కంపెనీ ఆర్థిక సేవలనందించే ఏ విధమైన వ్యవహారాలు నిర్వర్తిస్తూ వుండకూడదు (ఆర్ధిక సేవలు అనగా బ్యాంకింగ్ / బ్యాకింగేతర సంస్థలు అందించే సేవలు, భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా క్రమబద్ధీకరించబడినటువంటివి. భీమా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఐ.ఆర్.డి.ఏ) ద్వారా పర్యవేక్షింపబడే సంస్థలు మరియు ఇతర ఆర్థిక పర్యవేక్షకుల ద్వారా క్రమబద్ధీకరణ చేయబడిన ఇతర సంస్థలు ఎలా అయితే ఎలా)
- అటువంటి బదలాయింపు సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (చెప్పకోతగ్గ స్థాయిలో ఉండే షేర్లను స్వాధీనం చేసుకోవడం) 1997కు లోబడి వుండనప్పడు)
- సంబంధిత పార్టీలు వెల నిర్ణయించే మార్గదర్శక సూత్రాలను , డాక్యుమెంటేషను, మరియు అటువంటి బదలాయింపులపై నివేదించవలసిన అవసరాలను, కాలానుగుణంగా భా.రి.బ్యా. ప్రకటించే విధంగా కట్టుబడి ఉండాలి.
బహుమతిగా బదలాయించడం
- భారతదేశానికి వెలపల నివాసం ఉండే వ్యక్తికి, భారతదేశంలో నివసించే వ్యక్తి ఈ క్రింది పరిస్థితుల్లో షేర్లను బదలాయించవచ్చు
- భారతదేశంలో నివసించే ఒక వ్యక్తి, భారతదేశానికి వెలుపల ఉండే వ్యక్తికి , (గతంలో ఓ.సి.బి. కానటువంటి వ్యక్తి కాకుండా) బహుమతి రూపంలో, ఏ విధమైన సెక్యూరిటీనైనా బదలాయించడానికి ప్రతిపాదించినప్పడు, అతను భారతీయ రిజర్వ్ బ్యాంకు కేంద్ర కార్యాలయంలోని ఫారిన్ ఎక్స్ఛేంజ్ శాఖకు ఒక దరఖాస్తు చేసుకొంటూ, ఈ క్రింద వివరించిన విధంగా సమాచారాన్నివ్వాలి.
- బదలాయించే వ్యక్తి మరియు అటువంటి బదలాయింపు అందుకునే వ్యక్తి యొక్క పేర్లు, చిరునామా.
- బదలాయించే వ్యక్తి, అటువంటి బదలాయింపును అందుకునే వ్యక్తికి మధ్యవున్న బంధుత్వము.
- అటువంటి బహుమతినివ్వడంలో ఉద్దేశ్యం, కారణాలు
ఒకవేళ నివాసి నుండి నివాసి కాని వ్యక్తికి చేసేటటువంటి బదలాయింపు పై సౌకర్యాలకు లోబడి వుండకపోతే ఏమవుతుంది?
- ఒకవేళ అటువంటి బదలాయింపు పైన చెప్పిన వాటికి లోబడి ఉండనప్పడు, బదలాయించిన వ్యక్తి అయినా (నివాసి) లే క అట్టి బదలాయింపును అందుకున్న వ్యక్తి (నివాసి కానటువంటి వ్యక్తి) భారతీయ రిజర్వ్ బ్యాంకు కు అటువంటి బదలాయింపునకై అనుమతి కోరుతూ దరఖాస్తు పెట్టుకోవచ్చు.
- ఎఫ్.ఐ.పి.బి. అనుమతి కాపీ ఒకటి బదలాయించే వ్యక్తి వద్ద నుండి మరియు బదలాయింపును ఎందే వ్యక్తి సమ్మతి లేఖ, బదలాయింపబడే షేర్ల సంఖ్య, పెట్టుబడి పెట్టిన కంపెనీ పేరు మరియు ఏ ధరలో బదలాయింపు ప్రతిపాదింపబడినదో తెలియచేయాలి.
- ప్రస్తుతపు భారతదేశంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యొక్క షేర్లను బదలాయించిన విధానం అది జరిగిన తర్వాత, నివాసులు మరియు నివాసులు కాని వారి యొక్క ఈక్విటి పార్టిసిపేషన్, విభజించిన వారి తరగతి ప్రకారం (క్యాటగిరి వైజు)
- భారతీయ రిజర్వ్ బ్యాంకు వారి అనుమతి లేఖల ప్రతులు / ప్రస్తుతం స్థానిక నివాసుల కాని వారి వద్ద నుండి వున్నటువంటి ఇతర హోల్డింగుల వివరాలను ఋజువు చేస్తూ యిచ్చినటువంటి ఎఫ్.సి - జి.పి.ఆర్.లు అవి అందినట్లు ముట్టినటువంటి రసీదులు (ఎకనాలెడ్జ్‌మెంట్లు)
- ఒక వేళ అమ్మినవారు / బదలాయించినవారు ప్రవాస భారతీయులు ( ఎన్.ఆర్.ఐ/లేక ఓ.సి.బిలు అయినట్లయితే, వాళ్ళ వద్ద ఉన్న షేర్లు మళ్లింపు చేసిన మీదట / చేయని, అన్నీ ప్రాతిపదికమీదట వున్నటువంటివి అని ఋజువు చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన అనుమతి నకల్లు.
- అట్టి స్థానిక నివాసి కానటువంటి వ్యక్తి ఎస్.ఇ.బి.ఐ. స్వాధీన నిబంధనలకు లోబడి షేర్లను ఎంది అట్టి బహిరంగ ప్రతిపాదన ఎస్.ఇ.బి.ఐ.తో ఫైలు చేసినపుడు
- క్రింద చూపించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం, షేర్ల విలువను వివరిస్తూ ఒక చార్టర్ ఎకౌంటెంట్ వద్ద నుండి, న్యాయపూరితమైన మదింపు చేసినటువంటి ఒక ధృవప్రతము.
- లిస్టుకాని షేర్ల విషయంలో సహేతుకమైన షేర్ల విలువనుకంట్రోలర్‌ఒ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ నిర్ధారించిన ప్రకారం చేయబడుతుంది.
- లిస్టెడ్ షేర్ల విషయంలో నిర్ధారించబడిన వెల ఆరు నెలల పాటు వున్న వారానికి వుండే ఎక్కువ, తక్కువ రేట్లలో సగటున వుండే అధిక రేటు కంటే తక్కువగా వుండకూడదు. అలాగే ఎఫ్.ఐ.పి.బి. కి దరఖాస్తు చేసిన తేది 30 రోజుల ముందు ఉంటే రెండు వారాలు ప్రతీరోజున వుండే సరాసరి అధిక, తక్కువ కొటేషన్‌కు తక్కువగా పంపకూడదు.
భారతదేశంలో సంపాదించిన పెట్టుబడులు మరియు లాభాలు మళ్లించుకోవచ్చా?
- అన్ని విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా మళ్లింపు చేసుకోవచ్చు. కాని ఎన్.ఆర్.ఐ.లు మళ్లింపు చేసుకునే వీలు లేని పథకాలలో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాలని ఎంచుకున్నప్పడు మళ్ళింపు వీలు లేదు. విదేశీ పెట్టుబడులపై వచ్చే డివిడెండులను ప్రకటించినప్పడు, ఒక అధీకృత డీలర్ ద్వారా అవి స్వేచ్ఛగా మళ్ళించవచ్చు.
ప్రస్తుతం నడుస్తున్న కంపెనీల విషయంలో షేర్లను జారీ చేయడంలోనూ, విలువను నిర్ధారించడంలోనూ అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలేమిటి?
- కంపెనీల చట్టము 1956 ప్రకారము షేర్లను ప్రిఫరెన్‌షియల్ ప్రాతిపదిక పైన కేటాయించడం చేయాలి. కాని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ విషయంలో ప్రత్యేక తీర్మానం ప్రవేపెట్టాల్సిన అవసరం ఉంది.
- లిస్టెడ్ కంపెనీల విషయంలో ఈ క్రింది విధంగా విలువ కట్టడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు/ఎస్‌ఐబిఐ సూత్రాల ప్రకారం.
జారీ చేయబడిన వెల ఈ క్రింది వాటిలో ఏ విధంగానైనా ఉండవచ్చు.
- సంబంధిత షేర్ల యొక్క ముగింపు వెల స్టాక్ ఎక్చేంజిలో కోట్ చేయబడినప్పడు, సంబంధిత తేదీ కంటే ముందు 6 నెలల కాలంలోప్రతి వారంలో హెచ్చు, తగ్గులలో సరాసరి.
- సంబంధిత షేర్ల యొక్క ముగింపు వెల, స్టాక్ ఎక్చేంజిలో కోట్ చేయబడినపుడు సంబంధిత తేదికి ముందు రెండు వారాల్లో ఉన్నట్టుగా ప్రతి వారంలో హెచ్చు, తగ్గులలో సరాసరి.
- అన్‌లిస్టెడ్ కంపెనీల విషయంలో, విలువ కట్టడం, గత కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలననుసరించి ఉంటుంది.
భారతీయ కంపెనీలు ఏ.డి.ఆర్/జి.డి.ఆర్‌లు జారీ చేసేటప్పుడు అనుసరించవలసిన నిబంధనలేమిటి?
- ఏ.డి.ఆర్‌లు/ జి.డి.ఆర్‌లను జారీ చేయడం ద్వారా అంతర్జాతీయ విఫణిలో భారతీయ కంపెనీలు మూలధనాన్ని పెంచుకునేందుకు అనుమతింపబడ్డాయి. భారతీయ రిజర్వు బ్యాంకు వారి ముందస్తు అనుమతి లేకుండానే వారు ఎడిబిలు/ జిడిఆర్‌లు జారీ చేయవచ్చు. కానీ ఈ కంపెనీలు విదేశీ కరెన్సీ మార్పిడి చేసుకోగలిగే బాండ్లు మరియు సాధారణ షేర్లు పథకాన్ని అనుసరిస్తూ (డిపాజిట్ రిసీట్ మెకానిజం ద్వారా) మరియు తదుపరి ఆర్థిక మంత్రిత్వశాఖ , భారత ప్రభుత్వముచే జారీ చేయబడినదర్శక సూత్రాలననుసరించి పంపవలెను.
- ఎ.డి.ఆర్‌లు /జి.డి.ఆర్‌లు జారీ చేయడం అయిన తర్వాత భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క అధికారిక ప్రకటన నెంబరు ఎఫ్.ఇ.ఎమ్.ఏ 20 2000 -ఆర్.బి. తేది మే 3, 2000 తో వున్న అనుబంధం (అనక్సర్)లో ఇచ్చిన నమూనా ప్రకారం, అట్టి కంపెనీ ఒక రిటర్ను ఫైలు చేయాల్సి వుంటుంది. అదే నిబంధనతో పాటుగా ఇవ్వబడిన అనుబంధం - డి (అనక్సర్ -డి) లోని, అటువంటి కంపెనీ ఒక త్రైమాసిక రిటర్ను కూడా ఫైలు చేయాల్సి ఉంటుంది.
- జి.డి.ఆర్/ఏ.డి.ఆర్ జారీచేయగా వచ్చిన సమ్మును చిట్టచివరి దశలో లభించే ఉపయోగాలపై అంక్షలేమీ లేవు. స్థలాలు, భూములు కొనుగోలు చేసే వ్యాపారం మరియు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం విషయాలపై ఖచ్చితంగా వున్న నిషేదం తప్పించి.
స్పాన్సర్డ్ ఏ.డి.ఆర్. మరియు ఏ.డి.ఆర్ / జి.డి.ఆర్ యొక్క టూ వే ఫంగిబిలిటీ పథకం అంటే అర్థం ఏమిటి?
- ప్రాయోజిత ఏడిఆర్/ జిడిఆర్ ః ఒక భారతదేశపు కంపెనీ ఏడిఆర్/ జిడిఆర్ లను విదేశీ డిపాజిటర్‌తో బాధ్యతగా తీసుకుని చేయవచ్చు దాని షేరు హోల్డర్లు వద్ద నున్న షేర్లకు ప్రతికూలంగా , లీడ్ మేనేజర్ నిర్ణయించిన వెల ప్రకారం. ఈ కార్యనిర్వహణకై మార్గదర్శక సూత్రాలను జారీ చేయడం జరిగింది. ఏ.పి. (డిఐఆర్ సీరీస్) సర్క్య్‌లర్ నం.52 తేదీ నవంబర్ 23, 2002 ద్వారా.
- రెండు మార్గాల ఫంగిబిలిటీ పథకం : పరిమితమైన రెండు మార్గాల ఫింగిబిలిటీ పథకం క్రింద, భారతదేశంలోని నమోదిత బ్రోకరు భారతదేశానికి వెలుపల ఉంటే ఒక వ్యక్తి కోసం , అతని తరపున ఒక భారతీయ కంపెనీ షేర్లను కొనవచ్చు. కాని అట్లు కొన్న షేర్లను ఏ.డి.ఆర్‌లు/ జి.డి.ఆర్‌లుగా మార్పిడి చేసుకొనవలెను. ఈ కార్యనిర్వహణకై మార్గ దర్శక సూత్రాలను ఏపి (డిఐఆర్ పథకం) సర్క్య్‌లర్ నం. 21 తేదీ ఫిబ్రవరి 13, 2002 ద్వారా జారీచేయడం జరిగింది.
- ఈ పథకం క్రింద ఏ.డి.ఆర్.లు /జి.డి.ఆర్. షేర్లను కొనడానికి లేక తిరిగి మార్పిడి చేసుకోవడానికి మాత్రమే వీలు కలిగిస్తుంది. ఏ.డి.ఆర్ / జి.డి.ఆర్‌లు అమ్మిన తర్వాత వచ్చిన షేర్ల సంఖ్యకు సమానంగా గానీ లేక తక్కువగా గానీ ఉండేలా (మార్కెట్టులో వాస్తవంగా అమ్మిన వాటితో ) ఆ విధంగా అది పరిమితమైన రెండు మార్గాల ఫంగిబిలిటీ పథకం అయి ఉండి, స్వదేశీ మార్కెట్టులో షేర్లను కొనడం, మార్పిడి చేసుకొన్న షేర్లు స్వదేశీ మార్కెట్లలో అమ్మబడినటువంటివై ఉండి, భారతదేశపు నివాసి కాని పెట్టుబడిదారుచే అమ్మబడినటువంటివైఉండి అటువంటి మార్పిడి చేసుకున్న షేర్ల సంఖ్యకు మాత్రమే పరిమితమై ఉంటాయి. స్వదేశీ మార్కెట్టులో లోపున్నా ఏడిఆర్/ జిడిఆర్ , షేర్ల విలువలో డిస్కౌంట్‌తో కోట్ చేయబడినంతవరకూ, ఈ ఏ.డి.ఆర్‌లను / జిడి ఆర్‌లను మూలాధారమైన షేర్లకు మార్పిడి చేసుకొని వాటిని స్వదేశీ మార్కెట్టులో అమ్ముకుని పెట్టుబడిదారుడు లాభపడతాడు. ఒక వేళ ఏ.డి.ఆర్/ జి.డి.ఆర్‌లు ప్రీమియంతో కోట్ చేయబడినప్పడు, రివర్స్ ఫింగిబిలిటీ కి డిమాండ్ పెరుగుతుంది. అంటే స్వదేశి మార్కెట్టులో షేర్లను కొని వాటిని తిరిగి ఎడిఆర్/జిడిఆర్‌లుగా మార్పిడి చేసుకోవడం. ఈ పథకం ఎస్‌సెబీఇబిఐ లోని సెక్యూరిటీ సంరక్షకులచే మరియు స్టాక్ బ్రోకర్లచే నిర్వహింపబడేటట్లు చేయబడుతుంది.
భారతీయ కంపెనీలు విదేశీ కరెన్సీ మార్పిడి చేసుకోవడానికి వీలయ్యే బాండ్లను (ఎఫ్.సి.సి.బి.లు) జారీ చేయవచ్చా?
- ఎఫ్.సి.సి.బి.లను భారతీయ కంపెనీలు జారీ చేయవచ్చు. కానీ ఈ కంపెనీలు విదేశీ కరెన్సీ మార్పిడి చేసుకునే బాండ్లను జారీ చేసే మరియు సాధారణ షేర్లు (ఆర్డినరీ షేర్సు) (డిపాజిట్ షీట్ మెకానిజం ద్వారా) పథకం 1993 ననుసరించి జారీ చేయవలెను.
- ఎఫ్.సి.సి.డి.లు భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన అధికార ప్రకటన నెం. ఎఫ్‌ఇఎంఏ 3/ 2000 - ఆర్.బి. తేదీ మే 3, 2000 ద్వారా (ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్) కొరకు జారీచేసిన మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి, కాలానుగుణంగా మార్పులు జారీ చేస్తున్న మార్గదర్శక సూత్రాలకు అనుకూలంగా వుండాల్సిన అవసరం ఉంది.
నేను ప్రిఫరెన్సు షేర్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చా? అటువంటి పెట్టుబడులకు సంబంధించి నిబంధనలేమిటి?
- ప్రిఫరెన్సు షేర్ల ద్వారా పెట్టిన విదేశీ పెట్టుబడి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్.డి.ఐ)గా పరిగణింపబడుతుంది. సందర్భాన్ని బట్టి, ప్రతిపాదనలు ఆటోమేటిక్ రూటు ద్వారా గాని లేక ఎఫ్.ఐ.పి.బి. ద్వారా గాని పరిశీలించబడతాయి. ప్రిఫరెన్స్ షేర్లలో విదేశీ పెట్టుబడి మూలధనంలో ఒక భాగంగా పరిగణింపబడి, ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఇ.సి.బి) యొక్క మార్గదర్శక సూత్రాలకు పరిధుల లోబడి వుండదు. ప్రిఫరెన్సు షేర్లు విదేశీ ప్రత్యక్ష ఈక్విటీగా పరిగణించి విదేశీ ఈక్విటీ రంగంలో పరిధిగా వాడుకునేటట్లుగా నిర్ణయింపబడి మరియు అవి మార్పిడి చేసుకునే అవకాశం కలిగి ఉండాలి. అటువంటి అవకాశం లేకుండా ఈ ప్రిఫరెన్స్ షేర్లు రూపకల్పన చేయబడమంటే అవి విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పరిధికి లోబడి ఉండవు.
షేర్లను లంప్సమ్ ఫీ, రాయల్టీ మరియు ఇ.సి.బి. లకు విరుద్ధంగా జారీ చేయవచ్చా?
- ఈక్సిటి షేర్లను లంప్సమ్ ఫీ, రాయల్టీ మరియు ఇ.సి.బి.లకు విరుద్ధంగా జారీ చేయడం అన్నది, మార్పిడి చేసుకోగలిగే విదేశీ కరెన్సీలో అనుమతింపబడుతుంది. అయితే దానికి వర్తించే అన్ని రకాల పన్ను వ్యవహారాలను మరియు ఆ రంగంలోని ప్రత్యేక మార్గదర్శక సూత్రాలను పాటించవలెను.
షేర్లను ఆటోమేటిక్ రూట్ / ప్రభుత్వ రూట్‌లలో జారీ చేయడమే కాకుండా భారతీయ రిజర్వు బ్యాంకు అధికారిక ప్రకటన నం ఎఫ్‌ఇ.ఎమ్‌ఏ 20 తేదీ 3.5.2000 ప్రకారం, ఇంకా లభ్యమయే ఇతర అనుమతులేమిటి?
- ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులకు లేక వాటి ఉమ్మడి వ్యాపారం (జాయింట్ వెంచర్) కంపెనీలో ఉన్న ఉద్యోగులకు లేక విదేశాలలో ఉండి సంపూర్ణంగా తమ ఆధీనంలో ఉండే సహాయక కంపెనీలలో ఉన్న ఉద్యోగులకు ప్రత్యక్షంగా, లేక ఒక ట్రస్టు ద్వారా కంపెనీ యొక్కపెయిడ్ ఆఫ్ మూలధనంలో 5 శాతం వరకూ భారతదేశానికి వెలపల నివశించే వారికి షేర్లను జారీ చేయవచ్చు.
- స్వదేశీ వాసులు కాని వారిచే షేర్లను జారీ చేయడం. స్వాధీనం చేసుకోవడం , భారతీయ కంపెనీలు విలీనం అయిన తర్వాత లేక విలీనం కాని తర్వాత లేక సమ్మిళితం (అమాల్గమేషన్ ) అయిన తర్వాత.
- ఒక భారత కంపెనీచే, భారతదేశానికి వెలుపల నివాసం ఉండే వ్యక్తికి, జారీ చేసే షేర్లను లేక ప్రిఫరెన్స్ షేర్లను లేక మార్పిడి చేసుకోగలిగే డిబెంచర్ల ప్రాతిపదికపైన (రైట్ బేసిస్) క్రింద భారతీయ కంపెనీ జారీ చేయుచున్న షేర్లు.
భారతదేశంలో ఉండే ఒక కంపెనీ జారీచేసిన అన్‌లిస్టెడ్ షేర్లను నేను కొనవచ్చా?
- అవును. భారతీయ రిజర్వు బ్యాంకు/భారత ప్రభుత్వము జారీచేసిన నిబంధనల మేరకు, భారత కంపెనీల యొక్క అన్‌లిస్టెడ్ షేర్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ఒక విదేశీయుడు భాగస్వామ్యంతో / యాజమాన్య ప్రాతిపదికతో భారతదేశంలో ఒక కంపెనీను స్థాపించవచ్చా?
- వీలుకాదు. కేవలం ఎన్.ఆర్.ఐ /పి.ఐ.ఓలు మాత్రమే భారతదేశంలో భాగస్వామ్య / యాజమాన్య కంపెనీలను స్థాపించుకోవడానికి అనుమతింపబడ్డారు. అదికూడా, ఎన్.ఆర్.ఐ / పి.ఐ.ఓ.ల విషయంలో కూడా. అటువంటి పెట్టుబడి తిరిగి స్వదేశానికి వెళ్లిపోని ప్రాతిపదికపై అనుమతి ఇవ్వబడుతుంది.
ఒక భారతీయ కంపెనీ డిస్కౌంటుతో జారీ చేసే రైట్ షేర్లలో నేను పెట్టుబడి పెట్టవచ్చా?
- భారతీయ రిజర్వు బ్యాంకు నుండి డిస్కౌంట్‌తో వుండే రైట్ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఆంక్షలేమి లేవు. అయితే ఆ విధంగా అమ్మకానికి వచ్చే రైట్ల షేర్ల ధర స్థానిక నివాసులకు మరియు కాని వారికి కూడా ఒకే మాదిరిగా వుండాలి.
విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సహకారం (కొలాబరేషను)
భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ఆటోమేటిక్ రూటు క్రింద విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి బదిలీ చేయు విషయంలో చెల్లింపులకు సంబంధించి పాటించవలసిన ప్రమాణాలు (పారామీటర్సు) ఏమిటి? ఏవిధంగా రాయల్టీ లెక్కగట్టబడుతుంది?
విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి, భారతీయ కంపెనీలు చేయు చెల్లింపులు, ఆటోమేటిక్ రోల్ క్రింద ఈక్రింద వుదహరించిన పరిమితులకు లోబడి అనుమతింపబడతాయి.
మిలియన్ అమెరికన్ డాలర్లకు మించకుండా, 2. ఏక మొత్తం (లంప్సమ్) చెల్లింపులు.
- ఇవ్వవలసిన రాయల్టీ 5 శాతం స్వదేశీ అమ్మకాలకు మరియు 8 శాతం విదేశీ అమ్మకాలకూ పరిమితమై ఉండి, అటువంటి రాయల్టీ చెల్లింపులకు కాల వ్యవధిపై ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఉండవలెను.
- ఇటువంటి రాయల్టీ చెల్లింపులు కట్టిన పన్ను నికరంపై పరిగణింపబడి, సాధారణ పరిస్థితులకు అనుగుణంగా లెక్క కట్టబడతాయి.
- ఇటువంటి రాయల్టీ నికర ట్యాక్స్‌ఫ్యాక్టరీ ఉత్పత్తి అమ్మకాల ధరపై ఆధారపడి ఉండి, ఎక్సైజు సుంకంతో కలపకుండా ఉండి అందులోంచి పరికరాల సాధారణ నిర్ణీత వెల మరియు ఎగుమతి చేసిన పరికరాల లాండింగ్ ఖరీదు, వాటిని ఎక్కడ నుండి తీసుకున్నా సరే సముద్రపు రవాణా ఖర్చు, భీమా, కస్టమ్స్ సుంకం మొదలైనవి తీసివేయాలి.
- భారతీయ రిజర్వు బ్యాంకు ఏ.డి.లకు అటువంటి ఒడంబడికల క్రింద, రాయల్టీను చెల్లించే అధికారాలనిచ్చింది. ఈ ఒడంబడికను భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ప్రాంతీయ కార్యాలయంలో నమోదు చేయించుకోవడం అవసరం లేదు.
ఒక వేళ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ఆటోమేటిక్ రూట్ సౌకర్యం లేనప్పుడు ఏం చేయాలి?
- భారతీయ రిజర్వ్ బ్యాంకు యొక్క ఆటోమేటిక్ రూట్‌లో విధింపబడిన ప్రామాణికాలను సంతృప్తికరంగా పాటించని ప్రతిపాదనలు, వాణిజ్య మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎమోషన్, భారత ప్రభుత్వము వారి వద్ద నుండి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది.
ఫోర్టు ఫోలియో పెట్టుబడి
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పోర్టుపోలియో పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన నిబంధనలు ఏమిటి?
- ఎఫ్‌ఐఐలు పెట్టే పెట్టుబడి ఎస్‌ఇబిఐ (ఎఫ్‌ఐఐ) నిబంధనలు 1995 మరియు నెం.20 ఎఫ్‌ఇఎమ్‌ఏ ప్రకటన లోని తేది మే 3, 2000లోని నిబంధన 5(2) క్రింద పంపవలెను. ఎఫ్.ఐ.ఐ.లు అనగా ఆస్తుల నిర్వహణ కంపెనీ (ఏ.ఎమ్.సి) పెన్షన్ నిధులు.
- ఎఫ్‌ఐఐ లను నమోదు చేయడంలో ఎస్‌ఐబిఐ ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. ఎస్‌ఐబిఐ ద్వారా నమోదు కాబడిన ఎఫ్‌ఐఐలకు భారత దేశంలో ఫోర్టుఫోలియో పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంకు సాధారణ అనుమతినిచ్చింది.
- అన్ని ఎఫ్‌ఐఐలు మరియు వాటి ఉపఖాతాలు కలిపితే భారతీయ కంపెనీ యొక్క పైడ్ అప్ మూలధనంలో 24 శాతం కంటే మించి ఉండకూడదు. భారతీయ కంపెనీలు పైన చెప్పబడిన 24 శాతం పరిమితి సెక్టోరల్ పరిధి / చట్టబద్ధమైన పరిమితి ప్రకారం పెంచవచ్చు. దానికి వర్తించే విధంగా, తమ డైరెక్టర్‌ల బోర్డు ఒక తీర్మానాన్ని పెట్టవలెను మరియు దాన్ని ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా సర్వసభ్యులు కూడా ఆమోదించవలెను.
విదేశీ సహకారంతో మూలధనపు పెట్టుబడికి (ఫారిన్ వెంచర్ కేపిటల్ ఇన్‌వెస్టిమెంట్) సంబంధించిన నిబంధనలేమిటి?
- ఎప్పటికప్పుడు మార్పులు చేసిన విధంగా, భారతీయ రిజర్వు బ్యాంకు వారి అధికారిక ప్రకటన నెం. ఎఫ్‌ఐఎంఎ 20/2000-ఆర్‌బి తేది ః 3.5.2000 లోని షెడ్యూల్ 6 ప్రకారం విదేశీయ సహకారంతో మూలధనపు పెట్టుబడి (ఎఫ్.వి.సి.ఐ) పెట్టుబడి పెట్టే ఒక విదేశీ పెట్టుబడిదారుడు ఎస్‌ఐబిఐ నమోదు చేయించుకోబడి ఉండి, ఒక భారత సహకార మూలధనపు సంస్థలోని సహకార మూలధనపు నిధిలో పెట్టుబడి పెట్టవచ్చు, పైన చెప్పిన షెడ్యూల్‌లో ఉదహరించిన నియమాలకు లోబడి, ఎప్పటికప్పుడు చేసే మార్పులకు అనుగుణంగా.
ఎన్.ఆర్.ఐ.లు / పి.ఐ.ఓలు చేయు పోర్టుపోలియో పెట్టుబడులకు సంబంధించిన నిబంధన లేమిటి?
- ప్రవాస భారతీయుడు (ఎన్‌ఆర్‌ఐ) మరియు భారత సంతతికి చెందిన వ్యక్తి (పిఐఒలు) లు భారతీయ కంపెనీలకు చెందిన షేర్లను/మార్పిడి చేసుకోడానికి వీలయ్యే డిబెంచర్‌లను స్టాక్ ఎక్చేంజ్‌లలో పోర్టుపోలియో పెట్టుబడి పథకం కింద కొనవచ్చు మరియు అమ్మవచ్చు. దీనికోసం ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ పోర్టుపోలియో పెట్టుబడులను నిర్వహించే బ్యాంకు యొక్క నిర్ణీత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని రకాల కొనుగోళ్ళు/అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ నిర్ణీత శాఖద్వారానే జరగాల్సి ఉంటుంది.
- ఒక భారతీయ కంపెనీ యొక్క షేర్లను, పైడ్ అప్ మూలధనంలో 5 శాతం వరకు ఎన్‌ఆర్‌ఐలు/పిఐఒలు కొనవచ్చు. అందరు ఎన్‌ఆర్‌ఐలు/పిఐఒలు మొత్తం కలిపినా కూడా కంపెనీ యొక్క పైడ్‌అప్ విలువలో 10 శాతం మించి కొనకూడదు (సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదింప చేసినప్పుడు ఈ పరిమితిని 24 శాతం వరకు పెంచవచ్చు)
- ఈ విధంగా తిరిగి మళ్ళించగలిగే పెట్టుబడులలో అమ్మగా వచ్చిన సమ్మును ఎన్‌ఆర్‌ఐ/పిఐఒల యొక్క ఎన్‌ఆర్‌ఇ / ఎన్‌ఆర్‌ఒ మొదలగు వారి ఖాతాలలో జమచేసుకోవచ్చు. అయితే మళ్ళించడానికి వీలుకాని పెట్టుబడులు అమ్మగా వచ్చిన సమ్మును కేవలం ఎన్‌ఆర్‌ఒ ఖాతాలకు మాత్రమే జమచేయవచ్చు.
- షేర్లయొక్క అమ్మకం, వర్తించబడే పన్నులు కట్టడానికి లోబడి ఉన్నప్పుడే అనుమతించబడుతుంది.
ఒక శాఖ / ప్రాజెక్ట్/అనుసంధాయక కార్యాలయాలను తెరిచే విధానం
విదేశీ కంపెనీలు అనుసంధాయక (లయజన్)/ప్రాజెక్ట్ (పథకం)/శాఖ కార్యాలయాన్ని తెరవడం ఎలాగ?
- భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద నుండి అనుమతి ఎందిన తరువాత, విదేశీ కంపెనీ అనుసంధాయక/శాఖా కార్యాలయాన్ని భారతదేశంలో తెరవవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు విదేశీ కంపెనీలకు కొన్ని నిబంధనలకు లోబడి ప్రాజెక్ట్ కార్యాలయాలను భారత దేశంలో స్థాపించుకోడానికి సాధారణ అనుమతిని ఇచ్చింది
- అనుసంధాయక/ప్రతినిధి కార్యాలయాన్ని స్థాపించుటకు భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క అనుమతి ఎందడంకోసం అనుసరించవలసిన పద్ధతి ఏమిటి?
- అనుసంధాన కార్యాలయము (లయజన్ ఆఫీస్) కేవలం అనుసంధాయక కార్యకలాపాలను మాత్రమే నిర్వర్తించగలదు, అనగా భారతదేశంలో ఉండే పార్టీలకు, విదేశాలలో ఉండే ప్రధాన కార్యాలయాలకు మధ్య ఒక సమాచార పథంగా మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో అది మరే ఇతర వ్యాపార కార్యకలాపాన్ని చేపట్టడంగానీ, ఏ విధమైన సంపాదనను ఆర్జించడంగానీ చేయజాలదు. విదేశాలలో ఉండే ప్రధాన కర్యాలయం ద్వారా ఇన్‌వర్డ్ రెమిట్ట్‌స్సెస్ ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం ద్వారానే ఈ కార్యాలయాల ఖర్చులు పూర్తిగా భరించబడతాయి. అందుచేత అటువంటి కార్యాలయాలు చేసే పని కేవలం మార్కెట్‌లో అందుకోగలిగే అవకాశాల గురించి సమాచారాన్ని సేకరించడం, కంపెనీ గురించి, దాని ఉత్పత్తులను గురించి సమాచారాన్ని అందించడం, కాబోయే భారత దేశపు వాడకందార్లకు వివరించడం వరకే పరిమితమై ఉంటుంది.
- భారతదేశంలో అనుసంధాయక కార్యాలయాన్ని (లయజన్ ఆఫీస్) ప్రారంభించాలని ఆశించేవారు ఫామ్ ఎఫ్‌ఎన్‌సి-1లో, దానిలో వివరించబడిన ఇతర పత్రాలతో (డాక్యుమెంట్లు) తో సహా దరఖాస్తును ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ డివిజన్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్ కేంద్ర కార్యాలయము, ముంబాయికి పంపుకోవాలి, ఈ ఫామ్ యొక్క నమూనా www.rbi.org.in లో లభ్యమౌతుంది.
- అటువంటి కార్యాలయాలను స్థాపించుకోడానికి ముందస్తుగా 3 సంవత్సరాల వరకు అనుమతి ఇవ్వబడుతుంది. ఇటువంటి కార్యాలయాన్ని స్థాపించిన ప్రదేశంలో అధికారం కలిగి ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ద్వారా అనుమతి కాలం ఎడగించుకోవచ్చు. అనుసంధాయక / ప్రతినిధి కార్యాలయాలు కేవలం భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతినిచ్చిన కార్యకలాపాలనే నిర్వహిస్తున్నట్టు ధ్రువపత్రాన్ని (యాక్టివిటీ సర్టిఫికేట్) ను సాలీనా ప్రాతిపదిపై, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా తీసుకొని ఆర్‌బిఐ యొక్క సంబంధిత ప్రాంతీయ కార్యాలయంలో ధాఖలు చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ కార్యాలయాన్ని స్థాపించుటకు అవలంభించవలసిన పద్ధతి ఏమిటి?
భారతదేశంలో ప్రాజెక్టులు నెలకొల్పుకొనేందుకు వీలుగా విదేశీ కంపెనీలకు భారత దేశపు సంస్థలు అనుమతినిస్తాయి. భారతదేశంలో ప్రాజెక్టు కార్యాలయాలను స్థాపించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు వారి అధికారిక ప్రకటన నెం. ఫెమా - 95 / 2003 - ఆర్‌బి తేది ః జూలై 2, 2003 ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క అనుమతినివ్వడం జరుగుతుంది, అయితే అట్టి కార్యాలయం భారతీయ కంపెనీనుంచి భారతదేశంలో ప్రాజెక్టును నిర్మించమని కాంట్రాక్టు ఇచ్చినప్పుడు మాత్రమే, మరియు
- విదేశాల నుండి వచ్చే ఇన్‌వర్డు రెమిట్టెన్స్‌స్ ద్వారా మాత్రమే అటువంటి ప్రాజెక్టుకు నిధులు సమకూర్చబడి ఉండాలి.
- ఈ ప్రాజెక్టుకు నిధులు ఉభయపక్షాల ద్వారా లేక బహుముఖ పక్షాలైన అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్నందించే ఏజెన్సీ ద్వారా ప్రత్యక్షంగా సమకూర్చబడి ఉండాలి, లేక
- ఈ ప్రాజెక్టుకు సరియైన అధికారిక సంస్థ (అప్రాప్రియేట్ అథారిటీ) చే అనుమతి లభించి ఉండాలి.
- ఈ కాంట్రాక్టునిచ్చే భారతదేశంలో ఉండే సంస్థకు కాలవ్యవధితో కూడిన ఋణం (టెర్మ్‌లోన్) ను భారతదేశంలోని పబ్లిక్ ఆర్థిక సంస్థ లేక ఒక బ్యాంకు గాని మంజూరు చేసి ఉండాలి.
- ఏమైనప్పటికీ, ఒకవేళ పైన ఉదహరించిన ప్రమాణాల్ని పాటించలేకపోయిన పక్షంలో లేక మాతృసంస్థ పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్‌ఘనిస్థాన్, ఇరాన్ లేక చైనాలలో కనుక స్థాపించబడి ఉన్నట్లయితే అటువంటి దరఖాస్తులను ఫారిజన్ ఎకనమికల్ డిపార్ట్‌మెంట్ యొక్క కేంద్ర కార్యాలయం భారతీయ రిజర్వు బ్యాంకు ముంబైకి అనుమతికోసం పంపుకోవాలి.
శాఖా కార్యాలయాన్ని స్థాపించాలంటే అనుసరించవలసిన పద్ధతి ఏమిటి?
- ఈ కింద ఉదహరించిన పనులకు భారతీయ రిజర్వు బ్యాంకు తయారీ మరియు వ్యాపార రంగంలో ఉండే కంపెనీలకు భారత దేశంలో శాఖా కార్యాలయాన్ని స్థాపించుకోడానికి అనుమతినిస్తుంది.
- వివిధ రంగాలలో తమ మాతృసంస్థలకు/ఇతర విదేశీ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించేందుకు అనగా భారత దేశంలో ఏజెంట్లుగా కొనుగోలు చేయడం / అమ్మకాలను నిర్వహించడంకోసం.
- మాతృసంస్థ నిర్వహించే రంగంలో పరిశోధనలు చేపట్టడానికి.
- టోకుపద్ధతిని ఎగుమతి మరియు దిగుమతి కార్యకలాపాలు మరియు వర్తకం చేపట్టడానికి.
- విదేశీ కంపెనీలకు మరియు భారత కంపెనీలకు మధ్య సాధ్యమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు ఆర్థిక సహకారాన్ని పెంఎందించడానికి తగిన ప్రోత్సాహకాలను కలిగించడం.
- వృత్తి సంబంధమైన సేవలలో సంప్రదింపులు జరపడం, సలహాల నివ్వడం (కన్సల్టెన్సీ సర్వీసెస్).
- భారతదేశంలో సాఫ్ట్‌వేర్ మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సేవలనందించడం.
- మాత్రు/గ్రూప్ కంపెనీలు సరఫరా చేసే ఉత్పత్తులకు సాంకేతిక సహాయము ఇవ్వడము.
- శాఖా కార్యాలయము తయారీ, ప్రోసెసింగ్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా గానీ / పరోక్షంగాగానీ చేపట్టజాలదు. అలాగే శాఖా కార్యాలయం భారత దేశంలో ఏ విధమైన రిటైల్ కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదు. కేంద్ర కార్యాలయంలోని ఫారిన్ ఎకనమికల్ డిపార్ట్‌మెంట్ శాఖా కార్యాలయము ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద నుండి కార్యకలాపాల ధృవపత్రం (యాక్టివిటీ సర్టిఫికేట్) ను తీసుకొని ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉండాలి, సాలీనా వచ్చే లాభాలను జమచేయడానికి శాఖా కార్యాలయం ఒక అధీకృత డీలరుకు సంబంధిత పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.
- శాఖా కార్యాలయాన్ని స్థాపించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతినిస్తుంది. అయితే భారతీయ రిజర్వు బ్యాంకు దరఖాస్తు చేసుకొన్న కంపెనీ యొక్క నైపుణ్యత రికార్డును, భారతదేశంతో ప్రస్తుతం ఉన్న వ్యాపార సంబంధాలు మరియు అట్టి కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని అనుమతించేముందు పరిశీలిస్తుంది.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు