విదేశీ మారకం నిర్వహణ చట్టం 1999లోని నిబంధనలకు లోబడి, భారతదేశం వెలుపల నివసించే వ్యక్తి భారతదేశంలో స్థిరాస్తిని సంపాదించడానికీ బదిలీ చేయడానికీ సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి గానూ సంబంధిత అంశాలన్నిటి సమాచారంకోసం తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఎక్యూ) సముదాయాన్ని రూపందించడం జరిగింది. ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) లేదా భారత సంతతికి చెందిన విదేశీ జాతీయుడు (పిఐఒ) లేదా భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, భారత పౌరుడు కాకపోయిన భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి భారతదేశంలో స్థిరాస్తిని సంపాదించడానికీ బదిలీ చేయడానికీ సంబంధించిన సమస్యల సముదాయాన్ని దాదాపు ఈ ఎఫ్‌ఎక్యూలు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. పరిష్కారం అవసరమయిన ఇతర సమస్యలున్నట్లయితే, చీఫ్ జనరల్ మేనేజర్, భారతీయ రిజర్వు బ్యాంకు, విదేశీ పెట్టబడి విభాగం, సెంట్రల్ ఆఫీస్, ముంబాయి-400 001 ని సంప్రదించవచ్చు.
భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన నిబంధనలు/ఆదేశాలు
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి భారతదేశంలో స్థిరాస్తి సంపాదించడానికి బదిలీ చేయడానికీ సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన నిబంధనలు/ఆదేశాలు ఎక్కడ లభిస్తాయి?
- భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి భారతదేశంలో స్థిరాస్తి సంపాదించడానికీ బదిలీ చేయడానికీ సంబంధించిన నిబంధనలను ఆర్‌బిఐ ప్రకటన సం. ఫెమ 21/2000-ఆర్‌బి తేది మే 03, 2000న ప్రకటించడం జరిగింది. దీన్ని జూన్ 29, 2002న ప్రకటన నెం. ఫెమ 64/2002-ఆర్‌బి ద్వారా సవరించడం జరిగింది. ప్రకటన సం. ఫెమ 65/2002-ఆర్‌బి, తేదీ 2002 జూన్ 29, ప్రకటన నెం. ఫెమ 93/2003-ఆర్‌బి, తేది 2003 జూన్ 6 తోపాటు ఎ.వి. (డిఐఆర్ సిరీస్) సర్క్యులర్‌ల రూపంలో స్వసంగతమైన ఆదేశాలు కూడా జారీచేయడమైంది. ఇవన్నీ ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో www.fema.rbi.org.in లభిస్తాయి.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి, కొనుగోలు విధానం ద్వారా భారతదేశంలో స్థిరాస్తిని సంపాదించడం
ప్రస్తుతం అమలులోఉన్న విదేశీ మారకం నిబంధనల ప్రకారం, భారతదేశంలో స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి ఎవరికి సాధారణ అనుమతి అందుబాటులో ఉంటుంది?
- భారతదేశ పౌరుడయి (ఎన్‌ఆర్‌ఐ) లేదా భారతసంతతికి చెందిన (పిఐఒ) భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తికి భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన స్థిరాస్తి మొత్తం కొనుగోలు చేయడానికి సాధారణ అనుమతి అందుబాటులో ఉంటుంది.
భారత సంతతికి చెందిన వ్యక్తి (పిఐఒ) అంటే ఎవరు?
- భారతదేశంలో స్థిరాస్తి సంపాదన, బదిలీల నిమిత్తం పిఐఓ అంటే (1) ఎప్పుడయినా భారతీయ పాస్‌పోర్టు ఉన్న లేదా (2) భారత రాజ్యాంగం ప్రకారం లేదా పౌరత్వ చట్టం, 1955 (57 ఆఫ్ 1955) ప్రకారం, అతని తండ్రి, లేదా తాతలలో ఎవరో ఒకరయినా, భారత పౌరుడై ఉన్న (పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక లేదా ఆప్ఘనిస్థాన్ లేదా ఇరాన్ లేదా చైనా లేదా నేపాల్ లేదా భూటాన్ పౌరుడుగా లేని) వ్యక్తి అని అర్థం.
సాధారణ అనుమతికి లోబడి నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని కొనుగోలు చేసిన ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, భారత రిజర్వు బ్యాంకు కు ఏవయినా పత్రాలు సమర్పించాలా?
- సాధారణ అనుమతికిలోబడి నివాస/వాణిజ్య పరమైన ఆస్తిని కొనుగోలు చేసిన ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, భారతీయ రిజర్వు బ్యాంకు కు ఏ విధమైన పత్రాలూ సమర్పించనవసరం లేదు.
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ కొనుగోలు చేసే నివాసి/వాణిజ్యపరమైన ఆస్తుల సంఖ్య మీద ఏదయినా పరిమితి ఉందా?
- అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ కొనుగోలు చేసే నివాస/వాణిజ్య పరమైన ఆస్తులు సంఖ్యమీద పరిమితి ఏమీలేదు.
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ కొనుగోలు చేసిన నివాస/వాణిజ్య పరమైన ఆస్తికి, భారత సంతతికి చెందని విదేశీజాతీయుడి పేరును రెండోహోల్డర్‌గా చేర్చవచ్చా?
భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతివారు కొనుగోలు విధానంద్వారా భారతదేశంలో పరాయి స్థిరాస్తి సంపాదించవచ్చా?
- సంపాదించకూడదు. విదేశీమారకం నిర్వహణ చట్టం 1999లోని సెక్షన్ 2 (|) ప్రకారం, బదిలీలో ఇతర అంశాలతోపాటు కొనుగోలు కూడా ఉంటుంది. అందువల్ల భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంస్కృతికి చెందని విదేశీ భారతీయుడు, కొనుగోలుద్వారా భారతదేశంలో ఏవిధమైన స్థిరాస్తినీ సంపాదించుకోలేడు.
భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, భారతదేశంలో కౌలుకు నివాస సంబంధమైన ఆస్తిని సంపాదించవచ్చా?
- సంపాదించవచ్చు. పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక లేదా ఆప్ఘనిస్థాన్ లేదా చైనా లేదా ఇరాన్ లేదా నేపాల్ లేదా భూటాన్ పౌరుడితోసహా భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, అయిదు సంవత్సరాలకు మించకుండా కౌలువిధానంలో నివాస సంబంధమైన వసతిని మాత్రం సంపాదించుకోవచ్చు. అయిదు సంవత్సరాల వరకు అయితే అతను/ఆమె, భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి ముందుగా అనుమతి తీసుకోనవసరంలేదు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి / అంటే ఎన్‌ఆర్‌ఐ లేదా పిఐఒ లేదా భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు), కొనుగోలు విధానంద్వారా భారతదేశంలో వ్యవసాయభూమి/తోటపరమైన ఆస్తి/ఫార్మ్‌హౌస్ సంపాదించుకోవచ్చా?
- సంపాదించుకోలేరు. భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి కొనుగోలు విధానం ద్వారా భారతదేశంలో వ్యవసాయ భూమి/తోటపరమైన ఆస్తి/ఫార్మ్‌హౌస్ సంపాదించకూడదు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి బహుమతి ద్వారా భారతదేశంలో స్థిరాస్తి సంపాదించడం
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి, బహుమతి ద్వారా ఎన్‌ఆర్‌ఐ/పిఐఓ, భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన ఆస్తి సంపాదించుకోవచ్చా?
- సంపాదించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి లేదా ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ నుంచి బహుమతి ద్వారా నివాస/వాణిజ్యపరమైన ఆస్తి సంపాదించుకోవచ్చు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీజాతీయుడు, బహుమతిద్వారా నివాస/వాణిజ్యపరమైన ఆస్తి సంపాదించుకోవచ్చా?
- సంపాదించుకోకూడదు. విదేశీమారకం నిర్వహణ చట్టం, 1999లోని సెక్షన్ 2(|) ప్రకారం, బదిలీ పరిధిలోకి ఇతర విషయాలతోపాటు బహుమతికూడా వస్తుంది. అందువల్ల భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతసంతతికి చెందని విదేశీ జాతీయుడు, బహుమతిద్వారా భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన ఆస్తి సంపాదించుకోలేడు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి (అంటే ఎన్‌ఆర్‌ఐ లేదా పిఐఒ లేదా భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు), బహుమతి విధానంద్వారా భారత దేశంలో వ్యవసాయ భూమి/తోటల పరమైన ఆస్తి/పార్మ్‌హౌస్ సంపాదించుకోవచ్చా?
- సంపాదించుకోలెడు. భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి బహుమతులద్వారా భారతదేశంలో వ్యవసాయభూమి/తోటలపరమైన ఆస్తి/పార్మ్‌హౌస్ సంపాదించుకోలేడు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి, వారసత్వంద్వారా భారతదేశంలో స్థిరాస్తి సంపాదించడం
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి (అంటే ఎన్‌ఆర్‌ఐలేదా పిఐఒ లేదా భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు) భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి నుంచి వారసత్వంగా సంపాదించిన భారతదేశంలోని ఏవిధమైన స్థిరాస్తిని ఉంచుకోవచ్చా?
- ఉంచుకోవచ్చు. విదేశీమారకం నిర్వహణ చట్టం 1999లోని సెక్షన్ 6(5) నిబంధనల ప్రకారం, భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి నుంచి వారసత్వంగా సంపాదించిన స్థిరాస్తిని ఉంచుకోవచ్చు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి (అంటే ఎన్‌ఆర్‌ఐలేదా పిఐఒ లేదా భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు) భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి నుంచి వారసత్వంగా సంపాదించిన భారతదేశంలోని ఏదయినా స్థిరాస్తిని ఉంచుకోవచ్చా?
- రిజర్వు బ్యాంకు ప్రత్యేక ఆమోదంతో భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి, భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి నుంచి వారసత్వంగా వచ్చిన భారతదేశంలోని ఏదయినా స్థిరాస్తిని ఉంచుకోవచ్చు. అయితే, ఆస్తిని సంక్రమింపజేస్తున్న వ్యక్తి, ఆ ఆస్తిని, సంపాదన సమయంలో అమలులో ఉన్న విదేశీమారకం శాసనంలోని నిబంధనలను లేదా ఫెమా నిబంధనలను అనుసరించి సంపాదించి ఉండాలి.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి, అమ్మకంద్వారా భారతదేశంలో స్థిరాస్తిని బదిలీ చేయడం
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతి ప్రకారం తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని ఒక ఎన్‌ఆర్‌ఐ అమ్మకం ద్వారా ఎవరికి బదిలీ చేయవచ్చు?
- భారతదేశంలోని తన నివాస/ వాణిజ్యపరమైన ఆస్తిని అమ్మకం ద్వారా ఎన్‌ఆర్‌ఐ, భారతదేశంలో నివిసిస్తున్న వ్యక్తికి లేదా ఎన్‌ఆర్‌ఐకి లేదా పిఐఒకి బదిలీ చేయవచ్చు.
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతి ప్రకారం, తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని ఒక పిఐఒ, అమ్మకం ద్వారా ఎవరికి బదిలీ చేయవచ్చు?
- భారతదేశంలోని తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని ఒక పిఐఒ, అమ్మకం ద్వారా భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి మాత్రమే బదిలీ చేయాలి.
ఒక పిఐఒ, తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని అమ్మకంద్వారా ఒక ఎన్‌ఆర్‌ఐకి లేదా పిఐఒకి బదిలీ చేయవచ్చా?
- బదిలీ చేయవచ్చు. భారతదేశంలోని తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని ఒక పిఐఒ, అమ్మకం ద్వారా ఒక ఎన్‌ఆర్‌ఐకి లేదా పిఐఒకి బదిలీ చేయడానికి రిజర్వు బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం ఎందవలసి ఉంటుంది.
భారతదేశంలో గానీ భారతదేశం వెలుపలగానీ నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, ప్రత్యేకమైన రిజర్వ్‌బ్యాంకు అనుమతితో సంపాదించిన భారతదేశంలోని తన నివాస సంబంధమైన ఆస్తిని అమ్మకంద్వారా భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల నివసిస్తున్నవారికి బదిలీ చేయవచ్చా?
- చేయకూడదు. భారతదేశంలోగానీ వెలుపలగానీ నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు రిజర్వు బ్యాంకు ప్రత్యేక అనుమతితో సంపాదించిన భారతదేశంలోని నివాస సంబంధమైన ఆస్తిని అమ్మకంద్వారా భారతదేశంలోగానీ వెలుపల గానీ నివసిస్తున్న వ్యక్తికి బదిలీ చేయడానికి రిజర్వు బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం ఎందవలసి ఉంటుంది.
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి, భారతదేశంలో ఉన్న తన వ్యవసాయభూమిని/తోటలపరమైన ఆస్తిని /ఫార్మ్‌హౌస్‌ను ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ అమ్మకంద్వారా ఎవరికి బదిలీ చేయవచ్చు?
- అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, భారతదేశంలో ఉన్న తన వ్యవసాయ భూమిని/తోటపరమైన ఆస్తిని/ఫార్మ్ హౌస్‌ను భారతపౌరుడయిన, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి అమ్మకంద్వారా బదిలీ చేయవచ్చు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, భారతదేశంలో తాను సంపాదించిన వ్యవసాయభూమిని/తోటల పరమైన ఆస్తిని / ఫార్మ్ హౌస్‌ను అమ్మకం ద్వారా బదిలీ చేయగలడా?
- భారతదేశం వెలుపల నివిసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, భారతదేశంలో సంపాదించిన వ్యవసాయ భూమిని/తోటల ఆస్తిని/ఫార్మ్‌హౌస్‌ను అమ్మకం ద్వారా బదిలీ చేయడానికి ముందుగా రిజర్వు బ్యాంకు ఆమోదం ఎందవలసి ఉంటుంది.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి, బహుమతిద్వారా భారతదేశంలో స్థిరాస్తిని బదిలీ చేయడం
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, బహుమతి ద్వారా తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని బదిలీ చేయగలడా?
- చేయగలడు. భారతదేశంలోని తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, బహుమతిద్వారా భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి లేదా ఎన్‌ఆర్‌ఐకి లేదా పిఐఒకి బదిలీ చేయగలడు.
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి, ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, భారతదేశంలోని తన వ్యవసాయభూమిని/తోటపరమైన ఆస్తిని/ఫార్మ్‌హౌస్‌ను బహుమతి ద్వారా ఎవరికి బదిలీ చేయవచ్చు?
- అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికిలోబడి ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, భారతదేశంలోని తన వ్యవసాయభూమిని/తోటలపరమైన ఆస్తిని/ఫార్మ్‌హౌస్‌ను బహుమతిద్వారా భారతదేశ పౌరుడయి, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి బదిలీ చేయవచ్చు.
భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, తాను భారతదేశంలో సంపాదించుకొన్న వ్యవసాయభూమిని/తోటఆస్తిని/ఫార్మ్ హౌస్‌ను బహుమతిద్వారా బదిలీ చేయగలడా?
- బదిలీ చేయలేడు. భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు, భారతదేశంలో తాను సంపాదించుకొన్న వ్యవసాయ భూమిని/ తోటఆస్తిని/ ఫార్మ్ హౌస్‌ను బహుమతిద్వారా బదిలీ చేయడానికి ముందుగా రిజర్వు బ్యాంకు ఆమోదం ఎందాలి.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి తనఖాద్వారా భారతదేశంలోని నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని బదిలీ చేయడం
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని తనఖాద్వారా భారతదేశంలోని అధికృత డీలర్‌కు/గృహ రుణాలిచ్చే సంస్థకు బదిలీ చేయగలడా?
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, భారతదేశంలోని తన నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని తనఖాద్వారా విదేశంలో ఉన్న పార్టీకి బదిలీచేయగలడా?
- చేయలేడు. అతను ముందుగా ఆర్‌బిఐ ఆమోదం ఎందాలి. అయితే, ఫెమ/ఫెరా నిబంధనల ప్రకారం, ఏదయినా కార్యరూపాన్ని భారతదేశంలో నిర్వహించడానికి ఒక శాఖ కార్యాలయాన్ని లేదా ఇతర వ్యాపార స్థలాన్ని ఏర్పాటుచేసిన భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి కొనుగోలుచేసిన స్థిరాస్తిని అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి, ఏదయినా ఋణం తీసుకోవడంకోసం పూచీగా అధికృత డీలర్‌కు తనఖాపెట్టవచ్చు.
ఎన్‌ఆర్‌ఐ/పిఏఒ భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన ఆస్తి కొనుగోలుకు చేసే చెల్లింపు విధానం
అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి, ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన ఆస్తి కొనుగోలుచేసే చెల్లింపు విధానం ఏమిటి?
- అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, సాధారణ బ్యాంకింగ్ చానెల్ ద్వారా భారతదేశానికి పంపిన నిధులుతోగానీ తన ఎన్‌ఆర్‌ఐ/ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి)/ఎన్‌ఆర్‌ఒ ఖాతాలో ఉన్న నిధులలోగానీ భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. భారతదేశం వెలుపల ఎలాంటి ప్రతిఫలం చెల్లించకూడదు.
ఫ్లాట్/ప్లాటు కేటాయించనందుకు/నివాస/వాణిజ్యపరమైన ఆస్తి కొనుగోలుకోసం చేసిన బుకింగ్‌లు/ఒప్పందాల రద్దుకు గృహనిర్మాణ ఏజెన్సీలు/అమ్మకందారు తిప్పిపంపిన దరఖాస్తు ఫండ్/బయానాసమ్ము/కొనుగోలు ప్రతిఫలం వడ్డీతోసహా (దానిపై చెల్లించవలసిన నికర ఆదాయపు పన్ను), ఎన్‌ఆర్‌ఐ ఖాతాలో జమచేయవచ్చా?
- జమచేయవచ్చు. అయితే, మొదటి చెల్లింపు, ఇన్వార్డ్ రెమిటెన్స్ ద్వారా గానీ ఎన్‌ఆర్‌ఇ/ఎఫ్‌సిఎఫ్‌ఆర్(బి) ఖాతాకు డెబిట్ చేయడం ద్వారా గానీ జరిగి ఉండాలి. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతి అవసరం లేదు. వారు, ఈ విషయంలో నేరుగా అధికృతడీలర్‌ను సంప్రదించవచ్చు.
ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ సంత నివాసంకోసం భారతదేశంలో ఫ్లాట్/ఇల్లు సంపాదించుకొనే నిమిత్తం తన ఎన్‌ఆర్‌ఐ ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతా/ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి) ఖాతాలోని నిధులను పూచీగా పెట్టి అధికృత డీలర్ నుంచి ఋణం తీసుకొనే వీలు ఉంటుందా?
- ఉంటుంది. అయితే కొన్ని షరతులకూ నిబంధనలకూ లోబడి ఉండాలి. (దయచేసి, మే 03, 2000న జారీచేసిన ప్రకటన సం. ఫెమ 5/2000-ఆర్‌బిఐ షెడ్యూల్-1 మరియు షెడ్యూల్-2 చూడండి).
ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, నివాసవసతి కొనుగోలుకోసం, లేదా నివాస వసతి మరమ్మతు/పునరుద్ధరణ/విస్తరణకోసం అధికృత డీలర్‌నుంచి లేదా జాతీయ హౌసింగ్ బ్యాంక్ ఆమోదించిన భారతదేశంలోని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థనుంచి రూపాయలలో గృహ ఋణం ఎందడానికి వీలుంటుందా?
- వీలుంటుంది. అయితే కొన్ని షరతులకూ నిబంధనలకూ లోబడి ఉండాలి. అలాంటి ఋణాలను, ఋణం తీసుకొన్న వ్యక్తి, సాధారణ బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా ఇన్వర్డ్ రెమిటెన్స్ విధానం లోగానీ తన ఎన్‌ఆర్‌ఐ/ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి)/ఎన్‌ఆర్‌ఒ ఖాతాకు డెబిట్ చేయడం ద్వారా గానీ ఆ ఆస్తిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే అద్దె ఆదాయంలోగానీ తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అలాంటి ఋణాన్ని ఋణ్రగహీత సన్నిహిత బంధువులు కూడా ఋణగ్రహీత ఋణం ఖాతాకి క్రెడిట్ చేయడం ద్వారా భారతదేశంలోని తమ ఖాతాద్వారా తిరిగి చెల్లించవలసి ఉంటుంది (దయచేసి, 2000, మే 3 నాటి ప్రకటన నం. ఫెమ4/2000-ఆర్‌బి లోని నిబంధన 8, ఏప్రిల్ 20, 2003 నాటి ఎ.పి. (డిఐఆర్ సిరీస్) సర్క్యులర్ నం.95, 2003 ఏప్రిల్ 25 నాటి ఎ.పి. (డిఐఆర్ సీరీస్) సర్క్యులర్ సం. 94 చూడండి).
ఒక ఎన్‌ఆర్‌ఐ, భారతదేశంలోని తన యజమాని నుంచి గృహనిర్మాణ ఋణం తీసుకోవచ్చా?
- తీసుకోవచ్చు. అయితే కొన్ని షరతులకూ నిబంధనలకూ లోబడి తీసుకోవచ్చు. (2000 మే 3 నాటి ప్రకటన నం. ఫెమ 4/2000-ఆర్‌బి లోని నిబంధన 8ఎ నీ 2003 అక్టోబర్ 10 నాటి ఎ.పి. (డిఐఆర్ సీరీస్) సర్క్యులర్ నెం. 27 ను చూడండి).
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ కొనుగోలుచేసిన నివాస/వాణిజ్యపరమైన ఆస్తికి సంబంధించిన అమ్మకపు రాబళ్లలోనికి పంపడం (repatriation)
ఆర్‌ఎన్‌ఆర్‌ఐ/ఐపిఒ, సాధారణ బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా లేదా ఎన్‌ఆర్‌ఇ/ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) ఖాతా డెబిట్ ద్వారా ఇన్వర్డ్ రెమిటెన్స్ పద్ధతిలో సంపాదించిన భారతదేశంలోని నివాస/ వాణిజ్యపరమైన ఆస్తి అమ్మకపు రాబళ్లను స్వస్థలానికి పంపగలడా? పంపగలిగితే పరిమాణం ఎంత?
- ఒక ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, సాధారణ బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా లేదా ఎన్‌ఆర్‌ఇ/ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి) ఖాతా డెబిట్ ద్వారా ఇన్వార్డ్ రెమిటెన్స్, పద్ధతికి సంబంధించిన భారతదేశంలో నివాస/వాణిజ్యపరమైన ఆస్తి అమ్మకపు రాబళ్లని స్వస్థలానికి పంపవచ్చు. అయితే స్వస్థలానికి పంపే మొత్తం (ఎ) సాధారణ బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా లేదా ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి) ఖాతా డెబిట్ ద్వారా సేకరించిన విదేశీ మారకం (బి) ఎన్‌ఆర్‌ఇ ఖాతాకు డెబిట్ ద్వారా చెల్లించిన మొత్తానికి, చెల్లింపు తేదీనాటికి, సమాన విదేశీ కరెన్సీలో, నివాస/వాణిజ్యపరమైన ఆస్తి సంపాదనకు చెల్లించిన మొత్తానికి మించకూడదు.
- ఎన్‌ఆర్‌ఒ ఖాతాలోని నిల్వలనుంచి కాలెండర్ సంవత్సరానికి ఒక మిలియన్ యుఎస్‌డి వరకు అతను పంపవచ్చు. పది సంవత్సరాలపాటు ఉంచుకొన్న తదనంతరం స్థిరాస్తిని అమ్మేటట్లయితే ఆ ఆస్తి అమ్మకపు వసూళ్లతో సహా అర్హమైన నిల్వలు ఆ అస్తిని 10 సంవత్సరాలకంటె తక్కువగా ఉంచుకున్నట్లయితే, తక్కువైన కాలంతో పాటు ఎన్‌ఆర్‌ఐ అమ్మకపు వసూళ్లను ఖాతా (ఎదుపు/టర్మ్ డిపాజిట్)లో లేదా ఇతర అర్హమైన పెట్టుబడిలో ఉంచినట్లయితే రెమిట్ చేయవచ్చు. అయితే అలాంటి పెట్టుబడి, స్థిరాస్తి అమ్మకపు వసూళ్ళకు సంబంధించినదై ఉండాలి. వివరాలకు 2000 మే 3 నాటి సవరించిన ఫెమా 13లోని నిబంధన 4 (3) చూడండి).
నివాస వసతి కొనుగోలుకోసం ఎన్‌ఆర్‌ఐ తీసుకున్న రూపాయి ఋణాన్ని ఇన్వార్డ్ రెమిటెన్స్ ద్వారా గానీ ఎన్‌ఆర్‌ఇ/ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి) ఖాతాకు డెబిట్ ద్వారా గానీ తిరిగి చెల్లించడం జరిగింది. ఆ ఆస్తి అమ్మకపు వసూళ్లను స్వస్థలానికి పంపవచ్చా?
- పంపవచ్చు. విదేశీమారకంలో ఋణాన్ని తిరిగి చెల్లించడాన్ని నివాస వసతి కొనుగోలుకోసం తీసుకున్న విదేశీ మారకంలో సమానంగా పరిగణించడం జరుగుతుంది.
ఇన్వార్డ్ రెమిటెన్స్ / ఎన్‌ఆర్‌ఇ/ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి) ఖాతాకు డెబిట్ ద్వారా కొనుగోలు చేసిన నివాస/వాణిజ్యపరమైన ఆస్తి అమ్మకానికి సంబంధించి, సరయిన స్తంభనకాలం ఉందా?
- అలాంటి ఆస్తి అమ్మకానికి స్తంభనకాలం లేదు.
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ అమ్మకపు వసూళ్లను స్వస్థలానికి తిప్పిపంపడానికి అఅవకాశంగల నివాస సంబంధించిన ఆస్తుల సంఖ్య మీద ఏదయినా ఆంక్ష ఉందా?
- ఉంది. అమ్మకపు వసూళ్లను స్వస్థలానికి తిప్పి పంపడం, రెండు నివాస సంబంధమైన ఆస్తులకు మించకూడదనే ఆంక్ష ఉంది.
ఎన్‌ఆర్‌ఐ/పిఆర్‌ఒ, బహుమతిద్వారా ఎందిన నివాస/వాణిజ్యపరమైన ఆస్తి అమ్మకపు వసూళ్లను జమచేయడం (రెమిటెన్స్)
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, బహుమతిద్వారా ఎందిన నివాస/వాణిజ్యపరమైన ఆస్తి అమ్మకపు వసూళ్లను ఎన్‌ఆర్‌ఐఖాతాలో జమచేయవలసి ఉంటుందా?
- ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, బహుమతిద్వారా ఎందిన నివాస/వాణిజ్యపరమైన ఆస్తి అమ్మకపు వసూళ్లను ఎన్‌ఆర్‌ఒ ఖాతాలో మాత్రమే జమచేయాలి.
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి అమ్మకపు వసూళ్లను జమచేయడం
భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి నుంచి ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ వారసత్వంగా ఎందిన స్థిరాస్తి అమ్మకపు వసూళ్లను విదేశంలో జమచేయవచ్చా?
- జమ చేయవచ్చు. కాలెండర్ సంవత్సరానికి ఒకమిలియన్ యుఎస్‌డిలకు మించని మొత్తాన్ని జమచేయవచ్చు. అయితే, వారసత్వంగా సంక్రమించిందనడానికి మద్దతుగా పత్రసహితమైన సాక్ష్యాన్ని, పన్ను క్లియరెన్స్ ధ్రువపత్రాన్ని రెమిటెన్స్‌లకోసం అధికృత డీలర్‌కు ఆస్తిపన్ను అధికారి ఇచ్చిన నిరభ్యంతర ధ్రువపత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. అయితే, పిఐఒ గనక పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక లేదా ఆప్ఘనిస్థాన్ లేదా చైనా లేదా ఇరాన్ పౌరుడయినట్లయితే, వారసత్వానికి మద్దతుగా పత్రసహితమైన సాక్ష్యం, పన్నుక్లియరెన్స్ ఆదాయపు పన్ను అధికారినుంచి నిరభ్యంతర ధృవపత్రం వంటి పత్రాలతో రిజర్వు బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం ఎందాలి. ఈ రెమిటిన్స్ సదుపాయం నేపాల్ లేదా భూటాన్ పౌరులకు లేదు. (దయచేసి, 2000 మే 3 నాటి ప్రకటన నం. ఫెమ 13/ఆర్‌బి-2000 లోని నిబంధన 4 (3) చూడండి).
భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి నుంచి భారతదేశం వెలుపలి నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయులకు వారసత్వంగా ఎందిన భారతదేశంలోని ఏదయినా స్థిరాస్తి అమ్మకపు వసూళ్ళను అతను స్వస్థలానికి పంపవచ్చా?
- పంపవచ్చు. మొత్తం కాలెండర్ సంవత్సరానికి ఒక మిలియన్ యుఎస్‌డిలకు మించకూడదు. అయితే వారసత్వానికి మద్దతును పత్రసహితమైన సాక్ష్యాన్ని పన్ను క్లియరెన్స్ ధ్రువపత్రాన్ని రెమిటెన్స్ కోసం అధికృత డీలర్‌కు ఆదాయపు పన్ను అధికారి ఇచ్చిన నిరభ్యంతర ధ్రువపత్రం సమర్పించవలసి ఉంటుంది. అయితే పిఐఒ గనక పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక లేదా ఆప్ఘనిస్థాన్ లేదా చైనా లేదా ఇరాన్ పౌరుడయినట్లయితే అతను, వారసత్వ ధ్రువపత్రం, పన్ను క్లియరెన్స్ ధ్రువపత్రం, ఆదాయపు పన్ను అధికారి ఇచ్చిన నిరభ్యంతర వ్రాతప్రతిని సమర్పించి రిజర్వు బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం ఎందవలసి ఉంటుంది. ఈ రెమిటెన్స్ సదుపాయం, నేపాల్ లేదా భూటాన్ పౌరుడికి లేదు (2000 మే 3 నాటి ప్రకటన సం. 13/ఆర్‌బి-2000లో నిబంధన 4 (2) () చూడండి).
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి నుంచి భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తికి (అంటె ఎన్‌ఆర్‌ఐ లేదా పిఐఒ లేదా భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయుడు వారసత్వంగా సంక్రమించిన భారతదేశంలోని ఏదయినా స్థిరాస్తి అమ్మకపు వసూళ్ళకు అతనుగానీ అతని వారసుడు గానీ స్వస్థలానికి పంపవచ్చునా?
- పంపడానికి లేదు. వారసత్వం, పన్ను క్లియరెన్స్/ఆదాయపు పన్ను అధికారి నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం వంటి పత్రసహిత సాక్ష్యాలతో ముందుగా రిజర్వు బ్యాంకు ఆమోదం పొందవలసి ఉంటుంది.
భారతదేశంలో అనుమతించిన కార్యకలాపం సాగించడానికి స్థిరాస్తిని సంపాదించడం.
ఫెరా/ఫెమా నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలో శాఖ కార్యాలయాన్ని లేదా ఇతర వ్యాపార స్థలాన్ని ఏర్పాటు చేసిన భారతదేశం వెలుపల నివసిస్తున్న ఒక వ్యక్తి స్థిరాస్తిని కొనుగోలు చేయగలడా?
- చేయగలడు. అయితే అలాంటి కార్యకలాపం సాగించడానికి, దానికి వర్తించే శాసనాలనాూ, నియమాలనూ, నిబంధనలనూ, ఆదేశాలనూ సముచితరీతిలో పాటించడం తప్పనిసరి అవసరం. కొనుగోలు ధరను, సక్రమమైన బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా ఇన్వార్డ్ రెమిటెన్స్ పద్ధతిలో చెల్లించవలసి ఉంటుంది. వాణిజ్యపరమైన/నివాస సంబంధమైన ఆస్తిని సంపాదించిన తేదీనుంచి 90 రోజుల లోపల, ఐపిఐ ఫారంలో ప్రకటన నింపి, రిజర్వు బ్యాంకు కు సమర్పించవలసి ఉంటుంది.
ఫెరా/ఫెమ నిబంధనలను అనుసరించి భారతదేశంలో అనుసంధాన కార్యాలయం ఏర్పాటు చేసిన, భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి, స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చా?
41వ ప్రశ్నలో పేర్కొన్నటువంటి ఆస్తిని, ఏదయినా ఋణం తీసుకోవడం కోసం పూచీగా అధికృత డీలర్‌కు తనఖా పెట్టవచ్చా?
- పెట్టవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు అలాంటి తనఖా పెట్టుటకు సాధారణ అనుమతి మంజూరు చేసింది.
వ్యాపారాన్ని మూసేసిన మీదట, ఆ ఆస్తి అమ్మకపు వసూళ్లని స్వస్థలానికి పంపవచ్చా?
- పంపవచ్చు. ముందుగా రిజర్వు బ్యాంకు ఆమోదం ఎందాలి.
విదేశీ రాయబారులు/దౌత్యవేత్తలు/కాన్సులేట్ జనరల్‌లు భారతదేశంలో స్థిరాస్తిని సంపాదించడం/బదిలీ చేయడం
విదేశీ రాయబారులు/దౌత్యవేత్తలు/కాన్సులేట్ జనరల్ లు భారతదేశంలో స్థిరాస్తిని కొనడం/అమ్మడం చేయగలరా?
- చేయగలరు. అందుబాటులో ఉన్న సాధారణ అనుమతికి లోబడి, విదేశీరాయబారులు/దౌత్యవేత్తలు/కాన్సులేట్ జనరల్‌లు, భారతదేశంలో వ్యవసాయ భూమి/ తోట ఆస్తి/ఫార్మ్‌హౌస్ కాకుండా ఏదయినా స్థిరాస్తిని సంపాదించుకోవచ్చు. అలాంటి ఆస్తిని కొనుగోలు చేయవచ్చు/అమ్మవచ్చు. అయితే, అలాంటి కొనుగోలుకు/ అమ్మకానికి భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాలు మంత్రిత్వశాఖనుంచి ముందస్తు క్లియరెన్స్ పొందవలసి ఉంటుంది. అలాంటి ఆస్తి కొనుగోలుకు సంబంధించిన ప్రతిఫలాన్ని సాధారణ బ్యాకింగ్ ఛానెల్ ద్వారా ఇన్వార్డ్ రెమిటెన్స్ విధానంలో చెల్లించవలసి ఉంటుంది.
ఇతర సమస్యలు
విదేశీ మారకం/రూపాయి నిధుల నుంచి కొనుగోలు చేసిన నివాస/వాణిజ్య పరమైన ఆస్తిని ఎన్‌ఆర్‌ఐ/పిఐఒ, తక్షణ ఉపయోగానికి అవసరం లేనట్లయితే, అద్దెకు ఇవ్వవచ్చా?
- ఇవ్వవచ్చు. తీసుకొన్న అద్దె, ప్రస్తుత ఆదాయం కాబట్టి ఎన్‌ఆర్‌ఐలు/ఎన్‌ఆర్‌ఇ ఖాతాకు క్రెడిట్ చేయవలసి ఉంటుంది లేదా విదేశానికి రెమిట్ చేయాలి.
భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తిగా ఉన్నప్పుడు, భారతదేశంలో స్థిరాస్తిని అంటే నివాస/వాణిజ్య పరమైన ఆస్తి/ వ్యవసాయ భూమిని/ తోట ఆస్తిని / ఫార్మ్ హౌస్‌ను సంపాదించిన ఎన్‌ఆర్‌ఐ ఆ ఆస్తిని అలాగే ఉంచుకోవచ్చా లేదా బదిలీ చేయవచ్చా? అమ్మకపు వసూళ్ళను ఖాతాకు క్రెడిట్ చేయాలా?
- విదేశీమారకం నిర్వహణచట్టం 1999లోని సెక్షన్ 6 (5)నిబంధనల ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్నవ్యక్తిగా ఉన్నప్పుడు, భారతదేశంలో స్థిరాస్తిని సంపాదించుకొన్న ఎన్‌ఆర్‌ఐ, ఆ ఆస్తిని అలాగే ఉంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాధారణ అనుమతి ప్రకారం, భారతదేశంలోని వ్యవసాయ భూమిని/తోట ఆస్తిని/ ఫార్మ్ హౌస్‌ను అమ్మకం లేదా బహుమాన రూపంగా అతను, భారతదేశ పౌరుడయిన భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి బదిలీ చేయవచ్చు. భారతదేశంలోని నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని అమ్మకం లేదా బహుమతి విధానం ద్వారా భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి లేదా ఎన్‌ఆర్‌ఐ/పిఐఒకి బదిలీ చేయవచ్చు. అమ్మకపు వసూళ్లను ఎన్‌ఆర్‌ఐ బ్యాంకు క్రెడిట్ చేయవలసి ఉంటుంది.
భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తిగా ఉన్నప్పుడు, భారతదేశంలో స్థిరాస్తిని అంటే నివాస/వాణిజ్యపరమైన ఆస్తిని / వ్యవసాయ భూమిని/తోట ఆస్తిని/ఫార్మ్ హౌస్‌ను సంపాదించుకొన్న పిఐఒ, ఆ స్థిరాస్తని అలాగే ఉంచుకోవచ్చా? లేదా బదిలీ చేయవచ్చా? అమ్మకపు వసూళ్ళను ఏ ఖాతాకు క్రెడిట్ చేయాలి?
- విదేశీ మారకం నిర్వహణ చట్టం 1999లోని సెక్షన్ 6 (5) నిబంధనల ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తిగా ఉన్నప్పుడు, భారతదేశంలో స్థిరాస్తిని సంపాదించుకొన్న పిఐఒ, ఆ ఆస్తిని అలాగే ఉంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాధారణ అనుమతి ప్రకారం భారతదేశంలోని వ్యవసాయ భూమిని/తోట ఆస్తిని/ఫార్మ్ హౌస్‌ను అమ్మడం లేదా బహుమాన రూపం ద్వారా భారతదేశ పౌరుడైన, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి బదిలీ చేయవచ్చు. భారతదేశంలోని నివాస/వాణిజ్యపరమైన ప్రకటన ఆస్తిని అమ్మకం లేదా బహుమాన రూపంలో భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి లేదా ఎన్‌ఆర్‌ఐ/పిఐఒకి బదిలీ చేయవచ్చు. అయితే, ఆ పిఐఒ గా ఒక పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక లేదా ఆప్ఘనిస్తాన్ లేదా చైనా లేదా ఇరాన్ లేదా నేపాల్ లేదా భూటాన్ పౌరుడైనట్లయితే, భారతదేశంలోని స్థిరాస్తిని బదిలీ చేయడానికి అతను ముందుగా రిజర్వు బ్యాంకు ఆమోదం ఎందవలసి ఉంటుంది. అమ్మకపు వసూళ్లను ఎన్‌ఆర్‌ఐ ఖాతాకు క్రెడిట్ చేయవలసి ఉంటుంది.
ఎన్‌ఆర్‌ఐ/పిఐఒకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఖాతాకు క్రెడిట్ చేసినా 46, 47 ప్రశ్నలలో ప్రస్తావించిన స్థిరాస్తి అమ్మకపు వసూళ్లను విదేశానికి రెమిట్ చేయవచ్చా?
- చేయవచ్చు. అయితే, స్థిరాస్తిని పది సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉంచుకొని ఉండాలి.
ఆ స్థిరాస్తిని పది సంవత్సరాల కంటె తక్కువగా ఉంచుకొని ఉన్నట్లయితే ఏమవుతుంది?
- రూపాయి నిధులనుంచి సంపాదించిన అలాంటి ఆస్తిని, పది సంవత్సరాల కంటె తక్కువ కాలం ఉంచుకొని అమ్మినట్లయితే, అమ్మకపు వసూళ్లను తక్కువపడిన కాలం మేరకు ఎన్‌ఆర్‌ఐ ఖాతా (ఎదుపు / టర్మ్ డిపాజిట్)లో లేదా మరేదైనా అర్హమైన పెట్టుబడిలో పెట్టినట్లయితే రెమిటెన్స్ చేయవచ్చు. అయితే ఇలాంటి పెట్టుబడి స్థిరాస్తి అమ్మకపు వసూళ్ళకు సంబంధించినదై ఉండాలి.
పూర్వపు ఫెరా ప్రకారం, భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందని విదేశీ జాతీయులు, రిజర్వు బ్యాంకు ప్రత్యేక ఆమోదంతో భారతదేశంలో నివాస సంబంధమైన ఆస్తిని సంపాదించుకొన్నారు. ఫెమ 1999లోని సెక్షన్ 6 (5) నిబంధనల ప్రకారం ఆ ఆస్థిని వారు అట్లే ఉంచుకోవచ్చా? ఆ ఆస్తిని బదిలీ చేయవచ్చా?
- రిజర్వు బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం ఎందిన తరవాత మాత్రమే అలా చేయవలసి ఉంటుంది.
భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ విదేశీ మారకం నిర్వహణ (భారతదేశంలో స్థిరాస్తి సంపాదన, బదిలీ నిబంధనలు, 2000 వర్తిస్తాయా?
- పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లేదా శ్రీలంక లేదా ఆప్ఘనిస్థాన్ లేదా చైనా లేదా ఇరాన్ లేదా భూటాన్ పౌరుడు, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి విదేశీ మారకం నిర్ధారణ/ భారతదేశంలో స్థిరాస్తిని సంపాదన బదిలీని నిబంధనలు 2000 వర్తిస్తాయి.
‘భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి’, ‘భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి’ అనే పదాలను ఎక్కడ నిర్వచించడం జరిగింది?
- ఫెమ 1999 సెక్షన్ 2 (ు), సెక్షన్ 2 (ూ)లో, వరసగా “భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తినీ, భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తినీ” నిర్వచించాయి.
భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి అంటే ఎవరు?
- ఫెమ కోణంలో భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి అంటే, గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-మార్చి) లో నూటా ఎనభై రెండు రోజులకు మించి భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి, భారతదేశంలో ఏదయినా ఉద్యోగిగా చేయడానికి వ్యపారం చేయడానికి లేదా వృత్తిని నిర్వహించడానికి లేదా మరేదయినా ప్రయోజనం కోసం వచ్చి భారతదేశంలో ఉన్న వ్యక్తి అని అర్థం. మరోవిధంగా చెప్పాలంటే, ఫెమా కింద భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తిగా పరిగణించడానికి ఒక వ్యక్తి, దేశంలో ఉన్న కాలానికి గత అర్థిక సంవత్సరంలో 182 రోజులకు మించకూడదు. సంబంధించిన నిబంధనను సంతృప్తి పరచడమే కాకుండా అతని ఉనికికి సంబంధించిన ఉద్దేశానికి చెందిన నిబంధననుకూడా పాటించవలసి ఉంటుంది.
భారతదేశంలో స్తిరాస్తిని సంపాదించుకోడానికి సంబంధించి, ఒక వ్యక్తి నివాస హోదాను రిజర్వు బ్యాంకు నిర్ధారిస్తుందా?
- నిర్ధారించదు. ఫెమ ప్రకారం, నివాస హోదాను అమలులో ఉన్న శాసనం నిర్ధారిస్తుంది. మరే అధికారి అయినా ప్రశ్నించి నట్లయితే అతని / ఆమె నివాస హోదాను రుజువు చేసుకోవడం ఆ వ్యక్తి బాధ్యతగా ఉంటుది.
ఒక విదేశీ జాతీయుడు (పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, చైనా, ఇరాన్, నేపాల్, భూటాన్ పౌరులు తప్ప, ఫెమ 1999, సెక్షన్ (ు) (1) బి నిబంధనల ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి అయినట్లయితే భారతదేశంలో ఏదయినా స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అతను ఆర్‌బిఐ ఆమోదం పొందాలా?
- అవసరం లేదు. ఫెమ కోణం దృష్ట్యా రిజర్వుబ్యాంకు నుంచి ఆమోదం ఎందనవసరం లేదు. అయితే, సంబంధిత రాష్ట్రప్రభుత్వం మొదలయినటువంటి ఇతర అధికారాలు నిర్ధారించిన నిబంధనల రూపంలో ఏవయినా ఆమోదాలు అవసరమయినట్లయితే అతను/ఆమె వాటిని పొందవలసి ఉంటుంది.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు