অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భారత దేశంలో పెట్టుబడులు పెట్టుటకు ప్రవాస భారతీయులకు ఎన్‌.ఆర్‌.ఐ/పి.ఐ.ఓ. లకు లభించే సౌకర్యాలు

భారత దేశంలో పెట్టుబడులు పెట్టుటకు ప్రవాస భారతీయులకు ఎన్‌.ఆర్‌.ఐ/పి.ఐ.ఓ. లకు లభించే సౌకర్యాలు

బ్యాంకు ఖాతాలు మరియు డిపాజిట్లు

ప్రవాసీయులు (విదేశీ) రూపాయి (ఎన్‌.ఆర్‌.ఇ.) ఖాతా / (అసలు / వడ్డీ మళ్ళించే )

  • ఎదుపు - ఎన్‌.ఆర్‌.ఇ.లకు ఎదుపు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ స్వదేశీ ఎదుపు డిపాజిట్లపై చెల్లించే రేట్ల ప్రకారమే వర్తిస్తుంది.
  • కాలవ్యవధితో కూడుకున్న డిపాజిట్లు (టెర్మ్‌ డిపాజిట్లు) - ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరముల వరకు కొత్తగా మళ్ళించడానికి వీలయ్యే స్వదేశీ వాసులు కాని (విదేశీ) రూపాయి ( ఎన్‌.ఆర్‌.ఇ.) టెర్మ్‌ డిపాజిట్లుపై ఇచ్చే వడ్డీ క్రిందటి నెలలోని చివరి పనిరోజునఉన్న ఎల్‌ఐబివోఆర్‌/ఎస్‌డబ్ల్యూఏపి రేటు ప్రకారం అమెరికన్‌ డాలర్లకు ఉన్నసమాన పరిపక్వతను ద్రుష్టలో ఉంచుకొని 75 బెసిస్‌ పాయింట్ల కంటెె మించి ఉండకూడదు. మూడు సంవత్సరాల డిపాజిట్ల పరిపక్వత చెందే కాలవ్యవధికి ఇచ్చే వడ్డీ రేట్లునేమూడు సంవత్సరాలు దాటిపోయిన వాటికి కాడా వర్తింపచేయబడును
  • ప్రస్తుత పరిపక్వత కాలాన్ని దాటి పోయిన తర్వాత తిరగి పునరుద్ధరించబడిన ఎన్‌.ఆర్‌.ఐ. డిపాజిట్లకు కూడా వడ్డీ రేట్లలో ఉండే మార్పులు వర్తిస్తాయి.

ఎఫ్‌సి.ఎన్‌.ఆర్‌.(బి)  అసలు / వడ్డీ మళ్ళించబడేవి

రిజర్వు బ్యాంకు నిర్ణయించనట్లుగా, అనుమతింపబడిన కరెన్సీలో, కాలానుగుణంగా డిపాజిట్‌ చేయదానికి వున్న పరిమితులకు లోబడి ఖాతాలోని నిధులను డిపాజిట్‌ చేయడానికి అనుమతింపబడుతుంది.

ప్రస్తుతం నిర్ణయించిన కాలవ్యవధి డిపాజిట్లు ( టెర్మ్‌ డిపాజిట్లు ) 6 ఖచ్చితమైన విదేశీ కరెన్సీలలో ఎ.డి.లు పెట్టవచ్చును. (అమెరికన్‌ డాలర్లు, పౌండ్‌ స్టెర్లింగ్‌ , యూరో, జపనీస్‌ యెన్‌, ఆస్ట్రేలియన్‌ డాలర్‌  మరియు కెనడియన్‌ డాలర్‌ )

  • వడ్డీరేటు: స్ధిరమైన లేక స్వల్పకాలిక ఎల్‌.ఐ.బి.ఓ.ఆర్‌. / ఎస్‌.డబ్ల్యూ.ఎ.పి. గరిష్ట పరిమితికి లోబడి ఉండే రేట్లతో సంబంధిత కరెన్సీపై / సమానమైన వ్యవధికి -25 ఆధారిత పాయింట్లు (జపనీస్‌ యెన్‌ తప్ప)
  • డిపాజిట్ల పరిపక్వత: 1 - 5 సంవత్సరాలకు

ఎన్‌.ఆర్‌.ఓ. ఖాతాలు ( ప్రస్తుత రాబడి మళ్ళించుకోవడానికి వీలుగా ఉండేది)

  • ఎదుపు- మాములుగా రూపాయలలో ఉండే ఆదాయం / డివిడెండ్లు, వడ్డీల రూపేణా వచ్చే ఆదాయాన్ని జమ చేసుకోవడానికి నిర్వహించుకొనేది.  ప్రస్తుత వడ్డీ రేటు సాలీనా 3.5 శాతం
  • వ్యవధితో ఉండే డిపాజిట్లు (టర్మ్‌ డిపాజిట్లు)- వడ్డీ రేటును బ్యాంకులే నిర్ణయించుకోవచ్చు.

ఎన్‌.ఆర్‌.ఓ. నిల్వల (బ్యాలన్స్‌ల) నుండి మళ్ళించుట

  • అధీకృత డీలర్లు విశ్వసనీయమైన అవసరాలకై, సాలీనా ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాలనుండి 1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల చెల్లింపు(ల) వరకు వర్తించే పన్నులు చెల్లిస్తూ అనుమతింపవచ్చు. 1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పరిమితిలో ఎన్‌.ఆర్‌.ఐలు / పి.ఐ.ఓ.లు తమ అధీనంలో 10 సంవత్సరాల నుండి ఉన్న స్ధిరాస్తులను అమ్మగా వచ్చిన సమ్ము కూడా కలిసి ఉంటుంది. ఒకవేళ అట్టి ఆస్తిని 10 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధికి ఉంచుకొని అమ్మి వేసినప్పుడు, మిగిలిన కాలానికి అటువంటి సమ్ము ఎన్‌.ఆర్‌.ఐ./పి.ఐ.ఓ.లు అర్హత కలిగిన పెట్టుబ డులలో ఉంచవలెను.

మళ్ళింపు ప్రాతిపదికపై ఇతర పెట్టుబడులు

  • తేదీలతో ఉండే ప్రభుత్వ సెక్యూరిటీలు / ట్రెజరీ బిల్లులు
  • స్వదేశీ మ్యూచువల్‌  ఫండ్స్‌ యొక్క యూనిట్లు
  • భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్ధలు (పి.ఎస్‌.యు.లు) జారీ చేసిన బాండ్లు.
  • భారతదేశంలో నమోదు (ఇన్‌కార్పోరేటెడ్‌) కాబడిన కంపెనీ యొక్క మార్పిడికి వీలు కాని డిబెంచర్లు.
  • భారతీయ ప్రభుత్వం ఉపసంహరించుకొనేందుకు తలపెట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల్లోని షేర్లు, ఇది ప్రభుత్వం వారు అమ్మకానికై జారీ చేసిన ప్రకటనలో బిడ్లను ఆహ్వనిస్తూ ఉండే నియమ నిబంధనలకు లోబడి ఉన్నప్పుడు.
  • ఎఫ్‌.డి.ఐ. పథకం క్రింద (ఆటోమేటిక్‌ రూట్‌ మరియు ఎఫ్‌.ఐ.పి.బి.లతో సహా) కొన్న భారతీయ కంపెనీలలోని షేర్లు, మార్పు చేసుకోవడానికి వీలుగా ఉండే డిబెంచర్లు.
  • స్టాక్‌ ఎక్చేంజ్‌ల ద్వారా పోర్టు పోలియో పథకం క్రింద కొన్న భారతీయ కంపెనీల యొక్క షేర్లు మరియు మార్పిడి చేసుకునే డిబెంచర్లు.
  • భారతదేశపు బ్యాంకుల ద్వారా జారీ చేయబడిన నిరంతర అప్పు ప్రతాలు (పెర్‌పెట్యువల్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) మరియు మూలధన అప్పులపై ఉండే పత్రాలు.

మళ్ళింపు చేయడానికి వీలుకాని ప్రాతిపదికపై ఇతర పెట్టుబడులు

  • తేదీతో ఉండే ప్రభుత్వ సెక్యూరిటీలు (బేరర్‌  సెక్యూరిటీలు మినహా) / ట్రెజరీ బిల్లులు.
  • స్వదేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ యొక్క యూనిట్లు
  • భారత దేశంలోని మనీ మార్కెట్‌  మ్యూచువల్‌ ఫండ్స్‌లోని యూనిట్లు
  • భారతదేశంలో నమోదు కాబడిన కంపెనీ యొక్క మార్పిడి చేసుకోవడానికి వీలుకాని డిబెంచర్లు.
  • వ్యవసాయం లేక సేద్యం (మొక్కల పెంపకం) వ్యాపకంలో కాని లేక స్ధిరాస్తిని అమ్మే వ్యాపారంలో కాని సంబంధం లేని భారత దేశంలోని కంపెనీ లేక యాజమాన్య సంస్ధ యొక్క మూలధనం.
  • కంపెనీల చట్టం, 1956 క్రింద నమోదు కాబడిన కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకుతో నమోదు కాబడిన ఎన్‌.బి.ఎఫ్‌.సి.లు, పార్లమెంట్‌ యొక్క చట్టంకాని లేక ఒక రాష్ట్ర శాసన మండలి యొక్క చట్టం క్రింద కాని నెలకొల్పబడి నమోదు కాబడిన ఒక సంస్ధ లేక ఎన్‌.ఆర్‌.ఇ/ ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌(బి) ఖాతాలను ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాలోనికి ఇన్‌వార్డ్‌ చెల్లింపులకు లేక బదలాయించడానికి ప్రాతినిధ్యం వహించని భారతదేశపు రూపాయి నిధులతో స్ధాపించబడిన ఒక యజమాన్య ప్రాతిపదికన లేక సంస్థలో పెట్టిన డిపాజిట్లు.
  • పోర్టు ఫోలియో పెట్టుబడి పథకం క్రిందకు రానటువంటి భారతీయ కంపెనీలలోని షేర్లు మరియు మార్పిడి చేసుకోగల డిబెంచర్లు.

స్ధిరాస్తిలో పెట్టుబడులు

  • మళ్ళింపు చేయగలిగే/వీలుకాని నిధుల నుండి భారతదేశంలో స్ధిరాస్తులను గడించుకోవచ్చు. అయితే అవి వ్యవసాయ/సేద్యపు (మొక్కల పెంపకానికి సంబంధించిన) లేక ఎలాలలో ఉండే ఇళ్ళు (ఫాంహౌస్‌) తప్ప.
  • అటువంటి పెట్టుబడుల విషయంలో ఎన్‌.ఆర్‌.ఐ.లు మళ్ళింపు చేసుకోవడానికి అర్హులు. లాక్‌-ఇన్‌-పిరియడ్‌లో లేని మళ్ళింపు చేయగలిగే నిధులను ఉపయోగించి కొన్నటువంటి భారతదేశంలో గడించిన స్ధిరాస్తులను అటువంటి వాటిని అమ్మగా వచ్చిన సమ్మును - రెండు నివాస యోగ్యమైన ఆస్తుల వరకు. ఐటమ్‌ (1) (డి) లో వివరించిన షరతులకు లోబడి మిగిలిన సమ్మును ఎన్‌.ఆర్‌.ఓ. ఖాతాల ద్వారా మళ్ళింపు చేసుకోవచ్చు.
  • వాపసు, ఈ క్రింది సందర్భాల్లో- (అ) ధరఖాస్తు/ధరావత్తు (ఎర్నస్ట్‌ మనీ)/ ఇళ్ళు నిర్మించే సంస్థల ద్వారా వచ్చిన కొనుగోలు సమ్ము /ఫ్లాట్లను లేదా ప్లాట్లను కేటాయించినప్పుడు అమ్మకందారుని ద్వారా వచ్చిన సమ్ము (ఆ) / నివాస స్ధలాలు / వ్యాపార స్ధలాల కొనుగోలు వ్యవహారాలు. బుకింగ్‌  చేసుకొన్నవి రద్దు చేసుకొన్నప్పుడు వడ్డీలతో సహా, పన్నుల నికరంతో ప్రధానంగా ముందు చెల్లింపులు  (ఒరిజినల్‌ పేమెంట్సు) ఎన్‌.ఆర్‌.ఇ./ ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌.(బి) ఖాతాల నుండి ఇన్‌వర్డ్‌ చెల్లింపులు జరిగినప్పుడు మాత్రమే.
  • ఎన్‌ఆర్‌.ఐ.లు ఏ.డి.లనుండి / గృహ నిర్మాణ ఆర్ధిక సంస్ధల నుండి రూపాయలలో గృహ ఋణాలు తీసుకొన్నప్పుడు అట్టి ఋణ గ్రహీత యొక్క భారత దేశంలోనే ఉండే సమీప బంధువులు తిరిగి చెల్లించవచ్చును.

తిరిగి వచ్చే ఎన్‌.ఆర్‌.ఐ.లు / పి.ఐ.ఓ.లకు సౌకర్యాలు

  • భారతదేశానికి వెలుపల నివసిస్తున్నప్పుడు సంపాదించిన, దాచుకోబడిన లేక స్వంతమైన విదేశీ కరెన్సీ, విదేశీ సెక్యూరిటీల ఆస్తిని భారతదేశానికి వచ్చిన తరువాత కాడా కొనసాగించవచ్చు, స్వంతం చేసుకోవచ్చు,  బదలాయించవచ్చు లేక  వాటిని విదేశీ కరెన్సీ, విదేశీ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు లేక  భారతదేశానికి వెలుపల స్టిరాస్తిని కోనుగోలు చేయవచ్చు.
  • భారతదేశంలోని అధీకృత డీలర్‌ వద్ద రెసిడెంట్‌ ఫారెన్‌ కరెన్సీ(ఆర్‌.ఎఫ్‌.సి) ఖాతాను తెరవడం, ఉంచుకోవడం మరియు నిర్వహించడం చేయవచ్చు, మరియు ఖాతాలోకి ఎన్‌.ఆర్‌.ఇ./ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ (బి) ఖాతాల్లో ఉండే మిగుళ్లు (బ్యాలెన్సెస్‌)ను బదలాయించవచ్చు. భారతదేశానికి బయట ఉన్న ఆస్తులను అమ్మగా వచ్చిన సమ్మును తాను తిరిగి వచ్చే సమయంలో ఆర్‌.ఎఫ్‌.సి. ఖాతాలో జమచేయవచ్చు.  ఆర్‌.ఎఫ్‌.సి. ఖాతాలో ఉండే విదేశీ కరెన్సీ నిధుల మిగుళ్లను ఉపయోగించుకోవడంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్చగా ఉంటాయి. ఈ నిధులతో భారతదేశానికి వెలుపల పెట్టుబడులు ఆంక్షలు లేకుండా పెట్టుకోవచ్చు.

ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate