వివరములు | విదేశీ కరెన్సీ (స్ధానికేతర) ఖాతా (బ్యాంకుల ) పథకం ఎఫ్.సి.ఎన్.ఆర్.(బి) ఖాతా | స్ధానికేతర (విదేశీ) రూపాయి ఖాతా పథకం (ఎన్.ఆర్.ఇ ఖాతా) | స్ధానికేతర సాదారణ రూపాయి పథకం (ఎన్.ఆర్.ఓ. ఖాతా) |
ఖాతాను ఎవరు తెరవగలరు? | ఎన్.ఆర్.ఐ (వ్యక్తులు/ బంగ్లాదేశ్ / పాకిస్దాన్ జాతీయులు / స్వంతమైతే ఆర్‌బిఐ. ముందు అనుమతి కావాలి. | ఎన్.ఆర్.ఐ (వ్యక్తులు/ బంగ్లాదేశ్ / పాకిస్దాన్ జాతీయులు / స్వంతమైతే ఆర్‌బిఐ ముందు అనుమతి కావాలి. | భారత దేశం వెలువల వుండే ఏ వ్యక్తి అయినా (నేపాల్/భూటాన్ నివాసి కాకుండా)( బంగ్లాదేశ్ / పాకిస్ధాన్ జాతీయులు / స్వంతమై ఉన్నప్పుడు మరియు గత ఓసిబిలు అయిఉన్నప్పుడు ఆర్‌బిఐ అనుమతి కావాలి. |
ఉమ్మడి ఖాతా | ఇద్దరు లేక ముగ్గురు స్ధానికేతరుల పేరున | ఇద్దరు లేక ముగ్గురు స్ధానికేతరుల పేరున | స్ధానిక నివాసులతో కలిసి ఉమ్మడిగా ఉండవచ్చు |
నామినేషన్ | అనుమతించబడుతుంది | అనుమతించబడుతుంది | అనుమతించబడుతుంది |
ఖాతా నిర్వహించే కరెన్సీ | పౌండ్ స్టెర్లింగ్ , అమెరికన్ డాలర్లు , జపాన్ యెన్, యూరో, కెనడియన్ డాలర్ మరియు ఆస్ట్రేలియన్ డాలర్ | భారతదేశపు రూపాయి | భారతదేశపు రూపాయి |
స్వదేశానికి పంపగలిగే అవకాశం | ఉన్నది | ఉన్నది | ఆ విధంగా స్వదేశానికి పంపడం వీలుకాదు. కాని ఈక్రింది ఖాతాలో ఉన్న వాటిని పంపవచ్చును. 1. ప్రస్ధుత రాబడి 2. ఎన్.ఆర్.ఓ. ఖాతాలో మిగిలి ఉన్న సమ్ము నుండి 1 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు, ప్రతి సంవత్సరము, ఏదైనా విశ్వసనీయమైన అవసరాలకు /వారసత్వం ద్వారా సంక్రమించిన, భారత దేశంలోనే ఉన్న ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన సమ్ము / వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు, మరియు కొన్ని షరతులకు లోబడి పరిష్కారం ద్వారా లభించిన ఆస్తులతో సహా. స్ధిరాస్తులు తమ అధీనంలోనే కనీసం 10 సంవత్సరాల వ్యవధికి ఉండాలి. 3. రూపాయలలో ఉండే నిధుల నుండి ఎందిన ఆస్తిని 10 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి తమ అధీనంలో ఉంచుకొని అమ్మివేయగా వచ్చిన ఆ సమ్మును స్వదేశానికి పంపకూడదు. దానిని పంపడానికి అనువుగా ఆ సోమ్మును మిగిలిన కాలానికి (10 సంవత్సరాల ఆస్తి ఆధీనంలో ఉన్న కాలము) ఎన్.ఆర్.ఓ. ఖాతాలో ఎదుపు (సేవింగ్స్ / వ్యవధితో కూడుకున్న డిపాజిట్టు ఖాతాలో లేక మరియే ఇతర అర్హత ఉన్న పెట్టుబడులలో నైనా ఉండవలెను. అయితే ఇటువంటి పెట్టుబడి స్దిరాస్దిని అమ్మగా వచ్చిన సమ్ముతోటే పెట్టబడిందని ఆధారాలు చూపించవలెను |
ఖాతా ఏ రకమైనది? | టర్మ్ డిపాజిట్టు మాత్రమే | ఎదుపు (సేవింగ్స్), ప్రస్తుత (కరెంట్ ) ప్రత్యావర్తక (రికరింగ్), నిర్ణీత కాలానికి (ఫిక్స్‌డ్) డిపాజిట్ | ఎదుపు (సేవింగ్స్), ప్రస్తుత (కరెంట్ ) ప్రత్యావర్తక (రికరింగ్), నిర్ణీత కాలానికి (ఫిక్స్‌డ్) డిపాజిట్ |
నిర్ణీత కాలానికి పెట్టిన డిపాజిట్ కాలవ్యవధి | ఒక సంవత్సరానికి తక్కువ కాకుండా మరియు 5 సంవత్సరాలకి మించకుండా ఉండే కాలవ్యవధికి | బ్యాంకు యొక్క విచక్షణా ధికారాన్ని బట్టి | స్ధానికుల ఖాతాలకు వర్తించే మాదిరిగా |
వడ్డీరేటు | దిగువ తెలిపిన షరతులకు కు లోబడిః ఎల్‌ఐబిఓఆర్ -25 బేసిస్ పాయింట్లు, ఈ క్రింది సందర్భంలో తప్ప అమలులో ఉన్న ఎల్‌ఐబిఓఆర్ రేట్లపై క్యాప్ ప్రాతిపదికపై ఉండే జపనీస్ యెన్ |
దిగువ తెలిపిన షరతులకు కు లోబడిః నిర్ణీత కాలపు డిపాజిట్లు: ఎల్‌ఐబిఓఆర్ / ఎస్.డబ్ల్యు.ఏ.పి. రేట్లు క్రిందటి నెలలో చివరి పని రోజున ఉన్నట్లుగా, అమెరికన్ డాలర్ల విషయంలో, సమాన స్ధాయిలో ఉండే పరిపక్వతకు 75 బేసిస్ పాయింట్లు, భారత దేశంలో వ్యాపారం మూసివేసే తేది అనగా 17-11-2005 నుండి. ఎదుపు ఖాతా స్వదేశీ ఎదుపు ఖాతాలకు వర్తించే వడ్డీ రేట్లే ఉంటాయి, భారతదేశంలో 17-11-2005 నాటి వ్యాపార వేళలు మూగిసిన తరువాత నుండి |
కాల వ్యవధికి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులకు స్వేచ్ఛ ఇవ్వబడింది. |
స్ధానికేతర ఖాతాదారుల ద్వారా స్దానిక వ్యక్తికి ఇచ్చిన వ్యవహారాధికారం (పవర్ ఆఫ్ అటార్నీ ) ను అమలు చేయుట / నిర్వహించుట |
వ్యవహారాధికారం (పవర్ ఆఫ్ అటార్నీ): ఖాతాను స్ధానిక విత్‌డ్రావల్స్‌కు పరిమితం చేస్తూ లేక ఖాతాదారుని ఖాతాలో, మామూలుగా నిర్వహించే బ్యాంకు విధానాల ద్వారా జమ చేయుటకు అనుమతింపబడుతుంది. |
వ్యవహారాధికారం (పవర్ ఆఫ్ అటార్నీ) ఖాతాను స్ధానిక విత్‌డ్రావల్స్‌కు పరిమితం చేస్తూ లేక ఖాతాదారుని ఖాతాలో,మామూలుగా నిర్వహించే బ్యాంకు విధానాల ద్వారా జమ చేయుటకు అనుమతింపబడుతుంది. | |
ఋణాలు అ. భారతదేశంలో 1) ఖాతాదారునకు 2) మూడవ పార్టీలకు |
అనుమతింపబడినది అనుమతింపబడినది |
అనుమతింపబడినది అనుమతింపబడినది |
అనుమతింపబడినది అనుమతింపబడినది |
ఆ. విదేశాలకు 1. ఖాతాదారునకు 2. మూడవ పార్టీలకు |
అనుమతింపబడినది అనుమతింపబడినది |
అనుమతింపబడినది అనుమతింపబడినది |
అనుమతింపబడదు అనుమతింపబడదు |
ఇ. భారతదేశంలో విదేశీ కరెన్సి రుణాలు 1. ఖాతాదారునకు 2. మూడవ పార్టీలకు |
అనుమతింపబడినది అనుమతింపబడదు |
అనుమతింపబడదు అనుమతింపబడదు |
అనుమతింపబడదు అనుమతింపబడదు |
ఋణం తీసుకోవడానికి గల అవసరం అ. భారతదేశంలో 1. ఖాతాదారునకు |
1.వ్యక్తిగత అవసరాలకు లేక వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొనుటకు 2. స్వదేశానికి మళ్ళించడానికి వీలులేకుండా, భారత కంపెనీల/ సంస్ధలలో మూలధనానికి పెట్టిన ప్రత్యక్ష పెట్టుబడి 3. అతని స్వంత వాడకానికి భారతదేశంలో ఫ్లాట్ / ఇల్లు కొనుక్కోవడం, (దయచేసి ఫెమా 5 (ఎఫ్.ఇ.ఏమ్.ఏ)లోని షెడ్యూలు 2ను పేరా 9 నిచూడండి) |
1. వ్యక్తిగత అవసరాలకు లేక వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొనుటకు 2. స్వదేశానికి మళ్ళించడానికి వీలులేకుండా భారత కంపెనీల / సంస్ధల మూలధనాములో ప్రత్యక్ష పెట్టుబడి 3. భారతదేశంలో ఫ్లాట్ / ఇల్లు కొనుక్కోవడం, అతని స్వంత వాడకానికి (దయచేసి ఫెమా 5 (ఎఫ్.ఇ.ఎమ్.ఏ) లోని షెడ్యూలు 1లోని పేరా 6 (అ) చూడండి) |
వ్యక్తిగత అవసరాలకు మరియు / లేక వ్యాపార కార్యకలాపాలకు |
2. మూడవ పార్టీకి | నిధుల ఆధారితమైన మరియు / లేక నిధుల ఆధారితం కాని వ్యక్తిగత అవసరాలకు లేక వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి (దయచేసి ఫెమా (ఎఫ్.ఇ.ఎమ్.ఏ) 5 లోని షెడ్యూలు 2లోని పేరా 9 చూడండి) | నిధుల ఆధారితమైన మరియు / లేక నిధుల ఆధారితం కాని వ్యక్తిగత అవసరాలకు లేక సౌకర్యాలు, వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి (దయచేసి ఫెమా (ఎఫ్.ఇ.ఎమ్.ఏ) 5లోని షెడ్యూలు 1లోని పేరా 6(బి) చూడండి) |
వ్యక్తిగత అవసరాలకు మరియు / లేక వ్యాపార కార్యకలాపాల కోసం |
ఖాతాదారునకు మరియు మూడవ పార్టీలకు |
నిధుల ఆధారిత మరియు / లేక నిధుల ఆధారితంకాని నిర్దారిత అవసరాలకు |
నిధుల ఆధారిత మరియు / లేక నిధుల ఆధారితంకాని నిర్దారిత అవసరాలకు |
అనుమతింపబడినది |
విదేశాలలో తీసుకొన్న ఇటువంటి ఋణాలు తిరిగి అప్పులు ఇవ్వడానికి గాని, లేక వ్యవసాయం లేక మొక్కల పెంపకానికి లేక స్ధిరాస్తిపై పెట్టుబడులు పెట్టుటకు ఉపయోగించకూడదు. |
|||
గమనికః అ. భారతదేశంలోనే స్ధానికుడైన ఒక వ్యక్తి నేపాల్‌కు మరియు భూటాన్‌కు ఉద్యోగరీత్యా కాని లేక వ్యాపారం చేసుకోవడానికి గాని లేక విహారానికి గాని లేక మరియు ఏ ఇతర కారణాల వల్లనైనా భారత దేశంనుండి వెళ్ళినట్లయితే, నేపాల్ మరియు భూటాన్‌లో అనిశ్చిత కాలానికి ఉండడానికి తన ఉద్దేశ్యాన్ని తెలిపినప్పుడు, ప్రస్తుతము ఉన్న అతని ఖాతా స్వదేశీ ఖాతా మాదిరిగా అలాగే కొనసాగింపబడుతుంది. అటువంటి ఖాతాను స్ధానికేతర (నాన్ రెసిడెంట్) ( ఆర్డినరీ) రూపాయి ఖాతా (ఎన్.ఆర్.ఓ.)గా పరిగణించకూడదు. ఆ. నేపాల్ మరియు భూటాన్‌లో నివసిస్తూ ఉండే, భారత దేశస్తులైన లేక భారతదేశ సంతతికి చెందిన వారై ఉన్నప్పుడు. ఏ.డి.లు ఎన్.ఆర్.ఇ/ఎఫ్.సి.ఎన్.ఆర్ . (బి) ఖాతాలను తెరవవచ్చును మరియు నిర్వహించవచ్చును. అయితే ఈ ఖాతాలను తెరవడానికి నిధులను స్వేశ్ఛాయుత విదేశ మారక ద్రవ్యంలో చెల్లించాలి. నేపాల్ మరియు భూటాన్‌లలో ఉండే ఎన్.ఆర్.ఐ.లకు మరియు పి.ఐ.ఓ. వాసులకు ఎన్.ఆర్.ఇ. / ఎఫ్.సి. ఎన్. ఆర్ (బి) ఖాతాలపై వచ్చే వడ్డీని భారతదేశపు రూపాయలలోనే చెల్లించవచ్చు. ఇ. అధికార ప్రకటన నెం. ఎఫ్.ఇ.ఎమ్.ఏ. 5 / 2000 - ఆర్.బి. తేది మే 3, 2000లోని నిబంధన 4(4) ప్రకారం నేపాల్ / భూటాన్‌లో నివాసం ఉండే ఒక వ్యక్తి కొరకు ఏ.డి.లు రూపాయి ఖాతాలను తెరిచి నిర్వహించవచ్చు. ఈ . ఎన్.ఆర్.ఐ.లకు లభించే వివిధ డిపాజిట్టు పథకాలకు సంబంధించిన నిబంధనలు, అధికార ప్రకటన నెం. ఎఫ్.ఇ.ఎమ్.ఏ. 5 తేది 3.5.2000లో వివరించబడ్డాయి, మరియు ఈ నిబంధనలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. సంబంధిత అధికార ప్రకటనలు మరియు ఏ.పి. (డిఐఆర్ సిరీస్) సర్క్యులర్‌లు మా వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఆర్‌బిఐ.ఓఆర్‌జి.ఇన్.లో ఉంచబడ్డాయి. దయచేసి మీరు మా మిగతా పూర్తి వివరాలకై దీనిని చూడవచ్చు. |
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020