ఆసియా క్లియరింగ్ యూనియన్ (ఎ.సి.యు) అంటే ఏమిటి?
- ప్రాంతీయ సహకారాన్ని పెంఎందించే దిశలో ఒక చర్యగా ఐకరాజ్య సమితి ఆసియా పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమీషన్ (ఇఎస్‌సిఎపి) చొరవతో 1974 డిసెంబర్ 9న ఆసియా క్లియరింగ్ యూనియన్‌ను ఏర్పాటు చేయబడింది. ఈ యూనియన్ కేంద్ర కార్యాలయం ఇరాన్‌లోని టెహరాన్‌లో ఉంది. బహుళ పక్ష ప్రాతిపదికమీద సభ్యదేశాల మధ్య చెల్లింపులను క్లియర్ చేయడానికి సంబంధించిన వ్యవస్థే ఎ.సి.యు.
ఎ.సి.యు. లో సభ్యులు ఎవరు?
- ఇరాన్, భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్ దేశాల సెంట్రల్ బాంకులూ, ద్రవ్యపరమైన అధికారసంస్థలు ఎ.సి.యులో సభ్యులు.
ఎ.సి.యు.కు సంబంధించిన సూచనలు ఏక్కడ లభిస్తాయి?
- ఎ.సి.యు ద్వారా వ్యవహారాలను నిర్వహించడానికి సవివరమైన కార్యనిర్వహణాపరమైన సూచనలను మెమోరాండమ్ ఎ.సి.ఎమ్. అనే ఒక ప్రత్యేకమైన కరదీపికగా రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది.
భారతదేశంలో అధికృత డీలర్‌లు ఎ.సి.యు లావాదేవీలను ఏవిధంగా నిర్వహించవలసి ఉంటుంది?
- ఎ.సి.యు ద్వారా క్లియర్ చేయవలసిన లావాదేవీలన్నిటినీ మామూలు విదేశీమారకం లావాదేవీలను నిర్వహించే తీరులోనే అధీకృత డీలర్‌లు నిర్వహిస్తారు. భారతదేశంలోని అధీకృత డీలర్‌లందరినీ ఎసియు లావాదేవీల నిర్వహణకు అనుమతించడం జరిగింది.
- క్లియరింగ్ యూనియన్‌లో పాల్గొంటున్న ఇతర దేశాలలోని బ్యాంక్‌లతో అధికృత డీలర్‌లు స్వేచ్ఛగా కరస్పాండెంట్ ఏర్పాట్లులోకి ప్రవేశించవచ్చు.
ఎ.సి.యు లావాదేవీల పరిష్కార యూనిట్ ఏమిటి?
- ఎ.సి.యు అకౌంట్‌కు సంబంధించిన సాధారణ యూనిట్ ఆసియా ద్రవ్యపరమైన యూనిట్. ఇది ఒక యు.ఎస్. డాలర్‌కు సమానం. ఆసియా ద్రవ్య యూనిట్‌ను ఎ.సి.యు డాలర్‌గా కూడా డినామినేట్ చేయవచ్చు. చెల్లింపు పత్రాలన్నిటినీ ఆసియా ద్రవ్య యూనిట్‌లోనే నామినేట్ చేయవలసి ఉంటుంది. అలాంటి పత్రాల పరిష్కారాలన్నిటినీ ఎసియు డాలర్ ఖాతాలకు సంబంధించిన నిర్వహణ ద్వారా అధీకృత డీలర్‌లు చేపట్టవచ్చు.
లావాదేవీల పరిష్కారానికి సంబంధించి కార్యవిధానం ఏమిటి?
- యనియన్‌లో పాల్గొంటున్న ఇతర దేశాలలోని బ్యాంకులతో అధీకృత డీలర్‌లు నిర్వహించే ఖాతాల ద్వారా లావాదేవీలలో అధిక భాగాన్ని సాధ్యమైనంతవరకూ నేరుగా పరిష్కరిస్తారు. ఏ కారణం చేతనయిన అయినా మిగిలిపోయిన వాటిని మాత్రమే క్లియరింగ్ యూనియన్ ద్వారా సంబంధిత దేశాలలోని సెంట్రల్ బాంకుల ద్వారా పరిష్కరించవలసి ఉంటుంది.
- ఇతర సాధారణ విదేశీమారకం లావాదేవీల మాదిరిగానే వాణిజ్యపరమైన, ఇతర అర్హమైన లావాదేవీలను పరిష్కరించడానికి అధీకృత డీలర్‌లను అనుమతించడం జరిగింది. మార్పిడియోగ్యమైన కరెన్సీలతో వర్తకం విషయంలో పత్రాల బదలాయింపు వాటి వాటాను ప్రారంభించడానికి సంబంధించిన కార్యవిధానాలు, ఎసియు యంత్రాంగం ద్వారా జరిగే వర్తకానికి వర్తిస్తాయి.
- ఈ రీతిలో ఎ.సి.యు ద్వారా లావాదేవీలను పరిష్కరించడానికి వీలుగా అధీకృత డీలర్‌లు, తమ శాఖలలో/కరస్పాండెంట్లలో స్వేచ్ఛగా ఎసియు డాలర్ ఖాతాలను తెరవవచ్చు. క్లియరింగ్ యూనియన్‌కు సంబంధం లేకుండా జరిగే లావాదేవీల పరిష్కారానికి నిర్వహించే యు.ఎస్.డాలర్ ఖాతాల నుంచి వీటిని వేరుగా ఉంచాలి.
- ఎ.సి.యు లావాదేవీలకు సంబంధించి యుఎస్ డాలర్ ఉపయోగాన్ని గుర్తించడానికి ఎ.సి.యు డాలర్ అనే పదాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. లేకపోతే, ఎసియు డాలర్‌కూ యుఎస్ డాలర్‌కూ మధ్య విలువపరంగా తేడా ఉండదు.
ఎ.సి.యు డాలర్ ఖాతాలో నిర్వహించే నిల్వలు ఎల్లప్పుడూ తమ సాధారణ మారకపు వ్యాపారావసరాలకు అనుగుణంగా ఉండేట్లు అధికృత డీలర్‌లు ఎసియు డాలర్ ఖాతాలు తెరవవచ్చునా?
- తెరవవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు పూర్వామోదం లేకుండా పాకిస్థాన్‌తో సహా సభ్యదేశాలన్నిటిలోని అన్ని బ్యాంకుల పేర్లలో అధీకృత డీలర్‌లు ఎసియు డాలర్ ఖాతాలు తెరవవచ్చు.
ఎ.సి.యు ద్వారా పరిష్కారానికి గల యంత్రాంగం ఏమిటి?
- యూనియన్‌లో పాల్గొంటున్న ఇతర దేశాలలోని తమ కరస్పాండెంట్లతో అధికృత డీలర్ నిర్వహించే ఎసియు డాలర్ ఖాతాలలో మిగిలిన ద్రవ్యత్వాన్ని తిరిగి పంపడానికి లేదా ఆర్థిక సహాయం అందించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు, అధీకృత డీలర్ నుంచి యు.ఎస్.డాలర్‌లను స్వీకరించడం/వారికి చెల్లించడం అనే పనిని చేపడుతుంది. అదేవిధంగా విదేశాల్లోని తమ కరస్పాండెంట్ల తరఫున అధీకృత డీలర్‌లు నిర్వహించే ఎసియు డాలర్ ఖాతాల ద్రవ్యత్వాన్ని శోషించుకోడానికి లేదా ఆర్థిక సహాయం సమకూర్చుకోడానికి భారతీయ రిజర్వు బ్యాంకు, యు.ఎస్.డాలర్ మొత్తాలను స్వీకరించడం, బట్వాడా చేయడం చేస్తూ ఉంటుంది.
- మరో ఎసియు భాగస్వామ్య దేశంలో కరస్పాండెంట్ బాంకుతో నిర్వహించే ఎసియు డాలర్ ఖాతాకు సంబంధించిన ఆర్థిక సహాయ (ఫండింగ్), అధీకృత డీలర్ ఖాతాకు న్యూయార్క్ లోని ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఆఫ్ న్యూయార్క్‌లో తన ఖాతాకు యుఎస్ డాలర్‌కు సమానమైన మొత్తాన్ని జమ చేయడం జరిగిందని సమాచారాన్ని అందుకొన్న మీదట మాత్రమే రిజర్వు బ్యాంకు అమలులో కొనసాగిస్తుంది. అదేవిధంగా, భారతదేశంలోని అధికృత డీలర్ బ్యాంకు తరఫున ఇతర భాగస్వామ్య సెంట్రల్ బ్యాంకుకు మిగులు నిధుల సరేండర్ సమాచారం అందుకున్న సందర్భంలో, ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఆఫ్ న్యూయార్క్‌లో తన ఖాతానుంచి న్యూయార్క్ లోని అధీకృత డీలర్ ఈ కరస్సాండెంట్ ఖాతాకు యుఎస్ డాలర్ చెల్లింపు ఏర్పాటును రిజర్వు బ్యాంకు కొనసాగిస్తుంది.
ఎసియు ద్వారా చేయడానికి యోగ్యమైన లావాదేవీలు ఏవి?
ఎసియు ద్వారా చేయడానికి ముఖ్యమైన లావాదేవీలు
- ఒక భాగస్వామి భూభాగంలోని నివాసి నుంచి మరో భాగస్వామి భూభాగంలోని నివాసికి చెల్లింపులు.
- అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒప్పంద నియమాలు నిర్వచించిన కరెంట్ అంతర్జాతీయ లావాదేవీలో చెల్లింపులు.
- చెల్లించే వ్యక్తి నివసిస్తున్న దేశంలో అనుమతించిన చెల్లింపులు. ఫెమా (FEMA)1999కు అనుగుణమైన, దానికింద జారీచేసిన నియమాలు, నిబంధనలు, ఆదేశాలకు మెమొరాండమ్ ఎసిఎమ్‌కు ప్రత్యేక నిబంధనలకు అనుగుణమైన చెల్లింపులు.
- విలంబిత చెల్లింపు షరతులమీద ఎసియు సభ్యదేశాల మధ్య ఎగుమతి/దిగుమతి లావాదేవీలకు చెల్లింపులు.
ఎసియు ద్వారా పరిష్కారానికి యోగ్యంకాని చెల్లింపులు ఏవి?
- కింది చెల్లింపులు, ఎసియు ద్వారా పరిష్కరించడానికి యోగ్యమైనవి కావు.
- నేపాల్ మరియు భారత్, భూటాన్ మరియు భారత్‌ల మధ్య చెల్లింపులు. విదేశీ మారకంలో చెల్లింపులు చేయడానికి నేపాల్ రాష్ట్ర బ్యాంకు అనుమతించిన నేపాల్‌లోని నివాస దిగుమతిదారు, భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న సరుకుల విషయంలో మినహాయింపు ఇస్తారు.
- రిజర్వు బ్యాంకుకూ ఈ భాగస్వాములకూ మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు తప్ప, అంతర్జాతీయ ద్రవ్యనిధి నిర్వహించిన కరెంట్ అంతర్జాతీయ లావాదేవీలు ఖాతాకు సంబంధించని చెల్లింపులు.
- క్లియరింగ్ సదుపాయం ద్వారా పరిష్కరించడానికి యోగ్యంగాని ఆసియా క్లయరింగ్ యూనియన్ ప్రకటించిన ఇతర చెల్లింపులు.
సభ్యదేశాల మధ్య యోగ్యమైన లావాదేవీలన్నిటినీ ఎసియు ద్వారా పరిష్కరించుకోవలసి ఉంటుందా?
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు