దేశంలో ప్రయాణీకులకు, పర్యాటకులకు మరియు ప్రవాస భారతీయులకు కూడా, సులభతరమైన నగదు మార్పిడి సదుపాయాలను కల్పించే విధానాన్ని విస్తృతం చేయాలన్నది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దిగువ పేర్కొనబడిన ఈ పథకం వల్ల బ్యాంకులు మరియు పూర్తిస్థాయి నగదు మార్పిడిదారులకు, అన్ని పర్యాటక కేంద్రాలు మరియు ప్రధాన నగరాలలో ఎడిగించబడిన పని గంటలలో మరియు సెలవు దినాలలో నగదు మార్పిడి సదుపాయాన్ని కల్పించడానికి వీలు కలుగుతుంది.
ప్రస్తుతం విదేశీ కరెన్సీలో గుర్తించబడిన నోట్లు, నాణలు లేదా ట్రావెలర్స్ చెక్కులను భారతీయ రూపాయలలోకి మార్పు చేయడానికి, అధీకృత డీలర్లుగా గుర్తింపబడిన బ్యాంకుల ద్వారా, ఇంకా (ఎ) పూర్తి స్థాయి నగదు మార్పిడిదారుల ద్వారా, (ఎఫ్‌ఎఫ్‌ఎంసి), (బి) పరిమిత నగదు మార్పిడిదారుల ద్వారా (ఆర్‌ఎంసిలు) మాత్రమే సాధ్యపడుతుంది. రిజర్వు బ్యాంకు ఈ ఆర్‌ఎంసి ల (కొన్ని ఆర్‌ఎంసి లను ప్రత్యేక పరిస్థితులలో మినహాయించి) లైసెన్సులను జారీ చేయడం/ఎడిగించడం వంటి చర్యలను నిలుపుదల చేసింది. ఎఫ్‌ఎఫ్‌ఎంసి లకు భారతీయ రూపాయి నోట్లకు బదులుగా విదేశీ నగదు కొనుగోళ్ళు మరియు అమ్మకాలను అనుమతిస్తూ, ఆర్‌ఎంసి లను కేవలం భారతీయ రూపాయిలకు బదులుగా విదేశీ నగదును కొనుగోలు చేయడానికి మాత్రమే అనుమతించింది.
ఈ పథకం కింద, రిజర్వు బ్యాంకు ఎడిలు మరియు ఎఫ్‌ఎఫ్‌ఎంసి లను వారి ఎంపిక మేరకు, పరిమిత నగదు మార్పిడి వ్యాపార నిర్వహణ నిమిత్తం ఏజెన్సీ/ఫ్రాంఛైజీ ఒప్పందాల మేరకు విదేశీ కరెన్సీ నోట్లు, నాణలు లేదా ట్రావెలర్స్ చెక్కులను రూపాయిలలోకి మార్పిడికి అనుమతిస్తుంది.
ఒక ఫ్రాంఛైజీ ఏదైనా గుర్తింపుతో ఒక వ్యాపార స్థలాన్ని కలిగి ఉండి, అతని యొక్క వాస్తవ పరిస్థితిని ధ్రువీకరించే పత్రాలను ఎడి/ఎఫ్‌ఎఫ్‌ఎం ల చేత అంగీకరింపబడి ఉండాలి. ఈ ఫ్రాంఛైజర్లు పరిమిత నగదు మార్పిడి వ్యాపారాన్ని మాత్రమే నిర్వహించగలరు.
ఏజెన్సీ/ ఫ్రాంఛైజ్ ఒప్పందం
ఫ్రాంచైజర్లు, ఏర్పాట్ల యొక్క పద్ధతిని నిర్ణయించడానికి, అంతేకాక, వ్యాపారానికి సంబంధించిన కమీషన్ లేదా ఫీజులను ఉమ్మడి ఒప్పందం ద్వారా నిర్ణయించడానికి, స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఒక ఎడి/ఎఫ్‌ఎఫ్‌ఎంసి తో కుదుర్చుకొనే ఏజెన్సీ/ఫ్రాంఛైజీ ఒప్పందం ఈ దిగువ పేర్కొన్న ముఖ్య లక్షణాలను కలిగి ఉండాలి.
ఫ్రాంఛైజర్ అనగా, ఒక ఎడి లేదా ఎఫ్‌ఎఫ్‌ఎంసి వారి ప్రధాన కార్యాలయ పరిధిలో ఉన్న రిజర్వు బ్యాంకు యొక్క సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి, ఇందువెంట జతపరచిన నమూనా ప్రకారం ఈ పథకం కింద వ్యాపార ఏర్పాట్లను చేసుకోవడానికి వీలుగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ దరఖాస్తుతో పాటుగా, వ్యాపార ఏజెంట్లను ఎంపిక చేసుకొనే సందర్భంలో అత్యంత శ్రద్ధతో వ్యవహరించడం జరిగిందనీ, ఫ్రాంఛైజీ ఒప్పందంలో/అమలులో ఉన్న రిజర్వు బ్యాంకు నిబంధనలలో సూచించిన మేరకు వివిధ అంశాలను పాటించే విషయంలో బాధ్యతను చేపట్టడం జరుగుతుందనీ, తెలియచేసే ఒక ప్రకటనను కూడా జతపరచవలసి ఉంటుంది. మొట్టమొదటి ఫ్రాంఛైజీ ఏర్పాటుకు రిజర్వు బ్యాంకు యొక్క ఆమోదం జారీ చేయబడాలి. ఆ తరువాత నుండి, కొత్తగా చేసుకొనే ఏజెన్సీ/ఫ్రాంఛైజీ ఒప్పందాలు పైన చెప్పిన ప్రకటనతో జతపరచబడి, కార్యానంతర అనుమతికై రిజర్వు బ్యాంకుకు నివేదించవలసి ఉంటుంది.
ఈ పథకాన్ని అమలు చేయడానికి గాను కేంద్రాలను ఎంపిక చేసుకొనే విషయంలో ఫ్రాంఛైజర్లకు స్వేచ్ఛ కల్పించబడింది.
ఫ్రాంఛైజర్లు ఏజెంట్లకు/ఫ్రాంఛైజీలకు కార్యకలాపాల అమలు మరియు రికార్డులకు సంబంధించి శిక్షణ ఇప్పించే ఏర్పాట్లను చేయవలసి ఉంది. పరస్పర సౌలభ్యతకు లోబడి, రిజర్వు బ్యాంకు కూడా అటువంటి శిక్షణకు అవసరమైన సహకారాన్ని కల్పిస్తుంది.
ఫ్రాంచైజర్లు, అనగా ఎ.డి.లు/ఎఫ్.ఎఫ్.ఎం.సి.లు తమకు క్రమానుసారంగా ఫ్రాంచైజీల నుండి, తమచే రూఎందింపబడిన ఒక సులభ నమూనాలో నెలవారీ లావాదేవీల నివేదికలు ఎందే ఏర్పాట్లను చేసుకోవలసి ఉంది.
పైన పేర్కొన్న విధంగా, ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్న పుస్తకాలను తనిఖీ చేయడానికి గాను, ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలి. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే, ఈ తనిఖీ నగదు మార్పిడి వ్యాపారానికి సంబంధించి, ఫ్రాంచైజీలు ఒప్పందం ప్రకారం మరియు/అమలులో ఉన్న ఆర్‌బిఐ మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం అంశాలను పాటిస్తున్నదీ లేనిదీ నిర్ధారించుకోవడం, మరియు అవసరమైన రికార్డులను ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నదీ లేనిదీ తెలుసుకోవడం ఈ తనిఖీ యొక్క ప్రధాన ఉద్దేశాలుగా ఉండాలి.
రిజర్వు బ్యాంకు అధీకృత నగదు మార్పిడిదార్ల నిమిత్తం తేది. డిసెంబరు 2, 2005న జారీ చేసిన ఎ.పి. (డిఐఆర్ సిరీస్) ప్రకటన నం.18 లో తెలియచేసిన ఎ.ఎం.ఎల్/కెవైసి మార్గదర్శకాలకు ఫ్రాంచైజీలు కట్టుబడి ఉండాలి.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020