రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో కంపెనీ నమోదు చేయడం అవసరమా? ఆ తరవాతే స్థానిక ప్రాంత బ్యాంకును స్థాపించాలా? ఒకవేళ అట్లాకాకపోతే స్థానిక ప్రాంత బ్యాంకు దరఖాస్తులోని ఆ అంశం దగ్గర ఏ విధంగా సూచించాలి?
- స్థానిక ప్రాంత బ్యాంకు స్థాపనకు దరఖాస్తు చేసుకొనేముందు కంపెనీ రిజిస్ట్రార్‌తో నమోదు చేసుకోనవసరం లేదు. ఆర్‌బిఐ ‘సూత్రప్రాయంగా’ ఆమోదం తెలిపిన తరవాత ప్రమోటర్స్ కంపెనీ రిజిస్ట్రార్‌ను కలవాల్సి ఉంటుంది దరఖాస్తులో ఆ అంశం దగ్గర ‘ఈ దశలో వర్తించదు’ అని రాయాలి. స్థానిక ప్రాంత బ్యాంకు పేరును ప్రమోటర్లు ఎంపిక చేస్తే, ప్రతిపాదిత పేరును అందులో సూచించాలి. ఉదాః ఎక్స్‌వైజడ్ స్థానిక ప్రాంత బ్యాంకు లిమిటెడ్ (ప్రతిపాదిత).
దరఖాస్తు దాఖలు చేసేముందు స్థానిక ప్రాంత బ్యాంకు ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సిఇడి) సంచాలకుల పేర్లను జీవితాంశాల్ని (బయోడేటా) సూచించడం తప్పనిసరా?
- లేదు. వివరాలు అందించడం తప్పని సరికాదు. ఆర్‌బిఐ ‘సూత్రప్రాయంగా’ ఆమోదించిన తరవాత నిర్వాహక సంచాలకుల పేరును జీవితాంశాల్ని, ప్రతిపాదిత సంచాలక మండలి నిర్మాణ వివరాలను ఆర్‌బిఐకి సమర్పించాలి. దరఖాస్తులోని ఆ అంశం దగ్గర ‘ఆర్‌బిఐ ఆమోదం కోసం సముచిత సమయంలో దాఖలు చేస్తాము’ అని రాయాలి.
దరఖాస్తు లో మిగిలిన అంశాల దగ్గర సమాచారం తెలపడం అవసరమా?
- అవసరమే. కావలసిన సమాచారాన్ని ప్రతి అంశం దగ్గర సమకూర్చాలి. ఒకవేళ అట్లా చేయకపోతే దరఖాస్తును పరిశీలించరు.
దరఖాస్తుతో ఎటువంటి పత్రాలను, సమాచారాన్ని జతచేయాలి?
- దరఖాస్తు లోని అనుబంధంలో సూచించిన సమాచారాన్ని, పత్రాలను దరఖాస్తు తో పాటు సమర్పించాలి.
ప్రాజెక్టులొ నివేదిక సమర్పణకు నిర్దిష్టరూపం ఏదైన ఉందా? దరఖాస్తు వెంట నివేదిక ప్రతులు ఎన్ని సమర్పించాలి?
- ప్రాజెక్టు నివేదిక ఫలానా విధంగా సమర్పించాలని నిర్దిష్టరూపం లేదు. స్థానిక ప్రాంత బ్యాంకు ప్రతిపాదన గురించి కావలసిన సమచారం అందులో ఉండాలి. కార్యకలాప జిల్లాల పూర్తి స్వరూపం, ప్రతి జిల్లా పరపతి అవధి అంచనా, ప్రస్తుతం లభించే బ్యాంకు వసతులు, జిల్లాల వ్యాపార సామర్ధ్యం ఆయిదేళ్ళ పాటు ప్రతిపాదిత బ్యాంకు వ్యాపార ప్రణాళిక, వ్యాపార ప్రక్షేపకాలు వీటితోపాటు అయిదేళ్ళ పి/ఎల్‌ఖాతా, ప్రక్షేపక బ్యాలెన్స్ షీట్, వ్యాపార ప్రక్షేపకాల వివిధ ప్రతిపాదన భావనలు, అధ్యయన నివేదిక స్వయంభరణశక్తి మొ|| నివేదికలో ఉండాలి.
- ఆర్‌బిఐ దరఖాస్తుతో ప్రమోటర్లు రెండు ప్రతులను దరఖాస్తుకు అనుబంధంగా, ప్రాజెక్టు నివేదికను మరియు రెండు ప్రతుల అనుబంధాలను సమర్పించాలి.
ఒక రాష్ట్రాన్ని మించి మూడు జిల్లాల పరధిలో స్థానికప్రాంత బ్యాంకు కార్యకలాపాలు విస్తరించవచ్చా?
- ఈ విషయమై ఎటువంటి నిషేధం లేదు. కాని ఈ బ్యాంకు కార్యకలాపాలు ఎంపిక చేసిన మూడు జిల్లాలు భౌగోళికంగా సన్నిహితంగా ఉండాలి.
కార్యకలాప ప్రాంతంలో అన్ని జిల్లాలను అనుమతిస్తారా?
- వెనుకబడిన, అభివృద్ధి చెందని జిల్లాల ప్రాంతాన్ని స్థానిక ప్రాంత బ్యాంకు కార్యకలాపాలకు అనుమతిస్తారు. రాష్ట్రరాజధాని గల జిల్లా, మెట్రోపాలిటన్ నగరాలు లేదా, అధికపారిశ్రామిక అభివృద్ధి చెందిన నగరాలలో స్థానిక్రపాంత బ్యాంకులను అనుమతించరు.
ఆరంభ పెట్టుబడిగా రెండుకోట్ల రూ.లను (చెల్లింపు మూలధనంలో కనీసం 40శాతం) ప్రమోటర్లు తేవచ్చా? మిగిలిన మూడుకోట్ల రూ.ల స్థాప్రాబ్యా మొదలుపెట్టక ముందు పబ్లిక్ ఇస్యూల ద్వారా ఎందవచ్చా?
- లేదు. పరిశీలనార్హమైన సంత వనరునిధులనుంచి అయిదుకోట్ల రూ. పూర్తి కనీస పెట్టుబడిని ప్రమోటర్లు పెట్టాల్సి ఉంటుంది. ఇది చట్ట ప్రకారం తప్పనిసరి. చార్డెర్డ్ అకౌంటెంట్ ధ్రువీకరించిన, తగు మాత్రంగా పరిశీలించిన ఇటీవలి అసలు విలువ ప్రకటన పత్రాలను ప్రమోటర్లు దాఖలు చేయాలి. కనీస ప్రారంభ##పెట్టుబడి 5కోట్ల రూ.లను తరలించామనే ఆధారం చూపే ఆడిటర్ ధ్రువీకరణతో పత్రపరమైన సాక్ష్యాన్ని జతచేయవలసి ఉంటుంది. ఇదంతా స్థాప్రాబ్యా లైసెన్సు జారీకి ముందే జరగాలి.
ఒకే కుటుంబం పూర్తి ప్రారంభ పెట్టుబడి మొత్తం 5కోట్ల రూ. లేదా పెట్టుబడి లోని ప్రధాన భాగాన్ని సమకూర్చవచ్చా?
- స్ధాప్రాబ్యా లోని చెల్లింపు మూలధనంలోని 40శాతాన్ని మించిన పెట్టుబడికి స్థాప్రాబ్యా పెట్టుబడిగా ఒకే కుటుంబం పెట్టకూడదు. విభిన్న వాటా హోల్డింగ్స్ ప్రతిపాదనలను అంగీకరించవచ్చు.
ఈక్విటీ వాటాలను ఏ సమయంలోనైనా ప్రమోటర్లు బదిలీ చేయవచ్చా?
- ఈక్విటీకై (స్నేహితుల, బంధువుల విరాళాలతో సహా) ప్రమోటర్లు అందించిన పూర్తి విరాళానికి లైసెన్సు జారీ అయిన తేదీ నుంచి మూడేళ్ల కాలం లాక్‌ఇన్ వ్యవధి వర్తిస్తుంది. 40 శాతం మరో రెండేళ్ళపాటు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే అయిదేళ్ళ కాలం పూర్తి అయ్యేముందు పునర్విమర్శ చేస్తారు.
నగర ప్రాంతాలలో స్థాప్రాబ్యా శాఖలు తెరవవచ్చా?
- వారి కార్యకలాప ప్రాంతాలకు సమీపగ్రామ, అర్ధనగర ప్రాంతాలలో స్థాప్రాబ్యా శాఖలు తెరిచేందుకు అనుమతిస్తారు. ప్రతి జిల్లాలోనూ (లక్షజనాభా పైబడ్డ కేంద్రంలో) ఒక నగర శాఖకు అనుమతిస్తారు.
స్థాప్రాబ్యా స్థాపనకు ఆర్‌బిఐ ఏమయినా మార్గదర్శక సూత్రాలు జారీచేసిందా?
- చేసింది. ఆర్‌బిఐ జారీ చేసిన 24-8-96 నాటి ప్రసారమాధ్యమ సమాచారంలో మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు