సూక్ష్మ పరపతిని ఎదుపు చేయుట, పరపతి మరియు ఇతర ఆర్ధిక సేవలు కలుగజేయు వసతిగా మరియు చిన్న మొత్తంలో ఇతర ఉత్పత్తులను పేద గ్రామీణవాసులకు, ఒక మాదిరి పట్టణ ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి వారి సంపాదనను, రాబడి స్ధాయిని పెంచుకొనేందుకు వీలుగాను, వారి జీవిత స్ధాయిని పెంచుకొనేందుకు వీలుగాను మరియు వారి జీవిత స్ధాయిని అభివృద్ధి పరిచే విధంగాను వర్ణింపబడినది. ఈ సౌకర్యాలను కల్గించే వాటినే సూక్ష్మ పరపతి సంస్ధలు అంటారు.
1991లో చేపట్టబడిన ఆర్ధిక రంగ సంస్కరణల్లో మిళితమైన ఒక భాగంగా వడ్డీ రేట్లపై సంస్కరణలు చేపట్టబడిన హయాంలో ఈ సంస్కరణలు కూడా రూఎందించడం జరిగింది. ఈ సంస్కరణల ప్రక్రియల విధానంలో బ్యాంకుల ద్వారా సూక్ష్మ ఆర్ధిక సంస్ధలకు లేక సూక్ష్మ ఆర్ధిక సంస్ధల ద్వారా స్వయం సహాయక బృందాలకు / సభ్యులైన లబ్ధిదారులకు వర్తించే వడ్డీ రేట్లను వారి విచక్షణకే వదిలివేయబడింది. బ్యాంకు వ్యక్తిగత ఋణ గ్రహీతలకు ఇచ్చే ప్రత్యక్ష చిన్న ఋణాలపై విధించే గరిష్ట వడ్డీ రేటు ఏమైనప్పటికీ అలాగే కొనసాగుతుంది.
అట్టడుగు స్ధాయి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులకు పరపతి విధానము నిర్ణయించే స్వతంత్ర్యం కలిగింపబడినది. సరైన ఋణాలు, ఎదుపు పథకాల రూపకల్పన మరియు వాటికి సంబంధించి నియమ నిభందనావళిని మరియు ఇచ్చే ఋణం యొక్క పరిమాణం, యూనిట్ ఖరీదు, యూనిట్ పరిమాణము, పరిపక్వత ఎందే కాలం, అనుగ్రహ కాల వ్యవథి (గ్రేస్ పిరియడ్) , మార్జిన్స్ మొదలగు వాటిపై రూపకల్పన చేయవలసినదిగా బ్యాంకులను కోరడం జరిగింది. బీదలకు సంబంధించి వాడకం మరియు ఉత్పాథక ఋణాలను వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఋణాల కెె వీలు కల్పించబడడమే కాకుండా వారియొక్క గృహ మరియు నివాస వసతిని మెరుగు పర్చుకునేందుకు వీలుగా ఋణ అవసరాలకు కూడా ఈ పరపతి విధానం వీలు కలిగిస్తుంది.
స్వయం సహాయక బృందం (ఎస్.హెచ్.జి) అంటేనమోదు కాబడిన లేక కానటువంటి స్వశ్ఛందంగా స్వజాతీయ సాంఘిక మరియు ఆర్ధిక నేపథ్యంలో ఉండి నిత్యం చిన్న మొత్తాలలో ఎదుపు చేయడానికి ముందుకు వచ్చి సమిష్టిగా నెలకొల్పే నిధులకు తోడ్పడుతూ, పరస్పర సహాయం చేసుకొనే ప్రాతిపదికపై పనిచేయునటువంటి సూక్ష్మ పారిశ్రామిక వేత్తల బృందం.
ఈ బృందంలోని సభ్యులు సామూహికంగా తమ తెలివితేటలను, సమాన పరిమితిలో వత్తిడిని ఉపయోగించి, తీసుకొన్న ఋణాల సక్రమ వినియోగం మరియు వాటిని సకాలంలో తిరిగి చెల్లించునట్లు చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే సమాన స్ధాయిలో వచ్చే వత్తిడి భద్రతకు ఒక కట్టుదిట్టమైన ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది అని గుర్తించారు.
బృందంలో ఒక భాగంగా ఆర్ధికంగా వెనుకబడిఉన్న ఒక వ్యక్తి బలోపేతం ఎందుతాడు. అంతే కాకుండా స్వయం సహాయ బృందాల ద్వారా ఆర్ధిక సహాయం చేయడం వల్ల ఋణదాతకు, ఋణ గ్రహీతకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. పెద్ద సంఖ్యలో ఉండే చిన్న సైజు ఖాతాల వ్యక్తిగత ఖాతాలను నిర్వహించడానికి బదులుగా ఋణదాతలు కేవలం ఒకేస్వయం సహాయక బృందం ఖాతాను నిర్వహించే సౌకర్యం కలిగి ఉంటారు.
ప్రభుత్వేతర సంస్ధ (ఎన్.జి.ఓ.) ఒక స్వశ్ఛంద సంస్ధ అయిఉండి, మధ్యవర్తిత్వాన్ని నెరపే విధంగా నెలకొల్పబడి ఉంటుంది. అనగా సూక్ష్మ పారిశ్రామికవేత్తలతో స్వయం సహాయక బృందాన్ని నిర్వహించడం. అలాగే వారికి బ్యాంకులతో ఋణాలనిప్పించే ప్రక్రియలో అనుసంథానం చేస్తూ లేక ఆర్ధిక మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో బ్యాంకుల నుండి అప్పులను సేకరించే స్వయం సహాయక బృందాలకు నిరంతరం ఋణ సహాయాన్ని అందజేసే విధంగా ఆర్ధిక మధ్య వర్తిత్వాన్ని నెరపుతూ ఉంటుంది.
బడుగు వర్గాల వారికి సజావుగా మరియు మిక్కిలి అర్థవంతమైన విధంగా బ్యాంకింగ్‌ను నిర్వహించే సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక ప్రయోగాత్మక పథకాన్ని, స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష బ్యాంకుల పరపతి సౌకర్యాన్ని విస్తరింపచేసే దృష్టితో, రాష్ట్రీయ కృషి మరియు గ్రామీణ వికాస్ బ్యాంకు (నాబార్డ్) 1991-92 సం||లో ప్రవేశ##పెట్టడం జరిగింది. ఈ అనుసంథాన కార్యక్రమములో చురుకుగా పాల్గొనాలని భారతీయ రిజర్వు బ్యాంకు వ్యాపార సంస్ధలకు సలహా ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఇప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్.ఆర్.బి.) కు, మరియు సహకార బ్యాంకులకు కూడా విస్తరింపబడినది. మార్చి 31, 2002 నాటికి బ్యాంకులతో అనుసంధానం చేయబడిన ఎస్.హెచ్.జి.ల సంఖ్య మొత్తం మీద 4,61, 478గా వుంది. మార్చి 31,2002 నాటికి అట్టడుగు బడుగు వర్గానికి చెందిన ఇంచుమించు 7.87 మిలియన్ల కుటుంబాలను సాధారణ బ్యాంకింగ్ సేవల పరిధిలోనికి తీసుకురావడం జరిగింది. వీటిలో 90 శాతం కంటే మించి బ్యాంకులలో అనుసంధానం చేయబడిన బృందాలు ప్రత్యేకంగా మహిళా బృందాలే. ఈ ఎస్.హెచ్.జి. లకు బ్యాంకులు చెల్లింపు చేసిన మొత్తం సమ్ము మార్చి 31,2002 నాటికి రూ. 1026,34 కోట్లు అయి ఉండి, ప్రతి ఎస్.హెచ్.జి.కు సగటున ఇచ్చిన ఋణం రూ. 22, 240 మరియు ప్రతీ కుటుంబానికి రు. 1,316గా ఉంది. ఈ అనుసంధానం నెరపే నమూనాలకు సంబంధించి, నమూనా -1 అనగా ఎస్.హెచ్.జి. లకు ప్రత్యక్షంగా ఎన్.జి.ఓ.ల మరియు ఇతర ఏజన్సీల మధ్య వర్తిత్వం లేకుండా ఉన్నవి ఇప్పుడు 16 శాతం వరకు, నమూనా - 2 అనగా ఎన్.జి.ఓ. మరియు ఇతర ఏజన్సీలు ఒక మధ్యవర్తిగా సౌకర్యం కల్గిస్తూ సహకరించే విధంగా ఉన్నవి 75 శాతం వరకూ ఉన్నాయి. అలాగే నమూనా -3 అనగా ఎన్.జి.ఓ. సౌకర్యం కల్గించేదిగా మరియు ఒక ఆర్ధిక సౌకర్యాన్ని కల్గించే ఏజన్సీగా ఉన్నవి వాటిలో 9 శాతం వరకు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని / కేంద్రపాలిత ప్రాంతాలలోని 448 జిల్లాలలో ఈ పథకం విస్తరింపబడి ఉన్నది. 444 బ్యాంకులు అందులో 44 వ్యాపార బ్యాంకులు (పబ్లిక్ రంగంలో ఉన్న 17 బ్యాంకులతో సహా) 191 ప్రాం.గ్రా.బ్యా.లు మరియు 2,155 ఎన్.జి.ఓ.లతో కల్సి పనిచేసే 209 సహకార బ్యాంకులు కూడా ఎస్.హెచ్.జి. అనుసంధాన కార్యక్రమంలో ఇప్పుడు పాలు పంచుకొంటున్నాయి.
ఎస్.హెచ్.జి. - బ్యాంకుల అనుసంధాన కార్యక్రమం ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యత వహించిన సూక్ష్మ పరపతి ప్రక్రియగా, భారత దేశంలోనే ఒక ఆదర్శవంతమైన వ్యవస్థగా ఆవిర్భవించి, ఇతర నమూనాలు కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో సూక్ష పరపతిని కలుగజేయడానికి విస్తరించిన మార్గాలుగా అవతరించాయి.
సూక్ష్మ పరపతి పథకాల్లో పాలు పంచుకోవడాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తమ ఆగస్టు 29, 2000 తేదీ నాటికి అధికారిక ప్రకటన ద్వారా “ సూక్ష్మ పరపతి/ గ్రామీణ పరపతి’’ని బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధల కార్యకలాపాల జాబితాతో మిళితం చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.లు) / విదేశ కార్పోరేట్ సంస్ధల / ప్రవాస భారతీయుల ( ఎన్.ఆర్.ఐ.ల) పెట్టుబడులను అనుమతించే విధంగా సూక్ష్మ పరపతి పథకాలలో పెట్టుబడి పెట్టడాన్ని ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ పరపతి విధానం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న తరహా ఉత్పత్తిదారులకు మరియు సూక్ష్మ పారిశ్రామికవేతలకు, సూక్ష్మ స్ధాయిలో ఆర్ధిక సహాయాన్ని అందించడానికి సౌకర్యం కలుగజేసే విధంగా వీరిని ఆదుకొంటుంది.
కనీస సేవలు అందించే విధానం నుండి తమ పంథాలను సూక్ష్మ పరపతి సౌకర్యం కలుగ జేసే వారు మార్చుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ఆసన్నమైంది. అనగా కేవలం ఆర్ధిక మధ్యవర్తిత్వాన్ని నెరపడం మాత్రమే కాదు, దాని నుండి దారిద్ర్య నిర్మూలనకై సమగ్రమైన విధానం , వినియోగదారుని విషయంలో పరిపూర్ణమైన దృష్టితో మరియు వ్యాపారాభివృద్ధికై అవసరమయ్యే సేవలు అనగా అమ్మకానికి అనువైన మౌలిక వసతులు కలుగుజేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం మరియు ఉత్పత్తి రూపకల్పనను అభివృద్ధి చేయడంతో సహా. ఈ నేపథ్యంలో సూక్ష్మ ఆర్ధికాభివృద్ధి నిథిని నెలకొల్పడం ఒక ముఖ్యమైన ముందడుగు వంటి చర్య. కేంద్ర ఆర్ధిక మంత్రి తన 2000-01 సంవత్సరపు బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా ఈ క్రింద పేర్కొన్న కార్యకలాపాలను నిర్వహించడానికి రూ. 100 కోట్లతో రాష్ట్రీయ కృషి మరియు గ్రామీణ వికాస్ బ్యాంకు (నాబార్డ్) లో ఈ నిథిని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుత పరిస్ధితి ఈ క్రింది విధంగా ఉన్నది.
సౌకర్యాన్ని కలిగించే తరగతులు | వారి చర్యలను నియంత్రీకరించే చట్టపరమైన వ్యవస్ధ |
• దేశీయ వ్యాపార బ్యాంకులు: • ప్రభుత్వ రంగ బ్యాంకులు • ప్రయివేట్ రంగ బ్యాంకులు మరియు లోకల్ ఏరియ బ్యాంకులు |
1. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934/ 2. బి.ఆర్. చట్టం 1949 3. భారతీయ స్టేట్ బ్యాంకు చట్టం 4. భారతీయ స్టేట్ బ్యాంకు యొక్క సహాయకర చట్టం. 5. స్వాధీన పరచుకొనుట మరియు సంస్ధలను బదిలీ చేయు చట్టం 1970 మరియు 1980 |
• ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు | 1. ఆర్.ఆర్.బి. చట్టం 1976 2. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934 3. బి.ఆర్. చట్టం 1949 |
• సహకార బ్యాంకులు | 1. సహకార సంఘాల చట్టం 2. బి.ఆర్.చట్టం 1949 (ఏ.ఏ.సి.ఎస్) 3. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934(షెడ్యూల్డ్ బ్యాంకులకు) |
• సహకార సంఘాలు | 1. రాష్ట్రచట్టం - ఎమ్.ఏ.సి.ఎస్.లాంటిది |
• నమోదు కాబడిన నాన్ బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధలు | 2. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934 3. కంపెనీల చట్టం 1956 |
• నమోదు కాని నాన్ బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధలు | 1. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం (సవరణ చట్టం) 1997 కు ముందుగా ఎఫ్‌ఐ వ్యాపారం చేయుచున్న నాన్‌బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధలు వాటి సిఓఆర్ కోసం పెట్టుకొన్న ధరఖాస్తు ఇంకా బ్యాంకుచే తిరస్కరింపబడలేనటువంటివి 2. కంపెనీస్ చట్టం లోని 25వ సెక్షను. |
• సంఘాలు , ట్రస్టులు మొ|| ఇతర సేవలనందించువారు. | 1. సొసైటీల రిజిష్ట్రేషన్ చట్టం 1960 2. భారతీయ ట్రస్టుల చట్టం 3. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934 లోని అధ్యాయం 3సి 4. రాష్ట్ర మనిలెండర్స్ చట్టం |
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020