వాణిజ్య పత్రం అంటే ఏమిటి
- ప్రామిసరీ నోట్ రూపంలో జారీ అయిన అరక్షిత ద్రవ్య విఫణి సాధనాన్ని వాణిజ్యపత్రం అంటారు.
దీన్ని ఎప్పడు ప్రవేశపెట్టారు?
- మనదేశంలో 1990లో ప్రవేశపెట్టారు.
ఎందుకు ప్రవేశపెట్టారు?
- పెట్టబడిదార్లకు అదనపు సాధనం కల్పించడానికి, అత్యధిక రేటులో ఉన్న కార్పొరేట్ రుణగ్రస్తుల స్వల్పకాల రుణ వనరులను మళ్ళించడానికి 1990లో మన దేశంలో ప్రవేశపెట్టారు. తరువాత ఈ సౌకర్యాన్ని ప్రాధమిక డీలర్లకు కూడా అందించారు.
ఎవరు దీన్ని జారీ చేయవచ్చు?
- కార్పొరేట్లు, ప్రాధమిక డీలర్లు, అఖిలభారత ఆర్థిక సంస్థలు వాప జారీ చేయడానికి అర్హులు.
అందరు కార్పొరేట్లు స్వయం చాలితంగా వాప జారీ చేసే అర్హత పొందుతారా?
పొందరు. కింది లక్షణాలున్న కార్పొరేట్లకు అర్హత లభిస్తుంది.
- ఇటీవల ఆడిట్ అయిన బ్యాలెన్స్ పత్రం ప్రకారం నాలుగు కోట్ల రూ.లను తక్కువ కాని నిశ్చిత (టాంజిబుల్) నికరవిలువ కంపెనీకి ఉండాలి.
- బ్యాంకు (ల) /అఖిలభారత ఆర్థిక సంస్ధ (ల) ద్వారా కంపెనీకి క్రియాశీల పెట్టుబడి మంజూరయి ఉండాలి.
- పెట్టుబడి మంజూరు చేసే బ్యాంకు (లు) / సంస్థ (లు) కంపెనీ రుణగ్రస్తు ఖాతాను ప్రమాణ అస్సెట్‌గా వర్గీకరించి ఉండాలి.
వాప జారీకి రేటింగ్ అవసరం ఉంటుందా? అట్లా ఉంటే రేటింగ్ అవసరం ఏమిటి?
- అవసరమే. అర్హత ఉన్న వారందరూ వాప జారీకోసం పరపతి రేటింగ్ ఎందాలి. దీన్ని భారత పరపతి రేటింగ్ సమాచార సేవాసంస్థ (క్రిసిల్) లేదా పెట్టుబడి సమాచారం, పరపతి రేటింగ్ (ఇక్రా) లేదా పరపతి విశ్లేషణ, పరిశోధన లిమిటెడ్ (కేర్) లేదా దిఫిట్చి రేటింగ్స్ ఇండియా లిమిటెడ్ లేదా ఇతర పరపతి రేటింగ్ ఏజన్సీ (క్రా)ల నుంచి కాలానుగుణంగా ఈ ప్రయోజనం నెరవేరుస్తాయని ఆర్‌బిఐ భావించే సంస్థల నుంచి ఎందవచ్చు. కనీస పరపతి రేటింగ్ క్రిసిల్ కుపి 2గాను లేదా ఇతర ఏజన్సీల సమాన రేటింగ్ గాను ఉండవచ్చు. వాప జారీ చేసే సమయంలో జారీ చేసే వారు గ్రహించిన రేటింగ్ వర్తమానానిదేనని, పునర్విమర్శకు లోను కానిదని, జారీ చేసినవారు జారీ చేసిన పరపతి రేటింగ్ తేదీకి వాప పరిపక్వ తేదీ దాటి ఉండదని నిర్దారించుకొంటారు.
వాప కు గరిష్ఠ, కనిష్ఠ పరిపక్వ వ్యవధి ఎంత?
- జారీ చేసిన తేదీ నుంచి వాప పరిపక్వత కనీసం 15 రోజులు గరిష్ఠంగా ఏడాదిగా ఉంటుంది.
వాప జారీచేసిన పరిధి ఎంత ఉంటుంది?
- సంచాలక మండలి ఆమోదించిన పరిధి లేదా పరపతి రేటింగ్ ఏజన్సీ నిర్దిష్టరేటింగ్‌కు సూచించిన పరిమాణం, ఏది తక్కువయితే దాన్ని పరిధిలోపల జారీదారు వాప కు సరాసరి మొత్తం కు జారీ చేస్తారు. ఆర్థిక సంస్థలకు సంబంధించినంతమటుకు స్థిరీకరించిన మొత్తం ఛత్ర పరిధి లోపల వాప జారీ చేయవచ్చు అంటే వాప జారీ ఇతర సాధనాలతో కూడి ఉంటుంది. టర్మ్ ద్రవ్యరుణాలు, టర్మ్ డిపాజిట్లు డిపాజిట్ ధ్రువపత్రాలు, ఇంటర్ కార్పొరేటట్ డిపాజిట్లు, ఇవన్నీ సంతంగా ఉన్న నిధులలో 100శాతం మించకూడదు. అదీ ఇటీవల ఆడిటయిన బ్యాలెన్స్ పత్రం ప్రకారం.
వాప ఏ సంజ్ఞతో జారీ చేస్తారు?
- రూ.5లక్షలు లేదా రూ. 5 లక్షల బహుళత్వంతో వాప జారీ చేస్తారు.
ఎంత కాలం వాప జారీని బహిరంగంగా ఉంచుతారు?
- జారీదారు జారీని చందాకు తెరిచిన తేదీనుంచి రెండు వారాల వ్యవధిలో ప్రతిపాదిత వాప మొత్తం సమకూర్చు కొంటారు.
ఒకే జారీదారు వాప ను వేర్వేరు తేదీలతో జారీ చేయవచ్చా?
- చేయవచ్చు. ఒకేతేదీన లేదా వేర్వేరు తేదీలలో భాగాలలో విడుదల చేయవచ్చు. అయితే వేర్వేరు తేదీల ప్రతి వాపకు ఒకే పరిపక్వ తేదీ ఉండాలి. నవీకరణతో సహా ప్రతి వాప జారీని తాజా జారీగా పరిగణిస్తారు.
జారీ, చెల్లింపు ఏజెంట్ /(జాచెఏ) గా ఎవరు వ్యవహరిస్తారు?
- వాప జారీకి జారీ చెల్లింపు ఏజెంట్‌గా షెడ్యూల్డ్ బ్యాంకు ఉంటుంది.
వాప లో ఎవరు పెట్టుబడి పెడతారు?
- వ్యక్తులు, బ్యాంకింగ్ కంపెనీలు, ఇతర కార్పొరేట్ సంస్థలు, నమోదయిన లేదా మనదేశంలో ఇన్‌కార్పొరేట్ అయిన కార్పొరేట్ సంస్థలు, ఇన్ కార్పోరేట్ కాని సంస్థలు ప్రవాస భారతీయులు , విదేశీ సంస్థల పెట్టుబడిదార్లు మొ|| వాప లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక పెట్టుబడిదారు పెట్టుబడి మొత్తం అయిదు లక్షల రూ.కు తక్కువగా ఉండకూడదు. ఆర్థిక సంస్థలు మటుకు (ముఖపత్ర విలువ) వారి పరిధులను భారత సెక్యూరిటీల వినిమయమండలి (సెబీ) తో చర్చించి నిర్ణయించుకోవచ్చు.
వాప ను విభౌతిక రూపంలో (డిమెటీరియలైజ్డ్ ఫార్మ్) ఉంచవచ్చా?
- ఉంచవచ్చు. (షెడ్యూల్ 1లో) ప్రామిసరీ నోటు రూపంలో కానీ లేదా సెబీతో నమోదు చేసి ఆమోదం ఎందిన బ్యాంకులు ఎఫ్‌ఐలు, ఎస్‌డితో మొ|| డిపాజిటరీల దగ్గర నిర్దేశించి కేవలం విభౌతిక రూపంలో ఉంచవచ్చు.
వాప ను ఎప్పడూ ముదరా ఇచ్చి జారీ చేస్తారా?
- అవును చేస్తారు. జారీదారు నిర్ధారించినట్లుగా ముఖపత్ర విలువకు ముదరా ఇచ్చి వాప జారీ చేస్తారు.
వాప కు చందాపూచీ (అండర్ రిటన్) ఉంటుందా?
- ఏ జారీదారు వాప ను చందా పూచీ లేదా సహ అంగీకారంతో జారీ చేయరు.
విమోచన విధానం ఏమిటి?
- జారీ చెల్లింపు ఏజెంట్ (జాచెఏ) ద్వారా జారీదారుఖాతాకు వాప కు ఉండే ముదరా విలువ ఖాతాదారు చెల్లింపు చెక్కును క్రాస్ చేసి మొట్టమొదటి వాపాలో పెట్టుబడి పెట్టాలి.
వాప పరిపక్వతకు వచ్చినప్పుడు
- వాప భౌతిక రూపంలో ఉంటే, వాప ఉన్నవారు జారీ చేసినవారికి చెల్లింపుకు సాధనాన్ని జాచెఏ ద్వారా అందజేయాలి.
- డీమాట్ రూపంలో ఉన్న వాప ను, అది ఉన్నవారు డిపాజిటరీ ద్వారా విమోచన చేయించుకోవాలి. జాచెఏ ద్వారానే చెల్లింపు ఎందాలి.
వాప జారీలో బ్యాంకర్లు / ఎఫ్‌ఐలు కట్టుబడి (స్టాండ్‌బై) ఉండే వసతి కల్పిస్తారా?
- వాప అనేది ‘కట్టబడిలేని ఒంటరి’ ఉత్పాదకం కాబట్టి వాప జారీచేసేవారికి బ్యాంకులు, ఎఫ్‌ఐలు ఏ రీతిగాను కట్టుబడి వసతి కల్పించడం జరగదు.
- అయితే వాప జారీలో బ్యాంకులు , ఎఫ్‌ఐలకు కొంత సాగుదల అవకాశం ఉంటుంది. కట్టుబడి సహాయం/ పరపతి వెనక నిలుపుదల వసతి మొ||కల్పించి పరపతి మదింపు చేయవచ్చు. మండలి నిర్దిష్ట ఆమోదంతో పాటు వివేక విధానాలకు (ఫ్రుడెన్షియల్) లోబడి ఉండాలి.
వాప జారీలో పరపతి మదింపుకు బ్యాంకేతర సంస్థలు / కార్పొరేట్ల గ్యారంటీ సమకూర్చవచ్చా?
సమకూర్చవచ్చు. బ్యాంకేతర సంస్థలు కార్పొరేటర్లతో సహా వాప జారీలో పరపతి మదింపుకు ఏ షరతూ లేకుండా రద్దు చేయడానికి వీలులేని గ్యారంటీని ఇవ్వవచ్చు. అయితే అది ఈ లక్షణాలకు లోబడి ఉంటుంది.
- వాప జారీలో నిర్థారిత అర్హత అంశాలను జారీదారు పూర్తి చేసి ఉండాలి.
- పరపతి రేటింగ్ ఏజన్సీ ఆమోదించిన దానికన్నా అధికంగా పరపతి రేటింగ్ లో పూచీదారు (గ్యారంటార్) ఉండాలి.
- వాప ప్రతిపాదన పత్రంలో సముచితంగా ఈ వివరాలు తెలియపరచాలి. పూచీదారు కంపెనీ నికర విలువలు, పూచీదారు ఇటువంటి గ్యారంటీలు సమకూర్చిన ఇతర కంపెనీల పేర్లు, పూచీదారు కంపెనీ సమకూర్చిన పూచీల పరిధి, ఏషరతులలో పూచీ పునరుద్ధరణ జరుగుతుంది మొ||
జారీదారు / జారీచేస్తున్న వారు, చెల్లింపు ఏజంట్ల, పరపతి రేటింగ్ ఏజంట్ల పాత్ర, బాధ్యతలు.
- జారీదారు
- ప్రతి జారీదారు వాప జారీకి జాచెఏ ను నియమించుకోవడం తప్పనిసరి.
- ప్రమాణ విఫణి ఆచరణకు సరిపోలేట్టుగా సమర్ధపెట్టుబడిదార్ల వివరాలను, వారి ఆర్థికస్థితిని జారీదారు వెల్లడించాలి.
- జారీదారుకు, పెట్టుబడిదారు మధ్య వ్యాపారం నిర్దారణ అయితే జారీ చేసే కంపెనీ భౌతిక ధ్రువీకరణలను పెట్టుబడిదారుకు ఇవ్వడమో లేదా డిపాజిటరీతో పెట్టబడిదారు ఖాతా వాప జమ చేసే వీలునో కల్పించాలి.
- పెట్టబడిదార్లకు జాచెఏ ధ్రువీకరణ ప్రతి అందజేయాలి. అందులో జారీదారు జాచెఏ తో చెల్లుబడి అయ్యే ఒప్పందం కలిగి ఉన్నాడని, పత్రాలు సక్రమంగా ఉన్నాయని తెలపాలి.
(షెడ్యూలు 3)- జారీ చెల్లింపు ఏజంట్
- ఆర్‌బిఐ నిర్ధారించిన కనీస పరపతి రేటింగ్ జారీదారుకు ఉండేలా జాచెఏ చూసుకోవాలి. నిర్దిష్ట రేటింగ్ కోసం పరపతి రేటింగ్ ఏజన్సీ సూచించిన మొత్తంలో వాప తరలించేలా చూసుకోవాలి.
- జారీదారు దాఖలు చేసిన అన్ని పత్రాలను జాచెఏ పరిశీలించుకోవాలి. అంటే మండలి తీర్మనాల ప్రతి, (వాప భౌతిక రూపంలో ఉంటే, అధికృత నిర్వాహక దార్ల సంతకాలు, పత్రాలు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరణ, జారీదారుతో మన్నించే ఒప్పందం ఉందన్న ధ్రువీకరణ (షెడ్యూల్ 3)
- జాచెఏ పరిశీలించిన అసలు పత్రాల ధ్రువీకృత ప్రతులను జాచెఏ దగ్గరే సురక్షితంగా భద్రపరచాలి.
పరపతి రేటింగ్ ఏజన్సీ (పరేఏ)
- సెబీ పరేఏ లకు నిర్ధారించిన ప్రవర్తనా నియమావళి ప్రత్యేకించి పెట్టుబడి విఫణి సాధనాల రేటింగ్‌నే వాప రేటింగ్ పరేఏ కూ వర్తిస్తాయి.
- జారీదారు దార్డ్యత భావనమీద ఆధారపడి రేటింగ్ వ్యవధి మన్నిక నిర్ధారణ నిర్ణయం పరేఏ నే తీసుకొంటుంది. ఆవిధంగానే పరేఏ రేటింగ్ సమయంలో రేటింగ్ పునర్విమర్శ చేయాలన్న తేదీని స్పష్టంగా సూచించాలి.
- పరపతి రేటింగ్ వ్యవధి మన్నిక నిర్ణయం పరేఏ తీసుకొన్నా, జారీదార్లకు కేటాయించిన రేటింగ్‌ను సన్నిహిత పరివేక్షణ పరేఏ చేయాలి. అలాగే వారి చరిత్రను క్రమబద్ధంగా వ్యవధానాలతో గమనించాలి. వెబ్‌సైట్, ప్రచురణల ద్వారా పబ్లిక్‌రేటింగ్‌ను సమీక్షించుకోవాలి.
వాప జారీకి ఇతర పత్రాలు మొ|| సమర్పించాల్సిన అవసరం ఉందా?
- భారత స్థిర ఆదాయ ద్రవ్యమార్కెట్, నిష్పన్నాల సంఘం (ఫిమ్మడా) స్వయం క్రమబద్ధసంస్థగా (ఎస్‌ఆర్‌ఓ) స్థిర ఆదాయ ద్రవ్య మార్కెట్ సెక్యురిటీల కోసం ఆర్‌బితో సంప్రదించి పత్రసమర్పణను కార్యకలాప సాగుదల, వాప మార్కెట్ మృదు కార్యాచరణకు ప్రమాణీకృత విధానం అవలంబిస్తుంది.
- జాచెఏ ద్వారా ఆర్‌బిఐ కేంద్ర కార్యాలయం ముంబయిలోని పారిశ్రామిక , ఎగుమతి పరపతి విభాగం (ఐఇసిడి) చీఫ్ జనరల్ మేనేజర్‌కు ప్రతి వాప జారీని జారీ ముగించిన మూడు రోజుల లోగా షెడ్యూల్ 2 ప్రకారం వివరాలను సమకూర్చాలి.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు