অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బ్యాంకింగ్‌ నిర్వహణ మరియు అభివృద్ధి విభాగము

స్వదేశీ డిపాజిట్లు

బ్యాంకులు వడ్డీలని డిపాజిట్లను స్వీకరించవచ్చా?

  • కరెంటు ఖాతా (కరెంటు ఎక్కౌంట్‌) లో తప్ప ఏ ఇతర వడ్డీ లేని డిపాజిట్లను బ్యాంకులు స్వీకరించలేవు.

పొదుపు ఖాతా (సేవింగ్స్‌ ఎక్కౌంటు) పై బ్యాంకులు త్రైమాసిక వడ్డీని చెల్లించవచ్చా?

  • బ్యాంకులు పొదుపు ఖాతాలపై త్రైమాసిక వడ్డీని లేక దీర్ఘ విరామాలకు వడ్డీని చెల్లించవచ్చు.

కాలవ్యవధితో వుండే డిపాజిట్ల (టెర్మ్‌ డిపాజిట్‌) పై బ్యాంకులు నెలవారీ వడ్డీ చెల్లించవచ్చా?

  • కాలవ్యవధితో వుండే డిపాజిట్లపై బ్యాంకులు త్రైమాసిక లేక దీర్ఘ విరామాలకు వడ్డీ చెల్లించవచ్చు.  త్రైమాసిక  వడ్డీని డిస్కౌంటు చేసి బ్యాంకులు నెల నెలా కూడా  చెల్లించవచ్చు .

రూ 15 లక్షలకు మించివుండే కాలవ్యవధితో కూడిన డిపాజిట్లపై బ్యాంకులు తేడాతో వుండే వడ్డీని చెల్లించనచ్చా?

  • కాలవ్యవధితో వుండే ఒకేఒక డిపాజిట్టు రూ 15 లక్షలకు మించి వున్నప్పుడు బ్యాంకులు తేడాతో వుండే వడ్డీని ఇవ్వవచ్చు.  అంతేకానీ, వ్యక్తిగత డిపాజిట్టులన్నీ కలిపి మొత్తం రూ 15 లక్షలు దాటివున్నప్పుడు మాత్రం ఇవ్వరాదు.

డిపాజిట్ల సమీకరణపై బ్యాంకులు కమీషను ఇవ్వవచ్చా?

  • ఒక ప్రత్యేక పధకం ద్వారా ఇంటింటికి తిరిగి డిపాజిట్లు సేకరించడానికి నియమించబడిన ఏజంట్లకు తప్ప, డిపాజిట్లు సేకరించడానికి, డిపాజిట్లతో కూడినవుత్పత్తులను అమ్మడానికి గాను ఏ విధమైన పారితోషికము, రుసుము, కమీషన్‌ చెల్లించే ప్రాతిపదికను ఏ దేనీ వ్యక్తిని, సంస్ధను, సంఘాన్ని, కంపెనీని గానీ బ్యాంకులు నియమించడం నిషేధించబడింది.

తమంతట తాముగా బ్యాంకులు కాలవ్యవధితో కూడుకున్న డిపాజిట్లు పరిపక్వత కాకముందే  తిరిగి చెల్లించవచ్చా?

  • కాలవ్యవధితో కూడుకుని వున్న  డిపాజిట్లు బ్యాంకుకు, వినియోగదార్లకు మధ్య వున్న ఒక ఖచ్చితమైన కాలవ్యవధికి చేసుకున్న  ఒడంబడిక.   బ్యాంకు ఇష్టప్రకారం అట్టి డిపాజిట్టు కాలవ్యవధి ముగియక ముందే చెల్లించడం కుదరదు.  అయితే ఇటువంటి కాలవ్యవధితో కూడిన డిపాజిట్టు వినియోగదారుడు కోరుకుంటే, కాలవ్యవధి ముగియక ముందే బ్యాంకు చెల్లించవచ్చు.

కాలవ్యవధితో కూడుకుని వుండే డిపాజిట్లను అట్టికాలవ్యవధి ముగియక ముందే వుపసంహరించుకోవడాన్ని నిరాకరించవచ్చా?

  • ఒక వ్యక్తి మరియు అవిభక్త హిందు కుటుంబం (హెచ్‌.యు.ఎఫ్‌) యొక్క కాలవ్యవధితో వుండే డిపాజిట్లను వాటి పరిమాణమెంతైనా  కాలవ్యవధి ముగియక ముందె వుపసంహరించుకోవడాన్ని మామూలు పరిస్ధితుల్లో బ్యాంకులు నిరాకరించవు. అయితే బ్యాంకులు ఒక వ్యక్తి మరియు అ.హిం.కు. కాని సంస్ధలు ఏవైనా పెద్ద పరిమాణాలలో వున్న కాలవ్యవధితో వుండే డిపాజిట్ల అపరిపక్వ వుపసంహరణను తమ విశక్షణ ప్రకారం అనుమతింపకపోవచ్చు.    బ్యాంకులు అటువంటి డిపాజిటర్లకు డిపాజిట్టును స్వీకరించెె సమయములోనే బ్యాంకుయొక్క విధానాన్ని తెలియజేయాలి.

కాల వ్యవధి కంటే ముందుగానే వుపసంహరించుకునే డిపాజిట్లపై అపరాధ రుసుమును వసూలుచేయవచ్చా?

  • కాల వ్యవధితో వుండే డిపాజిట్లను కాలవ్యవధికి కాక ముందుగానే వుపసంహరించుకునే పక్షంలో, బ్యాంకులు  వసూలుచేసే అపరాధ రుసుమును తామే విర్ణయించుకునే  స్వేచ్చ కలిగి వున్నాయి.

సెలవు రోజున /వ్యాపారకలాపాలను జరపని రోజున/ ఆదివారాల్లోను పరిపక్వమయ్యే డిపాజిట్లపై వడ్డీని ఏ విధంగా చెల్లించాల్సి వుంటుంది?

  • నిర్ణయించిన కాలవ్యవధి అంతమయ్యే రోజునకు, చెల్లింపుచేసే రోజునకు మధ్యలో సెలవురోజు /ఆదివారం/ పనిచేయనిరోజు వచ్చినట్లయితే ఆ కాలనికి కూడా బ్యాంకులు డిపాజిట్లపై కుదుర్చుకున్న రేటుతో వడ్డీనివ్వాలి. తదుపరి పనిచేయు రోజునాడే డిపాజిట్‌ సమ్మును, వడ్డీని చెల్లించాలి.

తమ మైనరు పిల్లలపై పెట్టిన డిపాజిట్లపై బ్యాంకు సిబ్బందికిచ్చే అదనపు వడ్డీని అట్టి సిబ్బంది చనిపోయినప్పుడు ఆ మైనరు పిల్లలకు ఇవ్వవచ్చా?

  • లేదు. బ్యాంకు సిబ్బందికి/రిటైరైన సిబ్బందికి చెల్లించే అదనపు వడ్డీకి చనిపోయిన బ్యాంకు సిబ్బంది యొక్క పిల్లలు (మైనర్లతో సహా) అర్హులు కారు.

మైనరు పిల్లలకు కోర్టువారు ప్రకటించిన నష్టపరిహారాన్ని, ఆ మైనరు పిల్లలు తండ్రి పేరిట వున్న వుమ్మడి ఖాతాలో జమ చేసివుపడు బ్యాంకు సిబ్బందికిచ్చే అదనపు వడ్డీని చెల్లించవచ్చా?

  • అట్టి సమ్ము ఆ మైనరు పిల్లలకే చెందుతుంది, బ్యాంకు సిబ్బందికి కాదు. కాబట్టి అదనపు వడ్డీ చెల్లించడం కుదరదు.

ఇతర డిపాజిట్లపై బ్యాంకులు భదాత్మక వడ్డీ రేట్లను ఇవ్వడానికి అనుమతింపబడ్డాయా?

  • పరిమాణంతో సంబంధం లేకుండా, సాధారణ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కంటే అధికంగా స్ధిరమైన వడ్డీ రేట్లతో  కూడిన ప్రత్యేక ఫిక్సెడ్‌ డిపాజిట్‌ పథకాలను సీనియర్‌ఒ పౌరుల కొరకు బ్యాంకులు రూఎందించ వచ్చు.

ప్రభుత్వశాఖలు/ ప్రభుత్వపధకాల పేరున బ్యాంకులు ఎదుపు ఖాతాలను తెరవవచ్చునా?

ఈ క్రింద పేర్కొన్న  ప్రభుత్వసంస్ధలు /ఏజన్సీల విషయంలో తప్ప. ఏ ఇతర ప్రభుత్వ శాఖ /ప్రభుత్వ పధకాల పేరిట ప్రభుత్వ శాఖ తెరవడానికి వీలులేదు

  • బ్యాంకు ద్వారా ఆర్ధిక సౌకర్యాన్ని ఎందుతున్న ప్రాధమిక సహకార పరపతి సంఘం
  • ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలులు,
  • వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ కమిటీలు,
  • ససైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం 1860 లేక ఏ దేని రాష్టం లేదా  కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలులొ వున్న తత్సమానమైన చట్టాల పరిధిలో నమోదైన సంఘాలు.
  • కంపెనీల చట్టం 1956 లోని సెక్షను 25  క్రింద కేంద్ర ప్రభుత్వముచే అనుమతివ్వబడి, ఆల చట్టపు నియంత్రణలో వున్న కంపెనీలు లేదా కంపెనీల చట్టం 1913 లోని తత్సమానమైన అంశాల క్రింద అనుమతింపబడి వాటిపేరు చివర లిమిటెడ్‌ లేక పై#్రవేటు లిమిటెడ్‌ అన్న పదాలు జతచేయకుండా వున్న కంపెనీలు.
  • వాటి ఆదాయము మొత్తము  ఆదాయపు పన్ను చట్టం 1961 నుండి మినహాయింప బడి, క్లాజ్‌ (1) లో పేర్కొన బడని సంస్ధలు.
  • సంబంధిత ప్రభుత్వ శాఖలనుండి ఎదుపు ఖాతా తెరవడానికై అనుమతి పత్రం సమర్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో  వివిధ కార్యక్రమాలు/పధకాల అమలుకు సంబంధించిన గ్రాంటులు/సబ్సిడీలు నిర్వహించడం కోసం ప్రభుత్వ శాఖలు, సంస్ధలు మరియు ఏజన్సీలు.
  • గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ, శిశు సంక్షేమము, అభివృధ్ది (డ్వాక్రా), తమ సభ్యులలో ఎదుపు చేసే అలవాటును ప్రోత్సహించడంలో నిమగ్నమవుతూ వున్ననమోదు అయిన, నమోదు కాని స్వయం సహాయక బృందాలు (ఎస్‌.హెచ్‌.జి)
  • రైతుల క్లబ్బులు - స్వశ్చంద వికాస వాహిని (వి.వి.వి)

(అ) చనిపోయిన వ్యక్తి పేరిట వున్న లేదా ఇద్దరు లేదా అంతకన్న ఎక్కువమంది పేర ఉమ్మడిగా (జాయింట్‌) (టర్మ్‌) కాల వ్యవధి డిపాజిట్లు ఉన్నప్పుడు వారిలో ఒకరు చనిపోయిన ఆ డిపాజిట్లపై పరిపక్వత తరువాత చెల్లించవలసిన వడ్డీ రేటు విషయం ఆయా బ్యాంకుల విశక్షణకు వదిలవేయడమైనది.  అయితే ఆ బ్యాంకుల యొక్క బోర్డులు దీనికి సంబంధించి పారదర్శకమైన విధానాన్ని రూఎందించాలి.

చనిపోయిన వ్యక్తిగత డిపాజిటరు పేరిట లేదా ఏక స్వామ్య సంస్ధ పేరిట వున్న కరెంటు ఖాతాలో నిలువ వున్న సమ్ముపై మే 1, 1983 నుండి కానీ, డిపాజిటరు చనిపోయిన తేదీనుండి గానీ (ఏది తర్వాత జరిగితే ఆది) డిపాజిట్‌ తిరిగి చెల్లించే నాటికి అమలులో వున్న ఎదుపు ఖాతాకు వర్తించే వడ్డీ రేటును ఆయా క్లయిము దారులకు చెల్లించవలెను.

ఎన్‌.ఆర్‌.ఐ. డిపాజిట్ల విషయంలో క్లైము దారు భారతనివాసి అయితే పరిపక్వత చెందిన తర్వాత ఆ డిపాజిట్లను స్వదైశీ రూపాయిల ఖాతాగా పరిగణిస్తూ దానిపై వడ్డీని తత్సమానమైన పరిపక్వత చెందిన స్వదేశీ డిపాజిట్లకు అన్వయించే రేట్లకే చెల్లిస్తారు.

గడువు దాటిపోయిన డిపాజిట్లను పునరుధ్దరించుటకు (రిన్యువల్‌) పాటించ వలసిన మార్గదర్శక సూత్రాలేమిటి?

  • గడువు దాటిపోయిన డిపాజిట్ల పునరుధ్దరణకు సంబంధించి బ్యాంకు బోర్జులు పారదర్శకమైన విధానాలను రూఎందించాలి.   డిపాజిట్లు స్వీకరించే సమయంలోనే పునరుధ్దరణ మరియు వడ్డీ రేట్లతో సహా దీనికి సంబంధించిన విధి విధానాలను వినియోగదారులకు తెలియజేయాలి.  ఈ విధానం విశక్షణారహితంగాను, వివక్ష రహితంగాను వుండాలి.

ప్రవాస భారతీయుల (ఎన్‌.ఆర్‌.ఐ)డిపాజిట్లు

ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ (బి) డిపాజిట్లపై తీసుకునే ఋణాలను తిరిగి విదేశీ ద్రవ్యంలో చెల్లించినపుడు వడ్డీ రేట్లలో రాయితీనివ్వడం వర్తిస్తుందా?

  • తిరిగి చేసే చెల్లింపు రూపాయలలో వుందా లేక విదేశీ కరెన్సీలో వుందా అనే విషయంతోనూ, బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌ఒ రేట్‌ (బి.పి.ఎల్‌.ఆర్‌) తోనూ సంబంధం లేకుండా డిపాజిటర్లుకు ఎఫి.సి.ఎన్‌.ఆర్‌.(బి) డాపాజిట్లపై ఇచ్చే ఋణాలకు వసూలుచేసే వడ్డీరేటును బ్యాంకులు నిర్ణయించే స్వతంత్రత కలిగివున్నాయి.

ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) పధకం క్రింద బ్యాంకులు రికరింగ్‌  డిపాజిట్లను స్వీకరించవచ్చా?

  • ఫి.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) పధకం క్రింద బ్యాంకులు రికరింగ్‌  డిపాజిట్లను స్వీకరించరాదు.

ఎన్‌.ఆర్‌.ఇ మరియు ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) డిపాజిట్లపై వడ్డీరేటును ఎవరు నిర్ణయిస్తారు?

  • అటువంటి డిపాజిట్లపై వడ్డీ రేటును విర్ణయించడానికి బ్యాంకు డైరెక్టర్ల బోర్డ్‌ తమకున్న అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించిన పరిమితుల మేరకు ఎసెట్‌ -- లయబిలిటీ మేనేజ్‌ మెంటు కమిటీకి ఆధికారమివ్వవచ్చు.

బ్యాంకులు ఎన్‌.ఆర్‌.ఇ/ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) డిపాజిట్లపై భేధాత్మక రేట్లతో వడ్డీనివ్వవచ్చా?

  • అవును. ఇవ్వవచ్చు. ఎన్‌.ఆర్‌.ఇ.టెర్మ్‌ డిపాజిట్లపై రు|| 15 లక్షలు ఆపైబడివుండే స్వదేశీ టెర్మ్‌ డిపాజిట్ల మాదిరిగా, పరిమితులకు లోబడి. బ్యాంకులు వడ్డీని తేడావుండే రేట్లతో ఇవ్వవచ్చు.  ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) డిపాజిట్లకు సంబంధించి వివిధ కరెన్సీల విషయంలో కనీస మొత్తాలను నిర్ణయించడానికి తేడాతో వుండే వడ్డీ రేట్లను నిర్ణయించుకోవడానికి, మొత్తం మీద నిర్దేశించిన పరిమితులకు లోబడి వుండే విధంగా బ్యాంకులు ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

తిరిగి పెట్టుబడి (రి-ఇన్వెస్టుమెంటు) డిపాజిట్‌  అంటే ఏమిటి?

  • తిరిగి పెట్టుబడి (రి-ఇన్వెస్టుమెంటు) పెట్టే డిపాజిట్‌ అనగా, దానిపై వచ్చే వడ్డీని తిరిగి అసలు సమ్ముతో పాటుగా, ఒప్పుకున్నరేటుతో, పరిపక్వత ఎందే తేదీవరకూ కొనసాగించి   ఆటుతర్వాత కూడా మొత్తం వడ్డీ మరియు అసలు సమ్ముతో సహా పరిపక్వత చెందిన తేదీనాడు  విత్‌ డ్రా చేసుకోవడానికి వీలైన డిపాజిట్‌. ఇది స్వదేశీ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.

ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) డిపాజిట్ల గడువు దాటిపోయిన తర్వాత కూడా గతాన్నించి వర్తించే విధంగా అనగా పరిపక్వత చెందిన తేదీనుండి పునరుద్ధరణ (రిన్యువల్‌) చేసుకోవచ్చా?   అయినచో, ఇవ్వగలిగే వడ్డీ రేటెంత?

  • అవును. చేసుకోవచ్చు. తమ విశక్షణాధికారాన్ని వుపయోగించి, బ్యాంకులు కాలం చెల్లిపోయిన ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) డిపాజిట్లను పూర్తిగా కానీ లేక పాక్షికంగా గానీ పునరుద్ధరీకరణ చేయవచ్చు.   అయితే మామూలుగా డిపాజిట్టు పరిపక్వత ఎందిన తేదీకి, పునరుద్ధరీకరణ చేసుకునే తేదీకి(రెండు రోజులు కలుపుకుని) మధ్యలో వ్యవధి  14 రోజులకు మించిరాదు. ఆ విధంగా పునరుద్ధీరీకరణ చేయబడిన డిపాజిట్‌ పై, పరిపక్వత తేదీ నాటికి ఆచరణలో వున్న వడ్డీ రేటు ప్రకారంగా గాని, పునరుద్ధరీకరణ తేదీ నాడు వుండే రేటు ప్రకారం గాని, ఏది తక్కువైతే ఆ రేటుతో వడ్డీ చెల్లిస్తారు.
  • పరిపక్వత తరువాత 14 రోజులు మించిన డిపాజిట్లను  అప్పటికి అమలులో వున్న రేటు ప్రకారం పునరుద్ధరీకరణ చేసుకోవచ్చు.  ఒకవేళ డిపాజిటరు మొత్తం కాలవ్యవధి దాటిపోయిన డిపాజిట్టు సమ్మును పూర్తిగా   గానీ  పాక్షికంగా కానీ తిరిగి  ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ (బి) డిపాజిట్టుగా పెట్టుకో దలిస్తే, ఆవిధంగా పెట్టిన కొత్త డిపాజిట్టుపై బ్యాంకులు పరిపక్వత చెందిన తరువాత కాలానికి తాము నిర్ణయించిన రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తాయి.   పునరుద్ధరీకరణ చేసిన తర్వాత, ఈ పధకం క్రింద నిర్ణయించబడినకనీస కాలవ్యవధి వూర్తికాకముందే డిపాజిట్టును వుపసంహరించుకున్నట్లయితే, పరిపక్లత చెందిన తర్వాత కాలానికి ఇచ్చిన వడ్డీని తిరిగీ తీసుకోవడానికి బ్యాంకులు స్వేచ్ఛ వుంది.

ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) పధకం క్రింద ఇచ్చిన రూపాయి ఋణాలపై విధించే వడ్జీ రేటు నిబంధనలు విదేశీ కరెన్సీలో ఇచ్చిన ఋణాలకు కూడా వర్తిస్తాయా?

  • లేదు.  వర్తించవు.   ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ (బి) పధకం క్రింద ఇచ్చిన రూపాయి ఋణాలపై విధించే వడ్డీ రేటు నిబంధలను విదేశీ కరెన్సీలో ఇచ్చిన ఋణాలకు వర్తించవు. ఈ ఋణాలు భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క విదేశీ మారకద్రవ్య విభాగం వారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం వుంటాయి.

ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ (బి) డిపాజిట్ల విషయంలో ప్రకటించబడిన రేట్ల కంటే ఎక్కువగా అదనపు వడ్డీ ఏ పరిస్ధితుల్లో ఇవ్వవచ్చు?

ఈ క్రింద పేర్కొన్న పేరుతో స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి

  • బ్యాంకు సభ్యుడు లేక బ్యాంకు యొక్క రిటైరైన సభ్యుడు (బ్యాంకు సిబ్బందిలో ఒకరు) ఒంటరిగా, లేక ఉమ్మడిగా వేరే సభ్యునితో గానీ లేక అతని/అమె కుటుంబ సభ్యులతో గానీ, లేక
  • చనిపోయిన బ్యాంకు వుద్యోగీ లేక రిటైరైన వుద్యోగి యొక్క భార్య లేక భర్త మొత్తం మీద ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ఒ (బి) డిపాజిట్లకు నిర్దేశించిన వడ్డీ రేట్ల పరిమితికి లోబడివున్నంత వరకూ   మామూలుగా వర్తించే వడ్డీ రేట్లకు  అదనంగా ఒక శాతం  మించకుండా, ఎక్కువగా వడ్డీనివ్వడానికి బ్యాంకుకు విచక్షణాధికారం వుంది.  అయితే
  • ఉమ్మడి ఖాతాలో వుండే డిపాజిట్‌ దారు/లు భారత జాతికి లేక సంతతికి చెందిన భారతదేశపు ప్రవాసి/nలు అయినప్పుడు, మరియు
  • బ్యాంకు సంబంధిత డిపాజిటరు వద్దనుండి ఆవిధంగా డిపాజిట్టు చేసిన సమ్ములు లేక కాలానుగుణంగా డిపాజిట్టు చేయబడేవి, పైన క్లాజు (ఆ) మరియు (ఆ) లో చెప్పబడినట్టుగా డిపాజిటరుకే చెందినవని  ఒక లిఖిత పూర్వకమైన ప్రకటన (డిక్లరేషను) తీసుకొనవలెను.
  • వివరణ  ‘కుటుంబం’ అన్న మాటలోని అర్ధం న్యాయబధ్దంగా విడిపోయిన భర్త /భార్య తప్ప. బ్యాంకు వుద్యోగీ/రిటైరైన వుద్యోగి వారి భార్య లేక భర్త, పిల్లలు, తలిదండ్రులు, వారిపై ఆధారపడిన అన్నదమ్ములు మరిటు అక్కచెల్లిళ్లు.

దివంగత డిపాజిటరు యొక్క ఎన్‌.ఆర్‌.ఇ/ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌ (బి) విషయంలో అటువంటి డిపాజిట్టును వారసులు నిర్దేశంచిన కనీస కాలవ్యవధి కంటే ముందే, పరిపక్వత చెందకనే విత్‌ డ్రా చేసుకున్నప్పుడు, ఏమైనా వడ్డీ చెల్లించాల్సి వుంటుందా?

లేదు. చెల్లించనక్కరలేదు. ఎఫి.సి.ఎన్‌.ఆర్‌.(బి)/ఎన్‌.ఆర్‌.ఇ. డిపాజిట్ల విషయంలో, వడ్డీని ఎందాలంటె ఆ డిపాజిట్లకు నిర్ణయించిన కనీస కాలవ్యవధి ఒక సంవత్సరం పూర్తవ్వాలి.

బ్యాంకులు ఎన్‌.ఆర్‌.ఇ/ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌(బి) డిపాజిట్లపై శని, ఆదివారాలు మరియు శలవు రోజులు పరిపక్వత ఎందిన మరియు చెల్లింపుచేసే తేదీ మధ్య వచ్చినట్లయితే  ఆ రోజులకు వడ్డీనివ్వాలా?

  • అవును.   ఇవ్వాలి. గడువుతేదీ నుండి చెల్లింపుచేసే తేదీకి మధ్యలో వచ్చే కాలవ్యవధికి కూడా, డిపాజిటర్లు వడ్డీ నష్టాన్ని ఎందకుండా వుండేందుకు, గడువు తేదీలు శని, ఆదివారాల్లో లెక పనిచేయని రోజుల్లోనూ వచ్చినట్లయితే ఎన్‌.ఆర్‌.ఇ/ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ (బి)  డిపాజిట్లపై  అట్టి కాలానికి వడ్డీనివ్వడానికి బ్యాంకులు అనుమతింప బడ్డాయి.

అడ్వాన్సులు

అప్పులిచ్చే రేట్ల విధానంలొ ’స్వేచ్చ’ అనే మాటకు అర్ధం ఏమిటి?

  • రూ|| 2 లక్షలకు మించివున్న పరపతి కాలపరిమతులపై బ్యాంకులు బెంచ్‌ మార్క్‌ పై#్రమ్‌ లెండింగ్‌ రేట్లను  (బి.పి.ఎల్‌.ఆర్‌), సంబంధిత బ్యాంకు బోర్డ్‌ల అనుమతి తో నిర్ణయించడానికి స్వేచ్చ కలిగి వున్నాయి.  బి.పి.ఎల్‌.ఆర్‌  ప్రకటింపబడి, అన్ని బ్యాంకు శాఖలలోను ఒకే మాదిరిగా వుండేటట్లు వర్తింపచేయాలి. బ్యాంకులు తమ ఎస్సెట్‌-లయబిలిటీ మేనేజ్మెంటు కమిటీ (ఆల్కో)ను డిపాజట్లు మరియు ఋణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించమని ఆధికారమివ్వవచ్చు.  అయితే  ఆ నిర్ణయాన్ని వెంటనే తమ సంబంధిత బోర్డులకు తెలియ పరచాలి.   అన్ని రకాల అడ్వాన్సులపై బి.పి.ఎల్‌.ఆర్‌. తో అత్యధిక విస్తృతి (స్ప్రెడ్‌ ఓవరు)ని ఆల్కో/బోర్డుల అనుమతితో బ్యాంకులు ప్రకటించాలి.

(అ)మధ్యవర్తిత్వ (ఇంటర్మీడియరీ) ఏజన్సీలు అంటే ఏమిటి?

(అ) ‘గృహ నిర్మాణానికి ఆర్ధిక సహాయాన్నందించేందుకు మధ్యవర్తిత్వం చేసే ఏజన్సీలు’ అంటే ఏమిటి?

మధ్యవర్తిత్వ ఏజన్సీల వివరణాత్మకమైన జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.

  • బలహీన వర్గాలకు ఋణాలిచ్చేందుకు ప్రభుత్వముచే మద్దతీయబడిన సంస్ధలు.
  • వ్యవసాయ వుత్పాదకతలను/పనిముట్లను పంపిణీ చేయు వారు.
  • బలహీన వర్గాలకు ఋణాలను అందించే పరిధి వరకూ రాష్ట్ర ఆర్ధిక సంస్ధలు (ఎస్‌.ఎఫ్‌ి.సి.లు)/రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్ధలు (సిడ్కో).
  • జాతీయ లఘు పరిశ్రమల సంస్ధ (ఎన్‌.ఎస్‌.ఐ.సి)
  • ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషను (కె.వి.ఐ.సి),
  • వికేంద్రీకరణ చేయబడిన రంగాలకు చేయూతనివ్వడంలో నిమగ్నమైన ఏజన్సీలు,
  • గృహ వసతి మరియు పట్టణ అభివృద్ధి సంస్ధ (హడ్కో),
  • జాతీయ గృహనిర్మాణ బ్యాంకు (ఎన్‌.హెచ్‌.బి) వారిచే అనుమతింప బడిన గృహ నిర్మాణ ఆర్ధిక కంపెనీలు.
  • ప్రభుత్వం ద్వారా మద్దతీయబడిన షెడ్యూల్డ్‌ కులాలు/షెడ్యూల్డ్‌ తెగల కొరకు పనిచేస్తున్న సంస్ధలు (ఉత్పాదకాలను అందచేయడానికి మరియు/లేక ఈ సంస్ధలయొక్క లబ్దిదారుల వుత్పత్తులను మార్కెట్టు చేయడానికి).
  • స్వయం సహాయక బృందాలు (ఎస్‌.హెచ్‌.జి)లకు ఋణాలివ్వడం కొరకు పనిచేస్తున్న సూక్ష్మ ఆర్ధిక సహాయాన్నందించే సంస్ధలు/ప్రభుత్వేతర స్వశ్చంద సంస్ధలు (ఎన్‌.జి.ఓ.లు),

ప్రాధాన్యతారంగంలోని (ప్రయారిటీ సెక్టార్‌) బలహీన వర్గాలలో ఈ క్రింద సూచించినవి మిళితమై వున్నాయి.

  • చిన్న మరియు నామ మాత్రపు, 5 ఎకరాలు అంతకంటే తక్కువ భూములు కలిగివున్న రైతులు, భూమిలేని కూలీలు, కౌలుదారులు మరియు పంటలను భాగం తీసుకునే వారు.
  • వ్యక్తిగత ఋణాలు రూ|| 25,000/-  మించకుండా వున్నటువంటి చేతి వృత్తుల వారు, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలు,
  • చిన్న మరియు సన్నకారు రైతులు, పంటలలో భాగం పంచుకునే వారు, వ్యవసాయ మరియు వ్యవసాయేతర కూలీలు, గ్రామీణ చేతివృత్తుల వారు, దారిద్ర్య రేఖకు దిగువన వుండే కుటుంబాల వారు, లబ్దిదారులు. ఆట్టవారి అకుటుంబ సంపాదన సంవత్సరానికి రు||లు 11,000/- మించరాదు.
  • షెడ్యూల్డ్‌ కులాలు మరియు షెడ్యూల్డ్‌ తెగలు.
  • లబ్దిదారులు అంటే అన్ని ఆధారాలనుండి, పట్టణ మరియు పూర్తిగా పట్టణ ప్రాంతం కాని ప్రాంతాలలో ఎందే కుటుంబ వార్షిక ఆదాయం రూ||లు 72,000/- లేక పల్లె ప్రాంతాల్లొ రూ||లు. 64,000/- మించని వారు.     వారు ఏవిధమైన భూమి కలిగి వుండరాదు, అలాగే వారివద్ద సాగుచేసే భూమి అయితే ఒక ఎకరానికి మించకూడదు, మరియు సాగుకు పనికిరాని భూమి అయితే 2.5 ఎకరాలు మించకూడదు (షె.కు/షె.తె. ల విషయంలో ఈ నియమం వర్తించదు).
  • విముక్తి మరియు పునరావాస పధకం ద్వారా  లబ్ది ఎందిన పారిశుధ్య పనివారు.
  • గ్రామీణ బడుగు వర్గాలను ఆదుకోవడానికి స్వయం సహాయక బృందాలకు (ఎస్‌.హెచ్‌.జి.) ఇచ్చిన అడ్వాన్సులు.

బ్యాంకులు వారి బి.పి.ఎల్‌.ఆర్‌.తో నిమిత్తంలేకుండా వడ్డీ రేటును వసూలు చేయవచ్చా?

అవును. చేయవచ్చు. బ్యాంకులు వారి బి.పి.ఎల్‌.ఆర్‌.ను పరిగణనలోనికి తీసుకోకుండా వడ్డీరేట్లను నిర్ణయించే స్వతంత్రత కలిగి వున్నాయి.   అలాగే, ఈ క్రింద సూచించిన ఋణాల విషయంలో వాటి పరిమాణంతో నిమిత్తం లేకుండా వినియోగదారులు వాడకం వస్తువులను కొనుక్కోవడానికి ఇచ్చే ఋణాలు,

  • షేర్లు/ బాండ్లు/ డిబెంచర్లకు పై వ్యక్తిగత ఋణాలు.
  • ప్రాధాన్యతా రంగానికి చెందని ఇతర వ్యక్తిగత ఋణాలు.
  • అడ్వాన్సులు/ఓవర్‌  డ్రాఫ్టులు.  డిపాజిట్లు    ఋణగ్రహీత/ లు పేరునవుండి, లేక కేవలం ఋణగ్రహీత పేరునే వుండి వున్నప్పుడు లేక ఋణగ్రహీత ఇతర వ్యక్తులతో కలిసి ఉమ్మడిగా వున్నప్పుడు బ్యాంకులలో వుండే అట్టి  స్వదేశీ /ఎన్‌.ఆర్‌.ఇ./ ఎఫి.సి.ఎన్‌.ఆర్‌ (బి) డిపాజిట్లపై ఇచ్చే వ్యక్తిగత ఋణాలు.
  • అంతిమ లబ్దిదారులకు ఉత్పాదకాలను సమకూర్చే ఏజన్సీలకుఋణసహాయం అందించడానికి ఆర్ధిక సహాయం (గృహవసతికి మినహా) అందించే  మధ్యవర్తిత్వ ఏజన్సీలకు ఇచ్చిన  ఋణాలు.
  • అంతిమ లబ్దిదారులకు ఋణాలివ్వడానికి గాను గృహవసతికై ఆర్ధిక సహాయం అందజేసే మధ్యవర్తి ఏజన్సీలకు
  • బిల్లుల డిస్కౌంటింగు కొరకు,
  • సరుకులపై ఎంపికచెయబడిన పరపతి నియంత్రణ  (సెలెక్టివ్‌ క్రెడిట్‌ కంట్రోల్‌) విధానాలకు లోబడి ఇచ్చే ఋణాలు/  అడ్వాన్సులు /నగదు పరపతి/ ఓవర్‌ డ్రాఫ్టులు.
  • వ్యవధితో కూడుకున్న ఋణాలిచ్చే సంస్ధలయొక్క వడ్డీతో తిరిగి ఆర్ధికసహాయాన్ని కలుగచేసే పధకాల్లో పాల్గొనడంలో కవరు చేయబడ్డ ఋణాలు.
  • బి.పి.ఎల్‌.ఆర్‌.తో సంబంధం లేకుండా తిరిగి ఆర్ధిక సహాయాన్నందించే ఏజన్సీల యొక్క నిబంధనలననుసరించి, ఛార్జిలను వసూలుచేయడంలో బ్యాంకులు స్వేఛ్చ కలగి వున్నాయి.

బహువిధ బి.పి.ఎల్‌.ఆర్‌.లను కలిగివుండడం బ్యాంకులకు సబబేనా?

  • కాదు.   బహుముఖ బి.పి.ఎల్‌.ఆర్‌. అవసరంలేదు.  ఎందుకంటే, అన్ని ఋణాల రేట్లను బెంచిమార్కు పి.ఎల్‌.ఆర్‌ లను పరిగణనలోనికి తీసుకుని నిర్ణయించవచ్చు, వ్యవధితో కూడుకుని వున్న ప్రీమియాలు (టెర్మ్‌ ప్రీమియాలు) మరియు /ndలేక రిస్కు ప్రీమియాలను లెక్కలోకి తీసుకున్నప్పుడు.    ఈ ప్రీమియాలను విస్తృతి (స్ప్రెడ్‌ ఓవర్‌) లో ఒక గుణకంగా (ఫ్యాక్టరైజ్డ్‌) తీసుకోవచ్చు లేకపోతే బి.పి.ఎల్‌.ఆర్‌ కు దిగువగా కూడా తీసుకోవచ్చు.

ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం   చేసే  ఉద్దేశ్యంతో కాకుండా, మిగతా వాటి విషయంలో బ్యాంకులు స్ధిరమైన రేట్లతో (ఫిక్సెడ్‌ రేట్సు) వుండే ఋణాలను మంజూరు చేయవచ్చా?

  • బ్యాంకులు ఎసెట్‌ - లయబిలిటీ మేనేజ్మెంట్‌ కమిటీ యొక్క మార్గదర్శక సూత్రాలకు లోబడి  అన్ని ఋణాలను స్ధిరంగా మరియూ మారుతూ వుండే రేట్లతో మంజూరుచేసే స్వతంత్రత కలిగి వున్నాయి.

ప్రస్తుతం వున్న అడ్వాన్సులకు సవరించబడిన బి.పి.ఎల్‌.ఆర్‌ లు వర్తిస్తాయా?

  • అవును.  వర్తిస్తాయి. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన ఆదేశాలకనుగుణంగా, స్ధిరమైన రేటు (ఫిక్సెడ్‌ రేట్‌) ఋణాల విషయం  లో మినహాయించి, బ్యాంకులు అన్ని అడ్వాన్సుల విషయంలోనూ - వ్యవధితో (టెర్మ్‌) కూడుకున్న ఋణాలతో సహా వర్తించే రేట్లను వసూలుచేయడానికి వీలుగా ఋణ ఒడంబడిక (లోన్‌ అగ్రిమెంట్‌) లో  తప్పనిసరిగా ఈ క్రింది అంశాలను వుటంకించాలి  ''అయితే, ఋణగ్రహీత కట్టవలసిన వడ్డీ రేటు భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లలో చేసే మార్పునకనుగుణంగా వుంటుంది.”

రూ||లు 2 లక్షలకు మించివుండే ఋణాలపై బ్యాంకులు బి.పి.ఎల్‌.ఆర్‌. కంటే తక్కువగా వడ్డీని వసూలు చేయవచ్చా?

  • అవును. చేయవచ్చు. ప్రస్తుతం, రూ||లు 2 లక్షల వరకూవుండే ఋణాలపై బి.పి.ఎల్‌.ఆర్‌. నిర్దేశించిన దాని కంటే మించి వుండకూడదు, మరియు రూ||లు 2 లక్షలకు మించివుండే ఋణాలపై బ్యాంకులు బి.పి.ఎల్‌.ఆర్‌. మరియు స్ప్రెడ్‌ మార్గదర్శక సూత్రాలకు లోబడి వడ్డీ రేటును తమ విచక్షణనుపయోగించి నిర్ణయించే స్వతంత్రత కలిగి వున్నాయి.
  • అంతర్జాతీయ పధ్దతులను దృష్టిలో వుంచుకుని, ఆలాగే వాణిజ్య బ్యాంకులు ఋణాల రేట్లను నిర్ణయించడంలో సరళమైన వ్వవహార శైలిని కలుగచేయడానికి,
  • సంబంధిత బోర్డులు పారదర్శకత తోనూ మరియు దూరదృష్టితోనూ అనుమతించిన విధానాల ప్రాతిపదికపై ఎగుమతి దార్లకు, నమ్మకస్తులైన ఋణగ్రహీతలకు, ప్రభుత్వ పరిశ్రమలకు బ్యాంకులు బి.పి.ఎల్‌.ఆర్‌. కంటే తక్కువగా ఋణాలనివ్వవచ్చు.

ప్రముఖ బ్యాంకు రేటుతో పోల్చతగినట్లు వుండడానికి ఆర్ధిక సంస్ధల/పెట్టుబడిదారుల సహవ్యవస్ధ (కన్సార్టియమ్‌) ఏర్పాటుతో, బ్యాంకులు తాము ప్రకటించిన బి.పి.ఎల్‌.ఆర్‌. కంటే తక్కువ వడ్డీని వసూలు చేయడానికి అనుమతింప బడ్డాయా?

  • లేదు.  అనుమతింప బడలేదు.  ఆర్ధిక సంస్ధల/పెట్టుబడిదారుల సహవ్యవస్ధ (కన్సార్టియమ్‌) ఏర్పాటు క్రింద కూడా బ్యాంకులు ఒకే మాదిరి రేటును వసూలు చేయాల్సిన అవసరం  లేదు.   బి.పి.ఎల్‌. ఆర్‌. కు లోబడి వుండేటట్లుగా ప్రతి బ్యాంకు  ఋణంలో తమ వంతు మొత్తానికి నిర్ణయించిన వడ్డీ రేటును వసూలు చేయవచ్చు.

అపరాధ  రుసుము తో వసూలుచేసే వడ్డీ రేటు ఎంత వుండాలి?

  • అక్టోబరు 10, 2000 తేదీ నుండి బ్యాంకులు వారి  డైరెక్టర్ల బోర్డు అనుమతితో.     అపరాధ రుసుము తో వడ్డీని వసూలుచేసే విషయంలో పారదర్శకతతో కూడిన  విధానాన్ని  రూఎందించడంలో స్వేఛ్చ నివ్వబడ్డాయి. అయితే, ప్రాధాన్యతా రంగాలలో, ఋణగ్రహీతలకిచ్చే ఋణాల విషయంలో రూ||లు 25,000/- వరకూ వడ్డిపై అపరాధ రుసుమును వసూలు చేయకూడదు. వడ్డిపై అపరాధ రుసుమును, చెల్లింపును ఎగవేయడం, ఆర్ధిక విషయాలను (ఫైనాన్షియల్‌ స్టేట్‌ మెంట్సు) సమర్పించక పోవడం మొదలగు కారణాలపై విధించవచ్చును.   అయితే, ఈవిధంగా వడ్డీకై అపరాధ రుసుము విధించడాన్ని, దాని విధానం, అన్నవిషయాలు సర్వదా అభిలషణీయమైన పారదర్శకతా, స్వశ్చతా, సేవలకు ఇచ్చే ప్రోత్సాహం, ఋణగ్రహీతల అప్పులు మరియు నమ్మశక్యమైన బాధలు అన్న ప్రాతిపదిక సూత్రాలపై ఆధారపడి నియంత్రించ బడాలి.

రూ||లు 2 లక్షలకు పైబడివుండే ఋణాలపై వడ్డీ రేట్లను క్రమబధ్దం చేయడాన్ని 18-10-1994 నుండి రద్దు చేసిన దరిమిలా, ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే ఋణాలపై  బ్యాంకులు డి.ఐ.సి.జి.సి. హామీ (గ్యారంటీ) రుసుమును చెల్లించాలా?

  • డి.ఐ.సి.జి.సి. హామీ రుసుము (గ్యారంటీ ఫీజు) విషయానికి సంబంధించి, బ్యాంకులు రూ||లు 25,000/- మించిన అడ్వాన్సుల విషయంలో దానిని ఋణగ్రహీత చెల్లించాలా (బలహీన వర్గాలకిచ్చిన అడ్వాన్సుల మినహా) అన్న విషయం బ్యాంకు విచక్షణకే వదలి వేయబడింది. రూ||ల 25,000 వరకూ బలహీన వర్గాలకిచ్చిన అన్ని అడ్వాన్సులపై డి.ఐ.సి.జి.సి. హామీ రుసుము (గ్యారంటీ ఫీజును బ్యాంకులే భరించాలి.

ఋణాలపైనా, అడ్వాన్సులపైనా నెల నుండి ఏడాది మధ్య వివిధ వ్యవధులకు  వడ్డీని వసూలు చేయవచ్చా?

  • ప్రస్తుతం వున్న పధ్దతే కొనసాగుతున్న చోట ఏప్రిల్‌ 1, 2002 నుండి బ్యాంకులు  ఋణాలు, అడ్వాన్సులపై వడ్డీని నెలవారీగా వసూలు చేస్తూ వున్నాయి, (ఒక్క  వ్యవసాయ రంగ ఋణాలపై తప్ప)    తక్కువ వ్యవధితో వుండే ఋణాలు, మరియు తత్సంబంధిత  కార్యక్రమాలతో సహా .

బ్యాంకు సిబ్బంది లేక సహకార పరపతి సంఘాల సిబ్బందికి ఇచ్చే ఋణాలపై /అడ్వాన్సుల పై వసూలు చేసే వడ్డీ రేటు ఎంత?

  • బ్యాంకులిచ్చే అడ్వాన్సులపై వసూలు చేసే వడ్డీకి సంబంధించిన నిబంధనలు ఏదేనీ షెడ్యూల్డ్‌ బ్యాంకు ద్వారా వాటిల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే ఋణాలూ, అడ్వాన్సులూ మరే ఇతర ఆర్ధిక సౌకర్యాన్ని కలుగచేయడం గానీ, లేక పునరుధ్దరణ చేయడానికి గాని తమ అభ్యర్ధులకు ఋణాలిచ్చే లక్ష్యంతో, బ్యాంకు సిబ్బందితో  నెలకొల్పబడిన సహకార పరపతి సంఘాలకు బ్యాంకులు అడ్వాన్సులు ఇచ్చే విషయంలో భారతీయ రిజర్వు బ్యాంకు వారి వడ్డీ రేట్ల నిబంధనలు వర్తించవు.

షేర్లు/డిబెంచర్ల పై అడ్వాన్సులు

షేర్లను, డిబెంచర్లను సెక్యూరిటీగా పెట్టినపుడు బ్యాంకులు ట్రస్టులక% మరియు ఎండోమెంట్లకు ఋణాలను మంజూరు చేయవచ్చా?

  • వీలుకాదు. షేర్లను, డిబెంచర్లను సెక్యూరిటీగా పెట్టినపుడు బ్యాంకులు ట్రస్టులక% మరియు ఎండోమెంట్లకు ఋణాలను మంజూరు చేయడం వీలుకాదు.

బ్యాంకులు బ్యాంకింగ్‌  కంపెనీ యొక్క ఈక్వీటీ షేర్లపై వారి డైరెక్టర్లకు ఋణాలివ్వ వచ్చా?

  • వీలుకాదు.

క్యాపిటల్‌ మార్కెట్‌ లోని బ్యాంకుల అన్ని రకాల పెట్టుబడులపై (ఎక్స్పోజర్‌)  ఏమైనా పరిమితులు విధింపబడ్డాయా?

  • బ్యాంకులు ఈ క్వీటీ వాటాలలొ, మార్పిడి చేసుకోగలిగే బాండ్లు మరియు డిబెంచర్లలో అలాగే ఈక్విటీ లక్షణం గల (ఈక్పిటీ ఓరియంటెడ్‌) మ్యూచువల్‌ ఫండ్సులో తమ ప్రత్యక్ష పెట్టుబడులు, ఈక్విటీ వాటాలు (ఐ.పి.ఓ లతో సహా), బాండ్లు, డిబెంచర్లు, ఈక్విటీ లక్షణం గల మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనడానికి వ్యక్తులకిచ్చే అడ్వాన్సులు మరియు స్టాక్‌ బ్రోకర్లకిచ్చే సెక్యూర్డ్‌, సెక్యూర్డ్‌ కాని అడ్వాన్సులు అదే విధంగా స్టాక్‌ బ్రోకర్సు మరియు మార్కెట్‌ మేకర్స్‌ తరఫున ఇచ్చే గ్యారంటీల మొత్తము గత సంవత్సరం మార్చి 31 నాటికి బకాయ వున్న అడ్వాన్సుల మొత్తంలో (కమర్షియల్‌ పేపరుతో సహా) 5 శాతానికి మించి వుండరాదు. ఈ పరిమితికి లోబడి, బ్యాంకుయొక్క ప్రత్యక్ష పెట్టుబడి దానియొక్క నికర విలువపై 20 శాతానికి మించివుండకూడదు.   క్యాపిటల్‌ మార్కెట్‌ లో బ్యాంకుయొక్క అన్ని రకాల పెట్టుబడుల  పరిమితులను లెక్కగట్టడానికి షేర్లలో బ్యాంకుయొక్క ప్రత్యక్ష పెట్టుబడిని షేర్ల యొక్క కొన్న ధరపై లెక్కిస్తారు..

బ్యాంకులు షేర్లపై  షార్ట్‌ సేల్‌ అమ్మకాలను చేపట్టవచ్చా?

  • వీలుకాదు.   బ్యాంకులు తమవద్దలేని  షేర్లలో  అమ్మకాలను చేపట్టడం నిషేధించబడింది.

బ్యాంకులు డిస్కౌంటు చేయకూడని బిల్లులేమిటి?

  • విద్యుత్‌ చార్జీలకై చేయు చెల్లంపుల బిల్లులు, కస్టమ్స్‌ డ్యూటీ,  అద్దె ప్రాతిపదికపై కొనుగోలు/బాడుగ, అద్దెకై కట్టే వాయిదాలు, సెక్యూరిటీల అమ్మకం మరియు ఇతర రకములైన ఆర్ధిక సౌలభ్యంవంటి వాటిని బ్యాంకులు డిస్కౌంటు చేయడానికి వీలులేదు.

బ్యాంకులు ఆర్ధికేతర కంపెనీ లలోని ఫిక్సెడ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టవచ్చా?

  • పబ్లిక్‌ డిపాజిట్‌ పధకం క్రింద బ్యాంకింగేతర, ఆర్ధికేతర  సంస్ధలలో బ్యాంకులు తమ నిధులను పెట్టడంపై నిషేధమేదీ లేదు.  అయితే, బ్యాంకింగ్‌  రెగ్యులేషన్స్‌ చట్టం 1949 క్రింద మరియు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టం 1934 క్రింద సమర్పించే రిటర్న్స్‌ లోను మరియు తమ బాలెన్స్‌ షీట్లలొను పబ్లిక్‌ డిపాజిట్‌ పధకంలో పెట్టిన పెట్టుబడులను బ్యాంకులు  ఋణాలు, అడ్వాన్సులుగా వర్గీకరించి చూపించవలసి వుంటుంది.

బ్యాంకులు పబ్లిక్‌ రంగ సంస్ధల బాండ్లకు సంబంధించి, లెటర్‌  ఆఫ్‌ ఎలాట్మెంటు ను కొనవచ్చా?

ప.రం.సం. లకు సంబంధించిన బాండ్ల విషయంలో, ఈ క్రింది నిబంధనలకు లోబడి బ్యాంకులు అటువంటి లెటర్‌ ఆఫ్‌ ఎలాట్మెంటును కొనవచ్చుః

  • లావాదేవీలు (అంతర్‌  బ్యాంకు వ్యవహారాలు తప్ప). గుర్తింపబడిన స్టాక్‌ ఎక్చేంజ్‌లు మరియు నమోదు కాబడిన బ్రోకర్ల ద్వారా మాత్రమే చపట్టబడి వుండాలి.
  • బాండ్లను కొనేటప్పుడు, సెక్యూరిటీకి క్లియర్‌  టైటిల్‌ వుందా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆలాగే అది సెకండరీ మార్కెట్టులో అమ్మకం చేయడానికి వీలుకలిగి వుండాలి.
  • బ్యాంకు అటువంటి లావాదేవీలు జరపడానికి బోర్డ్‌ యొక్క అనుమతిని తీసుకుని, అంతర్గతంగా మార్గదర్శక సూత్రాలను రూఎందించాలి.

షేర్లు/ డిబెంచర్లు /బాండ్లపై అడ్వాన్సులనిచ్చే విషయంలోవాటి విలువను కట్టే విధానం ఏమిటి?

  • బ్యాంకులు ఋణాలు/ అడ్వాన్సులు ఇచ్చేటప్పుడు, ప్రస్తుతం మార్కెట్లో వున్న ధరను బట్టి సెక్యూరిటీగా తీసుకున్న షేర్లు/ డిబెంచర్లు/ బాండ్ల యొక్క విలువను లెక్క గట్టాలి.

కంపెనీలకు బ్యాంకులు బ్రిడ్జ్‌ ఋణాలు (బ్రిడ్జ్‌ లోన్స్‌) ఇవ్వ వచ్చా?

  • అవును. ఇవ్వవచ్చు.  కంపెనీలకు బ్యాంకులు ఒక సంవత్సరానికి మించకుండా, ఆశించే ఈక్వీటీ రాబడి (ఫ్లోస్‌)/ఇష్యూలు, అలాగే మార్పిడిచేసుకోగల డిబెంచర్ల అమ్మకంతో వచ్చే ఆశించతగ్గ వసూళ్లు, ఎక్‌స్టర్నల్‌ కమ్మర్షియల్‌ బారోయింగ్స్‌, గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్సు మరియు/లేక ఎఫ్‌.డి.ఐ. రూపంలో వున్న నిధులపై బ్రిడ్జ్‌ ఋణాలివ్వవచ్చు.   అయితే, ఋణం తీసుకునే కంపెనీ పైన చెప్పిన వనరులను/నిధులను గడించడానికి ఖచ్చితమైన ఏర్పాట్లు చేసేవుందని సంతృప్తి చెందాలి.   బ్యాంకులిచ్చే బ్రిడ్జ్‌ ఋణాలు  క్యాపిటల్‌ మార్కెట్‌ లో అన్ని రకాల పెట్టుబడులకు (ఎక్స్పోజర్‌ ) సంబంధించిన 5 శాతం పరిమితికి లోబడి వుంటాయి.

భౌతికరూపంలో కానీ, డిమ్యాట్‌ రూపంలో కాని  ఉన్న షేర్లు, డిబెంచర్లు మరియు ప్రభుత్వ రంగ బాండ్లను సెక్యూరిటీగా తీసుకుని బ్యాంకులు వ్యక్తులకిచ్చే ఋణాలపై ఉన్న పరిమితులేమిటి?

  • భౌతిక/ డిమ్యాట్‌ రూపాలలో వున్నప్పుడూ షేర్లు, డిబెంచర్లు, బాండ్లను సెక్యూరిటీగా తీసుకుని బ్యాకులిచ్చే ఋణాలు రూ|| 10 లక్షలు / రూ|| 20 లక్షలు మించి వుండకూడదు.  ఐ.పి.ఓలపై వెచ్చించడానికి ఒక వ్యక్తికిచ్చే అత్యధిక ఆర్ధిక సహాయం రూ|| 10 లక్షలకు మించకూడదు. అయితే, ఇతర కంపెనీల ఐ.పి.ఓ.లలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులు కంపెనీలకు ఆర్ధిక సహాయం అందించకూడదు. బ్యాంకులు ఉద్యోగులకు తమ స్వంత కంపెనీల్లో షేర్లను కొనడానికి ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్‌ క్రింద కొనుగోలు ధరలో 90 శాతం వరకూ, లేక రు||లు 20 లక్షల వరకూ, ఏది తక్కువైతే అది,  అడ్వాన్సుగా ఇవ్వ వచ్చు.  తిరిగి వ్యక్తులకు ఐ.పి.ఓ.లలో పెట్టుబడి పెట్టడం కోసం ఋణాలుగా ఇవ్వడానికి ఎన్‌.బి.ఎఫ్‌.సి.లకు ఆర్ధిక సహాయం చేయకూడదు.   ఐ.పి.ఓ.లలో పెట్టుబడి పెట్టడం కోసం ఇచ్చే ఋణాలు / అడ్వాన్సులను మార్కెట్‌ ఎక్స్పోజర్‌  క్రింద పరిగణించ వచ్చు.

భౌతికం గానూ, మెటీరియలైజ్డ్‌ కాని రూపంలోనూ వున్న షేర్లపై ఇచ్చే  అడ్వాన్సులపై విధించిన మార్జిన్‌ ఏమిటి?

  • షేర్లు, గ్యారంటీలపై  ఇచ్చే అన్ని అడ్వాన్సులపైన ఒకే మాదిరిగా 50 శాతం మార్జిన్‌ విధించబడింది.   ఈ 50 శాతం మార్జిన్‌ లోపల క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాలకై బ్యాంకు ఇచ్చిన గ్యారంటీల విషయంలో కనీసపు నగదు మార్జిన్‌ 25 శాతం మైంటైన్‌ చేయబడాలి .

విరాళాలు

బ్యాంకులు విరాళాలివ్వ వచ్చా?

అవును. ఇవ్వ వచ్చు.   లాభాలు గడించే బ్యాంకులు ఆర్ధిక సంవత్సరంలొ గతసంవత్సరానికి ప్రకటింపబడిన మొత్తం లాభాల్లో 1 శాతం వరకూ ఇవ్వ వచ్చు,   అయితే, బ్యాంకులిచ్చే ఇటువంటి విరాళాలు/చందాలు ఈ క్రింది వాటి విషయంలో, పైన చెప్పబడిన పరిమితి నుండి మినహాయింప బడ్డాయి.

  1. ప్రధాన మంత్రి సహాయ నిధికి, మరియు
  2. వృత్తిపరమైన సంస్ధలకు, అనగా
    • భారత బ్యాంకుల అసోసియేషన్‌
    • జాతీయ బ్యాంకు మేనేజ్‌ మెంట్‌ సంస్ధ,
    • భారతీయ బ్యాంకర్స్‌ సంస్ధ (ఐ.ఐ.బి)
    • బ్యాంకింగ్‌ సిబ్బంది ఎంపిక సంస్ధ
    • భారతీయ విదేశీ మారక ద్రవ్య డీలర్ల అసోసియేషన్‌,

వీరికి ఒక సంవత్సరంలో ఇచ్చినటువంటి విరాళం/చందా,  పైన చెప్పబడిన పరిమితి నుండి మినహాయింప బడుతుంది.  అటువంటి విరాళాలు/చందాలు ఇవ్వడానికి ఒక సంవత్సరంలో  అనుమతింపబడి మిగిలిపోయిన సమ్మును తరువాతి సంపత్సరానికి జమ చేయకూడదు,.

నష్టాలు భరిస్తూ వుండే బ్యాంకులు విరాళాలివ్వ వచ్చా?

  • అవును. ఇవ్వ వచ్చు.  నష్టాలు భరిస్తూవుండే బ్యాంకులు ఒక ఆర్ధిక సంవత్సరానికి రు||లు 5 లక్షల వరకూ విరాళాలివ్వ వచ్చు.

విదేశాలలో వుండే బ్యాంకు శాఖలు విదేశాలలో విరాళాలివ్వ వచ్చా?

  • అవును.  ఇవ్వ వచ్చు.   విదేశాలలో వుండే బ్యాంకు శాఖలు విదేశాలలోనే విరాళాలివ్వ వచ్చు.   అయితే, అట్టి విరాళాలు గత సంవత్సరం ప్రకటించిన లాభాల్లో  1 శాతం పరిమితికి మించి వుండకూడదు.

ఆవరణలపై ఇచ్చే ఋణాలు

వాణిజ్య బ్యాంకులు తమ కోసం, అనగా తమ కార్యాలయం కోసం/సిబ్బంది నివాసముండడం కోసం, గృహవసతిని బాడుగ/అద్దె ప్రాతిపదికపై తీసుకొనుటకు భారతీయ రిజర్వు బ్యాంకు రూఎందించిన ప్రమాణాలు/పధ్దతులు ఏమిటి?

  • విడి విడిగా మహానగరాలు/పట్టణ, పూర్తిగా పట్టణం కానటువంటివి మరియు  గ్రామీణ ప్రాంతాలలో నివాస వసతికి సంబంధించి, బ్యాంకు అవసరం కోసం గృహవసతిని బాడుగ/అద్దె ప్రాతిపదికపై  స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకుల యొక్క డైరెక్టర్ల బోర్డ్‌ ఒక విధానాన్ని మరియు నిర్వహణకై మార్గదర్శక సూత్రాలను, పధ్దతులను రూఎందించాలి.  వివిధ స్ధాయిల్లో అధికారాలనప్పగించడం అన్న అంశం కూడా ఈ మార్గదర్శక సూత్రాలలొ కలిసి వుండాలి.  గ్రామీణ కేంద్రాలలో మినహా మిగిలిన ప్రాంతాలలో గృహవసతిని వదులుకోవడం/మార్చడం వంటి నిర్ణయాలు కేంద్రకార్యాలయ స్ధాయిలోనే ఒక సీనియర్‌ ఆధికారుల కమిటీచే తీసుకొనబడాలి.
  • భూస్వామి/ఇంటి యజమానుల నుండి బ్యాంకులు గృహవసతిని బాడుగ/అద్దె ప్రాతిపదికపై తీసుకున్నప్పుడు వారికిచ్చే ఋణాలకు సంబంధించి బ్యాంకుయొక్క డైరెక్టర్ల బోర్డ్‌  ఒక విధానాన్ని రూఎందించాలి. రూ|| 2 లక్షలకు మించిన ఋణాలపై విధించే వడ్డీ రేటు బి.పి.ఎల్‌.ఆర్‌ఒ కంటే తగ్గకుండా,  భారతీయ రిజర్వు బ్యాంకు జారిచేసిన నిర్దేశాలకు అనుగుణంగా వుండాలి. బ్యాంకు సాధారణ పధ్దతిలో వ్యవధితో కూడిన ఇతర ఋణాలకు వర్తింప చేసేవిధంగానే ఈ వడ్డీ రేట్లు సాధారణ వడ్డీగా గానీ, చక్రవడ్డీగా కానీ వుండవచ్చు.
  • భూస్వామి/గృహయజమాని యొక్క నిజమైన ఫిిర్యాదులను/అసౌకర్యాన్ని వేగవంతంగా పరిష్కరించేందుకు సరైన యంత్రాంగాన్ని బ్యాంకులు కలుగచేయాలి.
  • ప్రభుత్వ ఆదేశాల మేరకు బాడుగ/అద్దె ప్రాతిపదికపై గృహవసతి కల్గించిన గృహయజమానితో బేర సారాల వివరాలు, అవి జరిపిన తర్వాత చేసుకున్నటువంటి కాంట్రాక్టును, అతనికిచ్చిన అడ్వాన్సులకు సంబంధించి (పన్నులు,  మొ||వి,   రూ||లు. 25 లక్షలకు మించిన డిపాజిట్లతో సహా) అట్టి బాడుగ/అద్దె  ప్రాతిపదిక మీద తీసుకున్న గృహవసతి గురించిన వివరాలు  అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు,  కేంద్ర నిఘా సంస్ధ (సి.బి.ఐ) కు  నివేదించాల్సి వుంటుంది.   అయితే  పై#్రవేటు రంగంలో వుండే బ్యాంకులకు ఈ నిబంధన  వర్తించదు.

సేవలకై చార్జిలు (సర్వీస్‌ చార్జెస్‌)

సేవలపై బ్యాంకులు విధించే చార్జిలపై  పరిమితి ఏమైనా వుందా?

  • భారతీయ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐ.బి.ఏ) వారు బ్యాంకులు అందించే వివిధ సేవలపై వసూలుచేసే చార్జిలను  నిర్దేశించడాన్ని  సెప్టంబరు, 1999 నుండి విరమించింది. సంబంధిత బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల అనుమతితో సేవలపై చార్జిలు విధించే స్వేచ్చను  భారతీయ రిజర్వు బ్యాంకు ఆయా బ్యాంకులకు ఇచ్చింది.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate