অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సెవింగ్స్‌ బాండ్లు

సెవింగ్స్‌ బాండ్లు

  • 6.5 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను లేనివి) మరియు 8 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను కట్టాల్సినవి)  మధ్య లోని అంశాలలో ఉన్న వ్యత్యాసాలు / సారూప్యాలు ఏమిటి?
  • 6.5 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను లేనివి) మరియు 8 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను కట్టాల్సినవి) మధ్య వ్యత్యాసాలు/సారూప్యాలు క్రింద చూపబడినవి.

లక్షణాలలో ఉండే తారతమ్యాలను తెలిపే పట్టిక

లక్షణాలు 6.5 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను లేనివి) 8 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను కట్టాల్సినవి)
ధరఖాస్తుదారుల సంవర్ణము ప్రవాస భారతీయులు తప్ప వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం వ్యక్తులు, హెచ్‌.యు.ఎఫ్‌.లతో సహా (ఎన్‌.ఆర్‌.ఐలు తప్ప) ధార్మిక సంస్ధలు మరియు విశ్వవిద్యాలయాలు
వ్యవధి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు
వడ్డీరేటు 6.5శాతం సాలీనా అర్ధ సంవత్సరానికి అనగా 1 జనవరి - 1 జూలై నాటికి చెల్లింపు చేసేటట్లుగా సాలీనా 8 శాతం అర్ధ సంవత్సరానికి అనగా 1 ఫిబ్రవరి - 1 ఆగస్టులలో చెల్లింపు చేసేటట్లుగా
పరిపక్వం కాకముందే విడిపించు (విత్‌డ్రా) కొనే అవకాశం ఉంది.  3 సం||ల లాక్‌-ఇన్‌ -వ్యవధి తరువాత, బాండ్లను విడిపించుకోవచ్చును. లేదు.  అటువంటి సౌకర్యం లేదు.
స్వీకరించే  కార్యాలయాలు భారతీయ రిజర్వు బ్యాంకు కార్యాలయాలు మరియు ఏజన్సీలు కేవలం ఏజన్సీ బ్యాంకులు  మరియు ఎస్‌.హెచ్‌.సి.ఐ.ఎల్‌.
పన్ను మినహాయింపు పన్ను లేనివి పన్ను కట్టాల్సి ఉన్నది.  కానీ పన్ను మూలము లోనే (ఎట్‌ సోర్స్‌)  వసూలు చేయబడదు.
కమతం యొక్క రూపం 1.  భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన స్టాక్‌ సర్టిఫికేట్‌ మాత్రమే, మరియు

2. భారతీయ రిజర్వు బ్యాంకు మరియు ఏజన్సీల వద్ద లభించే బాండ్‌ లెడ్జర్‌ ఖాతా (బి.ఎల్‌.ఏ సౌకర్యం)
1.  బాండ్‌ లెడ్జర్‌  ఖాతా (బి.ఎల్‌.ఏ.) కేవలం ఏజన్సీల వద్ద  మాత్రమే లభించే బాండ్‌ లెడ్జర్‌ ఖాతా.
పెట్టుబడిపై పరిమితి పెట్టుబడిపై ఏ పరిమితి లేదు పెట్టుబడిపై ఏ పరిమితి లేదు
జారీ చేయు ధర సరిసమానంగా సరిసమానంగా
అవకాశం క్యూములేటివ్‌ మరియు క్యూములేటివ్‌ కానిది
క్యూములేటివ్‌ మరియు క్యూములేటివ్‌ కానిది
అడ్వాన్స్‌లు దొరకవు. ఈ బాండ్లను సెక్యూరిటీగా పెట్టి ఏ బ్యాంకు నుండైనా అడ్వాన్స్‌ తీసుకొనే సౌకర్యం లేదు. దొరకవు. ఈ బాండ్లను సెక్యూరిటీగా పెట్టి ఏ బ్యాంకు నుండైనా అడ్వాన్స్‌ తీసుకొనే సౌకర్యం లేదు
నామినేషన్‌ సౌకర్యం కేవలం వ్యక్తిగత హక్కుదారు (హోల్డర్‌)కు మాత్రమే లభిస్తుంది. కేవలం  వ్యక్తిగత హోల్డర్‌కు మాత్రమే లభిస్తుంది. ప్రవాస భారతీయులను కూడా నామినేట్‌ చేయవచ్చు
వడ్డీ చెల్లింపు 1. క్యూములేటిన్‌ కాని స్ధితిలో వడ్డీ వారంట్లు/ఈ.సి.ఎస్‌ ద్వారా అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లిస్తారు.

2. ఒకవేళ క్యూములేటివ్‌ పద్ధతి ప్రకారం అయితే అసలు సమ్ము విడుదల చేసుకొనే సమయంలో వడ్డీతో సహా లెక్కకట్టి ఇవ్వబడుతుంది.
1. అర్ధ సంవత్సరానికి వడ్డీ వారెంట్ల ద్వారా / ఈ.సి.ఎస్‌. / క్యూములేటివ్‌ కానటువంటివి

2.  ఒకవేళ క్యూములేటివ్‌ పద్ధతి ప్రకారం అయితే అసలు సమ్ము విడుదల చేసుకొనే సమయంలో వడ్డీతో సహా లెక్కకట్టి ఇవ్వబడుతుంది.
దళారి రుసుము (బ్రోకరేజి)
ఏజన్సీ బ్యాంకు లెడ్జర్‌ ఖాతాలకు (బి.ఎల్‌.ఏ) రూ.100 కు రూ 1 చొ||న, భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద వుండే బ్యాంకు లెడ్జర్‌ ఖాతాలకు ప్రతీ రూ.100 కు 0.50 పై. చొ||న చెల్లిస్తారు.

స్టాక్‌ సర్టిఫికేట్‌పై బ్రోకరేజ్‌ లేదు.
ఏజన్సీ బ్యాంకులలో వుండే బ్యాంకు లెడ్జర్‌ ఖాతాలకు రూ. 100 కు రూ. 1 చొ||న చెల్లిస్తారు.
బదలాయించడం బదలాయించడానికి వీలులేదు.  హక్కుదారు మరణించిన సందర్భములో నామినీకి తప్ప ఇతరులకు బదలాయించడానికి వీలులేదు.   భారతీయ కంపెనీల చట్టం 1956లోని సెక్షన్‌ 6 లో వివరించినట్లుగా బంధువులకు బహుమానంగా బదలాయించవచ్చు. బదలాయించడానికి వీలులేదు.  హక్కుదారు మరణించిన సందర్భములో నామినీకి తప్ప ఇతరులకు బదలాయించడానికి వీలులేదు.
పరిపక్వానంతర కాలానికి వడ్డీ చెల్లింపబడదు చెల్లింపబడదు
లావాదేవీలు జరపడం కుదరదు.

లావాదేవీలు జరపడానికి వీలుకాదు.
కుదరదు.

లావాదేవీలు జరపడానికి వీలుకాదు.

సేవింగ్స్‌ బాండ్ల విషయంలో పన్నుకు సంబంధించిన అంశాలు

  • 6.5 శాతం సేవింగ్స్‌ బాం డ్లు (పన్ను లేనివి) మరియు 8 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్నుకట్టాల్సినవి)లకు సంబంధించి మూలములో(ఎట్‌ సోర్స్‌) పన్ను మినహాయించడంపై ఉన్న భావం ఏమిటి?
  • ఆదాయపు పన్ను చట్టము 1961 ప్రకారం 6.5 శాతం సేవింగ్స్‌ బాం డ్లు (పన్ను లేనివి) 2003 పై వచ్చే వడ్డీ ఆదాయంపుపన్ను నుండి,  మినహాయింపబడినది.
  • 8శాతం  సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను కట్టాల్సినవి) పై పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీకి పన్ను ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం బాండు హక్కుదారు చెల్లించాల్సి ఉంటుంది.  అయితే అటువంటి పన్ను మూల స్ధానం (ఎట్‌ సోర్స్‌) వద్దే తగ్గింపబడదు. భారత ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ప్రకటన నెం. ఎఫ్‌ 4(10)-డబ్ల్యూ.ఎమ్‌/2003 తేది.జనవరి 13, 2004లో ఇది సూచించబడినది.

ఈ బాండ్లపై వచ్చే వడ్డీపై లభించే పన్ను లాభాలు ఏమిటి?

  • ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఎల్‌ ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలపై / బాండ్లపై వచ్చే వడ్డీకి సాలీనా రూ. 15,000/- వరకూ పన్ను మినహాయింపు సౌకర్యం లభిస్తుంది. సంపద పన్ను చట్టం (వెల్త్‌ ట్యాక్స్‌) 1957 ప్రకారం ఈ బాండ్లు సంపద పన్ను నుండి మినహాయింపబడ్డాయి.

సేవింగ్స్‌ బాండ్లపై లభించే నామినేషన్‌ మరియు ఉమ్మడి కమతం  సౌకర్యాలు

సేవింగ్స్‌ బాండ్లలో నామినేషన్‌ సౌకర్యం ఉందా? ఒక ప్రవాస భారతీయుడిని నామినీగా చూపించవచ్చా ?

  • అవును.  నామినేషన్‌ సౌకర్యం ఉంది.  బాండ్లు కలిగి ఉన్న, బ్రతికి ఉన్న కేవలం వ్యక్తిగత హక్కుదారు మాత్రమే ఒకరిని లేక ఎక్కువ మందిని నామినేట్‌ చేయవచ్చును. హక్కుదారు మరణించిన సందర్భంలో అట్టి నామినీ బాండ్‌ పైన,  దానిపై వచ్చే ఇతర చెల్లింపులపైనా అర్హత కలిగి ఉంటారు.
  • ఈ బాండ్లలో ప్రవాస భారతీయులు పెట్టుబడి పెట్టడానికి అనుమతి లేకపోయినా బాండ్లు కలిగి ఉన్న వ్యక్తి అటువంటి బాండ్లపై పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ పెట్టుబడి పూర్తి కాలం ముగిసిన తరువాత  వి డుదల చేసుకొనే పూర్తి సమ్మునకు ఒక ఎన్‌.ఆర్‌.ఐ.ను తన నామినీగా నామినేట్‌ చేయవచ్చు. విదేశీ చెల్లింపులకు సంబంధించినంత వరకు,  ఎన్‌.ఆర్‌.ఐ.లకు కాలానుగుణంగా వర్తించే విధంగా అమలులో వున్న నిబంధనలు ఇటువంటి కేసులను నియంత్రీకరిస్తూ ఉంటాయి.

ఇటువంటి సేవింగ్స్‌ బాండ్ల విషయంలోఉమ్మడి కమతాలు అనుమతింపబడుతాయా? ఉమ్మడి కమతం కలవారు ఈ బాండ్లపై ఇతరులనెవరినైనా నామినేట్‌ చేయవచ్చా?

  • ఉమ్మడి కమతాలు “ఎవరైనా లేక బ్రతికే ఉన్నవారు’’ అన్న ప్రాతిపదికపై అనుమతిస్తారు.  అయితే ప్రస్తుతానికి ఇటువంటి ఉమ్మడి కమతాలపై నామినేషన్‌కు అనుమతి లేదు.

ఒకవేళ బాండు హక్కుదారు (లు) ఏ నామినేషన్‌ చేయకుండా చనిపోయే పక్షంలో వడ్డీని / పూర్తి కాలానికి విడుదల చేసే సమ్మును చట్టబద్దమైన వారసులు ఏ విధంగా రాబట్టుకోగలరు?

  • ఏ నామినేషన్‌ ఇవ్వకుండా బాండు హక్కుదారు(లు) చనిపోయినట్లయితే చట్టబద్దమైన వారసులు వారసత్వపు ధృవీకరణ పత్రం (సక్సెషన్‌ సర్టిఫికెట్‌) ను సమర్పించవలసి ఉంటుంది.

సేవింగ్స్‌ బాండ్లను నిర్వహించే ఏజన్సీ బ్యాంకులు

భారతీయ రిజర్వు బ్యాంకు సేవింగ్స్‌ బాండ్లను అమ్ముతుందా?

  • తన ప్రజా రుణ కార్యాలయాల (పబ్లిక్‌ డెట్‌ ఆఫీసెస్‌) ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు 6.5 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను లేనివి) పథకాన్ని మాత్రమే నిర్వహిస్తోంది. ఏజన్సీ బ్యాంకులు 6.5 శాతం మరియు 8 శాతం సేవింగ్స్‌ పథకాలను నిర్వహిస్తూ ఉంటాయి.

సేవింగ్స్‌ బాండ్లను ఏ ఏ ఏజన్సీలు అమ్ముతాయి?

6.5శాతం మరియు 8 శాతం బాండ్ల పథకాలను అమలు చేసే ఏజన్సీలు ఈ క్రింద చూపబడినవి.

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ యొక్క ఏడు సహచర బ్యాంకులు, అనగా

    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌
    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌
    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌  అండ్‌ జైపూర్‌
    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌
    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర
    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా
    • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌

14 జాతీయం చేయబడిన బ్యాంకులు , అనగాః

  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
  • దేనా బ్యాంక్‌
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
  • సిండికేట్‌ బ్యాంక్‌
  • కెనరా బ్యాంక్‌
  • ఇండియన్‌ బ్యాంక్‌
  • ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
  • యూనియన్‌ బ్యాంక్‌
  • అలహాబాద్‌ బ్యాంక్‌
  • యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • యూకో బ్యాంక్‌
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

నాలుగు ప్రయివేట్‌ రంగంలోని బ్యాంకులు , అనగాః

  • ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్‌ లిమిటెడ్‌
  • హెచ్‌.డి.ఎఫ్‌.సి. బ్యాంక్‌ లిమిటెడ్‌
  • ఐ.డి.బి.ఐ. బ్యాంక్‌ లిమిటెడ్‌
  • యు.టి.ఐ. బ్యాంక్‌ లిమిటెడ్‌

స్టాక్‌ హోల్డింగ్‌  కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పరిపక్వత చెందకుండానే  సొమ్ము చేసుకొనే సౌకర్యం

ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడి సొమ్మును పరిపక్వత కాకుండానే నగదు చేసుకొవడాన్ని అనుమతిస్తారా?

  • 6.5 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను లేనివి)  విషయంలో బాండ్లును జారీ చేసిన తేది నుండి కనీసం 3 సంవత్సరాలు లాక్‌-ఇన్‌-పిరియడ్‌ తరువాత మాత్రమే నగదు చేసుకోవడాన్ని అనుమతిస్తారు.  పెట్టుబడిదారుడు అటువంటి బాండ్లును ఎప్పుడైనా 6వ అర్ధ సంవత్సరం తరువాత వాపసు చేయవచ్చు కాని దాని తరువాత వచ్చే వడ్డీ చెల్లించవలసిన తేదీ నాడు మాత్రమే పూర్తి సమ్ము విడుదల చేయబడుతుంది.  ఈ విధంగా పరిపక్వత కంటే ముందుగానే సమ్ము చేసుకొనే అవకాశం ప్రతీ సంవత్సరం జూలై, 01 మరియు జనవరి, 01 నాడు మాత్రమే ఉంటుంది. అయితే క్యూములేటివ్‌ మరియు క్యూములేటివ్‌ కాని  బాండ్లపౖౖె. చెల్లించవలసిన చివరి 6 నెలల హోల్డింగ్‌  కాలవ్యవధిపై 50 శాతం వడ్డీ తగ్గించబడుతుంది. 8 శాతం సేవింగ్స్‌ బాండ్లు 2003 (పన్ను కట్టాల్సినవి)  విషయంలో మాత్రం పరిపక్వత చెందే కాలానికి ముందే సొమ్ము చేసుకోవడం వీలుకాదు.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate