অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సంప్రదింపు వ్యవహార వ్యవస్థ (ఎన్‌డిఎస్‌/ సవ్యవ్య)

సంప్రదింపు వ్యవహార వ్యవస్థ (ఎన్‌డిఎస్‌/ సవ్యవ్య)

సంప్రదింపు వ్యవహారాల వ్యవస్థ (సవ్యవ్య /ఎన్‌డిఎస్‌) అంటే ఏమిటి ?

  • ప్రభుత్వ సెక్యూరిటీల, ద్రవ్య విఫణి సాధనాల (మనీమార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) వ్యవహారాలకు వసతి కల్పించే ఎలక్ట్రానిక్‌ వేదికను సవ్యవ్య అంటారు.
  • వేలం, వాడకం (ఫ్లటేషన్‌) ద్వారా ఆర్‌బిఐ ప్రభుత్వ సెక్యురిటీల ప్రాథమిక జారీని సభ్యుల కోసం ఆర్‌బిఐ ఎన్‌డిఎస్‌ ద్వారా నిర్వహిస్తుంది. వీటికి సభ్యులు  బిడ్స్‌ దాఖలు/ దరఖాస్తు దాఖలు చేసేందుకు ఎలక్ట్రానిక్‌ పద్దతిలో  సవ్యవ్య వీలు కల్పస్తుంది. భౌతికంగా సహాయక సాధారణ ఆవర్జా (ససాఆ/ ఎన్‌జిఎల్‌) బదిలీలఫార్మ్‌ ద్వారా సభ్యులమధ్య  జరిగే వ్యవహారాల దాఖలు విధానాన్ని సవ్యవ్య అమలుతో ఆగిపోతుంది. ప్రజారుణ కార్యాలయం, సెక్యూరిటీ పరిష్కార వ్యవస్థకు (సపవ్య / ఎస్‌ఎస్‌ఎస్‌ ఆర్‌బిఐలో సవ్యవ్య ఇంటర్‌ ఫేస్‌ కల్పిస్తుంది. ఖజానా బిల్లులు, మొత్తంగా (అవుట్‌రైట్‌) రిపోస్‌తో సహా ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీల పరిష్కారానికి సవ్యవ్య తోడ్పడుతుంది.

సవ్యవ్యలో ఎవరు సభ్యులు?

  • సవ్యవ్య ఇన్‌ఫీనెట్‌ అనే సంవృత వినియోగ సమూహజాలికను భావప్రసార విధానానికి వెన్నెముకగా ఉపయోగిస్తుంది. కాబట్టి సవ్యవ్య సభ్యత్వం ఇన్‌ఫీనెట్‌  సభ్యులకే పరిమితం. ఇన్‌ఫీనెట్‌ సభ్యత్వం  వల్ల ససాఅ/ లేదా కరెంటు ఖాతాలను కాలానుగుణంగా నిర్ధారించిన విధానంలొ ఆర్‌బిఐతో కలిగి ఉండే వసతి కలుగుతుంది.

సవ్యవ్య ఉపయోగంలో ఉండటం వల్ల భౌతిక గుసాఆ/ ఎస్‌జిఎల్‌ కొనసాగుతుందా?

  • అవును. కొనసాగుతుంది. భౌతిక ససాఆ/ ఎస్‌జిఎల్‌ ఫార్మ్‌ను ప్రత్యేకించి సవ్యవ్యలో సభ్యులు అయినవారి  మరియు సభ్యులు కానివారి మధ్య వ్యాపారాల పరిష్కారానికి వినియోగిస్తారు. ఒకసారి సవ్యవ్య పూర్తిస్థాయిలో అమలువుతే ఆర్‌బిఐ భౌతిక ససాఆ/ ఎస్‌జిఎల్‌ బదిలీ ఫార్మ్‌ను ససాఆ/ ఎస్‌జిఎల్‌ ఖాతాల పరిష్కారానికి ఉపయోగించదు.

ఈ వ్యవస్థ వ్యవహారంలో ప్రవేశిస్తే ఉపసంహరించుకోవచ్చా?

  • పరిష్కర్తల మధ్య వ్యవహారం గురించి అంగీకారాలు కుదిరితే వ్యవస్థ నుంచి వ్యవహారాన్ని ఉపసంహరించుకొనే వీలుండదు. అయితే పరిష్కర్తల ఆమోదానికి ముందు పరిష్కర్తలలో  ఎవరయినా లేదా వ్యవహార సభ్యుడు తిరస్కరించిన వ్యవస్థలో ప్రవేశించేందుకు నిరాకరించవచ్చు.

పూర్తి అంగీకారం కుదిరిన  వ్యవహారాల్లో ఉపసంహరణకు సభ్యులకు ఎటువంటి అవకాశాలు లభిస్తాయి?

  • ఈ దశలో  ఒక్కసారి పరిష్కర్తలు వ్యవహారానికి అంగీకారం తెలిపితే రద్దు చేయలేం. తరవాతి దశలో సవ్యవ్య లు సెపవ్య/ ఎస్‌ఎస్‌ఎస్‌ తో సమగ్రీకరణ ఎందితే, (కొనుగోలుదారు / అమ్మకందారు) ఇరువర్గాల అంగీకారంతో వ్యవహారాన్ని పరిష్కారం  తేదీకి ముందయితే రద్దుచేసే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా నిర్దిష్ట సమయం లోపల అంటే పరిష్కారం  జరిగే తేదీకి ముందు జరగాలి. పరిష్కారం  జరిగే తేదీన ఈ వ్యవహారం రద్దుకాదు.

ఉద్యోగుల పోరపాట్లు అనే సాంకేతిక కారణాల వల్ల ససాఆ / ఎస్‌జిఎల్‌ ఫార్మ్‌ను ప్రస్తుతం తిరస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ నేపథ్యంలో సవ్యవ్య వ్యవహారాన్ని తిరస్కరిస్తారు?

  • విధానంలో పటిష్టమైన గమనింపులను ప్రవేశపెట్టారు. పై కారణాలను చూపించి తిరస్కరించలేరు. కాని ఆర్‌బిఐ లో వ్యాపార కక్షిదార్ల ఖాతాలలో తగినంత నిధులు /సెక్యూరిటీలు లేవని కారణం చూపించి వ్యవహారాలను రద్దు చేయవచ్చు. సిసిఐఎల్‌ వ్యాపారాలకు / ప్రభుత్వ సెక్యూరిటీల ఖజానా బిల్లుల (మొత్తంగా, రిపోస్‌తో సహా) గురించి సవ్యవ్య కు అందితే వాటికి పరిష్కార గ్యారంటీ  ఇస్తుంది.

సభ్యుడెవరయినా ఇంటర్‌ఫేస్‌లో ఆఫీస్‌ సిస్టమ్‌ నుంచి బ్యాక్‌ చేసి సవ్యవ్యను చూసి ఆన్‌లైన్‌లో ససాఅ/ఎస్‌జిఎల్‌ ఖాతాస్థితిని ఆర్‌బిఐ పుస్తకాల్లో క్రమబద్ధం చేసుకోవచ్చా?

  • భద్రతా కారణాల దృష్ట్యా సభ్యుడి బ్యాక్‌ ఆఫీస్‌ దరఖాస్తు సిస్టమ్‌ నుంచి సవ్యవ్య కు ప్రత్యక్ష ఇన్‌పుట్‌ కల్పించడం లేదు. అయితే సిస్టంలో సభ్యుల అవకాశం కోరుకొనే మేరకు క్రమబద్ధమైన విరామంలో (వ్యవహార వివరాల కోసం) ఫ్లాట్‌ ఫైల్‌ డౌన్‌లోడ్‌ వసతి / లేదా ఓరకిల్‌ వ్యూ ఆప్షన్‌ అవకాశాలను కల్పించారు.

సవ్యవ్య ద్వారా ఎటువంటి రకాల వ్యాపారాలను పరిష్కరిస్తారు?

  • సవ్యవ్య  ద్వారా  సెపవ్య/ఎస్‌ఎస్‌ఎస్‌ లకు ఇంటర్‌ఫేస్‌ వసతి కల్పిస్తారు. దీనివల్ల ఖజానా బిల్లులు, మొత్తం రిపోలు కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలు సాధ్యమవుతాయి.

సొమ్ము పిలుపు (కాల్‌మనీ) ప్రకటన సొమ్ము, సిపిలు, సిడిల వ్యాపార పరిష్కారానికి సవ్యవ్యలు సహాయం చేస్తాయా?

  • సవ్యవ్య ద్వారా సెపవ్య/ ఎన్‌ఎస్‌ఎస్‌లకు పిడిఓల వద్ద (ఆర్‌బిఐలో) ఇంటర్‌ఫేస్‌ వసతి కల్పిస్తారు. దీనివల్ల ప్రభుత్వ సెక్యురిటీల, ఖజానా బిల్లుల (మొత్తం రిపోల) లావాదేవీలు జరుగుతాయి. ఇతర ద్రవ్య విఫణి సాధనాల పరిష్కారం ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల ప్రకారం జరుగుతాయి.

సవ్యవ్య లో కార్పొరేట్‌ బాండ్ల వ్యాపారం చేయవచ్చా?

  • ప్రస్తుతం  ఆర్‌బిఐ క్రమబద్దీకరణ పరిధిలో ఉన్న  సాధనాల వ్యాపారం మాత్రమే సవ్యవ్య వేదిక మీద జరుగుతోంది. వీటిలో ప్రభుత్వ సెక్యూరిటీలు, ద్రవ్య విఫణి సాధనాలు - సొమ్ము పిలుపు/ప్రకటన / టర్మ్‌సొమ్ము, సి.పి.లు, సిడిలు ప్రభుత్వ సెక్యురిటీ రిపో వ్యాపారం జరుగుతోంది. కాబట్టి కార్పొరేట్‌ బాండ్ల వ్యాపారం చేయలేం.

సభ్యబ్రోకర్ల ద్వారా చేసే వ్యవహార మార్పిళ్ళను సవ్యవ్య పరిష్కారానికి నివేదింవచచ్చా?

  • జాతీయ  స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ / బొంబాయి స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ బ్రోకర్‌ సభ్యులు చేసే లావాదేవీలను సవ్యవ్యలో ప్రవేశపెట్టే విషయమై ఎటువంటి పరిమితి లేదు. అయినా అటువంటి లావాదేవీలను సవ్యవ్య సభ్యులే పిడిఓ -ఆర్‌బిఐలో సవ్యవ్య పరిష్కారానికి ప్రయత్నించాల్సి ఉంటుంది.

బ్రోకర్లు సవ్యవ్యలో సభ్యులు కావచ్చా?

  • ఇన్‌ఫీనెట్‌ సభ్యత్వం ప్రాథమికంగా సవ్యవ్యకు అవసరం ఇన్‌ఫీనెట్‌ సభ్యత్వం ససాఅ/ఎస్‌జిఎల్‌/ లేదా  కరెంట్‌ ఖాతా ఆర్‌బిఐలో ఉన్నవారికే పరిమితం లేదా కాలానుగతంగా నిర్ధారించిన రీతిలో పరిమితం అవుతుంది. కాబట్టి బ్రోకర్లు సవ్యవ్యలో సభ్యులు కావడానికి అర్హతలేదు.

సభ్యుడికి సవ్యవ్యలో ఫ్రంట్‌, బ్యాక్‌ ఆఫీసెస్‌  ఉంటే ఒకే నగరంలోని రెండు వేర్వేరు స్థానాలకు లేదా వేర్వేరు నగరాలకు సవ్యవ్య అనువర్తన సాఫ్ట్‌వేర్‌  ఉపయోగించవచ్చా?

  • సవ్యవ్య మొదటి ప్రతి సాఫ్ట్‌ వేర్‌కి సంబంధించి సభ్యుడు వారి ఉపయోక్తలు (క్లయంట్స్‌) లాన్‌ పరిసరాలు ఉంటే ఒకే డొమెయిన్‌కు ఉపయోగించేలా రూఎందించారు. సభ్యసర్వర్‌లో భద్రతాంశాలు -ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌  సిగ్నేచర్‌ ఉంటుంది దాని ద్వారా గోపనీయత, డీక్రిప్షన్‌, ఎన్‌క్రిప్షన్‌, నిరాకరణ మొ|| అంశాలు సమకూరుతాయి. కాబట్టి సవ్యవ్య ఈ ప్రతిలో రెండు వేర్వేరు స్థానాల్లో ఉన్న ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌  ఆఫీసెస్‌లను నిభాయించలేడు. ఈ అంశాన్ని రాబోయే దశలో గుర్తించి సభ్యులు సవ్యవ్యను వాన్‌ (డబ్ల్యుఎఎన్‌) పరిసరాల్లో ఉపయోగించేలా తయారు చేస్తారు.

ఇద్దరు సభ్యులు ఏకకాలంలో సంస్థ కోట్‌ను అందుబాటు పొందవచ్చా?

  • ఒకే సమయంలో సంస్థ కోట్‌ను ఇద్దరు సభ్యులు అందుబాటులోకి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం. కేంద్ర హోస్ట్‌ సర్వర్‌ ఒప్పుకున్న కోట్‌ అందుబాటును దాని నుండి వచ్చే మేసేజెస్‌ క్రమం ఆధారంగా నిర్ణయిస్తుంది. అంతేకాకుండా సభ్యుడి స్పందనలు గమనించి సిస్టమ్‌ కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలను ఒప్పుకున్న కోట్‌  కు సంబంధించి నెరవేరుస్తుంది. లభించే మొత్తంలో ఒప్పుకున్న కోట్‌ను తగ్గిస్తుంది. ఆ తరవాతే వరసలో ఉన్న రెండో సభ్యుడికి అందుబాటులోకి  వస్తుంది.

ఒకవేళ మరో సభ్యుడు ఆపాటికే అందుబాటులోకి వస్తే సభ్యుడు తన కోట్‌ను మార్పు చేయవచ్చా?

  • మరోసభ్యుడు ప్రతిస్పందిస్తున్న కాలంలో కోట్‌కు కేంద్రహోస్ట్‌  సర్వర్‌ సభ్యుడి కోట్‌కులాక్‌ చేసి ఉంచుతుంది. అట్లాగే  ఒక సభ్యుడు తన కోట్‌ను మార్పుకు  తీసుకొంటే, దాని అందుబాటును ఇతరులకు ఇవ్వదు.

ససఆ/ ఎస్‌జిఎల్‌ ఖాతాదారుల తరఫున వ్యవహారాలకుగాను సవ్యవ్య వేదిక ఉపయోగిస్తుందా?

  • ఉపయోగిస్తుంది. సవ్యవ్య సభ్యుడు తన తరఫున ప్రభుత్వ సెక్యురిటీల అంతర్భాగ  ఖాతాదారుడిగా క్లయింట్‌  సూచించిన ధర ఆధారంగా కేవలం మొత్తం (అవుట్‌రైట్‌) లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. అంతర్భాగం  తరపున సభ్యుడు ప్రస్తుతం రిపోలావాదేవీని ప్రవేశింప చేయలేడు.

సవ్యవ్య ద్వారా ఫోన్‌లో జరిగిన వ్యాపారాలను నివేదించడం. తప్పనిసరా?

  • ఆన్‌లైన్‌ ద్వారా ధర సమాచార వ్యాప్తి చేయడం సవ్యవ్య లక్ష్యాలలో ఒక మౌలిక లక్ష్యం. ఈ లక్ష్యం సాధించడానికి ప్రభుత్వ సెక్యురిటీల లావాదేవీలు, ద్రవ్య విఫణి సాధనాల లావాదేవీల సమాచార వ్యాప్తి  చేస్తారు. అందుకని సవ్యవ్య ద్వారా జరగని లావాదేవీలను సవ్యవ్యకు నివేదించడం తప్పనిసరి.

మార్కెట్‌కు ఉభయ కక్షిదార్ల (అమ్మకందారు, కొనుగోలుదారు) గుర్తింపువారి పేర్లు తెలపవచ్చా?

  • తెలపకూడదు.  కక్షిదార్ల గుర్తింపును మార్కెట్లో తెలుపకూడదు. లావాదేవీకి సంబంధించిన కీలక సమాచారం అంటే సెక్యూరిటీ ఐఎస్‌ఐఎన్‌, మొత్తం (ముఖవిలువ, ధర/రేటు/లేదా సూచిత దిగుబడి, సమపద్ధతి మొ|| అనువర్తిస్తే మార్కెట్‌,  వ్యాపార వాచ్‌ ద్వారా మార్కెట్‌లో వ్యాప్తి చెందింప చేస్తారు.

సవ్యవ్యకు క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సిసిఐఎల్‌) కుమధ్య సంబంధం ఏమిటి?

  • సవ్యవ్య ఎలక్ట్రానిక్‌ వ్యాపార వేదిక . దీనిద్వారా సపవ్యకు ఇంటర్‌ఫేస్‌ లభిస్తుంది. సిసిఐఎల్‌ ఏజన్సీగా ఉండి నోవీకరణ (నోవేషన్‌) ప్రక్రియద్వారా సవ్యవ్యకు నివేదితమయ్యే  ప్రభుత్వ సెక్యురిటీలకు ఖజానా బిల్లులు, మొత్తం (అవుట్‌రైట్‌)  రిపోలకు / జరిగే వ్యాపారానికి గ్యారంటీ ఉండే పరిష్కారం విస్తరింపచేస్తోంది.

నోవీకరణ ప్రక్రియ అంటే ఏమిటి? సిసిఐఎల్‌ ద్వారా వ్యాపారాల పరిష్కార ప్రయోజనం ఏమిటి?

  • సిసిఐఎల్‌ ద్వారా  పరిష్కారం అయ్యే ప్రభుత్వ సెక్యురిటీల లావాదేవీలను నోవీకరణ ప్రక్రియగా గుర్తిస్తారు. సిసిఐ ఎల్‌ కొనుగోలుదారుగా అమ్మకందారుకు అలాగే ఏకకాలంలో అమ్మకందారు గా కొనుగోలుదారుకు సెక్యురిటీ లావాదేవీలలో వ్యవహరిస్తుంది. అందువల్ల కక్షిదార్ల మధ్య పరపతి   ప్రమాద భయం (రిస్క్‌) ఉండదు. అదీకాక సిసిఐఎల్‌ గ్యారంటీనిధి ద్వారా సభ్యులకు దినసరి మార్జిన్ల నిర్వహణ, అనుషంగిక విఫణి దినసరి మార్కింగ్‌ వంటి మెరుగయిన ప్రమాద నివారణ యాజమాన్య ఆచరణలను అమలుచేసి అదనపు సౌకర్యం కలగజేస్తుంది.

సిసిఐఎల్‌ ద్వారా వ్యాపారాలు ఎలా పరిష్కారం అవుతాయి?

  • ఒక్కసారి వ్యాపారం అయినా లేదా సవ్యవ్య కు నివేదించడం జరిగితే అది సిసిఐఎల్‌ ద్వారా లేదా ప్రత్యక్షంగా ఆర్‌బిఐ ససాఆ/ఎస్‌జిఎల్‌  ద్వారా పరిష్కారం అవుతుంది. సిసిఐఎల్‌ ద్వారా పరిష్కారం బట్వాడా వెర్సస్‌ చెల్లింపు 2 (బవెచె/డివిపి2) యంత్రాంగం  ద్వారా పరిష్కారం అవుతుంది. బవెచె -2 అంటే (వ్యాపార క్రమ ప్రాతిపదికన) మొత్తం ప్రాతిపదికన సెక్యూరిటీల పరిష్కారం, నిధులను నికరప్రాతిపదికన పరిష్కారం చేయడం అన్నమాట. ఆర్‌బిఐ ససాఆ/ఎస్‌జిఎల్‌ పరిష్కారం అంటే డివిపి/బవెచె -1 యంత్రాంగాన్ని అనుసరిస్తుంది. అంటే సెక్యూరిటీలను, నిధులను రెంటినీ నికర ప్రాతిపదికన పరిష్కరిస్తుంది.

వ్యాపారాలను సిసిఐఎల్‌ ద్వారా పరిష్కరించుకోవాలన్న నిర్బంధం ఉందా? ఎటువంటి వ్యాపారాలు సిసిఐఎల్‌ ద్వారా పరిష్కారం పొందుతాయి?

  • రిపో మార్కెట్‌ విస్తృతికి, మెరుగయిన ప్రమాద నివారణ ఆచరణలకు ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి అన్ని రిపోలావాదేవీలు సవ్యవ్యలో జరుగుతాయి /నివేదించబడతాయి. అవన్నీ సిసి ఐఎల్‌  ద్వారానే పరిష్కారం ఎందాలి. రూ.20కోట్లు అంతకు తక్కువ (ముఖవిలువ)   కటాఫ్‌ మొత్తం ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల మొత్తం (అవుట్‌రైట్‌) లావాదేవీలు సిసిఐఎల్‌ ద్వారా చేయాలని సంకల్పించింది. 20కోట్ల రూ. పైబడ్డ ప్రభుత్వ సెక్యూరిటీల మొత్తం (అవుట్‌రైట్‌)  లావాదేవీల విషయంల్‌ సభ్యులకు ప్రత్యక్షంగా ఆర్‌బిఐ ససాఆ/ ఎస్‌జిఎల్‌ లేదా సిసిఐఎల్‌ ద్వారా  అన్న అవకాశం ఉంటుంది. సవ్యవ్య సభ్యులు మాత్రమే  వారి మధ్య జరిగే వ్యవహారాలను సిసిఐఎల్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చు.

వాన్‌ పరిసరాల్లో  సమాంతర పరుగు (పారలెల్‌రన్‌) ఉంటే సభ్యులకు లభించే సహాయం ఏమిటి?

  • సవ్యవ్య ప్రయోజనాత్మకతలను (రెండురోజులు) హాండ్స్‌ ఆన్‌లను  సవివరంగా సవ్యవ్య సభ్యులకు వారి ఆవరణలో అనువర్త సాఫ్ట్‌వేర్‌ అందిస్తున్నప్పుడు తెలియచేయడం జరిగింది. అందువల్ల వాన్‌ పరిసరాల్లో పాల్గొనేవారు సమాంతర పరుగు తీయవచ్చు. ఉపయోగకరదీపికలను వారి సిస్టమ్స్‌లో ఆన్‌లైన్‌ సహాయం కోసం లోడ్‌ చేశాం. అదీకాక ఆర్‌బిఐ బృందం టెలిఫోన్‌/ఇమెయిల్‌ / ఫాక్స్‌ల ద్వారా సహాయం అందిస్తుంది. అత్యవసరమైన సమాచారం కోసం 022-2634271ఫోన్‌ను  ముంబై ప్రాంతీయ కార్యాలయం లోని ఐబిఎమ్‌- ఆర్‌టిజిఎస్‌ గదిని సంప్రదించవచ్చు.

ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate