ప్రభుత్వ సెక్యూరిటీలు - శ్రేష్ఠ నిధులు (గిల్ట్‌ఫండ్స్)
శ్రేష్ఠనిధులను సాధారణంగా మ్యూచువల్ నిధి పథకాలంటారు. వీటిని ఆస్తి యాజమాన్య కంపెనీలు ప్రవేశ పెడుతుంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడికి ఈ పథకాలు ఉపయోగిస్తుంటారు. ఈ పథకాలను ప్రభుత్వ సెక్యూరిటీలకే అంకితమైన మ్యూచువల్ నిధులు పథకాలుగా వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు ఖజానా బిల్లులు. శ్రేష్ఠనిధులు పెట్టుబడిదార్లకు భద్రతను చేకూరుస్తాయి. పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీలలో ఉండడం వల్ల మెరుగయిన ఆదాయం లభిస్తుంది. ప్రత్యక్ష పెట్టుబడులను వివిధ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టడం వల్ల శ్రేష్ఠ నిధులకు వేర్వేరు రేట్లలో ఆదాయం లభిస్తుంది. అదీకాక ప్రత్యక్ష పెట్టుబడిలో ప్రమాదభయం ఎక్కువ. మనదేశంలో మొట్టమొదట శ్రేష్ఠనిధిని 1998లో స్థాపించారు.
ఆర్‌బిఐ కల్పించే వసతులు
ఆర్‌బిఐ ద్రవ్యత్వ సహాయం, ఇతర వసతులను కల్పిస్తుంది. అంటే సహాయక సాధారణ ఆవర్జా (ససాఆ/ఎస్‌జిఎల్), కరెంట్ ఖాతాలు, రిజర్వ్‌బ్యాంకు చెల్లింపు వసతిపథకం ద్వారా నిధుల బదిలీ, ద్రవ్య విఫణి పిలుపు అందుబాటు మొ|| వసతులు శ్రేష్ఠనిధులకు లభిస్తాయి. ఈ వసతులు శ్రేష్ఠ నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌కు విస్తృత పెట్టుబడి ప్రాతిపదిక కల్పించేందుకు ప్రోత్సహిస్తాయి. శ్రేష్ఠనిధులకు లభించే వసతులివి.
- ద్రవ్యత్వ సహాయం: రిజర్వు బ్యాంకు కల్పించే ద్రవ్యత్వ సహాయ ముఖ్యోద్దేశం మ్యూచువల్ నిధులకు అసవరమయిన స్వల్పకాల ద్రవ్యత్వ అవసరాలను తీర్చి శ్రేష్ఠనిధులకు ద్రవ్యత్వ సహాయ లక్ష్యాన్ని నెరవేర్చడం. విలోమ పునః క్రయ ఒప్పందాలు (రివర్స్‌రిపో) శ్రేష్ఠనిధులకు కల్పించడం ద్వారా ఆర్‌బిఐ శ్రేష్ఠ నిధులకు ద్రవ్యత్వ సహాయం అందిస్తోంది. భారతప్రభుత్వ కాలపరిమితి సెక్యురిటీలకు విలోమ పునః క్రయ ఒప్పందాలు చేస్తారు. రిపోలావాదేవీలకు, అన్ని పరిపక్వతలపై ఖజానా బిల్లులకు వీటి అర్హత ఉంటుంది. గత పనిదినము చివరన ఉన్న శ్రేష్ఠనిధులలో నిలువ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు ఖజానా బిల్లులను పరిగణించి ప్రభుత్వ సెక్యురిటీల రో జువారీ నిల్వలో 20శాతం కి ద్రవ్యత్వ సహాయ పరిమాణాన్ని నిర్ధారిస్తారు.
- ససాఆ/ ఎస్‌జిఎల్ కరెంట్ ఖాతాలు: శ్రేష్ఠనిధులు కోరుకొనే చోట అన్ని రిజర్వ్‌బ్యాంకు కేంద్రాలలో శ్రేష్ఠనిధుల లావాదేవీలకుగాను ఆర్‌బిఐ ఒక సహాయ సాధారణ ఆవర్జా (ఎస్‌జిఎల్) ఒక కరెంటు ఖాతాను తెరుస్తుంది.
- నిధుల బదిలీ వసతి: రిజర్వ్‌బ్యాంకు చెల్లింపు వసతి పథకం కింద శ్రేష్ఠనిధులకు ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రానికి నిధుల బదిలీని కల్పిస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలలో ఆర్‌బిఐ కౌంటర్లలో వచ్చే చెక్కులను క్లియరింగ్ చేసే సౌకర్యం కల్పిస్తోంది.
- విఫణి పిలుపుకు అందుబాటు: శ్రేష్ఠనిధులు పిలుపు ద్రవ్యమార్కెట్‌లో రుణదాతలు అందుబాటులో ఉంటాయి.
- ముందుకు సిద్ధం (రెడీ ఫార్వార్డ్): శ్రేష్ఠనిధులకు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌లో ముందుకు సిద్ధమయ్యే లావాదేవీలను అనుమతించమని భారతప్రభుత్వాన్ని ఆర్‌బిఐ సూచిస్తుంది.
ద్రవ్యత్వ సహాయం
అర్హత
ప్రభుత్వ, ప్రయివేట్ రంగ, విస్తృత ముగింపు లేదా సంవృత ముగింపు ఉన్న శ్రేష్ఠనిధులకు ద్రవ్యత్వ సహాయం ఎందే అర్హత ఉంటుంది. ఇవి ఆర్‌బిఐ అందించే ఇతరవసతులు కూడా ఎందవచ్చు. శ్రేష్ఠనిధులకు భారత సెక్యూరిటీల వినిమయ మండలి అనుమతి ఉండాలి. ఈ మండలికి శ్రేష్ఠనిధులు ముసాయిదా ఆఫర్ పత్రం సమర్పించేప్పుడు దాని ప్రతిని ఆర్‌బిఐ కి కూడా సమర్పించడం అనుసరణీయం. అందువల్ల శ్రేష్ఠనిధులు ఆర్‌బిఐ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని, కాబట్టి ఆర్‌బిఐ అందించే ద్రవ్యత్వ సహాయం ఎందే వీలుంటుందని ఆర్‌బిఐ నిర్ధారించుకొంటుంది.
షరతులు
- ఆర్‌బిఐ ద్రవ్యత్వ సహాయాన్ని విలోమ పునఃక్రయ ఒప్పందం ద్వారా క్రింది షరతులకు లోబడి అందిస్తుంది.
- అర్హత ఎందిన కేంద్రప్రభుత్వ కాలపరిమితి సెక్యూరిటీలకు, అన్ని పరిపక్వతలున్న ఖజానా బిల్లుల విషయంలోఆర్‌బిఐతో పునఃక్రయ ఒప్పందాలు (రివర్స్ రిపోలు) ఉండాలి.
- విలోమ పునఃక్రయ ఒప్పందాల లావాదేవీల కోసం సెక్యూరిటీల ధరలను ఆర్‌బిఐ తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటుంది.
- ఆర్‌బిఐ విలోమ పునఃక్రయానికి శ్రేష్ఠనిధుల సెక్యూరిటీలను రూ.10లక్షలు (ముఖవిలువలలో) సమర్పించాలి.
- ఒక్కసారి 14 రోజుల గరిష్ఠకాలాన్ని విలోమ పునఃక్రయ ఒప్పంద వసతిని శ్రేష్ఠనిధులు ఉపయోగించుకోవచ్చు.
- బ్యాంకు రేటే రిపోరేటు.
- కేవలం ముంబయిలోనే ద్రవ్యత్వ సహాయం లభిస్తుంది. శ్రేష్ఠనిధులు స్వేచ్ఛగా నిధులను ఇతర ఆర్‌బిఐ కేంద్రాలకు చెల్లింపు వసతి పథకం కింద బదిలీ చేసుకోవచ్చు.
- పిలుపు /ప్రకటన ద్రవ్యమార్కెట్ లో రుణం ఇవ్వడం కోసం విలోమ పునఃక్రయ ఒప్పంద వసతి ద్వారా నిధులను పోగుచేసి శ్రేష్ఠనిధులు ఉపయోగించకూడదు.
- దరఖాస్తును పూర్తిగా తిరస్కరించేందుకు, పాక్షికంగా అంగీకరించేందుకు ఆర్‌బిఐకి అన్ని అధికారాలున్నాయి.
- శ్రేష్ఠనిధులను నుండి సముచితసమాచారాన్ని ఆర్‌బిఐ కోరే హక్కుంది. శ్రేష్ఠనిధులు ఆ సమాచారం సమర్పించాలి.
డ్రాయల్ (అందుకోవడం)
- రిజర్వ్‌బ్యాంకు నుంచి ద్రవ్యత్వ సహాయం అందుకోవాలంటే శ్రేష్ఠనిధులు కింది వాటిని నెరవేర్చాలి.
- చీఫ్ జనరల్ మేనేజర్, అంతర్గత పరపతి యాజమాన్య విభాగం, ఆర్‌బిఐ, కేం ద్ర కార్యాలయం, ముంబయి వారికి దరఖాస్తు చేసుకోవాలి.
- ద్రవ్యత్వ సహాయం కావలసిన, అందుకొందామని భావించిన రోజు మధ్యాహ్నం లోపల దరఖాస్తును (అ)లో సూచించిన విభాగానికి సమర్పించాలి.
- ఆర్‌బిఐ జారీ చేసిన అంగీకార -కమ్ - ఒప్పంద /నిర్ధారణ పత్రాన్ని సంతకం చేసి దాని డూప్లికేట్ ప్రతిని పై విభాగానికి అందజేయాలి. అప్పుడే ఒప్పందాన్ని అంగీకరించినట్లు. ముంబయి కార్యాలయంలోని సెక్యూరిటీ విభాగంలో ససాఆ/ ఎస్‌జిఎల్ బదిలీని కూడా అడగాలి.
- రిపోవ్యవధి ముగియగానే అంగీకారక ఒప్పంద నిర్ధారణ పత్రంలో సూచించిన మొత్తం కరెంట్ ఖాతాలో ఆర్‌బిఐ డెబిట్ చేసేందుకు అధికృతి కల్పించాలి.
- సెక్యూరిటీల పునః క్రయం కోసం ససాఆ/ ఎస్‌జిఎల్ బదిలీ ఫారంను సమర్పించాలి.
- ద్రవ్యత్వ సహాయ మొత్తాన్ని కరెంట్‌ఖాతాలో ప్రత్యక్షజమగా ఎందాలి. ఈ సమ్ము ఎందేనాటికి ఖాతా ఆర్‌బిఐ ముంబయిలో ఉండాలి.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.