অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యాపార సంస్థలపై తరచు అడిగే ప్రశ్నలు

నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యాపార సంస్థలపై తరచు అడిగే ప్రశ్నలు

  1. నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యాపార సంస్థ అంటే ఏమిటి?
  2. నా.బ్యాం.ఆ.వ్యా.సం.లు చేసేకార్యకలాపాలు బ్యాంకుల మాదిరిగానే వుంటాయి. మరి బ్యాంకులకు నా.బా.ఆ.వ్యా.సం.లుకు మధ్య వున్న తేడా ఏమిటి?
  3. భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదు కాబడిన నా.బ్యా.ఆ.వ్యా.సం.లు.
  4. పెట్టుబడి పెట్టే సమయంలో డిపాజిట్టుదారుడు, ఈ నా.బా.ఆ.వ్యా.సం.లకు సంబంధించి గమనించవలసిన ఇతర ముఖ్యాంశాలేమిటి?
  5. సి.ఎల్‌.బి. యొక్క వివిధ బెంచ్‌ల అధికారుల చిరునామాలు, వాటికి సంబంధించిన అధికార పరిధుల వివరాలు ఇవ్వగలరా?
  6. నా.బ్యా.ఆ.వ్యా.సం లకు సంబంధించి ఆచరించవలసిన దూరాలోచనతో, వివేకంతో విధించినటువంటి వివిధ నిబంధనలేమిటి?
  7. ప్రజానీకము వద్దనుండి స్వీకరించిన డిపాజిట్లను కంపెనీ ముందుగానే చెల్లించవచ్చా?
  8. డిపాజిట్లు   స్వీకరించే కంపెనీలకు సంబంధించిన , ద్రవ రూపంలో ఉండాల్సిన ఆస్తులు (లిక్విడ్‌ ఎసెట్స్‌) ఏమిటి?
  9. అవశిష్ట (బాకీ వున్న, రెసిడ్యుయరి) నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ (ఆర్‌.ఎన్‌.బి.సి) అంటే ఏమిటి? ఇతర నా.బ్యా.ఆ.వ్యా.సం. లకు దీనికీ తేడాఏమిటి?

నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యాపార సంస్థ అంటే ఏమిటి?

  • నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యాపార సంస్థ (ఎన్‌.బి.ఎఫ్‌.సి) కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదు (రజిస్టరు) కాబడి, రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే కార్యకలాపాలలోనూ, ప్రభుత్వము వారి ద్వారా గాని, సంస్థలు లేక అటువంటి ఇతర సెక్యూరిటీల ద్వారా జారీచేయబడిన షేర్లు / స్టాక్సు/ బాండ్లు/ డిబెంచర్లు/ సెక్యూరిటీస్‌ మున్నగు వాటిని స్వాధీనం చేసుకుని, ఆ విధమైన వాటిని మార్కెటింగ్‌ చేసే వ్యాపారం, తాకట్టుపెట్టడం, అద్దె కొనుగోలు చేయడం, భీమా (ఇన్య్సూరెన్స్‌) వ్యాపారం, చిట్‌ల వ్యాపారం కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను నిర్వర్తించే సంస్థ, అయితే ఇది పారిశ్రామిక వ్యాపకాల స్థిరాస్తులను అమ్మకం, కొనుగోలు చేయడం గాని మాత్రం కాదు. నా.బ్యా.ఆ.వ్యా.సం. కూడా ఒక నమోదు (రిజిస్టరు) చేయబడిన కంపెనీలాంటిదే అయినప్పటికీ, దాని ముఖ్య వ్యాపారం ఏ స్కీము ప్రకారంగా కానీ అప్పులివ్వడం చేస్తున్నప్పటికీ, అది కూడా ఒక నా.బ్యా.ఆ.వ్యా.సం. సంస్థే. (అవసిస్టమైన (రెసిడ్యుయరీ) అధికారాల ప్రకారం, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థ)

నా.బ్యాం.ఆ.వ్యా.సం.లు చేసేకార్యకలాపాలు బ్యాంకుల మాదిరిగానే వుంటాయి. మరి బ్యాంకులకు నా.బా.ఆ.వ్యా.సం.లుకు మధ్య వున్న తేడా ఏమిటి?

నిజమే. నా.బ్యా.ఆ.వ్యా.సం.ల పని కూడా బ్యాంకులు చేసే మాదిరిగానే వుంటుంది. కాని, వాటిమధ్య కొన్ని తేడాలున్నాయి.

  1. నా.బ్యాం.ఆ.వ్యా.సం.లు డిమాండ్‌ డిపాజిట్లను స్వీకరించలేవు.
  2. డబ్బు చెల్లించడం (పేమెంట్‌ చేయడం) లేకపోతే ఒక పరిష్కారం (సెటిల్మెంట్‌ ) చేసే పద్ధతి కూడా కాదు. అందుచేత ఏవిధమైన చెక్కులు కూడా కక్షిదారులకు (క్లెయింట్లకు) జారీచేయడం కూడా చేయలేదు.
  3. డి.ఐ.సి.జి.యొక్క డిపాజిట్టు సౌకర్యం నా.బ్యా.ఆ.వ్యా,.సం.లకు మమూలు బ్యాంకులలో మాదిరిగా లభ్యం కాదు.

ప్రతి వా.బ్యా.ఆ.ప్యా.సం. తప్పనిసరిగా భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదు (రిజిస్టరు) చేయించుకోవాలా?

  • భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934లోని సెక్షన్‌  45-1ఏ ప్రకారం, ప్రతీ నా.బ్యా.ఆ.వ్యా.సం భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదు చేయించకోవడం, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934 లోని సెక్షను 45-1లోని నిబంధననుసరించి అట్టి సంస్థ నా.బ్యా.ఆ.వ్యా.సం.గా వ్యాపార కలాపాలను నిర్వహించుకోవాలంటే చట్టప్రకారం తప్పనిసరి.
  • ఏమైనప్పటికీ, ద్వంద్వ నింబంధన (డ్యుయల్‌ రిగ్యులేషన్‌)ను నివారించడానికి, తప్పించడానికి, ఇతర క్రమబద్ధీకరణ చేయు వ్యవస్థాపనల ద్వారా క్రమబద్ధీకరణ చేయబడివున్న కొన్ని తరగతులకు చెందిన నా.బ్యా.ఆ.వ్యా.స.లకు రిజర్వు బ్యాంకు వద్ద నమోదు చేయించుకోవడం మినహాయింపబడింది. అనగా సెబి (సెక్యూరిటి ఎక్చేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) వద్ద నమోదు కాబడిన వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌/మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు/ స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలు, ఐ.ఆర్‌.డి.ఏ.వారు జారీచేసిన రిజిస్ట్రేషన్‌ లేక అధీకృత ధృవపత్రాలను (వ్యాలిడ్‌ సర్టిఫికెట్‌) వున్నవాటికి కంపెనీల చట్టం 1956లోని సెక్షన్‌ 620 ఏ ప్రకారం ప్రకటించిన నిధి కంపెనీలకు, చిట్‌ఫండ్స్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 2, నిబంధన (బి)లో వివరించినట్లుగా లేక జాతీయ  హౌసింగ్‌ (గృహవసతి కలిగించు) బ్యాంకు ద్వారా క్రమబద్ధీకరణ చేయబడుతున్న హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు.

భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదు కాబడిన నా.బ్యా.ఆ.వ్యా.సం.లు.

  • సాధన సామగ్రిని / పరికరాలను బాడుగకిచ్చు కంపెనీలు
  • అద్దె - కొనుగోలు  వసతి కల్పించు  కంపెనీలు.
  • ఋణాలిచ్చే కంపెనీలు
  • పెట్టుబడినిచ్చు / పెట్టే కంపెనీలు.
  • అవశిష్ట (బాకీవున్న) (రెసిడ్యుయరీ) నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ.

ఈ పైన చెప్పిన కంపెనీలను, ఇంకా కొంచెం వివరంగా  విభజించి చెప్పాలంటే డిపాజిట్లు స్వీకరించేవి. స్వీకరించనివిగా రెండు రకాలైనవిగా చెప్పవచ్చు.

భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదు (రిజిస్టరు) చేయించుకోవాలంటే కావలసని అర్హతలేమిటి?

  • కంపెనీల చట్టం 1956 ప్రకారం చట్టబద్దంగా స్థాపించబడిన ఒక సంస్థ భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934లోని సెక్షన్‌ 45-1 (ఏ)లో వివరించిన ప్రకారం ఒక నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్ధిక వ్యాపార సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి)గా వ్యాపార కలాపాలను ఆరంభించాలనే ఉద్దేశ్యం కలిగినపుడు కనీసం సంతంగా 25లక్షల రూ.లు మేరకు నిధులు కలిగివుండాలి (ఏప్రిల్‌ 21, 1999 నుండి ఇది 200లక్షల రు.లకు పెంచబడింది) బ్యాంకు వారి పరిశీలన, అనుమతి కొరకు నిర్దేశింపబడిన ఫారమ్‌లో నమోదు కొరకు  అవసరమైన ఇతర డాక్యుమెంట్లన్నీ జతచేస్తూ, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అటుపిమ్మట భారతీయ రిజర్వు బ్యాంకు వారు భారతీయ రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్‌   45-1(ఎ) ప్రకారం అన్ని నియమాలకు అనుగుణంగా దరఖాస్తు చేయడం జరిగిందని సంతృప్తి చెందినచో, నమోదిత యోగ్యతాపత్రాన్ని (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) జారీ చేస్తారు.

నమోదు కాబడిన నా.బ్యా.ఆ.వ్యా.సం.ల జాబితాను మరియు వాటికై నిర్దేశింపబడిన నియమావళిని ఎక్కడ చూడగలం?

  • భారతీయ రిజర్వు బ్యాంకు వారి వెబ్‌సెట్‌లో నమోదు కాబడిన నా.బ్యా.ఆ.వ్యా.సం.ల జాబితాను  www.rbi.org.in. భారతీయ రిజర్వు బ్యాంకు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇదే సైటులో ఎప్పటికప్పుడు నా.బా.ఆ.వ్యా.సం.లకు జారీచేసే నియమనిబంధనావళిని కూడా చూడవచ్చు. దీంతోపాటుగా ఈ నియమనిబంధనావళి అధికారిక గెటిజ్‌ నోటిఫికేషనులో కూడా జారీచేయబడుతువంది. పత్రికా ప్రకటనలు కూడా ప్రజానీకము / నా.బా.ఆ.వ్యా.సం. యొక్క దృష్టిని ఆకర్షించేందుకు విడుదల చేయబడుతూ ఉంటాయి.

అన్ని నా.బా.ఆ.వ్యా.సం.లు డిపాజిట్లను స్వీకరించవచ్చా? ప్రజానీకము వద్దనుండి డిపాజిట్లను స్వీకరించడానికి కావలసిన అర్హతలేమిటి?

  • అన్ని నా.బా.ఆ.వ్యా.సంలకు డిపాజిట్లను స్వీకరించే సౌకర్యము లేదు. కేవలం అధికారికంగా నమోదు చేయబడిన యోగ్యతాపత్రము   (వాలిడ్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌) కలిగి  వున్నప్పుడే ప్రజానీకము నుండి డిపాజిట్లను స్వీకరించుటకు / ప్రజల వద్దనుండి స్వీకరించిన అటువంటి డిపాజిట్లను తమవద్ద ఉంచుకోవడానికి ఈ నా.బా.ఆ.వ్యా.సంలకు అర్హత ఉంది. అదనంగా ప్రజానీకమును డిపాజిట్లను స్వకీరించే నా.బా.ఆ.వ్యా.సంలకు స్వంతంగా, వికరంగా, కనీస పరిమితికి లోబడి నిధులు (నెట్‌ ఓన్డ్‌ ఫండ్స్‌) ఉండాలి. అలాగే బ్యాంకువారు జారీచేసిన నియమనిబంధనలకు కూడా లోబడి ఉండాలి.

ప్రజానీకమునుండి స్వీకరించే డిపాజిట్లకు ఏమైనా గరిష్ట పరిమతి వుందా? నా.బా.ఆ.వ్యా.సం.లు స్వీకరించే డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఎంత? డిపాజిట్లకు కాలవ్యవధి ఎంత ఉంటుంది?

  • అవును. ప్రజానీకము నుండి స్వీకరించే డిపాజిట్లపై గరిష్ట పరిమితి ఉంది. కావలసిన ఏన్‌.ఓ.ఎఫ్‌/సి.ఆర్‌.ఏ.ఆర్‌ లతో పాటుగా ఖచ్చితమైనప్రమాణాలను, నిబంధనలను పాటిస్తూ ఉంటే నా.బా.ఆ.వ్యా.సం.లు ఈ క్రిందివిధంగా ప్రజానీకంనుండి డిపాజిట్లను స్వీకరించవచ్చు.
నా.బా.ఆ.వ్యా.సం.ల యొక్క శ్రేణి/ తరగతి ప్రజల డిపాజిట్లపై ఉండే గరిష్ట పరిమితి
ఇల్‌/హెచ్‌.పి.రకానికి చెందిన కంపెనీలు 15శాతం సి.ఆర్‌.ఏ.ఆర్‌.ను పాటిస్తూ వుండి క్రెడిట్‌ రేటింగ్‌ లేకుండా ఉన్నవి ఎన్‌.ఓ.ఎఫ్‌.మీద 1.5 రెట్లు లేక రు||లు పదికోట్లు, ఏది తక్కువైతే అది.
సి.ఆర్‌.ఏ.ఆర్‌. పాటిస్తూ, 12శాతంతో వుండే ఇల్‌/హెల్‌.పి.కంపెనీలు, కనీసస్థాయి (మినిమమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (గ్రేడ్‌) పెట్టుబడులు శ్రేణి క్రెడిట్‌ రేటింగ్‌ కలిగివున్నప్పుడు. ఎన్‌.ఓ.ఎఫ్‌.పై నాలుగు రెట్లు.
ఎల్‌.సి/ ఐ.సి. కలిగివుండి, సి.ఆర్‌.ఏ.ఆర్‌.లో 15శాతంతో ఉండే కంపెనీ, కనీసస్థాయి పెట్టుబడుల శ్రేణ క్రెడిట్‌ రేటింగ్‌ కలిగివున్నప్పుడు ఎన్‌.ఓ.ఎప్‌.పై 1.5 రెట్లు.
ప్రస్తుతం ఒక నా.బా.ఆ.వ్యా.సం. అత్యధికంగా వడ్డీ 11శాతం ఇవ్వగలదు. ఈ వడ్డీ చెల్లింపు చేయబడుతుంది. లేకపోతే నిరామంతో, ఒక నెల వ్యవధికి తక్కువ కాకుండా చక్రవడ్డీకి లెక్కింప బడుతుంది.
నా.బ్యా.ఆ.వ్యా.సం లు ప్రజలనుండి డిపాజిట్లను స్వీకరించుట / ఎడిగించుట/పునరుద్ధరణ చేయుటకు వీలు   కలిగింపబడింది. కనీసం 12 నెలల వ్యవధి వరకూ, అలాగే, అత్యధికంగా 60నెలల కాల వ్యవధికి, తిరిగి చెల్లింపు చేయబడే డిపాజిట్లను, చెల్లించమని ఒత్తిడిచేసే డిపాజిట్లను స్వీకరించడం నా.బ్యా.ఆ.వ్యా.సం. లకు వీలుగాదు.
ఈ చిరుపుస్తకంలో మరోచోట వివరించినట్లుగా ఈ నా.బా.ఆ.వ్యా.సం.లు డిపాజిట్ల స్వీకరణలో వివిధ రకములైన నియమాలను కలిగి ఉన్నారు.

పెట్టుబడి పెట్టే సమయంలో డిపాజిట్టుదారుడు, ఈ నా.బా.ఆ.వ్యా.సం.లకు సంబంధించి గమనించవలసిన ఇతర ముఖ్యాంశాలేమిటి?

  1. నా.బ్యా.ఆ.వ్యా.సం.లకకు సంబంధించి, కొన్ని ముఖ్యాంశాలు, నిబంధనలు ఈ క్రింద ఉదహరింపబడ్డాయి.
  2. నా.బ్యా.ఆ.వ్యా.సం.లు ప్రజలనుండి డిపాజిట్లను స్వీకరించుట/ఎడిగించుట/ పునరుద్ధరణ చేయుటకు వీలు కలిగింపబడింది.కనీసం 12 నెలల వ్యవధి వరకూ, అలాగే, అత్యధికంగా 60నెలల కాల వ్యవధికి, తిరిగి చెల్లింపు చేయబడే డిపాజిట్లను, చెల్లించమని ఒత్తిడిచేసే డిపాజిట్లను స్వీకరించడం నా.బ్యా.ఆ.వ్యా.సం. లకు వీలుగాదు.
  3. ఎప్పటికప్పుడు భా.రి.బ్యాంకు వారు నిర్దేశించిన గరిష్ట రేట్లకంటే ఈ నా.బా.ఆ.వ్యా.సం.లు ఎక్కువగా వడ్డీనివ్వకూడదు. ప్రస్తుతం వున్న ఈ గరిష్ట పరిమితి సాలీనా 11శాతం. ఈ వడ్డీని చెల్లింపు చేయుటగాని లేక చక్రవడ్డీకి లెక్కించుట గాని ఒక నెలకంటే తక్కువ విరామంతో వుండేలాగ చేయవచ్చు.
  4. డిపాజిటర్లకు నా.బా.ఆ.వ్యా.సం.లు బహుమతులనుగాని / ప్రోత్సాహకాలనుగాని, మరే ఇతర ప్రలోభాలను గానీ యివ్వకూడదు.
  5. నా.బా.ఆ.వ్యా.సంలకు (కొన్ని రకాల సాధన సామగ్రిని పరికరాలను బాడుగకిచ్చుట/ అద్దె కొనుగోలు వసతి కల్పించుట చేయు ఆర్థిక కంపెనీలు తప్ప) కనీసస్థాయిలోనైనా పెట్టుబడి పట్టే రకాల క్రెడిట్‌ రకాల క్రెడిట్‌ రేటింగ్‌ కలిగి ఉండాలి.
  6. నా.బా.ఆ.వ్యా.సం.లలో డిపాజిట్టు చేసుకునే డిపాజిటర్లకు భీమా (ఇన్సురెన్సు) సౌకర్యం లేదు
  7. నా.బా.ఆ.వ్యా.సంలలో పెట్టే డిపాజిట్లను తిరిగి చెల్లింపు చేయుటకు భారతీయ రిజర్వు బ్యాంకు, వారి హామీగాని, పూచీకత్తు గానీ లేదు.
  8. డిపాజిట్ల నాహ్వానిస్తూ కంపెనీ ఇచ్చే దరఖాస్తు ఫారమ్‌లో కంపెనీ గురించి తప్పనిసరిగా, విధిగా కొన్ని  విషయాలను వెల్లడి జేయాల్సి ఉంటుంది.

డిపాజిట్‌ మరియు పబ్టిక్‌ డిపాజిట్‌ అంటే ఏమిటి? ఎక్కడైనా ఇది వివరింపబడిందా?

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934లోని సెక్షన్‌ 45-1 (బిబి)లో డిపాజిట్‌ అనే మాటకు నిర్వచనం ఇవ్వబడింది. డిపాజిట్టులో కలిసి వుండేది మరియు అట్లు కలిసి ఉన్నదనే భావన కలిగించేది డిపాజిట్టు ద్వారా సేకరించిన ఏ డబ్బైనా సరే, ఒక  డిపాజిట్టు రూపంలో లేక ఏ సొమ్మునైనా ఒక డిపాజిట్టు రూపంలో స్వీకరించడం లేక ఒక అప్పుగా గాని లేక మరే రూపంలో నైనాగాని. కానీ, ఈ క్రింద చూపినవి మాత్రం డిపాజిట్‌తో కలిసి ఉండవు.

  • ఒక సంస్థ (ఫరమ్‌) లోని భాగస్వాములు మూలధనంగా పెట్టుబడి పెట్టడానికి షేర్‌ క్యాపిటల్‌ ద్వారాను, లేక చందా వేసుకున్న మూలధనంగా గాని సేకరించినటువంటి సొమ్ము.
  • భారతీయ రిజర్వుబ్యాంకు వివరించినట్లుగా ఒక షెడ్యూల్డ్‌ బ్యాంకు నుండి గాని, సహకార బ్యాంకు నుండి గాని, లేక ఒక బ్యాంకింగ్‌ సంస్థ నుండి గాని, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ (స్టే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) నుండిగాని, ఐ.డి.బి.ఐ నుండి గాని లేక మరే ఇతర సంస్థ నుండి గాని తీసుకున్న సొమ్ము.
  • మామూలుగా వ్యాపారం చేసే విధానంలో సెక్యూరిటీ డిపాజిట్లుగా తీసుకున్నటువంటి సొమ్ముగాని, డీలర్షిప్‌గాని, ఎర్నెస్టుమనీ గా వ్యవహరించే సొమ్ముగాని, వస్తువులనుగాని ఆస్తులను గాని లేక సేవలను గాని, కలుగచేయడానికి ముందుగా అడ్వాన్సుగా తీసుకునే సొమ్ముగాని.
  • ఒక సమూహిక సంస్థ (కార్పొరేట్‌ బాడీ) నుండి తీసుకున్నసొమ్ము తప్ప, డబ్బు అప్పు ఇచ్చే నమోదు (రిజిస్టరు) కాబడిని వ్యక్తి నుండి తీసుకున్న సొమ్ము గాని.
  • ఒక చిట్‌కు సంబంధించి తీసుకున్న చందా లేక చెల్లింపు ద్వారా సేకరించిన సొమ్ము.
  • నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్ధిక సంస్థలు ప్రజానీకము వద్ద నుండి స్వీకరించే డిపాజిట్లు (రిజర్వుబ్యాంకు) నిబంధనలు 1998 ( నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ యాక్సెప్టెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ డిపాజిట్స్‌ డైరనెక్షన్స్‌ 1998) లోని పేరా 2(1)(12) పబ్లిక్‌ డిపాజిట్‌ ను ఒక డిపాజిట్‌గా నిర్వచనం ఇచ్చింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం 1934 లోని సెక్షన్‌ 45-1 (బిబి)లో వివరించినట్లుగా అయితే, ఈ క్రింది వాటిని మాత్రం ఈ వివరణ నుండి మినహాయించింది.
  • కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం లేక వేరు ఇతరములైన ఏ ఆధారాల ద్వారాగాని, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల హామీ, పూచీకత్తు (గ్యారంటీ) ఉన్నప్పుడు లేక స్థానిక సంస్థల నుండి తీసుకున్న ఏ సమ్మైనా  గాని లేక విదేశ ప్రభుత్వాల నుండి తీసుకున్న సొమ్ముగాని లేక ఒక విదేశీయుడు /సంస్థ / వ్యక్తి వద్ద నుండి తీసుకున్నటువంటి సొమ్ముగాని.
  • ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న ఏ సమ్మైనాగాని.
  • వేరే ఇతర కంపెనీల నుండి తీసుకున్నసొమ్ము గాని, అంతర్‌ సామూహిక (ఇంటర్‌ కార్పొరేట్‌) సంస్థ నుండి డిపాజిట్‌గా తీసుకున్న సొమ్ము.
  • షేర్లకు, స్టాకునకు, బాండ్లకు, లేక కేటాయింపు నిలుపుదలలో ఉన్న డిబెంచర్లకు లేకపోతే ముందుగానే కాల్స్‌కు సంబంధించిన అడ్వాన్సులు, కంపెనీ యొక్క ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ప్రకారం ఇటువంటి సొమ్ము  సభ్యులకు తిరిగి చెల్లింపబడని సమ్మైనచో.
  • ఒక ప్రయివేటు కంపెనీ ద్వారా షేరు హోల్డర్లు తీసుకున్న సొమ్ము.
  • ఒక నా.బా.ఆ.వ్యా.సం. డైరక్టర్ల వద్ద నుండి గాని లేక వారి బంధువుల నుండి గాని తీసుకున్న సొమ్ము.
  • కొన్ని నియమాలకు లోబడి స్థిరాస్థినీ గానీ, లేక   కంపెనీ యొక్క ఎటువంటి ఆస్థినైనా గానీ తాకట్టుగా పెట్టి, వాటిద్వారా బాండ్లకు గాని లేక డిబెంచర్లను గాని జారీచేసిన వాటిపై వచ్చిన సొమ్ము.
  • హామీ / పూచీకత్తు లేని ఋణాల ద్వారా ఎమోటర్లు తీసుకొని వ చ్చిన సొమ్ము.
  • ఏ సమ్మైనా ఒక మిశ్రమ అప్పుగా (హైబ్రిడ్‌ డెట్‌) లేక అప్రధానమైన అప్పు (సబార్డినేటెడ్‌ డెట్‌)గా తీసుకున్నప్పుడు.
  • కమర్షియల్‌ పేపరు జారీ చేయడం ద్వారా తీసుకున్న ఏ సొమ్మైనా.

ఈ విధంగా, ఈ నిబంధనలు, స్వయంగా నిర్ణయం తీసుకొనే సామర్థ్యం ఉన్న అభిజ్ఞ వర్గాలనుండి సేకరించిన డిపాజిట్లను ప్రజలవద్ద నుండి తీసుకునే డిపాజిట్‌ అనే నిర్వచనం నుండి మినహాయించబడింది.

సురక్షితమైన, పూచీ వున్న డిబెంచర్లు ప్రజల నుండి స్వీకరించిన డిపాజిట్లుగా పరిగణింపబడతాయి. లేకపోతే వాటిని క్రమబద్ధీకరించేదెవరు?

  • కంపెనీ యొక్క స్థిరాస్తులను లేక ఇతర ఆస్తులను తాకట్టు పెట్టగా వచ్చిన దానితో డిబెంచర్లను తీసుకోవచ్చు. అయితే ఆవిధంగా  సమకూర్చుకున్న సొమ్ము ఈ స్థిరాస్తులు మార్కెట్‌ విలువకంటే అధికంగా, మించి ఉండకూడదు. వీటిని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌  కంపెనీస్‌ యాక్సెప్టెన్స్‌ పబ్లిక్‌ డిపాజిట్స్‌  (రిజర్వ్‌బ్యాంకు) డైరెక్షన్స్‌ ననుసరించి ప్రజానీకము వద్దనుండి స్వీకరించిన డిపాజిట్ల యొక్క నిర్వచనం నుండి మినహాయించడం జరిగింది. సురక్షిత, పూచీకత్తు మీద ఉన్న డిబెంచర్లు అపుర్ప పత్రాలుగా పరిగణింపబడి, సెక్యూరిటీస్‌ ఎక్చేంజెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) వారిచే క్రమబద్దీకరణ చేయబడుతున్నాయి.

ప్రవాస భారతీయుల నుండి నా.బ్యా. ఆ.వ్యా.సం.లు డిపాజిటలు స్వీకరించవచ్చా?

  • ఏప్రిల్‌ 24, 2004 నుండి నా.బా.ఆ.వ్యా.సం.లు విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి డిపాజిట్లను స్వీకరించడం లేదు. ఎన్‌.ఆర్‌.ఐ.ల యొక్క డెబిట్‌ ఖాతాకు డిపాజిట్లను ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాకు జమచేయడం మినహాయించి, అది కూడా అటువంటి సొమ్ము ఇన్వర్బ్‌ రెమిట్జెన్స్‌ లేక ఎస్‌.ఆర్‌.ఇ/ ఎఫ్‌.సి.ఆర్‌.( బి) ఖాతాకు బదిలీ చేయబడినటు వంటిదై వున్నప్పుడు తప్ప. ఏమైనప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఎన్‌.ఆర్‌.ఐ.డిపాజిట్లను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.

నా.బా.ఆ.వ్యా.సం.లలో డిపాజిట్‌ దార్లకు నామినేషన్‌ సౌకర్యం ఉందా?

  • అవును. నా.బా.ఆ.వ్యా.సం.ల డిపాజిటర్లకు నామినేషన్‌ సౌకర్యం ఉంది. రిజర్వుబ్యాంకు చట్టం  1934లోని సెక్షన్‌ 45 క్యు.బి. క్రింద నామినేషన్‌ సౌకర్యానికి సంబంధించిన  నియమాలు, రూల్సు వివరించబడ్డాయి. నా.బ్యా.ఆ.వ్యా.సం.ల బ్యాంక్‌ రిగ్యులేషన్స్‌ చట్టం 1949లోని సెక్షన్‌ 45 జడ్‌.ఏ. క్రింద బ్యాంకింగ్‌ కంపెనీల  (నామినేషన్‌) రూల్సు 1985ను అనుసరించవలసిందిగా సూచించడం జరిగింది. ఆవిధంగా నా.బ్యా.ఆ.వ్యా.సం.ల యొక్క డిపాజిటర్‌/లు నా.బ్యా.ఆ.వ్యా.సంలు తిరిగి డిపాజిట్‌ సొమ్మును దురదృష్టవశాత్తు డిపాజిటర్‌ చనిపోయిన సందర్భంలో వాపసు ఇవ్వడానికి  అనువుగా ఒక వ్యక్తిని నామినేట్‌ చేయడానికి అనుమతింపబడ్డారు. ఈపైన చెప్పబడిన రూల్సు ప్రకారం ఇవ్వబడిన ఒక నిర్నీత ఫారమ్‌లో డిపాజిటర్లు  తమ నామినేషన్‌ ఇవ్వడానికి వీలు కల్పించబడి, నా.బ్యా.ఆ.వ్యా.సం.లు వారికి అటువంటి నామినేషన్లను అంగీకరించ వలసిందిగా సలహా ఇవ్వడం జరిగింది. ఇదిఫారమ్‌ డి.ఏ.1 నామినేషన్‌ కొరకు, అలాగే ఫారాలు డి.ఏ- 2 మరియు డి.ఏ-3లు నామినేషన్‌ ఉపసంహరించు (కాన్సిల్‌) కోవడానికి గాని లేక ఏదైనా మార్పు ఉన్నచో చేసుకోవడానికి నిర్దేశింపబడ్డాయి.

సొమ్మును నా.బ్యా.ఆ.వ్యా.సం.లలో డిపాజిట్‌ చేసేటప్పుడు డిపాజిటరు ఇంకా దేని గురించి ఆలోచించాలి? ఎటువంటి విషయాలపై దృష్టి  పెట్టాలి?

నా.బ్యా.ఆ.వ్యా.సం.లలో సొమ్ము డిపాజిట్‌ చేసే ముందు డిపాజిటర్లు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

  1. ప్రజలనుండి సేకరించే డిపాజిట్లు భద్రత, పూచీకత్తు లేనటువంటివి.
  2. డిపాజిటరు పేరుతో సహా ఇతర వివరాలిచ్చే అంటే డిపాజిట్‌ చేసిన తేదీ, డిపాజిట్‌ సొమ్ము అక్షరాలలోనూ, అంకెలలోనూ కూడా వ్రాయబడి ఉండి, వడ్డీ ఇచ్చే రేటు, డిపాజిట్‌ పరిపక్వత  (మెచ్యూరిటీ) చెందే తేది, మొ||గు వివరాలతో వుండే రశీదును ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పాలి. ఈ రశీదుపై కంపెనీ ఈ పనిని చేయుటకై అధీకృతంగా నియమింపబడ్డ అధికారి యొక్క సంతకం చేయబడి ఉండాలి.
  3. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రస్తుత పరిస్థితిలో ఇటువంటి కంపెనీ యొక్క ఆర్థిక బాగోగులను గురించి ఏ విధమైన బాధ్యత తీసుకోవడంగాని, పూచీకత్తు (గ్యారంటీ) ఇవ్వడం గాని చేయదు, లేక కంపెనీ చేసిన ఏ విధమైన ప్రకటనలకు సంబంధించిన నిజానిజాల గురించి గానీ, ఏ విధమైన ప్రాతనిధ్యం, నిరూపణకు సంబంధించి కంపెనీ చేసిన ప్రకటనలకు గానీ లేక వాటి అభిప్రాయాలతో ఏకీభవించడం గాని లేక డిపాజిట్లు తిరిగి చెల్లింపుల గురించి గాని, వాటికున్న అప్పులను తీర్చుకునే విధానం గురించి గాని ఏ విధమైన బాధ్యతను భారతీయ రిజర్వుబ్యాంకు తీసుకోదు.

డిపాజిట్లను స్వీకరించే ముందు నా.బ్యాం.ఆ.వ్యా,సం.లకు రేటింగ్‌ వుండడం అవసరం అని చెప్పబడింది. నిజమేనా? వీటిని రేట్‌ చేసెదెవరు?

  • రేట్‌ చేయబడిన నా.బ్యాం.ఆ.సం.లు కొన్ని పరికరాలను సామగ్రిని బాడుగకిచ్చే లేక అద్దె - కొనుగోలు ఇచ్చే కొన్ని కంపెనీలు తప్ప, ప్రజలవద్దనుండి డిపాజిట్లను స్వీకరించవు. రేటింగ్‌ చేయబడని ఇ.ఎల్‌/ హెచ్‌.పి. 15శాతం సి.ఆర్‌. ఏ.ఆర్‌.తో వున్న కంపెనీల విషయంలో మినహాయింపు ఇవ్వబడి, అవి ప్రజల యొద్ద నుండి డిపాజిట్లను ఎన్‌.ఓ.ఎఫ్‌.పై 1.5. రెట్లు వరకూ లేక 10కోట్ల రు||లు వరకూ,  ఏది తక్కువగా ఉంటే అది, స్వీకరించవచ్చు క్రెడిట్‌ రేటింగ్‌ లేకపోయినప్పటికీ కూడా... నా.బ్యాం.ఆ.వ్యా.సం. ఈ క్రింద చూపబడిన 4 రేటింగునిచ్చే ఏజన్సీలతో దేనినుండైనా రేటింగును తనంతట తానే తెచ్చుకోవచ్చును.
  • క్రైసిల్‌        CRISIL
  • కేర్‌            CARE
  • ఇక్రా           ICRA
  • ఫిట్చ్‌ రేటింగ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లి.
రేటింగ్‌ ఏజన్సీల పేర్లు కనీసస్థాయి పెట్టుబడి పెట్టే శ్రేణి క్రెడిట్‌ రేటింగ్‌ (ఎమ్‌.ఐ.జి.ఆర్‌)
క్రైసిల్‌        CRISIL
కేర్‌            CARE
ఇక్రా           ICRA
ఫిట్చ్‌ రేటింగ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లి.
FA- (FA MINUS)
MA- (MA MINUS)
CARE BBB (FD)
tA- (ind) (FD)

ఏ-1 అన్నది ఏకి సమానం కాదు. ఏఏ - ఏఏ కు సమానం కాదు. అలాగే ఏఏఏ - ఏఏఏ కు సమానం కాదన్న విషయాన్ని గమనించాలి.

ఇంకా రేటింగ్‌ చెయ్యవలసి వున్న నా.బ్యాం.ఆ.వ్యా.సం. ప్రజల వద్దనుండి డిపాజిట్‌ను స్వీకరించవచ్చా?

  • కుదరదు. నా.బ్యా.ఆ.వ్యా.సం. రేటింగ్‌ ఎందకుండా డిపాజిట్లను స్వీకరించరాదు. ఇ.ఎల్‌/హెచ్‌.పి. 15శాతం సి.ఆర్‌.ఏ.ఆర్‌తో వున్న కంపెనీల విషయంలో మినహాయింపు ఇవ్వబడి, అవి ప్రజల యొద్ద నుండి డిపాజిట్లను ఎన్‌.ఓ.ఎఫ్‌. పై 1.5 రెటలు వరకూ  లేక 10కోట్లరూ.   వరకూ, ఏది తక్కువగా వుంటే అది, స్వీకరించవచ్చు క్రెడిట్‌ రేటింగ్‌ లేకపోయినప్పటికీ కూడా.

కంపెనీ యొక్క రేటింగ్‌ క్రింది స్థాయికి కుదించివేయబడినప్పుడు ప్రజానీకము నుండి స్వీకరించిన డిపాజిట్ల స్థాయిని కూడా అది వెంటనే దక్కించుకోవాలా? లేకపోతే కొంత కాలవ్యవధిలో అలా చేసుకోవచ్చా?

  • ఒక నా.బ్యాం.ఆ.వ్యా,.సం. యొక్క కనీస స్థాయిలో పెట్టుబడి పెట్టే కంటే తక్కువస్థాయిలో కి  రేటింగ్‌ తగ్గించివేయబడినట్లయితే, అది వెంటనే ప్రజలవద్ద నుండి డిపాజిట్లను స్వీకరించడం నిలిపివేయాలి. పనిచేయు 15 రోజులలో రిజర్వు బ్యాంకు వారికి పరిస్థితిని నివేదించాలి. ప్రజల వద్దనుండి పరిమితి కంటే ఎక్కువగా వసూలు చేసిన 3 సం||లలో శూన్యస్థాయికి తగ్గించుకోవాలి. ఆవిధంగా రేటింగ్‌ క్రిందిస్థాయికి దిగజారిపోయిన తేదీనుండి. లేకపోతే సరైన పరిమితమైన స్థాయికి తగ్గించుకోవాలి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీస్‌ యాక్సోప్టెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ డిపాజిట్స్‌ (రిజర్వు బ్యాంకు ) డైరెక్షన్స్‌  1988లోని పేరా 4(4) కు లోబడి, అయితే అటువంటి నా.బ్యాం. ఆ.వ్యా.సం. లు పరిపక్వానికి (మెచ్యురిటీ) వచ్చిన ప్రజా డిపాజిట్లను పైన చెప్పిన తిరిగి చెల్లింపులు చేయు నిబంధనల మేరకు పునరుద్ధరించడం అలాగే డిపాజిట్లను స్వీకరించే నియమాలకు లోబడి అమలు చేస్తూ ఉన్నంత వరకూ .

ఒకవేళ నా.బ్యా.ఆ.వ్యా.సం.లు డిపాజిట్లను తిరిగి చెల్లింపు చేయని సందర్భంలో, డిపాజిటరు చేపట్టవలసిన తదుపరి చర్యలేమిటి?

  • ఒకవేళ నా.బ్యా.ఆ.వ్యా.సం. లు డిపాజిట్లను తిరిగి చెల్లింపు చేయని పక్షంలో అట్టి డిపాజిటరు కంపెనీ లా బోర్డును గాని కన్స్యూమర్‌ ఫోరమ్‌ను గాని ఆశ్రయించవచ్చు. లేకపోతే అటువంటి డిపాజిట్‌ను తిరిగి రాబట్టుకోవడానికి సివిల్‌ సూట్‌ను ఫైల్‌ చేయవచ్చు.

డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడంలో కంపెనీ లా బోర్డు పాత్ర ఎటువంటిది? ధాననాశ్రయించడమెలా?

  • నా.బ్యా.ఆ.వ్యా.సం.లు డిపాజిటరుకు ఏదేని డిపాజిట్‌ను పూర్తిగాగానీ, పాక్షికంగా కాని అట్టి డిపాజిట్‌కు  సంబంధించిన నియమ, నిబంధనల ప్రకారం, తిరిగి చెల్లింపకపోయినా లేక ఎగవేసినా, కంపెనీ లా బోర్డు (సి.ఎల్‌.బి) తనంతట తానుగా గానీ, లేక డిపాజిటరు యొక్క దరఖాస్తు ప్రకారం గాని, ఒక ఆర్డరు ద్వారా అటువంటి నా.బ్యా.ఆ.వ్యా.సం. లను అటువంటి డిపాజిట్‌ సొమ్మును పూర్తిగా గానీ, పాక్షికంగా గాని, వెంటనే నిర్ణయించి అటువంటి కాల వ్యవధిలో వాపసు ఇమ్మని అటువంటి ఆర్డరులో ఉదహరింపబడిన నియమ నిబంధనలకనుగుణంగా చేయాలని నిర్దేశిస్తుంది.
  • పైన వివరించిన విధంగా డిపాజిటరు నిర్ణత ఫారమ్‌లో ఒక దరఖాస్తును సి.ఎల్‌.బి యొక్క సరైన బెంచికి పోస్టు ద్వారా పంపిస్తూ, వారిని ఆశ్రయించవచ్చు. నిర్ణయింపబడిన ఫీజుతో సహా ఆ ప్రాంతము యొక్క అధికార పరిధిని బట్టి.

సి.ఎల్‌.బి. యొక్క వివిధ బెంచ్‌ల అధికారుల చిరునామాలు, వాటికి సంబంధించిన అధికార పరిధుల వివరాలు ఇవ్వగలరా?

  • సి.ఎల్‌.బి. యొక్క వివిధ అధికారుల చిరునామాలు, ప్రాంతీయ అధికారిక పరిధులతో సహా ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
క్రమ సంఖ్య చిరునామా ప్రాంతీయ అధికార పరిధి
1 బెంచ్‌ ఆఫీసర్‌,
కంపెనీ లా బోర్డు,
ఉత్తర ప్రాంతీయ బెంచ్‌,
శాస్త్రి భవన్‌ ఎ వింగ్‌,
5వ అంతస్తు,
డా.రాజేంద్రప్రసాద్‌ రోడ్‌,
కొత్తఢిల్లీ - 110 001
ఉత్తరప్రదేశ్‌, జమ్ము-కాశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, మరియు చండీఘర్‌ మరియు ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాలు.
2 బెంచ్‌ ఆఫీసర్‌,
కంపెనీ లా బోర్డు,
దక్షిణ ప్రాంతపు బెంచ్‌,
శాస్త్రిభవన్‌  ఏ వింగ్‌
5వ అంతస్తు, 8వ బ్లాక్‌,
నెం.26, హ్యాడోస్‌ రోడ్‌,
చెన్నై - 600 006.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్నాటక, అమీన్‌ దీవి, మినికాయ్‌ మరియు లక్షద్వీపాలు మరియు పాండిచ్చేరి.
3 బెంచ్‌ ఆఫీసర్‌,
కంపెనీ లాబోర్డు,
పశ్చిమ ప్రాంతపు బెంచ్‌,
2వ అంతస్తు, ఎన్‌.టి.సి. హౌస్‌,
15, నరోత్తమ్‌ మొరార్జీ మార్గ్‌,
బల్లార్డ్‌ ఎస్టేట్‌,
ముంబాయి- 400 038
మహారాష్ట్ర, గుజరాత్‌  , మధ్యప్రదేశ్‌, గోవా మరియు దాద్రా నాగర్‌ హవేలి, డామన్‌, మరియు డయ్యు యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలు.
4 బెంచ్‌ ఆఫీసర్‌,
కంపెనీ లా బోర్డు,
తూర్పు ప్రాంతపు బెంచ్‌,
9, పాత పోస్టాఫీస్‌ వీధి,
6వ అంతస్తు,
కోల్‌కత్తా - 700 001.
పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, బీహార్‌, అస్సామ్‌, త్రిపుర, మణిపూర్‌, నాగాలాండ్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరామ్‌, అండమాన్‌, నికోబార్‌ ద్వీపాల కేంద్ర పాలిత ప్రాంతాలు.
5 బెంచ్‌ ఆఫీసర్‌, కంపెనీ లా బోర్డు,
ప్రధాన  బెంచ్‌, కొత్త ఢిల్లీ,
శాస్త్రి భవన్‌ రోడ్‌,
ఎ వింగ్‌, 5వ అంతస్తు,
డా.రాజేంద్రప్రసాద్‌ రోడ్‌,
కొత్త ఢిల్లీ - 110 001.
భారత దేశానికంతకు చెందు బెంచ్‌కు సంబంధించిన ముఖ్య విషయాలు.

బాకీ చెల్లించకుండా వుండే నా.బ్యాం.ఆ.వ్యా.సం. ల విషయంలో అధికారిక లిక్విడేటర్‌ (దివాలను నిర్ధారించు అధికారి)ను చాలా కేసుల్లో నియమించడం జరుగుతుందని విన్నాము. వారి పాత్ర ఏమిటి? వారినాశ్రయించడం ఎలా?

  • మూసివేతకు పిటిషన్‌ పెట్టుకున్న సందర్భంలో అటువంటి సంస్థకు వారికి పరిస్థితిని వివరించుకోవడానికి తగినంత సమయం, అవకావం యిచ్చిన తర్వాత, కోర్టువారు అధికారిక లిక్విడేటర్లను నియమిస్తారు. (కోర్టు వారు విధించిన నియమాల ప్రకారం). ఈ లిక్విడేటర్‌లు తమ విధులను అటువంటి కంపెనీ యొక్క మూసివేత ప్రక్రియలో నిర్వహిస్తూ ఉంటారు.
  • కోర్టువారు ఎప్పుడైతే ఒక అధికారిక లిక్విడేటర్‌ నియమిస్తారో, అప్పటినుండి ఆ అధికారి ఆ సంస్థ యొక్క ఆస్తులకు సంరక్షకుడిగా ఉంటూ, రోజువారీకార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాడు. నిర్ణీత ఫారమ్‌లో అతను కంపెనీ యొక్క స్థితిగతులను వివరిస్తూ ఒక నివేదికను తయారు చేయాల్సి వుంటుంది. అందులో అట్టి  సంస్థయొక్క ఆస్తి వివరాలు, దానికున్న అప్పులూ, నష్టాలూ, దాని ఖాతాదారుల పేర్లు/ గృహ వివరాలు/ వృత్తి వివరాలు, ఆసంస్థకు చెందవలసిన ఋణాలూ, ఇంకా అటువంటి సమాచారం దేన్నైనా, నిర్ణీత పద్ధతిలో ఎందుపరచాల్సి ఉంటుంది. ఈ విధంగా లిక్విడేటర్‌ తయారుచేసిన ప్రణాళిక (స్కీము) కోర్టువారికి సమర్పించబడుతుంది. వారి సమ్మతి, ఆమోదం కకోసం, కోర్టువారు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం, లిక్విడేటరు ఆ సంస్థ యొక్క ఆస్తులను గురించి ఒక అవగాహనకు వచ్చి,  ఖాతాదారులకు ఇవ్వవలసిన చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తాడు. కోర్టు ఆజ్ఞలననుసరించి, సాధారణంగా ఈ లిక్విడేటరు వార్తాపత్రికలలో ప్రకటనను వేయించి, డిపాజిటర్ల / పెట్టుబడి దారులను క్లైమ్సు పెట్టుకోమని ఆహ్వానిస్తాడు.  అందుచేత లిక్విడేటరు జారీచేసిన  అట్టి ప్రకటనను చూసిన వెంటనే నిర్ణీత కాలంలో క్లైమ్సును ఫైలు చేసుకోవాలి. అధికారిక లిక్విడేటర్ల చిరునామాలు వగైరా వివరాలనిస్తూ, రిజర్వు బ్యాంకు కూడా అట్టి డిపాజిటర్లకు సహాయ సహకారాల్ని అందిస్తుంది.

కన్స్యుమర్‌ కోర్టులు డిపాజిటర్ల సమస్యలు చేపట్టడంలో ఉపయోగకరమైన పాత్రను పోషిస్తున్నాయి.   కన్స్యుమర్‌  ఫోరాన్ని, సివిల్‌ కోర్టులను, సి.ఎల్‌.బి. ను ఒకేసారి ఆశ్రయించవచ్చా?

  • అవును. డిపాజిటర్‌ పైన చెప్పిన పరి ష్కారం చేసే అధికారం సంస్థలను దేనినైనా లేక అన్నింటినీ కూడా ఒకేసారి ఆశ్రయించవచ్చు. అనగా కన్స్యూమర్‌ ఫోరాన్ని, కోర్టులు లేక సి.ఎల్‌.బి. ని కూడా.

నా.బ్యా.ఆ.వ్యా.సం లకు సంబంధించి ఆచరించవలసిన దూరాలోచనతో, వివేకంతో విధించినటువంటి వివిధ నిబంధనలేమిటి?

  • వివరణాత్మకమైన మార్గదర్శక సూత్రాలను, బ్యాంకు జారీ చేస్తూనే ఉంది. దూరాలోచనతో, వివేకంతో, ఆచరించవలసిన పద్ధతులూ మున్నగు వాటిగురించి, నా.బ్యా.ఆ.వ్యా.సం ల ప్రూడెన్షియల్‌ నారమ్స్‌  (రిజర్వుబ్యాంకు) 1998 ద్వారా, ఈ మార్గదర్శక సూత్రాలు మిగతా వాటితో పాటుగా రాబడిని గుర్తించుట. ఆస్తుల విభజనల వివరణ, అలాగే నా.బ్యా.ఆ.వ్యా.సం.లకు కావలసిన అవసరాలను సమకూర్చడానికి, బహిర్గతం చేసే పద్ధతులు, ఆడిట్‌ సంఘాల నియామకం, బ్యాలెన్స్‌ వెల్లడించే విషయాలు, మూలధనం సరిపోవునంత వరకూ ఏర్పాటు చేసే అవసరం,  భూస్థలాలు మరియు భవనాలపై అలాగే కోట్‌ చెయ్యబడిన షేర్లపై కూడా పెట్టుబడులు పెట్టే విధానం, మున్నగు వాటి గురించి నిర్ణీత పద్ధతిలో ఈ మార్గదర్శక సూత్రాలు తయారు చేయబడి ఉంటాయి.
  • నా.బ్యా.ఆ.వ్యా.సం. ల విషయంలో స్వంతంగా సమకూర్చుకున్న నిధి (ఓన్డ్‌ ఫండ్‌) అంటే చెల్లింపబడిన ఈక్విటీ మూలధనం (పెయిడ్‌ అప్‌ ఈక్విటీ క్యాపిటల్‌) మరియు స్వేచ్ఛాయుతమైన నికర మూలధనం (ఫ్రీ రిజర్వ్‌) ఇటీవల కంపెనీ తయారుచేసిన బ్యాలెన్స్‌ షీటులో చూపించిన విధంగా పేరుకుపోయిన నష్టాలను దాంట్లోంచి మినహాయించి తర్వాత, అలాగే డిఫర్డ్‌ రాబడి ఖర్చులు (డిఫర్డ్‌ రెవెన్యూ ఎక్స్పెండిచర్‌) మరియు ఇతర స్పష్టతలేని, వుపయోగం లేని ఆస్తులు.
  • అటువంటి సంస్థలలో పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ము అనగా వాటి సబ్సిడియరీల  యొక్క షేర్ల రూపం లోను అదే గ్రూపులోని కంపె నీలు మరియు అన్ని ఇతర నా.బ్యాం.ఆ.వ్యా.సం,.లు అలాగే డిబెంచర్ల యొక్క బుక్‌ వాల్యు, బాండ్లు, తీర్చవలసిన అప్పులు, అడ్వాన్సులు మరియు అదే గ్రూపులో ఉన్న సబ్సిడియరీల డిపాజిట్లు మున్నగునవి మదుపు చేయబడతాయి. ఆవిధంగా లెక్కకట్టగా వచ్చిన  సొమ్ము  స్వంతంగా వున్న నిధి నుండి తగ్గించేవివేయబడుతుంది. నికరంగా వుండే స్వంత నిధి ని  లెక్కగట్టడానికి.

రిజర్వుబ్యాంకు కు సమర్పించవలసిన రిటర్న్‌లకు మరియు ఇతర సమాచారానికి సంబంధిం చినంత వరకూ, ప్రజల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరించడంలోను / తనవద్దే ఉంచుకోవడంలోను నా.బ్యా.ఆ.వ్యా.సం.ల బాధ్యతలేమిటి?

ప్రజానీకం నుండి డిపాజిట్లను స్వీకరించే నా.బ్యా.ఆ.వ్యా.సం. లు రిజర్వు బ్యాంకుకు ఈ క్రింద వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

  • సాధారణ సమావేశంలో ఆమోదింపబడిన విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన, ఆడిట్‌ చేయబడిన బ్యాలెన్స్‌షీటు, ఆ సంవత్సరానికి సంబంధించిన, ఆడిట్‌ చేయబడిన లాభనష్టాల  (ప్రాఫిట్‌ మరియు లాస్‌) అక్కౌంటును, దానితోపాటుగా జతచేయబడిన బోర్డు యొక్క డైరెక్టర్ల నివేదిక కాపీ, ఆడిటర్లచే జారీచేయబడిన నోట్స్‌ ఆన్‌ అక్కౌంటు కాపీను కూడా జత చేస్తూ.
  • డిపాజిట్లపై చట్టబద్ధమైన వార్షిక రిటర్న్‌ ఎన్‌.బి.ఎస్‌.1
  • ఎప్పుడంటే అప్పుడు క్లైములు వచ్చనప్పుడు డిపాజిట్లనుతిరిగి చెల్లించే పరిస్థితిలో లేదని ధృవీకరిస్తూ ఆడిటర్ల ద్వారా జారీచేయబడిన ఒక ధృవపత్రము (సర్టిఫికెట్‌)
  • ద్రవరూపంలో ఉన్నట్లు చెప్పబడే ఆస్తులకు (లిక్విడ్‌ ఎసెట్స్‌) సంబంధించి త్రైమాసిక  రిటర్న్‌.
  • దూరదృష్టితో, వివేకంతో ఆమలు చేయబడే నియమ, నింధనలకు సంబంధించిన అర్ధ సంవత్సరపు రిటర్న్‌.
  • ప్రజానీకమునకు చెందే రు||లు 20కోట్లకు పైబడి  వున్న డిపాజిట్లు లేక రు||లు 100 కోట్లకు, ఆపైబడి విలువ వున్న ఆస్తులు కలిగివుండే కంపెనీలు, డిపాజిట్ల పరిమాణంతో నిమిత్తం లేకుండా, అర్ధ సంవత్సరపు ఏ.ఎల్‌.ఎమ్‌. రిటర్న్‌.
  • మూలధనపు మార్కెట్లో (క్యాపిటల్‌ మార్కెట్‌) వ్యాపారం చేస్తూ, ప్రజానీకానికి చెందిన రు||లు 50 కోట్లకు పైబడి వున్న డిపాజిట్లతో, వున్న కంపెనీలు పంపే నెలవారీ రిటర్న్‌.
  • సంవత్సరానికొకసారి లభించే క్రెడిట్‌ రేటింగ్‌ కాపీ, దాంతోపాటుగా, దూరదృష్టి, వివేకంతో అమలు  చేయబడే నియమ, నిబంధనలకు సంబంధించిన అర్థ సంవత్సరపు రిటర్న్‌ (పైన (5) లో చూపించినట్లుగా) ఒక కాపీ.

ప్రజానీకమునుండి డిపాజిట్లను స్వీకరించకుండా / ప్రజల డిపాజిట్లను తమవద్ద ఉంచుకోనటువంటి నా.బ్యా.ఆ.వ్యా.సం.లు రిజర్వు బ్యాంకుకు సమర్పించ వలసిన  పత్రాలు (డాక్యుమెంట్స్‌) లేక చట్ట ప్రకారం అమలు (కంప్లయన్స్‌) చేసేవి గానీ ఏమిటి?

రు||లు 500 కోట్ల కంటే ఎక్కువ విలువగల ఆస్తులు కలిగి ఉండి, ప్రజల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరించనటువంటి నా.బ్యా.ఆ.వ్యా.సం.లు కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక ప్రమాణికాల (పారామీటర్స్‌) కు సంబంధించిన త్రైమాసిక రిటర్న్‌.

  • ప్రజల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరించనటువంటి కంపెనీలన్నీ గడుస్తున్న సంవత్సరంలో ప్రజలవద్ద నుండి డిపాజిట్లను స్వీకరించలేదని, లేక ఆ ఉద్దేశ్యం గానీ లేదనే విషయాన్ని నిర్ధారిస్తూ బోర్డ్‌ వారు ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
  • ఏమైనప్పటికీ, అన్ని నా.బ్యా.ఆ.వ్యా.సం. లు (మినహాయింపబడినటువంటివి తప్ప) రిజర్వుబ్యాంకు తో నమోదు చేయించుకోవడమే కాకుండా, నిరంతరం ఆవిధంగా నమోదు చేసుకునే యోగ్యత కలిగి ఉండేటట్లుగా  చూసుకోవాలి. ఏ కంపెనీ అయినా వారు నిర్వహించే కార్యకలాపాల గురించి పుస్తకాలను తనిఖీ చేసే అధికారాన్నీ అలాగే ఏ ఇతర సమాచారాన్నైనా అడిగే హక్కు కూడా బ్యాంకుకు ఉంది. దీనికోసం నా.బ్యా.ఆ.వ్యా.సం. ల డైరెక్టర్ల చిరునామా, పేరు ముఖ్య అధికారుల పేర్లు మరియు వారి హోదాలు అలాగే ఆడిటర్ల పేర్లు, వారి కార్యాలయాల చిరునామాలతో సహా నా.బ్యా.ఆ.వ్యా.సం.  ఎప్పటికప్పుడు వివరాలను సమర్పిస్తూ ఉండాలి.

కాలాతీతమైన డిపాజిట్లపై ఒకవేళ అటువంటి డిపాజిట్లను క్లైములు వచ్చనప్పుడు కంపెనీ తిరిగి వాపసు  చెల్లించలేని పక్షంలో నా.బ్యా.ఆ.వ్యా.సం.లకు అటువంటి సందర్బంలో వాటిపై వడ్డీని చెల్లించే విధంగా బాధ్యతను కలిగి ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాలను వివరించండి.

  • రిజర్వు బ్యాంకు మార్గదర్శక సూత్రాల ప్రకారం ఒకవేళ కంపెనీ పరిపక్వానికొచ్చిన డిపాజిట్లను  తిరిగి  వాపసు చెల్లించడంలో జాప్యం చేసినచో, అటువంటి సందర్భంలో దానిపై కాలాతీత వడ్డీ చెల్లించాల్సి  ఉంటుంది. అటువంటి వడ్డీని క్లైమ్సు  అందుకున్న రోజు నుండి గానీ, లేక డిపాజిట్టు పరిపక్వానికొచ్చిన రోజునుండి గాని, ఏది ముందైతే అది. అసలు డిపాజిట్టు చెల్లించే తేదీ వరకు, ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఒకవేళ డిపాజిటరు డిపాజిట్టు పరిపక్వానికొచ్చిన తేదీ  తర్వాత క్లైము పెట్టుకున్నచో, అటువంటి క్లైము తేదీనుండి, కంపెనీ ఆ డిపాజిట్టు పై వడ్డీని క్లైము పెట్టుకున్న తేదీనుండి వాపసు చెల్లించే వ్యవధికి చెల్లించాల్సి ఉం టుంది. పరిపక్వానికొచ్చిన తేదీనుండి క్లైము పెట్టుకున్న తేదీకిమధ్యలో ఉనక్న కాలానికి వడ్డీ చెల్లించాలా అన్నది కంపెనీ యొక్క విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.

ప్రజానీకము వద్దనుండి స్వీకరించిన డిపాజిట్లను కంపెనీ ముందుగానే చెల్లించవచ్చా?

  • నా.బ్యా.ఆ.వ్యా.సం. లు తమ డిపాజిటర్ల వద్దనుండి ఒక పరస్సర అవగాహనతో డిపాజిట్లన స్వీకరిస్తుంది. ఒకవేళ డిపాజిటరు ఎవరైనా పరిపక్వానికొచ్చే దానికంటే ముందు తేదీకే డిపాజిట్టును తిరిగి చెల్లించమని కోరినచో రిజర్వ్‌ బ్యాంకు ఇటువంటి సందర్భాలలో కొన్ని నిర్ణీత నిబంధనలను చేసింది. నా.బ్యా.ఆ.వ్యా.సం. ల పబ్లిక్‌ డిపాజిట్స్‌ (రిజర్వు బ్యాంకు) మార్గదర్శక సూత్రాలు (డైరెక్షన్స్‌)1998 ద్వారా. ఇందులో వివరించినదేమిటంటే నా.బ్యా.ఆ.వ్యా.సం.లు ప్రజల యొక్క డిపాజిట్టుకు ప్రతికూలంగా ఏవిధమైన ఋణాన్ని ఇవ్వడంగానీ, అట్టి డిపాజిట్టు సొమ్మును పరిపక్వానికొచ్చే ముందుగానే అట్టి డిపాజిట్టు చేసిన మూడు నెలల వ్యవధిలో (లాక్‌ ఇన్‌ పీరయడ్‌) చెల్లించకూడదు. అందుచేత అటువంటి డిపాజిటరు చనిపోయిన  సందర్భంలో , లాక్‌ ఇన్‌ పీరియడ్‌లో నైనాసరే, కంపెనీ అటువంటి డిపాజిట్లు సొమ్మును తిరిగి చెల్లించవచ్చు. సంయుక్తంగా వున్న హక్కుదారులు (జాయింట్‌ హోల్డర్స్‌) సర్వైవరు నిబంధనతో / నామినీ/ వ్యాయ ప్రకారంగా ఉండే వారసుడు / వద్దనుండి అభ్యర్ధన వచ్చినచో,కంపెనీ యొక్క సంతృప్తి మేరకు సంబంధిత పత్రాలను (డాక్యుమెంట్లను) సమర్పించినప్పుడు మాత్రమే.
  • ఒక నా.బ్యా.ఆ.వ్యా.సం. పైన ఉదహరించిన నిబంధనలకు లోబడి ఉన్నప్పుడు, అది ఒక సమస్యాత్మక కంపెనీ కానప్పుడు లాక్‌ ఇన్‌ పీరియడ్‌  కంటే ముందుగానే ప్రజలయొక్క  డిపాజిట్లను పరిపక్వానికొచ్చే ముందే   తమ యొక్క విచక్షణాధికారంతో, బ్యాంకు వారు నిర్ణయించిన వడ్డీ రేటుతో వాపసు చెల్లించవచ్చు.
  • సమస్యాత్మకమైన నా.బ్యా.ఆ.వ్యా.సం. ఏ డిపాజిట్టును తిరిగి చెల్లించడంగాని , లేక ప్రజలయొక్క డిపాజిట్టుపై ప్రతికూలంగా ఋణాన్నివ్వడం గాని ఏదైనా సరే చేయరాదు. ఈ నిషేదం డిపాజిటరు మరణించిన సందర్భంలో లేక చిన్న డిపాజిట్లు - అనగా రు||లు 10,000 వరకూ ఉన్నటువంటివి. లాక్‌ ఇన్‌ పీరియడ్‌    నిబంధనకు లోబడి (చిన్న డిపాజిట్ల విషయంలో) వున్న సందర్బాలలో వర్తించదు.

డిపాజిట్లు   స్వీకరించే కంపెనీలకు సంబంధించిన , ద్రవ రూపంలో ఉండాల్సిన ఆస్తులు (లిక్విడ్‌ ఎసెట్స్‌) ఏమిటి?

  • రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా చట్టం 1934లోని సెక్షన్‌  451 బి ప్రకారం నా.బ్యా.ఆ.వ్యా.సం. లు నిర్వహించవలసిన కనీస స్థాయి ద్రవరూపంలో ఉండే ఆస్తులు (లిక్విడ్‌ ఎసెట్స్‌) ఇంతకు ముందు వున్న రెండవ త్రైమాసిక కాలం చివరిరోజు నాటికి వున్న చెల్లించాల్సిన ప్రజా డిపాజిట్ల విలువలో 15 శాతం. ఈ 15 శాతంలో,నా.బ్యా.ఆ.వ్యా.సం. లు 10శాతం వరకూ అనుమతింపబడిన సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. మిగిలిన 5శాతం ఏ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులోనైనా ఏ చిక్కులు, ఇబ్బందులు లేని విధంగా ఫిక్సెడ్‌ డిపాజిట్లలో పెట్టాల్సి వుంటుంది. ఆవిధంగా ద్రవరూపంలో ఉండే ఆస్తులు ప్రభుత్వ సెక్యూరిటీలుగాను, ప్రభుత్వ హామీ (గవర్నమెంటు గ్యారంటీడ్‌) వున్న బాండ్లుగాను, మరియు ఏ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లోనైనా టర్మ్‌ డిపాజిట్లు రూపంలోను వుంటాయి.
  • ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టే పెట్టుబడి డిమెటీరియలైజ్డ్‌ రూపంలో ఉండాలి మరియు అది కాన్సిట్యుయంట్‌ సబ్సిడియరీ జనరల్‌ లెడ్జర్‌ (సి.ఎస్‌.జి.ఎల్‌) అకౌంటులో వుండి ఒక షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ (ఎస్‌.సి.బి) /స్టాక్‌ హోల్డింగ్‌  కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  (ఎస్‌.హెచ్‌.ఐ.సి.ఎల్‌)లో ఉండి కాపాడబడుతూ  (మైంటైన్‌ చేయబడుతూ) ఉంటాయి. ప్రభుత్వ హామీ (గ్యారంటీ)తో ఉండే బాండ్ల విషయంలో, వీటిని            అదే మాదిరిగా, అనగా డిమెటీరియలైజ్డ్‌  రూపంలో ఎస్‌.సి.బి/ఎస్‌.హెచ్‌.సి.ఐ,.ఎల్‌) లేక డిపాజిటరీస్‌  (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌.ఎస్‌.డి.ఎల్‌)/ సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) లిమిటెడ్‌ (సి.ఎస్‌.డి.ఎల్‌), సెక్యూరిటీస్‌  అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) తో నమాెెదు (రిజిస్టర్‌) కాబడిన ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్‌ ద్వారా డిమోటీరియలైజ్డ్‌  ఎకౌంటులో ఉంచబడతాయి. అయినప్పటికీ ప్రభుత్వ బాండ్లు భౌతిక రూపంలో వున్నప్పుడు వాటిని ఎస్‌.సి.బి/ ఎస్‌.హెచ్‌.సి.ఐ.ఎల్‌ వారి సంరక్షణలో  భద్రంగా ఉంచాలి.
  • పైన చెప్పిన ఆస్తుల వివరణతో, కంపెనీ యొక్కనమోదిత కార్యాలయం వున్నచోట చట్టపరమైన ద్రవరూపంలో ఉండే ఆస్తుల (లిక్విడ్‌ ఎసెట్స్‌) సెక్యూరిటీలను డిమెటీరియలైడ్‌ రూపంలో కాపాడుతూ ఉండాలని నా.బ్యా.ఆ.వ్యా.సం.లను నిర్దేశించడం జరిగింది.  అయితే ఏదేని ఒక నా.బ్యా.ఆ.వ్యా.సం.  తమ నమోదిత కార్యాలయంలో కాకుండా వేరేచోట ఎక్కడైనా ఉంచి, ఈ సెక్యూరిటీలను కాపాడాలని అనుకుంటే, రిజర్వు బ్యాంకు వద్ద నుండి లిఖితపూర్వక అనుమతిని ఎంది,  ఆ విధంగానే చేయవచ్చును. అనుమతింపబడిన ద్రవరూపంలో వున్న ఆస్తులను (లిక్విడ్‌ ఎసెట్స్‌) సెక్యూరిటీలలో కేవలం డిమెటీరియలైజ్డ్‌  రూపంలోనే కాపాడాల్సి ఉంటుందని గమనించాలి.
  • పైన ఉదహరించిన ద్రవరూపంలో ఉండి కాపాడబడుతున్న ఆస్తులను డిపాజిటర్ల క్లైములను చెల్లించుటకే వినియోగించాలి. అయితే, ఇటువంటి డిపాజిట్లు పూచీ, హామీ లేని స్వభావం కలవి కాబట్టి, ఈ ద్రవరూపంలో ఉండే ఆస్తులపై డిపాజిటర్లకు ప్రత్యక్షంగా (డైరెక్టుగా) క్లైములు చేసుకునే అవకాశంలేదు.

నా.బ్యా.ఆ.వ్యా.సం. అయివుండి కూడా నమోదు చేసుకోవలసిన అవసరం లేకుండా,  మినహాయించబడిన నా.బ్యా.ఆ.వ్యా.సం. ల గురించి దయచేసి, మాకు వివరించండి.

  • గృహవసతికై ఆర్థిక  సహాయాన్నంద చేసే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, మర్చంట్‌ బ్యాంకింగ్‌  కంపెనీలు, స్టాక్‌ ఎక్చేంజ్‌లు, స్టాక్‌ బ్రోకింగ్‌ / సబ్‌ - బ్రోకింగ్‌ వ్యాపార కలాపాల్లో పాల్గొనే కంపెనీలు, నిధి కంపెనీలు, భీమా (ఇన్స్యూరెన్స్‌) మరియు చిట్‌ఫండ్‌ కంపెనీలు నా.బ్యా.ఆ.వ్యా.సం. లు కానీ, రిజర్వు బ్యాంకు చట్టం 1934లోని సెక్షన్‌ 45-1ఏ క్రింద అటువంటి నమోదు చేసుకోవలసిన అవసరాన్నుండి మినహాయించడం జరిగింది.
  • గృహవసతికై ఆర్థిక సహాయాన్నిచ్చే కంపెనీలు (హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు), నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, మర్చంట్‌ బ్యాంకర్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ కంపెనీ /స్టాక్‌ ఎక్చేంజిలు/ స్టాక్‌ బ్రోకర్స్‌/ సబ్‌ - బ్రోకర్స్‌ను, ఇన్స్యూరెన్స్‌ రిగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్‌ అధారిటీ క్రమబద్ధీకరిస్తుంది. అలాగే, చిటఫండ్‌ కంపెనీలను సంబంధిత రాష్ట్రప్రభుత్వము, వారి కంపెనీ ఎఫైర్స్‌ మంత్రిత్వశాఖ క్రమబద్ధీకరిస్తుంది.

కొందరు వ్యక్తులు, సంస్ధలు (కంపెనీలు కావు) నా.బ్యా.ఆ.వ్యా.సం.ల మాదిరిగానే అటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. వారు డిపాజిట్లను స్వీకరించడానికి అనుమతింపబడ్డారా? వారినెవరు క్రమబద్ధీకరిస్తారు?

  • ఏ సంస్థ (ఫర్మ్‌) అయినా ఒక వ్యక్తిగా ఉండి, లేక ఒక సంస్థగా గాని, లేకపోతే చట్టబద్ధంగా కలుపుకోనటువంటి (ఆన్‌ ఇన్కార్పొరేటెడ్‌) వ్యక్తలు యొక్క సంఘం కానీ డిపాజిట్లను స్వీకరించడానికి లేదు. అయితే, బంధువుల వద్దనుండి గానీ, అతని / ఆవ్యాపారం పూర్తిగా కానీ, పాక్షికంగా గానీ ఋణాలివ్వడం, పెట్టుబడులు పెట్టడం, అద్దె - కొనుగోలు లేక బాడుగ వసతులు కలుగచేసేది. దాని ప్రధాన వ్యాపారం ఏ స్కీము ప్రకారం గానైనా డిపాజిట్లను స్వీకరించడం లేక ఒక ఏర్పాటు చేసుకోవడం ద్వారా, లేక మరేవిధంగానైనా ఋణాలివ్వడం గానీ, చేసేవి ఈపరిధిలోనుండి తప్పించబడ్డాయి.

అవశిష్ట (బాకీ వున్న, రెసిడ్యుయరి) నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ (ఆర్‌.ఎన్‌.బి.సి) అంటే ఏమిటి? ఇతర నా.బ్యా.ఆ.వ్యా.సం. లకు దీనికీ తేడాఏమిటి?

  • రెసిడ్యయరీ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ (ఆర్‌.ఎన్‌.బి.సి) కూడా ఒక రకమైన, ఒక తరహాకు చెందిన నా.బ్యా.ఆ.వ్యా.సం. వంటిదే అయివుండి, ఒక కంపెనీగా దాని ప్రధాన వ్యాపారం ఏ స్కీముకింద గానీ, లేక ఏ విధమైన ఏర్పాటు ద్వారా గానీ, డిపాజిట్లను స్వీకరించడం గానీ, పెట్టుబడిగా కాకుండా మరే విధంగాకానీ, బాడుగ వసతిని కలుగజేయుట, అద్దె - కొనుగోలు , ఋణాలిచ్చే కంపెనీ కాకుండా వున్నటువంటిది. ద్రవరూపంలో ఉండే ఆస్తులకు అదనంగా, రిజర్వు బ్యాంకు మార్గదర్శక సూత్రాలననుసరించి , ఈ కంపెనీలు పెట్టుబడులను పెట్టడం నిర్వహిస్తూ ఉండాలి. ఈ కంపెనీలు పనిచేసే విధానం  నా.బ్యా.ఆ.వ్యా.సం.ల లాగా ఉండకుండా, తేడా కలిగి ఉంటుంది. డిపాజిట్లను సమీకరించే పద్ధతిలోను, అలాగే డిపాజిటర్ల నిధులను వినియోగించుకొనే విధానంలోనూ కూడా. ఏమైనప్పటికీ దూరదృష్టితో, వివేకంతో కూడిన నియమావళి, మార్గదర్శక సూత్రాలు (ప్రూడెన్షియల్‌ నార్మ్‌, డైరెక్షన్స్‌) ఈకంపెనీలకు కూడా వర్తిస్తాయి.

రెసిడ్యుయరీ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీలు (రె.నా.బ్యా.కం.లు) డిపాజిట్లను స్వీకరించడంలో గరిష్ట పరిమితేమీ లేదని, విన్నాము. అటువంటప్పుడు డిపాజిట్‌ ఏ మాత్రం. ఎంతవరకూ భద్రతా, రక్షణా కలిగి ఉంటుంది?

  • రె.నా.బ్యా.కం.లు సేకరించే డిపాజిట్లకు గరిష్ట పరిమితి లేదు అన్న విషయం వాస్తవమే. కానీ, డిపాజిటర్లు డిపాజిట్‌ చేసిన సొమ్ములు మరియు కంపెనీ పెట్టినటువంటి పెట్టుబడులు డిపాజిటర్లకివ్వవలసిన మొత్తం బాకీలకంటే ఏవిధంగానూ తక్కువగా ఉండకుండా ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది.
  • డిపాజిటర్ల శ్రేయస్సును కాపాడడానికై అటువంటి కంపెనీలు అమితమైన లిక్విడ్‌ ఫోర్టు ఫోలియోలో వుండేటటువంటి, రక్షణ  మరియు భద్రత కలిగిన సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అనగా కేంద్ర/ రాష్ట్రప్రభుత్వాల సెక్యూరిటీలు, షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో  (ఎస్‌.సి.బి) ఫిక్సెడ్‌ డిపాజిట్లు, ఎస్‌.సి.బి/ ఎఫ్‌.ఐ.ల డిపాజిట్ల సర్టిఫికెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లు మొ||నవి.

రె.నా.బా.కం. డిపాజిట్‌ చేసిన సమ్మను ఒక క్రమపద్ధతిలో చెల్లించనప్పుడు లేక చెల్లించకుండా మానివేసినప్పుడూ అటువంటి డిపాజిట్‌ ను కోల్పోతున్నట్టుగా గానీ /జప్తు  చేయడం వంటిదిగానీ చేయవచ్చా?

  • రె.నా.బ్యా.కం.డిపాజిట్‌ కట్టిన సొమ్మునుగాని, లేక వడ్డీని గాని, ప్రీమియంనుగానీ, బోనస్‌ లేక డిపాజిటరుకు లభించే ఇతర లాభాలను, సౌకర్యాలను కోల్పోవడం గానీ / జప్తు చేయడం గానీ చేయవచ్చు.

రె.నా.బ్యా.కం. డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు గురించి, అలాగే డిపాజిట్లు పరిపక్వానికొచ్చే కాల వ్యవధి గురించి మరికొంత వివరించి చెబుతారా?

  • వడ్డీ ద్వారా, ప్రీమియం, బోనస్‌ మరియు ఇతర లాభాలూ, సౌకర్యాలు, రె.నా.బ్యా.కం. డిపాజిట్ల విషయంలో ఏ పేరుతో పిలిచినా సరే. ఒకసారి మొత్తంగా డిపాజిట్‌ చేయబడిన సొమ్ము, ఒక నెలసరి లేక సరైన క్రమపద్ధతిలో కట్టేవిగాని లేక దీర్ఘ విరామంతో కట్టే డిపాజిట్లపై లెక్కించబడిన 5శాతం (సంవత్సరానికి చక్రవడ్డీగా పరిగణింపబడుతుంది) రేటు కంటే తక్కువగా ఉండదు. మరియు రోజువారీ కట్టే డిపాజిట్లు పద్ధతి (డైలీ డిపాజిట్‌ స్కీము) ప్రకారం రోజూ కట్టే  డిపాజిట్‌పై 5శాతం  (సంవత్సరానికి చక్రవడ్డీగా పరిగణింపబడుతుంది) అంతేకాకుండా, రె.నా.బ్యా.కం. కనిష్టంగా 12నెలలకూ, గరిష్టంగా 84 నెలల కాలవ్యవధికి, అటువంటి డిపాజిట్‌ స్వీకరించిన తేదీనుండి, డిపాజిట్టును స్వీకరించవచ్చు. డిమాండ్‌తో తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లను ఇవి స్వీకరించవు.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate