অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సేవలు

ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సేవ (ఇ.సి.ఎస్‌) అంటే ఏమిటి?

  • క్లియరింగ్‌ హౌస్‌ సేవలను ఉపయోగించుకొంటూ ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరొక బ్యాంక్‌ ఖాతాకు ఎలక్ట్రానిక్‌ పద్దతి ద్వారా నిధులు బదిలీ విధానమే ఇది. సాధారణంగా ఒక ఖాతా నుంచి చాలా ఖాతాలకు లేదా చాలా ఖాతాలనుంచి ఒక ఖాతాకు పెద్ద మొత్తంలో జరిగే బదిలీలకు దీన్ని ఉపయోగిస్తారు. సంస్థలు చేసే డివిడెండ్‌, వడ్డీ, వేతనాలు, పించన్‌లు మొ|| వాటి చెల్లింపులు చేయడానికీ టెలిఫోన్‌, విద్యుచ్ఛక్తి వంటి వినియోగ కంపెనీలకు చేసే చెల్లింపులు లేదా ఇంటిపన్ను, నీటిపన్ను మొదలయినటువంటి ఛార్జీలను లేదా ఆర్థిక సంస్థల / బ్యాంకులు  ఋణ వాయిదాలు లేదా వ్యక్తుల పెట్టుబడులు వంటి వాటి నిమిత్తమైన మొత్తాలను వసూలు చేయడానికీ దీన్ని ఉపయోగిస్తారు.

ఇసిఎస్‌లో ఉన్న రకాలు ఏమిటి? అవి పరస్పరం ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?

  • ఇసిఎస్‌(క్రెడిట్‌) ఇసిఎస్‌ ( డెబిట్‌) అని ఇసిఎస్‌ రెండురకాలు.
  • డివిడెండ్‌, వడ్డీ లేదా వేతనం చెల్లింపుల కోసం, ఒక ఖాతాకు ఒకే డెబిట్‌ చేరడంద్వారా అధిక సంఖ్యలోప్రయోజనం ఎందేవారికి క్రెడిట్‌ అందించడం కోసం ఇసిఎస్‌(క్రెడిట్‌)ను ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేకమైన సంస్థకు క్రెడిట్‌ చేయడం కోసం అనేకమంది వినియోగదారులు/ఖాతాదారుల ఖాతాలకు డెబిట్‌ చేయడంకోసం ఇ.సి.ఎస్‌ (డెబిట్‌)ను ఉపయోగిస్తారు.

ఇసిఎస్‌ క్రెడిట్‌ వ్యవస్థ పనితీరు

ఇసిఎస్‌ (క్రెడిట్‌) లావాదేవీని ఎవరు ప్రారంభిస్తారు?

  • అనేకమంది ప్రయోజనం ఎందే వ్యక్తుల (బెనిఫిసియరీలు) కు పెద్ద సంఖ్యలో లేదా పదే పదే చెల్లింపులు చేసే ఏదయినా సంస్థ (ఇసిఎస్‌ యూజర్‌ అంటారు), ఇసిఎస్‌ చెల్లింపులను ప్రారంభించవచ్చు. ఆమోదం ఎందిన క్లియరింగ్‌ హౌస్‌లో స్వయంగా రిజిస్టర్‌ చేసుకొన్నమీదట వారు లావాదేవీలు ప్రారంభించవచ్చు.  ఇసిఎస్‌ యూజర్‌లు, ఇ.సిఎస్‌ క్లియరింగ్‌లలో పాల్గొనడానికి ప్రయోజనం ఎందే వ్యక్తి  సమ్మతితోపాటు అతని ఖాతా వివరాలుకూడా సేకరించవలసి ఉంటుంది.
  • ఇసిఎస్‌ యూజర్‌ బ్యాంకును పథకం పరిధిలోని స్పాన్సర్‌ బ్యాంకుగా పేర్కొంటారు. ఇసిఎస్‌  ఖాతాదారును డెస్టినేషన్‌ ఖాతాదారుగా పేర్కొంటారు. డెస్టనేషన్‌ ఖాతాదారు బ్యాంకును లేదా బెనిఫిషరీ (ప్రయోజనం ఎందే వ్యక్తి) బ్యాంకును డెస్టినేషన్‌ బ్యాంకు అంటారు.
  • రెగ్యులర్‌ లేదా పదేపదే చెల్లింపులు ఎందెె బెనిఫిషయరీలు కూడా చెల్లింపు జరపడంకోసం ఇసిఎస్‌ (క్రెడిట్‌) యంత్రాంగాన్ని ఉపయోగించుకోమని  చెల్లింపు చేసే సంస్థను కోరవచ్చు.

ఇసిఎస్‌ (క్రెడిట్‌) వ్యవస్థ ఎలా పని చేస్తుంది?

  • చెల్లింపులు  జరపాలనుకొంటున్న ఇసిఎస్‌ యూజర్‌లు, ఆమోదం ఎందిన ఏదేని క్లియరింగ్‌ హౌస్‌లో నిర్ణీత ఫార్మేట్‌లో దత్తాంశ వివరాలను సమర్పించాలి. ఆమోదంఎందిన క్లియరింగ్‌  హౌస్‌ల జాబితా లేదా ఇసిఎస్‌ సదుపాయం అందుబాటులో ఉండే  కేంద్రాల జాబితా  www.rbi.org.in లభిస్తుంది.
  • క్లియరింగ్‌ హౌస్‌, నిర్ణీత తేదీన స్పాన్సర్‌ బ్యాంకు ఖాతా లోని ఇసిఎస్‌ యూజర్‌ ఖాతాను డెబిట్‌ చేసి, అంతిమంగా ప్రయోజనం  ఎందేవారి ఖాతాలకు క్రెడిట్‌ చేయడంకోసం స్వీకర్త బ్యాంకుల ఖాతాలకు క్రెడిట్‌ చేస్తుంది.

ఏ కేంద్రాలలో ఇసిఎస్‌ సదుపాయం అందుబాటులో ఉంది?

  • ప్రస్తుతం, 60కి పైగా కేంద్రాలలో ఇసిఎస్‌ సదుపాయం అందుబాటులో ఉంది. ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో పూర్తి జాబితా లభిస్తుంది.
  • ఇసిఎస్‌ ప్రయోజనం ఎందడానికి కేంద్రాలలోని బ్యాంకులలో ఒకదానిలో ప్రయోజనం ఎందే వ్యక్తులు ఖాతా తెరిచి నిర్వహించాలి.

ఇసిఎస్‌ (క్రెడిట్‌) పథకంలో బెనిఫిసియరీ ఎలా పాల్గొంటారు?

  • బెనిఫిసయరీ, ఇసిఎస్‌ సదుపాయాన్ని ఉపయోగించుకొనే విషయంలో తన సమ్మతిని ఇస్తూ ఒక  మాండేట్‌ (mandate) ఇవ్వాలి. తన బ్యాంక్‌ శాఖ, ఖాతా వివరాలను కూడా అతను, ఇసిఎస్‌ యూజర్‌కు తెలియజేయాలి.

బెనిఫిసియరీకి ఈ మాండేట్‌ను మార్పు చేసే అవసరం ఉంటుందా?

  • ఉంటుంది. సమాచారం ఖాతా వివరాలు మారినట్లయితే, ఇసిఎస్‌ యూజర్‌ నుంచి నిరంతరాయమైన ప్రయోజనాలు ఎందడానికి, తనకు సంబంధించి  మారిన వివరాలను నమోదు చేసుకోవడానికి ఇసిఎస్‌ యూజర్‌కు తెలియపరచాలి.  డెస్టినేషన్‌ శాఖలోని ఖాతా వివరాలు, సరిపోలకపోయినట్లయితే, డెస్టినేషన్‌ శాఖలు, తమ సర్వీస్‌ శాఖద్వారా క్రెడిట్‌ను క్లియరింగ్‌ హౌస్‌కు  తిప్పి పంపుతాయి.

ఖాతాలో క్రెడిట్‌ గురించి బెనిఫిసియరీలకు ఎవరు తెలియజేస్తారు?

ప్రతిపాదిత క్రెడిట్‌ తేదీ, మొత్తం, సాపేక్ష చెల్లింపు వివరాలను సూచిస్తూ  అతని ఖాతాకు జమ అవుతున్న క్రెడిట్‌ వివరాలను బెనిఫిసియరీకి తెలియజేయడం ఇసిఎస్‌ యూజర్‌ బాధ్యత.   ఇలా తెలియజేయడంవల్ల, ఆ వివరాలను, ఖాతా స్టేట్‌మెంట్‌/పాస్‌బుక్‌లో బ్యాంకు చూపిన వివరాలతో సరిచూసుకోడానికి బెనిఫిసియరీకి వీలుగా ఉంటుంది.

అంతిమ  బెనిఫిసియరీకి చేకూరే లాభాలు ఏమిటి?

  • అంతిమ బెనిఫిసియరీ, భౌతికమైన  కాగితపు పత్రాలను డిపాజిట్‌ చేయడానికి తరచుగా తన బ్యాంకుకు వెళ్లవలసిన పని ఉండదు.
  • పత్రం పోతుందనీ, మోసపూరితంగా నగదు చేసుకొంటారనీ అతను భయపడే పనే లేదు.

కార్పొరేట్‌ సంస్థలు/ఇతర సంస్థలు లాంటి ఇసిఎస్‌ యూజర్‌కు ఈ పథకం ఎలా ప్రయోజనం సమకూరుస్తుంది?

ముద్రణ, డిస్పాచ్‌, రికన్సిలియేషన్‌లకు సంబంధించిన పాలనా యంత్రాంగంమీద ఇసిఎస్‌ యూజర్‌ వెచ్చించాల్సిన అవసరమువుండదు.

  • తపాలా రవాణాలో పత్రాలు నష్టపోయే అవకాశాలను నివారిస్తుంది.
  • కాగితపు పత్రాలను మోసపూరితంగా దొరకబుచ్చుకొని, నగదు తీసుకొనే అవకాశాలు నివారిస్తుంది.
  • నిర్ణీత తేదీన బెనిఫిసియరీల ఖాతా క్రెడిట్‌ అయ్యేట్లు వీలు అవుతుంది.

బ్యాంకులకు కలిగే లాభాలు ఏమిటి?

ఇసిఎస్‌ నిర్వహించే బ్యాంకులకు కాగితపు నిర్వహణ నుంచి స్వేచ్ఛలభిస్తుంది.

  • కాగితాల ద్వారా నిర్వాహణ బ్యాంకులమీద ఎంతో వత్త్తిడిని కలగజేస్తుంది. పత్రాలను ఎన్‌కోడ్‌ చేయడం, వాటిని క్లియరింగ్‌కు సమర్పించడం, వాటి రిటర్న్స్‌ను పర్యవేక్షించడం, సంబంధిత బ్యాంకులోతో ఖాతాదారులతో అనుదినం ఫాలోఅప్‌ వంటి పనులను బ్యాంకులు నిర్వహించవలసి వుంటుంది.
  • ఇసిఎస్‌ బ్యాంకులలో, తమ ఖాతాదారులకు సంబంధించిన చెల్లింపు వివరాలు సులభంగా లభిస్తాయి.  వారు చేయవలసిందల్లా ఏమిటంటే, పేరు, ఖాతాసంఖ్య వంటి ఖాతావివరాలను సరిచూసుకొని, రాబడులను క్రెడిట్‌ చేయడమే.
  • వివరాలు సరిపోనట్లయితే ఇసిఎస్‌ కార్యవిధానం ప్రకారం, వారు ఆ మొత్తాన్ని తిప్పి పంపుతారు.

ఈ చెల్లింపులను కస్టమర్‌ ఎలా తెలుసుకొంటారు?

  • కస్టమర్‌లకు ఇచ్చిన పాస్‌బుక్కులు/స్టేట్‌మెంట్లు, ఇసిఎస్‌ యూజర్‌లు అందించిన లావాదేవీ వివరాలను ప్రతిబింబించేట్లు చూసుకోవాలని బ్యాంకులకు సలహా ఇవ్వడమైంది. కస్టమర్‌లు ఈ  ఎంట్రీలను, చెల్లింపు సంస్థ నుంచి తమకు అందిన అకౌంట్స్‌తో సరిపోల్చుకోవచ్చు.

వైయక్తిక లావాదేవీల మొత్తం మీద ఏదయినా పరిమితి ఉందా?

  • లేదు. ఈ పథకం కింద, వైయక్తిక లావాదేవీల మొత్తంమీద ఎలాంటి విలువ పరిమితినీ నిర్ణయించలేదు.

ప్రోసెసింగ్‌/సర్వీస్‌ ఛార్జీలు ఏమిటి? ఇది వ్యయభరితమైన సేవా?

  • స్పాన్సర్‌ బ్యాంకులు విధించే సేవా ఛార్జీలను ఆర్‌బిఐ డీ-రెగ్యులేట్‌ చేసింది. ఆర్‌బిఐతోపాటు క్లియరింగ్‌ హౌస్‌లు నిర్వహిస్తున్న ఇతర బ్యాంకులు విధించే ప్రాసెసింగ్‌ ఛార్జీలకు సంబంధించినంతవరకు, 2008 మార్చి 31 వరకు వాటిని రద్దు చేయడమైంది.

పెట్టుబడిదారుల నుంచి మాండేట్‌ తీసుకోవడం కార్పొరేట్‌లకు/సంస్థలకు అవసరమా?

  • అవసరమే. ఇందుకోసం నమూనా మాండేట్‌ ఫారాన్ని నిర్ణయించడమైంది. ఒకసారి డేటాబేస్‌ను రూఎందించుకున్నమీదట బ్యాంకులు, చెల్లింపు ప్రాసెసింగ్‌ సులభతరమవుతుంది. వడ్డీ/డివిడెంట్‌ వారంట్లమీద   ముద్రించడానికి వీలుగా తమ వాటా దరఖాస్తులలో తమ ఖాతా సంఖ్యలను  ఇవ్వమని సెబి కూడా పెట్టుబడిదారులకు మార్గదర్శక సూత్రాలు జారీచేసింది. ఖాతా వివరాలనూ మాండేట్‌లో సేకరించడం పెద్ద సమస్య ఏమీకాదు.

ఇసిఎస్‌ (డెబిట్‌) వ్యవస్థ

ఇసిఎస్‌ (డెబిట్‌) పథకం అంటే ఏమిటి?

  • బ్యాంకులో ఒక ఖాతాదారు, తన ఖాతాలో డెబిట్‌ చేయడం ద్వారా నిర్ణీత పౌనఃపున్యంలో ఒక మొత్తాన్ని వసూలు చేయడానికి ఇసిఎస్‌ యూజర్‌కు అధికారం ఇచ్చే పథకమే ఇది. ఇసిఎస్‌ యూజర్‌, అలాంటి డెబిట్‌లు  చేయడానికి, ఇసిఎస్‌ మాండెెట్‌ అనే ధృవీకరణ పత్రాన్ని సేకరించుకోవలసి ఉంటుంది. మాండేట్‌లను ఖాతా నిర్వహిస్తున్న బ్యాంకుశాఖ ఆమోదించవలసి ఉంటుంది.

ఈ పథకం ఎలా పనిచేస్తుంది.

  • ఈ పథకంలో పాల్గొనాలనుకొన్న ఇసిఎస్‌ యూజర్‌ ఆమోదం ఎందిన క్లియరింగ్‌ హౌస్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆమోదం ఎందిన క్లియరింగ్‌ హౌస్‌ల జాబితా ఆర్‌బిఐ వెబ్‌సైట్‌ ూూూ.సశి.ుసగ.n లో లభిస్తుంది. బ్యాంకు  అక్‌నాలెడ్జ్‌మెంట్‌తోపాటు ఇసిఎస్‌ (డెబిట్‌)లో పాల్గొనే డెస్టినేషన్‌ ఖాతాదారుల నుంచి మాండేట్‌ ఫారాలు కూడా సేకరించవలసి ఉంటుంది. డ్రాయీ బ్యాంకులో  మాండేట్‌ ప్రతి అందుబాటులో ఉండాలి.
  • ఇసిఎస్‌ యూజర్‌ నిర్ణీత ఫారంలో దత్తాంశ వివరాలను, స్పాన్సర్‌  బ్యాంక్‌ ద్వారా క్లియరింగ్‌ హౌస్‌కు సమర్పిస్తారు. క్లియరింగ్‌ హౌస్‌, డెబిట్‌ను క్లియరింగ్‌ వ్యవస్థ ద్వారా డెస్టినేషన్‌ ఖాతాదారుకు పంపుతుంది. తదుపరి ఇసిఎస్‌ యూజర్‌కు క్రెడిట్‌ అందించేందుకు స్పాన్సర్‌ బ్యాంకు ఖాతాకు క్రెడిట్‌ చేస్తుంది.  ప్రాసెస్‌ చేయని డెబిట్‌లు  అన్నిటినీ నిర్ణీత సమయంలోపల స్పాన్సర్‌ బ్యాంకుకు తిప్పి పంపాలి. క్లియరింగ్‌ వ్యవస్థ ద్వారా అందుకొనే ఎలక్ట్రానిక్‌ సూచనలను బ్యాంకులు అసలయిన చెక్కులతో సమానంగా పరిగణిస్తాయి.

అంతిమ బెనిఫిసియరీకి లాభాలు ఏమిటి?

  • కష్టమర్‌లు, వసూలు కేంద్రాలకు/బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా పోతుంది. చెల్లింపు కోసం ఎడవయిన క్యూలలో నిలబడే పని ఉండదు.
  • కష్టమర్‌లకు మనశ్శాంతి- చెల్లింపులకు సంబందించిన చివరి తేదీల గురించి ఆలోచించవ లసిన అవసరంలేదు.
  • ఇసిఎస్‌ యూజర్‌లు డిబిట్‌లను  పర్యవేక్షిస్తారు.

కార్పొరేట్‌ సంస్థలు/సంస్థలు లాంటి ఇసిఎస్‌ యూజర్‌కు ఈ పథకంవల్ల లాభం ఏమిటి?

  • చెక్కులు వసూలు, వాటి రియలైజేషన్‌పై పర్యవేక్షణ, రికన్సిలేషన్‌ కోసం అవసరమైన పరిపాలనా యంత్రాంగంమీద ఇసిఎస్‌ యూజర్‌ ఆదా చేస్తాడు.
  • శ్రేష్టతమమైన  నగదు నిర్వహణ
  • కాగితపు పత్రాలను మోసపూరితంగా దొరకబుచ్చుకొని, నగదు చేసుకొనే అవకాశాలను నివారించడం.
  • చెల్లింపుల వసుళ్ళు వివిధ రోజులలో కాకుండా ఒకే రోజులో జరిగిపోవడం.

బ్యాంకులకు చేకూరే లాభాలు ఏమిటి?

ఇసిఎస్‌ను నిర్వహించే బ్యాంకులు కాగితపు నిర్వహణ నుంచి బయటపడతాయి.

  • కాగితాల ద్వారా నిర్వాహణ బ్యాంకులమీద ఎంతో వత్త్తిడిని కలగజేస్తుంది. పత్రాలను ఎన్‌కోడ్‌ చేయడం, వాటిని క్లియరింగ్‌కు సమర్పించడం, వాటి రిటర్న్స్‌ను పర్యవేక్షించడం, సంబంధిత బ్యాంకులోతో ఖాతాదారులతో అనుదినం ఫాలోఅప్‌ వంటి పనులను బ్యాంకులు నిర్వహించవలసి వుంటుంది.
  • ఇసిఎస్‌ బ్యాంకులలో, తమ ఖాతాదారులకు సంబంధించిన చెల్లింపు వివరాలు సులభంగా లభిస్తాయి.  వారు చేయవలసిందల్లా ఏమిటంటే, పేరు, ఖాతాసంఖ్య వంటి ఖాతావివరాలను సరిచూసుకొని, రాబడులను డెబిట్‌ చేయడమే.
  • వివరాలు సరిపోనట్లయితే ఇసిఎస్‌ కార్యవిధానం ప్రకారం, వారు ఆ మొత్తాన్ని తిప్పి పంపుతారు.

ఒకసారి మేండేట్‌ ఇచ్చిన తరవాత, ఉపసంహరించుకోడం లేదా రద్దుచేయడం కుదురుతుందా?

  • కుదరుతుంది. ఇచ్చిన మాండేట్‌, ఖాతాదారు జారీచేసిన చెక్కుతో సమానం. ఈ పథకం కింద  ఉన్న ఒకె ఒక నిబంధన ఏమంటే  అవి డెబిట్‌లలో కలపకుండా చూడటానికి ఖాతాదారు, ఇసిఎస్‌ యూజర్‌కు ముందస్తు నోటీసు ఇవ్వాలి.

మాండేట్‌కు సరయిన గరిష్ట డెబిట్‌, ప్రయోజనం లేదా మాన్యతాకాలాన్ని ఖాతాదారు నిరణించగలడా?

  • నిర్ణయించగలడు. ఈ అంశాలన్నీ నిర్ణయించుకొనే అవకాశాన్ని వైయక్తిక ఖాతాదారు మరియు ఇసిఎస్‌ యూజర్‌లకు వదిలి పెట్టడం జరిగింది.  మాండేట్‌లో గరిష్ఠ పరిమితి ఉండవచ్చు. ఇది నిర్ణీత ప్రయోజనాన్ని మాన్యత కాలాన్ని కూడా  పేర్కొనవచ్చు.

ప్రస్తుతం ఈ పథకం పరిధి ఎంత?

  • ప్రస్తుతం ఈ పథకం, 15 ఆర్‌బిఐ కేంద్రాలలో (అంటే ఆర్‌బిఐ క్లియరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న చోట్ల), ప్రభుత్వరంగ బాంకులు, క్లియరింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే  ఈ కేంద్రాలలో అమల్లో ఉంది. ఈ కేంద్రాల జాబితా, కార్యవిధాన పరమైన మార్గదర్శక సూత్రాలకింద ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.

వైయక్తిక లావాదేవీలమీద ప్రాసెసింగ్‌ చార్జీలు

  • స్పాన్సర్‌ బ్యాంకులు విధించే సర్వీస్‌ చార్జీలను ఆర్‌బిఐ, రెగ్యులేట్‌ చేసింది. ఆర్‌బిఐ, క్లియరింగ్‌ సేవలను నిర్వహించే ఇతర బ్యాంకులు విధించే ప్రాసెసింగ్‌  ఛార్జీలను ఆర్‌బిఐ 2008 మార్చి వరకూ రద్దు చేసింది.

ఇసిఎస్‌ డెబిట్‌ పథకంలో పాల్గొనడానికి అర్హతగల సంస్థలు ఏవి?

  • టెలిఫోన్‌ కంపెనీలు, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీలు, విద్యుచ్ఛక్తి  మండలులు, క్రెడిట్‌ కార్డు వసూళ్లు, బ్యాంకులూ, ఆర్థిక సంస్థల ఋణ వాయిదాల వసూలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించిన పెట్టుబడి పథకాలు మొ||న  వంటి సేవలు అందించే సంస్థలు.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate