గవదబిళ్ళలు ( పెరోటిడ్ గ్రంధి శోధము ) అనే వ్యాధిలో ఆకస్మిక వైరస్ సోకి అవి నొప్పితో కూడిన వాపునకు గురౌతాయి. పెరోటిడ్ గ్రంధులు చెవులకు క్రింద మరియు మందు భాగంలో వుండి లాలాజలాన్ని (ఉమ్మి)ని స్రవిస్తాయి. లాలాజలం జీర్ణ ప్రక్రియలో పనికి వస్తుంది.
ఈ వ్యాధి ఒకరి నుండి మరోకరికి సోకే అంటువ్యాధి మరియు దీనికి కారణము వైరస్. ఉమ్మి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. 2 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు ఎక్కువగా సోకుతుంది. పెద్దవారిలో ఈ వైరస్ గవదబిళ్ళలే కాక మగవారిలో బీజాశయాలకు, ప్లీహము మరియు నాడీ మండలానికి కూడా సోకుతుంది. వ్యాధి సోకడానికి వ్యాధి లక్షణాలు బయట పడడానికి అంటే వ్యాధి బారిన పడినప్పటి నుంచి, మొదట వ్యాధి లక్షణం బయటపడడానికి పట్టే సమయం 12- 14 రోజులు.
ఉమ్మి గ్రంధులు నొప్పితో కూడుకుని వాస్తాయి. ముందుగా ఒకవైపు ప్రభావితమై మూడు నుంచి 5 రోజుల తరువాత రెండూ గ్రంధులు వాస్తాయి. నమిలేటప్పుడు, మింగేటప్పుడు నొప్పి అధిక మవుతుంది. పుల్లటి ఆహార పదార్ధాలు కానీ, పుల్లటి పళ్ళ రసాలను గానీ తీసుకున్నప్పుడు నొప్పి తీవ్రతరమవుతుంది.
జ్వర తీవ్రత అధికంగా వుండి, తలనొప్పి, ఆకలిలేమి వంటి లక్షణాలు ఉంటూ 3 నుంచి 4 రోజులలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. 7 నుంచి 10 రోజుల లోపు ఉమ్మి గ్రంధులు వాపు (గవదబిళ్ళలు) కూడా తగ్గిపోతుంది. ఈ సమయంలో వ్యాధి సోకిన పిల్లలను దూరంగా ఉంచాలి. పాఠశాలలకు కానీ, ఆటలకు కానీ పంపరాదు. ఎందుకంటే ఇది అంటువ్యాధి, మగవారిలో కొంచెం పెద్దవారిలో బీజాశయాలు వాపుతో కూడిన, నొప్పి కూడా వుండవచ్చును.
(బీజాశయాల శోధము) గవదబిళ్ళల సంక్రమితం మెదడు వాపుకు నొప్పికి కూడా దారి తీయవచ్చును. ఈ క్రింది లక్షణాలు వున్న యెడల వెంటనే వైద్యుని సంప్రదించవలెను.
- తీవ్రమైన తలనొప్పి
- మెడ పట్టేసినట్టు వుండడం
- తల దిమ్ముగా వుండడం
- అధికమైన వాంతులు
- చాలా అధికమైన జ్వరము
- కడుపు నొప్పి
- బీజాశయాల వాపు
దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు లక్షణాలు వాటికి తగ్గ మందులతో నయమవుతాయి. పారసిట్ మోల్ వంటి మాత్రలతో జ్వరము, నొప్పి తగ్గుతాయి. చిన్న పిల్లలకు ఆస్ప్రిన్ ఇవ్వకూడదు. మెత్తగా వున్న ఎక్కువ కారం లేని ఆహారం, ద్రవ పదార్ధాలు అధికంగా తీసుకోవాలి. పుల్లగా వున్న ఆహారం, రసాలు నివారించాలి. చిన్న పిల్లలు పడుకునే వుండనవసరం లేదు.
ఒకసారి గవదబిళ్ళలు వచ్చిన వారికి మళ్ళీ రావు. ఇది జీవితకాలం వ్యాధి నిరోధక శక్తినిస్తుంది. చిన్న పిల్లలలో ఎవరికైతే గవదబిళ్ళలు రాలేదో వారికోసం టీకాలు వున్నాయి. యమ్. యమ్. ఆర్. మూడు అంటువ్యాధులకు నిరోధక శక్తి నిస్తుంది. అవి గవదబిళ్ళలు, తట్టు (పొంగు) మరియు రూబెల్లా, రూబెల్లా వ్యాధిలో చర్మంపై ఎరుపు దనం కనబడుతుంది. ఈ టీకాలు బిడ్డ పుట్టిన 15 నెలల వయసులో ఇవ్వాలి. సంవత్సరము లోపు పిల్లలకు, జ్వరంతో బాధ పడుతున్న పిల్లలకు గర్భిణి స్త్రీలకు ఈ టీకాలు ఇవ్వరాదు.
గవదబిళ్ళల వైరస్ మెదడుకు పాకి మెదడు శోధము కలిగించవచ్చు. ఇది తీవ్రమైన పరిణామము, యుక్త వయసు మగవారిలో బీజాశయాలకు సోకినప్పుడు వంధత్వము సంభవించును.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020