చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster).
లక్షణాలు
- ముఖం, వీపు, ఛాతీ భాగములో దురదతో కూడిన ఎఱ్ఱగ వచ్చు చర్మవ్యాధి.
- నీటితో కూడిన బొబ్బలు వస్తాయి.
- ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసము, ఆకలి తగ్గుట, తేలికపాటి కడుపునొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎలా వ్యాపిస్తుంది
చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన; వారు తుమ్మినప్పుడు - దగ్గినప్పుడు - వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించి - ఈ జబ్బు వస్తుంది. ఇది ఒకరినుండి ఇంకోకరికి సోకే అంటువ్యాధి. చర్మముపై లక్షణాలు కనపడక ముందు 2 రోజులనుండి - దద్దుర్లు పూర్తిగమాని, మచ్చలుగా తయారయ్యేంతవరకు ఈ క్రిములు ఆరోగ్యవంతులకు సోకే అవకాశం వుంటుంది. చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది. చిన్నపిల్లల సంరక్షణ సంస్థలు, పాఠశాలలు, మురికి వాడలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు, చిట్లించరాదు.
- వీలైనంతవరకు పిల్లలకు గోళ్ళు లేకుండా చేయాలి, రాత్రులలో- తెలియకుండా గీచుకోకుండునట్లు - చేతులకు శుభ్రమైన గుడ్డకాని, గ్లౌజులుకాని తొడగాలి. పిల్లలకు ఈ జాగ్రత్త నేర్పించాలి, చెప్పాలి.
- వీలైనంతవరకు చల్లని నీటితో/గోరువెచ్చని నీటితో స్నానము చేయించిన దురదలు కాస్త తగ్గుతాయి.
- కాలమిన్ లోషన్ తో చర్మముపై పూత దురదను కాస్త తగ్గిస్తుంది.
- జ్వరము, దగ్గు అధికంగా వున్నా, డాక్టరును సంప్రదించి వైద్యం చేయించడం అవసరం.
- ఆస్పిరిక్ లాంటి మందు వాడరాదు.
- సులభంగా జీర్ణమగు అహార పధార్దాలు, ద్రవపదార్దాలు తీసుకోవాలి.
- పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
- చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి. వాడినబట్టలను - వేడినీళ్ళతో శుభ్రపరచాలి.
- ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.
నివారణ
చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయించుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కలిగే చర్యలు చేపట్టాలి.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.