অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆస్తమా

ఆస్తమా

 1. ఆస్థమాతో జాగ్రత్త
  1. ఎందుకు వస్తుంది…
  2. వాతావరణ కాలుష్యంతో …
  3. ఆస్థమాలో రకాలు…
  4. ఆస్థమా మాదిరిగా…
  5. మందులు తప్పనిసరి…
  6. జాగ్రత్తలు…
  7. ఆస్థమా తీవ్రతకు కారణాలు…
 2. చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు
  1. ఆస్తమా అంటే ఆయాసమేనా ?
  2. చిన్న వయసులోనే ప్రారంభమవుతుందా ?
  3. అంటువ్యాధా ?
  4. వంశపారంపర్యమా?
  5. ఆస్తమా, క్షయ ఒకటేనా ?
  6. ఎక్స్‌రేలో ఎటువంటి దోషం లేకపోతే ఆస్తమా లేదనుకోవచ్చా ?
  7. ఇస్నోఫీలియా, అలర్జీక్‌ బ్రాంకైటీస్‌ అన్నా, ఆస్తమా అన్నా ఒకటేనా ?
  8. ఆస్తమాలో ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు ?
  9. మా అబ్బాయి స్కూలులో చేరిన తర్వాత ఆయాసం వస్తోంది. ఏం చేయాలి ?
  10. ఇన్‌హేలర్‌ లాంటి అత్యంత శక్తివంతమైన మందులు మొదట్లోనే వాడడం సబబా?
  11. మా పిల్లవాడికి ఆస్తమ కోసం స్టెరాయిడ్స్‌ వాడాలంటే భయం అవుతుంది. ఏం చేయాలి ?
  12. ఆస్తమాలో యాంటి బయా టిక్స్‌ ఉపయోగమా?
  13. ఇన్‌ హేలర్లలో ఖరీదైనవి, చౌకమం దులు లేవా?
  14. ఒకే ఇన్‌హేలర్‌ను ఇద్దరు వాడొచ్చా?
  15. ఇన్‌హేలర్లు జీవితాంతం తీసుకోవల్సిందేనా ?
  16. ఆయాసం లేనప్పుడు కూడా మందులు వాడాలా?
  17. కిటోటిఫెన్‌ అనే మందు ఆస్తమాకు అవసరమా?
  18. పిల్లలు ఆడుకున్న తర్వాత ఆస్తమా వస్తున్నది. వాళ్లను ఆడుకోవడానికి అనుమతించడం సరైనదేనా?
  19. పిల్లల వయసు పెరిగే కొద్దీ ఆస్తమా తగ్గుతుందా?
  20. ఆస్తమా నయం కాదా?
  21. ఆస్తమా ఉన్న పిల్లలు సాధారణ జీవితం గడపగలరా? పెరుగుదల ఉంటుందా ?
  22. ఆస్తమాలో ఏ దగ్గు మందు మంచిది?
  23. ఆస్తమాకు వ్యాక్సిన్‌ ఉందా?

ఆస్థమాతో జాగ్రత్త

ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య.ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మొట్టమొదటి సారి 1998వ సంవత్సరంలో గ్లోబల్‌ ఇనిషి యేట ివ్‌ ఫర్‌ ఆస్థమా సంస్థ వరల్డ్‌ ఆస్థమా డేను 35 దేశాలలో జరిపింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ఆస్థమా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ వస్తున్నారు.దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచ జనాభాలో ఆస్థమా పరిజ్ఞానాన్ని పెంపొందించడం తద్వారా వారి ఆస్థమాని సునాయాసంగా అదుపులో పెట్టుకోగలిగేటట్లు చేయడం. ప్రతి సంవత్సరం ఆస్థమా దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ ఒ నినాదాన్ని ప్రచారం చేస్తోంది. ‘మీరు మీ ఆస్థమాని అదుపులో పెట్టుకోగలరు’ అనేది సంస్థ ఈ సంవత్సరం నినాదం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 సంవత్సరం అంచనాల ప్రకా రం భార తదేశంలో సుమారు 2.5 కోట్లమంది ఉ బ్బసంతోనూ, 1.5 కోట్లమంది సిఒపిడితోనూ బాధపడు తున్నారు. 2016 నాటికి ఈ సంఖ్య 50శాతం పైగా పెరగవచ్చని అంచనా.

ఎందుకు వస్తుంది…

ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతి రోజూ మన శ్వాస కోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జెన్స్‌కి, రసాయ నాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతుంటా యి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ఆస్థమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జెన్స్‌) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది.

వీటి ప్రభావం వలన మన శ్వాస నాళాలు కుంచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్థమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేక పోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్థమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

వాతావరణ కాలుష్యంతో …

ఇంటి లోపలి గాలి కాలుష్యం వలన కూడా ఆస్థమా ఎక్కువ వచ్చు. ఇల్లు ఊడ్చడం వలన, గ్యాస్‌ స్టవ్‌ వాడడం వలన, వేపు డులు చేయడం వలన, అగరబత్తీలు వాడడం, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు గాలిలోకి పార్టి క్యులేట్‌ మెటీరియల్స్‌, రసాయనాలు, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, ఓజోన్‌ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్థమా పెరగవచ్చు. ఇంట్లో వాడే ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌, అయోనైజర్స్‌, జిరా క్స్‌ యంత్రాలు, ఎయిర్‌ క్లీనర్స్‌, ఫిల్టర్స్‌, ప్యూరిఫయర్స్‌ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతా వరణం కాలుష్యం వలన ఆస్థమా చాలా పెరుగుతుంది.

హైదరాబాదులో 70 శాతం గాలి కాలుష్యం వాహనాల వలన జరుగు తుంది. ముఖ్యంగా డీజిల్‌ వాహనాల వలన గాలిలోని పార్టిక్యు లేట్‌ మేటర్‌, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, సల్ఫర్‌ డై ఆకై్సడ్‌, సీసం పొగ లు, కార్బన్‌ మోనాకై్సడ్‌ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓ జోన్‌, పొగమంచును విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకై టిస్‌, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్థమా వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఆస్థమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకొనకపో యినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్‌ వే రీమోడలింగ్‌ జరిగి సిఒపిడిగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్‌ అవుతుంది. చిన్న పిల్లలో ఎదుగుదల, చురుకుదనం తగు ్గతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్‌ దెబ్బతినడం, కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది.

ఆస్థమాలో రకాలు…

ఎలర్జిక్‌, నాన్‌ ఎలర్జిక్‌ ఆస్థమా, యర్లీ, ఆన్‌సెట్‌ ఆస్థమా, వ్యాయామం వలన వచ్చే ఆస్థమా, పొడిదగ్గులాగా వచ్చే ఆస్థమా, వృత్తి ఆస్థమా, స్టిరాయిడ్‌ రెసిస్టెంట్‌ ఆస్థమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగా కనుక్కొని మందులను వాడుకోవాలి.

ఆస్థమా మాదిరిగా…

కొన్ని జబ్బులు ఆస్థమాలాగే ఉంటాయి. దీర్ఘకాలి బ్రాంకైటిస్‌, సిఒపిడి, పోస్ట్‌ నాసల్‌ డిశ్చార్జ్‌, జిఇఆర్‌డి, స్వర పేటికలోని ఓకల్‌ కార్డ్స్‌ పనిచేయకపోవడం, ఆస్టిరేషన్‌ (కడుపులోని పదార్థాలు ఊపిరితిత్తులలోకి వెళ్లడం), దీర్ఘకాలిక మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్‌, బ్రాంకెస్టాసిస్‌ తదితర వాటిని సరిగ్గా కనుక్కొని వాటికి సంబంధించిన మందులు వాడాలి. చిన్న పిల్లలు, ముసలివారి జబ్బుకి సంబంధించిన లక్షణాలని గుర్తించలేరు. దీని వలన జబ్బు ముదిరి ప్రాణాంతకం కావచ్చు.

మందులు తప్పనిసరి…

ఆస్థమా ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా వాడుకోవాలి. పీల్చే మందులే మంచివి. అవి ఎలా వాడుకోవాలో తగు శిక్షణ తీసుకోవాలి. ఒకసారి ఆస్థమా ఎటాక్‌ వస్తే దాని వలన కలిగే నష్టం తిరిగి మరమత్తు అవడానికి సుమారు ఆరు వారాలు పడుతుంది. అలాగే ఇంకొక ఎటాక్‌ రాకుండా చూసుకోవాలి. పీల్చే మందులలో ఇందు కొరకు ప్రివెంటర్స్‌ , రిలీవర్స్‌ అని రెండు రకాల మందులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉదా. గర్భిణీ స్ర్తీలు, శస్త్ర చిిత్స సమయంలో, ముక్కులో పాలిప్స్‌ ఉన్నవారు, ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారు, వృత్తి ఆస్థమా ఉన్నవారు ఆ కారణాన్ని బట్టి సూచించిన మందులు తప్పనిసరిగా వాడుకోవాలి.

జాగ్రత్తలు…

ఆస్థమా ఉన్నవారు క్రింది జాగ్రత్తలు పాటిస్తే తీవ్రతను తగ్గిం చుకోవచ్చు. ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి. డస్ట్‌మైట్స్‌ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఇం ట్లో తివాచీలు ఉంచకూడదు. దుమ్మదూళికి దూరంగా ఉండా లి. ముఖ్యంగా పాత పుస్తకాలు, పేపర్ల జోలికి వెళ్లకూడదు. ఇల్లు ఊడవడానికి బదులు తడిగుడ్డతో తుడుచుకోవడం లేదా వాక్యూమ్‌ క్లీనర్స్‌ వాడుకోవడం మంచిది. ఇట్లో బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. ముక్కు కి గుడ్డ కట్టుకొంటే మంచిది. పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.

ఆస్థమా తీవ్రతకు కారణాలు…
 • చలికాలం
 • పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకల వలన
 • గాలిలో రసాయనాల తుంపరల వలన
 • దుమ్ములోని మైట్స్‌ వలన
 • మందుల వలన (ఆస్ప్రిన్‌, బీటా బ్లాకర్స్‌)
 • ఘాటు వాసనలు
 • ఇంటి పరిసరాలలో బొద్దింకలు, ఎలుకలు ఎక్కువగా ఉన్నా
 • జంతువుల చుండ్రు వలన
 • వ్యాయామం వలన
 • పుప్పొడి రేణువుల వలన
 • వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడం వలన
 • పొగలు, ధూమపానం
 • బాగా నవ్వినా లేదా ఏడ్చినా

ఆస్థమాకి కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానమైనది జన్యు సంబంధిత కార ణాలు, వాతావరణ పరిస్థి తులు, ఇంటి లోపల, బయట వాతా వరణ కాలుష్యం వలన ఆస్థమా రావచ్చు లేదా పెర గవచ్చు.
ఇంటి లోపల వాతారవణ కాలుష్య కారకాలలో ము ఖ్యమైనవి డస్ట్‌మైట్స్‌. ఇవి ఒకరకమైన సూక్ష్మ జీవు లు. మన చర్మం నుండి చనిపోయి రాలిన కణాలపై పడతాయి. ఎక్కువగా తివాచీలు, దుప్పట్లు, పరుపులు, దిండ్లపై ఉంటాయి. కుక్కలు, పిల్లులు, పక్షులు తదితర ఇంట్లోని పెంపుడు జంతువుల వెం ట్రుకలు, చుండ్రు తదితర వాటి వలన ఆస్థమా పెరుగుతుంది. అలాగే ఎలుకలు, బొద్దింకలు ఇంట్లో ఉండడం వలన వాటి మలమూత్ర విసర్జనల నుండి వచ్చే రసాయనాల వలన ఆస్థమా పెరుగుతుంది. ఇంటి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా ఫంగస్‌ పెరుగుతుంది. దీంతో ఆస్థమా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు

వర్షాకాలం తగ్గి క్రమేణా శీతాకాలం వస్తోంది. ఈ వాతావరణంలో ఆస్తమా ప్రకోపించడం పెరుగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమా గురించి తల్లిదండ్రుల్లో అనేక అపోహలున్నాయి. వీటిని నివృత్తి చేసే ప్రశ్నలు-జవాబులు…

ఆస్తమా అంటే ఆయాసమేనా ?

అవును ఆయాసమే. కానీ దగ్గు రూపంలో కూడా ఆస్తమా ఉండొచ్చు. ముఖ్యంగా రాత్రి పూట వచ్చే దగ్గు, అదేవిధంగా ఎదలో బిగపట్టినట్టు ఉండడం, వ్యాయామం తర్వాత దగ్గు రావడం కూడా ఆస్తమాకు తొలి లక్షణాలుగా భావించొచ్చు.

చిన్న వయసులోనే ప్రారంభమవుతుందా ?

ఆస్తమా ఎప్పుడైనా రావొచ్చు. ఇది శ్వాసకోశాల వాపు వల్ల వస్తుంది కాబట్టి చిన్న వయసులోనైనా రావొచ్చు, మధ్యలోనైనా రావొచ్చు.

అంటువ్యాధా ?

కాదు. పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం వల్ల కానీ, కలిసి చదువుకోవడం వల్లకానీ, కలిసి తినడం వల్లకానీ, ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు.

వంశపారంపర్యమా?

కాదు. కానీ ఆస్తమాలేని తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకంటే ఆస్తమా ఉన్న తల్లి దండ్రులకు పుట్టిన బిడ్డల్లో ఇది రెండు మూడింతలు ఎక్కువగా ఉండడం చూస్తాం.

ఆస్తమా, క్షయ ఒకటేనా ?

కాదు. క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆస్తమాకు కారణం శరీరంలో ఉండే అలర్జీ లాంటి గుణం.

ఎక్స్‌రేలో ఎటువంటి దోషం లేకపోతే ఆస్తమా లేదనుకోవచ్చా ?

అన్ని సందర్భాలలో ఆస్తమ ఉందని ఎక్స్‌రేలో నిర్ధారించలేం.

ఇస్నోఫీలియా, అలర్జీక్‌ బ్రాంకైటీస్‌ అన్నా, ఆస్తమా అన్నా ఒకటేనా ?

ఈ పదాలను సాధారణంగా ఒకే అర్థంలో వాడుతున్నారు. కొన్ని తేడాలతో ఇవన్నీ ఒకటే అనుకోవచ్చు.

ఆస్తమాలో ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు ?

ఫలానాది తినకూడదని నిర్ధారణగా చెప్పలేం. కానీ ఏదైనా ఒక పదార్థం తిన్న తర్వాత పదే పదే ఆయాసం వస్తుంటే దాన్ని మానెయ్యాలి.

మా అబ్బాయి స్కూలులో చేరిన తర్వాత ఆయాసం వస్తోంది. ఏం చేయాలి ?

ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే స్కూళ్లల్లో రద్దీ ఉంటుంది కాబట్టి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి ఇంకొకరికి సులభంగా సోకుతాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఆస్తమా బయటపడుతుంది. ఎక్కువైతుంది.

ఇన్‌హేలర్‌ లాంటి అత్యంత శక్తివంతమైన మందులు మొదట్లోనే వాడడం సబబా?

ఇన్‌హేలర్లు ఆస్తమాలో మొదటి నుంచి వాడడం అవసరం. అవి మనం అనుకున్న విధంగా ప్రమాదకరమైనవి కావు. అలవాటు కూడా కావు. పైగా మాత్రల కంటే కూడా చాలా చాలా తక్కువ మోతాదు మందు మాత్రమే అందులో ఉంటుంది. నోటి ద్వారా తీసుకునే మాత్రలు, ఇంజక్షన్లు శరీరమంతటా ప్రభావం చూపితే, ఇన్‌హేలర్లు ఊపిరితిత్తుల్లో మాత్రమే వాటి ప్రభావాన్ని చూపుతాయి. ఆ రిత్యా ఇన్‌హేలర్లు మంచివి. అవసరమైనవి కూడా.

మా పిల్లవాడికి ఆస్తమ కోసం స్టెరాయిడ్స్‌ వాడాలంటే భయం అవుతుంది. ఏం చేయాలి ?

స్టెరాయిడ్స్‌లో అనేక రకాలుంటాయి. ఇన్‌హే లర్‌ ద్వారా

ఆస్త మా కోసం వాడే స్టెరాయిడ్స్‌ సరైన వైద్య పర్య వేక్ష ణ లో తీసుకు న్నప్పుడు ఎటువంటి భయం అవసరం లేదు. ఇతర మందుల్లాగే అది కూడా సురక్షితమే.

ఆస్తమాలో యాంటి బయా టిక్స్‌ ఉపయోగమా?

ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు యాంటి బయాటిక్స్‌ అవసరం అవుతాయి. లేనప్పుడు అవసరం లేదు.

ఇన్‌ హేలర్లలో ఖరీదైనవి, చౌకమం దులు లేవా?

ఇన్‌హేలర్లు ఖరీదైనవిగా కనిపించినా దీర్ఘకాలిక దృష్టితో చూడాలి. ఇన్‌హేలర్ల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాల్సిన అవసరం తగ్గుతుంది. అత్యవసర పరిస్థితులు కూడా తగ్గుతాయి. ఇతరత్రా ఖర్చులు కూడా పరిగణలోకి తీసుకుంటే ఇన్‌హేలర్ల వల్ల లాభమే కానీ నష్టం లేదు.

ఒకే ఇన్‌హేలర్‌ను ఇద్దరు వాడొచ్చా?

వాడకపోవడం మంచిది.

ఇన్‌హేలర్లు జీవితాంతం తీసుకోవల్సిందేనా ?

అది జబ్బు తీవ్రతను బట్టి, మందుల వల్ల వచ్చే ఫలితంపైఆధారపడి ఉంటుంది. కానీ తప్పనిసరిగా ఆస్తమా ఉన్నవారంతా జీవితాంతం ఇన్‌హేలర్లు వాడి తీరాల్సి ఉంటుందన్నదేమీ లేదు.

ఆయాసం లేనప్పుడు కూడా మందులు వాడాలా?

ఆస్తమ దీర్ఘకాలిక సమస్య. అప్పుడప్పుడు ఆయాసం వస్తూ, తగ్గుతూ ఉండొచ్చు. కాలం గడిచేకొద్దీ శ్వాసనాళాల్లో శాశ్వతమైన మార్పులు వస్తాయి. ఈ మార్పులను నిరోధించాలంటే తగిన మందులను నిరంతరం వాడాల్సి ఉంటుంది.

కిటోటిఫెన్‌ అనే మందు ఆస్తమాకు అవసరమా?

ఈ మందు ఆస్తమాను నియంత్రిస్తుందని కానీ, ఉపశమనం కలిగిస్తుందని కానీ నిర్ధారణ కాలేదు.

పిల్లలు ఆడుకున్న తర్వాత ఆస్తమా వస్తున్నది. వాళ్లను ఆడుకోవడానికి అనుమతించడం సరైనదేనా?

బహుశ ఈ కారణం వల్ల పిల్లలను ఆడుకోనివ్వకపోవడం, సముచితం కాదేమో. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆడుకోనివ్వొచ్చు. చల్లటి గాలిలో తిరగకపోవడం, తేలికైన ఆటలు ఆడడం, ఆటల సందర్భంగా నిదానంగా, గాఢంగా గాలి తీసుకుని వదలడం అలవాటు చేసుకోవడంలాంటి జాగ్రత్తల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆటలకు ముందు ఇన్‌హేలర్‌ను వాడడం వల్ల కూడా నిరోధించొచ్చు.

పిల్లల వయసు పెరిగే కొద్దీ ఆస్తమా తగ్గుతుందా?

ప్రతి ముగ్గురిలో ఇద్దరికి తగ్గే అవకాశ ముంది. అయితే చిన్నతనంలో వచ్చే ఆస్తమా అటాక్‌లను నివారించడానికి, నయం చేయడానికి తగిన వైద్యం జరగకుంటే పెద్ద అయిన తర్వాత తగ్గకపోవచ్చు. కాబట్టి చిన్న వయసులో వచ్చే ఆస్తమాకు శ్రద్ధగా వైద్యం చేయించుకోవాలి.

ఆస్తమా నయం కాదా?

ఆస్తమా ఒక ఇన్‌ఫ్లమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్‌ అనేది శరీరంలో ఒక సహజమైన రక్షణ గుణం. ఇది ఎక్కువకావడం, తక్కువ కావడం ఉంటుంది కానీ, అంటే బాగా నియంత్రించొచ్చు. సాధారణంగా చూసినప్పుడు ఈ నియంత్రణనే నయం కావడంగా కూడా అనుకోవచ్చు.

ఆస్తమా ఉన్న పిల్లలు సాధారణ జీవితం గడపగలరా? పెరుగుదల ఉంటుందా ?

ఆస్తమా నియంత్రణలో ఉన్న పిల్లవాడు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నట్లే లెక్క. పెరుగుదలలో కూడా తేడా ఉండదు.

ఆస్తమాలో ఏ దగ్గు మందు మంచిది?

ఆస్తమాలో దగ్గు మందుల అవసరం లేదు. బ్రాంకో డైలేటర్‌ మందులే దగ్గును కూడా తగ్గిస్తాయి.

ఆస్తమాకు వ్యాక్సిన్‌ ఉందా?

లేదు. కానీ ఫ్లూ వల్ల ఆస్తమా ఎక్కువ అవుతుంది. చిన్న పిల్లల్లో ఫ్లూ ఎక్కువగా వస్తుంటుంది. ఆ విధంగా ఫ్లూ వ్యాక్సిన్‌ వాడితే మంచిది. కానీ ఆస్తమాకు వ్యాక్సిన్‌ లేదు.

ఆధారము: వైద్యం

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/15/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate