অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

లైంగిక ఆరోగ్యం

లైంగిక ఆరోగ్యం అన్నది, లైంగికపరమైన ఉద్వేగం కలిగినపుడు సత్ర్పవర్తనతో శరీరంపై భావోద్రేకంపై అదుపును కలిగివుండటం వల్ల, రక్షించబడుతుంది. అందువల్ల లైంగిక పరమైన ఆనందాన్ని పొందగలుగుతారు కూడా. మన శరీరం గురించిన మనకు ఆనందాన్నిచ్చే విషయాల గురించిన అవగాహన కలిగి ఉండటంవల్ల, అవసరం లేని గర్భధారణల ప్రమాదంను తగ్గించుకోవటం వల్ల, లైంగిక సంపర్మాలవల్ల వ్యాప్తిచెందే వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవటం వల్ల లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చాలా కమ్యూనిటీలలో గల హానికరమైన నమ్మకాలు, విశ్వాసాలవల్ల స్త్రీలు ఆరోగ్యకరమైన సెక్స్ను పొందలేకపోతున్నారు. స్త్రీలకు తరచు సెక్స్, సెక్స్ను గురించిన నిర్ణయాలపై అదుపును కలిగివుండే పరిస్థితులు లేకపోవటం, తరచు సెక్స్ను తిరస్కరించలేని పరిస్థితులు వలన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది స్త్రీలు లైంగిక సంపర్మాలవల్ల సంక్రమించే హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మాత్రమే కాక ఇంకా అనేక సుఖవ్యాధులకు గురికావటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వికలాంగులైన స్త్రీలు వ్యాధులకు గురికారని భావిసూ వుంటారు కొందరు. కాని అది నిజం కాదు. వైకల్యం లేని స్త్రీలు ఏ వ్యాధులకు గురవుతూ వుంటారో, లైకల్యం గల  స్త్రీలకు కూడా అవే వ్యాధులు సంక్రమిస్తాయి.

యధార్గానికి వైకల్యం గల స్త్రీలకు, బాలికలకే, వైకల్యం లేని స్త్రీలకంటే వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే వారికి లైంగిక ఆరోగ్యం గురించి సమాచారం పొందటం కష్టం కావటం ఇంకా వారికి ఎవరితో, ఎలా సెక్స్ సంబంధం కలిగి వుండాలన్న ఆలోచన, అదుపు తక్కువగా వుండటం కూడా కారణాలు. అందువల్ల వారు లైంగికపరంగా ఎదుటి వారికి సులభంగా దొరికినట్లవుతుంది. ఫలితంగా లైంగికంగా వ్యాప్తి చెందే సుఖవ్యాధులతో పాటు ప్రాణాంతకమైన హెచ్.ఐ.వి/ఎయిడ్స్ కూడా సంక్రమించే అవకాశాలు వారికి ఎక్కువగా వుంటాయి. వైకల్యాలు గల స్త్రీలపై జరిగే లైంగిక వేధింపుల గురించిన అధిక సమాచారం కోసం 14వ అధ్యాయం చూడండి:

ఈ అధ్యాయంలో లైంగికపరంగా వ్యాపించే వ్యాధులూ, ఇంకా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ను గురించిన సమాచారం, వాటి నివారణ గురించిన సూచనలూ, సలహాలూ అందజేయబడ్డాయి. అవసరమైన మంచి సమాచారం అందుబాటులో వున్నట్లయితే, తగు జాగ్రత్తలు పాటించి తమను తాము రక్షించుకోగలగటమే కాకుండా, ఆరోగ్యకరమైన సెక్సును పొంది ఆనందంగా వుండగలుగుతారు.

సెక్పుద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధులు ఏవి?

c1లైంగిక సంపర్కం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాప్తిచెందే వ్యాధులను సుఖవ్యాధులు అంటారు. ఏ విధమైన సెక్పుద్వారా అయినా ఈ వ్యాధులు ఒకరి నుండి మరొకరికి సంక్రమించవచ్చు. అది పురుషాంగం - యోని సంపర్కం కావచ్చు, లేక మలద్వారం ద్వారా సెక్స్ కావచ్చు, లేక నోటి ద్వారా సెక్స్ (నోటి నుండి యోని గాని, నోటి నుండి పురుషాంగం గాని) కావచ్చు. కొన్ని సందర్భాలలో వ్యాధిగ్రస్తమైన యోనిని గాని, పురుషాంగాన్ని గాని కేవలం మరొక వ్యక్తి యొక్క జననాంగాలతో రాపిడి కలగటంవల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తాయి.

చికిత్స పొందని వ్యాధులు ప్రమాదకరం:

చాలా వరకు ఈ రకమైన వ్యాధులు మందులతో చికిత్స జరపటం ద్వారా నివారింపబడతాయి. ఈ వ్యాధులు చికిత్స లేకుండా ముదిరినట్లయితే స్త్రీ, పురుషులిరువురిలోను కూడా వంధ్యత్వం ఏర్పడుతుంది. శిశువు ముందుగానే జన్మించటం, మరీ చిన్నగా వుండటం, అంధత్వం కలగటం, అండవాహికలో గర్భం ఏర్పడటం, పొత్తి కడుపులో నొప్పి, సర్విక్స్ ద్వారానికి సోకే  క్యాన్సర్, తీవ్రమైన వ్యాధుల వల్ల మరణించటం మొదలైనవి జరుగుతాయి. చికిత్స చేయని వ్యాధులు ముదిరితే.

సెక్స్ వల్ల వ్యాపించే వ్యాధుల లక్షణాలు:

ఈ క్రింది వానిలో ఒకటిగాని, అంతకన్నా ఎక్కువగాని లక్షణాలు కలిగి వున్నట్లయితే మీకు లైంగిక పరమైన సుఖవ్యాధి ఏదో ఒకటి వున్నట్లే,

  • అసాధారణమైన స్రావం యోని నుండి.
  • యోని నుండి అసాధారణమైన వాసన
  • పురుషాంగం ద్వారా యోనిలో సెక్స్ జరిగే సమయంలో పొత్తికడుపులో నొప్పి గాని, ఒక అసాధారణంగా అనిపించే స్థితి గాని కలిగి ఉండటం.
  • మీ జననేంద్రియాలపై, దురద, దద్దుర్లు, బొడిపి కట్టటం లేక పుండు ఏర్పడటం.
  • మీ వైకల్యం కారణంగా మీలో ఈ లక్షణాలు వున్నట్లు గుర్తించి చెప్పలేకపోవచ్చు. ఈ లక్షణాలను గుర్తించటంలో మీరు నమ్మే ఒక వ్యక్తి సహాయం తీసుకోవచ్చు మీరు.

ప్రావంలో కలిగే మార్పులు

యోనిలో కొద్దిగా తడికాని, స్రావం కాని చాల సాధారణం. ఈ పద్ధతిగా యోని తనను తాను శుభ్రపరుచుకోవటం, రక్షించుకోవటం చేస్తుంది. మీ రుతుస్రావ సమయంలో ప్రావంలో మార్పు కలుగుతుంది. మీ నెలసరి రుతుస్రావం ప్రారంభం కావటానికి సుమారుగా 14 రోజుల ముందు ప్రావంలో మార్పు కలిగి, చక్కగా, జారుగా, స్పష్టంగా కనిపిస్తుంది. ప్రావం మొత్తంలో గాని, రంగులో గాని మీ యోని నుండి కలిగే స్రావంలో మార్పులు కలిగినట్లయితే కొన్నిసార్లు అది వ్యాధిగా అనుకోవచ్చు. కాని అది ఏ వ్యాధి అన్నది చెప్పటం క,టం.

లైంగికపరమైన వ్యాధులను గుర్తించటం ఎలా?

మీరు అంధులైనటైతే,

మీరు జననాంగాలను కడిగి శుభ్రపరచుకొనేటపుడు, ఏదైనా అసాధారణమైన స్రావంగాని, కణితిలుగాని, పండు గాని వున్నాయేమో మీ వేళ్ళను ఉపయోగించి తెలుసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి. అదే రోజూ గనుక చేస్తే మార్పులను గుర్తించటం కష్టం.

మీకు కొంచెం గాని అస్సలుగాని చేతిపై అదుపు లేనట్లయితే:

మీ చేతి వేళ్లను కదపలేని పరిస్థితి అయినటైతే మార్పులను గుర్తించటానికి, అద్దాన్ని ఉపయోగించి ఆ మార్పులను గుర్తించండి, మీరు అద్దాన్ని కూడా పట్టుకోలేకపోతున్నటైతే, అద్దాన్ని నేలపై పెట్టి అందుకు అనువుగా దానిపైకి జరిగి చూడాలి.

మీకు వెన్నెముకకు గాయమై వున్నట్లయితే;

మీ జననేంద్రియాలను కంటితో చూసుకోగలిగినా, చేతితో అనుభూతి పొందకలిగినా, స్నానంచేసే సమయంలో వారానికి ఒకసారి అలా చేసి చూడండి. మీ అంతట మీరు ఆ పని చేయలేనట్లయితే, మీకు విశ్వాసం గల వారిని ఎవర్నైనా సహాయం కోరండి. మీకు బహుశా పొత్తికడుపులో నొప్పిగాని జననేంద్రియాలలో దురదకాని అనుభవం కాకపోవచ్చు. మీకు గనుక లైంగికంగా వ్యాప్తి చెందే వ్యాధి వుండి  తొలిదళలోనే  చికిత్స చేయించుకోనటైతే, మీకు 'డిస్రిఫ్లెక్సియా వచ్చే అవకాశం చాలా వుంటుంది. అది చాల ప్రమాదకరం.

మీ కాళ్ళలో పరిమితమైన కదలిక లేక అసలు కదలిక లేకపోవడం వున్నటైతే

మీరు కడిగి శుభ్రపరుచుకొనే సమయంలో సాధ్యమైతే మీ జననాంగాలను వేళ్ళతో తాకగలిగే విధంగా కాని, ఒక అద్దం సహాయంతో చూడగలిగే విధంగా గాని కూర్చోవాలి. అవసరం అయినటైతే మీరు నమ్మే వ్యక్తిని, మీ కాళ్ళు కదలకుండా పట్టుకోమని అడగాలి.

టైకొమోనాస్:

టైకోమోనాస్ వ్యాధి, దురదతో కూడి చాల అసౌకర్యాన్ని కలిగించే లైంగికంగా వ్యాప్తిచెందే వ్యాధి. పురుషులు ఈ వ్యాధి తమకున్నట్లే గుర్తించే లక్షణాలేం వుండవ వారికి. ఇది వారి పురుషాంగంలో వుండి సెక్స్ సమయంలో ఒక స్త్రీకి సోకుతుంది.

లక్షణాలు:

  • బూడిద రంగు లేక పసుపు రంగు నురగతో కూడిన స్రావం.
  • చెడువాసన కలిగిన ప్రావం.
  • ఎర్రబడి, దురదను కలిగి వుండే యోని, దాని చుటూ వుండే ప్రాంతం.
  • మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పిగాని, మంటగాని కలిగి వుండటం.

మీరు గనుక పరీక్షలు చేయించుకొని, మీకు టైకోమోనాస్ వున్నట్ల నిర్ధారింపబడినట్లయితే, ఈ దిగువన పేర్కొన్న మందులలో ఒకదానిని ఉపయోగించండి. మీరు పరీక్షలు జరిపించుకోలేనట్లయితే, 162వ పేజీలో ఇచ్చిన జాబితాలోని మందులను తీసుకోవచ్చును. ఎందుకంటే మీకు సోకిన వ్యాధి, ఇతర రకాల లైంగికంగా వ్యాపించే వ్యాధుల కారణంగా వచ్చినది కావచ్చు.

టైకోమోనాస్కు మందులు

మందు

ఎంత తీసుకోవాలి

ఎపుడు తీసుకోవాలి

మెట్రోనిడాజోల్

400 నుంచి 500 మి.గ్రా.

నోటిద్వారా, రోజుకు 2 సార్లు చొప్పన 7 రోజులు

లేదా మెట్రోనిడాజోల్ (గర్భిణీ సమయంలో వేసుకోవాలి. మొదటి 3 నెలలు, మెట్రోనిడాజోల్ వాడకూడదు)

2 గ్రా. (2000మి.గ్రా)

నోటిద్వారా ఒకే మోతాదుగా వేసుకోవాలి.

లేదా కైండా మైసిన్

30 మి.గ్రా

నోటిద్వారా రోజు 2 సార్లు చొప్పన 7 రోజులు వేసుకోవాలి.

ముఖ్యం: మెట్రోనిడాజోల్ తీసుకునే సమయంలో ఆల్కహాల్ సేవించకూడదు. మెట్రోనిడాజోల్ గురించిన మరింత సమాచారం కోసం 347వ పేజీ చూడండి. మీ భాగస్వామికి కూడా అదే మందుతో చికిత్స చేయాలి.

గనోలియా (క్షాప్, గొనో, వి.డి) మరియూ క్షమీడియా

గనోరియా, క్షమీడియా రెండూ ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే, కాని తొలిదశలో చికిత్స పొందటం వల్ల సులభంగా నయం చేయవచ్చు. అలా చేయనట్లయితే ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చి, పురుషుడు, స్త్రీ కూడా సంతానోత్పత్తి శక్తిని కోల్పోవటం జరుగవచ్చు. ఇన్ఫెక్షన్ వున్న వ్యక్తితో లైంగిక సంపర్కం తర్వాత పురుషుడిలో 2 నుండి 5 రోజుల తర్వాత వ్యాధిలక్షణాలు కనిపించటం ప్రారంభిస్తాయి. పురుషుడిలో లక్షణాలు కనిపించక పోయినప్పటికీ వ్యాధి వుండొచ్చు. స్త్రీలలో లక్షణాలు కొన్ని వారాలు లేక నెలల వరకు కూడా కనిపించక పోవచ్చు. అయినప్పటికీ ఇరువురూ కూడా మరొక వ్యక్తికి గనోరియా, క్షమీడియా రెండింటినీ వ్యాపింపచేయవచ్చు.

స్త్రీలో సాధారణంగా కనిపించే లక్షణాలు

  • c2యోని లేక మల ద్వారం నుండి పసుపుపచ్చని లేక ఆకుపచ్చని ప్రావం. (డిశ్ఛార్జి)
  • మూత్ర విసర్జన చేసే సమయంలో మంట, నొప్పి
  • జ్వరం రావటం
  • పొత్తి కడుపులో నొప్పి
  • లైంగిక సంపర్కంలో నొప్పి లేక రక్తస్రావం కావడం
  • అసలే లక్షణాలూ వుండవు కూడ.

పురుషుడిలో లక్షణాలు

  • c3అంగం నుండి ప్రావం. (డిశ్ఛార్జి)
  • మూత్ర విసర్జన చేసేటపుడు నొప్పి లేక మంట.
  • బీర్గాల వాపు లేక నొప్పి
  • అసలేమీ లక్షణాలు వుండకపోవచ్చు.

చికిత్స

మీకు గనోరియా లేక క్షమీడియాకు సంబంధించిన ఏవైనా లక్షణాలు వున్నా ఒక వేళ మీరు ఇన్ఫెక్షన్ కలిగి వుండవచ్చు అని భావించిన వ్యక్తితో అరక్షిత లైంగిక సంపర్కం కలిగి వున్నా మీరు వెంటనే పరీక్ష చేయించుకోండి. మీకు వున్న వ్యాది ఏదో సరైన నిర్ధారణ తెలిసినట్లయితే, ఏ మందులు వాడుకోవాలో మీకు తెలుసుకొనే అవకాశం వుంటుంది.

గవోరియాకు మందులు

మందు

ఎంత తీసుకోవాలి

ఎపుడు తీసుకోవాలి

సెఫిక్సిమ్

400 మి. గ్రా.

నోటిద్వారా ఒకే మోతాదులో

లేదా సిప్రోప్లాక్సాసిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా ఒకే మోతాదు

క్షమీడియాకు మందులు

మందు

ఎంత తీసుకోవాలి

ఎపుడు తీసుకోవాలి

అజిత్రోమైసిన్

1 గ్రా.

నోటి ద్వారా ఒకేసారి అంతా

లేదా డాక్సీ సైక్లిన్

100 మి.గ్రా.

రోజుకు 2 సార్లు, 7 రోజులు

లేదా టెట్రూ సైక్లిన్

500 మి.గ్రా. నోటి ద్వారా

రోజుకు 4 సార్లు, 7 రోజులు

లేదా ఎరిత్రోమైసిన్

500 మి.గ్రా. నోటి ద్వారా

రోజుకు 4 సార్లు, 7 రోజులు

దురదృష్టవశాతూ ఈ వ్యాధులకు పరీక్షలు ఎల్లపుడూ అందుబాటుగా వుండవు. అందువల్ల, తరచు ఒకటి కంటే ఎక్కువ వ్యాధులకు మందులు వేసుకోవటం మంచిది. ఒక వ్యక్తి కేవలం గనోరియా, క్షమీడియాల వల్లనే కాకుండా, టైకోమోనాస్ మరియు బాక్టీరియల్ వేజినోసిస్ల వలన కూడా ఒకే సమయంలో అనేక వ్యాధులు సోకవచ్చు. 162వ పేజీలో ఛార్డులో ఇచ్చిన మందుల జాబితాలోని మందులు చికిత్సకు ఉపయోగపడతాయి.

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పి.ఐ.డి) లేక పొత్తికడుపులో ఇన్ఫెక్షన్

స్త్రీ పొత్తి కడుపులోని జననాంగాల్లో ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ సోకితే, ఆ వ్యాధిని పి.ఐ.డి.గా చెప్తారు. దీనినే తరచూ పెల్విక్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. నయంకాని సుఖవ్యాధులు, ముఖ్యంగా గనోరియా, క్షమీడియా ఇన్ఫెక్షన్ వున్నపుడు పెల్విక్ ఇన్ఫెక్షన్ రావచ్చు.

మీకు వీటిలో ఒకటిగాని, అంతకన్నా ఎక్కువగాని లక్షణాలు కనిపించవచ్చు.

  • c4పొత్తి కడుపులో నొప్పి
  • తీవ్రమైన జ్వరం.
  • మీకు నీరసంగా, బలహీనంగా, అనారోగ్యంగా అనిపిస్తుంది.
  • ఆకు పచ్చని లేక పసుపు పచ్చని దుర్వాసనతో కూడిన స్రావం కలగటం యోని నుండి.
  • యోని ద్వారా సెక్స్ సమయంలో నొప్పిగాని, రక్తస్రావం అవటంగాని.

చికిత్స

ఈ వ్యాధి అనేక క్రిముల కలయిక ద్వారా సోకుతుంది. అందువలన ఒకటికన్నా ఎక్కువ మందులను ఉపయోగించాలి.

గనోరియా, క్షమీడియా, టైకోమోనాస్, బాక్టీరియల్ వేజినోసిస్ మరియు పి.ఐ.డి.లకు మందులు

మీరు పరీక్షలు చేయించుకోలేక పోయినప్పటికీ, మీలో ఈ వ్యాధుల లక్షణాలు గనుక వున్నట్లయితే ఈ మందులను కలిపి వాడండి.

మందు

ఎంత తీసుకోవాలి

ఎపుడు, ఎలా తీసుకోవాలి

సెఫిక్సైమ్

400 మి.గ్రా.

నోటి ద్వారా ఒకే మోతాదు

లేదా సిప్రోప్లాక్సాసిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా ఒకే మోతాదు

(గర్భంతో వున్నా పాలిస్తున్నా సిప్రాప్లాక్సాసిన్ వాడకూడదు)

మరియు

అజిత్రోమైసిన్

1 గ్రా (1000 మి.గ్రా)

నోటి ద్వారా ఒకే మోతాదు

లేదా ఎరిత్రోమైసిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా 4 సార్లు రోజుకు, 7 రోజులు

లేదా ఎమాక్సిలిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా 3 సార్లు రోజుకు, 7 రోజులు

లేదా డాక్సీనైక్లిన్

100 మి.గ్రా.

నోటి ద్వారా 2 సార్లు రోజుకు, 7 రోజులు

(మీరు గర్భిణి అయినా, పాలిస్తున్నా డాక్సీ సైక్లిన్ వాడకూడదు)

లేదా టెట్రా నైక్లిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా 4 సార్లు రోజుకు, 7 రోజులు

(గర్భంతో వున్నా పాలిస్తున్నా సిప్రాప్లాక్సాసిన్ వాడకూడదు)

మరయు

మెట్రోనిరాజోల్

400 నుండి 500 మి.గ్రా.

 

నోటిద్వారా, 2 సార్లు రోజుకు, 7 రోజులు

లేదా 2 గ్రా. (2000 మి.గ్రా0

నోటిద్వారా, ఒకే మోతాదు

(గర్భంతో వున్న మొదటి 3 నెలలు మెట్రోనిడజోల్ వాడకూడదు. దానికి బడులుగా క్లిండామైసిన్ మరియు టినిడాజోల్ వాడాలి)

లేదా

క్షిండామైసిన్

300 మి.గ్రా.

నోటి ద్వారా, రోజుకు 2 సార్లు, 7 రోజులు

లేదా 5 గ్రాములు 2 శాతంలో

యోనిలో పడుకొనే సమయంలో

క్రీము (పూర్తిగా రాయలి)

7 రోజులు రాసుకోవాలి.

మరియు టినిడాజోల్

2 గ్రా. (2000 మి.గ్రా.0

నోటి ద్వారా ఒకే నోతాదు.

లేదా 500 మి.గ్రా.

నోటి ద్వారా, రోజుకు 2 సార్లు, 5 రోజులు.

ముఖ్యం: మెట్రోనిడాజోల్ లేదా టినిడాజోల్ వాడుతున్న సమయంలో ఆల్కహాల్ త్రాగకూడదు. మీ భాగస్వామికి కూడ ఇవే మందులను ఉపయోగించి చికిత్స చేయాలి.

జననాంగాలపై పుండ్లు

జననాంగాలపై వచ్చు పండ్లలో చాలా వరకు లైంగికంగా వ్యాప్తి చెందేవే వుంటాయి. కాని ఒత్తిడి వల్ల ఏర్పడే పుండు, కురుపులు లేదా గాయాల వల్ల కూడా జననాంగాలపై పుండు ఏర్పడతాయి. జననాంగాలపై పండ్లను శుభ్రంగా వుంచాలి. ప్రతి రోజూ జాగ్రత్తగా సబ్బు, నీరుతో వాటిని కడిగి, పొడిగా వుంచుకోవాలి. మీరు పండ్లను పొడిగా వుంచుకోవటానికి వాడే బట్టను ఇతరులను వాడనీయవదు.

హెచ్చరిక: జననాంగాలపై పుండు వున్నట్లయితే, సెక్స్లో ఎయిడ్స్ వైరస్ పుండు ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. హెపటైటిస్-బి కూడ అలాగే వ్యాపిస్తుంది. వీటిని నివారించటానికి సహాయపడటానికి, మీకు, లేదా మీ భాగస్వామికి పుండు మానే వరకు సెక్స్లో పాల్గొనకుండా వుండాలి.

సిఫిలిస్

సిఫిలిస్ ప్రమాదకరమైన సుఖ వ్యాధి. దాని ప్రభావం శరీరమంతటి పైనా పడుతుంది. ఈ వ్యాధి శరీరంలో సంవత్సరాల తరబడి వుంటుంది. క్రమక్రమంగా పరిస్థితి క్షీణిస్తూ, ఈ వ్యాధికి కారణం బాక్టీరియా. దీనిని తొలిదశలోనే చికిత్స చేయటం ద్వారా నివారించవచ్చు.

లక్షణాలు:

  1. మొదటి లక్షణం ఒక మొటిమ, బొబ్బ చదునుగా నీరుకారుతూ వుండటం, లేదా పగిలిన కురుపులాంటి చిన్న నొప్పి లేని పుండు, ఈ పండు కొన్ని రోజులు లేక వారాలుండి దానంతట అదే S తగ్గిపోతుంది. కాని వ్యాధి శరీరమంతటా పాకుతూనే వుంటుంది.
  2. కొన్ని వారాలు, లేక నెలల తర్వాత వ్యాధి సోకిన వ్యక్తికి గొంతు నొప్పి, జ్వరం, దదుర్లు (ముఖ్యంగా అరచేతుల్లో, అరికాళ్ళలో) పండు ఏర్పడతాయి. కీళ్ళ వాపులు కూడా వస్తాయి. ఈ సమయంలో ఇతరులకు కూడా వ్యాధి ఈ వ్యక్తి నుంచి వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది. .
  3. ఈ లక్షణాలన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. కాని వ్యాధి మాత్రం అలాగే వుంటుంది. శరీరంలో చికిత్స చేయనటైతే సిఫిలిస్ గుండె వ్యాధి, పక్షవాతం, మానసిక వ్యాధులకు దారితీసి చివరకు మరణం కూడా సంభవిస్తుంది.

చికిత్స

సిఫిలిస్ను పూర్తిగా నయం చేయాలంటే, పూర్తి చికిత్స చాల అవసరం.

  • లక్షణాలు ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం వున్నటైతే, 2.4 మిలియన్ యూనిట్లు బెంజాధిన్ పెన్సిలిన్, అంతా ఒక్కసారే, కాని సగం సగం చేసి రెండు చట్లకు (హిప్స్) ఇవ్వాలి. పెన్సిలిన్ పడక ఎలర్జీ వచ్చే వ్యక్తులు టెట్రాసైక్లిన్ - 500 మి.గ్రాలు, రోజుకు నాలుగుసార్లు చొప్పన, 15 రోజులు తీసుకోవాలి.
  • లక్షణాలు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం వున్నటైతే 2.4 మిలియన్ యూనిట్లు బెంజాధిన్ పెన్సిలిన్, రెండు చట్లలోను (పిరుదులు) సగం సగం చొప్పన, వారానికి ఒకసారిగా, 3 వారాలు ఇవ్వాలి (మొత్తం 7.2 మిలియన్ యూనిట్లు). ఒకవేళ పెన్సిలిన్ ఎలర్జీ అయినటైతే టెట్రాసైక్లిన్ - 500 మి.గ్రా.లు రోజుకు 4 సార్లు చొప్పన 30 రోజులు వాడాలి.

గమనిక: గర్భంతో వున్న లేక పాలిస్తున్న స్త్రీలు పెన్సిలిన్ అలర్జీ అయినట్లయితే ఎరిత్రోమైసిన్

గర్భం మరియు సిఫిలిస్ :

గర్భవతి అయిన ఫ్రీ, తన గర్భస్థ శిశువుకు సిఫిలిస్ వ్యాప్తి చేయటం వల్ల, బిడ్డ నెలలు నిండక ముందే జన్మించవచ్చు. వైకల్యాలతో పుట్టటం గాని, లేక లోపలే చనిపోయి పుట్టటం గాని జరగవచ్చు. గర్భం వచ్చిన తర్వాత రక్తపరీక్షలను చేయించుకొని, అవసరమైన చికిత్స చేయించుకుంటే ఈ అనర్గాన్ని నివారించవచ్చు. రక్త పరీక్షలలో గర్భిణి ఇయిన స్త్రీకి, ఆమె భర్తకు కూడ సిఫిలిస్ వ్యాధి వున్నట్టు నిర్ధారించబడినట్లయితే, ఇద్దరూ కూడా బెంజథిన్ పెన్సిలిన్ 2.4 మిలియన్ యూనిట్లు, వారానికి ఒక ఇంజక్షన్ చొప్పన 3 వారాలు కండరం లోకి (ఐ.ఎమ్) ఇంజక్షన్ చేయించుకోవాలి.

షాంక్రాయిడ్

షాంక్రాయిడ్, జననాంగాలపై పుండ్లను కలుగ జేసే ఒక సుఖవ్యాధి. త్వరగా మందులతో చికిత్స చేసినట్లయితే దీనిని నయం చేయవచ్చు. దీనిని సిఫిలిస్గా పొరపడే అవకాశం వుంది.

లక్షణాలు:

  • జననాంగాల మీద లేక మలద్వారం దగ్గర మెత్తగా, నొప్పిగా వుండి, సులభంగా రక్తం వచ్చే ఒకటి లేక అంత కన్నా ఎక్కువ పుండు,
  • గజ్జల్లో వాచి, నొప్పిని కలిగించే గ్రంథులు. (లింఫ్ గ్రంథులు. బ్యూబోస్).
  • కొంచెం జ్వరం.

షాంక్రాయిడ్కు మందులు

మందు

ఎంత తీసుకోవాలి

ఎపుడు తీసుకోవాలి

అజిత్రోమైసిన్

1 గ్రా.

నోటి ద్వారా, ఒకే మోతాదు

లేదా ఎరిత్రో మైసిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా, రోజుకు నాలుగుసార్లు, 7 రోజులు

లేదా సప్రోప్లాక్సాసిన్

500 మి.గ్రా.

నోటి ద్వారా, రోజుకు 2 సార్లు 3 రోజులు

(గర్భిణి అయినటైతే సిప్రోప్లాక్సాసిన్ వాడ కూడదు)

గమనిక: మీరు పరీక్ష చేయించుకోలేకున్నా మీ పుండు షాంక్రాయిడ్ వల్లే వచ్చినట్లు చెప్పలేకున్నా కూడ, బహుశా సిఫిలిస్కు వాడే మందులు వాడటం మంచింది

జెనిటల్ హెర్పిస్ (జననాంగాలపై హెర్పిస్ వ్యాధి)

జెనిటల్ హెర్పిస్ వైరస్ కారణంగా వచ్చే సుఖవ్యాధి, చిన్న బొబ్బలు జననాంగాలపై కనిపిస్తాయి. సెక్స్ సమయంలో ఈ జెనిటల్ హెర్బిస్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. నోటి ద్వారా సెక్స్ చేసే సందర్భాలలో జెనిటల్ హెర్బిస్ నోటిపై కూడా వస్తుంది. (ఇది సాధారణంగా నోటిపై వచ్చే హెర్పిస్ వంటిది కాదు, అది సెక్స్ ద్వారా రాదు. జ్వరం, రొంప వస్తే వసూ వుంటాయి అవి.

హెర్పిస్ వైరస్ వల్ల ఏర్పడే పండ్లు కొన్ని వారాలుగాని, నెలలుగాని వచ్చి వుండిపోతుంటాయి.

హెర్పిస్కు నివారణ లేదు. కాని మీకు కొంచెం ఉపశమనం కలిగేలా చికిత్స చేయవచ్చు అంతే.

లక్షణాలు:

  • జననాంగాల దగ్గర లేక తొడల మీద తిమ్మిర్లు లేక దురదతో కూడి బాధగా వుంటుంది.
  • జననాంగాలపై బొబ్బల్లా ఏర్పడి, అవి పగిలి పుండ్లు పడతాయి.

మీకు మొదటిసారి హెర్పిస్ వచ్చినపుడు అవి 3 వారాలు లేక అంతకంటే ఎక్కువ కాలం వుంటుంది. ఆ సమయంలో మీకు చలి, జ్వరం, తలపోటు, ఒళ్ళు నొప్పలు, గజ్జల్లో వాచిన లింప్స గ్రంథులు వుంటాయి. అటు తర్వాత ఇన్ఫెక్షన్ తక్కువగా వస్తుంది.

చికిత్స: ఎసైక్లోవిర్ వుపయోగించండి;

గర్భం మరియు హెర్పిస్

c5హెర్పిస్ ఇన్ఫెక్షన్ సోకిన గర్భవతికి ప్రసవం సమయంలో పుండ్లు వుంటే బిడ్డకు ఆ వ్యాధి వ్యాపించగలదు. ఇది బిడ్డకు ప్రమాదకర సమస్యలను కలుగజేస్తుంది. తల్లికి హెర్పిస్ మొదటిసారి వచ్చినటైతే ఆ ప్రభావం బిడ్డపై ఎక్కువగా పడుతుంది. అదే అంతకు ముందే ఒకసారి. వచ్చి వున్నటైతే ప్రమాదం తక్కువగా వుంటుంది. బిడ్డకు. మీకు హెర్పిస్ పండ్లు వున్నటైతే, ప్రసవం ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకోవడం మంచింది. వారు ఆపరేషన్ చేసి బిడ్డను తీసి, ప్రత్యేకమైన మందుల్ని ఇవ్వగలరు. ఆపరేషన్ వల్ల బిడ్డ, పుండ్ల నుండి వ్యాధి సోకకుండా కాపాడబడుతుంది.

జెవిటల్ వార్ట్స్ (జననాంగాలపై ఉలిపిరి కాయలు (వార్ట్)

బాహ్యజననాంగాలపై ఉలిపిరికాయలు (పిలకలు) , అంగం మీద పిలకలు వార్డ్స్ అన్నవి వైరస్ వల్ల వస్తాయి. జననాంగాలపై వచ్చే ఉలిపిరి కాయలు, శరీరంలోని ఇతర భాగాలపై వచ్చే వార్డ్స్ లాగానే వుంటాయి. జననాంగాలపై వార్డ్స్ వున్నప్పటికీ అంగం చివరగాని, యోని లోపలగాని వున్నటైతే తెలియకపోవచ్చు. చికిత్స లేకుండా కూడా అవి తగ్గిపోవచ్చు. కాని ఎక్కువ సమయం పట్టవచ్చు. సామాన్యంగా అవి ఇంకా ఎక్కువవుతూ వుంటాయి. అందువల్ల చికిత్స అవసరం. సెక్స్ ద్వారా వార్డ్స్ (హెచ్.పి.వి) ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది.

ముఖ్యం: జననాంగాలపై వార్డ్స్ (పిలకలు) చికిత్స చేయనటైతే సర్విక్స్ కాన్సర్ సోకే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. మీకు జననాంగాలపై వార్డ్స్ వస్తే, పాప్ పరీక్ష చేయించుకోవటానికి ప్రయత్నించండి. అందువల్ల మీ సర్విక్స్కు హెచ్.పి.వి లేదా కాన్సర్ లక్షణాలున్నాయేమో తెలుసుకోవచ్చు.

హెచ్.ఐ.వి. లక్షణాలు:

  • దురద
  • చిన్న నొప్పి లేని, తెలుపలేక గోధుమ రంగు, గరుకుగా వున్న బుడిపెలు

చికిత్స:

వార్డ్స్ (పిలకలు)కు చికిత్స కోసం ఉపయోగించే సామగ్రి మందుల షాపులో దొరుకుతుంది.

  1. ప్రతి వార్డ్ చుటూ ఆరోగ్యంగా వున్న చర్మాన్ని రక్షించటానికి, కొంచెం పెట్రోలియం జెల్ లేదా ఏదైనా జిడ్డుగా వుండే ఆయింట్ మెంటును రాయండి.
  2. చిన్నపుల్లతో 80% నుంచి 90% వరకు టైక్లోర్ ఎసిటిక్ ఏసిడ్ (టిసిఏ)ను జాగ్రత్తగా వార్డ్ పై అది తెల్లగామారే వరకు పెట్టండి. లేదా అదే విధంగా బైక్లోరో ఎసిటిక్ ఏసిడ్ (బిసిఏ) సొల్యూషన్ను పెట్టండి.
  3. ఏసిడ్ ను 2 గంటల తర్వాతగాని, మంట భరించలేకుంటే ఇంకా ముందుగానే కాని కడిగేయండి.

లేదా

20% పోడోఫిల్లిన్ సొల్యూషన్ను అదే విధంగా వార్డ్ గోధుమ రంగుకు మారే వరకు వుంచాలి దానిపై పోడోఫిల్లిన్ను 6 గంటల తర్వాత కడగాలి తప్పనిసరిగా, వార్డ్ను ఏసిడ్ కాల్చివేస్తుంది. వార్డ్ స్థానంలో ఒక నొప్పితో కూడిన పుండు వుంటుంది. పుండ్లను శుభ్రంగా, పొడిగా వుంచాలి. పుండు ఒకటి లేక రెండు వారాలలో నయమై పోవాలి. ఇన్ఫెక్షన్ రాకుండా పుండ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పుండు పూర్తిగా పోయే వరకు సెక్స్లో పాల్గొనకూడదు. అది తప్పని సరిగా భావించినట్లయితే, మీ భాగస్వామిని కండోమ్ ఉపయోగించమని చెప్పాలి.

వార్డ్స్ అన్నింటిని తొలగించాలంటే చాలా చికిత్సలు అవసరం. (మీరు ఏ సొల్యూషన్ ఉపయోగించారన్నది ముఖ్యం కాదు) అదే చికిత్సను ఒకవారం తర్వాత మళ్ళీ చేయవచ్చు. వార్డ్ స్థానంలో వున్న పుండుపై ఏసిడ్ చిందకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మంటగా వున్నట్లయితే రెండవ చికిత్స కోసం ఇంకొన్ని రోజులు ఆగండి.

గర్భిణీ మరియు వార్డ్

c6మీరు గర్భంతో వున్నటైతే పోడోఫిల్లిన్ను ఉపయోగించకండి. అది మీ చర్మంలోనికి ఇంకటం వలన గర్భస్థ శిశువుకు హాని కలిగించవచ్చు. గర్భంతో వున్న సమయంలో వార్డ్స్ వేగంగా పెరుగుతాయి. రక్తం కూడా చిందుతుంది. వాటంతట అవి శిశువుకు హాని చేయవు. కొన్ని సందర్భాలలో గర్భం తర్వాత వార్డ్స్ చాల చిన్నగా మారిపోతాయి.

హెపటైటిస్ (కామెర్లు, పసుపుపచ్చని కళ్లు)

c7కాలేయానికి హాని చేసే ఒకరకం వైరస్ వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధే హెపటైటిస్. ఇది కేవలం వైరస్ వలననే కాకుండా ఆల్కహాల్, విషపూరిత రసాయనాల వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా మూడు రకాల హెపటైటిస్ (ఎ, బి, సి)లు వుంటాయి. వ్యాధి లక్షణాలు లేకుండానే ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.

హెపటైటిస్ ఎ: ఇది సాధారణంగా పసిపిల్లలలో స్వల్ప ప్రభావం చూపిస్తుంది. అలాగే వయసు మళ్ళిన వారి విషయంలో తీవ్రంగా వుంటుంది. గర్భిణీ స్త్రీలపై కూడా దీని ప్రభావం అధికమే.

హెపటైటిస్ బి: ఇది ప్రతి ఒక్కరికీ కూడ ప్రమాదకరమైన వ్యాధే. దీనివల్ల కాలేయానికి శాశ్వితమైన హాని కలుగుతుంది. సిరోసిస్, కాలేయపు కాన్సర్ సోకి చివరకు మరణం కూడా సంభవిస్తుంది. మీరు గర్భిణీగా వుండి, మీలో హెపటైటిస్ బి లక్షణాలు వున్నటైతే వెంటనే డాక్టరు సలహా పొందటం అవసరం.

హెపటైటిస్ సి: హెపటైటిస్ సి కూడా చాలా ప్రమాదకరమైన వ్యాధే. ఇది కాలేయాన్ని శాశ్విత

ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. హెచ్.ఐ.వి /ఎయిడ్స్ వున్న వారి మరణానికి ప్రధానకారణం హెపటైటిస్ సి.

లక్షణాలు

  • అలసటగా, నీరసంగా వుండటం
  • ఆకలి లేకపోవడం
  • పసుపు పచ్చని కళ్ళు మరియు చర్మం (అరిచేతులు అరికాళ్ళు)
  • కడుపులో నొప్పి లేదా వికారం
  • ముదురు రంగు మూత్రం మరియు తెల్లని విరేచనం.
  • లక్షణాలేమీ లేవు.

చికిత్స

ఇందుకోసం సహాయ పడగల మందులేదు, ఏమైనా మందులు తీసుకోవటం వలన మీ కాలేయం మరింత హానికి గురవ్వడం జరుగుతుంది.

c8విశ్రాంతి తూసుకుంటూ, ద్రవ పదార్ధాలను, అదికంగా తీసుకోవాలి, మీకు తినాలని లేకుంటే పళ్ళరసం, జావ, వెజిటేబుల్ సూప్ తాగండి. వాంతిని అదుపు చేయటానికి కోలా లేకా అల్లం ద్రావాన్ని తీసుకోవాలి. మూలిక వంటి తేనీరు తీసుకుంటే మంచిది. మీ పరిసరాలలో వుండే వృద్దులైనా స్త్రీలను ఏ మూలికలు ఎక్కువ బాగా పనిచేస్తాయో అడగటం వలన పయోగం వుండవచ్చు.

మీకు తినాలనిపించినప్పుడు, ప్రోటీన్లు అధికంగా వుండే అంతు సంబంధమైన (మాంసం, చేపలు, గ్రుడ్లు) వంటివి తినకూడదు. ఎందుకంటే దెబ్బతిని వున్న కాలేయానికి అధిక శ్రమను కలిగిస్తాయి. అటువంటివి, వెజిటేబుల్ నూనెలు, జంతు సంబంధమైన క్రొవ్వులతో కూడిన, వండిన ఆహారాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా పళ్ళు తాడా కూరగాలు లేక ఉడికించినవి. ప్రోటీన్లు తక్కువ తీసుకోవాలి. కనీసం 6 నెలల వరకు ఆల్కహాల్ తాగరాదు.

నివారణ

హెపటైటిస్ బి మరియు సి వైరస్ లు సెక్స్ ద్వారాను, ఉడికించని ఇంజక్షన్ సూదుల వలన, వ్యాధిగ్రస్థమైన రక్తం ఎక్కించటం వలన, ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు - ఇలా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందటం జరుగుతుంది. హెపటైటిస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించాలంటే సెక్స్ సమయంలో విధిగా కండోమ్ను ఉపయోగించటం మరియు ఇంజక్షన్ సిరంజిలు, సూదులు, శరీరాన్ని కోయటానికి ఉపయోగించే పరికరాలు, ఇంకా పచ్చబొట్లకు ఉపయోగించే సాధనాలు, వాతలు పెట్టే వస్తువులు స్త్రీ జననాంగాలు కోయటానికి వాడేవి అన్నీ కూడా ఉడికించేలా (స్టెరిలైజ్) చూసుకోవటం ఉపయోగించటానికి ముందు అత్యవసరం.

హెపటైటిస్ ఎ వైరస్, కలుషితమైన ఆహారం నీరు ద్వారా ఒక వ్యక్తి విరేచనం నుండి మరో వ్యక్తికి చేరటం జరుగుతుంది. ఈ విధంగా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా వుండటానికి, వ్యాధి గ్రస్తుడైన వ్యక్తి యొక్క విరేచనం మరుగుదొడ్డి లోపలకైనా దిగిపోవాలి. లేదా మన్నుతో కప్పి వుంచాలి. వ్యాధి సోక్రిన వ్యక్తి 36%35on వుండేలా చూడాలి. వ్యాధి గ్రస్తుడైన వ్యక్తి సంరక్షకులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడ తరచు చేతులు శుభ్రంగా తోముకొని, శుభ్రత పాటించాలి.

ప్రస్తుతం హెపటైటిస్ మరియు బిలకు వ్యాధి నిరోధకాలు కనుగొనబడి అందుబాటుగా వుంటున్నాయి. కాని అవి చాలా ఖరీదైనవిగా వుంటాయి. కాని అవి ప్రతి చోట అందుబాటులో వుండవు. మీరు గర్భిణీగా వుండగా వ్యాధి నిరోధకాలు తీసుకోవటం వలన వ్యాధి మీ నుంచి గర్భస్థ శిశువుకు వ్యాపించకుండా నిరోధించవచ్చు.

లైంగికంగా వ్యాప్తి చెందే వ్యాధి మీకు వున్నటైతే ఏమి చేయాలి

మీకు గాని మీ భాగస్వామికి గాని సుఖవ్యాధి లక్షణాలు వుంటే ...

  • c9వెంటనే చికిత్స ప్రారంభించండి. తొలి దశలోనే చికిత్స తీసుకోవటం వలన క్రమంగా తర్వాత తర్వాత కలిగే తీవ్ర సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుకోవటమే కాకుండా వ్యాధిని ఇతరులకు వ్యాపించకుండా నివారించవచ్చు.
  • సాధ్యమైతే పరీక్ష చేయించుకోవాలి. ఆసుపత్రికి గాని, ఆరోగ్య కేంద్రానికి గాని వెళ్ళి, మీకు ఏరకమైన సుఖవ్యాధి వుందో పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇందువల్ల మీకు అవసరం లేని మందులను కూడా మీరు ఉపయోగించే బాధ తప్పతుంది. పరీక్ష చేయించుకోవటం వీలుకానట్లయితే మీరు అనేక రకాల మందులను ఉపయోగించవలసి వుంటుంది. అనుభవం గల ఒక ఆరోగ్య కార్యకర్తను కలిసి చికిత్స గురించి మాట్లాడండి.
  • మీరు చికిత్సను పొందుతున్న సమయంలోనే మీ భాగస్వామి కూడా చికిత్సను పొందనటైతే, సెక్స్ ద్వారా అతడు మీకు మళ్ళీ వ్యాధిని వ్యాపింపచేస్తాడు. అతడిని సరైన మందులు ఉపయోగించేలా కాని, ఆరోగ్య కార్యకర్తను కలిసేలా కాని చేయండి.
  • వ్యాధి లక్షణాలు పోతున్నాసరే శ్రద్ధగా అన్ని మందులు వాడండి. కొన్ని మందులను మాత్రమే కొనకండి. మీకు (లేదా మీ భాగస్వామికి) అవసరమైన అన్ని మందులు ఉపయోగిస్తేనే గాని పూర్తిగా నయంకాదు.
  • ఎల్లపుడూ కూడ సురక్షితమైన సెక్స్లోనే పాల్గొనండి. మిమ్మల్ని మీరు రక్షించుకోనటైతే, మీరు ఎప్పటికీ ఏదో ఒక సుఖవ్యాధికి గురవుతూనే వుంటారు.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అంటే ఏమిటి?

c10హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్యూనోడెఫిసియన్సీ వైరస్) చూడటానికి కనిపించనంతటి చిన్న క్రిమి. ఇన్ఫెక్షన్తో పోరాడే మీ శరీర భాగమైన వ్యాధినిరోధక వ్యవస్థపై వైరస్ దాడి చేస్తుంది. హెచ్.ఐ.వి తరచుగా సెక్స్ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. ఒక పురుషుడు హెచ్.ఐ.విని ఒక గర్బిణీ స్త్రీకి వ్యాపింప చేసినా, లేక ఒక గర్భిణీ స్త్రీ అంతకు మునుపే హెచ్.ఐ.వి.కలిగి వున్నా అది ఆ శిశువుకు గర్భంలోనే గాని, ప్రసవ సమయంలో గాని, లేకపాలిచ్చేటపుడు గాని సోకవచ్చు.

ఎయిడ్స్ (ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్) ఇది ఒక వ్యక్తికి హెచ్.ఐ.వి { సోకిన కొంతకాలం తర్వాత పెరిగే వ్యాధి. ఒక వ్యక్తికి మామూలు కన్నా ఎక్కువగా తరచు సాధారణారోగ్య సమస్యలు వస్తున్నటైతే అతడికి/ ఆమెకు ఎయిడ్స్ వున్నట్లు భావించవచ్చు.

బరువు తగ్గటం, పుండు మానక పోవటం, ఎక్కువ దగ్గు రాత్రిపూట చెమటలు పట్టటం, విరేచనాలవటం, చర్మంపై దదుర్లు, జ్వరం, యోని నుండి ప్రావం లేక ఎపుడూ కూడ బాగా అలిసి పోయినట్లుగా వుండటం - ఇవి ఎయిడ్స్ యొక్క కొన్ని లక్షణాలు. కాని ఈ సమస్యలన్నింటికి వేరే కారణాలు కూడా వుండవచ్చు. ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష జరిపితేనే గాని ఏ వ్యక్తికీ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వున్నట్లు నిర్ధారణ కాదు.

హెచ్.ఐ.వి. సోకిన ఒక వ్యక్తి యొక్క శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతి అనారోగ్యంతోను ఇంకా ఇంకా బలహీనమై పోతుంది. అందువలన ఆ వ్యక్తి శరీరం వ్యాధులతో పోరాడ లేక, కోలుకోకుండా అయిపోతుంది. ఆ వ్యక్తి శరీరం బ్రతకలేనంత బలహీనంగా అయిపోయే వరకు అలాగే కొనసాగి, చివరకు అతడు / ఆమె చనిపోవటం జరుగుతుంది. అంగవైకల్యం గల వ్యక్తిగాని, వైకల్యం లేని వ్యక్తిగాని ఎవరికైనా హెచ్.ఐ.వి / ఎయిడ్స్ సంక్రమించవచ్చు.

c11కొందరు హెచ్.ఐ.వి సోకగానే, ఎయిడ్స్తో త్వరగా చనిపోవటం జరుగుతుంది. కాని చాల మంది హెచ్.ఐ.వి సంక్రమించిన వ్యక్తులు ఎయిడ్స్తో జబ్బు పడటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అందువల్ల హెచ్.ఐ.వి. సంక్రమించినా, ఆరోగ్యం బాగానే వుండటం వల్ల వారికి తమకు వ్యాధి వున్నట్లే తెలియదు. వారికి ఎలా అనిపించినా, వారికి హెచ్.ఐ.వి. సోకగానే వారు మాత్రం ఇతరులకు హెచ్.ఐ.వి వ్యాపింపచేయగలరు. మీ రక్తం పరీక్ష చేయించుకోవటం ఒకటే, మీకు వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవటానికి మార్గం. ఈ పరీక్షలు చాల క్లినిక్లలో, ఆసుపత్రులలో చేయబడతాయి.

హెచ్.ఐ.వి /ఎయిడ్స్ సంక్రమించిన వ్యక్తులు ఆరోగ్యం గాను, ఎక్కువ రోజులూ జీవించటానికి ఏంటేరిట్రో వైరల్స్ అనబడే మందులు సహాయ పడతాయి. ఈ మందులు హెచ్.ఐ.వి ని నాశనం చేయటం గాని, ఎయిడ్స్ని నయం చేయటం గాని చేయవు. కాని ఆ వ్యాధితోనే సులభంగా జీవించేలా చేస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, ఎ.ఆర్.వి. చికిత్స హెచ్.ఐ.విని తల్లి నుండి శిశువుకు సోకకుండా నివారిస్తుంది. కాని దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఎ.ఆర్.వి.లు చాల ఖరీదైనవి కావటమే కాకుండా కొన్ని దేశాలలో అవి అందుబాటుగా లేకుండా వుండటం,

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది?

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ను కలిగించే వైరస్, వ్యాధి సంక్రమించిన వ్యక్తుల యొక్క రక్తం, పురుషుడి వీర్యం, స్త్రీ యొక్క యోని ద్రవంలో వుంటుంది. ఈ ద్రవాలు మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించినపుడు వ్యాధి వ్యాపించుతుంది.

హెచ్.ఐ.వి ఈ విధంగా వ్యాప్తిచెందగలదు.

  • మోచ్.ఐ.వి. గల వ్యక్తితోగాని కండోమ్లు ఉపయోగించని వ్యక్తితో సెక్ట్లో పాల్గొనటం వలన
  • ఉడికించని ఇంజక్షన్ సూదులు, పరికరాలు చర్మాల్లి కోసే పరికరాలు వుపయోగించటం వలన
  • కోసుకున్ల లేక పైకి గాయంగా వున్ల చోటకు వ్యాధి గ్రస్థమైన రక్తం ప్రవేశంచటం వలన
  • వ్యాధిగ్రస్తురాలైన తల్లి గర్గంలో గాని,  ప్రసవంలోగాని, పాలిద్దేటపుడు గాని శిశువుకు వ్యాపించటం వలన,

రక్త పరీక్షలు జరపకుండానే రక్తం ఎక్కించే సందర్భాలలో కూడా హెచ్.ఐ.వి. సోకే ప్రమాదం వుంటుంది.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎట్లా వ్యాప్తి చెందదు?

హెచ్.ఐ.వి. మానవ శరీరం వెలుపల కొద్ది నిముషాల కన్నా ఎక్కువ జీవించదు. అది దానంతట అది గాలిలోగాని, నీటిలో గాని జీవించదు. అందువలన మీరు ఈ క్రింది పనులు చేయటం వలన హెచ్.ఐ.వి.కి గురి కావటం గాని, వ్యాపింపచేయటం గాని చేయలేరు.

  • స్పర్శించుకోవటం, కౌగిలించుకోవటం ముదు పెట్టుకోవటం.
  • ఆహారం పంచుకు తినటం.
  • పక్కను పంచుకోవటం.
  • మరుగు దొడ్లను, దుప్పట్లను, దుస్తులను వారు ఉపయోగించినవి మీరు ఉపయోగించటం.
  • దోమలు మొదలైన కీటకాలు కుట్టటం.

స్త్రీలపై బెచ్.ఐ.వి/ఎయిడ్స్ ప్రభావం

పురుషులకన్నా తొందరగా, హెచ్.ఐ.వి సోకిన స్త్రీలు ఎయిడ్స్ బారినపడి అనారోగ్యానికి గురవుతారు. పోషకాహారం లోపించటం వలన, పిల్లలను మోసి కనటం వలన ూ6లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పురుషులకన్నా స్త్రీలకు హెచ్.ఐ.వి చాలా సులభంగా సంక్రమిస్తుంది. పురుషుడి వీర్యం ఫ్రీ శరీరంలోకి ప్రవేశించినపుడు సెక్స్ ద్వారా, అది ఆమె యోని ద్వారా లేదా సెర్విక్స్ ద్వారా ఆమె రక్తంలోనికి ప్రవేశిస్తుంది. ఏమైనా కోసుకున్న గాయాలుగాని, పండుగాని వున్నట్లయితే ఇంకా సులభం అవుతుంది. ఇది శరీర వైకల్యంతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా సంక్రమించవచ్చు.

c12హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు అంగవైకల్యం గల స్త్రీల గురించి ప్రమాదకరమైన అభిప్రాయాలు: హెచ్.ఐ.వి/ఎయిడ్స్ను గురించిన ఒక అతి హానికరమైన అభిప్రాయం ఏమిటంటే, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గల వ్యక్తి గనుక అంతకు ముందు సెక్స్లో పాల్గొనని స్త్రీ (కన్య)తో సెక్స్లో పాల్గొన్నట్లైతే అతడి వ్యాధి నయమవుతుందని. అందువల్ల హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గల పురుషుడు, వైకల్యం గల స్త్రీలు సెక్స్లో పాల్గొనక కన్యలు Yor వుంటారన్న ఆలోచనతో అటువంటి వారిని వేటాడటం మొదలు పెడతాడు. ఆమె వల్ల తన హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నయం కాగలదన్న మూఢ నమ్మకంతో అటువంటి వారికి ఇబ్బంది కలిగించటం జరుగుతుంది. కాని అది నిజం కాదు.

ఒక సెక్స్లో పాల్గొనని కన్యతో సెక్స్ జరపటం వలన మరో వ్యక్తికి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాపింప చేయటమే అవుతుంది.

మీకు హెచ్.ఐ.వి. ఒకవేళ వుందేమో తెలుసుకోవటo:

హెచ్.ఐ.వి పరీక్ష:

హెచ్.ఐ.వి. శరీరంలో ప్రవేశించగానే, వ్యాధి నిరోధక వ్యవస్థ దానితో పోరాడటానికి వెంటనే యాంటీ బాడీస్ను తయారు చేస్తుంది. 2 నుంచి 4 వారాల లోపున హెచ్.ఐ.వి పరీక్ష రక్తంలో వున్న ఈ యాంటీ బాడీస్ను గుర్తించటం జరుగుతుంది. ఒక వ్యక్తికి హెచ్.ఐ.వి సంక్రమించినట్లు తెలుసుకోవటానికి ఇది ఒక్కటే మార్గం.

పాజిటివ్ హెచ్.ఐ.వి పరీక్ష అంటే అర్థం మీకు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, మీ శరీరం హెచ్.ఐ.వి వైరస్ తో పోరాడటానికి యాంటీ బాడీస్ని తయారు చేసిందని, మీ ఆరోగ్యం పూర్తిగా బావున్నట్లనిపించినప్పటికీ, మీరు ఇతరులకు వ్యాధిని వ్యాపింపచేయగలరు.

నెగెటివ్ హెచ్.ఐ.వి టెస్ట్ అంటే అర్థం

  • మీకు హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ లేదని
  • మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది కాని, హెచ్.ఐ.వి. టెస్ట్ పాజిటివ్గా రావటానికి సరిపడా యాంటీబాడీలను మీ శరీరం ఇంకా తయారు చెయ్యలేదు.

మీకు పరీక్ష నెగెటివ్ వచ్చినప్పటికీ, మీకు ఇన్ఫెక్షన్ వుందేమోనని అనుమానం వున్నప్పడు తిరిగి ఆరు వారాల తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి. కొన్ని సందర్భాలలో పాజిటివ్ టెస్ట్లు కూడా తిరిగి మళ్ళీ చేయించుకోవాలి. మంచి అనుభవం గల ఆరోగ్య కార్యకర్త మీకు సహాయపడగలడు.

c13గమనిక: హెచ్.ఐ.వి. పరీక్ష చేయటం మరియు కౌన్సిలింగ్ సామాన్యంగా ఒకేసారే చేయబడుతున్నాయి. అందరికీ అందుబాటుగా కూడా ఎక్కువ ఏర్పాటు చేయబడుతున్నాయి. ఒక ఆరోగ్యకార్యకర్తను అడగండి, మీ ప్రాంతంలో మిమ్మల్ని ఎక్కడ పరీక్షిస్తారో, చాలా ఆసుపత్రులలోను, ఆరోగ్య కేంద్రాలలోను ఉచితంగా కాని, తక్కువ ఖర్చుతో గాని హెచ్.ఐ.వి. పరీక్షలు వేగంగా చేయబడుతున్నాయి. పరీక్ష చేసిన రోజునే ఫలితాలు కూడా పొందవచ్చు. కొన్ని పరీక్షలు జరిపే కేంద్రాలలో బ్రెయిలీలోను, మరికొన్ని చోట్ల సౌంజ్ఞ భాషలోను సమాచారం అందుబాటులో వుంటుంది.

ముఖ్యం: మీరు ఆరోగ్యంగా కనిపిస్తున్నా మీకు ఆరోగ్యంగానే అనిపిస్తున్నా కూడా, మీరు ఇన్ఫెక్షన్ సోకగానే మీరు హెచ్.ఐ.వి.ని ఇతరులకు వ్యాపింపచేయగలరు. కేవలం ఒక వ్యక్తిని చూసి ఆమె / అతడు కాని హెచ్.ఐ.వి కలిగి వున్నారని చెప్పలేం. మీకు వ్యాధి సోకిందీ, లేనిదీ తెలుసుకోవటానికి వున్న ఒకే ఒక మార్గం హెచ్.ఐ.వి టెస్ట్ చేయించుకోవటం.

కౌన్సిలింగ్ (సలహానిచ్చు ప్రక్రియ)

  • c14హెచ్.ఐ.వి. పరీక్ష చేయబడటం.
  • మీ అనుమతితోనే జరగాలి.
  • పరీక్షకు ముందు, తర్వాత కూడా కౌన్సిలింగ్తో జరగాలి.
  • రహస్యంగా ఫలితం మీకు, మీరు కోరుకున్నవారికి మాత్రమే తెలియ పరచాలి.

ఒక శిక్షణ పొందిన హెచ్.ఐ.వి /ఎయిడ్స్ కౌన్సిలర్ మీకు హెచ్.ఐ.వి పరీక్ష చేయించుకోవటం అవసరమైతే నిర్ణయం చేస్తారు. మీ పరీక్ష ఫలితం పాజిటివ్ అయితే ఆ కౌన్సిలర్ ఆ విషయం ఎవరికి తెలియచేయాలో మీ జీవితంలో కలిగిన ఆ మార్పును ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకోవటంలో సహాయ పడగలడు.

మీ ఆంతరంగిక విషయాలను కాపాడుకోవటo:

తనకు హెచ్.ఐ.వి. వున్న విషయం ఎవరికి చెప్పాలని గాని, ఎలా చెప్పాలని గాని నిర్ణయించుకోవటంలో ఒక స్త్రీ తన స్వంత అభిప్రాయాన్ని కలిగి వుండాలి. ముఖ్యంగా ఒక స్త్రీ  తన లైంగిక భాగస్వామితోగాని భాగస్వాములతో గాని ఆ విషయం గురించి మాట్లాడాలి. అందువల్ల వారు కూడా పరీక్షలు చేయించుకొని తమను తాము రక్షించుకోగలుగుతారు. చాల మంది స్త్రీలు తమ కుటుంబ సభ్యులకు, తమకు తోడ్పాటు అందించే వారికి చెప్పారు. సహజంగా ఫ్రీలు తమ చుటూ వున్న సంఘంలో అందరికీ తెలిసిపోతుందని భయపడతారు.

ఒక వికలాంగురాలైన స్త్రీకి ఒక ఆరోగ్య కార్యకర్తతో ప్రత్యేకంగా (రహస్యంగా) మాట్లాడాలంటే ఈ క్రింది కారణాల వల్ల వీలు కాకపోవచ్చు.

  • ఒక ఆరోగ్య కార్యకర్తకు, ఒక వికలాంగురాలైన స్త్రీకి కూడా మిగతా స్త్రీలకు ఇచ్చేటటువంటి గౌరవమే ఇచ్చి ఆదరించాలని తెలియదు.
  • ఆరోగ్య కార్యకర్త ఒక వైకల్యం గల స్త్రీకి ఆమె ఆరోగ్య పరిస్థితులను, హెచ్.ఐ.వి.తో సహా సుఖవ్యాధుల గురించి ఆమెకు చెప్పకుండా, ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాడు. ఇది ఒకవేళ ఆ వికలాంగురాలికి తెలుసుకోవటం, అర్థం చేసుకోవటంలో సమస్య వుంటే అలా చెయ్యటం నిజమే. అవసరం కూడా.
  • ఆ స్త్రీ యొక్క కుటుంబ సభ్యులు ఆమె అంతట ఆమెను స్వంతంగా వెళ్ళి ఒక ఆరోగ్య కార్యకర్తను కలిసేటందుకు సాయపడరు కూడా.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వలన కలిగే ఆరోగ్య సమస్యలకు సమయం పొందండి

ఎయిడ్స్ సోకిన వ్యక్తి అనేక రకాల సామాన్య ఆరోగ్య సమస్యల కారణంగా అనారోగ్యానికి గురవుతూ వుంటాడు. ఇక్కడ అటువంటి కొన్ని సాధారణ సమస్యల గురించిన సమాచారం వుంది, కాని ఒక ఆరోగ్య కార్యకర్తను కలిసి మాట్లాడటం ఉత్తమం. లేదా హెచ్.ఐ.వి.కి సంబంధించిన పుస్తకాలను చూడటం కూడా మంచిది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ కారణంగా వచ్చే సామాన్య ఆరోగ్య సమస్యలు:

జ్వరం: జ్వరం వస్తూ తగ్గుతూ వుంటుంది. కాని ఆ జ్వరం ఒక నయం చేయగల ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో, ఉదాహరణకు క్షయ, పి.ఐ.డి లేదా మలేరియా లేదా అది హెచ్.ఐ.వి వల్లే వస్తుందో తెలుసుకోవటం కష్టం. ఒక వేళ ఆ జ్వరం ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తే, ఆ ఇన్ఫెక్షన్ నే నయం చేయాలి అన్నది ముఖ్యం.

విరేచనములు: విరేచనాలు అన్నవి రావచ్చు పోవచ్చు, కాని కొన్ని సందర్భాలలో నయం చేయటం కష్టం అవవచ్చు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులలో విరేచనాలకు గల సామాన్య కారణాలలో, హెచ్.ఐ.వి వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ ఒకటి, లేదా ఉపయోగిస్తున్న మందుల వల్ల కలిగే దుష్ఫలితాల కారణం కావచ్చు.

చర్మంపై దదుర్లు, దురద: చర్మంపై దదుర్లు, దురద ఏ కారణంగా వచ్చాయో తరచూ చెప్పటం కష్టం. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్కు సంబంధించిన చర్మ సమస్యలకు కారణాలు:

  • మందులకు ఎలర్జీ వల్ల కలిగి ప్రతి చర్య (రియాక్షన్స్) వల్ల,
  • నోటి మీద లేక చర్మం మీద గోధుమ రంగు లేక బచ్చలి పండు రంగు మచ్చలు రక్తనాళాల క్యాన్సర్ లేక లింపు గ్రంథుల క్యాన్సర్ "కాపోసిస్ సార్కోమా" అనే వ్యాధి కారణంగా రావచ్చు.
  • హెర్పిస్ జోష్టర్ వ్యాధి హెర్పిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది సామాన్యంగా నొప్పితో కూడిన దద్దుర్లు, బొబ్బల్లా వచ్చి చితికి పోతాయి. ఇవి వీపు మీద, ముఖం మీద, ఛాతి మీద ఎక్కువగా వస్తాయి.

c15వికారం మరియు వాంతులు: ఇవి ఇన్ఫెక్షన్ల కారణంగా, కొన్ని మందుల కారణంగా, జీర్ణకోశం, అన్నపు ప్రేవులకు సంబంధించిన సమస్యల కారణంగా, లేదా హెచ్.ఐ.వి కారణంగానే కావచ్చు.

దగ్గు: దగ్గు సాధారణంగా ఊపిరి తిత్తులకు సంబంధించిన న్యుమోనియా, క్షయ వంటి వ్యాధుల కారణంగా వస్తుంది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చినపుడు, రేగినపుడు ఎక్కువ తెమడ (మ్యూకస్)ను ఉత్పత్తి చేస్తాయి

క్షయ (ట్యూబర్ క్యులాసిస్): క్షయ వేర్వేరు వ్యాధులయినప్పటికీ, వాటి లక్షణాలు ఒకే విధంగా వుంటాయి. చాల మంది స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు క్షయ వ్యాధి వుంటుంది. కాని ఎయిడ్స్ వుండదు. ఎయిడ్స్ వున్న వ్యక్తి శరీరానికి వ్యాధితో పోరాడే శక్తి లేకుండా బలహీనంగా వుంటుంది కనుక క్షయ సులభంగా వస్తుంది. ఎయిడ్స్ వ్యాధితో చనిపోయే ప్రతి ముగ్గురిలో ఒకరిని వాస్తవంగా మరణానికి గురి చేసేది క్షయ వ్యాధే.

నోరు, గొంతు సమస్యలు: ఈ సంబంధమైన సమస్యలలోగొంతు మంట, పెదవులు పగుళ్ళు బొబ్బలు, నాలుకపై తెల్లని మచ్చలు(ధ్రష్), వీటిని చేర్చవచ్చు.

ఆహార లోపం మరియు బరువు తగ్గటం: ఎయిడ్స్ గల వ్యక్తి ఎపుడూ అనారోగ్యంతోనే వుండటం కారణంగా ఆహారం తీసుకోకపోవటం వల్ల బరువు తగ్గిపోవటం జరుగుతుంది. ఆకలి లేక పోవటం, విరేచనాల వల్ల తిన్న ఆహారం వంటపట్టకపోవటం, నోటి ఇన్ఫెక్షన్ల వల్ల తినటం కష్టం అవటం వల్ల ఈ పరిస్థితి కలుగుతుంది.

హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తులు బరువు తగ్గిపోవటం అన్నది సహజం. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎయిడ్స్ను స్లిమ్ డిసీజ్ (కండను తగ్గించి నాజూకుగా చేసేవ్యాధి) అంటారు కూడా.

హెచ్.ఐ.వి/ఎయిడ్స్కు చికిత్స

ఆధునిక మందుల ద్వారా కాని, సాంప్రదాయ సిద్ధంగా నయం పద్ధతుల ద్వారా కాని ఎయిడ్స్ను నయం చేయటం అసాధ్యం. s) ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తికి సహాయపడే పద్ధతులు చాలా వున్నాయి.పరిశుభ్రమైన నీరు, మంచి ఆహారం, శుభ్రమైన దుస్తులు, విశ్రాంతి తీసుకోవటానికి శుభ్రమైన చోటు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ప్రేమ పూర్వకమైన సంబంధాలు ఎయిడ్స్ గల వ్యక్తుల్ని ఆరోగ్యంగా వుంచగలవు. ఆరోగ్యంగా వున్న వ్యక్తికి మంచిగా వుండే ఆహార పదార్ధాలే, ఎయిడ్స్తో అనారోగ్యానికి గురైన వ్యక్తికి కూడా మంచిగా వుంటాయి.

ఎయిడ్స్కు చికిత్స లేకపోయినా, ఏంటీరిట్రోవియల్ మెడిసిన్స్ (ఎ.ఆర్.వి)ను మంచి ఫలితాలతో ఎయిడ్స్ గల వారికి ఉపయోగించటం జరుగుతుంది. ఈ మందులు వ్యక్తి  శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. అందువల్ల శరీరం వ్యాధులతో పోరాడి ఆరోగ్యంగా వుండగలుగుతుంది. కాని హెచ్.ఐ.వి నయం చేయబడక పోవటం వలన, వైరస్ ఎల్లపుడూ కొద్దిగా వ్యక్తి శరీరంలో వుండిపోతుంది. ఒక వ్యక్తి హెచ్.ఐ.వి. కలిగి వున్నపుడు అతడు / ఆమె వ్యాధిని వ్యాపింప చేస్తూనే వుంటారు.

అంగవైకల్యం గల స్త్రీలకు, మంచి ఆరోగ్య సంరక్షణ అన్నది కష్టం, అదే ఇంకా ఎయిడ్స్ సోకిన వారికి అయితే మరీ కష్టం. ఆరోగ్య కార్యకర్తలు వికలాంగులకు పరీక్షలు జరపటానికి చికిత్స చేయటానికి కూడా ఇష్టపడరు. వారికి వికలాంగులైన స్త్రీలు సెక్స్కు పనికిరారని, అందువలన వారికి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకే ప్రసక్తి వుండదని, వారికి ఒక వేళ ఇన్ఫెక్షన్ వచ్చినా వారు తొందరగా చనిపోతారని వారి మూఢ విశ్వాసం.

కాని యధార్గానికి ఇతర స్త్రీలలాగే వైకల్యం గల స్త్రీలకు కూడా హెచ్.ఐ.వి సోకే ప్రమాదం వుంటుంది. అలాగే చికిత్స చేయటం వల్ల వారు కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారు.

యాంటీ లిట్రోవైరల్ థెరఫీ (ఎ.ఆర్.టి)

యాంటీ రిట్రోవైరల్ థెరఫీ లేదా (ఎ.ఆర్.టి) అంటే 3 రకాల యాంటీ రిట్రో వైరల్ మందులను కనీసం రోజుకు 2 సార్లు చొప్పన తీసుకోవటం. ఒకసారి, ఎయిడ్స్ గల వ్యక్తి ఈ మందులను తీసుకోవటం మొదలు పెడితే మానకుండా ప్రతి రోజూ వేసుకోవాలి. ఎ.ఆర్.టి ఉపయోగిస్తున్న స్త్రీ బొద్దుగా వుంటూ ఆరోగ్యంగా వున్న భావన కలుగుతుంది ఆమెకు. ఒకవేళ ఆమె మందులు వేసుకోవటం మానివేసినా, కాని టైమ్లో వేసుకున్నా ఒక మోతాదు మర్చిపోయినా, ఆమె హెచ్.ఐ.వి శక్తి వంతమవుతుంది. వికలాంగ స్త్రీలలో హెచ్.ఐ.వి /ఎయిడ్స్ గల వారిని మందులతో చికిత్స చేయటం గురించి, తల్లి నుండి బిడ్డకు హెచ్.ఐ.వి వ్యాప్తి చెందటం గురించిన మరింత సమాచారం కోసం 358 నుంచి 362 పేజీలను చూడండి.

ఎ.ఆర్.టి చాలా ఖరీదైన మందులే అయినా గాని, చాల దేశాలలో ఇవి అందుబాటులోనికి వస్తున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు, ఇంకా ఇతర కార్యక్రమాల క్రింద ఎ.ఆర్.టి. మందులను ఉచితంగా కాని, తక్కువ ధరకు గాని అందించవచ్చు అవసరమైన వారికి,

అయినప్పటికీ చాల కమ్యూనిటీలలో, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గల వ్యక్తులకు మందులు దొరకటం లేదు. ధనిక దేశాలలో గల భారీ మందుల కంపెనీలు తమ పలుకుబడితో ఇతర దేశాలు తయారు చేసే తక్కువ ఖరీదు గల మందులను తయారు చేసుకోకుండా నియంత్రిస్తున్నాయి. అందువలన కోట్లాది మంది స్త్రీలు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ చికిత్సకు అవసరమైన మందులను ఉపయోగించుకొనే పరిస్థితి లేక బాధపడవలసి వస్తుంది.

కొన్ని వ్యాధులకు మందులతో నివారణ చేయటం

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గల వ్యక్తులు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక మందు (యాంటీ బయోటిక్) కాట్రిమోక్సాజోల్ ఉపయోగించటం వలన న్యుమోనియా, డయేరియా, మరియు ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించుకోవచ్చు. మీకు ఒక వేళ బరువు తగ్గటం, పెదవుల చుటూ పండు గాని, పగుళ్లు గాని వుండటం, దురద పుట్టించే దద్దుర్లు వుండటం, ముందు నుండి వెనుకకి శరీర మధ్య భాగంలో (పొట్ట నుంచి వీపు మీదుగా) వచ్చే నొప్పి, నోటిలో పుండ్లు లేక తరచు జలుబు చేయటం వంటి సమస్యలున్నట్లయితే, వెంటనే యాంటీబయోటిక్ వేసుకోవటం మొదలు పెట్టాలి.

చికిత్స: కాట్రిమోక్సాజోల్ 960 మి.గ్రా. (రెట్టింపు శక్తి) నోటి ద్వారా రోజూ ఎక్కువ నీటితో వేసుకోవాలి. సాధ్యమైతే మీకు అనారోగ్యంగా వున్నా లేకున్నా సరే రోజూ వాడండి మందును.

ముఖ్యం: హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గల వ్యక్తులలో కాట్రిమోక్సాజోల్కు ఎలర్జీ రావటం సహజం. మీకు క్రొత్తగా చర్మంపై దద్దుర్లు వచ్చినా, మరే ఇతర, మందుల వల్ల వచ్చే ఎలర్జీ వచ్చినా మందును వాడటం ఆపేయండి.

ముఖ్యం: కొందరు ఫ్రీలలో యాంటీబయోటిక్స్ వాడేటపుడు యోనికి వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ వలన ఎక్కువ సమస్యలు కలుగుతూ వుంటాయి. పెరుగు లేక పుల్లటి పాలు తీసుకోవటం, ఒక టబ్లో కొంత పుల్లని పెరుగు కలిపిన నీళ్ళలో కూర్చోవటం (వెనిగార్ అయినా సరే), సహాయపడగలదు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ గురించి మరింత సమాచారం కోసం 111 నుంచి 113 పేజీలను చూడండి. కొన్ని దేశాలలో హెచ్.ఐ.వి /ఎయిడ్స్ గల వ్యక్తులు క్షయ (ట్యూబర్ క్యూలాసిస్)కు మందులు వాడాలని సిఫార్స్ చేయటం కూడా జరిగింది. ఒక అనుభవం గల ఆరోగ్య కార్యకర్తతో ఈ విషయం గురించి మాట్లాడండి.

ఆహారం బాగా తీసుకోవటo

c17ఎయిడ్స్ శరీరానికి ఆహారాన్ని సవ్యంగా జీర్ణం చేసుకొనే శక్తిని తగ్గించటమే కాకుండా, ఆకలిని తగ్గించి వేస్తుంది. అందువలన ఎయిడ్స్ సోకిన వ్యక్తి ఆహార లోపం వలన బలహీనంగా తయారవ్వటం జరుగుతుంది. మందులు తీసుకోవటం వలన కలిగే దుష్ఫలితాలవల్ల, నోరు మరియు గొంతుకు సంబంధించిన సమస్యలు, విరేచనాలు ఇంకా క్రొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోవటంలో కష్టం వలన కూడా అలా జరుగవచ్చు.

మీకు హెచ్.ఐ.వి గనుక వున్నట్లయితే, బాగా తినటానికి క్ష ప్రయత్నించటం అన్నది చాల ముఖ్యమైన విషయంగా గుర్తించాలి మీరు. ఎందుకంటే మీరు బలహీనంగా మారకుండా వుండి, వ్యాధి నిరోధక వ్యవస్థ, మీ శరీరంను సాధ్యమైనంత ఆరోగ్యకరంగా వుంచుకోవచ్చు. ఇలా చేయటానికి వేర్వేరు రకాల లేక సమతుల్య ఆహారం తీసుకోవటానికి ప్రయత్నించండి. (86వ పేజీ చూడండి) పరిశుభ్రమైన నీరు తాగండి. అన్ని విటమిన్ల మిశ్రమం గల మాత్రలను వాడండి రోజూ, అందుబాటుగా వున్నటైతే విటమిన్ A, C మరియు E ల యొక్క సప్లిమెంటులను వాడండి. అందువలన మీ శరీరంలో హెచ్.ఐ.వి వృద్ధి చెందే వేగాన్ని తగ్గించవచ్చు. విటమిన్ ఎ సమృద్ధిగా వుంటే, క్యారెట్టు, మామిడి పండ్లు, బొప్పాయి, చిలకడ దుంపలు, పాలు, గ్రుడు, ముదురు పచ్చని ఆకు కూరలను తినాలి. (పాలకూర, చుక్కకూర, క్యాబేజీ మొదలగు)

విటమిన్ సి ఎక్కువగా వుండే ఎరుపు, పసుపు, నారింజ రంగు పండ్లు తినాలి. ముదురు ఆకుపచ్చ రంగు ఆకు కూరలు (చామ, కర్ర పెండలం, ఆవ మొదలైనవి) కూరగాయలు తినాలి. విటమిన్ ఇ సమృద్దంగా వుండే గ్రుడ్లు, బాదం నూనె, పామ్ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, బరాణీలు, ఆలివ్లు మెలకెత్తిన గోధుమలు ఎక్కువగా తీసుకోవాలి.

మీకు ఆకలి లేనట్లయితే ఉదయం పూట భోజనమే ఎక్కువగా తినటం మంచిది. లేదా రోజంతలో 6 నుంచి 8 సార్లు కొంచెం కొంచెం తినటానికి మీరు ఇష్టపడినా మంచిదే. భోజనంతో పాటుగా చల్లని ద్రవ పదార్థాలను తీసుకోవటం వలన ఆహార పదార్ధాలు సులభంగా మింగబడతాయి.

హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్తో అనుకూల భావంతో జీవించటo

ఈ క్రింది విధంగా వుండి చేయగలిగితే మీరు హెచ్.ఐ.వి/ఎయిడ్స్తో వుండి, ఆరోగ్యంగా వుంటారు.

  • పరిశుభ్రమైన నీరు త్రాగండి. ఆహారాన్ని పరిశుభ్రమైన, రక్షత నీటిని ఉపయోగించే తయారు చేసుకోవాలి.
  • పచ్చికూరగాయలు తినకండి. అవి జీర్ణం అవటానికి గట్టిగా వుంటాయి. అంతే కాకుండా క్రిములు కూడ వుండవచ్చు వాటిలో,
  • c18ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్థాలను త్రాగండి. శరీరంలో ద్రవలోపం (డిహైడ్రేషన్) ఏర్పడకుండా చూసుకోవాలి.
  • మీకు అలసటగా అనిపించినపుడు విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు కనీసం 8 గమటలు నిద్రపోవాలి.
  • కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను కలిసి కాలం గడపండి.
  • మీకు యిష్టంగా అనిపించే పనులను చేయండి. మంచిగా, తృప్తిగా వున్న చేసుకుంటూనే వునాను. భావన కూడ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
  • దేని గురించి ఎక్కువగా ఆలోచించి, ఒత్తిడి కలిగించుకోకండి. ఒత్తిడివల్ల వ్యాధి నిరోదక  వ్యవస్థకు హాని కలుగుతుంది.
  • మీ దినసరి పనులను, కార్యక్రమాలను చేసుకుంటూ చలాకీగా వుండటానికి ప్రయత్నించండి.
  • సాధ్యమైనంత ఎక్కువగా వ్యాయామం చేయండి.
  • పొగ త్రాగటం, మద్యపానం చేయటం, యింకా యితర మాదక ద్రవ్యాలను సేవించటం మానుకోవాలి.
  • ఎక్కువసార్లు నీటితో శుభ్రపరచుకొంటూ ఇన్ఫెక్షన్లను నివారించుకోవాలి.
  • రక్షిత లైంగిక సంబంధాలనే కలిగి వుండాలి. గర్భిణీ విషయమై ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. క్రొత్త వ్యాధులు సోకకుండా చూసుకోవాలి.
  • ఆరోగ్య సమస్యలను తొలి దశలోనే శ్రద్ధ వహించి చూసుకోండి. ప్రతి ఇన్ఫెక్షన్ వల్ల కూడ మీ వ్యాధి నిరోధక వ్యవస్థకు హాని కలిగి, బలహీనం కావచ్చు.
  • కాట్రి మోక్సాజోల్ను వాడి విరేచనాలను నివారించండి.
  • మీరు మలేరియా ప్రభావం గల ప్రాంతంలో నివసిస్తున్నటైతే, దోమ తెరను ఉపయోగించాలి నిద్ర పోయేటపుడు.

హెచ్.ఐ.వి ఎయిడ్స్- అవమానం

కొన్ని కమ్యూనిటీలలో సంఘం హెచ్.ఐ.వి./ఎయిడ్స్ సోకిన వ్యక్తులను సిగ్గుతో, అవమానంతో బాధపడిపోయే విధంగా కించపరచటం జరుగుతుంది. ఎవరూ కూడ వారితో చేరి మాట్లాడటం చేయరు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్టులు గల కుటుంబం మొత్తం సమాజానికే తలవంపులు అన్నంతగా వారిని నిరాదరిస్తారు.

వేలాది మంది హెచ్.ఐ.వి పాజిటివ్ వ్యక్తులు తమ వ్యాధిని దాచుకొని జీవించవలసిన పరిస్థితిని సమాజంలోని తోటి వ్యక్తులు వారికి కలుగజేస్తున్నారు. హెచ్.ఐ.వి /ఎయిడ్స్ కేవలం వ్యక్తుల మధ్య సాధారణంగా వుండే సన్నిహితత్వం వల్ల సంక్రమించదు అన్న నిజం తెలిసినప్పటికీ, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ప్రదర్శించే "వెలి' లాంటి తిరస్కారానికి భయపడుతున్నారు వారు.

అందువలన ఎయిడ్స్ గలవారు, వారి కుటుంబాలు కూడ సమాజం నుంచి సహాయం కోసం ఆశించటం మానివేస్తున్నారు. ఈ కారణం వలన ఎయిడ్స్ గల వారు అవసరమైన సహాయం కాని, వైద్యసదుపాయాలను కాని పొందలేకపోతున్నారు. వారికి ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించటానికి అవసరమైన మందులు అందుబాటుగా వున్నప్పటికీ, వారిపై ఈ నిరాదరణ ప్రభావం ఎక్కువగా వుంటుంది.

ఇంటి దగ్గర ఇన్ఫెక్షన్ను నివారించడం

చాలా మంది హెచ్.ఐ.వి చాలసులభంగా వ్యాప్తిచెంది పోతుందన్న అసత్యపు అభిప్రాయంతో వుంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. ఈ దిగువన ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను పాటించినటైతే హెచ్.ఐ.వి గాని హెపటైటిస్గాని ఒకరికి వ్యాప్తి చేయకుండా జాగ్రత్తపడవచ్చు. ఇంకా మీ మట్టుకు మీకు హెచ్.ఐ.వి /ఎయిడ్స్ గాని, హెపటైటిస్ గాని సోకకుండా కాపాడుకోవచ్చును.

  • c19రకాన్ని స్పర్శించే విధమైన దేనినీ కూడ ఇతరులతో పంచుకోకండి. ఉదాహరణకు రేజర్లు, ఇన్ఫెక్షన్ సూదులు, ఇంకా శరీరాన్ని కోయటానికి వుపయోగించే పదునైన పరికరాలు. ఇంకా టూత్ బ్రష్, మీరు అటువంటివి తప్పనిసరిగా ఇతరులతో పంచుకోవలసివస్తే, వాటిని ముందు ఒక 20 నిముషాల పాటు నీటిలో ఉడక బెట్టండి.
  • హెచ్.ఐ.వి. గలవారు అయినా, లేని వారైనా అన్ని గాయాలను పరిశుభ్రమైన బ్యాండేజ్తో గాని, బట్టతో  గాని కప్పి వుంచుకోవాలి.
  • తిరిగి కడిగి ఉతకలేని, వాడిన బ్యాండేజీ సామాగ్రిని కాల్చివేయటం గాని, పూడ్చి వేయటం గాని చేయాలి.
  • శరీరం నుంచి వచ్చే ద్రవాలను వేటిని నేరుగా చేతులతో తాకకండి. ఒక ప్లాస్టిక్ క్లాత్ ముక్కను గాని, పేపరును గాని, గ్లోవ్స్ వేసుకొని గాని, ఏమీ లేకుంటే, ఒక పెద్ద ఆకు ఏదైనా ఉపయోగించి గాని ఉపయోగించేసిన బ్యాండేజిలను, బట్టలను, రకాన్ని వాంతిని, మలమూత్రాలను తొలగించండి.
  • దుస్తులను, పక్కదుప్పట్లను మార్చిన తర్వాత సబ్బు, నీరుతో చేతులను శుభ్రంగా కడుగుకోవాలి.
  • పక్క దుస్తులు, వీటిని ఎల్లపుడూ పరిశుభ్రంగా వుంచండి.
    • మాసిపోయిన దుప్పట్లను, దుస్తులను ఉతకాలైతే వేరుగా వుంచి ఉతకండి, మిగతా బట్టలతో కలపకుండా,
    • మరకలు పడని వైపు పట్టుకొని, ‘శరీరద్రావాలలో పడిన మరకలు, నీటి ధారలో కడిగేయండి.
    • బెడ్డింగును, దుస్తులను సబ్బు నీటితో ఉతికేసి ఎండలో ఆరబెట్టాలి. వీలైనంతవరకు, అటు తర్వాత మడత పెట్టటం, లేకుంటే ఐరన్ చేసుకోవటం చేయవచ్చు మామూలుగా,
  • శుభ్రతలేని దుస్తులను, దుప్పట్లను ఉతికే సమయంలో, అత్యవసరం కాకున్నా సహాయంగా వుండటం కోసం గ్లోవ్స్ను గాని, ప్లాస్టిక్ సంచులను కాని ఉపయోగించవచ్చును.

హెచ్.ఐ.విని నిరోధించటానికి ఇతర మార్గాలు

  • లైంగిక సంబంధాల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులకు తొలిదశలోనే చికిత్స చేసుకోవాలి. ఒక్క సుఖవ్యాధి సోకి వున్నటైతే అది హెచ్.ఐ.వి గాని, ఇంకా ఇతర సుఖవ్యాధులు గాని సంక్రమించటానికి దోహదపడుతుంది.
  • సిరంజ్, సూదులు నీటిలో ఉడకబెట్టినవే అని మీకు నమ్మకం కలిగితేనే ఇంజక్షన్ చెయ్యనివ్వండి. లేకుంటే చేయించుకోవద్దు. ఆరోగ్య కార్యకర్తలు ఉపయోగించిన సూదిని, సిరంజిని బాగా ఉడకబెట్టిగాని, తిరిగి ఉపయోగించరాదు.
  • ఒక సూదినిగాని, సిరంజిని గాని ఒకరితో పంచుకొని వాడుకోకూడదు. ఒకవేళ అలా చేయవలసి వచ్చినా, ముందుగా వానిని బ్లీచ్ తో ఉడికించాలి, 20 నిముషాలు.
  • చెవిలో ఉపయోగించేవి, ఆక్యుపంక్చర్కు ఉపయోగించేవి, సాంప్రదాయ సిద్ధంగా కొన్ని శరీరభాగ తొలగింపులకు ఉపయోగించేవి అయిన పరికరాలన్నీ కూడా 20 నిముషాల పాటు ఉడికించాలి నీటిలో,
  • శరీర ద్రవాలను, ఉదాహరణకు రక్తం, వాంతి, మలమూత్రాలను జాగ్రత్తగా తొలగించాలి.
  • రక్తమంతా పరీక్షించి చూడాలి. అది హెచ్.ఐ.వి లేక హెపటైటిస్ కలిగి వుందో లేదో తెలుసుకోవటానికి ప్రాణపాయ పరిస్థితిలో తప్ప రక్తమార్పిడి వంటివి చేసుకోకూడదు. పరీక్షలు జరిపినా సరే.

సురక్షితమైన సెక్స్

c20సురక్షిత సెక్స్ అంటే, లైంగిక సంపర్కం జరిగే సమయంలో మీకు, మీ భాగస్వామికి మధ్య వ్యాధిని కలిగించే క్రిములు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా అడ్డుకొనే అవరోధాలు (కండోమ్స్ వంటివి) ఉపయోగించటం, లేదా వ్యాధులు వ్యాప్తి చెందటానికి తక్కువ అవకాశాలుండే పద్ధతులను అవలంభించడం మొదలైనవి.

యోనిలో, అంగంతో జరిపే సెక్సే సర్వసాధారణంగా స్త్రీ పురుషులంతా అవలంబించేది. కాని జంటలు ఒకరికొకరు పరస్పరం వేర్వేరు రకాల సంభాషణల వల్ల, స్పర్శ అనుభూతులు వల్ల కూడ ఆనందాన్ని ఇవ్వచ్చు, అందుకోవచ్చు కూడా. ఒక వేళ మీ భాగస్వామికి కండోమ్స్ ఉపయోగించటం ఇష్టం లేనటైతే, మీరు ఇతర రకాల సురక్షిత సెక్స్ విధానాలను ప్రయత్నించవచ్చు. ఎటొచ్చీ ఆ పద్ధతులు అతడికి మంచివిగాను, మీకు సురక్షితమైనవిగాను వుండేలా చూసుకోవాలి.

చాలా జాగ్రత్త అయిన విధానం

  • c21అసలు ఎన్నడూ సెక్స్ జోలికే పోకండి. అలా అయితే లైంగిక పరంగా సంక్రమించే వ్యాధులు సంక్రమించే అవకాశమే వుండదు. కొందరు స్త్రీలు ఇదే మంచి పద్ధతిగా భావిస్తారు,  ముఖ్యంగా వారు యవ్వనంలో వున్నప్పడు, ఏమైనప్పటికీ చాలా మంది స్త్రీలకు ఏది మంచిది అని ఎన్నుకొనే అవకాశమే వుండదు, ఆశించటం కూడా వుండదు.
  • ఒక్క భాగస్వామితో మాత్రమే సెక్స్లో పాల్గొనాలి. అదికూడ అతడు మరొకరితో సంబంధం కలిగి లేనట్లు నిర్ధారణ చేసుకున్నాకనే. ఇంకా పరీక్ష ద్వారా ఇద్దరికి ఇన్ఫెక్షన్ లేనట్లు (అంతకు ముందు భాగస్వామి వల్ల సంక్రమించినది) నిర్ధారణ చేసుకోవాలి ముందు.
  • ఒకరి జననాంగాలను ఒకరు స్పర్శించుకోవటం ద్వారా మరియు మీ జననాంగాలను మీ చేతులతో స్పర్శించుకోవటం ద్వారా సెక్స్ను పొందండి.
  • నోటి ద్వారా సెక్స్లో పాల్గొనేటపుడు విధిగా కండోమ్ను వాడాలి. అది లాటెక్స్ లేదా ప్లాస్టిక్ది అవరోధం అయినటైతే, హెర్పిస్, గనేరియాల వల్ల గొంతులో కలిగే ఇన్ఫెక్షన్ను నిరోధించటానికి సహాయపడవచ్చు. నీటిలో వుండే అతి చిన్న కోసుకున్న గాయాల ద్వారా హెచ్.ఐ.వి. వ్యాపించకుండా కూడా ఈ కండోమ్స్ కాపాడతాయి.

క్షేమం

  • పురుషులైనా, స్త్రీలైనా సరే యోని ద్వారా అయినా, మలద్వారం ద్వారా అయినా సెక్స్లో పాల్గొనేటపుడు తప్పనిసరిగా లాటెక్స్ కండోమ్లనే ఉపయోగించాలి.
  • మీ భాగస్వామి యొక్క శరీర ద్రవాలేవీ, మీ యోనిలోనికి గాని, మల ద్వారం లోనికి గాని ప్రవేశించటాన్ని నిరోధించే విధమైన సెక్స్ పద్ధతులను అవలంభించండి.
  • మీ నోటిని సెక్స్కు ఉపయోగించటం వల్ల హెచ్.ఐ.వి. సంక్రమించటానికి చాల తక్కువ అవకాశం వుంటుంది. మీ నోటిలోనికి వీర్యం వచ్చినా వెంటనే వూసేయండి.

పురుషుడితో రక్షిత సెక్స్ పొందటానికి ఇతర మార్గాలు

  • స్కలనం జరిగేలోపునే అతడి అంగం బయటకు తీసుకోవాలి. తక్కువ వీర్యం మీ శరీరంలో ప్రవేశించటం వల్ల, హెచ్.ఐ.వి వ్యాపించే అవకాశం కూడా తక్కువే.
  • పొడి సెక్స్ను ప్రోత్సహించకండి. యోనిగాని, మల ద్వారం గాని పొడిగా వుండటం వలన, చర్మం సులభంగా చినిగే అవకాశం వుంటుంది. దీని వలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంటుంది. ఉమ్మిని గాని, స్పెర్మిసైడ్ను గాని, జారుడు క్రీమ్ను గాని ఉపయోగించటం వలన యోని జారుడు స్థితికి వస్తుంది. మీరు కండోమ్ను ఉపయోగిస్తున్నటైతే, ఆయిల్ను గాని లోషన్ను గాని, పెట్రోలియమ్ జెల్ను గాని ఉపయోగించకూడదు. దాని వలన కండోమ్ చినిగే ప్రమాదం వుంటుంది.

సెక్స్ మరియు రుతుస్రావం

మీకు గాని మీ భాగస్వామికి గాని ఏ రకమైన సుఖవ్యాధులు గాని, హెచ్.ఐ.వి /ఎయిడ్స్ గాని లేవు అని నిర్ధారణ చేసుకొనే వరకు రుతుస్రావ సమయంలో యోని ద్వారా సెక్స్లో పాల్గొనకపోవడం మంచిది. మీకు హెచ్.ఐ.వి వున్నటైతే, ఆ వైరస్ మీ యోని ద్రవాలలోను, రక్తంలోను కూడా వుంటుంది. అందువలన మీ భాగస్వామికి వ్యాధి వాప్తి చెందటానికి ఎక్కువ దోహదపడుతుంది. ఒకవేళ మీ భాగస్వామికి వ్యాధి వుండి, మీకు లేకున్నా కూడ, అతడి నుంచి మీకు వ్యాధి సోకే అవకాశం కూడా చాలా ఎక్కువ వుంటుంది. మీ రుతుస్రావ సమయంలో సెక్స్వల్ల కండోమ్స్ ఉపయోగించటం వల్ల అవకాశం తక్కువవుతుంది.

మార్పుకోసం కృషి చేయటం

సుఖవ్యాధులు మరియు హెచ్.ఐ.వి/ఎయిడ్స్లు, వికలాంగులైన స్త్రీలతో సహా మొత్తం సమాజం యొక్క ఆరోగ్య సమస్యలుగా వున్నాయి. కొన్ని సందర్భాలలో వికలాంగ బృందాలు, లైంగిక ఆరోగ్యం అన్నది పెద్దగా పట్టించుకొని విచారించదగిన విషయంగా భావించవు. కాని లైంగికవిద్యవల్ల మనుషుల ప్రాణాలు కాపాడబడతాయి.

లైంగిక ఆరోగ్యం గురించి, సుఖవ్యాధులు రాకుండా ఎలా నిరోధించుకోవాలి అన్న విషయాలను గురించిన మంచి సమాచారం అందరికీ అందుబాటుగా వుండాలి. వికలాంగులైన స్త్రీలతో సహా, ఉదాహరణకు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ను ఎలా నిరోధించాలి అన్న అంశంపై రేడియోలో తరచు వినవచ్చే సమాచారం, లేదా కరపత్రాలు ముద్రించి పంచటం వల్ల అందే సమాచారం కూడా వినికిడి శక్తి, కంటి చూపు లోపించిన స్త్రీలకు కూడ అర్థం చేసుకోవటానికి అనువుగా అందించాలి.

వికలాంగులైన స్త్రీల పాత్ర

  • c22వికలాంగులైన స్త్రీల సంరక్షకులను, కుటుంబాలను కలిసి, లైంగిక ఆరోగ్యం గురించిన మంచి సమాచారం కలిగి వుండటం, ప్రతి ఒక్కరికీ ఎంత ముఖ్యమో వారికి వివరించాలి.
  • ఆరోగ్య కార్యకర్తలలో, ఇంకా ఇతర బృందాలతో కలిసి కృషి చేసి, లైంగిక ఆరోగ్య సేవలు వికలాంగులైన వ్యక్తులకు చేరేలా చేయండి.
  • మిమ్మల్ని ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటైతే (మీ వైకల్యాన్ని ఆసరాగా తీసుకొని), మీ కుటుంబ సభ్యులొకరికి గాని, మీ పొరుగు వ్యక్తికి గాని, మీరు విశ్వసించే వ్యక్తికి గాని లేక ఆరోగ్య కార్యకర్తకు గాని చెప్పండి మీ ఇబ్బంది గురించి.

కుటుంబాలు మరియు సంరక్షకుల పాత్ర

  • c23వికలాంగులైన స్త్రీలకు, లైంగిక ఆరోగ్యం మరియు హెచ్.ఐ.వి /ఎయిడ్స్ ఇంకా సుఖ వ్యాధుల గురించిన సమాచారం చేరేలా చేయండి. ఆ సమాచారం మర్యాదగాను, రహస్యంగాను అందజేయండి.
  • వికలాంగులైన పిల్లల యొక్క తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎదిగి పెద్దవాల్ళైన తరువాత వారు కూడ మిగతా వారిలాగే లైంగిక సంబంధాలు కోరుకుంటారన్న విషయం, వివరించాలి.

కమ్యూనిటీల పాత్ర

సమాజంలోని ప్రతి వ్యక్తికీ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు సుఖవ్యాధులు ఎలా వ్యాపిస్తాయో, వాటిని ఎలా నివారించాలో తెలిసి వుండాలి. ఈ సమాచారంతో వారికి, ఈ ఇన్ఫెక్షన్లు ఎవరికైనా సోకవచ్చుననీ, వాటిని నిరోధించటానికి వారు చర్యలు తీసుకోవచ్చు నని తెలుసుకుంటారు. ఈ అవగాహన వలన వారు సమాజంలో మిగతా వారందరిలాగే వికలాంగులైన స్త్రీలకు కూడ ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరమని తెలుసుకుంటారు సమాజంలోని వ్యక్తులందరూ,

ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులతో కాదు పోరాటం, వ్యాధిని వ్యాప్తి చేసే పరిస్థితులతో పోరాడటం చాలా ముఖ్యం. మెరుగైన సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల కోసం పోరాటం సాగించినటైతే, వికలాంగులైన స్త్రీలు, వికలాంగులు కాని స్త్రీలు కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకొనే శక్తిని కలిగి వుంటారు. అందువలన వారు పనివెతుక్కోవటం కోసం కుటుంబం నుంచి దూరం కావలసిన అవసరం వుండదు. అందుచేత వారు తమ శరీరాలను అమ్ముకొని జీవించనక్కర్లేదు కూడ.

  • అందరికీ, అంటే వికలాంగులైన స్త్రీలకు కూడ, లైంగిక ఆరోగ్యం గురించి, సమాచారం, లైంగిక ఆరోగ్య సేవలు అందుబాటుగా వుండేలా చేయాలి. అంతేకాక లాటెక్స్ కండోమ్లు కూడా వారికి అందుబాటుగా దొరికేలా చూడాలి. అందువల్ల హెచ్.ఐ.వి/ఎయిడ్స్, ఇంకా ఇతర సుఖవ్యాధులు సమాజంలో వ్యాప్తి చెందకుండా వుంటాయి.
  • హెచ్.ఐ.వి/ఎయిడ్స్తో వున్న వ్యక్తులకు పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు అందుబాటులో వుండేలా చూడాలి.
  • స్త్రీలను, బాలికలను వైకల్యం ఆధారంగా లైంగిక వేధింపులకు గురిచేసే వారి గురించి సమాజంలోని వారందరికి తెలియపరచాలి. వైకల్యం గల వారితో సెక్స్లో పాల్గొనటం వలన హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నయం అవ్వటం అన్నది నిజం కాదని అవగాహన పెంచాలి.

ఆరోగ్య కార్యకర్త కోసం

మీరు ఏర్పాటు చేసే ఆరోగ్య విద్యా తరగతులలో వైకల్యం గల స్త్రీలను చేర్చుకోండి. ఆరోగ్య సంబంధమైన సమాచారాన్ని బృందాలుగా ఏర్పడి కలుసుకుంటూ వున్న వికలాంగస్త్రీలతో కలిసి పంచుకోవటానికి అవకాశం ఏర్పరుచుకోండి. వైకల్యం గల స్త్రీ యొక్క విషయాలకు, మర్యాదతో వ్యవహరించి రహస్యంగా వుంచటం చేయాలి ఎల్లపుడూ కూడ. ఎపుడూ కూడ ఒక స్త్రీ యొక్క సమస్య గురించి ఇతరుల దగ్గర మాట్లాడకూడదు. ఆమె అనుమతి ఇస్తేనే  గాని, ఆమె కుటుంబ సభ్యులతో కూడ మాట్లాడరాదు.

  • సుఖవ్యాధులు, హెచ్.ఐ.వి /ఎయిడ్స్

ఏ విధంగా వ్యాప్తి చెందుతాయో, వాటిని ఎలా నిరోధించలో వివరించండి.

  • c24కండోమ్ను పురుషులకైతే ఎలా వుపయోగించాలో, స్త్రీలకెలా వుపయోగించాలో చూపించాలి అర్థమయ్యేలా.
  • సుఖవ్యాధులను నివారించటానికి కొన్ని మందులు వేసుకోవటం వల్ల అంగవైకల్యం గల స్త్రీలలో ఎదురు కావచ్చన్న సమస్యల గురించి తెలుసుకోవాలి.
  • ఎవరైనా స్త్రీని ఏదైనా ఆరోగ్య సమస్య గురించి కలిసినపుడు, లైంగిక వేధింపులు మొదలైనవేమైనా ఆడవాళ్లకోసం చూడండి.
  • వికలాంగులైన స్త్రీలకు కూడ, కౌన్సిలింగ్ మరియు హెచ్.ఐ.వి పరీక్షలు వీలుగా వుండేలా ఏర్పాటు చూడాలి.

వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులకు తెలియ జెప్పాలి, వారి పిల్లలు సుఖవ్యాధులు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ల గురించిన అవగాహన వుండటం వలన మీరు రక్షణను దృష్టిలో వుంచుకొని జీవిస్తారు భవిష్యత్తులో

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate