অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మీ శరీరాన్ని గురించి జాగ్రత్త

మీ శరీరాన్ని గురించి జాగ్రత్త

j1వైకల్యం అంటే అదొక జబ్బుతో సమంగా భావిస్తారు కొందరు. అది నిజం కాదు. కాని ఒకటి నిజం. మీ నిత్య జీవితంలో ప్రతి విషయంలోను మరింత జాగ్రత్తగా వుంటూ మీ ఆరోగ్యాన్ని గురించి ఎక్కువ శ్రద్ధ వహించ వలసి వుంటుంది.

మీ శరీరం గురించి ఒకరు చెప్తే తెలుసుకోవటం కంటే, ఒక వికలాంగ స్త్రీగా మీకే ఎక్కువ అవగాహన వుంటుంది. శరీరంలో ఎక్కడో ఒక చోట నొప్పి కలిగితేనే ఏదో అనారోగ్యం అనుకోకూడదు. ప్రతి రోజూ మీ శరీరాన్ని పరీక్షగా శ్రద్ధగా చూసుకోవటం అవసరం. ముఖ్యంగా మీ కంటికి కనిపించని భాగాల గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఒక వేళ మీకు కొత్తగా ఏమైనా అనుభవమైతే, అంటే దురద, మంట, లాంటివి గాని ఏమైనా పండ్లు ఏర్పడటంగాని, అనారోగ్యంగా, నీరసంగా అనిపించినా, వీలైనంత తొందరగా అలా జరగటానికి కారణమేమిటో కనుక్కోవటానికి ప్రయత్నించాలి. అవసరం అనిపిస్తే మీకు సహాయపడతారు అని మీరు నమ్మే వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులో, స్నేహితులో, అటువంటి వారి సహాయం తీసుకోవాలి.

ఈ అధ్యాయంలో, అనేక అనారోగ్య సమస్యలను ముందుగానే ఎలా నిరోధించుకోవచ్చో ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో మొదలైన అంశాలను గురించిన సమాచారం అందించటం జరిగింది. మీరు నిత్య జీవితంలో పూర్తిగా ఒకరి తోడ్పాటు సంరక్షణ కావలసిన వారైనటైతే, మీ కుటుంబ సభ్యులు, సంరక్షకులు మీకు ఆ సహాయం అందించేలా సహాయపడటానికి ఈ అధ్యాయంలో సమాచారం వుంది.

మంచి ఆరోగ్యం కోసం బాగా తినాలి

j2స్త్రీ లందరికీ కూడ, వారి రోజువారీ పనులు బాగా చేసుకోగలగటానికి, వ్యాధులు - జబ్బుల బారిన పడకుండా వుండటానికి, ఆరోగ్యకరమైన - క్షేమమైన ప్రసవాలు జరగటానికి మంచి ఆహారం అవసరం. పోషక ఆహార లోపం వల్లనే చాలా వరకు పేద దేశాలలో అంగవైకల్య సమస్య ఏర్పడుతుంది స్త్రీలలో ఒక కుటుంబంలోగాని, ఒక కమ్యూనిటీలోగాని ఆహారం ఇచ్చేటపుడు సభ్యులలో పక్షపాతంతో తక్కువ ఆహారం అందేది ఎక్కువగా స్త్రీలకే. అందునా వైకల్యం గల స్త్రీలకు ఆ వివక్షత ఎక్కువ అనుభవం అవుతూ వుంటుంది.

బాల్యం నుంచీ కూడ ఒక బాలుడికి పెట్టినంత ఆహారం ఒక బాలికకు పెట్టరు. ఫలితంగా ఆమె ఎముకలు సక్రమమైన పెరుగుదల లేక, శరీర భాగాల ఎదుగుదల మందగించి కాలక్రమేణా వారికి అంగవైకల్యం కలిగే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. అదే పుట్టుకతోనే వైకల్యంతో పుట్టిన బాలిక విషయంలో అయితే ఆ వైకల్యం ఇంకా ఎక్కువైపోతుంది. ఒకస్త్రీ సరిపడినంత ఆహారం తీసుకోలేనటైతే, తీవ్రమైన ఆహార సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం

j3ఆరోగ్యం కోసం, తరువాత పేజీలో సూచించిన ఆహారాలన్నీ మీరు తీసుకోనవసరం లేదు. మీరు ప్రధానంగా తినే ఆహారం, అంటే మీరు అలవాటుగా రోజూ తినే ఆహారంతోపాటు వీలైనన్ని ఎక్కువ మిగతా ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది. మీ ప్రాంతంలో లభించే వాటిలో నుంచి వీలైనన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవటం వలన చర్మం కండరాలు బలంగా వుండటానికి తోడ్పడతాయి. అలాగే కాలియమ్ ఎక్కువగా వుండే పాలు, పాలతో తయారయ్యే ఇతర ఉత్పత్తులు, ఆకు కూరలు, సోయా చిక్కుడు, చేపలు - ఇవన్నీ తీసుకోవటం వలన ఎముకలు గట్టిగా, బలంగా తయారవుతాయి.

ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి.

  • j4వరి, గోధుమ, జొన్న మొక్కజొన్న రాగులు, చోళ్ళు బంగాళదుంప, కర్ర పెండలం మొదలైనవి తక్కువ ఖర్చుతో దొరికే ప్రధాన ఆహారాలు.
  • ఇక జంతువుల నుండి లభించే పోషక ఆహారాలలో పాలు, పెరుగు, జన్ను గ్రుడు, చేపలు, మాంసం
  • ఇవి శరీర నిర్మాణానికి తోడ్పడుతాయి.
  • పళ్ళు, కాయగూరలలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీర రక్షణకు, మరమ్మత్తులకు పని చేస్తాయి.
  • చిన్న మొత్తాలలో క్రొవ్వు పదార్థాలు, చక్కెర కూడా తీసుకోవటం వల్ల శక్తి లభిస్తుంది.

రక్తహీమత (anaemia) నివారణ - చికిత్స

సరిపడినంత ప్రమాణంలో మంచి ఆహారం తీసుకోనటైతే, ఒక స్త్రీ అయినా, బాలికైనా అనారోగ్యం బారిన పడక మానరు, శరీరంలో వుండవలసిన శాతం కన్నా రక్తం తక్కువైపోయి రక్తహీనతకు కూడా గురవ్వటం జరుగుతుంది. ఆహారంలో ఇనుము లోపించటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలోను, పిల్లలకు పాలిచ్చే తల్లలలోను ఈ రక్తహీనత సాధారణంగా కనిపిస్తుంది. అందువలన విపరీతమైన అలసట కలగటమే కాకుండా వ్యాధులను, జబ్బులను నివారించే వ్యాధి నిరోధక శక్తిని క్షీణించేలా చేస్తుంది. ప్రసవ సమయంలో కలిగే అధిక రక్తస్రావం వల్ల కూడా రక్త హీనత బారినపడతారు స్త్రీలు. అదే విధంగా మలేరియా, హుక్వార్మ్ల వల్ల కూడా రక్తహీనత కలుగుతుంది. (మలేరియాను నిరోధించటం కాని, నివారించటం కానీ ఏ విధంగా చేయాలో ఆరోగ్య కార్యకర్తను అడిగి తెలుసుకోవాలి. నివారణకు మొబెండజోల్ను ఉపయోగిస్తే ఫలితం వుంటుంది.

రక్తహీనత - లక్షణాలు

  • కనురెప్పల లోపలి వైపు, గోళ్ళు పెదవుల లోపల పాలిపోయి వుండటం.
  • బలహీనంగా వుండటం, అధికంగా అలసట అనిపించటం.
  • కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించటం, అది కూడా ముఖ్యంగా కూర్చొన్న చోట నుండి లేచేటపుడు, పడుకొన్న చోట నుంచి లేచేటపుడు ఎక్కువగా అనిపించటం.
  • స్పృహ కోల్పోవడం.
  • ఊపిరి అందకుండా భారమవ్వటం.
  • గుండె వేగంగా కొట్టుకోవటం

రక్తహీనతను నివారించేటందుకు గాని, ఇనుము ఎక్కువగా లభించే ఆహారాల్ని తీసుకోవాలి రోజూ, ఆకుపచ్చని ఆకు కూరలు (ఉదాహరణకు పాలకూర, ములగ ఆకు, చామ ఆకు, కర్ర పెండలం ఆకులు), ఇంకా గ్రుడ్లు, పాలు, ఎండుద్రాక్ష మాంసం, చెరుకు నుండి తయారైన తీయని ద్రవం (మొలాసిస్)

ఇంతకన్న ఇంకా అధికంగా కూడా ఇనుమును పొందవచ్చు కూడా.

  • ఇనుము అధిక శాతంగా గల ఆహార పదార్ధాలతో పాటు టమాటోగాని, పండుగాని తీసుకోవాలి. మామిడి, బొప్పాయి, నారింజ, నిమ్మ, దబ్బ మొదలైనవి, ఈ పళ్ళలో అధికంగా గల 'సి' విటమిన్, ఆహారంలో గల అధిక శాతం ఇనుమును మీ శరీరం ఉపయోగించుకొనేలా చేస్తుంది.
  • ఇనుముతో చేసిన పాత్రలలో వండుకోవాలి ఆహారం. నిమ్మరసం గాని దబ్బరసం గాని, టమాటోలుగాని వండేటపుడు ఆహారంలో చేర్చటం వల్ల ఇనుప పాత్ర యొక్క క్రై ఇనుము ఎక్కువగా ఆహారంలో కలిసే అవకాశం కలుగుతుంది.
  • వండే పాత్రలో, శుభ్రమైన, సవ్యమైన ఇనుప ముక్క అంటే ఒక మేకు గాని, గుట్టపు నాడాను కాని వేయటం వల్ల కూడా అధికంగా ఇనుము ఆహారంలోనికి చేరటం జరుగుతుంది. కాని ఆ ఇనుప వస్తువులు స్వచ్ఛమైన ఇనుముతో తయారైనవని రూఢిగా తెలిశాకనే ఉపయోగించాలి. ఇనుముతో, వేరే లోహాలు కలిసిన మిశ్రమంతో తయారైన వస్తువులైతే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. సీసం లాంటి లోహం చాలా హానిని కలిగిస్తుంది. శిశువులు లోపాలతో జన్మించటం జరుగుతుంది.
  • స్వచ్ఛమైన ఇనుముతో తయారైన పరిశుభ్రమైన ఒక ఇనుప ముక్కను, నిమ్మరసంలో కొన్ని గంటలు వేసి వుంచాలి. తర్వాత దానితో షర్బత్ చేసుకొని త్రాగాలి.

చాలా ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కేంద్రాలలో ఇనుము గల మాత్రలు (ఫెర్రస్ సల్ఫేట్) ఇస్తారు. రక్తహీనత నుండి కాపాడటానికి.

మీ శరీరాన్ని కదలికలలో వుంచాలి

j5తమ శరీరాలను శక్తివంతంగా, కావలసినట్లు కదిలే విధంగా, ఆరోగ్యవంతంగా వుంచుకోవటానికి వ్యాయామం స్త్రీలందరికీ ఎంతో అవసరం. వ్యాయామం వలన మీ కండరాలు, గుండె, ఊపిరితిత్తులు శక్తివంతంగా వుండటమే కాకుండా, ఎముకలు బలహీనపడకుండా కాపాడుతుంది. ఇంకా అధిక రక్తపోటు నుండి, మలబద్ధకం నుండి శరీరాన్ని కాపాడుతుంది. వ్యాయామం చేయటం వల్ల, మీరు బరువు పెరిగి సూల కాయం రాకుండా వుంటుంది. మరీ బొదుగా వుండటం ఆరోగ్యకరం కాదు. అందువల్ల మీ దినచర్యగా చేసుకొనే పనులన్నీ కూడా చాలా కష్టంగా చేసుకోవలసి వస్తుంది.

కొన్ని సందర్భాలలో స్త్రీ యొక్క వైకల్యం ఆమెను తన శరీరాన్ని ఏ పని చేయటానికి ఉపయోగించలేకుండా చేస్తుంది. శరీరాన్ని గాని శరీర భాగాలను గాని కదపలేక, అవసరమైన వ్యాయామం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. రోజూ చలనం లేకుండా వుంచిన కండరాలు బలహీనమవ్వటమే కాకుండా నొప్పలు కూడా పెడతాయి. కదలకుండా వున్న కీళ్ళ బిగిసిపోయి పూర్తిగా సాగనివ్వకుండా, ముడుచుకొన్నట్లయి వంగటానికి కూడా సాధ్యం కాకుండా తయారవుతాయి. మీకు శారీరక వైకల్యం వున్నట్లయితే, మీ శరీర భాగాలన్నింటినీ పూర్తి స్థాయిలో కదలికతో వుంచాలి. అంటే వైకల్యం వుందని ముడుచుక్కూర్చున్నటైతే అది మరింత బాధాకరంగా మారే అవకాశం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో ఈ విషయంగా సహాయం కూడా అవసరమవుతుంది మీకు.

నిరాశ నిస్పృహలతో బాధపడే స్త్రీలకు వ్యాయామం చాలా సహాయపడుతుంది. కొన్ని రకాల వ్యాయామాల వల్ల నొప్పి, బాధ తక్కువగా అనిపిస్తుంది కూడ. ప్రతిరోజు వ్యాయామం చేసే చాలా మంది హాయిగా నిద్రపోగలుగుతారు. మీ శరీరం బలంగా, ఆరోగ్యవంతంగా వుండటం వల్ల మీ శక్తి అధికమవుతుంది. మనసు ఆహ్లాదకరంగా వుండటమే కాకుండా బాధ తక్కువవుతుంది కూడ.

చాలా మంది స్త్రీలు తమ దినచర్యలో చేసుకునే వివిధ రకాల పనుల ద్వారా వారి శరీరానికి కావలసినంత వ్యాయామం లభిస్తుంది. ఉదాహరణకు కుటుంబం 860 ఆహారాన్ని వండి తయారు చేయటం, ఇంటిని, పరిసరాలను శుభ్రపరచుకోవటం, పొలంలో పని చెయ్యటం, వంట చెరకు పోగు చేసుకురావటం, నీళ్లు తెచ్చుకోవటం దూరం నుంచి, ఇంకా పిల్లలను ఎత్తుకోవటం మొదలైన పనులు. వీలైనంత వరకు, వికలాంగ స్త్రీలు కూడ ఈ విధంగానే తమ శరీరానికి కావలసిన వ్యాయామాన్ని పొందవచ్చు.

మీకు కదలటం, మీ శరీర భాగాలను కదల్చటం మరీ కష్టంగా వుండే పరిస్థితి అయినటైతే ఒక పనిచెయ్యండి.

మీరు వున్న అంటే కూర్చున్న పద్ధతినో, పడుకొన్న పద్ధతినో మరో విధంగా మార్చుకుంటూ వుండండి తరచూ, రోజంతా కూర్చోకుండా కాసేపు మధ్య మధ్య పడుకొంటూ వుండండి.

వ్యాయామం అన్నది ఒక కష్టంతో కూడుకున్న పని ఎంత మాత్రం కాదు. వ్యాయామం మీ శరీరానికే కాకుండా, మానసికంగా కూడ మేలును చేస్తుంది. మీరు ఒకే విధంగా వుండి ఎక్కువ సేపు కదలకుండా వుండేవారైనా, మీ శరీరంలో భాగాలను కదిలించలేని వారైనా, కదిలిస్తే బలహీనంగా, బాధగా అనిపించేవారైనా అయివుంటే, వ్యాయామాన్ని నెమ్మదిగా మొదలు పెట్టటం ఉత్తమం. ఎక్కువ కదలిక లేకుండా, శరీరాన్ని ఒకే స్థితిలో ఎక్కువ సేపు వుంచటం వల్ల, కండరాలు, కీళ్ళ బిగుతుగా, నొప్పిగా మారటమే కాకుండా శరీరాన్ని ఒకే భంగిమలో బిగిసి పోయేలా చేస్తుంది. మీ శరీరానికి కదలికలు ఎంత ఎక్కువగా అలవాటైతే అంత ఎక్కువగా చేయగలుగుతారు వ్యాయామం.

వ్యాయామం ఒక సరదా కూడ

j6వ్యాయామం సరదాగా కూడ అనిపిస్తుంది ప్రయత్నిస్తే, కొందరు స్త్రీలు గేదెను కాని గాడిదను కాని తోలతారు. ఆ ప్రయత్నంలో ఆ జంతువు కదలికలకు అనుగుణంగా ఆమె చేతులు, కాళ్ళ కదలటంతో వ్యాయామం సమకూరుతుంది. మీకు తోడుగా మరొక వ్యక్తితో కలిసి వ్యాయామం చేయటం సరదాగాను వుంటుంది. మీకు సహాయం దొరుకుతుంది అందువల్ల,

చాలా మంది వికలాంగ స్త్రీలకు నీళ్ళలో కదులుతూ ఈత కొట్టటం, చాల మంచి వ్యాయామం. నీటిలో వున్నప్పడు శరీరం బరువు మనకు తెలియదు. వైకల్యం వల్ల మామూలు కదలికలు, నడక కష్టమైన స్త్రీలకు నీటిలో కదలటం అన్నది చాలా సులభంగా అనిపిస్తుంది. ఇంకా వారికి నీళ్లలో నొప్పి కూడా తక్కువగా అనిపించవచ్చు. కీళ్ళ నొప్పలు, వ్యాధులు వున్న వారికి ఈత ఉత్తమమైన వ్యాయామం.

మీరు చక్రాల కుర్చీ ఉపయోగిస్తున్న వారైతే, ఆ కుర్చీని మీ అంతట మీరు తోసుకొని నడిపించుకొంటూ మీ కాలనీలో అటు ఇటూ తిరగండి.

ఇది సాధ్యం కానటైతే, రాళ్లు, ఆహారంతో నింపిన క్యారేజీలు, లేక నీటితో నింపిన సీసాలు వంటి బరువైన వస్తువులను పదేపదే ఎత్తటం అలవాటు చేసుకోండి. అందువలన మీ భుజాలలోని, చేతులలోని ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి.

బరువు ఎత్తే విధానం: మీరు ఎత్తే ముందు, మీరు వీలైనంత నిటారుగా, పొడవుగా కూర్చోవాలి. లోనికి గాఢంగా వూపిరి తీసుకొని, మళ్ళీ బయటకు వదలండి. వదులుతూ, మీ భుజం ఎముకల (రెక్కగూళ్ళ)ను వెన్నువైపుకు వంచి బరువును (వస్తువును) ఎత్తాలి. మరొక్కసారి శ్వాస లోపలకు తీసుకోవాలి వస్తువును పట్టుకొన్నప్పడు. మళ్ళీ శ్వాసను బయటకు వదులుతూ చేతులలో వస్తువులను నెమ్మదిగా క్రింద పెట్టేయాలి.

కండరాలను సాగేలా కదిలించటం

j7మీ కండరాలను బాగా కదిలించి చూచేలా చేయటం వల్ల, మీ కదలటం, అటూ ఇటూ వంగటం సులభంగా వుంటుంది. వికలాంగ స్త్రీలలో చాలా మందికి, ప్రతిరోజూ ఇలా చేయటం వల్ల వారి బాధ (నొప్పి) తక్కువవుతుంది. ఇందువల్ల గాయాలవ్వటం కూడ తగ్గుతుంది.

మీరు ఏదైనా కష్టమైన పని చేసే ముందుగాని, వ్యాయామం చేసే ముందుగాని ఇలా కదలికలతో కండరాలను చాచాలి. ఇది నెమ్మదిగా ప్రారంభించటం వల్ల మీ కండరాలకు, మీకు  కూడా బాధ కలగకుండా వుంటుంది. అలాగే కష్టమైన పని చేసిన తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత ఇలా కండరాలను సాగేలా చాచటం కూడా మంచి పనే. ఇలా చేయటం వల్ల, నొప్పిని లేకుండా చేయటమే కాకుండా శరీరం ఎటుకావాలిస్తే అటు వంగటం, వయసు పెరుగుతున్న కొలదీ బలహీనత లేకుండా వుండటం జరుగుతుంది.

కండరాలను చాచే విధానం

  1. j8మీరు పడిపోకుండా, భద్రతగా వుండే విధంగా చూసుకోవాలి. ఇది చాల మృధువుగా, కండరాలకు బాధను కలిగించే విధంగా వుండకుండా చేయాలి. ఉదాహరణకు మీ ముఖంపైకి చూసూ మీ నడుము క్రింది భాగం ఒక చాప మీద ఆనేలా వెల్లకిలా పడుకోవాలి. తర్వాత మీ మోకాళ్ళను మడిచి (వంచి) రెండు కాళ్ళను బొమ్మలో చూపిన విధంగా మీ ఛాతీ వైపుకు వీలైనంత వరకు లాక్కోండి, నొప్పి కలుగనంత వరకు లాక్కోవచ్చు.
  2. మీ శరీరాన్ని ఈ విధంగా వుంచి నెమ్మదిగా 30 వరకు లెక్కపెట్టండి. లేదా 10 వరకు మూడు సార్లు లెక్కించండి. మీ శరీరాన్ని మాత్రం ముందుకు, వెనక్కు వూగేలా కదల్చకండి.
  3. మీరు ఇలా చేసేటపుడు శ్వాస తీసుకోవటం గుర్తుంచుకోండి. ఈ విధమైన కండరాలు చాచే పద్ధతి మీకు బాధకరంగా అనిపిస్తే కొంచెం కదిలి చూడండి. అప్పటికీ మీకు కష్టం అనిపించినట్లేతే మరొక విధమైన భంగిమను ఎన్నుకోవాలి. చాల తక్కువ కదలికలు గల స్త్రీలు కొన్ని కండరాలను చాచేటందుకు కొన్ని ప్రయోగాలు చేసి చూడవచ్చు. కొన్ని సందర్భాలలో, ఈ ప్రయత్నంలో మీకు మరొక వ్యక్తి సహకారం అవసరం కావచ్చు. ఇలా మరొకరు మీ కండరాలను కదిలించే సమయంలో మీకు నొప్పి లేకుండా మృదువుగా చేసేలా చూడటం అవసరం. మీకు అనిపించినపుడు ఆ కదలిక చాలని చెప్పవచ్చు.

కొందరు వ్యక్తులు, కండరాలను చాచి కదలించటానికి ముందు బస్ గానీ, వేరే బట్టగాని, తువ్వాలు గాని, అందుబాటుగా వుంటే వేడి ప్యాక్ గాని వారి కండరాలపై పెడతారు. ఇది మీకు మంచిగా అనిపిస్తుందేమో, మీరే ప్రయత్నించి చూసుకోవాలి.

j9కండరాలు బిగుతుగా గల స్త్రీలందరూ ప్రతి ఉదయం, దినచర్యకు ఉపక్రమించే ముందు కండరాలను చాపి అటు ఇటు కదుల్చుకుంటారు. అందువల్ల వారికి రోజంతా ఎక్కువ బాధ అనిపించకుండా వుంటుంది.

మరికొందరు స్త్రీలు, వారు వేరే ఏదైనా పని చేసేటపుడు తమ కండరాలకు పని చెప్పారు చాపుకోవటానికి. మీ రోజు వారీ కార్యకలాపాలన్న్టిలో కూడ, ఈ పనిని చేయడానికి ఆలోచించుకోవాలి.

మీకు బిగిసిపోయిన కండరాలు వున్నా, మెదడు దెబ్బతినటం వల్ల కలిగే పక్షవాతం వున్నా వెన్నెముకకు గాయమైనా, కీళ్ళనొప్పి వున్నా.

కీళ్ళనొప్పలుగాని, పక్షవాతం సోకి బిగిసిపోయిన కండరాలు గాని గల స్త్రీ లు పరుగు పెట్టటం, బరువులు ఎత్తటం వంటి వ్యాయామాలతో జాగ్రత్త వహించాలి. ఈ రకమైన వ్యాయామాలు, కండరాలపైన, కీళ్ళపైన అధిక వత్తిడిని కలిగిస్తాయి. అందువల్ల మేలుకన్నామీ కండరాలకు, కీళ్ళకు హానే ఎక్కువ జరుగుతుంది.

బిగుతు (ముడుచుకున్న) కండరాలకు విశ్రాంతినిచ్చే విధానం

మెదడుకు సంబంధించి వచ్చే పక్షవాతం, వివిధ కణజాలాలు విపరీతంగా గట్టిబడిపోవటం, వెన్నెముకకు గాయం వంటివి గల ఫ్రీలలో తరచు కండరాలు విపరీతమైన బిగుతుకు, రాయిలా గట్టిబడిపోవటానికి గురవుతూ వుంటాయి. ఒక కండరం బిగిసి పోవచ్చు, లేదా అతికినట్లు కదులుతూ వుండవచ్చు. ఆ కదలికను ఆ స్త్రీ అదుపు చేయటం సాధ్యం కాదు.

బిగుసుకుపోయే కండరాల విశ్రాంతికి సూచనలు

  • అటువంటి కండరాలను నేరుగా నొక్కటం, లాగటం వంటివి చేయకూడదు. అందువల్ల కండరాలు మరింత గట్టిపడిపోతాయి.
  • అటువంటి కండరాలపై మాలీస్ (రుద్దటం) చేయకూడదు. అందువల్ల కండరాలు మరింత బిగిసిపోతాయి.
  • అటువంటి కండరాలు గలవారు, ఏ విధంగా వుంటే శరీరానికి విశ్రాంతి దొరుకుతుందో, ఆ విధమైన పద్ధతిలో విశ్రాంతి తీసుకోవాలి. అటు ఇటు దొర్లటం వల్ల, తిరగటం వల్ల కూడ విశ్రాంతి లభిస్తుంది. ఒక్కో సందర్భంలో శరీరంలోని మరో భాగాన్ని కదల్చటం వల్ల ఈ కండరాలు విశ్రాంతిని పొందుతాయి. పొడిగాని, తడిగాని వేడి బట్టగాని ఉపయోగించటం వల్ల ఈ కండరాలకు విశ్రాంతి కలుగుతుంది.

చక్రాలు గల బండి లేక కుర్చీలేక క్రెచెస్ ఉపయోగించే వారికి సూచన

j10మీరు చక్రాల బండి లేక క్రెచెస్ లేక చక్రాల కుర్చి ఉపయోగించే వారైనటైతే, మీ చేతులను ఎక్కువగా కష్టపడి ఉపయోగిస్తారు కనుక, మీ భుజాలలో, చేతి మణికట్టు (రిస్ట్)లలో ప్రారంభం కావచ్చు. మీ చేతులు, భుజాలు బాధకు లోనవటం, అరిగిపోవటం కూడా జరుగుతుంది. దీనిని రాకుండా చేసుకోవాలంటే మీ చేతులను, భుజాలను తరచు చాపుతూ వుండాలి. ఉదాహరణకు: చక్రాల కుర్చీని ఉపయోగించే స్త్రీల చేతులు తరచు బలంగానే వుంటాయి. కాని, కేవలం ఆ కుర్చి నడిపించటానికి ఉపయోగించే కండరాలే కాకుండా, చేతులలోని అన్ని కండరాలు బలంగా వుండేలా చూసుకోవాలి. మీ భుజాలను, చేతులను మరీ అధికంగా ఉపయోగించటం నివారించాలంటే, ఒకే రకమైన పనిని, అధిక సమయం వెచ్చించి చేయటం మానాలి. ఉదాహరణకు చేస్తున్న పనిని కాస్త అటూ ఇటూగా మార్చి చేయాలి. మొదట ఎడమ చేతిని, తర్వాత కుడి చేతిని ఉపయోగించాలి. మీ భుజాలలోని ఇతర కండరాలకు బలం చేకూర్చాలంటే మీ చక్రాల కుర్చీని వెనక్కు నడిపించండి.

అధిక కదలిక వల్ల గాయాలు

j11కీళ్ళగాని, రెండు ఎముకలు కలిగే చోటు : ఈ జాయింట్ల దగ్గర కండరాన్ని ఎముకకు కలిపే సున్నితమైన దారాల్లాంటి 'టెండన్స్ వుంటాయి. ఒకే రకం పనిని పదే పదే ఎక్కువసార్లు, మరీ ఎక్కువసార్లు చెయ్యటం వల్ల, ఈ టెండన్స్ దెబ్బతినే ప్రమాదం వుంటుంది. ఉదాహరణకు మీ చక్రాల బండి గాని, చక్రాల కుర్చీ గాని తొయ్యటం వల్ల, క్రెచెస్ ఉపయోగించి నడవటం వల్ల చేతి మణికట్టు (రిస్ట్)లో వుండే టెండన్స్ దెబ్బతింటాయి.

 

 

మీ చేతి రిస్ట్ దగ్గర చిన్నగా తట్టటం వల్ల మీ చేతిలో గాని, ఇక్కడ గాని మీకు నొప్పి కలుగుతుంది.j12

నివారణ

విశ్రాంతి: వీలైనంత ఎక్కువ సమయం మీ రిస్ట్లను, చేతులను విశ్రాంతిగా వుండే స్థితిలో వంచండి. మీరు విశ్రాంతి లేకుండా తిరుగుతుంటే, బ్యాండేజ్ లాంటిది వేసుకొని, వీలైనంత ఎక్కువగా చేతులను కదలకుండా చూసుకోవాలి.

బ్యాండేజ్: మెత్తటి బట్టలతో చేతి చివరి భాగాన్ని మణికట్టును చుట్టటం వల్ల అది ఎక్కువగా కదలకుండా వుంచుతుంది చేతిని. ఆ బట్టను ముందు ఒక పల్చని కర్రకు చుట్టి అపుడు చేతికి దాన్ని చేర్చి చుట్టటం వల్ల జాయింట్ సరైన విధంగా కదలకుండా వుంటుంది. ఇది చుట్టేటప్పడు రక్తప్రసారం ఆగిపోయేటంత బిగించి కట్టకూడదు. ఎక్కువగా బిగించటంవల్ల ఆ భాగం తిమ్మిరితో స్పర్శ తెలియకుండా అవుతుంది కూడ. నిదురపోతున్నా తిరుగుతున్నా అన్ని వేళలా దానిని చేతికి వుంచుకోవటం వల్ల మంచి ఫలితం వుంటుంది.

నీరు: ఒక గిన్నెలో వేడి నీరు, ఒక గిన్నెలో చల్లని నీరు నింపండి. మీ చేతులను, రిస్ట్లను చన్నీటిలో పెట్టండి ఒక నిముషం పాటు. అటు తర్వాత వేడి నీళ్ళలో 4 నిముషాలు వుంచండి. ఈ రకంగా 5 మార్లు చేయండి. వేడి నీళ్ళలో ఆఖరున పెట్టాలి. ఈ విధంగా రోజూ రెండుసార్లు చేయండి. ఇంకా ఎక్కువ మార్లు చేయగలిగినా మంచిదే. ప్రతిసారి కూడా వేడి నీళ్ళ దాన్లోనే ఆఖరున పెట్టాలి.

వ్యాయామం: ప్రతిసారి నీటి నివారణ తర్వాత చేతులకు, మణికట్టులకు వ్యాయామం చేయాలి. ఇందువల్ల టెండన్స్కు ఎక్కువ నష్టం జరుగకుండా వుంటుంది. ఆ సితిలో 5 వరకు లెక్క పెట్టండి. బొమ్మలో చూపిన రీతిగా చెయ్యండి. వాటిలో ఏ స్థితిలోనైనా మీకు నొప్పి అనిపిస్తే వేరేగా మార్చండి ఆ కదలికను. మరింత సౌకర్యంగా వుండేటందుకు ఈ రకంగా 10సార్లు చెయ్యండి.

మందులు: మీ చేతులుగాని, రిస్ట్లు గాని నొప్పిగా వుండి, వాచినటైతే, ఆఫ్రిన్ గాని మరో నొప్పిని తగ్గించే మాత్ర వేసుకోవాలి.

శస్త్రచికిత్స; 6 నెలలు దాటిన తర్వాత కూడ ఆ నొప్పి అలా స్థిరంగా వున్నటైతే, మీకు బలహీనంగా అనిపించినటైతే, మీకు స్పర్శజ్ఞానం పోయినటైతే (ఆ ప్రాంతంలో), మీ చేతులలో గుచ్చుతున్నట్లు మండుతున్నట్లు అనిపిస్తున్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. చేతి మణికట్టులోకి మందును జాగ్రత్తగా ఇంజక్షన్ ద్వారా ఎక్కించవలసి రావచ్చు. లేదా మీకు శస్త్ర చికిత్స కూడ అవసరం కావచ్చు.

నివారణ;

  • మీ చేతులను, రిస్తు (మణికట్టు)లను తక్కువ వంచి, వాటిపై తక్కువ వత్తిడి వుండే విధంగా నడిపించుకోవటం కాని, కదలటం కాని చేయగలిగితే మంచిది.
  • సాధ్యమైనంత వరకు మరెవరినైనా మీ చక్రాల కుర్చీని గాని, చక్రాల బండిని గాని తోసి నడిపించమని (మధ్య మధ్యగా అయినా) అడగండి. అపుడు మీ చేతులకు, మణికట్టులకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.
  • ప్రతి గంటకు ఒకసారి మీ చేతులను, రిస్ట్లను వ్యాయామం ద్వారా, మీరు కదల్చగలిగినన్ని సార్లు కదపండి. ఇందువల్ల, మీ రిస్ట్ దగ్గర ఎముకకు, కండరాన్ని కలిపే టెండన్స్ను, కండరాలను బలపూరితం అవుతాయి. వ్యాయామం వల్ల నొప్పి కలుగుతున్నట్లయితే నెమ్మదిగా, మృదువుగా చేయండి వ్యాయామం.

ఒకవేళ మీ చేతులు గాని, రిస్తులు గాని ఎర్రబడినా, వేడిగా అనిపించినా, అక్కడ వ్యాధి (ఇన్ఫెక్షన్) సోకి వుండవచ్చు. అందువలన వెంటనే ఆరోగ్య కార్యకర్తను కలుసుకోండి.

క్రెచెస్ (చేతుల క్రింద వూతంగా పెట్టుకు నడిచే కర్ర సాధనాలు) ఉపయోగించే విధానం

మీరు క్రెచెస్ ఉపయోగించాలనుకునట్లేతే, అవి మీకు సరిగా అమిరేలా చూసుకోండి. మీరు క్రెచెస్ ఉపయోగించేటపుడు మీ శరీర భారం అంతా మీ చేతులపై పడుతుంది. మీ చేతులు దెబ్బ తినకుండా వుండేందుకు 93వ పేజీలో ఇచ్చిన సలహాలను పాటించండి.

j13సాధ్యమైనంత వరకు, మీ చంకల (చేతి క్రింద)లో వున్న నరాలు నష్టపడకుండా వుండేందుకు ఎల్లపుడూ కూడ మోచేతి క్రింద అమరే క్రెచెస్నే ఉపయోగించండి. కాని మీరు పొడవు క్రెచెస్ మాత్రమే పొందగలిగినా, అవే ఉపయోగించాలని అనుకున్నా అవి మీ చంకలలో గట్టిగా ఒత్తేలా ఉపయోగించకండి, మీ మోచేతులను కొంచెం వంచాలి, చేతి క్రింది భాగానికి, క్రెచెస్కు మధ్య మూడు వ్రేళ్ళు పట్టేటంత ఖాళీ వండాలి. పొడవాటి క్రెచెస్ ఉపయోగం వలన చేతుల క్రింద వత్తిడి పెరిగినా నరాలపై ఆ ప్రభావం పడి పక్షవాతం వచ్చే ప్రమాదం వుంటుంది. మీ చేతులకు.

కుంచించుకుపోయిన కండరాలు - నివారించే విధానం

j14చాల ఎక్కువ సమయం వంచి వుండటం, లేక మడచి వున్న చెయ్యి అయినా కాలు అయినా, అదే విధంగా వంచి ఎక్కువ సమయం వుంచటం వలన, ఒకే విధంగా బిగిసిపోయి వుండిపోవటం జరుగుతుంది. కొన్ని కండరాలు పొట్టిగా అవటం వలన చెయ్యికాని, కాలు కాని పూర్తిగా చాపటానికి రాదు. ఒకోసారి ఈ పొట్టి కండరాలు కీళ్ళను తిన్నగా పట్టేసి వుంచటం వలన అవి మంగకుండా వుంటాయి.

ఈ కండరాల నొప్పలు అన్నవి చాల సంవత్సరాల వరకు వున్నటైతే సున్నితమైన కదలికల వలన లేక బాగా చాపటం వంటి వ్యాయామం వలన ఈ కండరాలు ఇంకా దిగజారే స్థితికి వెళ్ళకుండా కాపాడవచ్చు. కీళ్ళను, కండరాలను పొడవుగా చాచటం అంటే కష్టం అనిపించవచ్చు. కాని మృదువైన వ్యాయామం, కీళ్ళలో బిరుసుతనాన్ని తగ్గిస్తుంది. కండరాలను బలంగా తయారు చేస్తుంది.

కండరాల బిగుతును నివారించి, వాటిని శక్తివంతంగా తయారు చేయటానికి ప్రతి దినం వ్యాయామం చేయటం చాల అవసరం, మీరు మీకండరాలన్నింటిని కదపటానికి అవసరమైతే వేరే వారి సహకారం తీసుకోవచ్చును.j15

సాధారణ ఆరోగ్య సమస్యలు - నివారణ

మీ శరీరం గురించి మీకే తెలుసు. ఇతరులెవరికన్నాకూడ మీరే అర్థం చేసుకోగలరు. మీ శరీర అవసరాల గురించి, బాధల గురించి, మీకు తెలిసినంత బాగ మరెవరికీ తెలియదు గనుక, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సంరక్షకులకు మీకు సహాయ పడగల విధానం గురించి వారికి బోధించగలుగుతారు. మీకేదైనా సమస్య వున్నటైతే వారి సహాయం కోరటానికి భయపడవదు, నామోషీగా భావించవచ్చు. జబ్బుపడటం అన్న దాన్ని నివారించటం ఎల్లపుడూ సాధ్యం కాకపోయినా, చాల ఆరోగ్య సమస్యలు ముందుగా (తొలిదశ)లోనే చికిత్స చేయించుకున్నటైతే అవి తీవ్ర దశకు చేరకుండా వుంటాయి. సాధ్యమైనంత వరకు క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్షలను చేయించుకోవటం అవసరం.

రోజు వాలీ సంరక్షణ

j16మీరు ప్రతి రోజూ స్నానం చేయటం వలన, చర్మాన్ని పరీక్షగా చూసుకుంటూ వుండటం వలన వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా వుండగలుగుతారు. మీరు గనుక కూర్చునే వుండి రోజులో ఎక్కవ భాగం ఎటూ కదలకుండా వున్నటైతే మీరు మరింత జాగ్రత్త వహించవలసి వుంటుంది. ఎక్కడైనా శరీరంలో వాపుగాని, ఎర్రదనంగానీ, వ్యాధులకు సంబంధించిన ఇతర లక్షణాలుగాని వున్నాయేమోనని జాగ్రత్తగా చూసుకుంటూ వండాలి.

ఒక వేళ గీట్లు, కోతలు, పండ్లు వంటివి వున్నటైతే వాటిని బాగా కడిగి కట్టుకట్టండి. అలా అయితే అవి మరింతగా బాధించకుండా వుంటాయి. మీకు కనిపించని ప్రదేశంలో చూసుకోవటం కోసం అద్దాన్ని ఉపయోగించండి. చాల మంది అంధస్త్రీలు పండ్లు, ఇతర హెచ్చరిక చిహ్నాలను తెలుసుకోవటం కోసం, స్పర్శను, వాసనను ఉపయోగించడం నేర్చుకుంటారు.

మీరు క్రమబద్దంగా తల స్నానం చేసూ, తలలో పేలు వున్నాయేమోనని చూసుకుంటూ వండాలి. అలాగే మీ తలపై నున్న చర్మంపై గాయాలు గాని వున్నాయేమోనని చూసు కుంటూ వుండాలి. ప్రతిరోజూ పరిశుభ్రమైన దుస్తులను, ముఖ్యంగా లోదుస్తులను, సాక్సులను ధరించాలి పరిశుభ్రంగా,

అంగవైకల్యం గల స్త్రీలు, తమకు ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడినపుడు, చిన్నగా కనిపించే ఆ లక్షణాల పట్ల శ్రద్ధ వహించి, చెప్పటానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ఒక ఫ్రీ తనకు గర్భాశయంలో గలవ్యాధి గురించి, నొప్పి లేని పక్షంలో తెలుసుకోవటం కష్టం. కాని ఆమె తన యోని నుంచి జరిగే స్రావంలో అసాధారణత, వాసనలో మార్పు గుర్తించవచ్చు కోసుకున్న గాయం తీవ్రంగా తయారవుతుందని చూడలేక పోవచ్చు. కానీ దాని నుండి కలిగే నొప్పిని, వాపును ఆమె అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు.

చేతులు మరియు పాదాల యొక్క సంరక్షణ

మీ చేతులు, పాదాలలో ఎక్కువగా మీకు అనుభూతి లేనట్లుంటే, మీరు వాటి విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. కోసుకున్న గాయాలు, పండ్లు వున్నాయేమో ప్రతి రోజూ చూసుకోవాలి. మీరు, అనుభూతి లేనపుడు మీ పాదాలను, చేతులను సులభంగా కాల్చుకొనే ప్రమాదం వుంటుంది. మీకు నొప్పిలాంటి అనుభూతి లేకుండానే మీకు పండ్లు ఏర్పడటం, గాయాలు అవ్వటం జరగవచ్చు. ఒకవేళ మీరు ఒక పుండును గాని, గాయాన్ని గాని కలిగి వున్నట్లు తెలుసుకున్నటైతే, దానిని పరిశుభ్రంగా వుంచి, గాయం మానే వరకు కట్టుతో మూసి వుంచండి.

వేడిగాని, చలిగాని అనుభూతి పొందలేని మీ శరీర భాగాలకు రక్షణ కల్పించండి. ఏదైనా వేడి వస్తువును తాకేటపుడు, దళసరిగా వున్న గ్లోవ్స్తోగాని, మడత పెట్టిన బట్టతో గాని దానిని పట్టుకోండి. మీరు అతి చలి ప్రదేశంలో నివసించే వారైనటైతే మీ చేతులను, పాదాలను కప్పి వుంచుకోవటం ద్వారా రక్షించుకోండి.

ఒక చిన్న అద్దం ఉపయోగించటం వలనగాని, మరెవరి సహాయం అయినా పొందిగాని మీ పాదాల అడుగు భాగాన్ని చూడండి.

  • j17ఎర్రదనం, వాపు, మొద్దెక్కిన శరీర భాగాలు మొదలైనవి గాని, ఇన్ఫెక్షన్ యొక్క ఇతర లక్షణాలు గాని వున్నాయేమో చూసుకోవాలి.
  • పగుళ్ళు, పుండ్లు లేక చిట్టిన చర్మం.
  • చీము, రక్తస్రావం లేక చెడు వాసన.
  • లోపలికి పెరిగే బొటన వేలి గోర్లు (గోరు అంచు పెరిగి చర్మంలోనికి దిగిపోవడం) మీకు నొప్పికాని, గిలిగింతకాని, తిమ్మిరిగా కాని వుంటే పాదంలో, ఒక ఆరోగ్య కార్యకర్తను కలిసి మాట్లాడండి. మీకు ఇన్ఫెక్షనే అందుకు కారణంకావచ్చు. అందుకోసం మీకు వైద్య సహాయం అవసరం కావచ్చు.

ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుకోవటానికి ప్రతి రోజు మీ పాదాలను గోరు వెచ్చని నీరు, సబ్బుతో కడుక్కోండి. ఆ నీటి వేడి మీకు సరిపడినంత ఉపయోగించండి, లేదా బాగా వేడి అనుభూతి తెలుసుకోగలిగిన వారి సహాయం తీసుకోండి. బొటనవేళ్ళ మధ్యలో తడిని శుభ్రంగా తుడుచుకోవాలి పొడిగా,

మీ పాదాల మీది చర్మం పొడిబారిపోయినా, పగులటం మొదలు పెట్టినా, రోజూ మీ పాదాలను 20 నిముషాల చొప్పన నీటిలో నానబెట్టండి. వేజ్లైన్ గాని వెజిటబుల్ ఆయిల్ గాని, లోషన్గాని రుద్దండి.

మీ పాదాలను సంరక్షించుకోవటానికి ఇతర విధానాలు

  • చెప్పలు లేకుండా తిరగకూడదు.
  • మీ పాదం వేళ్ళ గోళ్ళను గుండ్రంగా కత్తిరించకుండా అడ్డంగా కట్ చేసుకోవాలి. అందువలన అవి మీ చర్మం లోనికి దిగిపోకుండా వుంటాయి. (లోనికి పెరిగే వేలి గోరు) వాటిని ఎక్కువ పొడవు పెరుగకుండా చూసుకోండి, లేకుంటే అవి అందుకొని చీరుకోవటం జరుగుతుంది.
  • మీ కాలికి చెప్పలు సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. మీ కాలి చర్మాన్ని ఒత్తుకొని బొబ్బలుగాని, ఎర్రని చర్మం గాని ఏర్పడకుండా జాగ్రత్త వహించండి.
  • మీ జోళ్ళను లేదా బూట్లను ధరించే ముందు, వాటి లోపల, మీకు బాధ కలిగించే కీటకాలు గాని, చిన్న రాళ్ళుగాని, ముళ్ళుగాని, మట్టిగాని లేకుండా వుండేలా చూసుకోండి.
  • మీ కాళ్ళను అడ్డంగా ముడుచుకు కూర్చోకూడదు. అందువల్ల మీ పాదాలకు రక్తసరఫరా అవటంలో సమస్య ఏర్పడుతుంది.
  • మీ పాదాల యొక్క చర్మం మందపాటిగా తయారై ఏర్పడిన వాటిని కత్తిరించకండి. అందువలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంటుంది.
  • పాదాలకు సాక్స్ వేసుకోండి. అవి మీ పాదాలకు గట్టిగా ఒత్తుకోకుండా మెత్తగా వుండేలా చూసుకోవాలి. మీ సాక్స్కు పడిన రంధ్రాలను కుట్టినా, ఆ కుట్ల చాల మృదువుగా వుండేలా చూసుకోవాలి.
  • ఉష్ణోగ్రత ఎక్కువగా వున్న వాతావరణంలో, పగటిపూట సాధ్యమైనంత వరకు పాదాలను కప్పి వంచకుండా వుంచుకోండి. అందువల్ల రక్తప్రసారం బాగా జరిగి మీ వేళ్ళమధ్య ఇన్ఫెక్షన్ సోకకుండా వుంటుంది. కుపురోగం (హన్సన్స్ డిసీజ్) గల స్త్రీలు, తమ పాదాలను గాయాల నుండి, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వ్యాధి కలవారికి కాళ్ళలో, పాదాలలో స్పర్శకు సంబంధించిన అనుభూతి తక్కువగా వుండటం వలన, ఏదైనా సమస్య తక్కువగా వుండగానే వైద్యపరంగా జాగ్రత్త తీసుకోలేకపోవచ్చును. తొలిదశలో చికిత్స సులభంగా వుంటుంది కూడ.

కుష్టువ్యాధి (హేన్సెన్స్ డిసీజ్) గ్రస్తులైన స్త్రీలు, వారి పాదాలను గాయాల నుండి, మరియు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వ్యాధి కలవారికి కాళ్ళలో, పాదాలలో స్పర్శకు సంబంధించిన అనుభూతి తక్కువగా వుండటం వలన, ఏదైనా సమస్య తక్కువగా వుండగానే వైద్యపరంగా జాగ్రత్త తీసుకోలేకపోవచ్చును. తొలిదశలో చికిత్స సులభంగా వుంటుంది కూడా.

కుష్టు వ్యాధిగ్రస్తులైన స్త్రీలలో తరచూ ఏదైనా వస్తువును పట్టుకోవటంలో సమస్య ఎదురవుతూ వుంటుంది. వస్తువులను సులభంగా పట్టుకోగలగటం కోసం గాయాల నుంచి రక్షించుకోవటం కోసం, మృదువుగాను, విశాలంగాను హ్యాండిల్స్ వుండేలాంటి పనిముట్లను తయారు చేసుకోవటం చేయాలి. లేదా హ్యాండిల్స్ చుటూ దళసరి బట్టను చుట్టి ఉపయోగించాలి.

హ్యాండిల్ ను తయారు చేసే విధానం:

j19ఒక వ్యక్తి చెయ్కి మూసి వుంటే (పిడికిలి) ఎలా వుంటుందో ఆ ఆకారంలో పళ్ళండిల్లను తయారు చేయవచ్చు బంకమనును గాని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను గాని ఒక గాఢమైన జిగట పదార్థం (గల్లా)తో కలిపి తయారు చేయవచ్చు. అది ఇంకకా పూర్తిగా గట్టిపడకుండా మొత్తగా వన్లప్పడే ఆ వ్యక్తిని పట్టండిల్ను పట్టుకోమనండి. అటు తరువాత దానిని గట్టిగా అవ్వనివ్వండి. దట్టంగా అరటి ఆకుల వంటి వాటిని గాని జొన్ల పొట్ట వంటి దాల్లి కాని హ్యాండిల్ చుట్టూ దళసరిగా వుండే విధంగా వుంచండి.

నోరు మరియు పళ్ళ యొక్క సంరక్షణ

j20తమ నోటిలోని, నాలుకలోని కండరాలను కదపటంలోగాని, అదుపు చేయటంలో గాని, లేక మెదడుకు సంబంధించిన పక్షవాతం కలవారిలా కాళ్ళు చేతులు సవ్యంగా ఉపయోగించలేక పళ్ళను, చిగుళ్ళను శుభ్రపరుచుకోలేక పోవచ్చు. కాని ప్రతిరోజూ పళ్ళు శుభ్రపరుచుకోనటైతే, ఆహార పదార్థాలు పళ్ళకు, చిగుళ్ళకు పట్టి వుండి వాటిని పాడు చేస్తాయి. అవసరం అయితే మీకు సహాయపడతారనుకునే వారిని వినియోగించుకోండి.

మూర్ఛ రోగం గల స్త్రీలు

మీరు మూర్ఛ రోగాన్ని నివారించేందుకు ఫెనీటాయిన్ (డిఫెనీ ధైడాన్ టాయిన్, డైలాంటిన్) ఉపయోగిస్తున్నటైతే, మీ చిగుళ్ళు వాచి పెద్దగా ఎదుగుతాయి. మీ నోటిని గురించి చాల ముఖ్యం. మంచి సంరక్షణ చేసుకున్నటైతే చాల వరకు ఈ వాపును నివారించవచ్చు.

ప్రతిసారి ఆహారం తీసుకున్న తర్వాత పళ్ళను జాగ్రత్తగా శుభ్రపరచుకొని, పరిశుభ్రమైన నీటితో నోరు కడుక్కోవాలి. మీ పళ్ళకు మధ్యలో శుభ్రం చేసుకోవటానికి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. మీ చిగుళ్ళను వేలితో మాసేజ్ చేసుకోవటం కూడ మంచిది.

j18మీ పళ్ళను తోముకోవటానికి టూత్ పేస్ట్ అవసరం లేదు. దానికి బదులుగా కొందరు బొగ్గును, ఉప్పను ఉపయోగిస్తారు. మీకు ఒక టూత్ బ్రష్ వున్నటైతే, దానికి వున్న వెంట్రుకలు మాత్రమే శుభ్రపరుస్తాయి పళ్ళను. బ్రష్పై నీళ్ళు పోసుకుంటే చాలు. మృదువైన వెంట్రుకలు గల బ్రష్ ఉపయోగించండి. గట్టిగా, బిరుసుగా వున్న బ్రష్ వల్ల చిగుళ్ళు గాయపడతాయి, తప్ప ఉపయోగం వుండదు. పళ్ళు తోమే పుల్లలను వుపయోగించేటపుడు గట్టిగా వుండే వాటిని వాడకూడదు. వేప చెట్టు పుల్లను (మొత్తగా వుంటుంది). ఉపయోగించటం వల్ల మంచి జరుగుతుంది. చిన్నపుల్ల కొనకు శుభ్రమైన బట్టను చుట్టి జాగ్రత్తగా ఒక్కో పన్నును శుభ్రం చేస్కోవచ్చు. అలాగే పళ్ళు కుట్టేపల్ల (టూత్పిక్)ను కూడ అందుకు ఉపయోగించవచ్చు.

కళ్ళను గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రతిరోజూ మీ ముఖాన్ని నెమ్మదైన ప్రభావం గల సబ్బుతో కడుక్కోండి. అందువల్ల కండ్ల కలక వంటి అంటువ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధి వలన కళ్ళు ఎర్రబడటం, చీము (ఫసి) పట్టటం, మరియు కళ్ళు ఒకటిగాని, రెండూగానిమండటం జరుగుతుంది. నిద్రపోయిన తర్వాత రెండు కనురెప్పలు అంటుకుంటాయి. ఇది ఒకరి నుండి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఒక కంటి నుంచి రెండో కంటికి కూడా తొందరగా వ్యాపిస్తుంది.

j21కంటి ఇన్ఫెక్షన్ వున్నవారు ఉపయోగించిన టవెల్నుగాని రుమాలునుగాని వాడకూడదు. మీ కళ్ళను తాకటానికి ముందూ, తర్వాత కూడ చేతులు కడుక్కోండి. ఈగలను మీకంటికి దూరంగా వుంచండి. ఈగల వల్ల ఇన్ఫెక్షన్లు సులువుగా వ్యాప్తి చెందుతాయి.

చికిత్స

మరిగించి చల్లార్చిన నీటిలో ఒక పరిశుభ్రమైన బట్టను తడిపి, కంటిలోని చీమును తుడిచి శుభ్రపరచండి.

తర్వాత ఎరిత్రోమైసిన్ ఆయింట్ మెంట్ను కంటిలో పెట్టాలి. బొమ్మలో చూపించిన విధంగా, కన్ను క్రింది రెప్పను లాగి లోపల పెట్టాలి ఆయింట్ మెంట్. బయట పూయడం వల్ల ప్రయోజనం వుండదు.

మీకు కుష్టు వ్యాధి వున్నటైతే

కుష్టు వ్యాధి వంటి వైకల్యాలు, కంటి చూపు సమస్యలకు, కంటి ఇన్ఫెక్షన్లకు ఆస్కారం కల్పిస్తాయి.

కుష్టు వ్యాధి వున్నటైతే, కంటి చుటూ వుండే కండరాలు బలహీనమవుతాయి. లేదా ఎక్కువ అనుభూతి తెలియకుండా మొదుగా తయారవుతాయి. దీని ఫలితంగా మీ కళ్ళ వాటంతట అవి దగ్గరగా చిట్టించుకు చూడలేవు. కళ్ళు ముడుచుకోకున్నటైతే, కళ్ళు పొడిబారిపోవటం, లేదా ఇన్ఫెక్షన్ సోకటం జరుగుతుంది.

మీ కంటి రెప్పలు పడకుండా తరచూ వున్నా కళ్ళు ఎర్రబారివున్నా మీరు ఈ విధంగా చేయవచ్చు.

    j22
  • చలువ అద్దములు, ముఖ్యంగా కళ్ళపక్క భాగాన్ని కప్పి వుంచే విధంగా వున్నవి ధరించాలి.
  • కళ్ళకు నీడను ఇచ్చే వంటి చుటూ అంచు వున్న టోపీ ధరించాలి.
  • పగటి పూట మీ కళ్ళను వీలైనన్ని ఎక్కువ సార్లు మూసూ వుండండి.
  • కళ్ళు బిగుతుగా మూసుకొని, తరచు కళ్ళను పైకి తిప్పతూ వుండండి.
  • మీ కళ్ళ చుటూ వున్న చర్మాన్ని తరచూ కడుగుతూ వుండండి.

కంటిలో చీము ఏర్పడినటైతే 99వ పేజీలో సూచించిన చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని అనుసరించండి. వీలైనంతగా కంటిని మూసి వుంచాలి. అవసరమైతే కంటిని కప్పి వుంచే చిన్న బట్ట (అయ్పాచ్)ను ధరించాలి.

మీరే గాజు గుడ్డతో గాని, ఏదైనా మృదువైన బట్టతోగాని అయ్పాచ్ను తయారు చేసి, కంటిపై కప్పి వుండేలా తల వెనుకవైపున ముడివేసి కట్టుకోవాలి.

లేదా

బొమ్మలో చూపిన విధంగా గాజు గుడ్డను కంటిపై టేప్తో వేయండి.

కంటిపై ఒత్తిడి కలుగనీయకండి

మీరు కంటిని మూయలేని పరిస్థితిలో వున్నటైతే, కంటిని, పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ సోకటం మొదలైన వాటి నుంచి కాపాడుకోవటానికి పరిశుభ్రమైన బట్టగాని, గాజు గుడ్డగాని ఉపయోగించండి.

మీ కళ్ళను తడిగా వుంచటానికి, ఇన్ఫెక్షన్ నుండి కాపాడుకోవటానికీ ప్రతి రోజూ కళ్ళలో కొన్ని ఉప్పనీటి చుక్కలను వేయండి. (చిటికెడు ఉప్ప నీటి చుక్కలను వేయండి. (చిటికెడు ఉప్పను ఒక కప్ప నీటిలో కలపాలి.)

మల, మూత్ర విసర్జన

అంగ వైకల్యం గల కొందరు స్త్రీలకు మల, మూత్ర విసర్జన చేసేటపుడు అదుపు వుండదు. వారి వైకల్యం, ముఖ్యంగా వారి శరీర క్రింది భాగంలోని కండరాలపై ప్రభావం చూపుతుంది. పోలియో వల్లగాని, వెన్నెముకగాయం వలన కాని ఏర్పడే పక్షవాతం లాంటిది ఇది.

మీ జననాంగాలను మీరు శుభ్రపరుచుకోలేనటైతే, మీ కుటుంబ సభ్యులలో ఎవరినైనా గాని, సహాయ పడే వారిని కాని సహాయం కోరి, ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగాను, పొడిగాను వుంచుకోండి. మీరు బట్టను గాని, పాడ్ (డయాపర్)ను గాని ఉపయోగించే అవసరం కలిగితే, వాటిని తరచు మార్చేస్తూ వుండాలి. అందువల్ల దద్దుర్లను, ఇన్ఫెక్షన్లను, పుండ్లను నివారించవచ్చును.

మీరు బయటకు వెళ్ళేటపుడు, అవసరం అయితే మార్చుకోవటానికి, మరొక జత దుస్తులను మీతో తీసుకెళ్ళండి. ఒక వేళ మీరు అదుపుచేయలేక, మల మూత్రాలతో మీ దుస్తులు పాడైతే మార్చుకొనే అవకాశం వుంటుంది. ఈ పరిస్థితిలో మీకు ఇబ్బంది కలుగకుండా వుంటుంది కూడ.

మూత్రాశయంపై అదుపు

మీరు తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావటం గాని, అదుపు లేకుండా మూత్రం కారుతున్నా వొత్తే వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ వ్యాయామం వల్ల బలహీనంగా వున్న కండరాలు శక్తివంతంమవుతాయి. ఈ వ్యాయామం కండరాలను శక్తివంతంగా చేయటం వలన, మీరు వయసు పెరిగి వృద్దులైనపుడు మూత్రం కార్చటం అదుపులో వుంటుంది.

బిగబట్టే వ్యాయామం

మొదట మీరు మూత్రం విసర్జన చేసేటపుడు, బిగబట్టే వ్యాయామం చేయాలి. మూత్రం బయటకు వచ్చేటపుడు, దానిని మీ యోనిలో కండరాలను బిగువుగా బిగించటం ద్వారా ఆపండి 10 అంకెల వరకు లెక్కపెట్టి అపుడు మూత్రాన్ని విసర్జించాలి. మీరు మూత్రాన్ని విసర్జించినపుడల్లా ఈ వ్యాయామాన్ని అనేకసార్లు చేయండి.

ఒకసారి ఈ వ్యాయామాన్ని ఎలా చెయ్యాలో తెలుసుకున్నాక, పగటిపూట ఇతర సమయాలలో కూడ అభ్యాసం చేయవచ్చు, ఎవరికీ తెలియకుండా, ప్రతి రోజూ కనీసం 4 సార్లు చేయండి. ఒక్కోసారి మీ కండరాలను 5 నుంచి 10 సార్లు బిగించండి.

కొందరు స్త్రీలకు మూత్రం అదుపు లేకుండా కారటాన్ని నివారించేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుంది. మీకు మూత్రం చాల లీక్ అవుతున్నటైతే ఈ వ్యాయామం పనికి రాదు. స్త్రీల ఆరోగ్య సంబంధమైన శిక్షణను పొందిన ఆరోగ్య కార్యకర్తను కలిసి సలహా తీసుకోండి. ఈ ఒత్తిడి వ్యాయామం అన్నది అందరి స్త్రీలకు కూడా చాల మంచిది. ఇది ప్రతి రోజూ చేయటం వల్ల కండరాలు కెఇ శక్తివంతం అవటమే కాకుండా, ముందు జివితంలో  సమస్యలను నివారిస్తుంది.

మూత్ర కోశాన్ని ఖాళీ చేయటం

మీ అంగవైకల్యం మిమ్మల్ని మూత్ర విసర్జన చేయకుండా ఇబ్బంది పెడుతున్నటైతే, మీకు అందుకోసం ఒకరి సహాయం లేకుండా, మరో మార్గం అవసరం. కొందరు స్త్రీలు ఈ క్రింది విధమైన రీతులలో మూత్రాశయాన్ని ఖాళీ చేసుకుంటూ వుంటారు.

  • బొడ్డు క్రింద, పెల్విక్ ఎముకకు పైన పొత్తికడుపుపై చేతో తట్టటం ద్వారా,
  • మూత్రాశయంపైన పొత్తికడుపుపై చేతులతో క్రింది వైపుకు ఒత్తటం వలన.
  • పిడికిలితో పొత్తి కడుపును మృదువుగా నొక్కుతూ మిగతా శరీరాన్ని ముందుకు వంచటం ద్వారా,
  • మూత్రాన్ని బయటకు పంపించటం కోసం కడుపు (పొట్ట)లో కండరాలను బిగించి ఒత్తిడిని క్రిందికి పంపించటం.

మృదువైన ఒత్తిడితో మూత్ర విసర్జన జరుగుతుంది. అయితేనే ఈ పద్ధతులను అనుసరించాలి. మీ కండరాలు తిరిగి యధాస్థితికి చేరి విశ్రాంతి స్థితికి మారకున్నటైతే, మూత్రం తిరిగి మూత్ర పిండాలలోనికి వెళ్ళిపోయి, వాటికి హానిని కలిగించవచ్చు.

ఒక వేళ ఈ పద్ధతులేవీ పనికి రానటైతే, రబ్బర్తోగాని ప్లాస్టిక్తో గాని తయారు చేసిన ట్యూబ్ (కేథెటర్)ను ఉపయోగించాలి. అది తప్ప వేరే మార్గం లేదూ అన్నప్పడే కేథెటర్ను ఉపయోగించాలి, మూత్ర విసర్జనకు. కేథెటర్ను ఎంత జాగ్రత్తగా ఉపయోగించినప్పటికీ, మూత్రాశయానికే, మూత్ర పిండాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంటుంది.

ప్రమాదమైన కేథెటర్ను ఉపయోగించుట

కేథెటర్ అంటే ఒక మృదువైన రబ్బరు గొట్టం. దీనిని మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు పంపించటానికి ఉపయోగిస్తారు. కేథెటర్ అవసరం అయిన స్త్రీలు, మరిగే నీళ్ళలో ఉడికించిన కేథెటర్ను ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్రాన్ని ఖాళీ చేయటానికి ఉపయోగించాలి. ఒక స్త్రీ తను ఎన్ని నీళ్ళు త్రాగుతుందో, అంతగా కేథెటర్ను ఉపయోగించవలసి వస్తుంది.

కొందరు స్త్రీలు కేథెటర్ను ఎక్కువగా ఉపయోగించటం ఇష్టం లేక నీరు తక్కువగా త్రాగుతూ వుంటారు. కాని అందువలన ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. ఎక్కువ నీరు తాగనటైతే, మూత్రాశయంలోగాని, మూత్రపిండాలలో గాని ఇన్ఫెక్షన్ రావటం, మల విసర్జన సాఫీగా జరుగకపోవటం వంటి సమస్యలు తల్లెత్తుతాయి.

మీ మూత్రాశయాన్ని మరీ నిండుగా వుంచుకోవటం మంచిది కాదు. అందువలన డిస్రెప్లెక్లియా వచ్చే ప్రమాదం వుంది  ఇంకా మూత్రం వెనుకకు మూత్ర పిండాలలోనికి వెళ్ళి వాటికి హాని కలుగవచ్చు.

మరుగు దొడ్లోగాని, కమోడుపై కూర్చున్నప్పడుకాని కేథెటర్ను ఉపయోగించే విధానాన్ని నేర్చుకుంటారు. చక్రాల కుర్చీని వినియోగించే స్త్రీలు కూడ కేథెటర్ను ఉపయోగించి, మూత్రాన్ని టాయిలెట్లేక బాటిల్లోకి వదిలి వేయవచ్చు. మీకు ఏది సరిపోతుందో అనుభవంతో తెలుసుకోవాలి. మీరు కూర్చొని వుండగా కేథెటర్ని ఎలా ఉపయోగించాలో నెమ్మదిగా నేర్చుకోవాలి. కాని చాలమంది స్త్రీలు కేథెటర్ ఉపయోగించటం వలన తమ దినచర్యలోని కార్యకలాపాలను సులువుగా చేసుకోగలుగుతున్నట్లు చెప్తారు. చాల మంది స్త్రీలకు 16 నంబరు కేథెటర్ పరిమాణం మంచిది ఉపయోగించటానికి, చిన్న ఆకారం గల స్త్రీకి 14వ నంబరు కాథెటర్ మంచిది.

ఒక కాథెటర్ ఉపయోగించే వ్యక్తికి, కాథెటర్ ఉపయోగించని వ్యక్తికన్నా మూత్ర కోశవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ వుంటుంది. సాధారణంగా కాథెటర్ అశుభ్రంగా వుండటం వల్ల క్రిములు మూత్రాశయంలోకి ప్రవేశిస్తాయి. మీ కాథెటర్ని పరిశుభ్రంగా వుంచటం ద్వారా మూత్రకోశ వ్యాధులను నివారించుకోవచ్చు. అదే మంచి పద్ధతి. కాథెటర్ని తాకటానికి ముందు చేతులను సబ్బు, శుభ్రమైన నీరుతో కడుగుకొంటూ వుండండి. కాథెటర్ని కూడ ఉపయోగించుకోవటానికి ముందు తర్వాత కూడా బాగా శుభ్రపరచండి. దానిని ఉపయోగించనపుడు ఒక శుభ్రమైన చోట వుంచండి.

కాథెబర్ ను లోపల పెట్టే పద్ధతి

  1. కాథెటర్ను ఇంకా మీరు ఉపయోగించే సిరంజినిగాని, మరే పరికరాన్నైనాగాని 20 నిముషాలపాటు మరిగే నీటిలో ఉడకబెట్టండి. లేదా మరిగించి చల్లార్చిన నీటితో శుభ్రంగా కడిగి పెట్టండి.
  2. జననాంగాల చుటూ ప్రదేశాన్ని సున్నితమైన సబ్బు, నీరుతో కడగండి. మూత్రం బయటకు వచ్చే ప్రదేశాన్ని దాని చుటూ వున్న మడతలను శుభ్రపరిచే జాగ్రత్త తీసుకోండి. స్వల్పంగా సబ్బు గుణం గల సోప్లేనటైతే పరిశుభ్రమైన నీటినే ఉపయోగించండి. గాఢమైన సబ్బు హానిని కలిగిస్తుంది.
  3. మీ చేతులను కడుక్కోండి. తర్వాత పరిశుభ్రమైన వస్తువులను మాత్రమే తాకండి.
  4. మీ జననేం ద్రియాలు దేనినీ తాకకుండా కూర్చుండ గలిగితే కూర్చోండి, కుర్చీ ముందు భాగంలా, మీరు నేలపై గాని, మరో గట్టి ఆసనంపై గాని కూర్చుంటే, పరిశుభ్రమైన జననేంద్రియాలకు క్రింద, చుటూ పెట్టండి.
  5. అంతలో మీరు దేనినైనా తాకవలసి వస్తే, మళ్ళీ చేతులను అలాగే స్వల్ప స్వభావం గల సబ్బుతో, నీట్తో కడుగుకోండి.
  6. కాథెటర్ పైన చుటూ నీటి ఆధారంగా తయారు చేయబడిన (ego))é5, పెట్రోలియమ్ జెల్లీ పనికిరావు) జారే పదార్థం (లూబ్రికెంట్)ను పూయండి. అందువలన జననేంద్రియాల యొక్క సున్నితమైన చర్మం మూత్ర నాళం యొక్క లోపలి చర్మం రక్షింపబడుతాయి గాయపడకుండా, మీకు లూబ్రికెంట్ అందుబాటులో లేనటైతే మీరు శుభ్రపరచిన నీటి యొక్క తడి ఆరిపోకుండా చూసుకొని, మరింత సున్నితంగా ట్యూబ్ను లోపలకు పెట్టాలి.
  7. కాథెటర్ను మీకు మీరే పెట్టుకోవాలి. అయితే మూత్ర ద్వారం ఎక్కడున్నదో చూడటానికి అద్దాన్ని సహాయంగా తీసుకోండి. మీ చూపుడువేలు, మూడో వేలు ఉపయోగించి యోనిని తెరిచిపట్టుకోండి. మూత్ర ద్వారం, యోని శీర్యానికి, దిగువన ఇంచుమించు యోని ద్వారం దగ్గరగానే వుంటుంది. ఇలా కొన్నిసార్లు చేసి చూసిన తర్వాత అద్దం సాయం అవసరం లేకుండానే ద్వారం ఎక్కడుందో తెలుసుకోగలుగుతారు.
  8. తర్వాత మీ మధ్య వేలితో యోని శీర్యం క్రింద తాకి చూసినటైతే ఒక పల్లం (సొట్ట) ప్రాంతం తగులుతుంది. దానిక్రిందే మూత్ర ద్వారం వుంటుంది. మీ మధ్యవేలిని సరిగా దానిపైన వుంచి మిగతా చేతితో పరిశుభ్రమైన కాథెటర్ను కొననుంచి 4 లేక 5 అంగుళాల దూరంలో పట్టుకోండి. మీ మధ్య వేలిక్రింద ఆ కొనను తాకించి, సున్నితంగా కాథెటర్ను లోపలకు, (మూత్రం బయటకు వచ్చే వరకు) పెట్టండి. కాథెటర్ కొనను మీ వేళ్ళతోగాని, చేతితో గాని తాకకుండా జాగ్రత్తపడండి. ఒక వేళ కాథెటర్ మూత్ర ద్వారానికి బదులుగా యోనిలోనికి పోతున్నటైతే, మీకు తెలుస్తుంది, ఎందుకంటే అది సులువుగా వెళ్ళిపోతుంది గనుక, కాని మూత్రం బయటకు రాదు. మీరు కాథెటర్ను యోని నుండి తీసి వేసినపుడు దాని చుటూ జిగటగా వుండే ప్రావం (మ్యూకస్) కనిపిస్తుంది. శుభ్రమైన నీటిలో దానిని కడిగి మళ్ళీ ప్రయత్నించండి. మీ యోనిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వుండి అది గనుక ఆరోగ్య కార్యకర్తను కలవండి.

ముఖ్యం : ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తపడాలంటే శుభ్రంగా ఉడికించిన కాథెటర్నే ఉపయోగించండి. ప్రతిసారి సైరైల్ చేసినది ఉపయోగించటం వీలుకాని పక్షంలో, అది శుభ్రంగా వున్నదని నిర్ధారించుకొన్నాకనే వాడండి.

మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్ (వ్యాధులు) నివారణ - చికిత్స

మూత్రకోశ వ్యాధి (ఇన్ఫెక్షన్)

చాల మంది స్త్రీ లు తమకు మూత్ర కోశ సంబంధమైన వ్యాధి (ఇన్ఫెక్షన్) వున్నట్లు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే వారు మూత్ర విసర్జన చేసే సమయంలో వారికి నొప్పి గాని, మంటగాని కలుగుతుంది. లేదా మూత్ర విసర్జన తర్వాత పొత్తి కడుపులో నొప్పి కలుగుతుంది.

మీకు కడుపులో ఎటువంటి అనుభూతి తెలియనటైతే ఈ క్రింద చెప్పిన ఇతర లక్షణాల కోసం చూడండి.

  • తరచుగా మూత్ర విసర్జన అవసరం కావటం.
  • మబ్బుగా వున్న మూత్రం.
  • చెడు వాసనగల మూత్రం.
  • రక్తం లేక చీము గల మూత్రం.
  • చెమటలు పోయటం లేదా వేడిగా అనిపించటం.

మూత్ర కోశ వ్యాధి నివారణ

లక్షణాలను తెలుసుకున్న వెంటనే చికిత్స ప్రారంభించాలి.

  • చాలా నీరు తాగండి. ప్రతి 30 నిమిఫాలకు ఒక కప్పు శుభ్రమైన నీరు తాగాలి. అందువల్ల వ్యాధి క్రిములు దానితో బయటకు కడిగి అడిగినటైతే, ఏ చేట్స్ వైద్యానికి వేయబడతాయి శరీరం నుంచి. దీనితో ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం పనికి వస్తాయో చెప్తారు. దాల్చక ముందే జాగ్రత్తపడినట్లు అవుతుంది.
  • సెక్స్లో పాల్గొనటం, వ్యాధి లక్షణాలు కనిపించకుండా వుండే వరకు మానుకోవాలి.

మీకు 1 లేక 2 రోజులలో బాగుండకపోయినటైతే, నీటిని, ఆకు వైద్యాలను ఆపివేసి మందులను వాడటం మొదలు పెట్టండి. మరొక 2 రోజులలో మీ ఆరోగ్యం మెరుగుపడనటైతే, ఆరోగ్యకార్యకర్తను చూడండి. మీకు లైంగికంగా వ్యాప్తి చెందేవ్యాధి వుండి వుండవచ్చు.

మూత్రకోశ వ్యాధికి మందులు

మందు

ఎంత తీసుకోవాలి

ఎపుడు తీసుకోవాలి

కాట్రిమాక్సాజోల్

160 మి.గ్రా, టై మెథాప్రిమ్

800 మి.గ్రా. సల్ఫా మెథాక్సాజోల్

 

2 మాత్రలు 480 మి.గ్రా.

రోజుకు 2 చొప్పన 8 రోజులలో నోటితో ప్రిమింగాలి.

లేదా నైటో ఫ్యూరాన్సన్

100 మి.గ్రా.

రోజుకు 2 చొప్పన

మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్

కొన్ని సందర్భాలలో మూత్రకోశ వ్యాధి మూత్రనాళాల ద్వారా మూత్ర పిండాలలోనికి ప్రవేశిస్తుంది. మూత్రపిండాలకు సోకే ఇన్ఫెక్షన్లు, మూత్రాశయానికి సోకే వానికన్నా ప్రమాదకరమైనవి.

మూత్రపిండ వ్యాధుల లక్షణాలు

  • మధ్యన గాని దిగువన గాని వెన్నునొప్పి తీవ్రంగా తరచూ వస్తూ, ముందు నుంచి ప్రక్కలను చుట్టి వెనుక వస్తుంది.
  • వికారం మరియు వాంతులు అవటం.
  • చాల నీరసం, అస్వస్థతగా అనిపించటం.
  • జ్వరం మరియు చలి.
  • మూత్రకోశ వ్యాధి లక్షణాలను పోలి వుండటం

మీకు మూత్రకోశ వ్యాధి, మూత్ర పిండవ్యాధి రెండింటి యొక్క లక్షణాలు కనిపించినటైతే, మీకు బహుశా మూత్ర పిండ వ్యాధి (ఇన్ఫెక్షన్) వుండి వుండవచ్చు. ఒక స్త్రీకి మూత్ర పిండ సంబంధమైన ఇన్ఫెక్షన్ కలిగి వున్నటైతే, ఆమె తీవ్రమైన నొప్పికి, అస్వస్థకు గురవ్వటం జరుగుతుంది. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అవసరం. ఎటువంటి గృహ వైద్యాలు పనికిరావు. ఈ క్రింది మందులను వెంటనే ఉపయోగించటం మొదలు పెట్టండి. అయినప్పటికీ మీ ఆరోగ్యంలో మెరుగదల లేకుంటే, ఆరోగ్యకార్యకర్తను చూడండి.

మూత్రపిండ ఇన్ఫెక్షన్ కు మందులు

మందు

మోతాదు

ఎపుడు తీస్కోవాలి

సిప్రా ప్లాక్సాసిన్(మీ బిడ్డకు పాలు ఇస్తుంటే ఉపయోగించకండి.)

500 మి.గ్రా.

రోజుకు 2 సార్లు చొప్పన 10 రోజులు నోటితో బ్రిమింగాలి.

లేదా సెఫిక్సిమ్

500 మి.గ్రా.

రోజుకు 2 సార్లు చొప్పన 10 రోజులు నోటితో బ్రిమింగాలి.

లేదా కాట్రి మోక్సాజోల్160 మి.గ్రా, టైమెథాప్రిమ్ మరియు 800 మి.గ్రా. సల్ఫామెథాక్సజోల్

480 ని.గ్రా. 2 మాత్రలు

రోజుకు 2 సార్లు చొప్పన 10 రోజులు నోటితో బ్రిమింగాలి.

మీరు వాంతుల కారణంగా మందులను బ్రిమింగలేకుంటే ఆరోగ్య కార్యకర్తను చూడండి. మీకు ఇంజక్షన్ ద్వారా మందు అవసరం.

మూత్ర కోశ వ్యాధుల నివారణకు సూచనలు

మీ జననేంద్రియాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి. జననేంద్రియాల నుండి, ముఖ్యంగా అపానము (ఆనస్) నుంచి క్రిములు మూత్ర ద్వారంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను కలుగజేస్తాయి. ప్రతిరోజూ జననాంగాలను ‘శుభ్రంగా కడుక్కోవటానికి ప్రయత్నించాలి. మల విసర్జన తర్వాత ఎపుడూ కూడ ముందు నుంచి వెనుకకు కడుక్కోవాలి. ముందుకు తుడుచుకోవటం వలన క్రిములు అపానము నుంచి మూత్ర ద్వారానికి వ్యాపిస్తాయి. ఇంకా మీ జననేంద్రియాలను సెక్స్లో పాల్గొనటానికి ముందు, తర్వాత కూడ కడుక్కోండి. మీ నెలసరి స్రావానికి ఉపయోగించే బట్టలు, పాడ్లు చాల పరిశుభ్రంగా, పొడిగా వుండాలి.

  • మీ కాథెటర్ వంగటం గాని, మెలిపడటం గాని జరుగకుండా చూసుకోవాలి. అలా అయితే మూత్రం బయటకు సులువుగా వస్తుంది.
  • సెక్స్లో పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయటం వల్ల మూత్ర నాళం కడుక్కుపోతుంది.
  • రోజూ ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకొని, మూత్రకోశాన్ని ఖాళీ చేసుకోవాలి మూత్రవిసర్జన చేసి.
  • రోజంతా పడుకొని వుండకండి. సాధ్యమైనంత వరకు ఉత్సాహంగా వుండండి.

చాల మంది స్త్రీలు వారికి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తేనే గాని మందులు వాడటం మొదలు పెట్టరు. కాని కొంత మంది ఫ్రీలు తమ రుతుస్రావ సమయంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురవుతుంటారు. అందువల్ల వారు మందులు ఆ సమయంలో వాడుతూ వుంటారు.

మల విసర్జన – అదుపు

రోజూకూడ ఒకే సమయానికి మల విసర్జన చేయటం అలవాటు చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు అనుకోకుండా వేరే సమయంలో మల విసర్జన చేసినప్పటికీ, మామూలుగా రోజూ వెళ్ళే సమయానికి అది యధావిధిగా జరుగుతుంది. దీనిని ప్రేగు కార్యక్రమం అంటారు.

బిసకోడిల్ లేదా గ్లిసరేన్ వంటి (ఆసనం ద్వారా ఉపయోగించాలి) సపోజిటరేస్ను ఉపయోగించవచ్చు. బులెట్ ఆకారంలో వుండే ఈ మాత్రలను ఆసనంలోనికి పెట్టాలి. ఇది ప్రేగేలను ఉత్తేజపరుస్తుంది. దానితో పేగులలో వున్న మలాన్ని బయటకు తోయటం జరుగుతుంది.

ఒక వేళ మీ శరీరం క్రింది భాగంలో వున్న కండరాలను ఉపయోగించి కూడా మీరు మల విసర్జన చేయలేకున్నట్లయితే, మీ వేలితో మలాన్ని తొలగించవచ్చు. మీకు మల విసర్జనలో సమస్య వున్నా మలం గట్టిగా బిగిసి వున్నా ఈ పద్ధతిని అనుసరించవచ్చు.

సాధారణంగా మల విసర్జన కూర్చున్న పద్ధతిగా జరుగుతుంది సులువుగా, అందువల్ల మీరు టాయిలెట్పై గాని కమోడుపైగాని కూర్చుని వుండగా ప్రయత్నించండి. మీరు కూర్చుండలేనటైతే, మీ ఎడమ వైపుకు పండుకొనగలిగితే ప్రయత్నించవచ్చు ఈ పద్ధతిని. అవసరం అయినటైతే వేరొకరి సహాయం తీసుకోండి. మీ మూత్రద్వారం లోనికి గాని, యోని ద్వారం లోనికి గాని మలం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. మలంలో వుండే హానికరమైన క్రిములు ఇన్ఫెక్షన్ను కలుగజేస్తాయి.

మలమును తొలగించే విధానం

  1. శుభ్రమైన ప్లాస్టిక్ లేదా రబ్బర్ గ్లోవ్తోగాని, లేదా ప్లాస్టిక్ సంచితోగాని చేతిని కవర్ చేసుకోవాలి. మీ చూపుడు వేలిపైగాని, మీకు బాగా ఏ వేలు పనిచేస్తుందో ఆ వేలుపై కూరగాయల నూనెను గాని, మినరల్ నూనెను గాని వేయాలి.
  2. నూనె పూసిన మీ వేలును ఆసనంలోనికి సుమారు 2 సెంటీమీటర్లు (ఒక అంగుళం) లోపలకు పోనివ్వండి.
  3. మీ వేలిని మృదువుగా వృత్తాకారంగా, మలం బయటకు తోసుకు వచ్చే వరకు ఒక్క నిముషం కదపండి.
  4. ఒక వేళ మలం దానంతగా అది రానటైతే బయటకు, మీ వేలితో మీరెంత ఎక్కువ తొలగించగలరో అంత తొలగించండి. సున్నితమైన చర్మం చిట్లకుండా జాగ్రత్త తీసుకోండి.
  5. ఆసనాన్ని చుటూ ప్రదేశాన్ని బాగా శుభ్రపరచి, చేతులు కూడా కడుక్కోండి.

కొందరు స్త్రీలైతే తాము చక్రాలు కర్చీలో కూర్చుని వుండగానే మలాన్ని తొలగించగలుగుతారు. అందుకోసం నేలలో ఒక రంధ్రంలా చేయటంగాని, లేదా దానిని పట్టి వుంచేందుకు ఒక బౌల్ను ఏర్పాటు చేసుకోవాలి.

అపుడు కూర్చున్న చోట కొంచెం ముందుకు జరిగి, పక్కకు తిరుగగలిగినంతగా తిరగాలి. ఒక కాలిని పైకి లేపటం కోసం మెలివేసిన బద్దిని గాని, బెల్లును గాని ఉపయోగించాలి. అపుడు మీ చేతితో మీ ఆసనాన్ని అందుకోగలుగుతారు. బెల్లు యొక్క రెండో కొనను కుర్చీకి చుట్టాలి. అందువల్ల మీ కాలును సరైన స్థానంలో వుంచుతుంది.

మలబద్ధకం (మల విసర్జన లోసమస్య)

మెదడుకు సంబంధించిన పక్షవాతం, వెన్నెముకకు గాయం గల స్త్రీలు తరచు మలబద్ధకం లేక గట్టిగా బిగిసిన మలం, విసర్జన చాల రోజులు పట్టటం మొదలైన సమస్యలు తరచు ఎదుర్కొంటూ వుంటారు. ఇందువల్ల మలం గట్టి వుండగా కట్టటం లేదా డిస్రిఫ్లెక్సియా) వచ్చే తీవ్రమైన సమస్యలు కలుగవచ్చు.

మలబద్ధకం – నివారణ:

  • ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల ద్రవ పదార్థాలను తీసుకోవాలి. నీళ్ళ వుంటే అవిత్రాగటమే మంచిది.
  • ఎక్కువగా కూరగాయలు, పళ్ళు పీచు పదార్ధాలు తీసుకోవటానికి ప్రయత్నించండి. ఉదాహరణకు గింజ ధాన్యాలు, చిక్కుళ్ళు లేక దుంపకూరలు (పీచు గలవి)
  • శరీరాన్ని ఎక్కువగా కదుపుతూ, వ్యాయామం వీలైనంత ఎక్కువగా చేసూ వండాలి.
  • క్రమబద్ధంగా మల విసర్జన అలవరుచుకోవాలి.
  • ప్రతిరోజూ మీ ఆహారంలో కూరగాయల నూనెను వుండేలా చూసుకోండి.
  • మీ కడుపు (పొట్ట)ను మాసేజ్ చేయండి.
  • మగ్గిన బొప్పాయి, మామిడి, పచ్చ అరటిపండు మొదలైనవి తీసుకోవాలి.

మీకు 4 రోజులు లేక అంతకు మించి విరోచనం అవ్వకుంటే స్వల్ప ప్రభావం కల విరోచనాకారి మాత్రలను వేసుకోవచ్చు లేదా మిల్క్ ఆఫ్ మెగ్నేషియా కూడ తీసుకోవచ్చు. మీ కడుపులో నొప్పిగా వున్నటైతే ఇవి తీసుకోకూడదు. విరోచనాల కోసం మాత్రలు తరచూ వేసుకోకూడదు. మలబద్ధక నివారణకు A3855 కూడినవి ఆసనంలో పెట్టే టాబ్లెట్స్ డల్కోలాక్స్ ఒక (బ్రాండు) ఉపయోగించటం ఒక మార్గం.

ఆసనం చుటూనొప్పితో కూడిన వాపులు (హెమరాయిడ్స్)

హెమరాయిడ్స్ అన్నవి ఆసనం చుటూ వాచిన నరాలు. అవి తరచు దురద పెట్టటం, మండటం, లేక రక్తం కారటం కలిగిస్తాయి. మలబద్ధకం వల్ల అవి మరింత విషమిస్తాయి. చక్రాల కుర్చీ ఉపయోగించే స్త్రీలు, ఎక్కువగా కూర్చుని వుండే స్త్రీలు, మెదడుకు సంబంధించిన పక్షవాతం గల స్త్రీలు హెమరాయిడ్స్తో సమస్యలను వారు వయసు పెరుగుతున్న కొలదీ ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. మీరు మలాన్ని చేతో తొలగించినటైతే రక్తస్రావం వుందేమో చూడాలి. ఇది హెమరాయిడ్స్ యొక్క సాధారణ లక్షణం.

హెమరాయిడ్స్ ఉన్నటైతే

ఒక బేసిన్ చల్లటి నీళ్ళలో కూర్చుంటే నొప్పి తగ్గుతుంది.

  • ఈ పేజీలో సలహా పాటిస్తే మలబద్ధకాన్ని నివారించవచ్చు.
  • విచ్ హాజరల్ (ఈ చెట్టు నుంచి మందు ద్రవ రూపంలో తగ్గుతుంది. తీస్తారు). ఒక శుభ్రమైన బట్టను మంచి నొప్పి వున్న ప్రాంతం పై వేయండి.
  • పిరుదులు పైకి వుండేలా మోకాళ్ళపై ఆనుకోవటం వల్ల నొప్పి తగ్గుతుంది.

రుతుస్రావం

నెలవారీ ప్రావం సమయంలో యోని నుండి జరిగే ప్రావానికి కొందరు బాలికలు, స్త్రీలు బట్టను మడతలుగా మడిచిన పాడ్లను, దూది పాడ్లను ఉపయోగిసూ వుంటారు. అది సరైన స్థానంలో బెల్లు, పిన్ లేక లోదుస్తులతో అమరుస్తారు. ఆ పాడ్లు రోజులో చాల సార్లు మార్చవలసి వస్తుంది. ఒక వేళ వాటిని మరల ఉపయోగించినటైతే సబ్బు, నీరుతో శుభ్రంగా ఉతకాలి.

ఆ బట్టలను సాధ్యమైతే ఎండలో ఆరవేయాలి. లేదా వేడి ఐరన్తో ఇస్త్రీ చేయాలి. ఉష్ణోగ్రత వాటిని ఎండ బెట్టటమే కాకుండా, క్రిములను నాశనం చేస్తుంది కూడ. అందువల్ల ఇన్ఫెక్షన్ సోకదు కనుక మళ్ళీ ఉపయోగించవచ్చు ఆ బట్టలను. పిరియడ్కు పిరియడ్కు (నెలకు నెలకు) మధ్యలో వాటిని పరిశుభ్రమైన పొడి చోటులో వుంచాలి, దుమ్ము కీటకాలు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.

కొందరు స్త్రీలు కొన్నవికాని, తాము దూదితో తయారు చేసినవి కాని, స్పాంజ్తో తయారు చేసినది కాని యోనిలోపల పెడుతూ వుంటారు. రుతు ప్రావ సమయంలో, వీటినే టాంపన్స్ అంటారు. టాంపన్స్ ను ఉపయోగించేవారు వాటిని కనీసం రోజులో మూడు సారైనా మార్చుకొంటూ వుండాలి. మార్చకుండా ఒక రోజు కన్నా ఎక్కువ వుంచినటైతే తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురికావలసి వస్తుంది.

ప్రతిరోజు జననేంద్రియాలను శుభ్రంగా నీటితో కడుగుకోండి. అందువల్ల ఇంకా రక్తం మిగిలి వుంటే పోతుంది. స్వల్ప స్వభావం కల సబ్బుతో కడుగుకోండి సాధ్యమైతే, మీరు కాథెటర్ సహాయంతో మూత్ర విసర్జన చేసేవారైతే మూత్రద్వారం చుటూ ప్రదేశాన్ని జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి. రుతుస్రావం సమయంలో, ఒకవేళ కాథెటర్ ట్యూబ్లో రక్తం వచ్చినటైతే దానిని వెంటనే కడిగి శుభ్రపరచండి. ఆ రక్తం అడ్డుకోవటం వల్ల మూత్రం బయటకు రాకపోవచ్చు.

అంగవైకల్యం గల కొందరు స్త్రీలు తమ రుతుస్రావ సమయంలో అదనపు సహాయం అవసరమై వుంటారు. కొన్ని సందర్భాలలో మీ దుస్తులపై గాని, పక్కలపై గాని రక్తపు మరకలు పడినా మీరు చెడ్డగా భావించకండి. ఇది కొన్ని సమయాలలో అందరు స్త్రీలకు జరిగే సాధారణ విషయమే. కొన్ని సందర్భాలలో ఆ సమయంలో మీకు మలమూత్ర విసర్జనలకు ఇతరుల సహాయం అవసరం అయితే తీసుకోండి. అటువంటి సమయంలోనే పాడ్ను మార్చుకోండి.

రాత్రి నిద్ర సమయంలో ఒకవేళ మార్చుకోలేనటైతే ఒక బట్టనో, తువ్వాలునో అడుగున వేసుకు పడుకోవాలి. అపుడు ఉదయం దానిని ఉతకటం సులభమవుతుంది.

మీరు అంధులైనటైతే.

j23మీరు మొదటిసారి రుతుస్రావం కలిగినపుడు కంటి చూపు లేకపోవటం వల్ల ఎపుడు అలా జరిగిందో చెప్పలేకపోతారు. కాని కొన్ని నెలల తర్వాత అది మీ జీవితంలో ఒక భాగం మారిపోయి, మీ శరీరంలో కలిగే అనుభూతులే మీకు చెపాయి ఆ విషయం. ప్రావం సమయంలో పాడ్లను గాని టాంపర్లను గాని వీలైనంత తరుచుగా మారుసూ వుండండి. మీ పాడ్లను మార్చుకున్నపుడు గాని రక్తం ఉనికి తెలుసుకోవటం కోసం తాకినపుడుగాని మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి. మీరు నమ్మే మీ కుటుంబ సభ్యులను గాని, మరెవరినైనా గాని మీ దుస్తులపై మరకలున్నాయేమో చూసి చెప్పమని అడగండి. ఒకవేళ వున్నటైతే, మీరు ఆ దస్తులను ఉతికేటపుడు ఆ మరకలు పోయేలా వారిని సహాయపడమని కోరండి.

మీరు గనుక ఒక స్త్రీకి రుతుస్రావ సమయంలో హాయపడినటైతే ఆ రక్తం మీ చేతులపై పడకుండా ప్లాస్టిక్ సంచులుగాని, గ్లోవ్స్ గాని ఉపయోగించండి. రుతు ప్రావ సమయంలో ఒక స్త్రీ నుండి మరొక స్త్రీకి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం చాల తక్కువే అయినప్పటికీ, హెపటైటిస్, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నుండి ఇన్ఫెక్షన్ సోకకుండా ముందు జాగ్రత్తగా వుంటుంది.

నేర్చుకోవటం, అర్థం చేసుకోవటంలో సమస్యగల బాలికలకు సహాయపడటం

ఒక బాలికకు అర్థం చేసుకోవటంలో సమస్య వున్నటైతే ఆమె దినచర్య విషయంలో, ఆమె అక్కగాని, పిన్ని లేక అత్తగాని, తల్లి గాని శ్రద్ధ వహించి, ఆమె నెలవారీ స్రావం సమయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలో నేర్పించాలి.

  • మీరు కూడ ఆ బాలిక ఉపయోగించే పాడ్ల వంటివే ఉపయోగించటం అవసరం.
  • ఆమెకు ఆ బట్టలు, పాడ్లు ఎక్కడ వుంచారో తెలిసేలా చూపించండి.
  • ఒకసారి ఉపయోగించిన పాడ్ గాని బట్టగాని ఎక్కడ పడవేయాలో, లేక అది మళ్ళి ఉపయోగించినటైతే ఎలా శుభ్రపరుచుకోవాలో చూపి నేర్చించండి.
  • ఒక పాడ్ గాని, బట్టగాని ఆమె వేసుకొనే లోదుస్తుల్లో (అండర్వేర్) ఉంచండి. అందువల్ల ఆమె దానికి అలవాటు పడుతుంది. అభ్యాసంతో,
  • ప్రావం మొదలైనపుడు ముదురు రంగు దుస్తులు ధరించటం వల్ల, రక్తపు మరకలు పైకి కనిపించే అవకాశాలు తక్కువగా వుంటాయి. అన్న ఆ విషయం ఆమెకు బోధపడేలా వివరంగా చెప్పండి.

నెలవాలీ ప్రావం వల్ల అసౌకర్యం

నెలవారీ రుతుస్రావం సమయంలో గర్భాశయం, లోపలి పొర బయటకు పోవటానికి అనువుగా ముడుచుకోవటం జరుగుతుంది. ఈ ముడుచుకొనే బిగుతు వలన పొత్తి కడుపులో లేక నడుము క్రింది భాగంలో నొప్పి కలుగుతుంది. నొప్పి, రక్తస్రావం జరగటానికి ముందుగాని, తర్వాత గాని కలుగుతుంది.

పొత్తి కడుపును వేడిగాకాయటం వలన ఈ నొప్పలు తగ్గే అవకాశం వుంటుంది. ఒక సీసాగాని, మరే పాత్ర అయినా గాని వేడినీటితో నింపి పొత్తి కడుపుపై గాని, నడుము క్రింది భాగంపై గాని ఉంచండి. లేదా వేడి నీటిలో మంచిన దళసరి బట్టను కూడ ఉపయోగించవచ్చు. ఒక వేళ వేడి కావడం పనికి రాకుంటే బ్రూఫెన్ వంటి నొప్పిని తగ్గించే స్వల్ప ప్రభావం గల మందును తీసుకోవాలి.

నెలవారీ ప్రావం వల్ల మీరు మామూలు కన్నా ఎక్కువగా అలసిపోయినట్లు అనుభూతి చెందుతారు. కండరాలు కూడ నొప్పిగా వుంటాయి. మీ వైకల్య లక్షణాలు ఈ సమయంలో మరింతగా దిగజారతాయి. కొందరు స్త్రీలు ఈ సమయంలో తమ రొమ్ములు పరిమాణం పెరిగినట్లు భావిస్తారు. కొందరైతే అదుపులేని ఉద్రేకపూరితమైన భావాలకు లోనవుతారు.

అధిక రుతుస్రావం

కొంత మంది ఫ్రీలలో రుతుసావ్రం ప్రతి నెలా కూడ అధికంగా అవుతుంది. వారికి అది సాధారణమూ, మామూలే కావచ్చు. కాని ఇతరులలో అది రక్తహీనతకు దారి తీస్తుంది. మీ పాడ్గాని బట్టగాని 3 గంటలలోపు తడిసిపోయినటైతే పూర్తిగా, అది అధిక రుతుస్రావం అవుతుంది. మీకు గనుక ఈ పరిస్థితి వుంటే 'ఐబూప్రొఫెన్ వేసుకోండి. దీని వల్ల నెమ్మదై రక్తహీనతను నివారింపబడుతుంది. ఒకవేళ అది పని చేయకున్నా మీ రుతుస్రావం 3, 4 వారాలకు ఒకసారి కన్నా ఎక్కువసార్లు వచ్చినా ఆరోగ్య కార్యకర్తను కలవండి.

ఈస్ట్ వలన కలిగే ఇన్ఫెక్షన్లు

ఈస్ట్ అన్నది, ఫంగస్ వలన వచ్చే సాధారణమైన ఇన్ఫెక్షన్, సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ జననాంగాలలో జననాంగాలపై, చర్మంపై వేడిగా, తడిగా వున్న ప్రాంతాలలో (కారుతున్న మూత్రం లేక చమట) ఎక్కువ సమయం వుండటం వలన వస్తుంది. ఈస్ట్ లైంగికంగా వ్యాప్తిం చెందేది కాదు.

యోని నుండి ప్రావం (ఈస్ట్, తెల్లబట్ట, తెల్ల పిరియడ్స్ కండిడా, త్రష్)

యోనిలో కొంచెం తడి, ప్రావం వుండటం సహజం. ఈ విధంగా యోని శుభ్రపడటం, రక్షించుకోవటం చేస్తుంది. వాసన, రంగులో మార్పు వలన మీకు ఇన్ఫెక్షన్ వున్నట్లు అర్థం. కాని మీ డిశ్ఫార్డ్ని బట్టి మీకున్న ఇన్ఫెక్షన్ ఏమిటన్నది చెప్పటం కష్టం.

ఏ స్త్రీకైనా ఈస్ట్ సోకవచ్చు యోనిలో ముఖ్యంగా ఎక్కువ సమయం కూర్చుని వుండటం, చక్రాల కుర్చీలో కూర్చుని నడిపించుకున్నట్లు వుండే విధంగా వున్న వారిసో ఈస్ట్ సోకవచ్చు. ఇంకా అంగ వైకల్యం గల స్త్రీలలోను, లేదా వ్యాధి నిరోధక ఔషధాలు తీసుకుంటున్న వారిలోను కూడ ఈస్ట్ సోకవచ్చు. గర్భిణీ స్త్రీకి శిశువు జన్మించక ముందే చికిత్స చేయించుకుంటే మంచిది. లేకుంటే పుట్టిన బిడ్డకు త్రష్ అనే ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

చర్మ వ్యాధి (ఇన్ఫెక్షన్)

ఈస్ట్ ఇన్ఫెక్షన్లన్నవి కేవలం యోనిలోనే వుండవు ఎల్లప్పడూ, చర్మానికి సంబంధించిన ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఉదాహరణకు చర్మపు మడతలలోను, తొడల లోపలి వైపు, చర్మం మరో చర్మంను తాకే చోట, లేక రొమ్ముల క్రింద ఈ ఈస్ట్ సోకవచ్చు.

చర్మంపై వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఒక తెరుచుకున్న వుండలా తయారు కావచ్చు. అది మలమూత్రాలలో అసహ్యంగా తయారైనట్లయితే, అది చాల తీవ్రమైన ఇన్ఫెక్షన్గా మారి శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. చాల తక్కువగా కదిలి తిరుగుతూ, ఒకేసారి చాల సమయం (ఎక్కువ గంటలు) కూర్చునే స్త్రీలలో ప్రత్యేకంగా ప్రమాదిస్తుంది. వెన్నెముక క్రింది చివర భాగంలో ఎముకలకు ఈ ఇన్ఫెక్షన్లు తగిలినటైతే చాల ప్రమాదం.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు

  • యోని వెలుపల గాని లోపల గాని విపరీతమైన దురద కలిగి వుండటం.
  • యోని వెలుపల, లోపల, ఇంకా ఇతర చర్మపుమడతలలోను, తొడల సందులలోను చర్మం ఎర్రగా వుండి, రక్తం రావటం.
  • మూత్ర విసర్జన చేసే సమయంలో మంట పుట్టటం.
  • తెల్లని ముద్దలలా పెరుగు లాంటి ప్రావం.
  • బ్రెడ్ బేక్ చేస్తున్నటువంటి వాసన కలిగి వుండటం.

ఈస్ట్ సహజమైన చికిత్సలతోనే నివారింపబడుతుంది. దీనికి ఒక సహజమైన చికిత్స ఏమిటంటే ఒక లీటరు నీటిలో మూడు స్పూన్ల వెనిగార్ను బాగా కలిపి, ఒక శుభ్రమైన దూదిని అందులో మంచి, ప్రతి రాత్రి ఆ దూదిని నిలోనికి ప్రవేశపెట్టి వుంచి, మరుసటి ఉదయం తీసేయండి. ఇలా మూడు రాత్రులు చేయటం వల్ల గుణం కనిపిసుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్కు మందులు

ఒక దూది ముక్కను తీసుకొని జెన్షియన్ వైలెట్ 1%లో మంచి తడపండి. ఆ దూదిని యోనిలోనికి పెట్టండి, ప్రతి రాత్రి మూడు రాత్రులు. ప్రతి ఉదయం ఆ దూదిని తీసి వేయండి. లేదా ఈ దిగువన చెప్పిన మందులు, ఆయింట్ మెంట్ల ఆ మందులతో చేసినవీ యోని వెలుపల, పిరుదల పైన, కాళ్ళపైన ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఆ ప్రదేశాలలో మృదువుగా ఆయింట్ మెంట్ను రుద్దండి.

మందు

తీసుకోవాల్సిన మోతాదు

ఎపుడు తీసుకోవాలి

మికనాజోల్

ఒక 200 మి.గ్రా.లోపల పెట్టుకునే మాత్ర

యోనిలో బాగా లోపలకు ప్రతి రాత్రి, మూడు రాత్రులు

లేక నైస్టాటిన్

ఒక 100,000 యూనిట్ల మాత్ర (లోపల పెట్టుకొనేది)

యోనిలో బాగా లోపలకు  ప్రతి రాత్రి, 14 రాత్రులు

లేక క్షాట్రి మాజోల్

ఒక రెండు 100 మి.గ్రా. (లోపల పెట్టుకొనే మాత్ర)

యోనిలో, ప్రతి రాత్రి మూడు రాత్రులు.

 

దొరికినటైతే, నైస్టాటిన్ వంటి ఫంగస్ను నిర్మూలించే (యాంటీ ఫంగస్) పౌడరు లేదా సెంట్దీయని బేబీ పౌడర్ ఇన్ఫెక్షన్ ప్రభావం గల ప్రాంతంలో వేయండి పౌడరు.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ - నివారణ

వెచ్చగా, తడిగా వుండే ప్రదేశంలోనే ఈస్ట్ బాగా వృద్ధిచెందుతుంది. యోనిని, దాని చుటూ వున్న చర్మాన్ని పిరుదులను, రొమ్ముల క్రింది చర్మాన్ని పొడిగా శుభ్రంగా వుంచుకోవటం ద్వారా మీరు ఈస్ట్ను నివారించవచ్చు. ఇక్కడ కొన్ని సూచనలు:

  • మీకు మూత్రం కారిపోతున్నట్లయితే, లోదుస్తులను వీలైనంత తరచుగా మార్చుకుంటూ వుండండి. మీరు రుతుస్రావానికి ఉపయోగించేటటువంటి పాడ్లను ఉపయోగించవచ్చు. అలాగే  వాటిని పగటి పూట తరచూ మార్చుకోండి.
  • మీరు చాల ఎక్కువ సమయం కూర్చునేవారైతే కూర్చున్న భంగిమను మధ్య మధ్య మార్చుకుంటూ వుండండి. (కనీసం గంటకు ఒకసారి) మీ కుర్చీలోంచి లేచి (రోజులో 2 సార్లు) రెండుకాళ్ళను ocšon పెట్టుకొని కనీసం 15 నిముషాలు పడుకోండి క్రింద. ఇందువల్ల ఒత్తిడి వలన ఏర్పడే పండ్లు కూడ నివారింప బడతాయి.
  • మీ శరీరం దిగువ భాగంలో స్పర్శ అనుభూతి లేకున్నట్లయితే, ఒక అద్దాన్ని ఉపయోగించి యోనిగాని, చుటూ చర్మం గాని అసహజమైన ఎరుపుగా వందేమో చూడండి. ఇది మీ అంతట మీరు చేయలేకుంటే మీరు నమ్మే వారిని ఒకర్ని సహాయపడమని, అడగండి, అది కూడ ముఖ్యంగా మీ యోని నుండి అసాధారణమైన వాసన వస్తున్నట్లు మీరు గుర్తించినటైతే,
  • కాటన్ (తడిని పీల్చుకొనేవి) లోదస్తులను ధరించండి. మీ జననాంగాలకు చుటూ గాలి ఆడి పొడిగా వుండేలాంటి వదులు దుస్తులను ధరించండి.
  • మీరు పడుకొనేటపుడు నిద్ర పోయేటపుడు లోదుస్తులు (అండర్ వేర్స్) ధరించకండి. ఇందువల్ల మీ జననాంగాలు పొడిగా వుంటాయి.
  • మీ రుతుస్రావ సమయంలో, రకాన్ని ఇంకించటానికి ఉపయోగించే పాడ్లను ఒక రోజులో తరచు ఎక్కువసార్లు మార్చుకోండి. వాటిని తిరిగి ఉపయోగించాలంటే, సబ్బు, నీళ్ళతో శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేయండి బాగా,
  • కాటన్తోగాని, గుడ్డతోగాని, స్పాంజ్తోగాని తయారు చేసిన టాంపన్ను మీ యోనిలో వుంచుకొని దానిని రోజుకు 3 సార్లు మార్చుకోండి. ఒకరోజుకన్నా ఎక్కువ సమయం తొలగించకుండా వంచినటైతే తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం వుంటుంది.

బాక్టీరియా వల్ల యోనికి సోకే ఇన్ఫెక్షన్ (బాక్టీరియల్ వేనోసిస్)

యోని నుంచి స్రావం కలిగించే మరో ఇన్ఫెక్షన్ ఈ బాక్టీరియల్ వేజినోసిస్ అన్నది. ఇది లైంగికంగా వ్యాప్తి చెందదు. మీరు గర్భిణీగా వున్నట్లయితే ఇన్ఫెక్షన్ మీ బిడ్డను తొందరగా పుట్టేసేలా చేస్తుంది.

లక్షణాలు:

  • మామూలు కన్నా అధిక ప్రావం.
  • చేపలా నీచువాసన, ముఖ్యంగా సెక్స్లో పాల్గొన్న తర్వాత,
  • స్వల్పమైన దురద.

చికిత్స

ప్రావానికి మందులు: బాక్టీరియల్ వెజినాసిస్కు చికిత్స

మందు

తీసుకోవాల్సిన మోతాదు

ఎపుడు తీసుకోవాలి

మెట్రోనిడాజోల్

400 నుండి 500 మి.గ్రా.

రోజుకు 2 సార్లు7 రోజులు నోటితో బ్రిమింగాలి.

లేదా మెట్రోనిడాజోల్  గర్భిణీగా మొదటి 3 నెలలు

2 గ్రా. (2000 మి.గ్రా.) ఈ మందు వాడకూడదు

ఒకే మోతాదుగా నోటితో

లేదా క్షిండా మైసిన్

300 మి.గ్రా.

రోజుకు 2 సార్లు 7రోజులు నోటితో

లేదా క్షిండా మైసిన్

5 గ్రాములు

2% క్రీము

యోని లోపల పడుకొనేటపుడు 7 రోజులు

మీ భాగస్వామి కూడ మెట్రోనిడాజోల్ (2 గ్రాములు నోటితో ఒక్కసారి మాత్రం)తో చికిత్స పొందాలి.

ముఖ్యం: మీరు మెట్రో నిడాజోల్ తీసుకొనేటపుడు, మద్యపానం (ఆల్కహాలు) త్రాగకూడదు.

ముఖ్యం: ఇక ఇతర ఇన్ఫెక్షన్లు కాని, యోనిలో స్రావం కాని, లైంగికంగా వ్యాపించేవే అయి వుంటాయి (స్టిల్స్)

ఒత్తిడి వల్ల కలిగే పుండ్లు

ఈ రకమైన పుండు సాధారణంగా చక్రాల కుర్చీలు ఉపయోగించే స్త్రీలలోను, మంచంపైనే కదలకుండా వుండే స్త్రీలలోను ఏర్పడుతాయి. ఎముకలపై గల చర్మం ఒక కుర్చీకి గాని, పరుపునకు గాని ఒత్తుకున్నపుడు ఈ పండు ప్రారంభం అవుతాయి. నొక్కుకోవటం వలన రక్తనాళాలు రక్తప్రసారం జరుగకుండా ఒత్తుకుపోయి చర్మానికి రక్తం సరఫరా జరుగదు. క్రమంగా అక్కడ నల్లని లేక ఎర్రని మచ్చ ఏర్పడుతుంది. అక్కడ ఇంకా ఒత్తిడి గనుక కొనసాగినటైతే పుండు ఏర్పడి, శరీరం లోపలికంటే ప్రభావం చూపుతూ పోతుంది. లేదా పండు శరీరం లోపలే ఎముక దగ్గరగా ఏర్పడి ఉపరితలం వైపు (చర్మం) పెరుగుతూ వస్తుంది. ఒత్తిడి వల్ల ఏర్పడే పండ్లకు చికిత్స గనుక చేయకుంటే శరీరమంతా అవి విస్తరించి, ఆ వ్యక్తిని చంపుతాయి.

సన్నని స్త్రీలలో (బక్కపల్చ) కండ తక్కువగా వుండటం వల్ల ఒత్తిడి వల్ల పండ్లు ఏర్పడటానికి ఎక్కువ అవకాశం వుంటుంది. ఇంకా ఈ రకంగా కూడ మీకు పుండు ఏర్పడే అవకాశం వుంటుంది :

  • చక్రాల కుర్చీని ఉపయోగించటం వలన గాని పక్క మీద కదలకుండా పడుకొని వుండటం వలనగాని.
  • మీకు అదుపు లేకుండా మూత్ర విసర్జన జరుగుతూ వుండటం వలన.
  • మీకు కండరాలు బిగుతుగా ముడుచుకోవటం వలన మీ శరీరం దుప్పట్లకు, దుస్తులకు ఎక్కువగా రాపిడి కావటం వలన.

లక్షణాలు

  • ఎర్రని, లేక నల్లబడిన చర్మం, నొక్కినా రంగు పల్చన కాకపోవటం.
  • వాపుగాని పుండు గాని చర్మంపై,

ఒత్తిడి పుండును మీరు మొదట గుర్తించినపుడు

  • గంటకు కనీసం ఒకసారైనా శరీర భంగిమను మార్చుకోవటం.
  • ఆ ప్రాంతాన్ని ఒత్తిడి నుంచి కాపాడటానికి అదనంగా మొత్తలతో కాపాడండి.
  • ఆ ప్రదేశాన్ని పరిస్థితి మెరుగవుతుందో, దిగజారుతుందో తెలుసుకోవటానికి గమనిస్తూనే వుండాలి.

మీకు ఒత్తిడి పండ్లు వున్నటైతే .

  • పుండు వున్నచోట ఒత్తిడిని పూర్తిగా తొలగించాలి. ఏ సమయంలోను కూడ పుండుపై పండు కోవటం కాని, కూర్చోవటం గాని చేయకూడదు.
  • పుండునూ, దాని చుటూ వున్న చర్మాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రమైన నీటితోగాని, కాచి చల్లార్చిన నీటితోగాని బాగ కడగాలి. పండు యొక్క చుటూ అంచు భాగాన్ని మొదట కడగండి. తర్వాత క్రొత్తబట్టలో ఓ శుభ్రమైన ముక్కతో గాని గాలు గుడ్డతోగాని పండు మధ్య నుంచి అంచుల వైపు శుభ్రపరచండి.
  • శుభ్రం చేసిన తర్వాత ఆయింట్ మెంట్ను ఒక పరిశుభ్రమైన బట్టపై వేసి (గాజు గుడ్డపై గాని) స్వల్ప ప్రభావం గల ఏ ఆయింట్ మెంట్ ను అయినా ఉపయోగించవచ్చు. పెట్రోలియమ్ జెల్లీ, లేక వ్యాధి నిరోధక క్రీమ్ను ఉపయోగించవచ్చు. దీనివల్ల చర్మం పొడిబారిపోకుండా నివారింపబడుతుంది. ఇంకా పుండును దుమ్ము మట్టి మరియు ఇతర కీటకాల నుండి కాపాడుతుంది.
  • పొడి చర్మాన్ని పగుళ్ళ నుండి కాపాడటానికి, మృదువుగా రోజూ ఒకసారి లోషన్ను రాయండి.
  • పుండు చుటూ వున్న చర్మాన్ని రుద్దటం గాని ఒత్తటం గాని చేయకండి. అందువల్ల ఆ చర్మం బలహీనమై చినిగి, పుండును మరింత ఎక్కువ చేస్తుంది.

పుండు లోతుగా వుండి, చనిపోయిన కండ (మాంసం)ను ఎక్కువగా కలిగి వుంటే

  • j25పుండును రోజుకు 3 సార్లు కడిగి శుభ్రపరచాలి.
  • తరచు పండు కనిపించే దానికన్నా పెద్దగానే వుంటుంది. చర్మపు అంచుల క్రింద లోతుగా వెళ్ళి వుండవచ్చు. పుండును శుభ్రపరిచేటపుడు చాల వరకు చచ్చు కండను తొలగించి వేయాలి. ఆరోగ్యమైన కండ కనిపించే వరకు కొంచెం కొంచెంగా చచ్చు కండను తొలగించి వేయాలి. ఆరోగ్యమైన, ఎర్రని మాంసంగాని, ఎముకగాని కనిపించే వరకూ అలా చేయాలి.
  • చచ్చు కండను తొలగించిన ప్రతిసారి కూడ పండును సబ్బు, నీరుతో శుభ్రపరచాలి. ద్రవ రూపంలో వున్న సర్టికల్ సబ్బు అందుబాటుగా వుంటే, అది ఉపయోగించడం మంచిది. తర్వాత పుండును, కాచి చల్లార్చిన నీటిలో కడగండి.

ఒత్తిడి పండ్లకు గృహ వైద్యాలు

j26బొప్పాయి: ఈ పండులో చచ్చుబడిన పాత కండను మొత్తగా చేసి తొలగించటం సులభం చేసే రసాయన పదార్థం వుంది. ఉడకబెట్టిన గుడ్డ లేక గాజు గుడ్డ, బొప్పాయి చెట్టు మాను నుంచి గాని, పసిరికాయ నుంచిగాని వచ్చే పాలలో తడిపి పండు లోపలకు పెట్టాలి. ఇలాగ రోజుకు 3 సార్లు చేయాలి.

తేనె, పంచదార: ఇవి క్రిములను చంపి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించటమే కాకుండా, త్వరగా కోలుకొనేలా చేస్తాయి. పంచదారను, తేనెను కలిపి చిక్కని ముద్దగా చేయాలి. దీనిని పండు లోనికి నొక్కిపెట్టి దళసరి బట్టతోగాని, గాజు గుడ్డతోగాని (స్తx కప్పి కట్టుకట్టాలి. (మొలాసిస్ గాని సన్న అంబవులున్న పంచదారను కూడ ఉపయోగించవచ్చు. పుండును శుభ్రంచేసి, రోజులో కనీసం రెండు సారైనా అలా చేయండి. తేనె, పంచదార మరీ ఎక్కువైతే, పండు నుంచి వచ్చే ద్రవ పదార్థంలో కలిసి క్రిములను చంపటానికి బదులుగా వానికి ఆహారం ఇవ్వటం జరుగుతుంది.

ఒత్తిడి పుండ్లకు ఇన్ఫెక్షన్ సోకితే

పుండు చెడువాసనను కలిగి వాచి వుండటం, వేడి మరియు చలి, జ్వరంవున్నటైతే పండుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు అర్థం చేసుకోవాలి. ఒక ఆరోగ్యకార్యకర్తను కలిసి, ఏ రకం క్రిముల వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకోవటం, ఏ మందులు బాగా పనిచేస్తాయో తెలుసుకొని ఉపయోగించటం చాల అవసరం. అది సాధ్ కానటైతే, డాక్సీసైక్లిన్, ఎరిక్రోమైసిన్, డైక్లాక్స్, ఏసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ (వ్యాధి నిరోధకాలు) వాడవచ్చు.

  • ఒత్తిడి వల్ల ఏర్పడిన పళ్ళు లోపల నుండి బయట వైపునకు మానుతూ వస్తాయి. అందువల్ల ఆ పండులో నుంచి పూడి రావటం మీరు చూడగలుగుతారు. ఇది త్వరగా జరుగదు. అందువలన ఓర్పు అవసరం.
  • అవసరమైతే నొప్పి తగ్గటానికి పారాసెటెమాల్ వేసుకోవాలి.

ఒకవేళ మీ శరీరం కొంత భాగంలో మీరు స్పందనను కోల్పోయినటైతే మీకు, మీ కుటుంబ సభ్యులకు, సంరక్షకులకు కూడ ఒత్తిడి వల్ల ఏర్పడే పళ్ళ గురించి, వాటి చికిత్సా విధానం గురించి, నివారణ గురించి వివరంగా తెలియటం చాల అవసరం. వెన్నెముకకు దెబ్బ తగిలిన వ్యక్తులలో ఈ రకం పుండ్లు సాధారణంగా ఏర్పడతాయి. తరచు ఇటువంటి పండు ఆసుపత్రిలో వుండగానే ప్రారంభం అవుతాయి. గాయం తగిలిన తర్వాత, ఎందువల్లనంటే గాయపడిన వ్యక్తి ఒత్తిడి తగ్గటం కోసం ఇటు అటు కదలలేడు గనుక. సరైన జాగ్రత్త తీసుకొన్నటైతే ఎవరికీ కూడ ఈ రకమైన పండ్లు ఏర్పడవు.

ఒత్తిడి పుండ్లు - నివారణ

మీరు పెద్దగా కదలలేకపోయినప్పటికీ, కొంచెం కదలటానికి ప్రయత్నించండి. లేదా మీ బరువును కనీసం 2 గంటలకు ఒకసారి మార్చుకోవటానికి ప్రయత్నించండి. మీరు ఎపుడూ పడుకొనే వుండే వారైతే, ఇతరులెవరి సహాయం అయినా తీసుకోండి కొంచెం అటు ఇటు బరువు మార్చుకోవటానికి ఎముకలున్న ప్రాంతాలలో ఒత్తిడిని తగ్గించేందుకు మెత్తని దిండులను, పాడ్లను ఉపయోగించండి. మీరు సూక్ష్మంగా మెత్తను తయారు చెయ్యాలంటే ఒక ప్లాస్టిక్ సంచిలో బియ్యం గాని, చిక్కుళ్ళు గాని పోసి (వండనివి) మెత్తగా వాడవచ్చు. దాన్ని తప్పని సరిగా పాతవి తీసేసి నెల తర్వాత కొత్త గింజలతో నింపుతూ వుండాలి.

మీ శరీరం మొత్తాన్ని ప్రతిరోజూ జాగ్రత్తగా పరీక్షగా చూసుకోవాలి. మీ వెనుక భాగం చూసుకోవటానికి అద్దం సహాయం తీసుకోండి. ఒకవేళ ఏదైనా ఎర్రని, నల్లని మచ్చలాంటి ప్రదేశం కనిపిస్తే, దానిపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి తగ్గేవరకూ,

ప్రతిరోజు స్వల్ప ప్రభావం గల సబ్బు, శుభ్రమైన నీరుతో పరిశుభ్రంగా కడుగుకోవాలి. మీ చర్మాన్ని పొడిగా వుండేలా చూసుకోండి. కాని రుద్దవద్దు. చర్మం పొడిబారిపోతే సులభంగా పగిలి, చినిగే ప్రమాదం వుంటుంది. మృదువుగా ఏదైనా లోషన్ రాయండి రోజుకు ఒకసారి. ఎన్నడూ కూడ మీ చర్మంపై ఆల్కహాల్ పడనివ్వకండి. అందువలన చర్మం పొడిబారిపోయి బలహీన పడుతుంది.

ఎక్కువగా పళ్ళు, కూరగాయలు, ప్రొటీన్లు, ఇనుము అధికంగా గల ఆహారం - ఉదాహరణకు మొలకెత్తుతున్న పప్పధాన్యాలు, చిక్కుళ్ళు, బరాణీ, మాంసం ముక్యంగా గుండె, కాలేయము, మూత్ర పిండాలు, ఇంకా చేపలు, కోడి మాంసం తీసుకోవాలి. అందువలన మీ చర్మం, కండరాలు ఆరోగ్యంగాను, గట్టిగాను శక్తివంతంగాను తయారై, ఒత్తిడి వల్ల ఏర్పడే పండ్లు నివారింపబడతాయి.

హఠాత్తుగా, మోదినట్లున్న తలనొప్పి (తీవ్రమైన)తో, రక్తపోటు అధికమవ్వటం (డిస్రిప్లెక్సియా)

వెన్నెముకలో టి6 ఎముకపై భాగంలో గాయం అయిన వారికి తలమీద బాదినట్లుండే తలపోటుతో పాటు అధిక రక్తపోటు వస్తుంది (డిస్రిఫ్లెక్సియా). సహజంగా నొప్పిని కలిగించేది గాని అసౌకర్యం కలిగించేది కాని అయిన ఒక సాధారణ విషయానికి శరీరం స్పందించే విధానం అది. కాని గాయం వలన ఆ వ్యక్తికి అనుభవం కాదు ఆ బాధ.

శరీరంలోని అంతర్భాగాలను, ఉదా: పేగులు, జననేంద్రియాలు, మూత్రాశయం, లేక శరీరం దిగువ భాగం లేక రొమ్ములపై చర్మం, వీటిని ఏదైనా స్పర్శించినా, ప్రేరణ కలిగించినా,

డిస్రిఫ్లెక్సియాకు సాధారణ కారణాలు

  • చాల నిండుగా అయిపోయిన మూత్రాశయం. ఇది కాథెటర్ మడతపడినా వంగిపోయినా జరుగుతుంది.
  • మూత్రకోశ ఇన్ఫెక్షన్, లేదా మూత్రకోశం లేక మూత్ర పిండాలలో రాళ్ళు
  • విపరీతమెన మొతంలో శరీరంలో మలం.
  • మీరు అనుభూతిని పొందలేని ఒత్తిడి వల్ల కలిగే పండు, కాలిన గాయాలు, లేక పగిలిన చర్మం
  • వేడిలేక చల్లని ఉష్ణోగ్రతలు చర్మాన్ని తాకటం. ఉదాహరణకు చల్లని పరీక్ష చేసే బల్ల,
  • రుతుస్రావ సమయంలో గాని, ప్రసవ సమయంలో గాని గర్భాశయ సంకోచం.
  • లైంగిక కార్యకలాపాలు.

డిస్రిఫ్లెక్సియా లక్షణాలు

  1. చెమటలు పట్టటం, ముఖ్యంగా మీ ముఖం, చేతులు, ఛాతి నుండి.
  2. ఎర్రని లేక వాచిన మచ్చలతో చర్మం, వెన్నెముక గాయానికి ఎగువన.
  3. చిరుపడు కాయలు లేదా మొటిమలు చేతులపైనా, ఛాతీపైనా,
  4. మసకగా అస్పష్టంగా కంటి చూపు, లేదా కళ్ళ  ఎదుట చుక్కలు, మచ్చలు కనపడటం.
  5. ముక్కు మూసుకుపోవటం.
  6. తీవ్రమైన, మోదినట్లుండే తలనొప్పి
  7. ఒంట్లో సుఖంగా లేకపోవటం . (వికారం,. వాంతి స్థితి)
  8. హరాత్తుగా పెరిగి పోయే విపరీతమైన రక్తపోటు.

ఈ లక్షణాలలో ఒకటిగాని, కొన్ని గాని కలిసి, కనిపించితే, అది డిస్రిఫ్లెక్సియా లక్షణం అనుకోవచ్చు. మీకు డిస్రిఫ్లెక్సియా సోకినట్లు మీరు అనుకున్నటైతే, వెంటనే మీకు వైద్య సహాయం కావాలి. మీకు ఒక్కసారిగా అధిక రక్తపోటు గనుక కలిగినటైతే మీ గురించి ఎలా శ్రద్ధవహించాలో, మీ కుటుంబ సభ్యునికి గాని, సంరక్షకులకు గాని అలవాటు చేయండి. మీరూ, వాళ్ళూకూడ ఆ రక్తపోటు కారణాన్ని కనుక్కొని దానిని తొలగించి, రక్తపోటును తగ్గించే జాగ్రత్తలను త్వరగా చేపట్టాలి. మీకు సహాయకులుగా వుండే వారుగాని, ఆరోగ్య కార్యకర్తగాని, ఒక వేళ మీకు డిస్రిఫ్లెక్సియా సోకినటైతే ఎలా సహాయపడాలో తెల్చుకొని వుండటానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకోండి.

ముఖ్యం: డిస్రిఫ్లెక్సియా వైద్య పరమైన అత్యవసర పరిస్థితి. అధిక రక్తపోటు వలన మూర్చలు రావచ్చు, లేదా మెదడులో ప్రాణాంతకమైన రక్తస్రావం జరుగవచ్చు. సంరక్షకులు లేదా వారి శ్రద్ధ వహించేవారు డిస్రిఫ్లెక్సియా గల వ్యక్తిని ఒంటరిగా వదలకూడదు.

డిస్రిఫ్లెక్సియా లక్షణాలు కనిపిస్తే ఎల్లప్పడూ శ్రద్ధవహించండి. కొన్ని లక్షణాలు అత్యవసర పరిస్థితిని తలపింపచేయకపోవచ్చు. కాని వెన్నెముకగాయం కలిగిన స్త్రీలు కొందరు తమ శరీరానికి ఏమో జరుగుతుందని గుర్తించగలుగుతారు. ఉదాహరణకు మీకు కొంచెం ఉక్కగా వుండి చెమటలు పోస్తున్నా లేదా మీ చర్మంలో చక్కిలిగిలి వంటి అనుభూతి కలుగుతున్నా అది మీరు బిగుతైన బూట్లు లేక దుస్తులు ధరించటం వల్ల లేదా మరీ గట్టిగా వున్న దేనిమీదైనా కూర్చోవటం, లేదా మీ మూత్ర విసర్జన కాథెటర్ వంగిపోవటం, మడత పడటం లేదా మీ కాలిబొటన వేలిగోరు మీ చర్మంలోనికి పెరగటం. సాధారణంగా ఈ సమస్యల గురించి శ్రద్ధ వహించినటైతే, మీ డిస్రిఫ్లెక్సియా లక్షణాలు పోతాయి.

డిస్రిఫ్లెక్సియాకు చికిత్స

  • మీరు పండుకొని వున్నటైతే, లేచి కూర్చుని, ఆ లక్షణాలు పోయే వరకు కూర్చునే వుండండి.
  • బిగువైన దుస్తులు, లేక సాక్స్ మొదలైన వాటిని వదులు చేసుకోండి.
  • ఒకవేళ అది ఉష్ణోగ్రత లేక ఒత్తిడి కారణం అయితే, వున్న భంగిమను మార్చుకోవటం, వేడిలేక చల్లని ఉపరితలం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి.
  • చర్మానికి రాసుకుంటున్న దేనినైనా సరే తొలగించండి.
  • మూత్రకోశం నిండిపోయి నిండుగా వుందేమో పొత్తికడుపును చేతో తడిమి చూసుకోవాలి.

మీరు మూత్రవిసర్జన చేయలేకుంటే:

  • కాథెటర్ను ఉపయోగించి మూత్రాశయాన్ని ఖాళీ చేయండి.

మీరు ఇప్పటికే కాథెటర్ని ఉపయోగిస్తున్నటైతే :

  • కాథెటర్లో వంకరలు, మడతలు వుంటే సరిచేయండి, మూత్రం సాఫీగా పోతుంది.
  • కాథెటర్ మూసుకుపోయిందా? కాథెటర్ను మార్చండి. లేదా 30 సి.సి. మరిగించి, చల్లార్చిన నీటిని కాథెటర్లోనికి ఇన్జెక్ట్ చేయండి. గొట్టాన్ని ఖాళీచేయటానికి,

మీకు మూత్రకోశ వ్యాధి (ఇన్ఫెక్షన్) లక్షణాలు వుంటే:

  • 105 నుంచి 106 వరకు పేజీలు చూడండి: ఇదే కారణం అని అనిపిస్తున్నటైతే, కాథెటర్ ద్వారా అనెస్టెటిక్ సొల్యూషన్ను మూత్రకోశంలోనికి పంపించాలి. 10 సి.సి.లో 1% శాతం లిడోకెయిన్ను 20 సి.సి. మరిగించిన నీటిలో కలపాలి. కాథెటర్ను 20 నిమిషాలు క్షాంపితో ఆపి వదలాలి. ఇన్ఫెక్షన్ను కూడ వ్యాధి నిరోధకాలను ఉపయోగించి తగ్గాలి.

మీకు మలబద్దకం కలిగినటైతే:

మీరు మల విసర్జన చేసి చాలాకాలం అయినటైతే, గ్లోవ్ తొడిగిన వేలిపై లిడ్ కైన్ జెల్లీని వేసుకొని, వేలును ఆసనంలోనికి జొనిపి, మలం నిండా వున్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఒక వేళ గట్టి మలంతో ప్యాక్ అయిపోయి వున్నటైతే మరింత లిడోకైన్ జెల్లీని ఆసనంలో పెట్టండి. 15 నిముషాలు గాని, ఆ తలనొప్పి పోయే వరకు గాని ఆగండి. అపుడు మలాన్ని వేలుతో తొలగించండి

ఆ లక్షణాలు గనుక 10 నిముషాలలో తగ్గిపోనటైతే "నిఫెడిపిన్"ను ఉపయోగించండి. అందువల్ల 5 నుంచి 10 నిముషాలలో రక్తపోటు తగ్గిపోతుంది.

డిస్రిఫ్లెక్సియాకు మందులు

మందు

ఎంత తీసుకోవాలి

నిఫెడిపిన్

10, 10 మి.గ్రా క్యాప్పల్ను కొరికి మింగివేయండి

లేదా నిఫెడిపిన్

10 మి.గ్రా నిఫెడిపిన్ టాబ్లెట్ను నలిపి పొడుం చేసి నీటితో కలిపి పేస్ట్ చేసి నాలుక క్రింద పెట్టండి.

అధిక మొత్తంలో మలమూత్రాలు శరీరంలో నిలువ వున్నటైతే, డిస్రిఫ్లెక్సియాకు అదికారణం కావచ్చు. క్రమబద్ధమైన మలవిసర్జనను అలవరుచుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. మలవిసర్జన సాఫీగా జరిగేటందుకు దోహదపడే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా తరచు మూత్ర విసర్జన చేయండి, మీరు కాథెటర్ని ఉపయోగిస్తున్నటైతే అది వంగి పోకుండా, మడత పడకుండా చూసుకోండి.

నొప్పిని తగ్గించుకోవటం

ఆరైటిస్ వంటి వైకల్యాలు, కండరాలలోను, కీళ్ళలోను నొప్పిని కలిగిస్తాయి. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలోనూ రావచ్చు నొప్పి, లేదా అది శరీర మంతటా కూడ కలుగవచ్చు. మీ నొప్పి నుండి విశ్రాంతి పొందటానికి అనేక మార్గాలుంటాయి.

బిగుతు కండరాలకు, బిగిసిన కీళ్ళకు వేడి మంచి గుణాన్నిస్తుంది. వేడి నీళ్ళలో బట్టను ముంచి నొప్పిగా వున్న ప్రదేశంపై వుంచండి. చెయ్యి పెట్టగలిగినంత వేడిగా వుండాలి నీరు: లేకుంటే మీ చర్మం కాలిపోవచ్చు.

j27మంట, బాధతో కూడిన కీళ్ళకు, గాయాలకు చల్లదనం చాల మంచిది. ఒక ప్రాంతం శరీరంలో మంటగా వున్నదని సులువుగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆ చోటు వేడిగాను, ఎర్రగాను, వాపుతోను వుంటుంది. మంచుగడ్డను ఒక తువ్వాలులోగాని బట్టలోగాని చుట్టినొప్పిగా వున్న ప్రదేశంపై పెట్టాలి. అంతేగాని ఐస్ను నేరుగా చర్మంపై పెట్టకండి. 10, నుంచి 15 నిముషాల తర్వాత ఐస్ను తొలగించి, వేడెక్కనివ్వండి. చర్మం వేడెక్కిన తర్వాత మళ్ళీ ఐస్ ప్యాక్ను పెట్టండి.

నొప్పిగా వున్న ఏరియాకు విశ్రాంతినివ్వటానికి ప్రయత్నించండి. కండరాలను, జాయింట్లను అలిసిపోయేలా చేయకూడదు. బాధకలుగుతున్న ప్రాంతాన్ని అలిసిపోయేలా చేసే బరువు పనులను మానాలి. ఎక్కువ ఆ భాగాలను ఉపయోగించటం కూడ మానాలి.

మృదువైన కదలిక ఎపుడూ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని నివారించే కొన్ని మార్గాలు జాయింట్ల కోసం, కండరాల కోసం సూచింపబడ్డాయి.

  • నొప్పి గల ప్రాంతాల్ని మృదువుగా రుద్దండి.
  • కండరాలను సున్నితంగా చాచండి.
  • మీ కండరాలను ఎవరితోనైనా మర్ధన చేయించండి.
  • పరిశుభ్రమైన, వెచ్చని నీటిలో ఈతకొట్టటం గాని, తిరగటం గాని చెయ్యండి.

నొప్పిని తగ్గించే మందు పారాసెటెమాల్ (ఎసెటామినోఫెన్) నొప్పిని తగ్గిస్తుంది. కాని వాపు తగ్గించదు. ఆఫ్ర్పిన్, ఐబూప్రొఫెన్లు జాయింట్లలో నొప్పిని తగ్గించటమే కాకుండా, వాపును కూడ తగ్గిస్తాయి. ఈ మందులను గురించిన సమాచారం కోసం ఆకుపచ్చ పేజీలు చూడండి :

ముఖ్యం: చెవిలో కూతలా వచ్చినా, సులువుగా గాయాలుsSS అవుతున్నా ఆఫ్ర్పిన్ను తక్కువగా తీసుకోండి.

మీరు మీ కీళ్ళ వాపులకు ఆఫ్ర్బిన్గాని, ఐబూప్రోఫెన్ గాని వాడుతున్నట్లయితే, ఆ నొప్పి, వాపు తగ్గిపోయిన తర్వాత కూడ SSవాటిని ఆపకుండా తీసుకోవాలి. ఆఫ్ర్పిన్గాని, ఐబూప్రొఫెన్గాని, ఒకటి తీసుకున్న 4 గంటలలోగా రెండవ దాన్ని వేసుకోకూడదు.

మార్పు కోసం కృషి చేయటం

అంగవైకల్యం గల స్త్రీలను గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం ముఖ్యం అని, అనేక మంది భావిస్తున్నప్పటికీ, యధార్థంగా చూస్తే వారికి అందవలసినంత సహాయంగాని, తెలియవలిసినంత సమాచారం గాని అందటం లేదు. వారికి ఆరోగ్యకరమైన, ఉత్సాహవంతమైన జీవితం గడిపేందుకు వారికి కావలసిన ముఖ్య సహాయాలే అందటం లేదు.

కుటుంబ సభ్యుల సంరక్షకుల పాత్ర

మా కుటుంబ సభ్యులు, సహాయకులు తీసుకునే జాగ్రత్తలే మా జీవితాలను ఎన్నో రకాలుగా సులభతరం చేస్తున్నాయి. వారు, మేము మా శరీరాల గురించిన జాగ్రత్త మేమే తీసుకునే విధంగా, మా బ్రతుకు మేము స్వతంత్రంగా బ్రతికే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అయినప్పటికీ, వికలాంగ స్త్రీలుగా మాకు అదనపు సహాయం అవసరం అవుతుంది.

  • j28ఆరోగ్యకరమైన మంచి ఆహారం, పరిశుభ్రమైన నీరు ఎక్కువగా తీసుకోవాలి.
  • శరీరాలను మంచిగా కదిలేలాగ, గట్టిగాను వుండేలా చేయటానికి వ్యాయామం చేయండి. చేతులు కాళ్ళ బాగా చాచి ముడిచి చేయండి.
  • స్నానం చేయించి, పళ్ళు తోమాలి.
  • మలమూత్రాలను తొలగించాలి. రుతుస్రావానికి ఉపయోగించిన పాడ్లను, బట్టలను కూడ మార్చాలి.
  • ఒత్తిడి వల్ల ఏర్పడే పండ్లను వెతకాలి, శుభ్రపరచాలి. చికిత్స చేయాలి. ఒత్తిడి పుండ్లను నివారించేందుకు ఒక స్త్రీకి తను పరున్న లేదా కూర్చున్న భంగిమను మార్చేటందుకు సహాయపడండి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆమె బరువును అటూ ఇటూ మార్చుకొనేటందుకు తోడ్పడండి. ఆమెకు మెత్తని ప్రదేశంలో కూర్చొనేటందుకు సహాయపడండి. అందువల్ల ఎముకలున్న ప్రాంతంలో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి పండ్లను చికిత్సలేకుండా వదిలేసినటైతే ప్రాణాంతకం కూడ అవుతాయి.
  • కొన్ని మందులను, ఇతర సరఫరాలను ఇంటి దగ్గర, లేకుంటే సమీపం గాను ఉంచండి. ముఖ్యంగా వైద్య సహాయం దూరంగా వున్నపుడు ఇది అవసరం. నొప్పి తగ్గించే మందులను, మూత్రకోశంలేదా చర్మం ఇన్ఫెక్షన్స్కు వ్యాధి నిరోధకాలను, ఇంకా ఆమె వైకల్యానికి రోజూ ఉపయోగించే మందులు, పరిశుభ్రమైన గాజు గుడ్డను కూడ వుంచాలి.

మాలో చాల మంది అంధులు కాని, వినికిడి శక్తి లేనివారు కూడ చాలావరకు తమ శరీరానికి సంబంధించిన జాగ్రత్తలను తామే తీసుకుంటారు. కాని మమ్మల్ని మేము ఆరోగ్యకరంగా వుంచుకోవటానికి సహాయం ఇంకా కావాలి. ఉదాహరణకు ఒక అంధురాలైన వ్యక్తికి, ఆరోగ్య సంబంధమైన సమాచారం గట్టిగా చదివి వినిపించటానికి మీ సహాయం కావాలి. అందులో కొంత సమాచారం ఇబ్బందికరమైనదైనా సరే. అదే విధంగా ఒక బధిరుడైన వ్యక్తి (వినికిడి శక్తిలేని స్త్రీ)కి, ముఖ్యమైన ఆరోగ్య సంబంధమైన వార్తలు మీరు రేడియోలో విన్నవి, ఆరోగ్య కార్యకర్త ద్వారా విన్నవి - వాటిని గురించిన సమాచారం అందించటానికి మీ అవసరం వుంటుంది.

సమాజం పాత్ర

మేము, మా శరీరాల గురించి జాగ్రత్తలు తీసుకునేలా, ఆరోగ్య సంరక్షణ పొందేలా, వున్న పరిస్థితులను మెరుగుపరచి సహాయపడటానికి సమాజం ఎంతో చేయగలదు. వికలాంగ స్త్రీలు చాల మంది నిరుపేదలై వుంటారు, కొందరు ఒంటరి జీవితం, వెళ్ళదీస్తూ వుంటారు. మిగతా అందరిలాగే సంరక్షణ, పోషకాహారం, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, భధ్రతతో కూడిన నివాసం - వీటన్నిటినీ అనుభవించే అవకాశం మాకు కావాలి. మా ఇరుగు పొరుగుల తోడ్పాటు, గౌరవం కూడ అవసరం మాకు. మాతో, మా కుటుంబ సభ్యులతో మా ఆరోగ్య సంరక్షణకు సమాజం సహాయపడగల కార్యక్రమాల గురించి మాట్లాడాలి.

  • j29మాలో కొంత మందికి వారి కుటుంబ సభ్యుల యొక్క సహాయకుల యొక్క సహాయం నిత్యం అవసరం వుంటుంది. సమాజంలో నాయకులు, బృందాలు సహాయం అందించగలవు. అందువలన మా అవసరాలు తీరటమే కాకుండా మా కుటుంబ సభ్యులకు, సహాయకులకు కాస్త విశ్రాంతి లభిస్తుంది.
  • చాల మంది వయసులో పెద్దవారైన స్త్రీలు చాల పేదవారు, ఒంటరి జీవితం గడుపుతూ, తమకు సహాయం చేసే వ్యక్తులు కనిపించక భారంగా బ్రతుకు వెళ్ళదీస్తూ వుంటారు. వారికి సహాయాన్ని తోడ్పాటును కల్పించటంలో, ఇంకా, ఇతర రకాలుగా సహాయ పడటంలో, సమాజం ప్రధాన పాత్ర వహించి, మా జీవితాలను మెరుగుపరచి ఉద్ధరించగలదు గొప్పగా,
  • మా పొలాలు మేము పండించుకోవటంలో, లేదా మార్కెట్కు వెళ్ళటంలో సహాయం అందిస్తే, మేము సరిపడినంత మంచి ఆహారం తీసుకోగలుగుతాం.
  • వికలాంగులైన స్త్రీలు పరిశుభ్రమైన త్రాగునీరు పొందగలిగేలా కృషి చేయాలి.
  • మా వికలాంగులం మరుగు దొడ్లను నిర్భయంగా, ఉపయోగించుకోగలిగేలా మరమ్మత్తులు చేయటం గాని, క్రొత్తగా నిర్మించటం గాని చేసే ఏర్పాట్లను సమాజం చేపట్టాలి.

కుటుంబాలు, తద్వారా సమాజం ఆరోగ్యంగా వుండటం ఎలా అన్న విషయం గురించిన మరింత సమాచారం కోసం మనకు డాక్టరు లేనిచోట అన్న పుస్తకంలో 10వ అధ్యాయం చూడండి.

మూత్రశాలలను మరుగు దొడ్లను సులభంగా ఉపయోగించుకోవటానికి అనువుగా ఏర్పాటు చేయటం

వికలాంగులైన పెద్దవాళ్ళు, పిల్లలు కూడ మరుగుదొడ్లను సులభంగా ఉపయోగించుకొనే విధంగా చేయటానికి, అనేకపద్ధతులున్నాయి. మీ అవసరాలకు అనుకూలంగా పరిష్కారాలను కనుగొని, ఆ విధంగా సమాజం మీకు సహాయ పడేలా సలహాలివ్వండి.

నేలబారున వుండే మరుగు దొడ్లను ఉపయోగించలేని సమస్య అయితే,

చేతికి వూతంగా వుండేల్లా పట్టుకోవటానికి ఒక సప్లోర్డును, లేదా కూర్చొనే సీటును శ్లో ఎత్తు చేయటం చేయాలి లేదా ఒక కుర్చీ లేక సూలు సీటుకు మరుగుదొడ్డిపై రోకీన్స్త వేయటానికి సరిపడగా రంధ్రం కోయించి ఉపయోగించాలి.

ఒక వ్యక్తి గనుక తన శరీరాన్ని అదుపులో వుంచుకోలేని పరిస్థితి అయినటైతే,

ఆమె విపునకు, పక్కలకు, కాళ్ళకు ఆసరాగా సపోర్టులను, అవసరాన్ని బట్టీ సీటు బెల్లును అమర్చాలి లేదా పట్టిని పెట్టాలి.

అంధ వ్యక్తులు ఇంటి నుంచి మరుగు దొడ్డికి వెళ్ళేటపుడు మార్గం

తెల్చుకోవటానికి అనువుగా ఒకతాడుగాని, ఫెన్సింగ్ (కట్టవ) గాని ఏర్పాటు చేయాలి.

ఒక వ్యక్తి దుస్తులు ధరించటానికి, విడిచి పెట్టటానికిగాని, సరి చేసుకోవటానికి గాని కష్టపడుతున్నటైతే,

ఆమె దుస్తులను అందుకు అనువుగా వదులుగా గాని, ఎలాస్టిక్తో గాని మార్పు చేయాలి. ఒక పరిశుభ్రమైన, పొడి చోటును ఏర్పాటు చేయాలి. పడుకొని దుస్తులు వేసుకోవటానికి.

ఒక వ్యక్తికి గనుక కూర్చోవటంలో కష్టం వున్నటైతే,

అవసరాన్ని అనుసరించి కదిలించగల మెట్లను, చేతి సపోర్టులను ఏర్పాటు చేయాలి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate