অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మీ పరికరాలు మరియు సహాయక సాధనాల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు

మీ పరికరాలు మరియు సహాయక సాధనాల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు

ఈ అధ్యాయంలో కొన్ని శారీరక వైకల్యాలు గల స్త్రీలు, వారు ఉపయోగించే పరికరాలను, సమర్థవంతంగా పనిచేసే విధంగాను, వీలైనంత ఎక్కువ కాలం పనిచేసే విధంగాను ఎలా చూసుకోవాలో, తెలియజేసే సమాచారం వుంది.

వినికిడి శక్తికి సహాయక సాధనాలు

హియరింగ్ ఎయిడ్లన్నవి చాలా ఖర్చుతో కూడుకున్న సాధనాలు. వాటిని కొనటంతోనే అయిపోదు. చెవిలోకి పెట్టె భాగం (మోల్డ్) సరిగ్గా చెవిలో అమరాలి. ఇది సాధారణంగా రెండు సంవత్సరాలే పని చేస్తుంది. అటు తర్వాత చిన్నగా అయిపోవటం, parikaralu1.jpgలేదా పగుళ్ళు ఏర్పడటం జరుగ వచ్చు. అవి చెవిలో సరిగా అమరకపోతే సమర్థవంతంగా పనిచేయవు. అపుడు మళ్ళీ మార్చుకోవాలి. అవి పని చేయటానికి బ్యాటరీలు అవసరం అవుతూ వుంటాయి, ఎప్పటికీ,

ఈ రెండు రకాల వినికిడి సాధనాలకు (హియరింగ్ ఎయిడ్స్కు) కూడా బ్యాటరీలను ప్రతివారం మార్చవలసి వుంటుంది. లేదా రెండు లేక మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి. మీరు ఎంత తరచు బ్యాటరీలను మార్చుకుంటూ వుండాలన్న విషయం, మీరు ఏ రకం ఎయిడ్ను ఉపయోగిస్తున్నారు, రోజుకు ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నారు, ఏ రకమైన బ్యాటరీలు ఉపయోగిస్తున్నారు, అన్న ఈ మూడు విషయాలపై ఆధారపడి వుంటుంది.

సౌత్ ఆఫ్రికాలోని బోట్స్ వానాలో ఒక సంస్థ రూపొందించిన హియరింగ్ ఎయిడ్ బ్యాటరీలు (మళ్ళీ ఛార్జ్ చేసుకొనే విధమైనవి) మళ్ళీ మళ్ళీ చాల రోజులు ఉపయోగించుకొనే విధంగా వున్నాయి.

కొన్ని దేశాలలో హియరింగ్ ఎయిడ్ బ్యాటరీలను, చెవిలో అమర్చే (మోల్డ్) భాగాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది, అవసరమైన వారికి. మీ దేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించండి, మీకు కూడా అటువంటి సౌకర్యం వుందేమో తెలుసుకోవటానికి.

వినికిడి సాధనం (హియరింగ్ ఎయిడ్) గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు

  • మీరు ఏ విధమైన వినికిడి సాధనం కలిగి వున్నప్పటికీ, మీరు ఆసాధనం విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటే దీర్ఘకాలం మీకు ఉపయోగపడుతూనే వుంటుంది. బాగా పనిచేసి.మీరు ఉపయోగించని సమయాలలో మీ వినికిడి పరికరాన్ని విద్యుత్ పరికరాలకు, అంటే ఫ్రిజ్ టెలివిజన్ మొదలైన వాటికి దూరంగా వుంచాలి.
  • అది మరీ ఉష్ణోగ్రత వున్న చోట, మరీ తక్కువ వేడి గల అతి చల్లని చోట వంచకూడదు.
  • దానిని పొడిగా వుంచండి. చెమట లేక నీరు వల్ల అది పాడయ్యే ప్రమాదం వుంది. రోజులో దానిని పదే పదే తీసి తడి వుంటే తుడి చేయాలి. ఈ పరికరాన్ని స్నానం చేయటానికి ముందు, ఈత కొట్టే ముందు, వర్షంలోను తీసి జాగ్రత్త చేయాలి. రాత్రిపూట సిలికాజెల్ (తడిపీల్చే పదార్థం) గల బాక్స్ లో వుంచాలి. వినికిడి పరికరాన్ని ఈ పరికరంపై సెంట్లు మొదలైనవి స్పే చేయకూడదు.

శుభ్రపరచటం

  • మెత్తని, పొడి బట్టను ఉపయోగించండి శుభ్రపరచటానికి. ఏ రకమైన క్లీనింగ్ ద్రవ పదార్థం వాడకూడదు.

చెవిలో పెట్టే భాగం (మోల్డ్)

  • రోజూ ఈ భాగానికి గులుగు (వేక్స్) అంటిందేమో చూసుకొంటూ వుండాలి.
  • ఈ భాగాన్ని వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తిరిగి ఉపయోగించే ముందు పూర్తిగా ఆరేటట్లు చూసుకోవాలి.

బ్యాటరీ

  • బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలంటే, పరికరం ఉపయోగించని సమయాలలో ఆఫ్ చేసి వుంచాలి.
  • బ్యాటరీని, ఎక్కువ సమయం ఉపయోగించకుండా వుంచే సమయాలలో బ్యాటరీని తీసేయాలి, బయటకు. బ్యాటరీని కూడా శుభ్రంగా వుంచాలి.
  • బ్యాటరీని అవసరం ప్రకారం మార్చండి. బ్యాటరీ అయిపోయిందో వందో చూసుకుంటూ వుండాలి. పరికరాన్ని ఎక్కువ శబ్దం వచ్చేలా తిప్పితే, ఈల శబ్దం వచ్చినటైతే బ్యాటరీ బాగానే వున్నట్లు అర్థం. అలా కాకుండా శబ్దంలేకుండా వున్నటైతే బ్యాటరీని మార్చవలసి వుందని అర్థం. అలాగే బ్యాటరీ కనుక తొందరగా అయిపోతున్నటైతే సాధారణ సమయం కన్నా ముందే, ఎవరి సహాయం అయినా తీసుకోండి. పరికరంలో ఏదైనా సమస్యకు అది సంకేతంగా తెలుసుకోవాలి.
  • బ్యాటరీలను చల్లగా, పొడిగా వుండే చోట వుంచాలి. బ్యాటరీ ఉష్ణోగ్రతను, గది ఉష్ణోగ్రతకు తెచ్చే కానే దానిని ఉపయోగించాలి.
  • అపుడపుడు పరికరాన్ని హియరింగ్ ఎయిడ్ క్లినిక్లో గాని, షాప్లోగాని పరీక్షించి చూపించుకోండి.

ఈ (హియరింగ్) వినికిడి పరికరాలకు మరమ్మత్తు అవసరం అవుతూ వుంటుంది. సాధారణంగా పెద్ద నగరాలలో మాత్రమే ఈ పరికరాల మరమ్మత్తు చేస్తారు. వినికిడి లోపం (డెఫ్) సంస్థలు వినికిడి శక్తి లేని (చెముడు గల) వ్యక్తులకు, ఈ పరికరాలను మరమ్మత్తు చేయటం లోను, చెవిలో అమర్చే భాగం (మోల్డ్)లను తయారు చేయటానికి చెవి ముద్రను తీసుకోవటంలోను శిక్షణను ఈయటం జరుగుతుంది.

పరిసరాలలో తిరిగేందుకు కర్రను ఉపయోగించటం

మీరు అంధులై వున్నా చూపులో parikaralu2.jpgలోపం వున్నా మీరు చేతి కర్రను ఉపయోగించటం వలన పరిసరాలలో తిరగటానికి, ముఖ్యంగా పరిచయం లేని ప్రాంతంలో తిరగటానికి మీకు ఒక విశ్వాసం కలుగుతుంది నడవటానికి. కర్ర పొడవు ఎక్కువగా వుండటం వలన మీ నడక వేగం పెరుగుతుంది. ఎదురుగా ఏమి వున్నదో కర్రతో తాకి అనుభూతిని పొందవచ్చు.

చేతికర్ర బలమైన కలపతోను, ఎక్కువ బరువు లేకుండాను తయారు చేయటం వలన రోజంతా సులభంగా చేతో పట్టుకు తిరగటానికి వీలుగా వుంటుంది. చేతో పట్టుకొనే కొనకాస్త లావుగా వుండి వంపుతో గాని, తిన్నగా కానివుంటాయి చేతి కర్రలు. కర్రకు మీ చేతో పట్టుకొనే చోట, ఒక తాడును మీ చేయి దూరేంత వదులుగాకట్టాలి. ఇలా కట్టటం వలన కర్ర మీ చేతిలో నుంచి పడిపోకుండా, పోకుండా వుంటుంది.

ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు రోజు, కర్ర పొడవునా తాకి ఎక్కడైనా పగుళ్ళు వుండటం, విరిగి వుండటం జరిగిందేమో చూసుకోవాలి. అవసరమైతే ఎవరి సహాయం అయినా అడగాలి, ఇందుకోసం.

మీ చక్రాల కుర్చీ (వీల్ చైర్) గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు

మీ చక్రాల కుర్చీ గురించిparikaralu3.jpg మీరు మంచి జాగ్రత్తలు తీసుకున్నటైతే, అది మీకు మొత్తగా నడుసూ (దొర్లుతూ) ఎక్కువ కాలం సేవను అందిస్తుంది. ఈ జాగ్రత్త కోసం మీకు కొన్ని ముఖ్యమైన మరమ్మత్తు పరికరాలు అవసరం. మీకు సాధారణమైన మార్గదర్శకంగా మీ వీల్చైర్ గురించి జాగ్రత్త తీసుకోవటంలో ఉపయోగపడతాయి. మీరు నివసించే ప్రాంతంలోని రహదార్లు, మార్గాలు సాఫీగా వుంటాయో, గతుకులు గా వుంటాయో దానిని బట్టి మీ చక్రాల కుర్చీ నిర్వహణ ఖర్చు వుంటుంది.

చక్రాల కుర్చీ (వీల్ చైర్) జాగ్రత్తకు అవసరమైన పనిముట్లు

 

parikaralu4.jpg

ఇంకా కావలసినవి

  • మధ్యస్థ బరువు గల parikaralu5.jpgమెషీన్ ఆయిల్ (యంత్రాల కదలికలకు వాడే తైలం)
  • జాజోబా చెట్టునుంచి తీనో మెత్తని మైనం లేదా గొర్రె వూలు నుంచి తయారు చేసే లేనోలిన్ లేదా కోకోవా చెట్టు వేసిన గింజల నుండి తయారు చేసిన వెన్న (మెత్తని మైనం), కొవ్వు వొత్తులకు ఉపయోగించే మైనం పెళుసుగా వుండటం వలన అది పనికి రాదు.

ప్రతి రొజూ

  • విల్ చైర్ చక్రానికి అంటిన ఏ మట్టినైనా తడిగుడ్డలో తుడిచి శుభ్రం చేయండి.
  • మీ వీల్ చైర్ ను (చక్రాల కుర్చీని) తడవనిచోట జాగ్రత్తగా వుంచండి. బురద, నీరు, మీ చక్రాల కుర్చీ ముందు, వెనుక చక్రాల బేరింగ్లలోనికి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోండి.

ప్రతివారం

  • మీ చక్రాల కుర్చీ టైర్లు అరిగిపోయాయో, బలహీనపడ్డాయో, పంక్చర్ అయ్యాయో వారం వారం చూసుకోవాలి. మేకు గాని, ముల్లగానిటైర్లో గుచ్చుకొని ఉంటే, మీరు ట్యూబ్ను సరిచేసుకోవటానికి సిద్ధపడేవరకు దానిని లాగటానికి ప్రయత్నించకండి. అవసరమైతే టైరును మార్చాలి. మీ కుర్చీకి సైకిలు టైర్లు ఉపయోగిస్తున్నటైతే సైకిల్షాపులో మరమ్మత్తు జరుగుతుంది. లేదా మార్చటం కూడా చేయవచ్చు. టైరు లోపల వుండే ట్యూబుకు పాబ్ వేయటం పంక్చర్కు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. సైకిలు దుకాణం వ్యక్తిని అడిగి చూసి నేర్చుకోవచ్చు
  • వెనుక చాక్రాలు సాఫీగా దొర్లుతున్నాయో లేదో చూసుకోవాలి. అవి ఆగుతూ ఎగిరిపడుతున్నా అసాధారణమైన శబ్దం చేస్తున్నా బాల్ బేరింగులు అరిగిపోయి వుండవచ్చు. మార్చవలసి వుండవచ్చు. వదులుగా అనిపించిన భాగాలను బిగించండి. పెద్ద రెంచ్లు కోసం మెకానిక్ దగ్గరకు వెళ్ళాలి. మీరు నట్లు బిగించిన తర్వాత, కొంచెం వదులు చేయాలి. సాఫీగా తిరగటానికి.
  • ముందున్న ఫోర్క్ లు ఒక వైపు నుంచి మరో వైపునకు తిరగకుండా వున్నటైతే, పుట్ రెస్టులలోకి అవి దిగి వున్నాయేమో చూసుకోండి. ఫోర్మంతా దడదడ కదులుతున్నటైతే పైన నట్టును బిగించండి. అటు తర్వాత, అది సులభంగా తిరిగేటందుకు కొద్దిగా వదులు చేయండి.
  • ముందు చక్రాలు ఫ్రీగా దొర్లనటైతే, వాటికి క్రొత్త బేరింగులు అవసరం అయి వుండవచ్చు. వాటిని ఒక వీల్ చైర్లు షాప్లో చూపించటం మంచింది.
  • బురదగాని, జుట్టుగాని నాలుగు చక్రాల మూలాలలో చిక్కుకొని వుంటే, ఒక తడిబట్టతో, కొన్ని చుక్కల ఆయిల్ వేసి శుభ్రం చేయాలి.
  • వెనుక వున్న పెద్ద చక్రాలలో వూచలను స్ఫోక్, రెంచ్ ని ఉపయోగించి సరిగా బిగించండి. ఏమైనా వూచలు వదులై వున్నటైతే బిగించండి. విరిగినవి వుంటే తొలగించి క్రొత్తవి వేయండి.

నెలనెలా

  • చక్రాల కుర్చీ ప్రేమ్కు మైనం పూయటం వలన శుభ్రం చేయటానికి సులభంగాను, తెరుచుకోవటం, ముడవటం కూడా సాఫీగా సులువుగా వుంటుంది.
  • చక్రం మధ్యన వుండే బాల్ బేరింగులు ఫ్యాక్టరీ సిల తో వుండవచ్చు. ఒక వేళ అలా లేనటైతే, వాటినిబయటకు తీసి కిరోసిన్తో శుభ్రపరచి, ఆరబెట్టండి. అపుడు మళ్ళీ కొత్త గ్రీజువేసి బిగించేయండి చక్రాలలో, బేరింగులలోనికి నీరు వెళ్ళినటైతే, తుప్ప పట్టటం వలన చక్రాలు మొత్తగా నడవవు.
  • చేతులు, కాళ్ళు ఆనుకొనే రెస్ట్ లు, మరియు చేతి రిమ్మలు, ఏమైనా గరిగా వున్నవిగాని, మొనతేలి కోసుకొనేలా వుండే అంచులు గాని వున్నటైతే, మృధువుగా అయ్యేలా ఆకురాయితో అరగతీయాలి.
  • కుర్చీకి వున్న స్ర్మూలు, బోల్టులు ఏమైనా వదులుగావున్నటైతే బిగించండి. కూర్చొనే సీట్లోను, చేర్లబడే వెనుక మరమేకులు బిగించుకొని చూసుకోవాలి. అలాగే పట్టుకొనే హ్యాండ్ రిమ్లు, ముందు వెనుక వుండే ఏక్సిల్స్, బ్రేకులు, ఎదుట వుండే చిన్న చక్రం, మరియు మలుపు తిప్పటానికి వుపయోగపడే చోటు (పివట్) అన్నీ ಬೌಲ್ಡಿಲು చూసుకోవాలి, బిగిసేలా, ముందుండే చిన్న చక్రాన్ని బిగించుకోవాలి గాని, మరీ గట్టిగా కాదు. గట్టిగా వుంటే ముందుకు నడుపుకోవటం కష్టమవుతుంది.
  • చక్రాల కుర్చీ ఫ్రేము ఎక్కడైనా పగిలి వుందో, రేకు రేగి వుందో చూసుకోవాలి. చిన్న పగులు ప్రేమ్ను విరిగేలా చేయవచ్చు. కొన్ని పగుళ్ళను వెల్డింగ్ చేసి మూసేయవచ్చు.

ప్రతి 4 నుంచి 6 నెలలకు

  • ఎక్స్-బ్రేస్ (ఒ- (బ్రేస్) యొక్క మధ్య మరియు అడుగు భాగాలకు, మధ్యస్థంగా వుండే బరువు గల మెషీన్ ఆయిల్ను పెట్టాలి. మిగతా మలుపు తిరగటానికి ఉపయోగపడే పాయింట్లకు (పివట్స్) కూడా ఆయిల్ పెట్టాలి.
  • సీటు కవరుకు ఉపయోగించిన ఫ్యాబ్రిక్ బాగా సాగిపోయినా, చినిగి, మరీ పీలికలుగా వ్రేలాడుతున్నటైతే క్రొత్తది మార్చుకోవటం చాలా ముఖ్యం. సాగిపోయిన, చినిగిన సీటు వల్ల ఒత్తిడి పండ్లు ఏర్పడే ప్రమాదం వుంది.
  • మీరు మెత్తని ఫోమ్ కుషను ఉపయోగిస్తున్నటైతే, అది స్ప్రింగు కదలికతో బాగా కదులుతుందో లేదో చూసుకోవాలి. లేనటైతే అందువల్ల కూడా ఒత్తిడి పుండు ఏర్పడే అవకాశం వుంటుంది.

ముఖ్యం

ముందుండే టైర్లు గట్టివైనా, గాలినింపేవి అయినా, వాటిని వీల్ ఛైర్ దుకాణంలోనే మార్పించాలి. ఒకవేళ మీ చక్రాల కుర్చీ విరిగినటైతే దానిని చక్రాల కుర్చీ (వీల్ చైర్) దుకాణంలోనే మరమ్మత్తు చేయించాలి. మీరున్న ప్రాంతంలో వీల్ ఛైర్దుకాణం లేనటైతే, §පීඒ షాపులో గాని ప్రేములవీ తయారు చేసే వర్కుషాపులో గాని మరమ్మత్తుకు సహాయం దొరకవచ్చు.

ఆరోగ్యానికి సాcజజ్జా భాష

ప్రపంచ వ్యాపితంగా చాలా ప్రాంతాల సమాజాలలో బధిరులు (వినికిడి శక్తిలోపించిన వారు) తమదైన ఒక సౌంజ్ఞా భాషను రూపొందించుకున్నారు. వారు ఆ భాష సౌcజ్ఞల ద్వారా, వినికిడి శక్తి గల వ్యక్తులంత వేగంగాను ఎదుటి వారితో సంభాషణ (తెలియజేయటం) చేయగలరు. ఇక్కడ చూపబడిన అటువంటి సౌcజ్ఞలు వివిధ దేశాలకు చెందినవి. ఒకే పదానికి, వేర్వేరు సౌcజ్ఞలను ఉపయోగించటం జరుగుతుంది. ఈ సౌCజ్ఞలను ఒక మార్గదర్శకంగా ఉపయోగించుకోండి. మీరు ఆరోగ్య కార్యకర్తగాని, కుటుంబ సభ్యులుగాని, సంరక్షకులుగాని అయినటైతే, మీ ప్రాంతంలో వున్న ఒక బధిర స్త్రీ ద్వారా వారు ఉపయోగించే సౌCజ్ఞలను నేర్చుకోండి. అవి ఎలా వుపయోగించాలి మొదలైనవి తెలుసుకున్నాక, ఇతర సౌCజ్ఞలను నేర్పించుకోండి. సౌCజ్ఞ భాష నేర్చుకోవటం వలన, మీ ప్రాంతంలో వుండే బధిర స్త్రీలందరికీ మంచి ఆరోగ్య సంరక్షణ లభించగలదు.

ఆరోగ్య కార్యకర్తలు తెలుసుకోవలసిన సాఁజ్ఞలు (సైన్స్)

బధిర స్త్రీలకు మంచి ఆరోగ్య సంరక్షణను ఇవ్వటం కోసం ఆరోగ్య కార్యకర్త తెలుసుకోవలసిన కొన్ని సౌCజ్ఞల ఉదాహరణలు ఇక్కడివ్వబడ్డాయి. ఈ సౌcజ్ఞలు వేర్వేరు దేశాలకు చెందినవైనా, మీకు తెలియటం కోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి, అందువలన మీకు ఇంకా మంచి ఆలోచనలు కలుగవచ్చు, వారికి ఉపయోగపడేలా, సౌcజ్ఞలు కొన్ని సందర్భాలలో చేతితో చేసే కదలికల ద్వారాను, మరికొన్ని సందర్భాలలో చేతి వ్రేళ్ళతో అక్షరాల ఉచ్చారణను సూచించటం ద్వారాను, విషయాన్ని బోధించటం జరుగుతుంది.

శరీరాన్ని చూపి చేసే సాcజ్ఞలు

నొప్పి ఎక్కడ కలుగుతుందో శరీర భాగాలను చూపి సూచించవచ్చు మీరు. ఉదాహరణకు పొత్తికడుపులో నొప్పి అని సూచించటానికి, ముందు నొప్పికి గల సౌCజ్ఞను చేసి, అపుడు సంబంధించిన పొత్తికడుపును చూపాలి వ్రేళ్ళతో

చేతి కదలికతో చేసే సాఁజ్ఞలు

parikaralu6.jpgఆరోగ్య సంరక్షణ జరిగే చోట్ల ఉపయోగించటం కోసం కొన్ని సౌCజ్ఞలను ఉదహరించటం జరిగింది ఇక్కడ. ఇవి చాలా వరకు చేతి కదలికలలో చేసేవే.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate