గాయపరచే సంఘటనల్ని అనుభవించే వ్యక్తి
తన ప్రాణానికి ముప్ప వస్తుందనే భయం లేక విపరీతమైన దుఃఖాన్ని కలిగించే సంఘటనలను గాయపరచే సంఘటనలు అని అంటారుః
- వ్యక్తిగత గాయం లేక ఆఘాతం. ఒకవ్యక్తిని గాయపరుస్తాననే బెదిరింపు, ఉదా. ఆ వ్యక్తిని మానభంగం చేస్తానని లేక అతనికి ప్రియమైన వ్యక్తిని చంపేస్తానని బెదిరింపు, నేరబాధితుడవడం, రోడ్డు ప్రమాదంలో చిక్కుకోవడంలాంటి సంఘటనలు.
- యుద్ధం, ఉగ్రవాదం. యుద్ధ బీభత్సం సైనికులకు, పౌరులకు కూడా గాయాల్ని కలగజేస్తుంది
- పెను ఉత్పాతాలు. విమాన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఒకేసారి ఎక్కువ మందికి గాయాల్ని కలగజేస్తాయి గృహహింసకు, మానభంగానికి గురయినవారిని, ఆత్మీయుల్ని కోల్పోయినవారిని సంబాళించే పద్ధతి ఈ అధ్యాయంలో వివరించ బడింది.
గాయం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది
రోడ్డు ప్రమాదంలో కాలు విరగడం లేక విస్ఫోటనంలో కాలడం వలన శారీరక గాయాలవొచ్చు. అలాంటి సంఘటనలు ఆ వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతియ్యొచ్చు. కేవలం ఆ భయంకర సంఘటనను చూసిన వారికి కూడా (రోడ్డు మీద మామూలుగా నడుస్తూ ప్రమాదాన్ని చూడడం) ఈ మానసిక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. గాయపడిన చాలామంది భావోద్వేగ ప్రతిస్పందనల్ని అనుభవిస్తారు. మెదడు మొద్దుబారడం, తలతిరగడం, భయం, నిద్ర సమస్యలు, ఆ సంఘటనను పదే పదే తలవడం, చిరాకు, పీడకలలు, ఏకాగ్రత నిలపలేక పోవడం మొదలైనవి వుంటాయి. ఒక గాయపరచే సంఘటనకు ఇది సహజమైన ప్రతిస్పందన, కొద్దికాలం ఇది కొనసాగుతుంది (రెండు నుండి నాలుగు వారాలు). కాని, కొంతమందికి ఆ సంఘటన తరువాత కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఈఅనుభవాలు కొనసాగుతాయి. అవి ఆ వ్యక్తి రోజువారీ పనులపై ప్రభావం చూపుతాయి, ఇది ఆల్కహాల్ వ్యసనం, ఇతరులతో సంబంధాలలో సమస్యలు మొదలైన వాటికి దారితియ్యొచ్చు. ఇది మానసిక వ్యాధి, దీనిని పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ అని (లేక పి టి ఎస్ డి) అంటారు.
పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ ఎప్పుడు గాయమంటే అర్థం శారీరకమైన దెబ్బకు మించినది? | |
పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ (పి టి ఎస్ డి) వున్న వ్యక్తులకు మూడు రకాల బాధలు వుంటాయి.
* పదే పదే ఆఆఘాతాన్ని అనుభవించడం. ఆఘటన తాలూకు దృశ్యాలు, పీడకలలు, ఫ్లాష్ బాక్స్ (అప్పుడే, ఆ సంఘటన ప్రస్తుతం జరుగుతున్నట్లు మళ్ళీ మళ్ళీ భావించడం)
* తప్పించుకోవడం. ఆ ఆఘాతాన్ని గుర్తుకు తెచ్చే సందర్బాల్ని తప్పించు కుంటుంది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాల్ని గుర్తుకు తెచ్చుకోలేదు, మనుషులకు భావోద్వేగపరంగా దూరమయినట్లు భావిస్తుంది.
ఎక్కువ మెలకువ. దీని అర్ధం ఎక్కువగా మేల్కొని వుండడం. సరిపడా నిద్రపోక, ఎప్పుడూ చికాగ్గా వుండడం, ఏకాగ్రత నిలపలేకపోవడం, సులభంగా భయభ్రాంతురాలవడం. పేనిక్ ఎటాక్స్ కూడా రావచ్చు.
వీటితోపాటు పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ ఉన్న చాలామందికి డిప్రెషన్ వస్తుంది, జీవితంపై ఆసక్తి పోతుంది, అలసట, నెప్పులు, తీపులు ఉంటాయి, ఆత్మహత్య గురించిన ఆలోచనలు ఉంటాయి. వీరికి పనిచెయ్యడంలో సమస్య, ఇతరులతో సంబంధాలలో సమస్య, చిన్న పిల్లల్లో ఐతే, చదువుకోవడంలో సమస్య ఉంటాయి.
|
|
హింసకు గురయిన వారిలో కొంతమందికి మానసిక వ్యాధి ఎందుకు వస్తుంది
ప్రాణం పోవడానికి దారితీసిన సంఘటనలు, లేక ప్రాణంతీస్తానని బెదిరించిన సంఘటనలు పోస్ట్ ట్రమాటిక్ ప్రైస్ డిజార్జర్కి তে০6 తీస్తాయి. మనుషుల మూలాన కలిగే విపత్తులు, ఉగ్రవాదం ఫలితంగా జరిగే హింస ప్రకృతిసహజంగా జరిగే విపత్తులకంటే ఎక్కువగా గాయపరుస్తుంది, ఎందుకంటే అది పూర్తిగా వివేక శూన్యమైనచర్య ఇలాంటి సంఘటనలలో మరణించగా మిగిలినవారు న్యూనత పడుతూ ఇతరులను రక్షించడానికి తగినంతగా చెయ్యలేకపోయామని తమను తాము నిందించుకుంటారు, ఇది స్వల్పకాలం వుంటుంది. సాంఘిక ఆసరా, సామాజిక బంధాలను ఎంత ఎక్కువగా కోల్పోతే (యుద్ధాలలో వలె) అంత ఎక్కువగా పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ ప్రమాదం వుంటుంది.
ఈ సమస్యనెలా సంబాళించడం
ఆఘాతాన్ని అనుభవించిన వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు
- ఏమయింది? ఆగాయపరచే సంఘటనను స్పష్టంగా వివరించడానికి అతన్ని ప్రోత్సహించండి. అది ఎలా ప్రారంభమయింది? మీకేమయింది? ఇంకా ఎవరున్నారు? దానితరువాత వెంటనే మీరేమి చేసారు? సంఘటన గురించి మీరొక అవగాహనకు రావడానికి ఇది తోడ్పడుతుంది. ఆసంఘటన గురించి మాట్లాడడం వలన అతని మనసులోని భారం తగ్గుతుంది.
- ఇప్పుడెలా వుంది మీకు? అతను ఆఘాతానికి గురయి ఎంత కాలమయిందో దానిమీద అతని భావోద్వేగ ప్రతిస్పందన ఆధారపడుతుంది.
- ఎవరితో మీరు మీ భావాల్ని పంచుకోగలుగుతారు? సాంఘిక ఆసరా వున్నవారు త్వరగా కోలుకుంటారు.
వెంటనే ఏమి చెయ్యాలి?
- గాయపరచే సంఘటనల్ని తట్టుకోవడానికి చాలా ముఖ్యమైనమార్గం ఇతరులతో దానిగురించి చెప్పడం. ఆవ్యక్తిని ఏమి జరిగిందో చెప్పడానికి ప్రోత్సహించండి.
- ఆవ్యక్తితో అతని ప్రతిస్పందనలు సహజమని, వెర్రితనం కాదని నచ్చజెప్పాలి.
- అతను నమ్మే ఇతర వ్యక్తులతో, ఆ సంఘటన నుంచి బ్రతికి బయటపడ్డ వారితో సహా, అతను మాట్లాడడానికి ప్రోత్సహించండి. ముఖ్యంగా, యుద్ధం నుంచి తప్పించుకుని బయటపడ్డ శరణార్డులు వంటి ఎక్కువ మందిపై ఆ సంఘటన ప్రభావం వుంటే, బ్బంద చర్చలు సహాయకారిగా వుంటాయి .
- ఆసంఘటనను గుర్తుకుతెచ్చే సందర్భాలను తప్పించుకోకుండా వుండడానికి అతన్ని ప్రోత్సహించండి.
- కొద్దిరోజులపాటు అతన్ని ఏకాంతంగా వుండనివ్వకండి. అతనిపై శ్రద్ధ చూపే బంధువులు, స్నేహితులతో కలిసి వుండేలా జాగ్రత్త తీసుకోండి.
- పేనిక్ ఎటాక్స్, నిద్ర సమస్యలు, అలసటలాంటి లక్షణాలు వుంటే వేరే చోట వివరించబడిన చర్యల్ని తీసుకోండి.
- ఒకవేళ ఆవ్యక్తికి చాలా తీవ్రమైన కష్టాలు వుంటే నాలుగు వారాల వరకు నిద్రమాత్రల్ని ఇవ్వొచ్చు.
- గాయాల్ని అనుభవించిన వ్యక్తులకు ఒక కోర్సు ఏంటీడిప్రెసెంట్స్ని ఇవ్వొచ్చు.
వేరే చోటకు ఎప్పుడు పంపాలి?
కొన్ని ప్రదేశాలలో, గాయపడిన వారికి ప్రత్యేక సేవలు లభిస్తాయి. యుద్ధం, పార సంఘర్షణలు జరుగుతున్నప్పుడు వీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది.
తరువాత ఏమి చెయ్యాలి?
వీలయినంత ఎక్కువ కాలంపాటు, లేక ఆమె తనకు సహాయకారిగా వుంటుందని తలచినంత కాలం వరకు, అమెతో అప్పుడప్పుడు మాట్లాడుతూ వుండండి. మొదట్లో, ఒక నెలవరకు వారానికొక సారి కలవండి. ఆమె క్రమేపీ కోలుకుంటున్న చిహ్నాలు కనబడితే, ఆమె పూర్తిగా కోలుకుంటుందని మీరు నమ్మొచ్చు. కాని పరిస్థితి దిగజారుతున్న చిహ్నాలు కనిపిస్తే, ఆమెతో చాలాకాలంపాటు తరచుగా మాట్లాడుతూ వుండండి, ఒక కోర్సు ఏంటీడిప్రెసెంట్స్ని కూడా ప్రయత్నించవచ్చు. లేక వేరేచోటకు నిపుణుల సహాయం కోసం పంపండి.
గాయాల్ని అనుభవించేవారిని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు |
- హింస లేక మానభంగం, నేరచర్య బాధితులవడం, యుద్ధంలోభాగమవడం, ఉగ్రవాద హింస, లేక పెను ప్రకృతి విపత్తులు గాయపరచే సంఘటనలలో భాగం. కొంతమందికి పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ (పి టి ఎస్ డి) అనే మానసిక వ్యాధి రావచ్చు.
- పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ ప్రధాన లక్షణాలు ఆగాయాన్ని అనేక సార్లు అనుభవించడం, ఆగాయాన్ని గుర్తు చేసే ప్రదేశాల్ని వ్యక్తుల్ని తప్పించుకోవడం, లేక భయంగా, ఉద్వేగంగా వుండడం. ఆసంఘటన గురించి, తన అనుభూతుల గురించి మాట్లాడడం కోలుకోవడానికి తోడ్పడుతుంది. కొంతమందికి ఏంటీడిప్రెసెంట్స్ సహాయపడతాయి.
|
భర్తతో దెబ్దలు, తిట్లు తింటున్న స్త్రీ
గృహహింస అంటే కుటుంబంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హింసించడం. హింసననుభవించే వారిలో ఎక్కువమంది స్త్రీలవడం వలన ఈ విభాగం తమ పురుష భాగస్వామితో దెబ్బలు తింటున్న స్త్రీల ప్రత్యేక సమస్యల్ని చర్చిస్తుంది. పురుష భాగస్వామి అంటే ఆమె భర్త, లేక వివాహం లేకుండా ఆమెతో లైంగిక లేక సన్నిహిత సంబంధంవున్న పురుషులు. వేధింపు అనే పదం శారీరక హింస ఒక్కటే హానికరం కాదని గుర్తిస్తుంది. భావోద్వేగపరమైన వేధింపు చాలా సాధారణంగా జరిగేదే కాక స్త్రీలకు చాలా హానికరమైనది .
స్త్రీల పై హింస ఎందుకు హానికరం
స్త్రీలపై హింస సర్వసాధారణం. కొన్ని ప్రదేశాలలో ప్రతి ముగ్గురిలో ఒకరు భర్త చేత తన్నులు తింటున్నారు. సమాజంలోని అన్నివర్గాలలో ఈ హింస కొనసాగుతోంది. ఇది స్త్రీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూంది. మరీ తీవ్రమైన సందర్భాలలో అది ఆమె మరణానికి కూడా దారితీస్తుంది. చాలామంది బాధితులు గృహహింస వలన కలిగే అనేక ఆరోగ్య సమస్యలకు సహాయం కోసం వస్తారు. అందువల్లే స్త్రీ లపై హింస ఒక ముఖ్యమైన సామాజిక ఆరోగ్య సమస్యగా వుంది.
గృహహింస బాధితులైన స్త్రీలు ఏలక్షణాలతో ఆరోగ్య కార్యకర్త దగ్గరకు వస్తారు
స్త్రీలు అరుదుగా తాము దెబ్బలు తింటున్నామని బయటకు చెప్తారు. వీరు తరచుగా చెప్పే బాధలుః
- హింస ప్రత్యక్ష ఫలితాలు, ఉదాహరణకు, కోసుకుపోవడం, కమిలిపోవడం, ఇతర గాయాలు
- హింసించే పురుషుడితో కలిసి బ్రతకడం కారణంగా కలిగే భయం, అసంతోషం వలన వచ్చే బాధలు-హింస వలన మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం-సాధారణంగా డిప్రెషన్, ఏంగ్డయిటీ, ఆరోగ్య కార్యకర్తలకు శారీరక బాధలు కనపడినంత స్పష్టంగా కనపడవు.
- లైంగిక వ్యాధులు, గర్భస్రావాలు లాంటి లైంగిక సమస్యలు.
| స్త్రీలను హింసించే మార్గాలు | |
|
వెక్కిరించడం, వేధించడం, అవమానపరచడం ఉదాహరణకు, అసహ్యకరమైన మాటలతో తిట్టడం, ఆ స్త్రీ బంధువుల్ని స్నేహితుల్ని దూషించడం.
బెదిరించడంఉదాహరణకు, ఆ స్త్రీని చంపుతానని, హాని కలిగిస్తానని లేక ఆమె తనను వదిలేస్తే తనకు తాను హాని చేసుకుంటానని (ఉదా. అత్మహత్య చేసుకుంటానని) బెదిరించడం
ఆమెను లైంగిక సంపర్కం కోసం బలవంత పెట్టడం.ఆ స్త్రీ అతన్ని పెళ్ళి చేసుకుంది కాబట్టి అతను కోరినప్పుడల్లా ఆమె సెక్స్కి అంగీకరించాలి అని కొంతమంది అనుకుంటారు. ఇది నిజంకాదు.
|
|
|
ఇంటి వనరుల్ని అదుపు చెయ్యడం ద్వారా ఉదాహరణకు, ఆమెకు డబ్బు ఇవ్వకపోవడం, హాస్పటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోవడానికి అనుమతించకపోవడం లేక ఆమె పని చెయ్యడానికి ఒప్పుకోకపోవడం.
ఆమెను బలవంతంగా తననుతాను ఒంటరిని చేసుకునేలా చెయ్యడంఉదాహరణకు, ఆమెకు తన స్నేహితుల్ని కలవడానికి, బయటకు వెళ్ళడానికి అవకాశాన్నివ్వక పోవడం
శారీరక హింసద్వారా చెంప దెబ్బ కొట్టడంనుంచి గుద్దడం, కాలితో తన్నడం వరకు. మరీ తీవ్రమైన సందర్భాలలో ఆపురుషుడు ఆయుధాన్ని ఉపయోగించవచ్చు, చివరకు చంపడానికి ప్రయత్నించనూవచ్చు.
|
|
|
|
|
కొంతమంది తమ భాగస్వామిని ఎందుకు కొడతారు లేక వేధిస్తారు
ఈప్రశ్నకు సులభమైన జవాబు లేదు కొంతమంది పురుషులు తన భార్యను ఎందుకు కొడతారంటే వారు సంఘర్షణను తగ్గించుకోవడానికి అది ఆమోదించబడిన చర్య అని నమ్ముతారు. అతను తన తండ్రి తన తల్లితో అలాగే వ్యవహరించడం చూసి ఉండొచ్చు. ఆడవాళ్ళను ఎక్కడుంచాలో అక్కడుంచడానికి హింస ఒక సాధనంగా మారింది. ఐనప్పటికీ పురుషాధిక్యం ఒక్కటే ఏకైక కారణం కాదు, ఎందుకంటే స్త్రీలు కొంత సమానత్వాన్ని సాధించిన సమాజాల్లో కూడా స్త్రీలపై హింస సర్వసాధారణంగా వుంది. నిజానికి భార్యల్ని కొట్టె పురుషులు కుటుంబం బయట సంబంధాలలో అంత దూకుడుగా వుండరు.
హింసను దాదాపుగా స్త్రీలపైనే అమలు చేస్తున్నప్పటికీ కుటుంబంలో ఇతరులపైనకూడా, చిన్నపిల్లలు, వృద్దులు, పురుషుల మీదకూడా, అమలు చేయబడుతుంది. హోమో సెక్సువల్ లేక స్వలింగ సంపర్కులలో పురుషుడు తనభాగస్వామియైన మరొక పురుషుడిపై, స్త్రీ తన భాగస్వామియైన మరొక స్త్రీపై హింసాత్మకంగా ప్రవర్తించవచ్చు. అలా, హింసకు ప్రధాన కారణం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నిహిత భావోద్వేగ సంబంధాల స్వభావం. కీలకమైన అంశం “అధికారం, అదుపు"https://static.vikaspedia.in/media_vikaspedia/te/images/health/c2ec3ec28c38c3fc15-c35c26c4dc2fc41c21c41-c32c47c28c3fc1ac4bc1f/7.4a.png"invisible">
పురుషులు స్త్రీలనెందుకు కొడతారు? భ్రమలు, నిజాలు |
|
|
స్త్రీలు హింసాత్మక సంబంధాలలో ఎందుకు ఉంటారు? |
స్త్రీలు తమను హింసిస్తున్న భర్తను ఎందుకు విడిచి పెట్టరు?
- డబ్బులేదు, వెళ్ళడానికి చోటు లేదు. ఆమె తన ఆర్థిక పరిస్థితిలో చిక్కుకుపోతుంది. ఆమె అతనిని విడిచి పెడితే వెళ్ళడానికి ఇల్లు లేదు, డబ్బులేదు.
- తండ్రి లేకుండా పిల్లలెలా బ్రతుకుతారు, ఆమెకు పిల్లలుంటే వారి భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది.
- నేను వెళ్ళిపోతే అతనేంచేస్తాడు? తను విడిచి పెడితే అతనేమి చేస్తాడోనని భయం. కొంతమంది భర్తలు తన భార్యను చంపుతానని లేక తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తారు.
- నేను అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇతరులేమి అనుకుంటారు. ఆమెకు చాలా తక్కువ సాంఘిక ఆసరా వుంటుంది. కొంతమంది స్త్రీలు తాము ఎదుర్కొంటున్న హింస గురించి చెస్తే వారి స్వంత కుటుంబసభ్యులే తిరస్కరిస్తారు.
- పరిస్థితుల్ని మెరుగు పరచడానికి నేను ప్రయత్నిస్తాను. కొంతమంది హింసకు తామే బాధ్యులమని అనుకుంటారు. పరిస్థితిని మెరుగు పరచుకోవడానికి తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నించాలని అనుకుంటారు.
- వివాహమంటే ఇదే. కొంతమంది స్త్రీలు పురుషుడితో కలిసి బ్రతకడంలో హింస సహజమేనని అనుకుంటారు. తమ తల్లి, అక్క చెల్లెళ్ళు దెబ్బలు తినడాన్ని చూసిన స్త్రీలు మరీ ఇలా అనుకుంటారు.
|
న్యాషా కథ: హింసవలయం | |
తన 17 ఏళ్ళ వయసులో న్యాషా తరిసాయిని పెళ్ళి చేసుకుంది. పెళ్ళయిన దగ్గర్నుంచి తరిసాయి ఆమె మీద అరవడం మొదలు పెట్టాడు. మొదట పెళ్ళికి ముందు అంత ప్రేమగా ఉన్న అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని ఆమె కలవర పడింది. అతనికి కోపం రావడానికి - - కారణాలు చాలా చిన్నవి: ఒకరోజు భోజనం బాగా లేదని, మరొక రోజు అతనికి - తాగడానికి ఎక్కువ వుంటే, ఇంకోరోజు పని చేసేచోట అసంతోషం. న్యాషా తన అక్కతో మాట్లాడింది, ఆమె ప్రతి సంసారంలో ఈకోపం సహజమేనని ఓదార్చింది. కాని కాలం గడిచినకొద్దీ తరసాయి కోపం ఇంకా ఎక్కువయింది. ఒక రోజు న్యాషా బజారు నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. తరిసాయికి చాలా కోపం వచ్చింది. అతను ఆమె మంచి భార్య కాదని నిందించాడు, పరాయి మొగవాడితో తనభార్యకు అక్రమ సంబంధం వుందని ఆరోపించాడు. న్యాషా క్షమాపణ చెప్పింది, తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పింది. కాని ఇది తరిసాయి కోపాన్నింకా ఎక్కువ చేసింది. అతనామె చెంపను ఛెళ్ళుమనిపించాడు. న్యాషా నిశ్చేష్టురాలయింది. అతనామెను కొట్టడం ఇదే మొదటిసారి. ఆమె తనగదిలోకి పరుగెత్తికెళ్ళి ఏడ్చింది. తరిసాయి క్షమాపణ చెప్పాడు. కాని అది మళ్ళీ, మళ్ళీ జరిగింది. కొట్టడం రోజువారీ కార్యక్రమం అయింది. తీవ్రంగా కొట్టాక తరిసాయి ఏడుస్తాడు, క్షమాపణ వేడుకుంటాడు. ఆమె తనను విడిచి వెళ్ళిపోతే చచ్చిపోతానని బెదిరిస్తాడు. ఈ నిందలు, బెదిరింపులు న్యాషాను స్నేహితులతో కలవకుండా చేసాయి, ఆమె ఒంటరిదయి పోయింది. ఆమె అతనితో లైంగిక కలయికను ఆనందించలేకపోతోంది. ఒక రోజు తరిసాయి సెక్స్ కావాలనుకున్నప్పుడు న్యాషా తిరస్కరించింది. అతను ఉగ్రుడయిపోయాడు. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టాడు. కొట్టడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమెనతను మానభంగం చేసాడు. మరునాడు ఉదయమే న్యాషా విషంతాగి అత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఆమె హాస్పటల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆరోగ్య కార్యకర్తకు ఈ హింస గురించి తెలిసింది. అప్పటికి న్యాషా తరిసాయిని పెళ్ళిచేసుకుని 12 ఏళ్ళు గడిచాయి.
|
|
గృహ హింసను గుర్తించడమెలా
చాలామంది ఆరోగ్య కార్యకర్తలు గృహ హింస విషయంలో తాము చెయ్యగలిగింది ఏమీ వుండదని భావించడం
వలన ఎవరినైనా గృహహింస గురించి అడగడానికి సంశయిస్తారు.కొంతమంది హింస ఆరోగ్య సమస్య కాదని నమ్ముతారు. కాని, మురికి తాగునీరును తాగడమెలా ఆరోగ్య సమస్యో అలానే హింసకూడా ఆరోగ్య సమస్యే. హింస గురించి వున్న అజ్ఞానం ఆస్త్రీకేవిధంగానూ ఉపయోగపడదు. ఒక నిబంధనగా ఏప్రీ ఇంట్లోనైనా హింస జరుగుతూందని మీరు భావిస్తే దానిగురించి ఒక సులభమైన ప్రశ్నను అడగండి. ఈ క్రింది బృందాలలో వారిని హింస లేక వేధింపు గురించి తప్పనిసరిగా ప్రశ్నించండి.
- ఏ స్త్రీ యైనా దీర్ఘకాలంగా నిద్ర సమస్యలు, అలసట మొదలైన వాటితో బాధపడుతూ వుంటే;
- గర్భవతి;
- వివరించలేని గాయాలతో వచ్చిన స్త్రీలు:
- గర్భస్రావాలు లేక గర్భవిచ్చిత్తి అయిన స్త్రీలు;
- ఆత్మహత్య ఆలోచనలు వున్న లేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వైకల్యం(శారీరక లేక మానసిక) ఉన్న స్త్రీలు;
- ఒక పురుష భాగస్వామి స్త్రీ మీద అతి శ్రద్ధను చూపుతూ ఆమెను మీతో ఒంటరిగా విడవకుండా వుంటే;
జననాంగ సమస్యలు ఉన్న స్త్రీలు
ఈ సమస్యనెలా సంబాళించడం
స్త్రీ ని అడగ వలసిన ప్రశ్నలు
- మీరు, మీ భర్త పోట్లాడుకుంటారా లేక వాదించుకుంటారా; ఎంత తరచుగా? దేని గురించి? చాలామంది భార్యాభర్తలు వాదించుకోవడం సామాన్యం కనుక ఇది చాలా సులభమైన ప్రశ్న
- మీ భర్త మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? లేక కొడతానని బెదిరించాడా? కొడతానని బెదిరించడం కొట్టడం కంటే భయంకరంగా వుంటుంది.
- కొడితే, మొదటిసారి ఎప్పుడు కొట్టాడు? అప్పటినుండి ఎంత తరచుగా అతను మిమ్మల్ని కొట్టాడు? ఇటీవల మరీ తరచుగా కొడుతున్నాడా? సమయం గడచిన కొద్దీ తీవ్రరూపం దాలుస్తున్న హింస, తక్షణ చర్యలు తీసుకోకపోతే, చాలా తీవ్రమైన హానిని కలగజేస్తుంది. మీరు భరించిన అత్యంత తీవ్రమైన గాయం ఏమిటి? అతనెప్పుడైనా ఆయుధాన్ని ఉపయోగించాడా లేక చంపుతానని బెదిరించాడా? ఎముకలు విరగడంలాంటి తీవ్రమైన గాయాలతో బాధపడినవారికి భవిష్యత్తులో తీవ్రమైన శారీరక గాయాల ప్రమాదం వుంటుంది.
- ఈ పరిస్థితి మీ మనోభావాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఏంగ్డయిటీ, డిప్రెషన్ గురించి ప్రశ్నల్ని అడగండి. ఆత్మహత్య పరమైన ఆలోచనల గురించి ప్రత్యేకంగా అడగండి.
- ఈ హింసను ఎలా తట్టుకుంటున్నారు? మీరెవరితోనైనా ఈవిషయం గురించి చెప్పారా? ఎవరితో? ఆ స్త్రీకి ఉన్న సాంఘిక ఆసరా, ఆమె హింసను తట్టుకునే విధానాలను గుర్తించండి. ఆమె ఆల్కహాల్ని లేక నిద్ర మాత్రల్ని వాడుతూందేమో తెలుసుకోండి. పిల్లల సంగతేంటి? పిల్లలపై కూడా హింస జరుగుతూంటే, వారితో మాట్లాడటానికి ఏర్పాటుచేసుకోండి.
- మీ పరిస్థితిని మార్చుకోవడానికి మీరేమి చెయ్యాలని అనుకుంటున్నారు? ఆమె విడిపోవాలనుకుంటూంటే, ఆమె ఎవరితో మాట్లాడిందో కనుకోండి. విడిపోవడం గురించి ఆమె కలవరాలేమిటి? ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి వుంటుంది? మీ ప్రదేశంలో స్త్రీల కోసం షెల్టర్స్ లేకపోతే ఇది మరీ .
మీ భర్త నాతో మాట్లాడడానికి వస్తాడా? చాలా కేసుల్లో అతను బహుశా రాడు, కాని అడిగితే నష్టంలేదు.
కుటుంబ సభ్యుల్ని లేక స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు
- ఆమె ఏమి చెయ్యాలని మీరు భావిస్తున్నారు? ఇది ఆమె సన్నిహిత బంధువుల అభిప్రాయాల సూచననిస్తుంది. వారు ఆమె తీసుకునే నిర్ణయాలలో ముఖ్యమైన పాత్రను పోషించ గలుగుతారు.
- ఆమె ఇల్లు విడిచి బయటకు రావాల్సివస్తే మీఇంట్లో వుండడానికి ఆహ్వానం ఉంటుందా? లేక మరెవరితోనైనా వుంటుందా?
ప్రత్యేక ఇంటర్వ్యూకు సూచనలు | |
- కోతలు, కముకు దెబ్బలలాంటి గాయాల చిహ్నాలేమైనా వున్నాయేమో చూడండి.
- అడగడానికి భయపడకండి. చాలామంది స్త్రీలు తమంతట తాము ఈవిషయాన్ని ఎత్తడానికి భయపడతారు లేక మొహమాటపడతారు కనుక మీరు హింసగురించి అడిగితే ఊరట చెందుతారు. మీరా విషయం గురించి చాలా విధాలుగా అడగొచ్చు. ( బొమ్మలు)
- హింస ఇబ్బందిని కలగజేసే విషయం కనుక దానిని ఆమెతో ఏకాంతంగా చర్చించండి. ఒకవేళ బంధువులు లేక స్నేహితులు అందుకు ఇష్టపడకపోతే, మీరామెను పరీక్ష చెయ్యాల్సిన అవసరం వుందని, అందుకు ఆమె ఒక్కతే ఉండాలని చెప్పండి.
- ఆమె ఏ బంధువులతో తనకు భద్రత వుంటుందో చెప్పేవరకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కుటుంబసభ్యులెవరూ లేకుండా వుంటే మంచిది.
- హింస గురించి చర్చ చాలా సమయం తీసుకుంటుంది. సమాచారం తెలుసుకోవడానికి తొందరపడకండి.
- ఎవరో ఒకరి పక్షం చేరి మాట్లాడకండి. సమస్యకు పరిష్కారాన్ని సూచించే ముందు జాగ్రత్తగా వినండి
- ఆమె అతని నుండి విడిపోవాలనుకున్నా అతనితోనే కలిసి వుండాలనుకున్నా ఆమె నిర్ణయం సరైనదా, కాదా అనే తీర్పును ఇవ్వకండి.
- ఆమెనా పరిస్థితి నుంచి రక్షించాలని తొందర పడకండి.
- హింసిస్తున్న వ్యక్తి పై కోపగించకండి.
|
|
|
|
వెంటనే ఏమి చెయ్యాలి?
- ఆ స్త్రీ వివరాలను, శారీరక గాయాలను స్పష్టంగా నమోదు చెయ్యండి. ఆమె తన భాగస్వామి ఏమి చేసాడని చెప్పిందో ఆ వివరాలను (ఉదాహరణకు ఆమె "తన భాగస్వామి ఇనప మూకుడుతో కనీసం ఆరుసార్లయినా కొట్టాడని" చెప్పింది) యథాతథంగా నమోదు చెయ్యండి.
- ఏమైనా గాయాలుంటే అవి ఏరకంగా వున్నాయో నమోదు చెయ్యండి, (ఉదా. " కుడి భుజం మీద 2-3 సెం. మీ. ల కముకుదెబ్బ"). ఇలా నమోదు చెయ్యడం పోలీస్ కేసు అయినప్పుడు ఉపయోగకరంగా వుంటుంది.
- కొంతమంది తమ గురించి తాము ప్రతికూల భావాలేర్పరచుకుంటారు. హింసకు ఆమె బాధ్యురాలు కాదని నమ్మకం కలిగేలాగా చెప్పండి.
- ఆస్త్రీకి డిప్రెషన్, లేక పోస్ట్ట్రమాటిక్ సైస్ డిజార్డర్ లక్షణాలు ఉన్నట్లయితే, వాటికి తగిన విధంగా చికిత్స చెయ్యండి. డిప్రెషన్ ఎక్కువగా వుండి, కౌన్సిలింగ్కి నయంకాకపోతే, ఏంటీడిప్రెసెంట్స్ని ప్రయత్నించండి.
- ఆమె తన భర్తతో కలిసివుండాలా లేదా అనే విషయాన్ని మీరు నిర్ణయించగూడనప్పటికి హింస తీవ్రంగా వున్నప్పుడు ఆమెకు కలగగల ప్రాణాపాయం విషయంలో మీకు వున్న కలవరాల్ని ఆమెతో పంచుకోండి. *ಅమె భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఆమె జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల్ని కూడా భాగస్వాముల్ని చెయ్యండి. వారామెకు నిజమైన హితైషులై వుండాలి.
- హింసకు గురయిన స్త్రీలకు న్యాయపరమైన సమస్యలు వుంటే, లేక పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలనుకుంటూంటే, ఆమెను సంబంధిత అధికారుల దగ్గరకు పంపండి. పోలీసులు అంత శ్రద్ధగా విని స్పందించే అవకాశం తక్కువగా వుంటుంది కనుక ఆమె ఆరోగ్య అంశాల గురించి రాసి పంపిస్తే ఉపయోగకరంగా వుంటుంది.
- మీకు హింసకు గురయిన స్త్రీల న్యాయపరమైన అంశాల గురించి తెలిసి వుంటే ఆసమాచారాన్ని ఆమెకు తెలపండి. మీకు తెలియకపోతే మీ సహోద్యోగిని సంప్రదించండి లేక సపోర్టు గ్రూపు దగ్గరకు పంపండి. కొన్ని ప్రదేశాల్లో న్యాయమూర్తులు ఆపరుషుడిని ఆమెదగ్గరకు రాకుండా లేక ఆమెకు మనోవర్తిచెల్లించేలాగా ఆజ్ఞలివ్వగలరు.
- ఒకవేళ మళ్ళీ హింస జరిగినట్లయితే ఆమె ఏమి చేస్తుందో చర్చించండి. తక్షణం చెయ్యగలిగిన పని పరిస్థితి ప్రమాదకరంగా మారుతూందని గుర్తించి వెంటనే ఆగదినుండి బయటకు వచ్చేయడం. దీర్ఘకాలానికి ఏమి చెయ్యాలో ఉన్ல் నిర్ణయించుకునేందుకు సహాయ పడండి. ఆమె తన భద్రత గురించి చేసుకోగల ఏర్పాట్లు ఇవిః
- ఆశ్రయం పొందేందుకు ఆమె ఎక్కడికి వెళ్ళగలదో ఆలోచించండి, ఉదా. పొరుగువారు(అత్యవసర పరిస్థితిలో అక్కడ ఆమెను ఆహ్వానిస్తారో లేదో ఆమె ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి)
- ఇంట్లో ఆయుధాలుంటే, వాటిని దాచేయండి;
- తరువాత అవసరపడితే వుండడానికి కొంత డబ్బును ఆదా చెయ్యండి;
- రేషన్ కార్డు లేక వివాహ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన పత్రాల కాపీలను ఇతరులెవరి దగ్గరైనా దాయండి;
- ఆమెను బెదిరించినప్పుడు సహాయం కోరాలనుకుంటే పిల్లలకు లేక బంధువులకు తెలిసేలాగా ఒక కోడ్ పదాన్ని రూపొందించుకోండి;
- మీ కమ్యూనిటీలో స్త్రీలకు సహాయపడగల వనరుల గురించి సమాచారాన్నివ్వండి.
- స్త్రీలకు సహాయపడడానికి మరింత సమాచారం కొరకు మనకు డాక్టర్ లేనిచోట" పుస్తకం
- ఎప్పుడు వేరేచోటకు పంపాలి?
- ఆమె ప్రాణానికి అపాయం వుండి, ఆమెకు వెళ్ళడానికి చోటు లేకపోతే, బహుశా హాస్పటలే ఆమెకు సురక్షితమైన ప్రదేశం.
తరువాత ఏమి చెయ్యాలి?
- వివాహ కౌన్సిలింగ్లో భర్తను కూడా భాగస్వామిని చెయ్యండి.
- స్త్రీని నిర్ణీత వ్యవధిలో చూడండి. డిప్రెషన్కి చికిత్స చేస్తూ వుంటే, కనీసం వారానికొకసారయినా చూడండి.
- ఆమె భర్త మారడానికి నిరాకరిస్తూ వుండి ఆమె అతన్ని విడిచి పెట్టలేని పరిస్థితిలో వుంటే దానిని పరిష్కరించడం చాలా కష్టం. అతనిని మార్చే ప్రయత్నాన్ని ఎప్పుడూ మానకండి (క్రింద చూడండి). కొన్నిసార్లు వేరేకారణంతో అతను తనంత తాను మీదగ్గరకు రావచ్చు. ఆసమయంలో మళ్ళీఈ ఈఅంశాన్ని ప్రస్తావించండి.ఈలోపు ఆస్త్రీకిగల ఈక్రింది ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించవచ్చు :
- పోలీస్కి ఫిర్యాదు చెయ్యండి (కొంతమంది పురుషులు పోలీసుల ప్రవేశంతో వెనక్కు తగ్గుతారు).
- భర్తమీద ఒత్తిడి పెడతారనే ఆశతో ఈవార్తను దగ్గరి, దూరపు బంధువులందరికీ తెలియజెయ్యండి.
- విడాకులకు ప్రయత్నం ప్రారంభించండి. (విడాకులగురించి ఆస్త్రీ భయాల్ని పరిగణనలోకి తీసుకోండి, ఆభయాల్ని తొలగించుకోవడానికి ఆమెకు సహాయపడండి)
- సలహాను కోరడానికి ఆమెను స్త్రీల సపోర్టు గ్రూపు దగ్గరకు పంపండి.
హింసించే పురుషులతో పనిచెయ్యడం
హింసించే భర్తలు వున్న స్త్రీలకు సహాయపడడంలో ఉన్న పెద్ద కష్టం. చాలామంది పురుషులు ఈసమస్యకు సహాయం కోరరు. వారు ఇతరులు తమను చిన్నబుచ్చుతారేమోనని జంకుతారు, పోలీస్, న్యాయపరమైన చిక్కులు, సాంఘిక వెలి గురించి భయపడతారు. హింసించే ఫురుషులతో వ్యవహరించడానికి క్రింద కొన్ని సూచనలు ఉన్నాయిః
- మీరు ఎవరో ఒకరి పక్షం వహించడం భావ్యం కాదు, పురుషుడికి కూడా సహాయపడడానికి ప్రయత్నించండి.
- అతని మానసిక ఆరోగ్య సమస్యల వలన పురుషుడు హింసాత్మకంగా మారే కొన్ని సందర్భాలు ఉంటాయి. మొదటిది పురుషులు విపరీతంగా తాగడం, తాగినప్పుడు హింసాత్మకంగా ప్రవర్తించడం. రెండవది తన భార్యకు పరాయి పురుషుడితో అక్రమ సంబంధం వుందని అనుమానిస్తూ ఆమెను ఆతప్పను ఒప్పుకోమని హింసించడం. అది కేవలం ఊహేనన్నది వేరే విషయం.
- హింసాత్మకంగా వున్న పురుషులందరూ తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి సహాయం లభిస్తే ప్రయోజనం పొందుతారు. కోపాన్ని తగ్గించుకోవడం గురించి మీరు అతనికి సలహానివ్వండి.
- హింసను నిరోధించడమంటే, మద్యం వ్యసనం వున్న వారికి సహాయపడే ఆల్కహాలిక్స్ ఎనానిమస్కిలాగానే తమ భార్యల్ని ఇతర పురుషులతో సపోర్టు గ్రూపుల్ని ఏర్పాటు చెయ్యడానికి సహాయపడడం
- వ్యక్తులతో వ్యవహరించినప్పటి లాగానే వారి భాగస్వాములతో వ్యవహరించినప్పుడు కూడా గోప్యత చాలా ముఖ్యం. ఇద్దరికీ తాము మీతో మాట్లాడింది తమ భాగస్వామితో మీరు చెప్పరనే నమ్మకం వుండాలి
| |
కోపాన్ని నియంత్రించుకోవడం (తమ ఉద్రేకాన్ని నియంత్రించుకోవడం కష్టమయిన వారికి సలహా) |
- కోపం మీఆరోగ్యానికి, జీవితానికి హానికరం. దానిని నియంత్రించుకునే విధానాన్ని నేర్చుకోవడం మీజీవితాన్ని మెరుగుపరచు కోవడానికి ముఖ్యమైన మార్గం.
- కోపాన్ని నియంత్రించుకోవచ్చు. ఎవరైనా నాకు కోపం వచ్చినప్పుడు నేనేమి చేస్తానో నా నియంత్రణలో వుండదు' అంటే, ఆవ్యక్తి తన కోపాన్ని నియంత్రించుకోవడానికి గట్టి ప్రయత్నం చెయ్యలేదని అర్థం.
- కోపాన్ని నియంత్రించుకోవడంలో మొట్టమొదటి చర్య కోపం మొదటి చిహ్నాన్ని గుర్తించడం. తలలో వేడిగా ఉన్నట్లనిపించటం, కోపం ఆలోచనలు రావడం, శరీరమంతా ఒత్తిడిలో ఉన్నట్లనిపించడం కోపం మొదటి చిహ్నాలు.
- ఆ వ్యక్తి వీటిలో దేనినైనా గుర్తిస్తే, దానికి కారణమైన సందర్భానికి దూరంగా వెళ్ళాలి. ఉదాహరణకు అతనికి భార్యతో మాట్లాడుతున్నప్పుడు కోపంవస్తే, ఆమెతో మాట్లాడుతున్న గదిలోనుండి బయటకు వచ్చేయాలి.
- మనసు మళ్ళీ ప్రశాంతంగా అయేవరకు ఆగాలి, అప్పుడు మాత్రమే తను చేస్తున్నదానిని కొనసాగించాలి. ఎదుటివ్యక్తికి తానేమి చెప్పదలచుకున్నాడో ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. కోపం తగ్గాక సంఘర్షణను తగ్గించడానికి తన ఆలోచనల్ని అ వ్యక్తితో చెప్పడానికి ప్రయత్నించాలి.
|
|
(అ) మీభావాల్ని కోపాన్ని గుర్తించండి
(ఆ) మీకు కోపం ప్రారంభమవుతున్న గదిని విడిచి వెళ్ళండి
(ఇ) మనసు ప్రశాంతంగా అయాకే, మీనిగ్రహాన్ని కోల్పోకుండా సమస్యను పరిష్కరించుకోగలిగినప్పుడే తిరిగి గదిలోకి రండి.
|
వేధింపులకు గురవుతున్న స్త్రీలతో వ్యవహరిస్తున్నప్పుడు గుర్తుంచు కోవలసిన విషయాలు |
- వేధింపు శారీరకమైనది లేక మానసికమైనది లేక లైంగిక పరమైనది అవొచ్చు. హింసకు గురవుతున్న చాలామంది స్త్రీలు తమ భర్తల చేతే హింసింప బడుతున్నారు.
- హింస సాధారణం; వివరించలేని శారీరక గాయాలు లేక శారీరక లక్షణాలు, నిద్రసమస్యలు లేక ఆత్మహత్య గురించి ఆలోచనలు వుంటే, హింసని అనుమానించండి
- అమె నమ్మే బంధువులు లేక స్నేహితులతో తను అనుభవిస్తున్న హింస గురించి చెప్పేందుకు ప్రోత్సహించండి; అలాగే, స్థానిక మహిళాబృందాలతో చెప్పడానికి కూడా ప్రోత్సహించండి.
- పురుషుడితో మాట్లాడి అతనిని మార్చడానికి ప్రయత్నించండి, అతనే సమస్యకు కారణం.
|
మానభంగానికి గురయిన లేక లైంగిక అత్యాచారానికి గురయిన స్త్రీ
మానభంగం అంటే ఆమె అనుమతి లేకుండా ఒక పురుషుడు ఒక స్త్రీని బలవంతంగా లైంగికంగా అనుభవించడం. చాలా దేశాల్లో మానభంగం అంటే స్త్రీ యోనిలో బలవంతంగా పురుషుడి అంగాన్ని ప్రవేశపెట్టడం. లైంగిక అత్యాచారం మానభంగంతో పాటు ఇతర రూపాల లైంగిక హింస కూడా వుండే విస్తృత చర్య
- ఆమె శరీరాన్ని ముట్టుకోవడం లేక పట్టుకుని లాగడం
- లైంగికతను సూచించే ವಖ್ಯಲು, కదలికలు
- ఆమెపై లైంగిక దాడి చెయ్యడం, లైంగిక కలయిక వున్నప్పటికి, లేకపోయినప్పటికి బాలలపై లైంగిక హింస గురించి
మానభంగం ఎందుకని ఆరోగ్య అంశం
మనిషి అనుభవించే అతి భయంకరమైన అనుభవాలలో మానభంగం ఒకటి. కొన్ని ప్రదేశాలలో, స్త్రీలు మానభంగంతోపాటు తమ కమ్యూనిటీ సభ్యుల వివక్షను కూడా ఎదుర్కొంటారు. మానభంగంలో శారీరక గాయాలు, మానసిక చిత్రహింస వుంటాయి కనుక అది స్త్రీ ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది. మానభంగం వీటికి దారితీస్తుందిః
- కోరని గర్భాలు
- లైంగిక వ్యాధులు (హెచ్.ఐ.వి, ఎయిడ్స్తో సహా)
- శారీరక గాయాలు, కముకుదెబ్బలు, కోసుకు పోవడం, చీరుకు పోవడం లేక ఎముకలు విరగడం
- డిప్రెషన్, పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు
|
(అ) కోరని గర్భాలు
(ఆ) లైంగిక వ్యాధులు (హెచ్.ఐ.వి, ఎయిడ్స్ లాంటివి)
(ఇ) శారీరక గాయాలు, కముకుదెబ్బలు, కోసుకు పోవడం, చీరుకు పోవడం లేక ఎముకలు విరగడం
(ఈ) డిప్రెషన్, పోస్ట్ ట్రమాటిక్ ప్రైస్ డిజార్డర్ లాంటి మూనసిక ఆరోగ్య సమస్యలు.
|
మానభంగానికి గురయినప్పుడు స్త్రీలు ఎలా ప్రతిస్పందిస్తారు
స్త్రీ సహకరించనిదే, వెల్లకిలా పడుకుని, నెమ్మదిగా వుండనిదే ఆమెను పురుషుడు మానభంగం చెయ్యడం
అసాధ్యమని కొంతమంది వాదిస్తారు. నిజానికి చాలామంది స్త్రీలు ప్రతిఘటిస్తారు, పెనుగులాడి రేపిస్ట్ని తప్పించుకుని
పారిపోతారు. కాని రేపిస్ట్ కేవలం తన శారీరక బలంతో స్త్రీని లొంగదీసుకోగలడు. కొన్నిసార్లు ఆ స్త్రీ ఎంతగా
భయభ్రాంతురాలవుతుందంటే, అతను తననింకా ఎక్కువగా హింసిస్తాడని ప్రతిఘటించడానికి భయపడుతుంది.
మానభంగానికి గురయిన స్త్రీ వరసగా అనేక భావోద్వేగాలకు గురవుతుంది.
- నిశ్చేష్టురాలవడం, కోపం మొదటి ప్రతిస్పందనలు. భయంతో, కోపంతో వణుకుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది, తనింతకుముందు అనుభవించిందేమిటో అర్థం చేసుకోలేదు.
- కొంతమందిస్త్రీలు నెమ్మదిగా, నిగ్రహంగా వుండొచ్చు; కాని దీని అర్థం వారు మానభంగాన్ని తట్టుకోగలిగారని కాదు.
- మానభంగం జరిగాక కొన్ని రోజులు లేక వారాలకు ఆస్త్రీ దానికి కారణం తనేనని తనను తాను నిందించుకోవచ్చు, తనను చంపేస్తారని, హానిచేస్తారని భయపడొచ్చు. తను మైలపడ్డానని భావించవచ్చు, మానభంగం గురించి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావచ్చు, పీడకలలు, నిద్ర సమస్యలు వుండొచ్చు. నెప్పులు, పీకులు లాంటి శారీరక బాధలు వుండొచ్చు, ఆకలి లేకపోవడం, అలసట కూడా సాధారణమే.
- తరువాత ఆ స్త్రీకి మనుషులంటే భయం, మానభంగం జరిగిన పరిస్థితుల్ని పోలిన సందర్భాలంటే భయం, తనకు లైంగికాసక్తి తగ్గిందనే భయం వుండొచ్చు, మానభంగానికి సంబంధించిన కలలు మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఇది పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్జర్ని పోలివుంటుంది.
- చివరగా, అధిక సంఖ్యాక స్త్రీలు చాలా కాలంపాటు మానభంగానికి సంబంధించిన బాధలు పడ్డాక కొంత తేరుకుని మామూలుగా అవొచ్చు. కాని కొంతమంది స్త్రీలకి స్పష్టమైన డిప్రెషన్ వస్తుంది, వారికి చికిత్స అవసరమవుతుంది.
ఎవరు మానభంగం చేస్తారు?
చాలా సందర్భాలలో మానభంగం చేసినవాడు లేక రేపిస్ట్ ఆమెకు తెలిసిన వాడే అయివుంటాడు. ఒక స్త్రీ అనేక పరిస్థితుల్లో మానభంగానికి గురవుతుంది: | |
- తనకు తెలిసిన పురుషుడు, మామ లేక పొరుగింటి వ్యక్తి లేక తనతో కలిసి పనిచేసే వ్యక్తి మానభంగం చేస్తాడు.
- పురుష స్నేహితుడు (దీనిని కొన్నిసార్లు డేట్ రేప్ అని అంటారు)
- భర్త (కొన్ని సమాజాల్లో భర్తకు లైంగికానందాన్నివ్వడం భార్య ధర్మం అని భావిస్తారు. కాని, ఆమెకు ఇష్టం లేకపోతే, ఆమెను బలవంతం చేస్తే అది లైంగిక హింస);
- పోలీస్ లేక సైనికులు (స్త్రీలను సైనికులు బందీలుగా పట్టుకున్నప్పుడు, పోలీసులు నేరంలో ఆనుమానితులుగా నిర్బంధించినప్పుడు-ఇది చాలా భయంకరమైనది, ఎందుకంటే ఆమెను రక్షించవలసిన వారిచేతే ఆమె మానభంగానికి గురవుతుంది);
- పూర్తిగా అపరిచితుడు (ఇది ఇంటి బయట ఎక్కడైనా లేక ఇంట్లో కూడా జరగొచ్చు).
|
|
ఈ సమస్యనెలా పరిష్కరించడం
ఆ స్త్రీని అడగవలసిన ప్రశ్నలు
- ఏమి జరిగింది? ఏమి జరిగిందో వివరంగా తెలుసుకోండి. రేపిస్ట్ లైంగికంగా కలవగలిగాడా? ఆమెను శారీరకంగా గాయపరచాడా? ఇది ఎప్పుడు జరిగింది?
- నీకు ఇప్పుడెలా వుంది? ఆ కొంత నిగ్రహంగా వున్నానని అంటే దాని అర్థం మానభంగం అంత చింతించాల్సిన విషయం కాదనికాదు.
- ఆఖరు సారి ఎప్పుడు బహిష్టు అయావు? ఆస్త్రీకి గర్భం వచ్చే అవకాశంవున్న దశలో వుంటే, గర్భనిరోధక సాధనమేదీ ఉపయోగిస్తూ వుండకపోతే, ఆమెను అత్యవసర గర్భనిరోధక మాత్రల్ని వాడమని చెప్పొచ్చు (మనకు డాక్టరు లేనిచోట).
- ఎవరితోనైనా మానభంగం గురించి చెప్పావా? ఎవరు? వారి ప్రతిస్పందన ఏమిటి? ఈ కష్ట సమయంలో ఆమెకు అవసరమయే ఆసరాని గుర్తించడానికి ఇది సహాయ పడుతుంది.
- వివాహ బంధంలో మానభంగం జరిగిందని అనుమానిస్తే ఈ ప్రశ్నని ఇలా అడగొచ్చు, మీకు సాధారణంగా ఎప్పుడు సెక్స్ కావాలి, లేక అసలు కావాలా, వద్దా అనేదానిపై ఎంత అదుపు వుంటుంది? మీరు కోరనప్పుడు కూడా మీభర్త మీతో సెక్స్ని పొందిన సమయాలున్నాయా?
ప్రత్యేక ఇంటర్వ్యూకి సూచనలు
- 24 గంటలలోపు మానభంగం జరిగుంటే గైనకాలజిస్ట్తో పరీక్ష చేయించుకోమని సూచించాలి. ఆమె అలా పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించవచ్చు. మానభంగాన్ని నిరూపించడానికి న్యాయపరమైన అంశాలకు ఇది అవసరమని చెప్పి ఆమెను ఒప్పించాలి. పరీక్షలో లైంగిక అవయవాలపైన, శరీరంలో ఇతర చోట్ల గాయాలేమైనా వున్నాయేమో చూడాలి, యోనిలోని ద్రవాన్ని తీసి వీర్య కణాల పరీక్షకు పంపాలి.
- మానభంగం చాలా సున్నితమైన అంశం. చర్చించడానికి సమయాన్ని తీసుకోండి. ఏకాంతంలో చర్చించండి. అమె చెప్పేది రహస్యంగా వుంచబడుతుందనే నమ్మకం కలిగించాలి. ఆచర్య గురించి అనవసరమైన ప్రశ్నల్ని అడగొద్దు.
వెంటనే ఏమి చెయ్యాలి?
- అది ఆమె తప్పుకాదని ధైర్యం చెప్పండి.
- ఆమె కథనంతటినీ నమోదు చెయ్యండి. ఎవరామెను మానభంగం చేసారు, పరిస్థితులు, గాయాలేమైనా వుంటే వాటిని నమోదు చెయ్యండి. శారీరక, జననాంగాల గాయాల గురించి వివరంగా నమోదు చెయ్యాలి. *తన అనుభవాన్ని బంధువు లేక స్నేహితురాలితో చెప్పమని ఆమెను ప్రోత్సహించండి. కాని ఆమె దానిని రహస్యంగా వుంచాలని అనుకుంటే ఆమె అభిప్రాయాన్ని గౌరవించండి.
- మానభంగం గురించి ఆమె పోలీస్కి రిపోర్టు చెయ్యదలచుకుంటే ఆమెకు ఆవిషయంలో సహాయపడండి. ఆసంఘటన గురించి పోలీస్కి రిపోర్టు చెయ్యడమే మంచిది, ఎందుకంటే, రేపిస్ట్ మొత్తం కమ్యూనిటీకే హానిని కలిగించగలవాడు. తనకు న్యాయం జరగగలదనే అలోచన ఆమెకు ఆత్మ స్థిర్యాన్నిస్తుంది. అది రేపిస్ట్ తన ప్రవర్తనను పునరావృతం చెయ్యకుండా కూడా నిరోధిస్తుంది.
- రేపిస్ట్ దగ్గరి బంధువయితే ఆమె పోలీస్కి రిపోర్టు చెయ్యడానికి జంకవచ్చు.
- ముఖ్యంగా రుతుచక్రంలో గర్భధారణకు అనువైన దశలో ఈసంఘటన జరిగితే, ఆమెకు అత్యవసర గర్భనిరోధానికి సహాయ పడండి, (=మనకు డాక్టరు లేని చోట)
- లైంగిక వ్యాధులకు చికిత్స చెయ్యండి. సాధారణ చికిత్స ప్రొకెయిన్ పెన్సిలిన్ (4.8 మిలియన్ యూనిట్లు కండరంలోకి ఇంజక్షన్), ప్రోబెనిసైడ్ (1 గ్రాము నోటితో). ఇది గనోరియా, సిఫిలిస్ లను నయం చేస్తుంది. పెన్సిలిన్ని ఇచ్చేముందు టెస్ట్ డోసు ఇచ్చి రియాక్షన్ లేకుంటేనే పెన్సిలిన్ని ఇవ్వండి. పెన్సిలిన్కి ఎలర్జీ వస్తే, ఆతర ఏంటీబయాటిక్స్ని, ఎరిథ్రోమైసిన్ లేక టెట్రాసైక్లిన్ని ఇవ్వండి.
- ఆమె నమ్మే ఎవరి దగ్గరైనా కొంతకాలం పాటు వుండడానికి ఆమెను ప్రోత్సహించండి. ఆమె కొంత కాలం ఒంటరిగా వుండక పోవడం మంచిది.
- మానభంగానికి సాధారణంగా కలిగే మానసిక ప్రతిస్పందన గురించి ఆమెకు వివరించండి. భయంకలగడం, పీడకలలు రావడం, విచారం ఆసంఘటన వలన సహజంగా వచ్చేవేకాని వెర్రికి చిహ్నం కాదని ఆమెకు తెలుస్తుంది.
- ఆ స్త్రీకి తీవ్రమైన నిద్రా సమస్యలు వుంటే, లేక తీవ్రమైన అలజడి వుంటే లోరజిపామ్ లేక డయాజిపామ్ లాంటి నిద్రమాత్రల్ని నాలుగు వారాలపాటు ఇవ్వండి
- ఆమె కలవరాల్ని విచారాల్ని అర్ధం చేసుకుని ఆమెకుగల న్యాయపరమైన హక్కులగురించి సలహానివ్వగల సపోర్టు గ్రూపుదగ్గరకు పంపండి
- ఆ స్త్రీ అంగీకరిస్తే ఆమె కుటుంబంతో మాట్లాడండి. కొంతమంది పురుషులు తన భార్య మానభంగానికి గురయితే ఆమెను తిరస్కరిస్తారు. మానభంగానికి గురైన స్త్రీ భర్తతో మాట్లాడండి. మానభంగం నేరమని, ఏస్త్రీకైనా అది జరగొచ్చని చెప్పి అతని వైఖరిని మార్చడానికి ప్రయత్నించండి.
- ఒకవేళ దగ్గరి బంధువు లేక స్నేహితుడు ఆ స్త్రీని మానభంగం చేస్తే ఆమె తన కుటుంబంతో ఈ విషయాన్ని చెప్పడానికి ప్రోత్సహించండి. ఆమె భయంనుండి బయటపడడానికి, మళ్ళీ అతను మానభంగం చెయ్యకుండా వుండడానికి రేపిస్ట్ ఎవరో అతనిని ఎరిగిన ఇతరులకు తెలియడం మంచిది.
ఎప్పుడు వేరే చోటకు పంపాలి?
- తీవ్రమైన శారీరక గాయాలున్నప్పుడు, ఆమె గైనిక్ పరీక్ష చేయించుకోవడం ద్వారా గాయాల్ని నమోదు చెయ్యాలనుకున్నప్పుడు హాస్పటల్కి పంపాలి.
తరువాత ఏమి చెయ్యాలి
- వారం పోయాక మళ్ళీ ఆమెను కలిసి సమీక్షించి హెచ్.ఐ.వి. పరీక్ష గురించి కౌన్సిలింగ్ చెయ్యాలి. ఒకవేళ పరీక్ష పాజిటివ్ వస్తే ఆమె మానభంగానికి గురయేముందే ఆమె హెచ్.ఐ.వి. పాజిటివ్ అయి వుంటుంది. పరీక్ష నెగెటివ్ వస్తే, కనీసం ఆరు నెలల వరకు తన మామూలు లైంగిక భాగస్వామితో సురక్షిత సెక్స్ని పాటించాలి. మానభంగం వలన ఆమెకు హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్ రాలేదని నిర్ధారణకు ఆరు నెలల తరువాత తిరిగి పరీక్ష చెయ్యాలి.
- డిప్రెషన్ లేక పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ చిహ్నాలేమైనా వున్నాయేమో గమనించండి. ప్రారంభంలో ఉన్న షాక్ తగ్గాక ఇవి బయటపడొచ్చు.
మానభంగానికి గురయిన స్త్రీతో వ్యవహరించేటప్పుడు గుర్తుంచు కోవలసిన విషయాలు. |
- మానభంగం స్త్రీ అనుభవించే హింసలలో అతి తీవ్రమైన హింస. ఇది ఆమె శారీరక ఆరోగ్యాన్ని లైంగిక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
- మానభంగం కోరని గర్భాలకు, హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్తో సహా అనేక లైంగిక వ్యాధులకు, ప్రమాదకరమైన గాయాలకు దారితియ్యొచ్చు. డిప్రెషన్, ఆత్మహత్య గురించి ఆలోచనలు, పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్ సాధారణంగా వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు.
- మానభంగానికి గురయిన వారికి సహాయం చెయ్యడంలో కీలకం ఆమె శారీరక ఆరోగ్యం బావుండేలా చూడడం. మానభంగానికి సంబంధించిన అంశాలన్నిటిని జాగ్రత్తగా నమోదు చెయ్యండి. గర్భం, లైంగిక వ్యాధుల్ని నిరోధించడానికి సలహానివ్వండి, ఆ అనుభవం వలన కలిగే మానసిక ఆరోగ్య ప్రభావాల గురించి ఆమెకు కౌన్సిలింగ్ చెయ్యండి.
- మెడికల్ రిపోర్టులతో కలిపి పోలీస్కి రిపోర్ట్ చెయ్యడానికి ఆస్త్రీకి ప్రోత్సాహమివ్వండి. రేపిస్ట్ ఒకసారి తప్పించుకుంటే మళ్ళీ ఆ నేరాన్ని చేసే ప్రమాదం వుంటుంది.
|
ఎప్పుడు పురుషులు మానభంగానికి గురవుతారు
| |
పురుషులు కూడా ఇతర పురుషులచే లైంగిక అత్యాచారానికి, మానభంగానికి గురవుతారు. ఇది ప్రత్యేకంగా చిన్నవయసు మగపిల్లలు వారికంటే పెద్ద వయసు బాలురు, పురుష బంధువులచే, జైళ్ళలో, ఒకరికొకరు బాగా దగ్గరగా మసలే ఇతర చోట్ల పురుషులు పురుషులపై లైంగిక అత్యాచారాల్ని చేస్తారు. స్త్రీలపై లైంగిక అత్యాచారాల కంటే పురుషులపైన జరిగే లైంగిక అత్యాచారాలు రహస్యంగా వుండిపోతాయి. దీనికి కారణం కొంతవరకు పురుష బాధితులు చాలా అరుదుగా సహాయం కోరడం. జైళ్ళలో, సైనికసాల, స్కూల్స్, పురుషులు కలిసి నివసించే ఇతర ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు పురుషులపై జరిగే లైంగిక అత్యాచారాల గురించి అవగాహనతో వ్యవహరించండి. మానభంగానికి గురయిన స్త్రీలకు సహాయ పడినట్లుగానే మానభంగానికి గురయిన పురుషులకు కూడా సహాయపడండి.
|
|
వియోగ శోకంలో వున్న వ్యక్తి
తను ఎంతగానో ప్రేమించే వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తిని కోల్పోవడం వలన వియోగంతో ఒక మనిషి పొందే అనుభవమే వియోగ శోకం. ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ అనుభవాన్ని పొందుతాడు. మనం తట్టుకోవలసిన అతి పెద్ద విషాదం మనం ప్రేమించిన వ్యక్తి శాశ్వతంగా దూరమవడం. ఇందువలనే కోల్పోవడం మానసిక వ్యాధి అంశమవుతూంది.
తనప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు
| |
కోల్పోవడం వలన కలిగే శోకం ఒక గాయంలాంటిది, అది బాధిస్తుంది. ఆ వ్యక్తి కోలుకోవడానికి, గాయం మానడానికి సమయం పడుతుంది. . కొన్ని గాయాలలాగానే ఈ వియోగ శోకం తగ్గడానికి చాలా సమయం. పడుతుంది, ఒకోసారి క్లిష్టంగా మారుతుంది. వియోగ శోకం వివిధ విద్యలు వివరించబడినాయి, కాని కోల్పోవడం వలన కలిగే శోకం పూర్తిగా వ్యక్తిగత అనుభవం అని గుర్తించడం ముక్యం ఈశోకాన్ననుభ వించడంలో సరైన లేక తప్ప విధమేదీలేదు. కొన్ని సమాజాలలో ఇది ఒకేసారి అనేకమంది శోకించే సమష్టి అనుభవం. అలాంటి సందర్భాలలో దుఃఖాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు.
|
|
ఈ శోకం ఎప్పుడు అసాధారణంగా మారుతుంది
కొన్నిసార్లు ఈవియోగ శోకం అసాధారణంగా మారుతుంది, అది చాలాకాలం కొనసాగుతుంది, ఆరోగ్యం దెబ్బ తినేలాగా ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అసాధారణ వియోగ శోకాన్ని సూచించే కొన్ని లక్షణాలు ఇవి:
- ప్రతిస్పందన ఆరు నెలలకంటే ఎక్కువ కాలం వుంటే;
- శోకించే ఆవ్యక్తి డిప్రెషన్ కి లోనయితే లేక ఆత్మహత్య ఆలోచనలు వస్తూంటే;
- ఇతరులతో మాట్లాడడం ఆపేస్తే;
- కోల్పోయిన బంధువు లేక స్నేహితుడి తాలూకు వ్యక్తుల్ని వస్తువుల్ని దూరం పెడితే.
- అసాధారణ శోకం ఈక్రింది పరిస్థితుల్లో కలుగుతుంది:
- ఆవ్యక్తి ఒకేసమయంలో ఎక్కువ మందిని కోల్పోతే
- అతనికి తగినంత సాంఘిక ఆసరా లేకపోతే;
- అతను తన భార్యను, ఏకైక బిడ్డను కోల్పోతే; ఒక పెద్ద వయసు వ్యక్తి తన భార్య లేక భర్తను కోల్పోతే ;
- ఆ మరణం అకస్మాత్తుగా జరిగితే, ఉదాహరణకు, రోడ్ ఏక్సిడెంట్ లేక అత్మహత్య ఐతే
- ఆ వ్యక్తి చాలా కాలం వరకు ఆమరణాన్ని నిరాకరిస్తే (లేక నిర్లక్ష్యం చేస్తే)
శోకం స్థాయిలు | |
ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు మానవ స్పందనను మూడు స్థాయిలుగా వర్ణించడం జరిగింది ఇదినిజం కాదుః నిరాకరించే స్థాయి
ఇది కోల్పోయిన వెంటనే మొదటి రోజుల్లో వుంటుంది. ఈవార్త నిజంకాదేమోననే భావం, తను ప్రేమించేవ్యక్తి చనిపోజాలదు అన్న భావం. ఇది అసంభవం అనిపిస్తుంది. మరణం అకస్మాత్తుగా జరిగితే ఈనిశ్చేష్టితా దశ స్పష్టంగా కనపడుతుంది. ఏదో కలలో, అవాస్తవ స్థితిలో ಔನ್ಲಿಲ್ಲ, స్తబ్దతలో గడుపుతుంది. దహనక్రియలాంటి కార్యక్రమాలు ఆ స్థితినుండి బయటపడడానికి సహాయపడతాయి.
నాకు విపరీతమైన దుఃఖంగావుంది: విచారపడే స్థాయి
అంత్యక్రియల తాలూకు కార్యక్రమాల హడావిడి ముగిసాక శోకిస్తున్న వ్యక్తి మళ్ళీ తన మామూలు జీవితం మొదలు పెట్టాక ఈ స్థాయి ప్రారంభమవుతుంది. తన ప్రియమైన వ్యక్తి ఇక లేడు అనే వాస్తవాన్ని గుర్తిస్తారు. విచారం, కనపడకుండా పోయిన వ్యక్తిని అన్వేషిస్తున్న భావన, ఆ వ్యక్తి ఇంకా జీవించే ఉన్నాడన్న ఊహ, తరచుగా కలిగే అనుభవాలు. కొంతమందికి ఆవ్యక్తి తనను పిలుస్తున్నట్లు వినిపిస్తుంది, కోల్పోయిన వ్యక్తి గురించి కలలు వస్తాయి. కొంతమంది ఆమరణాన్ని ఆపడానికి చెయ్యాల్సింది చెయ్యలేదని తనను తాను నిందించుకుంటారు, ఆ వ్యక్తి తనను విడిచి వెళ్ళాడని కోపగించుకుంటారు. ఏడవడం, నిద్ర సమస్యలు, పనులమీద, మనుషుల్ని కలవడం మీద ఆసక్తి పోవడం, జీవితం వ్యర్థం అనే భావన ఈ దశలో అనుభవంలోకి వస్తాయి.
|
|
ఇది ముందుకు సాగాల్సిన దశ పునర్నిర్మించుకునే స్థితి
ఇది శోకంలో చివరి దశ. చాలామందికి ఇలా కోల్పోవడం జీవితంలో భాగమని, తన మిగిలిన జీవితమంతా ఇలా గడపాల్సిందేనని అంగీకరిస్తారు. పరిస్థితితో రాజీపడడం క్రమేపీ జరిగే ప్రక్రియ. చాలామంది తరచుగా చనిపోయిన వ్యక్తిని గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు. ముఖ్యమైనదేమిటంటే ఈ విచారం బ్రతుకులోని సంతోష
క్షణాల్ని అనుభవించగల సామర్థ్యాన్ని దెబ్బతియ్యగూడదు. వ్యక్తి భవిష్యత్తు గురించి పథకాల్ని రూపొందించుకోవడం క్రి అతను ఆదుఃఖాన్నుండి బయటపడుతూ ముందుకు సాగుతున్నాడనడానికి నిదర్శనం-తను ప్రేమించే వ్యక్తి కాని భవిష్యత్తు, కాని ఆశ ఉన్న భవిష్యత్తు
ఈ సమస్యనెలా సంబాళించడం
వియోగం పొందిన వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు
- ఏమి జరిగింది? ఆ వ్యక్తి మరణం గురించి మాట్లాడడం నిశ్చేష్టత లేక షాక్ని తగ్గించడానికి సహాయపడుతుంది
- రాబోయే కొద్ది రోజులు ఎవరితో గడపాలనుకుంటున్నావు? నీకెవరి అవసరమైనా వున్నప్పుడు ఎవరితో మాట్లాడతావు?
- నీ భావాలేమిటి? అతని భావాల్ని ఆలోచనల్ని మీతో పంచుకో నివ్వండి. నిశ్చేష్టత, అపనమ్మకానికి సంబంధించిన ఆలోచనలు వ్యక్తమవుతాయి.
- వెంటనే ఏమి చెయ్యాలి?
- తను కోల్పోయిన బంధువు ఇంకా బ్రతికే వున్నాడని ఊహించడం, లేక ఆబంధువును వెదకడం లాంటి ఆమె ఆలోచనలు లేక చర్యలు సాధారణమేనని, ఆమెకు పిచ్చెక్కుతూందనడానికి అనవాళ్ళు కావని ఆమె నమ్మేలాగా చెప్పాలి. శోకపు స్థాయిల గురించి ఆమెకు అవగాహన కలిగించడం వలన ఆమెకు ఏమి ఆశించవచ్చో తెలిసి, తనకు వచ్చే కొన్ని అలోచనలు, భావాల గురించి ఆదుర్గా పడదు.
- ఆమె తన భావాల్ని బంధువులతో, స్నేహితులతో పంచుకునేలాగా ప్రోత్సహించండి. సాధ్యమైనంతవరకు మొదటి కొద్ది రోజులు ఆమె ఒంటరిగా వుండగూడదు.
- ఒకవేళ కమ్యూనిటీ మరణానికి సంబంధించిన కార్యక్రమాల్ని చేస్తూంటే, అతనిని వాటిలో పాల్గొనేందుకు ప్రోత్సహించండి. ఈ క్రతువులు వ్యక్తులు ఇతరుల ఆసరా తమకు లభిస్తూందని భావించేలా చేస్తాయి. ఆమె మతవిశ్వాసురాలయితే ప్రార్థన ఆమె ఆశోకాన్ని తట్టుకునేందుకు సహాయపడొచ్చు.
- మరణం తరువాత కొన్ని రోజులకు కోల్పోవడం కారణంగా కలిగే భావాలు, విచారం గురించి చర్చ సహాయకారిగా వుండొచ్చు. ఆ వ్యక్తి కోపం లాంటి కొన్ని ఉద్వేగాల్ని వ్యక్తపరచడానికి చికాకుపడొచ్చు. ఆమెను అలాంటి ఉద్వేగాలగురించి అడగండి, దానితో ఆమెకు మీతో బాహాటంగా, ఏ దాపరికం లేకుండా మాట్లాడొచ్చనే నమ్మకం కుదురుతుంది.
- ఆమెకు ఆత్మహత్య గురించి ఆలోచనలు వస్తూంటే, వేరేచోట వర్ణించిన విధంగా చికిత్స చెయ్యండి. అ వ్యక్తి మరణించడానికి కారణం ఆత్మహత్య అది, శోకాన్ననుభవిస్తున్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
- అ ఆమెను ఓదార్చడానికి యథాలాపంగా మాట్లాడకండి, ఉదా. " అది భగవంతుని ఇచ్చ", “నీకు కనీసం పిల్లలున్నారు". శోకం సామాన్య మానవ అనుభవం, మీరు సహనంతో ఆమె శోకాన్ని వ్యక్తపరచనిస్తే, అదే చికిత్స అవుతుంది.
- నిద్ర సమస్యలకు నిద్ర మాత్రల్ని ఇవ్వొచ్చు. శోకాన్ననుభవిస్తున్న వ్యక్తి బాగా నిద్రపోవడం చాలా మ్ధ్యం, దానితో ఆమెకు పగటిపూట అలసటగా వుండదు. అప్పుడామె అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోగలుగుతుంది, ఆపని తన శక్తికి మించినదనే భావాన్ని ఆమెకు కలగనివ్వదు.
- మూడు, నాలుగు వారాల్లో తిరిగి తమ మామూలు పనులు చేసుకునేందుకు ప్రోత్సహించండి. పని, ఇతర
కార్యక్రమాలు వారిని ఉత్సాహపరచడానికి, తమ భవిష్యత్తు జీవితాలను పునర్నిర్మించుకునేందుకు సహాయపడతాయి
ఆత్మహత్యతో చనిపోయినప్పుడు వియోగ శోకాన్ననుభవించే వారి అవసరాలు |
ఆత్మహత్య కారణంగా మరణించిన వారి వియోగశోకాన్ని అనుభవిస్తున్న వారికి ఈక్రింది అంశాలలో సహాయ మవసరమవుతుంది.
- ఆత్మహత్య గురించి మాట్లాడడం ద్వారా ఆత్మహత్యను దర్శించవచ్చు;
- ఆత్మహత్య వలన కలిగే కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడం;
- తమగురించి తాము మెరుగ్గా భావించడం (తమనుతాము నిందించుకోవడంకాక);
- ఆత్మహత్య విషయంలో ఖచ్చితంగా ఏమి జరిగిందో, దాని ప్రభావాలేమిటో పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం;
- కోపంలాంటి ఉద్వేగాల్ని వ్యక్తపరచడానికి సురక్షితమైన, ఏకాంతస్థిలం;
- ఆచరణాత్మకమైన, సాంఘిక అంశాలగురించి సలహా తీసుకోవడం;
- ఆత్మహత్యకు సంబంధించిన అపవాదును, ఇతర వ్యక్తుల ప్రతిస్పందనలను సంబాళించడం.
|
వియోగశోకం అసాధారణంగా వుంటే ఏమి చెయ్యాలి?
- శోకం అసాధారణంగా వుంటే, ఆవ్యక్తికి కనీసం వారానికొకసారైనా కౌన్సిలింగ్ చెయ్యాలి. కౌన్సిలింగ్లో చనిపోయిన వ్యక్తితో ఆమెకుగల సంబంధం (సానుకూల, ప్రతికూల భావాల్ని రెండిటినీ వెలికి తియ్యాలి) భాగమవాలి. చనిపోయిన వ్యక్తిని గుర్తుచేసే ఫోటోలు లేక ఇతర వస్తువుల్ని తెమ్మని చెప్పండి, ఇవి చర్చకు కేంద్రంగా సహాయ పడతాయి
- అ ఆమెలో తీవ్రమైన డిప్రెషన్ చిహ్నాలు కనబడితే, ఏంటీడిప్రెసెంట్స్తో చికిత్స చెయ్యండి.
వియోగశోకాన్ని అనుభవిస్తున్న వ్యక్తితో వ్యవహరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు. |
- మరణంద్వారా తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయినవారు వియోగశోకాన్ననుభవించడం సహజ మానవ ప్రతిస్పందన.
- ఆ నష్టం గురించి కౌన్సిలింగ్ చెయ్యండి, బంధువుల్ని స్నేహితుల్ని అతనికి ఆసరానివ్వమనండి.
- ఆరు నెలలకంటే ఎక్కువ కాలం శోకం కొనసాగితే, లేక తీవ్రమైన డిప్రెషన్ ඒජු ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తే, అప్పుడది అసాధారణం.
- మరణం తరువాత చాలా నెలలకు డిప్రెషన్, ఆందోళన తాలూకు ఖచ్చితమైన చిహ్నాలు కనిపిస్తే, ఏంటీడిప్రెసెంట్స్ సహాయపడొచ్చు.
|