హెచ్.ఐ.వి / ఎయిడ్స్ గురించిన సమాచారాన్ని తెలుసుకొని పాటించటం ఎందుకు ముఖ్యమంటే...
హెచ్.ఐ.వి / ఎయిడ్స్ గురించి తెలుసుకోవటానికి ప్రతి కుటుంబం, సమాజం ఏయే హక్కులు కలిగి ఉన్నాయి.
ఎయిడ్స్ కు మందు లేదు. కాని ఈ వ్యాధిని నివారించవచ్చు. ఎయిడ్స్ ను కలుగుజేసే హెచ్.ఐ.వి వైరస్ అసురక్షిత లైంగిక చర్య (కండోమ్ లేకుండా సంభోగించటం) ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంకా, స్క్రీనింగ్, చేయకుండా జరిపిన రక్త మార్పిడి, కలుషితమైన సూదులు, సిరంజీలు (డ్రగ్స్ కోసం ఎక్కువగా ఉపయోగించేవి) కూడా ఎయిడ్స్ వ్యాధిని కలుగజేస్తాయి. అంతేగాకుండా, ఈ వ్యాధితో ఉన్న మహిళ నుంచి ఆమె గర్భంలోని శిశువుకు లేదా ఈ వ్యాధి గ్రస్తులైన మహిళ పాల ద్వారా ఆమె శిశువుకు ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్నీ వైరస్ (హెచ్.ఐ.వి) ఎయిడ్స్ వ్యాధిని కలుగజేస్తుంది. రోగనిరోధకానికి మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థను ఈ వైరస్ ధ్వంసం చేస్తుంది. హెచ్.ఐ.వి సంక్రమించిన వ్యక్తులు ఈ వ్యాధి లక్షణాలేవీ బయటికి కనిపించకుండా కొన్నేళ్ల పాటు మామూలుగా జీవిస్తారు. వారు చూడడానికి ఆరోగ్యంగానే కనిపించినప్పటికీ, వైరస్ ను వారు ఇతరులకు బదిలీ చేయగలరు. హెచ్.ఐ.వి సంక్రమించిన తర్వాత వచ్చేదశ ఎయిడ్స్. ఎయిడ్స్ తో ఉన్న వ్యక్తులు రోగాలతో పోరాడే శక్తి లేక బలహీనంగా మారతారు. పెద్దలకు హెచ్.ఐ.వి. సోకిన 7 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ వ్యాధి పెరుగుతుంది. చిన్న పిల్లల్లో మాత్రం ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎయిడ్స్ వ్యాధికి మందులేదు. కాని, కొత్తగా వచ్చిన కొన్ని ఔషధాలు ఈ వ్యాధి గ్రస్తులు ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడగలవు. చాలా కేసుల్లో, హెచ్.ఐ.వి ఒకరి నుంచి ఒకరికి అసురక్షిత సంభోగం ద్వారా బదిలీ అవుతుంది వ్యాధితో ఉన్న వ్యక్తి వీర్యం, యోని స్రవాలు లేదా రక్తం ఇంకొకరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. స్టెరిలైజ్ చేయని సూదులు, సిరంజీలు (ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవటానికి ఉపయోగించేవి), బ్లేడ్లు, చాకులు, చర్మాన్ని కోయటానికి ఉపయోగించే ఇతర పరికరాలు, రక్త మార్పిడి ద్వారా కూడా హెచ్.ఐ.వి సంక్రమిస్తుంది. మార్పిడి చేయబోయే ముందు ప్రతి రక్తాన్ని స్క్రీనింగ్, చేయాలి, అంటే ఆ రక్తంలో హెచ్.ఐ.వి వైరస్ లేదని ధృవీకరించే పరీక్ష చేయాలి. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ వ్యాధి ఈ వ్యాధి చర్యల ద్వారా రాదు. వ్యాధి గ్రస్తులను తాకటం, హత్తుకోవటం, షేకే హ్యాండ్ ఇవ్వటం, తుమ్మటం, దగ్గటం. అంతేగాక, టాయలెట్ సీటు, టెలిఫోన్, ప్లేట్సు, గ్లాసులు, భోజనం పాత్రలు, టవల్స్, దుప్పట్లు, స్విమ్మింగ్ ఫూల్, పబ్లిక్ టాయిలెట్ ల ద్వారా కూడా ఈ వ్యాధి మార్పిడి కాదు. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ దోమకాటు ద్వారా ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి కాదు.
పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకొని, చైతన్యం కావలసిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. వ్యాది అపాయాన్ని తగ్గించటానికి సులువుగా కండోమ్స్ అందుబాటులో ఉండాలి. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ తో జీవించే శిశువులు, చిన్న పిల్లలకు చక్కని పౌష్ఠికాహారం, వ్యాధి నిరోధక టీకాలు, క్రమబద్దమైన ఆరోగ్య సంరక్షణ లాంటివి ప్రత్యేకంగా జరపాలి. తద్వారా బాల్యంలో ప్రాణాంతకంగా మారే సాధారణ అనారోగ్యాల ముప్పును తప్పించవచ్చు. చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తే, వారి తల్లికి, బహుశా వారి తండ్రికి కూడా ఈ వ్యాధి వచ్చి ఉంటుంది. గృహ సంరక్షణలో పిల్లలకు సందర్శించవలసిన అవసరం ఉంటుంది. హెచ్.ఐ.వి. సంక్రమణలు అత్యధికంగా ఉన్న దేశాల్లో, చిన్న పిల్లలకు, ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటమే గాక, ఎయిడ్స్ తో అతలాకుతలం అయ్యే వారి కుటుంబాలు, సమాజం ప్రభావం కూడా వారిపై ఉంటుంది.
తమకు హెచ్.ఐ.వి సోకిందనే అనుమానం కలిగిన స్త్రీ లేదా పురుషుడు వెంటనే గోప్యంగా సలహాలు పొంది, పరీక్షలు చేయించుకోవటానికి ఆరోగ్య కార్యకర్తను లేదా హెచ్.ఐ.వి / ఎయిడ్స్ కేంద్రాన్ని సంప్రదించాలి. హెచ్.ఐ.వి సంక్రమణము తొలి దశలోనే ధృవీకరించటానికి హెచ్.ఐ.వి సలహా పరీక్షల కేంద్రాలు సహాయపడతాయి తద్వారా వ్యాధిగ్రస్తులు తమకు అవసరమైన సహాయ, సహాకారాలు పొందటానికి తోడ్పడతాయి. ఇతర అంటువ్యాధులతో ఎలా మెలగాలి, హెచ్.ఐ.వి / ఎయిడ్స్ తో తదుపరి జీవనం ఎలా కొసాగించాలి, ఇతరులకు ఈ వ్యాధి అంటించకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను కూడా ఈ కేంద్రంలో బోధిస్తారు. భవిష్యత్ లో ఈ వ్యాధి సోకకుండా ఉండటానికి కూడా హెచ్.ఐ.వి సలహా పరీక్షల కేంద్ర వ్యక్తులకు సురక్షితమైన శృంగారం గురించి బోధించి సహాయ పడగలదు. ఒకవేళ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పరీక్ష ఫలితాలు నెగిటివ్ గా వస్తే, ఆ వ్యక్తికి ఇంకా వ్యాధి సోకలేదనీ లేదా ఈ వైరస్ ను కనుగొనటానికి తగినంత సమయం నిండలేదనీ అర్థం. హెచ్.ఐ.వి రక్త పరీక్షలో మొదటి ఆరు నెలలు వరకు ఆ వ్యాధి బయటపడదు. ఈ రక్త పరీక్షను తిరిగి ఆరునెలల తర్వాత మళ్లీ చేయించాలి. అప్పటిలోగా, ఆ వ్యక్తి ఇతరులకు ఈ వైరస్ ను అంటించకుండా సెక్స్ సమయంలో కండోమ్ ధరించాలి లేదా యోనిలోకి ప్రవేశించకుండా ఉండటం చాలా ముఖ్యం. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై గోప్యంగా సలహాలు పొంది, పరీక్షలు చేయించుకోవటానికి, తగిన సహాయం పొందటానికి కుటుంబాలు, సమాజం డిమాండ్ చేయాలి. పెద్దలు పిల్లలు ఈ వ్యాధి నుంచి రక్షణ పొండటానికి అవసరమైన సమాచారాన్ని కూడా డిమాండ్ చేసి తీసుకోవాలి. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పరీక్ష ల ద్వారా దంపతులు తమకు పిల్లలు కావాలా, వద్దా అని నిర్ణయించుకోగలుగుతారు. ఈ పరీక్ష చేయకపోతే, వ్యాధి సోకిన దంపతుల్లో ఒకరు గర్భదారణ ప్రయత్నంలో మరొకరికి ఈ వైరస్ ను బదిలీ చేసే ప్రమాదం ఉంది. హెచ్.ఐ.వి ఎలా సోకగలదో యుక్త వయస్కులు తెలుసుకొని, సెక్స్ కు దూరంగా ఉండటం, కండోమ్స్ అందుబాటులో ఉండటం ద్వారా తర్వాతి తరానికి ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా చేయటం సాధ్యమవుతుంది.
సెక్స్ ద్వారా హెచ్.ఐ.వి సోకకుండా ఉండాలంటే దాని జోలికి పోకుండా ఉండటం ఉత్తమం. ఈ వ్యాధి సోకే ప్రమాదాన్ని తగ్గించాలంటే - లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలి లేదా వ్యాధులు లేనివారే పరస్పరం శారీరకంగా కలుసుకోవాలి లేదా సురక్షితమైన లైంగిక అంటే యోనిలోకి ప్రవేశం లేకుండా లేదా కండోమ్ తొడుక్కొని మాత్రమే సెక్స్ జరపటం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ కండోమ్స్ ను సరైన పద్ధతిలో వాడటం ద్వారా హెచ్.ఐ.వి సోకటాన్ని నిరోధించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాధి లేని లైంగిక భాగస్వాములిద్దరూ పరస్పరం విశ్వాసానికి కట్టుబడి ఉంటే హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నుంచి రక్షణ లభిస్తుంది. లైంగిక భాగస్వాములు ఎంత ఎక్కువగా ఉంటే, హెచ్.ఐ.వి / ఎయిడ్స్ సంక్రమించటానికి అంత ఎక్కువ ప్రమాదం ఉంటుంది. దంపతుల్లో అలా ఒక్కరికి సోకిన వైరస్ ను ఇంకొకరికి బదిలీ చేస్తారు. లైంగిక భాగస్వాములు ఎక్కువగా వున్న వారికే కాకుండా హెచ్.ఐ.వి / ఎయిడ్స్ వ్యాధి ఎవరికైనా సంక్రమించగలదు. హెచ్.ఐ.వి సంక్రమించినదీ, లేనిదీ ఖచ్చితంగా నిర్థారించి చెప్పటానికి రక్త పరీక్ష ఒక్కటే మార్గం ఈ వ్యాధి సోకిన వ్యక్తి చూడటానిక పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తారు. లైంగిక భాగస్వాములు ఇద్దరూ తమకు హెచ్.ఐ.వి సంక్రమించలేదని నిర్దారించుకుంటే తప్ప శారీరకంగా కలవరాదు. ఒకవేళ కలవాల్సి వచ్చినా సురక్షితమైన పద్ధతులను పాటించాలి. అవి, ఎలాగంటే, పురుషాంగాన్ని నోట్లోకి, యోని లేదా మలాశయంలోకి ప్రవేశ పెట్టకుండా సెక్స్ జరపాలి లేదా సంభోగించిన ప్రతిసారి సరికొత్త లేటెస్ట్ కండోమ్ వాడాలి. జంతు చర్మంలో చేసిన కండోమ్ లు లేదా పలుచనైన సున్నితమైన కండోమ్ లతో పోలిస్తే లేటెస్ట్ కండోమ్ లు చిరిగిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గుర్తించుకోండి, ఒకసారి వాడిన కండోమ్ ను తిరగివాడరాదు. లైంగిక భాగస్వాములు ఇద్దరికీ హెచ్.ఐ.వి లేదని ఖచ్చితంగా నిర్థారణ అయితే తప్ప, సంభోగం జరిగిన ప్రతిసారి కండోమ్ తొడుక్కోవటం శ్రేయస్కరం. అసురక్షితంగా (కండోమ్ లేకుండా) కేవలం ఒకసారి సెక్స్ జరిపినా హెచ్.ఐ.వి సంక్రమించగలదు. హెచ్.ఐ.వి నివారణకు సంభోగం యోని ద్వారా జరిపినా లేదా మలాశయం ద్వారా జరిపినా కండోమ్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి. నున్నగా, జారిపోయే చమురు (జెల్) తో తయారైన లాబ్రికెంట్ కండోమ్ లు చిరిగిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ కండోమ్ నున్నగా లేకపోతే, సిలికాన్ లేదా గ్లిజరిన్ లాంటి నీటి ఆధార చమురు కలపాలి. ఒకవేళ ఇలాంటివి అందుబాటులో లేకపోతే, ఉమ్మి నీరు వినియోగించాలి. నూనె లేదా పెట్రోల్ (వాజిలిన్, ఇతర లోషన్ లు ) తో తయారు చేసిన లూబ్రికెంట్ కండోమ్ ను వాడరాదు. ఎందుకంటే, అవి త్వరగా చిరిగిపోతాయి. మలాశయం ద్వారా సంభోగం జరపటానికి, లూబ్రికెంట్ చేసిన చక్కని కండోమ్ చాలా అవసరం. నోటి ద్వారా జరిగే సెక్స్ తో హెచ్.ఐ.వి ఒకరి నుండి ఒకరికి పాకగలదు. కనుక పురుషుడైతే కండోమ్ ధరించాలి. మహిళకైతే వెడల్పాటి లేటెక్స్ ముక్కను అట్టుపెట్టాలి. లైంగిక వ్యాధులు ఎక్కువగా జననేంద్రియాలను తాకటం వల్ల వస్తాయి. కనుక, జననేంద్రియాలను తాకించటం కన్నా ముందుగానే కండోమ్ ధరించాలి. పురుషాంగాన్ని దూర్చకుండా జరిపే సెక్సు హెచ్.ఐ.వి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే, అన్ని రకాల లైంగిక వ్యాధులకు ఈ పద్ధతే సురక్షితం కాదు. పురుషుల కండోమ్ కు సురక్షితమైన ప్రత్యామ్నాయం మహిళల కండోమ్. మహిళలు ధరించే కండోమ్ మెత్తగా, వదులుగా,యోని ఆకారంలో ఉంటుంది. పాలీయురేతాన్ తో చేసిన ఒర ( కత్తిని దాచే పరికరం) లాగా ఉంటుంది. దీనికి రెండు చివరలా మెత్తని రింగు ఉంటుంది. మూసి ఉన్నరింగు చివరను యోనిలోకి చొప్పించాలి. తెరచి వున్న రింగు చివర యోని బయట ఉండి మర్మాంగానికి ఇరువైపులా ఉన్న లాబియాపై పరచుకొని ఉంటుంది. సెక్స్ జరిపే ముందు, మహిళ తన చేతి వేళ్లతో ఈ కండోమ్ ను యోనిలోకి చొప్పించాలి. పురుషుల కండోమ్ లాగా కాకుండా, మహిళల కండోమ్ కు ఎలాంటి లూబ్రికెంట్ అయినా (నీటి ఆధారమైన లేదా నూనె, పెట్రోల్ ఆధారమైన జిగురు) వాడవచ్చు. ఇది పాలీయురేథాన్ తో చేసినది కనుక ఏమీ కాదు. మద్యం లేదా డ్రగ్స్ మత్తులో సరైన నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు. ఎయిడ్స్ ప్రమాదం గురించి తెలిసిన వారే అయినప్పటికీ, సురక్షితమైన సెక్స్ ఎంత ముఖ్యమో ముందు అర్థం అయినప్పటికీ, నిషాలో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్ జరుపుతారు.
ముఖ్యంగా అమ్మాయిలూ ఎక్కువగా హెచ్.ఐ.వి. బారిన పడే ప్రమాదం ఉంటుంది. వీరు తమను తాము కాపాడుకోవటానికి, అవాంఛనీయమైన లేదా అసురక్షితమైన సెక్స్ నుంచి వీరిని రక్షించటానికి మద్దతు అవసరం. అనేక దేశాల్లో, ఇరవై ఏళ్లలోపు (టీనేజీ) వయస్సు అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉంది. టీనేజీ అమ్మాయిలు హెచ్.ఐ.వి ఇన్ ఫెక్షన్ కు ఎక్కువగా ఎందుకు గురవుతారంటేః
యుక్త వయస్కులు హెచ్.ఐ.వి /ఎయిడ్స్ వ్యాధికి గురికాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహాయం చేయగలరు. ఈ వ్యాది సంక్రమించకుండా, దీన్ని అరికట్టే విధానాల గురించి, పురుష, స్త్రీ కండోమ్ లను సరైన తీరులో ఎల్లవేళలా ఉపయోగించటం గురించి పెద్దలు యుక్త వయస్కులకు బోధించి వారిని ఈ వ్యాధి నుంచి కాపాడాలి. హెచ్.ఐ.వి /ఎయిడ్స్ తో వచ్చే ప్రమాదాన్ని యువజనులు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకులు, ఊరి పెద్దలు అందరూ కూడా హెచ్.ఐ.వి /ఎయిడ్స్ గురించి యువజనులు హెచ్చరించి, చైతన్యం కలిగించాలి. ఈ వ్యాధి కలిగించే ప్రమాదాన్ని, ఇతర లైంగిక వ్యాధులు, అవాంఛనీయ గర్భధారణ గురించి అవగాహన పెంచాలి. లేత యవ్వనపు (టీనేజీ) పిల్లలతో సెక్సు విషయాలను మాట్లాడాలంటే వారి పెద్దలకు వెగటు కలిగించవచ్చు. స్కూలు వయస్సు పిల్లలతో ఈ చర్చను ప్రారంభించటానికి చక్కని మార్గం ఏమిటంటే, హెచ్.ఐ.వి /ఎయిడ్స్ గురించి వారు ఏమి చెప్పే విషయాల్లో ఏదైనా తప్పు ఉంటే, దాన్ని అవకాశాన్ని తీసుకొని వారికి సరైన సమాచారం ఇవ్వండి. ఈ అంశంలో యుక్త వయస్కులు చెప్పేది వినటం, వారితో మాట్లాడటం చాలా ముఖ్యం దీనిపై మాట్లాడటానికి ఒకవేళ తల్లిదండ్రులు ఇబ్బందికి గురయితే , టీచర్ నో, బంధువునో లేదా ఈ సున్నితమైన అంశాన్ని చక్కగా చర్చించగల ఇతరుల ద్వారా తమ పిల్లలకు అవగాహన కలిగించాలి. హెచ్.ఐ.వి /ఎయిడ్స్ రాకుండా టీకా లాంటి దేమీ ఉండదనీ, ఈ వ్యాధికి మందే లేదని యువజనులకు స్పష్టంగా తెలియజేయాలి. ఈ వ్యాదికి నయంలేదనీ, నివారణ ఒక్కటే మార్గమనీ విడమర్చి చెప్పాలి. యుక్త వయస్కులు సెక్సును తిరస్కరించేటంత తెలివి, సామర్థ్యం కలిగి ఉండాలి. కేవలం తాకినంత మాత్రాన లేదా కలిసి చదువుకోవటం, ఆడుకోవటం ద్వారా హెచ్.ఐ.వి వచ్చే ప్రమాదం లేదని పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ తో నివసిస్తున్న వారికి సంరక్షణ, మద్దతు అవసరం. వారిపట్ల యువజనులు దయ, కనికరం చూపి సహాయపడాలి.
గర్భస్థ దశలో హెచ్.ఐ.వి తల్లి నుంచి శిశువుకు సంక్రమించగలదు. శిశు జననం లేదా తల్లి పాల ద్వారా కూడా ఈ వ్యాది పిల్లలకు సోకుతుంది. హెచ్.ఐ.వి సోకిన లేదా సోకినట్లు అనుమానిస్తున్న గర్భణీ స్త్రీలు, బాలింతలు పరీక్ష చేయించుకొని, సలహాలు పొందటానికి ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి. తల్లి నుంచి శిశువుకు హెచ్.ఐ.వి బదిలీ కాకుండా చూడటానికి చక్కని మార్గం ఏమిటంటే, ఆ మహిళకు హెచ్.ఐ.వి సంక్రమించకుండా నివారించటమే. మహిళను స్వయం శక్తిమంతులను చేయటం సురక్షితమైన సెక్స్ గురించి ప్రచారం చేయటం, కండోమ్ వాడటం, లైంగిక వ్యాధులను వెంటనే గుర్తించి, చికిత్స చేయటం లాంటి చర్యల ద్వారా మహిళలకు హెచ్.ఐ.వి సంక్రమించటాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ, మహిళ తనకు హెచ్.ఐ.వి సోకినట్లు కనుగొంటే ఆమెకు మానసిక స్థైర్యం ఇవ్వటానికి మద్ధతు అవసరం. ఆమె భవిష్యత్ జీవన ప్రణాళికకు తగిన సలహాలు అవసరం. భవిష్యత్ జీవనానికి తగిన నిర్ణయాలు తీసుకోవటానికి ఆ మహిళకు ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక మద్దతు దారులు అండదండలు ఇవ్వాలి. గర్భిణి మహిళ తెలుసుకోవలసిందిః
కొత్తగా తల్లులయిన వారు తమ శిశువుకు పాలు త్రాగించడానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల పద్ధతులు, వాటితో ముడిపడి వున్న ప్రమాదాల గురించి తెలుసుకోవాలి. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త శిశువుకు తగిన ఆహారం / పాలు అందించే పద్ధతిని గుర్తించి, అతడు హెచ్.ఐ.వి లేకుండా పూర్తి ఆరోగ్యంగా పెరిగేటట్లు తోడ్పడాలి. హెచ్.ఐ.వి తో ఉన్న మహిళ ఎలాంటి ఔషధాలు తీసుకోకపోతే ఆమెకు పుట్టబేయే శిశువుకు హెచ్.ఐ.వి ఇన్ ఫెక్షన్ సోకటానికి మూడింట ఒక వంతు అవకాశం ఉంటుంది. హెచ్.ఐ.వి తో జన్మించిన శిశువుల్లో మూడింట రెండు వంతుల మంది ఐదేళ్ల వయస్సు వచ్చే సరికి మరణిస్తారు.
వేడి నీటిలో మరగబెట్టకుండా ఉపయోగించే సూదులు, సిరంజీలు (ఎక్కువగా మత్తు మందులకు వాడేవి) హెచ్.ఐ.వి ని వ్యాప్తి చేస్తాయి. వాడిన రేజర్ బ్లేడ్లు కత్తులు లేదా చర్మాన్ని కోయటానికి ఉపయోగించిన పరికరాలు కూడా హెచ్.ఐ.వి ప్రమాదాన్ని కొంత వరకు కలిగి ఉంటాయి. స్టెరిలైజ్ చేయని ( అంటే, వేడి నీటిలో మరగ బెట్టని) సిరంజీలు, సూదులు హెచ్.ఐ.వి ని ఒకరి నుంచి ఒకరికి సంక్రమింపజేస్తాయి స్టెరిలైజ్ చేయకుండా ఎలాంటి పరికరాన్ని కూడా చర్మంలో గుచ్చరాదు. మాదక ద్రవ్యాలను ఇంజెక్ట్ చేసుకొనే వారు లేదా ఇలాంటి వారితో అసురక్షత సెక్స్ జరిపే వారికి హెచ్.ఐ.వి సోకే ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకునే వారు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన సూదులు, సిరంజీ లను ఉపయోగించాలి. ఇతరులకు చెందిన సూది, సిరంజీలను వాడరాదు. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేతనే సూది తీసుకోవాలి. టీకా సూది మందు ఇవ్వడానికి పిల్లలకైనా, పెద్దలకైనా ప్రతి ఒక్కరికీ సరికొత్త సూది, సిరంజీలను లేదా కనీసం నీటిలో మరగబెట్టిన సూది, సిరంజీలను వాడాలి. సూది, సిరంజీలను ఒకరితో పంచుకుంటే (వారు కుటుంబ సభ్యలైనా సరే) హెచ్.ఐ.వి లేదా ఇతర ప్రాణాంతక వ్యాధులు అంటుకుంటాయి. సూది, సిరంజీలను ఎవ్వరు కూడా పంచుకోరాదు. తమ పిల్లలకు సూది (ఇంజన్షన్) ఇప్పించేటప్పుడు తల్లి, దండ్రులు ప్రతి ఒక్కరికీ సరికొత్త సూది, సిరంజీని లేదా కనీసం మరగబెట్టిన సూది, సిరంజీని వాడవలసిందిగా ఆరోగ్య కార్యకర్తకు చెప్పాలి. స్టెరిలైజ్ చేయకుండా రేజర్ బ్లేడు, చాకు లాంటి పరికరాలతో చర్మం పై పెట్టే గాటు హెచ్.ఐ.వి ని కలుగ జేయవచ్చు. ఇలాంటి పరికరాలను ప్రతి ఒక్కరికీ , వారు ఒకే కుటుంబ సభ్యులైనా సరే స్టెర్లైజ్ చేసి తరువాతే వాడాలి. అప్పుడే జన్మించిన శిశువు బొడ్డు తాడు కోయడానికి ఉపయోగించే పరికరాన్ని స్టెరిలైజ్ చేసి మాత్రమే వాడాలి. ప్రసవ సమయంలో స్రవించే నెత్తురు, బొడ్డు తాడు విషయంలో ప్రత్యేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అందుబాటులో ఉంటే , లేటెక్స్ గ్లోవ్స్ ను చేతులకు తొడుక్కొని కాన్పు ప్రక్రియలో పాల్గొనాలి. దంత చికిత్స, పచ్చబొట్టు పొడిపించటం, చెవులు కుట్టించటం, ముఖంపై ముద్రలు, ఆక్యుపంక్చర్ లాంటి వాటిల్లో ఉపయోగించే సూది, తదితర పరికరాలను స్టెరిలైజ్ చేయకుండా వాడితే ప్రమాదకరం . వీటిని ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగించే ముందు స్టెరిలైజ్ (వేడి నీటిలో మరగబెట్టడం) చేయటం తప్పని సరి. పైన పేర్కొన్న ప్రక్రియలు నిర్వహించే వ్యక్తి ఆ సందర్భంగా కారే రక్తంతో పరికరాలు తగలకుండా నివారించాలి.
లైంగిక అంటువ్యాధులు (ఎస్.టి.ఐ) కలిగిన వ్యక్తులు హెచ్.ఐ.వి.కి గురికావటానికి లేదా వ్యాప్తి చెందించటానికి అత్యధిక అపాయకారులుగా ఉంటారు. ఎస్.టి.ఐ కలిగిన వ్యక్తులు వెంటనే తీసుకోవాలి. లైంగిక సంపర్కాన్ని నిరోధించాలి లేదా సురక్షిత సెక్స్ చేయాలి. (అంటే, పురుషాంగాన్ని దూర్చకుండా లేదా కండోమ్ ఉపయోగించి మాత్రమే సెక్స్ చేయాలి. లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించిన అంటు వ్యాధులను సెక్సువల్లీ ట్రాన్స్ మిట్టెడ్ ఇన్ ఫెక్షన్స్ (ఎస్.టి.ఐ) అని అంటారు. ఇవి వీర్యం యోనిస్రవాలు, రక్తము ఒకరి శరీరం నుంచి ఇంకొకరికి బదిలీ కావటం ద్వారా గానీ మర్మాంగం ప్రదేశం లోని చర్మాన్ని తాకటం (ముఖ్యంగా అక్కడ ఎస్.టి.ఐ.తో ఏర్పడిన బొబ్బలు, వాపు, గాయాలు లాంటి వాటి) ద్వారా గానీ సంక్రమిస్తుంది. ఎస్.టి.ఐ ( లైంగిక వ్యాధులు) శారీరకంగా బాధలు పెట్టి వ్యాధిగ్రస్తుణ్ణి దెబ్బతీస్తుంది. గనేరియా, సిఫిలిస్ లాంటి లైంగిక వ్యాధులు హెచ్.ఐ.వి సోకే ప్రమాదాన్ని అత్యధికంగా పెంచుతాయి. ఇలాంటి వ్యక్తులు అసురక్షిత పద్ధతులతో సంపర్కం జరిపితే హెచ్.ఐ.వి సంక్రమించే అవకాశాలు 5 నుంచి పదింతలు పెరుగుతాయి. ఎల్లవేళ్లా లెటెక్స్ కండోమ్ లు సరైన పద్ధతిలో ఉపయోగించి మాత్రమే సెక్స్ జరిపితే హెచ్.ఐ.వి తో సహా ఇతర లైంగిక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. లైంగిక వ్యాధులు సోకినట్లు అనుమానిస్తున్న వ్యక్తులు వెంటనే ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి చికిత్స పొందాలి. ఇలాంటి వ్యక్తులు లైంగిక సంపర్కం నుంచి దూరంగా ఉండాలి లేదా సురక్షిత పద్ధతుల తో సెక్స్ చేయాలి అంటే, పురుషాంగాన్ని దూర్చకుండా లేదా కండోము తొడుక్కొని మాత్రమే సెక్స్ జరపాలి. తమకు లైంగిక వ్యాధి ఉందని కనుగొంటే, ఆ విషయాన్ని తమ లైంగిక భాగస్వామికి తెలియజేయాలి. ఒకవేళ, ఇద్దరికీ ఈ వ్యాధులు ఉంటే, వాటిని ఒకరినుండి ఇంకొకరికి బదిలీ చేసుకోవటం కొనసాగుతూనే ఉంటుంది. లైంగిక వ్యాధులు (ఎస్.టి.ఐ.) అనేకం నయం కాగలవు. లైంగిక వ్యాధి కలిగిన పురుషుడు మూత్ర విసర్జన సమయంలో నొప్పికి లేదా అసౌకర్యానికి గురవుతాడు. అతని పురుషాంగం నుంచి చీము, నెత్తురు స్రవిస్తాయి లేదా పురుషాంగం పైన గానీ నోటిలో గానీ పుండ్లు, వాపు, దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. లైంగిక వ్యాధి సోకిన మహిళ యోనిలో నుంచి దుర్వాసనతో కూడిన స్రవాలు కారతాయి. ఆమె మర్మాంగం చుట్టూ నొప్పి లేదా దురద కలుగుతుంది. సంపర్క సమయంలో లేదా ఆ తర్వాత గానీ ఆమె యోనిలో నొప్పి కలుగుతుంది లేదా రక్తస్రావం జరుగుతుంది. అంటువ్యాధులు తీవ్రమైన జ్వరం వస్తుంది, కడుపులో నొప్పి కలుగుతుంది, సంతాన విహీనులవుతారు. అయితే, మహిళలకు సంక్రమించే లైంగిక వ్యాధుల్లో చాలా వరకు లక్షణాలను ప్రదర్శించవు. అలాగే పురుషుల్లో కొన్ని లైంగిక వ్యాదులు తమ లక్షణాలను పెద్దగా చూపవు. అలాగే మర్మాంగం ప్రదేశంలో ఏర్పడే ప్రతి సమస్యా లైంగిక వ్యాధి కాదు. కొన్ని ఇన్ ఫెక్షన్ ల కారణంగా, ఉదాహరణకు క్యాండియాసిస్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్ సెక్సుతో సంబంధం లేకుండా వస్తాయి. కాని, మర్మాంగం వద్ద తీవ్ర ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలుగుజేస్తాయి. లైంగిక వ్యాధుల నిర్ధారణ (డయాగ్నసిన్) ను ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా చేస్తారు. అయితే, ఈ పరీక్షలు కొందరికి అందుబాటులో ఉండవు లేదా చాలా ఖర్చుతో కూడిన పని. ఎస్.టి.ఐ. లక్షణాలు గల వ్యక్తుల్లో లైంగిక వ్యాధులను సిండ్రోమిక్ మేనేజ్ మెంట్ ద్వారా నియంత్రిచాలని 1990 వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. సిండోమిక్ మేనేజ్ మెంట్ ముఖ్యాంశాలు ఏమిటంటే........
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/26/2020
ఎయిడ్స్ కారక వైరస్.. ప్రధానంగా 'హెచ్ఐవి పాజిటివ...
ఈ అంశంతీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ గురించి సమాచారాన్ని...
కాన్పులకు వ్యవధి అనే సమాచారాన్ని అందరూ తెలుసుకొని ...