অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖరారవుతున్న ఖగోళ జివాధారాలు

ఖరారవుతున్న ఖగోళ జివాధారాలు

ఈ విశాల విశ్వంలో మన భూగ్రహం మీదే జీవం ఉందా? మరేచోట జీవం ఉండే అవకాశాలు లేవా? ఈ ప్రశ్నరాని మనిషి ఉండడు. అందుకే NASA వాళ్ళు SETI (Search for Extra Terrestrial Intelligence) అనే ఉపసంస్థను స్థాపించి దాని ద్వారా విశ్వంతరాళ పరిశోధనలలో విశ్వంలో జీవాన్వేషణకు పురికొల్పారు.

"ఇదుగో చూడండి. మేమిలా ఉంటాం. మా భూమి యిలా ఉంటుంది' అన్న సమాచారాన్ని మోసుకెళూ యిప్పటికే NASA వాళ్ళు పంపిన పయినీర్-10 (1972) పయినీర్-11 (1973), వాయేజర్-I, వాయేజర్-II (1977) వ్యోమ శకలాలు సౌర కుటుంబాన్ని దాటి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిసూనే ఉన్నాయి. అవి మన దూత లాగా గాలిపటాల్లాగా విశ్వంలోకి బొరబడు తున్నాయి. వాటిలో ఉన్న మెసేజ్లకు మనకు యింతవరకు రిపై లేదు.

కానీ కార్డ్సాగన్, ఫ్రాంక్ డ్రేక్ (Drake) ల వంటి ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం మనలాంటి మేధస్సు, సమాచార పంపిణీ సామర్థ్యం ఉన్న నాగరిక సమాజాలతో కూడిన జీవజాతులు ఈ విశ్వంలో మన పాలపుంత గెలాక్సిలోనే కనీసంలో కనీసం 100 గరిష్టంగా 30 కోట్ల వరకు ఉండవచ్చని గణితం ఆధారంగా లెక్కించారు. solarsysytem.jpgఅయితే ఈ మధ్యనే NASA వారు సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో జీవం ఉండే ఆస్కారం ఉన్న నక్షత్రాన్ని కనుగొన్నారు. దాని పేరు M8. పరిశోధించిన టెలిస్కోపు ఆధారంగా దానిని TRAPPIST-1 అనికూడా అంటారు. TRAPPIST అంటే పూర్తి పేరు Transmitting Planets and Planetesimals Small Telescope ఈ నక్షత్రానికి ఖగోళశాస్త్ర పరిభాషలో యిచ్చిన పేరు 2MASSJ23062928. ఇది నక్షత్ర జాతుల ఆధారంగా “అరుణకుబ్జ” (Red Dwarf). ఈ నక్షత్రం చుట్టూ 7గ్రహాలే అతిచేరువలో పరిభ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

వాటికీ b,c,d,e,f,g,h అని పేర్లు పెట్టారు. తమాషా ఏమిటంటే ఈ నక్షత్రం మన సూర్యుడు (నక్షత్రం) కంటే ఘనపరిమాణంలో సుమారు వెయ్యిరెట్లు చిన్నది. కానీ మన సౌర మండలంలో భూమికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న జూపిటర్ (గురుగ్రహం కన్నా) TRAPPIST-1 నక్షత్రపు బరువు సుమారు 80 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాదు b to h గ్రహాలు ట్రాపిస్ట్-1 నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్నాయి. సూర్యుడితో పోలిస్తే నక్షత్రపు వెలుగు సుమారు 5 శాతం మాత్రమే (సుమారు 20 రెట్లు తక్కువగా) ఉంది. innersolar.jpgఅయినా వున సౌరమండంలో మనం నివాసముంటున్న భూమి మీద ఎంత వరకు సూర్యకాంతి అక్కడ d గ్రహం (మూడవ గ్రహం) మీద కూడా అంతే మోతాదులో దగ్గరగా ఉండడం వల్ల వెలుగ (luminosity) కూడా భూమి లాగానే ఉందట. అంటే భూమ్మీద జీవం ఉండడానికి ఏ వాతావరణ, శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా నీరు, గాలి, శీతోష్ణ పరిస్థితులు ఉన్నట్లు ప్రయోగం ద్వారా తెలుస్తోంది. మన భూమి సూర్యుడి చుటూ తిరగడానికి సుమారు 365 రోజులు పడితే అక్కడ d గ్రహం (మూడవ గ్రహం) ట్రాపిస్ట్-1 నక్షత్రం చుటూ ఓ సారి తిరగడానికి కేవలం 4 రోజులే పడుతుంది. తనచుటూ తాను తిరగడానికి పట్టే సమయం సుమారు 10 గంటలు ఉంటుంది. అంటే అక్కడ సంవత్సరానికి 10 రోజులే (d గ్రహం పరంగా) నన్నమాట.

సగటు ఉష్ణోగ్రత కూడ భూమికి లాగానే చాలా అనుకూలతలో అంటే సగటు ఉష్ణోగ్రత సుమారు 15° మరి ఈ TRAPPIST_1 ను దాని గ్రహాలను ఎలాకనుగొన్నారు? మనం భూమి నుంచి చూస్తే ఈ ట్రాపిస్ట్ నక్షత్రం మత్స్యరాశి (Pisces) చేరువలో ఉన్న కుంభరాశి (Aquaris) లో ఉంది. నక్షత్ర పరిశోధనాల యాల (observator) నుంచి చూస్తే ఇది 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు ఇది M8V తరహా నక్షత్రం అయినట్లు తెలుస్తుంది. దాని చుటూ గ్రహాలు చుట్టూ గ్రహాలు తిరగడం వల్ల అడపాదడపా అవి మనకు ట్రాపిస్టి కు మధ్యలో ఒకేరేఖ పై (colinear) ఉంటాయి. మనం వీనస్ విన్యాసాన్ని (Transit of Venus) చుసినట్లు ట్రాపిస్ట్-1 చుటూ తిరిగే గ్రహాల విన్యాసం వల్ల, ఆ మేరకు ట్రాపిస్ట్ వెలుగు తక్కువ అయినట్లు నక్షత్రశాలలు గుర్తించాయి. అంటే గ్రహం ఆ నక్షత్రం మీద నుంచి వెళ్ళే సమయంలో మనకు తక్కువ ట్రాపిస్ట్ కాంతి వస్తుంది. ఆ గ్రహం అటు వెళ్ళితే తిరిగి కాంతి యధారీతిగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎన్నిసార్లిలా, ఎంతకాలం ంులా జరుగుతోందన్న విషయం ఆధారంగా గ్రహాల సంఖ్యను, గ్రహాల పరిభ్రమణాన్ని లెక్కించారు. ఇందులో మనం గర్వపడాల్సిన విషయం ఒకటుంది. మే 2, 2016 న ట్రాపిస్ట్ నక్షత్రాన్ని దాని గ్రహాలను కనుగొనడంలో మనదేశంలో ఉన్న HCT నక్షత్రదర్శని (Himalayan chandra Telescope) పరిశోధనలు కూడా NASA కు తోడయ్యాయి, Indian Institute of Astroplysics లో ప్రోఫెసోర్ గా ఉన్న Sujan K. Sen Gupta, GC Anupama, Devender, K. Sahu మొదలయిన వారి సేవలు నిరుపమానమైనవి. ఈ మార్చి 5 నుండి 7 వరకు జయపూర్ నగరంలో జరిగిన ASI ( Astronominal Society of India) వారి వార్షిక సదస్సులో TRAPPIST-1 అవిష్కరణలో భారతదేశపు HCT (Ladakh) నక్షత్ర ప్రోయోగశాల పాత్ర గురించి తెలియజేశారు. భూమికి లాగానే అక్కడి d గ్రహం మీద జీవం ఉండే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ ప్రయోగాలు మరిన్ని వస్తవాల్ని తెలియజేస్తాయి. మీరే వారి మిత్రులు.

రచయిత: డా. టి.వి. వేకటేశ్వరన్, విజ్ఞాన్ప్రసార్, D.S.T., New Delhi

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/4/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate