నేడు రకరకాల కెరీర్ అవకాశాలు వస్తున్నాయి. వెరైటీ ఉద్యోగావకాశాలను కూడా చూస్త్తున్నాం. కెరీర్ ఎంపిక విషయంలో విద్యార్థులు గందరగోళానికి లోనవుతుంటారు. వీళ్లు కెరీర్‌లో సరైన దిశగా అడుగు వేసేలా కెరీర్ కౌన్సెలింగ్ ఎంతగానో సహాయపడుతుంది.
కెరీర్ కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ దగ్గర పని నేర్చుకుంటారు. ప్రొఫెషనల్స్ రకరకరాల కెరీర్ యాప్టిట్యూడ్స్, కెరీర్ అసె్‌సమెంట్ టెస్టులు చేస్తారు. అభ్యర్థుల తెలివితేటలు, నైపుణ్యం, బలాబలాల కనుగుణంగా నిర్దిష్టమైన కెరీర్‌ను నిర్ణయిస్తారు. వారిలోని బలహీనతలను కూడా కౌన్సిలర్లు గమనిస్తారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కౌన్సెలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కెరీర్ కౌన్సెలర్లు సూచిస్తారు. అలాగే కొత్త కెరీర్ ఆప్షన్స్ ఎంపికలో కూడా సహాయపడతారు. అంతేకాదు ప్రస్తుతమున్న కెరీర్‌లో ఎలాంటి మార్పుచేర్పులు అవసరమో కూడా సూచిస్తారు.
ఎన్నో రకాల కెరీర్ అవకాశాలు నేడు ఉన్నాయి. ఇది ఒక పాజిటివ్ అంశం. మీకు ఏ కెరీర్ బాగా ఉంటుందన్న విషయం కెరీర్ కౌన్సెలర్ చెపుతారు. దీనివల్ల అభ్యర్థి సమయం ఆదా అవడమే కాకుండా వారికి సరిపడ్డ కెరీర్‌లో రాణించగలుగుతారు.
రకరకాల కెరీర్‌లు ఉండడంతో వీటికి ట్రైనింగ్, ఎడ్యుకేషన్ కూడా అవసరమవుతుంది. వీటిల్లో కెరీర్ కౌన్సెలర్ల అండదండలు అవసరం. అభ్యర్థి ఎంచుకున్న కెరీర్‌లో విజయం సాధించాలంటే ఎలాంటి శిక్షణ అవసరమో కూడా కెరీర్ కౌన్సెలర్లు తెలియజేస్తారు.
జాబ్ వెతుకులాటలో ఉన్న అభ్యర్థులకు కూడా కెరీర్ కౌన్సెలర్లు ఎంతో బాగా ఉపయోగపడతారు. జాబ్‌లో సక్సెస్ కావడానికి అవసరమయ్యే టూల్స్‌ను, ఫీడ్‌బ్యాక్‌ను, వనరులను కెరీర్ కౌన్సెలర్లు అందజేస్తారు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి