ఐఐడిటి ( ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీస్)
పరిచయం
ఈనాటి సమాజంలో సాంకేతికత పెరిపోయిన తీరుతెన్నులు గూర్చి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో ఆకాశ హద్దులుదాటి విహరిస్తుంది. మరి ఇలాంటి సమయాలలో మన తెలుగు ప్రజలు దానికి అనుగుణంగా ఈరోజుల్లో వస్తున్న కోర్సులు, ఉద్యోగాలకు సరియైన పునాది.. అవసరమని భావించి మన నాయకులు డిజిటల్ విప్లవానికి సరియైన పునాది కావాలనే ఉద్యేశ్యం తో .... ఐ ఐ డి టి కి పునాది ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోతోంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఎందుకు
యువతకు ఉపాధి లక్ష్యంగా.
భావితరాల సాంకేతిక అభ్యున్నతికి.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా, పూర్తి స్థాయిలో భవిష్యతరం సాంకేతిక నైపున్యాలలో శిక్షణ అందించేందుకు అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీల సంస్థ ఐ ఐ డి టి (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీస్) ఎరపాతుకు రంగం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో ఈ ఏడాదే శిక్షణా తరగతులను ప్రారంబిస్తారు.
ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు.
అమరావతి మరియు విశాక పట్టణాలలో ఏర్పాటు యోచన కూడా ఉంది.
ప్రత్యేకతలు
శిక్షణ అంశాలు
ఐదు అంశాలో శిక్షణ ఇస్తుంది.
డేటా ఎనలిటిక్స్.
ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేన్స్.
వర్చువల్ రియాలిటి.
క్లౌడ్ టెక్నాలజీ.
ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఓ టి)
శిక్షణా కాలం
ఏడాది శిక్షణ ఉంటుంది.
బర్క్ లీ, స్టాన్ ఫర్డ్, యుటీ-ఆస్టిన్ వంటి వర్సితీలతో పాటు వివిధ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందినా నిపుణుల ద్వారా శిక్షణ అందజేస్తారు.
సిలికాన్ వ్యాలీ నుంచి కూడా ఆయా రంగాలలో నిపుణులు ఆన్ లైన్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా శిక్షణ ఇస్తారు.
అర్హత మరియు ఎంపిక విధానం
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రయోజనాలు
ఉద్యోగ అవకాశాలు కల్పించే నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
ఈనాడు ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీల నుండి షాపింగ్,బోధనా, భద్రతా, పరిపాలన ఇలా చాలా రకాల అంశాలు సాంకేతికత తో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి అన్ని విషయాలలో పూర్తి స్థాయి పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు.
ఐ ఐ డి టి శిక్షణతో ఐటీ, ఈ- కామర్స్ , బ్యాంకులు తదితర సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఈరకమైన కోర్సులకు ఆంధ్రప్రదేశ్ యువత హైదరాబాద్, బెంగుళూరు, డిల్లీ వంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిన అవసరం తప్పుతుంది.
ఈ కోర్సుల్లో తొలి ప్రాధాన్యం ఏపి యువతకే కల్పిస్తారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్ తరహాలో బోధన ఉంటుంది.
పారిశ్రామిక, వాణిజ్య, పరిపాలనా రంగాల అవసరాలకు తగినట్లుగా శిక్షణ ఉంటుంది.
భవిష్య కార్యాచరణ
రానున్న నాలుగేళ్ళలో విద్యార్ధుల సంఖ్యను 1500 పెంచాలని లక్ష్యం.
నాలుగేళ్ళలో 45 డిజిటల్ సాఫ్ట్ వేర్ అంకుర సంస్థలు..
ఎనిమిది ‘ఏపీ లో తయారీ’ క్రింద డిజిటల్ సాఫ్ట్ వేర్ ఉత్పతులు.
పేటెంట్ స్థాయిలో డిజిటల్ ఆవిష్కరణలు జరపాలనేది లక్ష్యం.
ఆధారం: ఈనాడు లో ప్రచురితమైన కథనం ఆధారంగా
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి