অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సామాజిక సంక్షేమం

సామాజిక సంక్షేమం

  • sw-img4

    భారతదేశంలో మానవాభివృద్ధి ధోరణులు

    మారుతున్న జనాభా ధోరణుల ప్రకారం 2020 నాటికి భారత పౌరుడి సగటు వయసు 29 ఏళ్లుగా ఉండనుంది. అప్పటికి మన శ్రమశక్తి గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అంచనా. అభివృద్ధి చెందిన చైనా, అమెరికా, జపాన్, పశ్చిమ యూరప్ దేశాలతో పోలిస్తే ఇది మనకు సానుకూలాంశంగా చెప్పవచ్చు.

  • sw-img5

    పేదరికం కొలమానాలు

    కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటారు. భారత్ లాంటి వర్థమాన దేశాల్లో సమాజంలోని సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడంలో శతాబ్ధాలుగా రాజకీయ, ఆర్థిక విధానాలు పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోవడంతో స్వాతంత్ర్యం సిద్ధించి 66 ఏళ్లు పూర్తయినా దేశంలో దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది.

  • sw-img6

    మహిళా స్వయం సహాయక సంఘాలు

    మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో గ్రామలు అభివృద్ధి పథంలో మరియు ఆర్థిక పరంగా పటిష్టంగా ఉండేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. మహిళా చైతన్యంతోనే గ్రామల్లోని పేదలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు.

తరతరాలుగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించేందుకు భారత రాజ్యాంగంలో నిర్దేశించిన మేరకు దేశంలోని షెడ్యూల్ట్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకబడిన తరగతులకు హాస్టళ్ళ వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. భారత రాజ్యాంగం తనకు తానే సంక్షేమ రాజ్యంగా ప్రకటించుకుంటున్నది. 16వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం, 39వ అధికరణ (సి) ప్రకారం సంపద ఒక్క దగ్గరే కేంద్రీకరించకుండా చూడాలి. 46వ అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, తదితర బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నది. సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం . రాజ్యాంగ పీఠిక మరియు ఆదేశిక సూత్రాలలో సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా పొందుపరిచారు. భారత ప్రజలకు న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ భద్రత కల్పిస్తుందని రాజ్యాంగ పీఠిక హామీ ఇస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 47 ప్రకారం "Duty of the state to raise the level of nutrition and the standard of living and to improve public health" అనగా (ఈ రాజ్యం యొక్క కర్తవ్యం ప్రజలకందరికీ పౌష్టికాహార విలువలనూ, ప్రజా ఆరోగ్యాన్ని పెంచడమూ మరియు జీవన పురోగతిని పెంపొందించడం).

వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమము

వెనుకబడిన తరగతుల సంక్షేమము – వర్గీకరణ. వెనుకబడిన తరగతుల నిర్వాహక విభాగము ద్వారా మంత్రిత్వ శాఖ, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమమును, వెనుకబడిన తరగతుల వారికై ఏర్పరిచిన పధకములను నిర్దేశించిన విధానములో అమలు పరచడం ద్వారా పరిరక్షిస్తుంది. వాటికి సంబందించిన వివరాలు ఈ పోర్టల్ నందు లభించును.

గిరిజన సంక్షేమం

2011 వ సంవత్సరం యొక్క జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 15 శాతం ప్రాంతంలో 10.428 కోట్ల గిరిజనులు (ఎస్.టి) ఉన్నారని, వారి జనాభా దేశం యొక్క మొత్తం జనాభాలో 8.61 శాతంగా ఉందని తేలింది. సామాజికంగా, ఆర్ధికంగా మరియు దేశాభివృద్ధిలో వారి పాత్ర చాలా తక్కువగా వుందని కాబట్టి వారి పై ప్రత్యేక శ్రద్ధ కనపర్చవలసి వుందని గమనించబడింది.

అవ్యవస్థీకృత రంగం

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2004 -2005 సంవత్సరంలో చేపట్టిన సర్వే ప్రకారం దేశంలో మొత్తం 45.9 కోట్లమంది ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 2.6 కోట్లమంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.

ఆర్థిక అక్షరాస్యత

ఆర్ధిక సంబంధమైన అవగాహన - ఆర్థిక అక్షరాస్యత- భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నగేట్ వే అందించే విధి విధానాలు.

అల్పసంఖ్యాక వర్గల సంక్షేమం

భారత ప్రభుత్వం (అల్లోకేషన్ ఆఫ్ బిజినెస్) నియమాలు, 1961, రెండవ షెడ్యూలు ప్రకారం ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించిన విధులు.

వికలాంగుల సంక్షేమం

2001 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2.13 శాతం వున్న 2 కోట్ల 19 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది.

వయో వృద్ధులు సంక్షేమం

భారత దేశంలో వృద్ధుల జనాభా పెరుగుదల రోజు రోజుకీ ఎక్కువవుతోంది. 1951వ సంవత్సరంలో 1.98 కోట్లుగా ఉన్న వృద్ధుల సంఖ్య, 2001వ సంవత్సరం నాటికి 7.6 కోట్లుకు చేరింది.

గ్రామీణ పేదరిక నిర్మూలన

భారత్ లో నిరుద్యోగాన్ని ప్రధానంగా గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికం అని రెండు రకాలుగా వర్గీకరించారు. గ్రామీణ పేదరికాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఋతుసంబంధమైన నిరుద్యోగమని రెండు రకాలుగా విభజించవచ్చు.

ఎన్.జి.ఓ/స్వచ్ఛంద సంస్థలు

భారతదేశ ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్మాణంలోను, పనితీరులోను వైవిధ్యంకల స్వతంత్రమైన, సృజనాతమకమైన, సమర్ధవంతమైన స్వచ్చంద రంగాన్ని ప్రోత్సహించి, శక్తిని చేకూర్చి, సాధికారత కల్పించడానికై ఈ విధానం ఉద్దేశింపబడింది.

సామాజిక చైతన్యం

సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా మన మీద పడుతుంది. అత్యధికంగా ప్రభావితం గావించే. చారిత్రక, సామాజిక, ఆర్థిక,. రాజకీయ, సాంస్కృతిక అంశాలనేకం. సమాజపు గమనాన్ని, గమ్యాన్ని. నిర్దేశిస్తాయి. వీటి మధ్య పరస్పర. సమన్వయం సాధించి సుహృద్భావం. పెంచడమే సామాజిక చైతన్యం.

సామాజిక భద్రత

త్వరితంగా మారిపోతున్న జనాభాకు సంబంధించిన గణాంకాల సమాచారం, ముఖ్యంగా అందులోని వయోవర్గాల పొందిక లేబర్‌ మార్కెట్లకు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న సామాజిక భద్రత వ్యవస్థలకు, అతి పెద్ద సవాలును తెచ్చిపెడుతున్నాయి. దీనిని సత్వరమే ఎదుర్కోవాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) చెబుతోంది.

అసహాయ స్ధితిలో ఉన్నవారు

మహిళలు, పిల్లలు, యువత మరియు, గ్రామీణ పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఇతర అన్ నిమ్న మరియు అసహాయ స్ధితిలో ఉన్నవారు.

షెడ్యూల్డ్ కులాల (SC) సంక్షేమము

భారత ప్రజా రాజ్యపు నలభయ్యో సంవత్సరములో భారతదేశ పార్లమెంటుచే, షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989 (1989 యొక్క .నెం.33) చట్టం చేయడమైనది. ఆ చట్టానికి సంబందించిన వివరములు ఈ పోర్టల్ నందు లభించను.

మహిళా శిశు అభివృద్ధి

మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం,30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వ శాఖగా రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సమాచారం

షెడ్యూల్డ్ కులాల (యస్.సి.) ప్రజలు సమగ్రాభివృద్ధి సాధించడంలో, అంకితభావంతో తోడ్పాటు అందించడం ప్రధాన లక్ష్యంగా, సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 123.39 లక్షలు. రాష్ట్రం మొత్తం జనాభాలో వీరు 16.19 శాతం.

సంక్షేమ పధకాలు

ఈ విభాగం లో బంగారు తల్లి స్కీం (ఆడపిల్లను ప్రమోషన్ , సాధికారత యాక్ట్, ఆంధ్ర ప్రదేశ్ 2013), వివిధ రాష్ట్ర పధకాలు వాటి సంబందించిన సమాచారం లబించును.

తరచుగా అడిగే ప్రశ్నలు

మహిళా చట్టాలు, క్రూరత్వము, మానభంగము, మహిళా గౌరవానికి భంగం, స్త్రీ ధనము, బహూ భార్యత్వం, గృహ హింస నుండి రక్షణ, ప్రసూతి సౌకర్య హక్కుల చట్టం, రాజ్యాంగంలో స్త్రీ హక్కులు, కుటుంబ కోర్టులు, మనోవర్తి, సతీ సహగమన (నిషేధ ) చట్టం, స్త్రీ ల అసభ్యకర దృశ్య నిషేధం, దాంపత్య హక్కుల పునరుద్ధరణ, విడాకులు, బాల్య వివాహల చట్టాలు, బాల్య వివాహాలు, స్త్రీ భూణ హత్యచట్టాలు, స్త్రీ శిశు హత్యలు, బలహీన వర్గాల చట్టాలు, సమాచార హక్కు, వినియోగదారు రక్షణ చట్టము

చర్చా వేదిక - సామాజిక సంక్షేమం

ఈ చర్చ వేదిక నందు సామాజిక సంక్షేమానికి సంబందించిన అంశాలను గూర్చి చర్చించెదరు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 11/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate