తరచుగా అడిగే ప్రశ్నలు ఈ కింది విధంగా వర్గీకరింపబడి, విభజింపబడ్డాయి:
ఉపోధ్ఘాతం
బ్యాంకింగ్ విషయాల పై అవగాహన కొరకు ఉపయోగకరమైన సమాచారన్ని సేకరించబడింది
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం 2006 ఒనకూర్చేదేమిటి?
- బ్యాంకుల్లో ఏదేని డిపార్టుమెంట్ వల్ల ఎవరికైనా ఖాతాదార్లకు ఇబ్బంది కలిగితే వారి ఫిర్యాదులను బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం 2006 పరిష్కారం చేయడానికి వీలు కలిగిస్తుంది.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం 2006 పనిచేయడం ప్రారంభించిందా?
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం 2006, జనవరి 1 2006 నుండి అమలులోనికి తీసుకురాబడింది.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఎవరు?
- బ్యాంకింగ్ సేవలలో ఏదేని లోపం, కొరత జరిగినచో ఖాతాదారులు చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నియమించబడినటువంటి వ్యక్తిని ఆంబుడ్స్‌మెన్ అంటారు.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఏమైనా న్యాయపరమైన అధికారాలు కలిగి ఉంటాడా?
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఒక ఖాసీ-న్యాయాధికారి. మధ్యవర్తిత్వం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా ఇరు పక్షాలను అనగా - బ్యాంకును మరియు దాని ఖాతాదారులను కూడా పిలిపంచే అధికారం ఉంది.
ఎంతమంది బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ లను నియమించడం జరిగింది? వారెక్కడ నియమించబడ్డారు?
- చాలా వరకు రాష్ట్ర రాజధానుల్లో ఉండేటట్లుగా ఈ తేదీనాటికి 15 మంది బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌లను నియమించడం జరిగింది. బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌ల కార్యాలయాల చిరునామాలు భారతీయ రిజర్వు బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉంచబడ్డాయి.
ఏ బ్యాంకులు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం కిందకు తీసుకురాబడ్డాయి?
- అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు, అలాగే షెడ్యూల్డ్ ప్రాథమిక సహకార బ్యాంకులు, ఈ పథకం కిందకు తీసుకు రాబడ్డాయి.
పాత బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం - 2002 నుండి కొత్త ఆంబుడ్స్‌మెన్ పథకం-2006 కు ఉన్న తేడా ఏమిటి?
- పాత పథకం 2002 కంటే కొత్త పథకంలో ఉండే పరిధి మరియు లక్ష్యం చాలా విస్తృతమైనవి. కొత్త పథకం ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసుకొనే వీలు కలిగిస్తుంది. అదనంగా కొత్త పథకం ఉభయులూ అనగా బ్యాంకు మరియు ఫిర్యాదిదారు దారు దారు కూడా ఆంబుడ్స్‌మెన్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకోడానికి వీలుగా అప్పీలేట్ అథారిటీ అనే వ్యవస్థను కలుగజేస్తుంది.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ముందుకు వచ్చే ఫిర్యాదుల రకాలు
ఏవిధమైనటువంటి వివాదాలను బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పరిశీలిస్తారు?
కింద ఉదహరించిన బ్యాంకింగ్ సేవలలో ఏదైనా లోపాలు సంభవించినచో దానికి సంబంధించిన ఏ ఫిర్యాదునైనా బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ స్వీకరించి, పరిశీలిస్తారు.
- చెక్కులు కలెక్షన్‌కు, డ్రాఫ్టులు, బిల్లులు మొదలగు వాటికి సంబంధించి చెల్లింపులు చేయకపోవడం లేక చెల్లింపులు చేయడంలో అమితమైన జాప్యం, ఆలస్యం జరిగినప్పుడు.
- ఏ లక్ష్యంతోనైసా సరే సమర్పించిన చిన్న డినామినేషన్‌తో ఉండే నోట్లను తగినంత కారణం లేకుండా సమ్మును కట్టినపుడు పంపిన డబ్బు, చెల్లించిన డబ్బు తీసుకోకపోవడం, అలాగే దానికి సంబంధించి కమీషన్‌ను వసూలు చేయడం.
- చిన్న డినామినేషన్‌తో ఉండే నాణములను తగినంత కారణం లేకుండా సమ్మును కట్టినపుడు పంపిన డబ్బు, చెల్లించిన డబ్బు తీసుకోకపోవడం, అలాగే దానికి సంబంధించి కమీషన్‌ను వసూలు చేయడం.
- చెల్లింపులు చేయకపోవడం లేక సమ్మును కట్టినపుడు (ఇన్‌వర్డ్ రెమిట్టెన్స్) జాప్యం, ఆలస్యం చేయడం.
- డ్రాఫ్టులకు, పే ఆర్డర్లకు లేక బ్యాంకర్స్ చెక్కులు ఇవ్వడంలోనూ లేక ఆలస్యం అవ్వడంలోనూ.
- నిర్ణయించిన ప్రకారం పనివేళలను పాటించకపోవడం.
- గ్యారంటీలను గానీ లేక లెటర్ ఆఫ్ కమిట్‌మెంట్‌కు సంబంధించినటువంటి వాటిని ఆదరించకపోవడంలో వైఫల్యం.
- బ్యాంక్ వారు లిఖిత పూర్వకంగా వాగ్దానం చేసిన దానికి విరుద్ధంగాగానీ లేక తన యొక్క ప్రత్యక్ష అమ్మకపు ఏజెంట్ ద్వారాగానీ బ్యాంకింగ్ సౌకర్యాన్ని (ఋణాలు, అడ్వాన్సులు మినహా) కలుగజేయడంలో విఫలం లేక జాప్యంకానీ జరగడం.
- ఆలస్యం, పార్టీల ఖాతాలలో సమ్ములు జమచేయకపోవడం, డిపాజిట్లను చెల్లించకపోవడం లేక సేవింగ్స్ ఖాతాలోనైనా ఉన్న డిపాజిట్లపై గానీ లేక కరెంట్ అకౌంట్‌లో గానీ లేక బ్యాంకులో నిర్వహింపబడే ఏ ఇతరములైన ఖాతాలకు సంబంధించిన వడ్డీరేటు విషయంలో ఏమైనా.
- ఎగుమతుల విక్రయ ధనాన్ని స్వకీరించడంలోనూ , ఎగుమతుల బిల్లులకు సంబంధించిన పని చూడడంలోనూ, ఎగుమతి దార్ల బిల్లుల సేకరణ మొదలగు వాటిలో ఆలస్యం. భారతదేశంలో ఉన్న బ్యాంకుల కార్యకలాపాలకు ఇటువంటి ఫిర్యాదులు సంబంధించి ఉన్నచో.
- భారతదేశంలో ఖాతా ఉన్న ప్రవాస భారతీయులు విదేశాల నుండి జమ కట్టుటకు గానీ, డిపాజిట్లు మరియు బ్యాంకుకు సంబంధించిన ఇతర విషయాలపై వారి నుండి వచ్చే ఫిర్యాదులు.
- సరైన కారణం లేకుండానే బ్యాంకులో ఖాతా తెరచుకోడానికి తిరస్కరించడం.
- ఖాతాదారునకు ముందుగా తెలియజేయకుండా చార్జీలు వసూలు చేయడం.
- ఎటిఎమ్ / డెబిట్ కార్డుల వాడకంపై భారతీయ రిజర్వు బ్యాంకు వారు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం.
- పెన్షన్ పంపకం చేయకపోవడం లేక పోతే దాంట్లో కలిగే ఆలస్యం (ఈ విషయంలో వచ్చే ఫిర్యాదులు సంబంధిత బ్యాంకు తీసుకోవల్సిన చర్యలపై ఆపాదించబడినంత మేరకు, అంతేగానీ సిబ్బందిపైన అయితే కాదు.
- భారతీయ రిజర్వు బ్యాంకు/ప్రభుత్వం ఆదేశించినట్లుగా చెల్లించే పన్ను సమ్మును స్వీకరించడానికి నిరాకరణ లేక అటువంటి దాంట్లో కలిగించే ఆలస్యం.
- జారీ చేయడానికి నిరాకరణ లేక జారీచేయడంలో ఆలస్యం లేక సేవలలో విఫలం లేక సేవలు అందించడంలో ఆలస్యం లేక ప్రభుత్వ సెక్యూరిటీలను విడుదల చేయడంలో ఆలస్యం.
- ఇవ్వవలసిన నోటీసు ఇవ్వకుండా లేక సరైన కారణం లేకుండా డిపాజిట్ ఖాతాలను బలవంతంగా మూసివేయించడం.
- ఖాతాను మూసివేయడానికి నిరాకరించడం లేక ఆలస్యం చేయడం.
- బ్యాంకు అనుసరిస్తున్న సరళ పద్ధతుల కోడ్‌ను పాటించకపోవడం.
- బ్యాంకింగ్ మరియు ఇతర సేవలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలను అతిక్రమించడం.
ప్రవాస భారతీయుల యొక్క ఫిర్యాదులను కూడా ఆంబుడ్స్‌మెన్ పరిశీలిస్తారా?
- అవును. భారత దేశంలో ఖాతా ఉన్న ప్రవాస భారతీయులు - విదేశాల నుండి జమచేయడం, వారి డిపాజిట్లు మరియు ఇతర బ్యాంకు సంబంధిత విషయాలకు సంబంధించిన ఫిర్యాదును బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పరిశీలిస్తారు.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ కు దరఖాస్తు చేసుకోవడం
ఫిర్యాదుదారు తన ఫిర్యాదు ఎప్పుడు దాఖలా చేయవచ్చు?
- తను ఇచ్చిన ఫిర్యాదు బ్యాంకు అందుకున్న రోజు నుండి నెల లోపు బ్యాంకు నుండి జవాబు రాకపోతే లేక అతని ఫిర్యాదును బ్యాంకు తిరస్కరించినపుడు లేక బ్యాంకు వారిచ్చిన జవాబు ఫిర్యాదిదారు దారు కి సంతృప్తికరంగా లేనపుడు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు అతను తన ఫిర్యాదును దాఖలు చేసుకోవచ్చు.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు దాఖలు చేసే ముందు ఏమైనా షరతులను పాటించాల్సి ఉంటుందా?
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదును దాఖలు చేసేముందుగా ఫిర్యాదులో పేర్కొన్న బ్యాంకు నుండి ప్రత్యక్షంగా తన చర్యను చేపట్టి ఒక సంతృప్తికరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం ఆవశ్యం. అయితే ఫిర్యాదుదారు, తన నివేదికను బ్యాంకు నుండి సమాదానాన్ని అందుకొన్ననాటినుండి ఒక సంవత్సరం గడిచే లోపుగా అటువంటి ఫిర్యాదును ఇవ్వవలసి ఉంటుంది.
ఇంతకుముందు ఏ బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ కార్యక్రమంలో నైనా (ఎసీడింగ్స్) చేపట్టబడి, పరిష్కారం ఇవ్వబడిన అదే విషయంపై ఇంకోసారి బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చా?
- వీలు లేదు. బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ వారి కార్యాలయం ద్వారా పరిష్కరించబడిన అదే విషయంపై తిరిగి ఫిర్యాదు చేయడానికి వీలులేదు.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఇచ్చిన ఫిర్యాదులోని అదే విషయంపై ఇంతకుముందు ఏ కోర్టులోనైనా, ట్రిబ్యునల్ లేక ఆర్బిట్రేటర్ వద్ద పరిశీలింపబడి లేక మరి ఏ ఇతర ఫోరంలోనైనా పెండింగ్‌లో ఉండి లేక డిక్రీగానీ లేక తీర్పుగానీ లేక అంతిమ ఆదేశాలు గానీ అట్టి విషయంపై అట్టి కోర్టుద్వారాగానీ, ట్రిబ్యునల్ ద్వారాగానీ లేక ఆర్బిట్రేటర్ లేక ఫోరమ్ ఇప్పటికే ఇవ్వడం జరిగినప్పుడు అటువంటి ఫిర్యాదును మరలా ఇవ్వవచ్చా?
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదును దాఖలు చేయడానికి ఏదైనా పద్ధతి ఉందా?
- మామూలుగా ఒక తెల్లకాగితం మీద రాస్తూ ఫిర్యాదుదారు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో (www.bankingombudsman.rbi.org.in) ద్వారా లేక బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఒక ఈమెయిల్ పంపిస్తూ కూడా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. బ్యాంక్ అన్ని శాఖలలోనూ లభించే ఒక నిర్ణీత నమూనా కూడా ఉంది ఫిర్యాదులు రాసి ఇవ్వడానికి. అయితే ఈ నమూనాయే వాడాలనే నియమం ఏమీ లేదు. ఫిర్యాదుదారు మాత్రం కావలసిన సమాచారాన్ని పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఫిర్యాదిదారు దారు దారు అధికారికంగా తన ప్రతినిధి చేత ఫిర్యాదును దాఖలు చేయించవచ్చా?
- చేయించవచ్చు. ఫిర్యాదిదారు దారు దారు తన ఫిర్యాదును తను అధికారమిచ్చిన తన ప్రతినిధిచేత దాఖలు చేయించవచ్చు.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు ఫైలు చేయడానికి ఏమైనా రుసుము చెల్లించాల్సి ఉంటుందా?
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌ద్వారా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏవిధమైన రుసుము వసూలు చేయరు.
దరఖాస్తులో ఏమేమి వివరాలివ్వాలి?
- ఫిర్యాదులో ఫిర్యాదుదారు యొక్క పేరు, చిరునామా, ఫిర్యాదునివ్వడానికి కారణమైన పరిస్థితులు, ఆధారిత డాక్యుమెంట్లను ఏమైనా వుంటే జతచేస్తూ, ఫిర్యాదిదారు దారు దారు తనకు కలిగిన నష్టం యొక్క స్వభావం, పరిధి, పరిమాణము, బ్యాంక్ వద్దనుండి ఆశించే నష్టపరిహారం, అలాగే ఫిర్యాదిదారు దారు అనుసరించవలసిన నిబంధనలన్నింటినీ పాటించినట్లు ధృవీకరించవలసి వుంటుంది.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ వారి కార్యకలాపాలు (ఎసీడింగ్స్)
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఫిర్యాదును అందుకున్న తరువాత ఏమి జరుగుతుంది?
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఫిర్యాదును పరిష్కరించడంలో మధ్యవర్తిత్త్వం నెరపుతూ ఫిర్యాదిదారు దారు కి మరియు అతని ఫిర్యాదులో పేర్కొనబడిన బ్యాంకు మధ్య సదవగాహన కల్పించి, అంగీకారానికి వచ్చేటట్టూ పరిష్కరించడానికి కృషి చేస్తాడు.
ఒకవేళ పరిస్థితిని పరిష్కరించడానికి బ్యాంకు ముందుకు వస్తే ఏమౌతుంది?
- బ్యాంకు వారు చూపించే పరిష్కారం పిర్యాదుదారుకు పూర్తి సమ్మతమైతే ఆ మేరకు బ్యాంకింగు ఆంబుడ్స్‌మెన్ తీర్పునివ్వడం జరుగుతుంది. అట్టి తీర్పునకు ఇరు పక్షాలు లోబడి వుండవలసి వుంటుంది.
ఒక అంగీకారం ప్రకారం ఈ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే ఏమౌతుంది?
- ఒక నెలరోజుల వ్యవధిలో ఫిర్యాదు కనక ఒక అంగీకారం ప్రకారం పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ తదనంతరము తన తీర్పును ఇస్తాడు. అటువంటి తీర్పును ఇచ్చేముందు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఫిర్యాదిదారు దారు కి అలాగే బ్యాంకుకు కూడా తమ కేసును విన్నవించుకోడానికి తగినంత అవకాశాన్ని ఇస్తాడు.
తీర్పును ఇవ్వడంలో బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ వేటిని పరిగణనలోకి తీసుకుంటాడు?
- తీర్పును వెలువరించడానికి బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు తన సమక్షంలో ఉన్న ఉభయ పార్టీలు ఇచ్చిన రుజువులు, రాతపూర్వకంగా ఉండే రుజువు పత్రాలు (డాక్యమెంటరీ ఎవిడెన్స్) మార్గదర్శకంగా ఉంటాయి. బ్యాంకింగ్ చట్టము, విధానాలు, వాటికి సంబంధించిన సూత్రాలు మరియు ఆదేశాలు, భారతీయ రిజర్వు బ్యాంక్ వారు జారీచేసిన మార్గదర్శక సూత్రాలు ఇంకా అతని దృష్టిలో న్యాయాన్ని నిర్ణయించడానికి అవసరమనిపించిన విషయాలను పరిగణనలోనికి తీసుకుంటాడు.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఇచ్చే తీర్పు
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ తన తీర్పును వెలువరించిన తరువాత ఏమౌతుంది?
- తీర్పు వెలువడిన తరువాత దాని కాపీ ఒకటి ఫిర్యాదిదారు దారుకి , అలాగే ఫిర్యాదులో పేర్కొనబడిన బ్యాంకుకు ఇవ్వబడుతుంది. పూర్తిగానూ, అన్నివిధాల అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పును అంగీకరించాలా వద్దా? అన్నది ఫిర్యాదిదారు దారు కే వదిలివేయబడుతుంది.
ఒకవేళ అట్టి తీర్పు ఫిర్యాదిదారు దారుకి సమ్మతమైనచో ఏమి చేయాలి?
- ఒకవేళ వెలువరించబడిన తీర్పు తనకు సమ్మతమైనచో, ఫిర్యాదుదారు అట్టి తీర్పును పూర్తిగా, అన్ని విధాల అంతిమ తీర్పుగా అంగీకరిస్తున్నట్లుగా సంబంధిత బ్యాంకుకు ఒక లేఖ రాస్తూ, తను అట్టి తీర్పు కాపీని అందుకున్న 15 రోజులలోగా తెలియపర్చాలి.
అటువంటి తీర్పునకు తన అంగీకారాన్ని తెలియజేస్తూ బ్యాంకుకు రాసే లేఖను పంపుటలో కాల వ్యవధిని ఎడిగించమని ఫిర్యాదిదారు దారు కోరవచ్చా?
- అవును. ఫిర్యాదిదారు దారు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు కాలవ్యవధిని ఎడిగించమని లిఖితపూర్వకంగా కోరుతూ ఒక లేఖ రాయవచ్చు, దానికి తగినన్ని కారణాలను చూపవలసివుంటుంది.
తీర్పుపై తన సమ్మతిని తెలియజేస్తూ రాసే లేఖకు కాలవ్యవధి కావాలని కోరుతూ ఫిర్యాదిదారు పంపుకొనే అభ్యర్థన అందుకొన్నప్పుడు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఏమి చేస్తాడు?
- ఒకవేళ బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ కనక ఫిర్యాదిదారు తన లేఖలో (తన సమ్మతి లేఖను బ్యాంకుకు పంపడానికై) రాసిన కారణాలు సహేతుకమైనవని భావించి, తృప్తిపడినచో, 15 రోజుల దాకా అతను కాలవ్యవధిని ఎడిగించవచ్చు.
ఫిర్యాదిదారు పూర్తిగా అన్నివిధాల అంతిమంగా వెలువరించిన తీర్పును సమ్మతిస్తూ తన అంగీకారం తెలిపే లేఖను పంపినపుడు ఏమౌతుంది
- బ్యాంకు ఒకవేళ అట్టి తీర్పుపై సంతృప్తిని ఎందినట్లయితే ఒక నెల రోజుల లోపల (తీర్పును పూర్తిగాను, అన్నివిధాల అంతిమమైనదిగాను తాను అంగీకరిస్తున్నట్లు ఫిర్యాదిదారు రాసిన లేఖ అందిననాటినుండి) బ్యాంకు అటువంటి తీర్పును అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే దానిని అమలు చేసినట్లు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.
ఒకవేళ బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఇచ్చన తీర్పు తనకు అంగీకార యోగ్యంగా లేనప్పుడు ఫిర్యాదిదారుకి లభించే ఇతర మార్గాలేమిటి?
- ఒకవేళ ఫిర్యాదిదారు దారు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఇచ్చిన తీర్పును అంగీకరించని పక్షంలో, తీర్పును సవాలుచేస్తూ అతను అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించవచ్చు.
ఫిర్యాదిదారు తీర్పును నిరాకరించినప్పుడు అట్టి ఫిర్యాదుకు సంబంధించి ఒక న్యాయస్థానం ముందు ఒక వేదిక (ఫోరమ్) లేక మరి యే ఇతర అధికారుల ముందైనా, అమలులో ఉన్న చట్టం ప్రకారం ఇతర మార్గాలు, నివారణోపాయాలకు ప్రతిబంధకంగా ఉంటుందా?
- అమలులో ఉన్న చట్టం ప్రకారం ఫిర్యాదిదారు తీర్పును నిరాకరించడం అన్నది అతనికి ఉన్న ఇతర తరుణోపాయాలను, ఇతర మార్కాలను అన్వేషించడానికి ప్రతిబంధకం కాదు.
ఒకవేళ అటువంటి తీర్పు బ్యాంకునకు కూడా సమ్మతింపదగ్గదిగా లేకపోతే?
- ఈ పథకం కింద బ్యాంకుకు అప్పీలేట్ అథారిటీకి తమ అప్పీల్‌ను దాఖలా చేసుకొనే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది.
తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకోవడం
అప్పీలేట్ అథారిటీ ఎవరు?
- భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క డిప్యూటీ గవర్నర్ అప్పీలేట్ అథారిటీ.
అప్పీలు పెట్టుకోడానికి ఏమైనా కాలపరిమితి (టైమ్ లిమిట్) ఉందా?
- ఉభయ పార్టీలలో ఎవరైనా సరే అటువంటి తీర్పువల్ల ఇబ్బంది పడడం కానీ, నష్టపోవడం గానీ జరిగితే అటువంటి తీర్పును అందుకొన్న 45 రోజులలోపల అప్పీలేట్ అథారిటీ సమక్షంలో అటువంటి తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలేట్ అథారిటీ సంతృప్తి చెంది, దరఖాస్తు దారుడు కాలవ్యవధి లోపల అటువంటి దరఖాస్తును చేయలేకపోవడానికి సబబైన కారణాలున్నాయని భావిస్తే, 30 రోజులకు మించకుండా అట్టి కాలవ్యవధిని ఎడిగించడానికి అనుమతించవచ్చు. బ్యాంకు విషయంలో ముందుగానే చైర్మన్ లేక అతను హాజరు కానప్పుడు మేనేజింగ్ డైరెక్టరు లేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, లేక ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ) లేక బ్యాంకు యొక్క ఇతర ఏ అధికారి వద్దనుండైనా అనుమతి తీసుకున్న తరువాతే అప్పీల్ చేయాలి.
అప్పీలేట్ అథారిటీ అప్పీల్‌పై ఏవిధంగా వ్యవహరిస్తాడు?
అప్పీలేట్ అధికారి ఉభయపార్టీలకు వారు చెప్పేది వినేందుకు తగినంత అవకాశాన్న ఇచ్చిన తరవాత
- అప్పీలును కొట్టివేయవచ్చు, లేక
- అప్పీలును అనుమతించి , ఇచ్చిన తీర్పును నిలిపేయవచ్చు, లేక
- అవసరమనిపించి తను ఇచ్చే ఆదేశాల మేరకు పునఃపరిశీలన చేయడానికి అప్పీలేట్ అధికారి బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌తిప్పి పంపవచ్చు.
- తీర్పును సవరించి అవసరమైన ఆదేశాలను ఇవ్వవచ్చు.
- తనకు సరైనదే అనిపించినట్లయితే ఏ ఆదేశాన్నయినా జారీచేయవచ్చు.
ఇతర విషయాలు
ఏ దశలోనైనా బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఫిర్యాదును నిరాకరించే వీలుందా?
ఒకవేళ ఫిర్యాదుకనుక ఈ క్రింది విధమైన పద్ధతుల్లో చేయబడిందని తెలిస్తే బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ఏ దశలోనైనా సరే అట్టి ఫిర్యాదును తిరస్కరించవచ్చు.
- ఆషామాషీగా, మానసిక క్షోభ కలిగించేదిగా, విసిగించేదిగా మరియు అనుచితమైన, దురుద్దేశంతో కూడుకున్నదైనప్పుడు, లేక
- సరిపడినంత, తగినంత కారణాలు లేనిదై ఉన్నప్పుడు, లేక
- ఫిర్యాదిదారు తగిన శ్రద్ధ, జాగ్రత్తతో ఇచ్చినటువంటి ఫిర్యాదు కానప్పుడు, లేక
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ దృష్టిలో ఫిర్యాదిదారు కి ఏవిధమైన నష్టంగానీ, అసౌకర్యం గానీ, ఇబ్బంది గానీ కలగనే లేదు. లేక
- క్లాజు 12 (5) కింద నిర్దేశింపబడినట్టు బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ యొక్క ఆర్థిక సంబంధితమైన అధికార పరిమితికి లోబడి లేనప్పుడు.
దాఖలు చేయబడి, మిగిలి ఉన్న (పెండింగ్) ఫిర్యాదులను (2006 నాటి కొత్త పథకం అమలులోకి రాకపూర్వం) ఏ పథకం కింద పరిష్కరించబడతాయి?
- మిగిలి వున్న ఫిర్యాదుల పరిష్కారం మరియు ఇప్పటికే ఇచ్చిన తీర్పులను అమలు చేయడం బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ 2006 వ్యవస్థ ప్రవేశ పెట్టకముందువైనప్పటికీ ఇంతకు ముందున్న సంబంధిత బ్యాంకుల యొక్క బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకాలలోని నిబంధనలకు మరియు రిజర్వ్‌బ్యాంకు జారీచేసిన ఆదేశాలకు ప్రకారం కూడా ఇవి అమలు చేయబడతాయి.
ఈ పథకానికి సంబంధించి భారతీ రిజర్వ్ బ్యాంకువారి పాత్ర ఏమిటి?
- బ్యాంకు యొక్క ఖాతాదార్లకు వేగవంతమైన పరిష్కార యంత్రాంగాన్ని నెలకల్పడంకోసం భారతీయ రిజర్వు బ్యాంకు , బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ వ్యవస్థను రూఎందించింది. ఈ పథకంలో వివరించినట్లుగా ఇది సంస్థాగత మరియు న్యాయపరమైన ఒక వ్యవస్థను నెలకొల్పింది. బ్యాంకింగ్ సేవలకూ, ఇతర విషయాలకూ సంబంధించిన ఫిర్యాదులను పరిష్కారం చేసే ఉద్దేశ్యంతో. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం 1949లోని సెక్షన్ 35 ఎ ననుసరించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన ఆదేశాల మేరకు ఈ పథకం ప్రవేశపెట్టబడి, అమలులోకి తీసుకురాబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు తమవద్దే ప్రస్తుతం పనిచేసే అనుభవం ఉన్న సీనియర్ అధికార్లను బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్‌లుగా కూడా నియమిస్తూ, ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా నిధులను కూడా సమకూరుస్తుంది.
బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం ఎప్పుడు స్థాపించబడింది?
- బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ పథకం ముందుగా 1995లొ ప్రవేశపెట్టబడి 2002లో సవరించబడింది. గడచిన 5 ఏళ్ళ కాలంలో 36,000 ఫిర్యాదులను బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ చేపట్టడం జరిగింది.
ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు