অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రాధాన్యత రంగ రుణాలు

ప్రాధాన్యత రంగ రుణాలు

  1. ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలేమిటి?
  2. నికర బ్యాంకు పరపతిలో ఏముంటాయి?
  3. ప్రాధాన్యత రంగంలో ఏముంటాయి?
  4. వ్యవసాయ ప్రయోజనాలకు ప్రత్యక్ష ఫైనాన్సెస్‌ అంటే ఏమిటి?
  5. వ్యవసాయ పరోక్ష ఫైనాన్స్‌లో ఏముంటాయి?
  6. చిన్నతరహా పరిశ్రమలు (ఎస్‌ఎస్‌ఐలు) అంటే నిర్వచనం ఏమిటి?
  7. అతి చిన్నతరహా సంస్థల నిర్వచనం ఏమిటి?
  8. చిన్నతరహా సేవ, వ్యాపార సంస్థలు (ఎస్‌ఎస్‌ఎస్‌బిఇ) అంటే ఏమిటి?
  9. చిన్న తరహా పరిశ్రమ రంగంలో ఉండే పరోక్ష ఫైనాన్స్‌ ఎలా ఉంటుంది?
  10. బ్యాంకులు పెట్టే ఎటువంటి పెట్టుబడులు ప్రాధాన్యరంగ పెట్టుబడులుగా పరిగణిస్తారు?
    1. రాష్ట్ర ఆర్థిక సమాఖ్య (ఎస్‌ఎఫ్‌సి)/రాష్ట్రపరిశ్రమ అభివృద్ధి సమాఖ్యలు
    2. గ్రామీణ విద్యుద్దీకరణ సమాఖ్య (ఆర్‌ఇసి)
    3. నాబార్డు
    4. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడిబిఐ)
    5. జాతీయ చిన్న పరిశ్రమల సమాఖ్య లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసి)
    6. జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు (ఎన్‌హెచ్‌బి)
    7. గృహ నిర్మాణ నగరాభివృద్ధి సమాఖ్య (హడ్కో)
  11. ప్రాధాన్యత రంగంలో బలహీన వర్గాల వారి మాటేమిటి?
  12. బ్యాంకులు ప్రాధాన్యత రంగ రుణాలను సాధించనప్పుడు ఏంచర్య తీసుకొంటారు?
  13. రుణ దరఖాస్తుల పరిష్కారానికి కాల పరిమితి ఉందా?
  14. ప్రాధాణ్యత రంగంలో వడ్డీ రేటు ఏమిటి?
  15. ప్రాధాన్యతరంగ రుణ పర్యవేక్షణను రిజర్వ్‌ బ్యాంకు ఏవిధంగా చేస్తుంది?

ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలేమిటి?

భారతదేశంలో ఉండే దేశీయ, విదేశీయ బ్యాంకు కార్యకలాపాల ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను, ఉపలక్ష్యాలను దిగువ వివరించడం జరిగింది.

దేశీయ బ్యాంకులు (ప్రభుత్వ,  ప్రయివేటు రంగ బ్యాంకులు) మనదేశంలో ఉన్న విదేశీ బ్యాంకులు
మొత్తం ప్రాధాన్యత రంగ అడ్వాన్సులు ఎన్‌బిసిలో 40 % ఎన్‌బిసిలో 32 %
మొత్తం వ్యవసాయ అడ్వాన్సులు ఎన్‌బిసిలో 18 % ఏ లక్ష్యం లేదు
ఎస్‌ఎస్‌ఐ అడ్వాన్సులు ఏ లక్ష్యం లేదు ఎన్‌బిసిలో 10 %
ఎగుమతి పరపతి ప్రాధాన్యత రంగంలో ఎగుమతి పరపతి భాగం కాదు.
ఎన్‌బిసిలో 12 % బలహీన వర్గాలకు అడ్వాన్సులు ఎన్‌బిసిలో 10 %
గమనిక: ఎన్‌బిసి అంటే నికర బ్యాంకు పరపతి

నికర బ్యాంకు పరపతిలో ఏముంటాయి?

ఆర్‌బిఐ చట్టం 1934లోని సెక్షన్‌ 42(2) ప్రకారం దాఖలయిన పక్షంవారీ     రిటర్న్‌లో సూచించిన  సంఖ్యతో నికర బ్యాంకు పరపతి సమానంగా ఉండాలి. ఎఫ్‌సిఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్లు, ఎన్‌ఆర్‌ఎన్‌ఆర్‌ పథకాలలో ఉండే డిపాజిట్లు నికర బ్యాంకు పరపతి ప్రాధాన్యతారంగ రుణాల లక్ష్యాల/ఉపలక్ష్యాల నుంచి మినహాయింపు ఎందుతాయి.

ప్రాధాన్యత రంగంలో ఏముంటాయి?

విస్తృతంగా ప్రాధాన్యతరంగంలో దిగువ సూచించినవి ఉంటాయి.

  1. వ్యవసాయం
  2. చిన్నతరహా పరిశ్రమలు (పరిశ్రమ ఎస్టేట్ల స్థపానతో సహా)
  3. చిన్నరోడ్ల, జలరవాణా ఆపరేటర్లు (10 వాహనాలు ఉన్నవారు)
  4. చిన్న వ్యాపారం (20లక్షల రూ మించని వ్యాపారానికి ఉపయోగించే పరికరాల అసలు ధర)
  5. చిల్లర వ్యాపారం (10 లక్షల రూ. దాకా ప్రయివేటు చిల్లర వ్యాపారులకు అడ్వాన్సులు)
  6. వృత్తిపర, స్వయం ఉపాధి వ్యక్తులు (రుణపరిమితి రూ. 10 లక్షలు దాటకూడదు. అందులో రెండు లక్షల రూ. మించి నిర్వహణ మూలధనం ఉండకూడదు. గ్రామీణ ప్రాంతంలో వైద్య ప్రాక్టీసు పెట్టే అర్హత ఉన్న వైద్య ప్రాక్టీషనర్లకు ప్రాధాన్యత రంగంలో రూ. 10 లక్షలు, నిర్వహణ మూలధనం రూ. 3 లక్షలు గా మంజూరు చేస్తారు. ఈ పరిమితుల్లో ఒక మోటారు వాహనం కూడా ఉండవచ్చు)
  7. రాష్ట్రాలు సహాయం చేసే షెడ్యూల్డ్‌ కులాల/తెగల సంస్థలు
  8. విద్య (బ్యాంకులు వ్యక్తులకు బ్యాంకుల ద్వారా మంజూరు అయ్యే)
  9. గృహనిర్మాణం (ప్రత్యక్షంగా, పరోక్షంగా-రూ. 5 లక్షల దాకా (ప్రత్యక్షరుణాలు రూ. 10 లక్షల దాకా నగర మెట్రోపాలిటన్‌ ప్రాంతాలలో) లక్ష రూ. నుంచి రెండు లక్షల దాకా గృహమరమ్మత్తులకుగాను గ్రామీణ/అర్ధనగర/నగర ప్రాంతాలలో)
  10. వినియోగ రుణం (బలహీన వర్గాలకు వినియోగపరపతి పథకం కింద)
  11. సూక్ష్మ పరపతిని బ్యాంకులు ప్రత్యక్షంగా కానీ లేదా మధ్యవర్తి ద్వారా కాని ఇస్తాయి; స్వయం సహాయ బృందాలకు రుణాలు (స్వసబృ / ఎస్‌హెచ్‌డిలు)/ ప్రభుత్వేతర సంస్థ (ప్రిస-ఎన్‌జిఓలు) స్వసబృలకు రుణాలు ఇస్తాయి.
  12. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు రుణాలు (బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి కోటి రూ. పరపతి పరిధి దాటకుండా)
  13. ఆహార, వ్యవసాయ ప్రక్రియ రంగంలో నిర్దిష్ట పరిశ్రమలకు రుణాలు, ఈ పరిశ్రమల్లో యంత్రాల విలువ రూ. 5 కోట్ల దాకా ఉండాలి.
  14. సాహస వ్యాపర పెట్టుబడికి బ్యాంకుల పెట్టుబడి (సాహస వ్యాపార పెట్టుబడి నిధులు/సెబితో నమోదయిన కంపెనీలు).

వ్యవసాయ ప్రయోజనాలకు ప్రత్యక్ష ఫైనాన్సెస్‌ అంటే ఏమిటి?

వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు బ్యాంకులు అందించే అడ్వాన్సులను ప్రత్యక్ష వ్యవసాయ అడ్వాన్సులంటారు. పంటలను వేసేందుకు (అంటే  పంటరుణాలు, అదనంగా వ్యవసాయ ఉత్పత్తుల తనఖాతో/హామీతో రైతులకు ఇచ్చే 5 లక్షల రూ.లోపు అడ్వాన్సులు వీటిలో గోదాము రసీదులుంటాయి. వీటి కాలవ్యవధి  12 నెలలలోపు ఉంటుంది. అయితే రుణ గ్రహీతలు ఒకే బ్యాంకు నుంచి పంట రుణాల పరపతిని గ్రహించి ఉండాలి.

ప్రత్యక్ష ఫైనాన్స్‌లో మధ్యతరహా, దీర్ఘకాల రుణాలు (ఆర్థిక ఉత్పత్తి, అభివృద్ధి అవసరాలకోసం రైతులకు ప్రత్యక్షంగా ఇచ్చేవి) వ్యవసాయ ఉపకరణాలు యంత్రాల కొనుగోలు, నీటిపారుదల సామర్థ్యం అభివృద్ధి, భూ అభివృద్ధి, శుద్ధి పథకాలు, వ్యవసాయ భవన నిర్మాణాలు మొ|| ఉంటాయి. ప్లాంటేషన్లు, చేపల పెంపకం, కోళ్ళ పెంపకం వంటి సంబంధిత కార్యకలాపాభివృద్ధికి, బయోగ్యాస్‌ ప్లాంట్ల స్థాపనకు, చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ప్రయోజనాలకు భూమి కొనుగోలు, వ్యవసాయ క్లినిక్‌లకు, వ్యవసాయ వ్యాపార కేంద్రాలకు రుణాలు మొ|| ఇతర రకాల ప్రత్యక్ష ఫైనాన్స్‌లో ఉంటాయి.

వ్యవసాయ పరోక్ష ఫైనాన్స్‌లో ఏముంటాయి?

రైతులకు బ్యాంకులు పరోక్ష ఫైనాన్స్‌ అంటారు. ఇతర ఏజెన్సీల ద్వారా అందించే పరోక్ష సహాయం వ్యవసాయపరోక్ష ఫైనాన్స్‌లో ఉండే అంశాలు ఇవి.

  1. ఎరువుల, చీడ/పీడ మందుల, విత్తనాల మొ|| పంపిణీకి ఫైనాన్సింగ్‌ చేసేందుకు పరపతి కల్పించడం.
  2. పశువుల, కోళ్ళ దాణ మొ|| సంబంధిత కార్యకలాపా ఉత్పాదకాల పంపిణీకి ఫైనాన్సింగ్‌కి రూ. 25 లక్షలు  మించని రుణాలు.
  3. రైతుల బావులకు విద్యుత్తు కల్పించేందుకు స్టెప్‌డౌన్‌ పాయింట్‌ నుంచి రైతుల బావి వరకు ఇచ్చేందుకు లోటెన్షన్‌ కనెక్షన్‌ కల్పించడానికి అయిన ఖర్చును ఆపాటికే  విద్యచ్ఛక్తి మండలి పెట్టి ఉంటే వాటి పరిపూర్తికి విద్యున్మండలికి ఇచ్చే రుణం.
  4. ప్రత్యేక వ్యవసాయ ప్రాజెక్టు (ఎన్‌ఐ-ఎస్‌పిఎ) కింద వ్యవస్థ అభివృద్ధి పథకం కోసం రాష్ట్ర విద్యుచ్ఛక్తి మండలికి రుణాలు.
  5. నాబార్డ్‌ గ్రామీణ అవస్థాపన అభివృద్ధినిధి (ఆర్‌ఐడిఎఫ్‌)లలో బ్యాంకులు డిపాజిట్లు ఉంచడం.
  6. ప్రత్యేకించి పంపుసెట్ల విద్యుద్దీకరణ కార్యక్రమాన్ని గ్రామీణ, అర్ధనగర ప్రాంతాల్లో చేపట్టడానికి వ్యవస్థ మెరుగుదల కార్యక్రమానికి (ఎస్‌ఐ-ఎస్‌పిఎ) గ్రామీణ విద్యుద్దీకరణ సమాఖ్య (గ్రావిస-ఆర్‌ఇసి) జారీ చేసే బాండ్లకు ఇచ్చే ఫైనాన్స్‌.
  7. వ్యవసాయ/సంబంధిత కార్యకలాపాలకు ఫైనాన్సింగ్‌ ఉద్దేశంతో నాబార్డు జారీ చేసే బాండ్లకు ఫైనాన్స్‌.
  8. డ్రిష్‌ మరియు స్ట్రింకర్‌ సేద్య పనిముట్లు /వ్యవసాయ యంత్రాల డీలర్లకు పెట్టుబడి అందించడం. తుంపర/బిందు సహాయం ఈ కింది షరతులకు లోబడి ఉంటుంది.
      • డీలర్‌ గ్రామీణ/సెమీ అర్బన్‌ ప్రాంతాలలో ఉండాలి.
      • కేవలం పైన సూచించిన సామాన్లనే విక్రయించాలి.   ఒకవేళ ఇతర సామాన్లను  కూడా విక్రయిస్తుంటే వాటి రికార్డులను విడిగా నిర్వహించాలి.
      • డీలర్‌కు రూ. 20 లక్షల పరిమితి ఉంటుంది.
  9. అర్తియాలకు (గ్రామీణ/సెమీ అర్బన్‌ ప్రాంతాల కమీషన్‌ ఏజెంట్లు). రుణాలు  వీటి ద్వరా మూలధన పెట్టబడి అవసరాలు తీరుతుంటాయి. రైతులకు ఉత్పాదకాల సరపరా మీద పరపతిని కల్పిస్తారు.
  10. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వ్యవసాయంకోసం రుణాలు ఇవ్వడానికి ఇచ్చే పరపతి.

చిన్నతరహా పరిశ్రమలు (ఎస్‌ఎస్‌ఐలు) అంటే నిర్వచనం ఏమిటి?

చిన్నతరహా పరిశ్రమ యూనిట్లంటే సామగ్రి తయారీ, ప్రక్రియ లేదా సంరక్షణలో ఉన్న యూనిట్లు. వీటి యంత్రాలు, కర్మాగారం (అసలు ధర) కోటిరూ. మించకూడదు. వీటిలో సంబంధిత పరిశ్రమ-మైనింగ్‌, క్వారీయింగ్‌ యంత్ర సేవలు మరమ్మత్తులుంటాయి. సహాయక యూనిట్ల విషయంలోనూ కర్మాగార , యంత్రాల పెట్టబడి (అసలు ధర) కోటి రూ. మించకూడదు.

అతి చిన్నతరహా సంస్థల నిర్వచనం ఏమిటి?

రూ. 25 లక్షలదాకా పెట్టుబడి ఉన్న అతి చిన్నతరహా పరిశ్రమలు చిన్న తరహా సంస్థలు (టైనీ ఎంటర్‌పైజెస్‌) అవుతాయి. ఈ యూనిట్‌ ఎక్కడయినా స్థాపించి ఉండవచ్చు)

చిన్నతరహా సేవ, వ్యాపార సంస్థలు (ఎస్‌ఎస్‌ఎస్‌బిఇ) అంటే ఏమిటి?

రూ. 10 లక్షల దాకా స్థిరీకృత ఆస్తులున్న (భూమి భవనాలు మినహాయించి) పెట్టుబడి పరిశ్రమలు, సేవా, వ్యాపార సంస్థలుగా గుర్తింపు ఎంది చిన్న తరహారంగ ప్రయోజనాలు ఎందుతాయి. స్థిరీకృత ఆస్తుల విలువ గణనానికి అసలు యజమాని చెల్లించిన అసలు ధరనే లెక్కిస్తారు తప్ప తరవాత యజమానులు చెల్లించింది కాదు.

చిన్న తరహా పరిశ్రమ రంగంలో ఉండే పరోక్ష ఫైనాన్స్‌ ఎలా ఉంటుంది?

ఎస్‌ఎస్‌ఐల పరోక్ష ఫైనాన్స్‌లో దిగువ సూచించిన ప్రధానాంశాలు ఉంటాయి.

  • వృత్తికారుల ఉత్పాదకాల, గ్రామీణ, కుటీర పరిశ్రమల ఉత్పాదకాల మార్కెట్‌చేసే, ఉత్పత్తులను సరఫరాచేసే వికేంద్రీకృత రంగానికి సహాయం చేసే ఏజన్సీలకు ఫైనాన్సింగ్‌ చేయడం.
  • ప్రాధాన్యత రంగంలో ఉండే బలహీన వర్గాలకు నిధులందించే ప్రభుత్వ సహాయ సమాఖ్య/సంస్థలకు ఫైనాన్సింగ్‌ విస్తరణ
  • చేనేత సహకార సంస్థలకు అడ్వాన్సులు.
  • చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడికి రాష్ట్ర ఆర్థిక సమాఖ్య (ఎస్‌ఎఫ్‌సి)/ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సమాఖ్య (ఎస్‌ఐడిసి) కి లభించే పరపతి. ఇవి కాలపరిమితి పెట్టుబడులు/రుణాలుగా ఉంటాయి.
  • ఎస్‌ఐడిబిఐ / ఎస్‌ఎఫ్‌సిలకు బ్యాంకులు అందించే నిధులు. ఇవి బిల్స్‌ డిస్కౌంట్‌ రూపంలో ఉంటాయి.
  • చిన్నతరహా యూనిట్ల పెట్టబడికే కేవలం ఎస్‌ఐడిబిఐ, ఎస్‌ఎఫ్‌సిఎస్‌, ఎస్‌ఐడిసిఎస్‌, ఎన్‌ఎస్‌ఐసి లు జారీ చేసిన బాండ్లు.
  • వ్యవసాయేతర రంగానికి పెట్టుబడి ఇచ్చే లక్ష్యంతో జారీ చేసిన నాబార్డ్‌ బాండ్ల సబ్‌స్క్రిప్షన్లు.
  • అతి చిన్న రంగాలకు నిరంతర రుణ సౌకర్యం కల్పించడానికి ఎన్‌బిఎఫ్‌సి/ఇతర సంస్థలకు ఇచ్చే పరపతి.
  • ప్రాధాన్యత రంగ  లక్ష్యాల సాధనకు విధించిన లక్ష్యం విదేశీ బ్యాంకులు సమకూర్చకపోతే అట్టి తగ్గిన పెట్టుబడిని ఎస్‌డిబిఐ డిపాజిట్లుగా సమకూర్చడం.
  • హడ్కోకు బ్యాంకుల ద్వారా పరపతి అందించడం లేదా ప్రత్యేక బాండ్లుగా జారీచేసి పెట్టుబడి సేకరించడం. వీటిని వృత్తికారులకు, చేనేత కార్మికులు మొ|| రుణాలుగా ఇస్తారు. వీటిని అతి చిన్న (ట్రైనీ) రంగ పరోక్ష రుణంగా భావిస్తారు.

బ్యాంకులు పెట్టే ఎటువంటి పెట్టుబడులు ప్రాధాన్యరంగ పెట్టుబడులుగా పరిగణిస్తారు?

నిర్దిష్ట సంస్థలు జారీచేస్తున్న ప్రత్యేక బాండ్లలో బ్యాంకులు పెట్టుబడి పెట్టే ప్రాధాన్యతరంగ అడ్వాన్సులుగా లెక్కిస్తారు. అవి కింది విషయాలకు లోబడి ఉంటాయి.

రాష్ట్ర ఆర్థిక సమాఖ్య (ఎస్‌ఎఫ్‌సి)/రాష్ట్రపరిశ్రమ అభివృద్ధి సమాఖ్యలు

చిన్న తరహా పరిశ్రమల యూనిట్ల పెట్టుబడికి ఈ సంస్థలు జారీచేసిన బాండ్లలో బ్యాంకులు పెట్టుబడి పెడితే అవి ప్రాధాన్యత రంగంలో చిన్నతరహా పరిశ్రమలకు పరోక్ష పెట్టుబడులు అవుతాయి.

గ్రామీణ విద్యుద్దీకరణ సమాఖ్య (ఆర్‌ఇసి)

పంప్‌సెట్ల విద్యుద్దీకరణ కార్యక్రమానికి సంబంధించి ఆర్‌ఇసి జారీచేసిన ప్రత్యేక బాండ్లలో పెట్టుబడి.  ఈ పనిని గ్రామీణ/ సెమీ అర్బన్‌ ప్రాంతాలలో చేస్తారు. ప్రత్యేక వ్యవసాయ ప్రాజెక్టులలో (ఎస్‌ఐఎస్‌పిఎ) భాగంగా వ్యవస్థ మెరుగుదల కార్యక్రమం మొ|| పెట్టుబడి ప్రాధాన్యత రంగం లో వ్యవసాయానికి పరోక్ష పెట్టుబడిగా భావిస్తారు.

నాబార్డు

వ్యవసాయ/సంబంధిత కార్యక్రమాలకు వ్యవసాయేతర రంగ పెట్టుబడి లక్ష్యంతో నాబార్డు జారీ చేసిన బాండ్లు. వ్యవసాయ/చిన్నతరహా పరిశ్రమలకు పరోక్ష పెట్టుబడిగా సందర్భాన్ని బట్టి భావిస్తారు.

భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడిబిఐ)

చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడికి ఉద్దేశించి ఈ సంస్థ జారీచేసిన బాండ్లలో పెట్టుబడి. ఎస్‌ఎస్‌ఐలకు పరోక్ష పెట్టుబడిగా భావిస్తారు.

జాతీయ చిన్న పరిశ్రమల సమాఖ్య లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసి)

ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల పెట్టుబడికి ఉద్దేశించి ఈ సంస్థ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడి. వీటిని కూడా ఎస్‌ఎస్‌ఐల పరోక్ష పెట్టుబడిగా భావిస్తారు.

జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు (ఎన్‌హెచ్‌బి)

గృహనిర్మాణ పెట్టుబడికే జారీ అయిన బాండ్లలో పెట్టుబడిని నివాస యూనిట్‌కు ఇచ్చే రుణ పరిమాణం ఎంతలో ఉన్నా దీన్ని పరోక్ష గృహ నిర్మాణ పెట్టుబడిగా ప్రాధాన్యతరంగ అడ్వాన్సులలో పరిగణిస్తారు.

గృహ నిర్మాణ నగరాభివృద్ధి సమాఖ్య (హడ్కో)

  • గృహ నిర్మాణినికి సంబంధించిన ఫైనాన్స్‌ కోసమై హడ్కో జారీచేసిన బాండ్లలో పెట్టుబడిని. నివాస గృహ యూనిట్‌కు అందించే రుణ పరిమాణం ఎంతలో ఉన్నా ప్రాధాన్యతరంగ అడ్వాన్సులలో పరోక్ష గృహ నిర్మాణ పెట్టుబడిగా భావిస్తారు.
  • వృత్తికారుల చేనేత కార్మికులు మొదలైనవారికి నిరంతర రుణాలు ఇవ్వడానికి ఉద్దేశించి హడ్కో జారీ చేసిన ప్రత్యేక బాండ్లలో పెట్టుబడి. వాటిని ఎస్‌ఎస్‌ఐ (అతి చిన్న-టైనీ) రంగ పరోక్ష రుణాలుగా భావిస్తారు.

ప్రాధాన్యత రంగంలో బలహీన వర్గాల వారి మాటేమిటి?

ప్రాధాన్యతరంగంలో బలహీన వర్గాలను ఈ విధంగా పరిగణిస్తారు.

  • అయిదెకరాలు అంతకుతక్కువ ఉన్న చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కార్మికులు, కవులు రైతులు, వాటా పంట దార్లు.
  • వృత్తికారులు, గ్రామీణ కుటీర పరిశ్రమలు - వీరి వ్యక్తిగత పరపతి పరిధి రూ. 50,000/-లకు మించకూడదు.
  • స్వర్ణ జయంతి గ్రామ రోజ్‌గార్‌ యోజన ప్రయోజనదార్లు
  • షెడ్యూల్డ్‌ కులాల/తెగలవారు
  • వైవిధ్య వడ్డీ రేటు (డిఆర్‌ఐ) పథకం ప్రయోజనదార్లు
  • స్వర్ణ జయంతి షహరి రోజ్‌గార్‌ యోజన ప్రయోజనదార్లు
  • సఫాయి వృత్తి స్వేచ్ఛకల్పన, పునరావాస పథక (ఎస్‌ఎల్‌ఆర్‌) ప్రయోజనదార్లు.
  • స్వయం సహాయ వర్గాలు (స్వస్వ-ఎస్‌హెచ్‌జి)

బ్యాంకులు ప్రాధాన్యత రంగ రుణాలను సాధించనప్పుడు ఏంచర్య తీసుకొంటారు?

  • షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యతా రంగానికి రుణ ప్రధానంలో తగ్గుదల చూపినపుడు నాబర్డ్‌ స్థాపించిన గ్రామీణ వస్థాపన అభివృద్ధినిధి (ఆర్‌ఐడిఎఫ్‌) లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.  బ్యాంకులు డిపాజిటు చేయాల్సిన మొత్తాలు, డిపాజిట్ల వడ్డీరేట్లు, డిపాజిట్ల వ్యవధి మొ|| ఆర్‌ఐడిఎఫ్‌ కార్యకలాప వివరాలను ఏటా కేంద్రబడ్జెట్‌ ఆర్‌ఐడిఎఫ్‌ రూపకల్పనలో చేస్తారు.
  • మనదేశంలో ఉన్న విదేశీ బ్యాంకులు  ప్రాధాన్యతరంగ రుణ లక్ష్యాలు లేదా ఋణ లక్ష్యాలు సాధించడంలో విఫలమయితే, ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని ఏడాదికి 8 శాతం వడ్డీకి ఎస్‌డిబిఐ దగ్గర డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

రుణ దరఖాస్తుల పరిష్కారానికి కాల పరిమితి ఉందా?

రూ. 25 వేల పరపతి పరిధిని పక్షంలోగా రూ. 25 వేల మించిన పరపతి పరిధి దరఖాస్తులను 8-9 వారాలలోగా పరిష్కరిస్తారు.

ప్రాధాణ్యత రంగంలో వడ్డీ రేటు ఏమిటి?

ప్రస్తుత వడ్డీరేటు విధానం ప్రకారం రెండు లక్షల రూ.ల రుణాలకు

బ్యాంకు ప్రధాన రుణ రేటు (పిఎల్‌ఆర్‌) మించకుండా  ఉండాలి.  రెండు లక్షల రూ. పైబడిన రుణాలకు బ్యాంకు స్వేచ్ఛగా వడ్డీరేటు నిర్ధారించవచ్చు.

ప్రాధాన్యతరంగ రుణ పర్యవేక్షణను రిజర్వ్‌ బ్యాంకు ఏవిధంగా చేస్తుంది?

నిర్నీత వ్యవధిలో వాణిజ్య బ్యాంకులు సమర్పించిన రిటర్న్‌ల ద్వారా పరిస్థతిని ఆర్‌బిఐ పరివేక్షిస్తుంది. (రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌ స్థాయి) నాయక బ్యాంక్‌ పథకం (లీడ్‌) లో ఉండే వివిధ ఫోరా సెటప్‌ ద్వారా కూడా బ్యాంకుల ఆచరణను ఆర్‌బిఐ సమీక్షిస్తుంది.

ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate