లిఖిత, అతిపెద్ద, సుదీర్ఘ రాజ్యాంగం: ప్రపంచంలో ప్రస్తుతమున్న అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం.
రాజ్యాంగ పరిషత్ చిహ్నం: ఏనుగు
హెచ్‌వీ కామత్ భారత రాజ్యాంగాన్ని దేవేంద్రుని ఐరావతంతో పోల్చాడు.
భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అని గ్రాన్ విల్లే ఆస్టిన్ The indian constitution A corner Stone of A Nation అనే గ్రంథంలో వివరించాడు.
భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నానని డా. బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నాడు.
భారతదేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను రాజ్యాంగంలో పొందుపర్చడం వల్ల భారతరాజ్యాంగం సువిశాల రాజ్యాంగంగా ఆవిర్భవించిందని ఐవర్ జెన్నింగ్ తెలిపాడు.
భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా సుదర్ఘీమైన, సువిస్తారమైన రాజ్యాంగం - అని ఐవర్ జెన్నింగ్స్ వివరించాడు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అవి
Iవషెడ్యూల్ (1 నుంచి 4వ అధికరణాలు)
మొదటి అనుబంధం భారతదేశ నిర్మాణం, భారతదేశ సరిహద్దులు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విలీన విభాగాలను గురించి వివరిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 29 రాష్ర్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
IIవషెడ్యూల్: జీతభత్యాలు
జీత భత్యాలను గురించి వివరిస్తుంది.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ అధ్యక్షుడు (ఉప రాష్ట్రపతి), రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర విధానమండలి చైర్మన్, ఉప చైర్మన్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీత భత్యాల గురించి వివరిస్తుంది.
నోట్ : రెండో షెడ్యూల్‌లో పొందుపర్చిన వారి జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
IIIవషెడ్యూల్: ప్రమాణ స్వీకారాలు
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ సభ్యుల ప్రమాణస్వీకారాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి వివరిస్తుంది.
IVవషెడ్యూల్- రాజ్యసభనిర్మాణం
రాష్ర్టాల జనాభా ప్రాతిపదికన రాజ్యసభలో ప్రాతినిథ్యం కల్పిస్తారు. విధానసభ కలిగిన ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిథ్యం కలదు.
ఉదా: ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు 31 మంది సభ్యుల ప్రాతినిథ్యం, తక్కువ జనాభా కలిగిన సిక్కిం నుంచి ఒకరికి మాత్రమే ప్రాతినిథ్యం ఉంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురికి ప్రాతినిథ్యం ఉంది.
Vవషెడ్యూల్ : 244 (1) అధికరణం
షెడ్యూల్డ్ ప్రాంతాలు, గిరిజన తెగలకు సంబంధించిన పాలనా అంశాలు.
గిరిజన ప్రదేశాలను షెడ్యూల్డ్ ఏరియాగా పార్లమెంట్ గుర్తిస్తుంది. వాటికి సంబంధించిన అంశాలను రాష్ట్రపతి ప్రకటిస్తాడు.
VIవషెడ్యూల్ : 224(2), 275(1) అధికరణాలు
అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ర్టాల్లో గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను చేర్చారు.
VIIవషెడ్యూల్ : కేంద్ర-రాష్ర్టాల మధ్య అధికార విభజన
246 ప్రకరణను అనుసరించి కేంద్ర-రాష్ర్టాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉమ్మడి జాబితాలో 47 అంశాలను పొందుపర్చారు.
ప్రస్తుతం కేంద్ర జాబితా: 99 అంశాలు
రాష్ట్ర జాబితా: 61 అంశాలు
ఉమ్మడి జాబితా: 52 అంశాలు
88వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో సేవలపై పన్ను కేంద్ర జాబితాలో 268(A) ప్రకరణలో చేర్చారు. ప్రసుతం కేంద్ర జాబితాలో 100 అంశాలు (తెలుగు అకాడమీని అనుసరించి 99 అంశాలు) ఉన్నాయి.
VIIIవ షెడ్యూల్ : భాషలు
రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు (344(1) నిబంధన)
రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు 8వ షెడ్యూల్‌లో 14 భాషలు మాత్రమే ఉన్నాయి. అవి...
1) అస్సామీ 2) బెంగాళీ 3) గుజరాతీ 4) హిందీ 5) కన్నడం 6) కాశ్మీరం 7) మలయాళం 8) మరాఠీ 9) ఒరియా 10) పంజాబీ 11) సంస్కృతం 12) తమిళం 13) తెలుగు 14) ఉర్దూ భాషలు ఉన్నా యి
15వ భాషగా సింథీని 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో చేర్చారు.
16,17,18వ భాషలుగా కొంకిణి, మణిపూరి, నేపాలీ భాషలను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 సంవత్సరంలో చేర్చారు.
19, 20, 21, 22 భాషలుగా 92వ రాజ్యాంగ సవరణగా బోడో, డోగ్రీ, మైథిలీ, సంతాలు అనే భాషలను 2003లో 8వ షెడ్యూల్‌లో చేర్చారు.
343 నిబంధన ప్రకారం హిందీ (దేవనాగరిక లిపిని) జాతీయ భాషగా గుర్తించారు.
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం
1963 సంవత్సరంలో అధికారిక భాషా చట్టాన్ని రూపొందించారు.
ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా కాకుండా అనుసంధాన భాషగా కొనసాగిస్తున్నారు.
2011లో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా VIIIవ షెడ్యూల్‌లో ఒరియా అనే పదం స్థానంలో ఒడియా అనే పదాన్ని చేర్చారు.
IXవషెడ్యూల్ : 31-B నిబంధన
భూసంస్కరణలు, రిజర్వేషన్లు అనే అంశాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా జూన్ 18, 1951లో చేర్చారు.
76వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995 సంవత్సరంలో తమిళనాడు రాష్ర్టానికి సంబంధించి 69 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగంలో IXవ షెడ్యూల్‌లో చేర్చారు.
1950 జనవరి 26న భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు మన రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 విభాగాలు ఉన్నాయి.
ప్రస్తుతం మన రాజ్యాంగంలో సుమారు 462 ప్రకరణలు (తెలుగు అకాడమీ ప్రకారం450 ప్రకరణలు) 12 షెడ్యూల్స్, 25 విభాగాలు కలవు.
నిబంధన : ఆంగ్లంలో Articals అంటారు. ఆర్టికల్‌ను అధికరణం/నిబంధన/ప్రకరణ అంటా రు.
విభాగాలు (Parts) : రాజ్యాంగాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అందులోని విషయాలను 22 అంశాలుగా తెలియజేశారు.
రాజ్యాంగ సవరణ : మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా భారత పార్లమెంట్ చేసే సవరణను రాజ్యాంగ సవరణ అంటారు.
భారత రాజ్యాంగం నుంచి 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా VII, IX భాగాలు తొలగించారు.
1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా IV A భాగం (ప్రాథమిక విధులు), XIV A భాగం పాలనా ట్రిబ్యునల్స్ చేర్చారు.
1993 సంవత్సరంలో IXవ భాగంలో పంచాయతీరాజ్ వ్యవస్థను 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చగా IX A భాగంలో 1993లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించారు.
2012వ సంవత్సరంలో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను రాజ్యాంగంలో IX B భాగంలో చేర్చారు.
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భాగాలు 22 (Number of Parts 25), నిబంధనలు 395 మాత్రమే ఉన్నాయి (Number of Articles 462)
2015 జనవరి నాటికి పార్లమెంట్ 121 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టగా 99 మాత్రమే ఆమోదం పొందాయి.
ఉదా : 99వ రాజ్యాంగ సవరణ న్యాయ నియామకాల కమిషన్
Xవషెడ్యూల్ : పార్టీ ఫిరాయింపులు
102(2), 191 (2) అధికరణాలు
1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్‌గా రాజ్యాంగంలో చేర్చారు.
91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేశారు.
XIవషెడ్యూల్ : పంచాయతీరాజ్ సంస్థలు
243(A) నుంచి 243(O) నిబంధనలు
నూతన పంచాయతీరాజ్ చట్టం 1992ను 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993లో రాజ్యాంగంలో 9వ భాగంలో చేర్చి పంచాయతీరాజ్ సంస్థలకు 29 అధికారాలను కట్టబెట్టారు.
XIIవషెడ్యూల్ : పట్టణ సంస్థలు
243(P) నుంచి 243(ZG) నిబంధనలు
పట్టణ ప్రభుత్వాల చట్టం 1992 ను 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993లో రాజ్యాంగంలోని 9A భాగంలో చేర్చి 18 అధికారాలను కేటాయించారు.
ఆధారము: నమస్తే తెలంగాణ
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి