ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి జైలుకు పోతే ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబం చాలా కష్టాలు అనుభవిస్తుంది. ఖైదీలంటే సమాజంలో ఉన్న చిన్న చూపువల్ల, ఆ కుటుంబం చాలా సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది. ఒక రకంగా వారు కుటుంబాన్ని వెలి వేసినట్టు చూస్తారు. సమాజం ఇలా ప్రవర్తించడం వల్ల ఆ కుటుంబం బాధపడడం, హింస అనుభవించడం ఒక ఎత్తయితే, ఆ కుటుంబంలోని పిల్లలు బతకడం కోసం తప్పుడు మార్గాలు వెతుక్కునే పరిస్థితికి నెట్టబడతారు. సమాజంలోని ఆధిపత్య భావజాలమంతా ఖైదీల పట్ల వ్యతిరేకంగా, క్రూరంగా – ఉండడం వలన, ఏ నేరం చేయని ఖైదీల కుటుంబాలు అనుభవించే కష్టాలు అన్నీ ఎన్నీ కావు.
ఇలాంటి పరిస్థితి జైలులో ఉండే మహిళా ఖైదీల పిల్లలు కూడా ఎదుర్కొంటారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు జైలు వాతావరణం ఏ విధంగాను సానొకూలంగా ఉండక పోగా వాళ్ళు జైలులో ఉండే హింస, తిట్లతో కూడిన భాష మొరటుదనం మధ్య పెరిగి పెద్ద కావాల్సి ఉంటుంది. చాలా జైలు మ్యాన్యువల్స్ పిల్లలను ఐదారు సంవత్సరలు వచ్చేవరకు జైలులో ఉండనిస్తాయి. ఆ తరువాత వాళ్ళు వాళ్ళ తల్లులతో ఉండడానికి వీలులేదు.అలాంటి పిల్లలను బంధువులు కూడా ఎవరూ చేరదీయరు. ఎవరూ దత్తత కూడా తీసుకోరు. ఏ తప్పు చేయని ఈ పిల్లలు బయటికొచ్చి దిక్కులేని వాళ్ళుగా మారుతారు. జీవితాంతం ఆ మచ్చను మోస్తారు, వివక్షను అనుభవిస్తారు
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020