ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అనే జాతీయ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ స్కీమ్.
వార్షిక ఆదాయం 3,500 రూపాయల కన్నా తక్కువ ఉండాలి.
13-35 సంవత్సరాల మధ్యవారై ఉండాలి.
కనీసం పదవ తరగతి చదివి ఉండాలి.
స్థానిక సర్వీసింగ్ యూనిట్లు, పారిశ్రామీక యూనిట్ల ద్వారానూ, వృత్తి పనివారు, నైపుణ్యం గల వారితోనూ శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ కాలంలో స్టైఫండ్, అనంతరం టూల్‌కిట్‌ను అందజేస్తారు.
చదువురాని వారికి సైకిల్ రిపేర్, పాదరక్షల తయారీ లాంటివి నేర్పిస్తారు.
కనీసం 10వ తరగతి చదివిన అభ్యర్హులకు రేడియో టెక్నాలజీ, ఎయిర్ కండిషనింగ్, ఫిట్లర్, ఫ్లంబర్, మోటార్ మెకానిజం, మోటార్ రీవైండింగ్, ముద్రణ లాంటివి ఎన్నో కోర్సుల్లో శిక్షణనిచ్చి, సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తారు.
పరిశ్రమను బట్టి ఋణం మంజూరవుతుంది.
కూల్‌డ్రింక్స్ షాపుకు 9 వేలు,
చిన్న బట్టల దుకాణం 10వేలు,
పుస్తకాల షాపు 10వేలు,
నోట్‌బుక్ తయారీ 6 వేలు,
తేనెటీగల పెంపకం 6 వేలు, సైకిల్ షాపు 8 వేలు,
లాండ్రీ షాపు 3 వేలు ఇలా ఋణం మంజూరవుతుంది. యూనిట్ విలువలో మూడో వంతు సబ్సిడీ లభిస్తుంది.
మరిన్ని వివరాలకు: సంబంధిత మండల కార్యాలయం.
ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/27/2020