অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గ్రామ వికాసానికి ప్రభుత్వ పధకాలు

గ్రామ వికాసానికి ప్రభుత్వ పధకాలు

 1. ఉపోద్ఘాతం
 2. వ్యక్తిత్వవికాసము
  1. పరిశుభ్రమైన అలవాట్లు మరియు పద్దతులు
  2. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేసే అలవాటును నేర్చుకొనేలా యడం
  3. ఆరోగ్యం మరియు పోషణ
  4. అందరికి విద్య
  5. సాంఘీకాభివృద్ధి
  6. పరిశుభ్రమైన గ్రామాలు
  7. వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల అభివృద్ధి
  8. గ్రామీణ పారిశ్రామీకరణ
  9. యువకులకు నైపుణ్యాల అభివృద్ధి
  10. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
  11. పర్యావరణ పరిరక్షణ
  12. సాంప్రదాయ జలవనరుల పునర్జీవం ద్వారా నీటి యాజమాన్యం
  13. వాయు, నీటి మరియు భూ కాలుష్యం తగ్గించుట
  14. వాన నీటి వినియోగం - ఇంటి పై కప్పు నీటిని భధ్రపరచడం
  15. మౌళిక సదుపాయాలు
  16. సురక్షితమైన త్రాగునీరు
  17. రోడ్లు సదుపాయం
  18. ప్రతి ఇంటికీ విద్యుత్ సదుపాయం, ఇతర ప్రత్యామ్నాయ వనరుల (సౌరశక్తి )ద్వారా విద్యుత్ సదుపాయం
  19. ప్రజా సంస్థలైనటు వంటి అంగన్ వాడీలు, స్కూలులు, ఆసుపత్రులు మరియు గ్రామ పంచాయితీలు మరియు గ్రంధాలయాలకు మౌళిక సదుపాయాల రూపకల్పన
  20. స్వయం శక్తి సంఘాలు, క్రీడా మైదానాలు, పౌర సరఫరా, స్మశాన వాటికలకు మౌళిక సదుపాయాలు
  21. గ్రామీణ మార్కెట్లు
  22. సూక్ష్మ బ్యాంకులు / పోస్ట్ ఆఫీస్ /ఎటి మ్ మరియు UIDAI కార్డులు
  23. బ్రాడ్ బ్యాండు టెలికం కనెక్టివిటీ మరియు కామన్ సర్వీసు సెంటర్ లను ఏర్పాటు చేయుట
  24. సాంఘీక భద్రత
  25. భీమా పధకాలు
  26. పౌర సరఫరాలు - అర్హులైన వారి అందరికీ పౌర సరఫరా పథకం అందేలా చూడటం
  27. గ్రామ పంచాయితీలను బలోపేతం చేయడం
  28. సోషల్ ఆడిట్
  29. ముందస్తు సమాచారం
  30. సరైన సమయంలో సమస్యల పరిష్కారం
  31. సకాలంలో సేవలను అందించడం
  32. గ్రామ సభ, మహిళా సభ మరియు బాలల సభను ఏర్పాటు చేయుట

ఉపోద్ఘాతం

గ్రామీణాభివృద్ధి దిశగా ఎన్నో ప్రభుత్వపథకాలు అమలులో ఉన్నాయి. వ్యక్తిగత వికాసం మొదలుకొని, కుటుంబ, సంఘ, సమాజ పరిపూర్ణ వికాసం కోసం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుపరచబడుతున్నాయి. ఫ్రతి పథకం లక్ష్యం వేరు, లక్ష్యసమూహం కూడా వేరు. మనిషి సామాజికంగా, మానసికంగా, శారీరికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచే భావనతో, ప్రతి పథకం కార్యాచరణ నిర్వచించబడింది. అత్యంత సూక్ష్మ స్థాయి అంశాలనుండి, స్థూలస్థాయి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ పథకాలు రూపు దిద్దుకున్నాయి. ఉదాహరణకు చేతులు శుభ్రత వినడానికి సూక్ష్మమంగా అంపించవచ్చు. కాని అది ఆరోగ్యవంతమైన జీవితానికి తొలి మెట్టు. అందుకే పథకాన్ని కాకుండా, వికాస అంశాలను దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధి పథకాలు వివరించడం జరిగింది. కార్యాచరణ వివరములు

వ్యక్తిత్వవికాసము

పరిశుభ్రమైన అలవాట్లు మరియు పద్దతులు

లక్ష్యం: వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందించడం.

 • పళ్ళను తోముకోవడం
 • రోజు స్నానం చేయడం
 • మరుగుదొడ్లను ఉపయోగించడం
 • మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను బాగా కడుక్కోవడం
 • బట్టలను శుభ్రంగా ఉతుక్కోవడం
 • ఋతుక్రమంలో కిషోర బాలికలు మరియు స్త్రీలు వ్యక్తిగత శుభ్రతను పాటించడం

వ్యూహం

 • స్వచ్చంద కార్యకర్తల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయడం
 • అంగన్ వాడి కేంద్రాలు పాఠశాలలు, స్వయంశక్తి సంఘాల ద్వారా అవగాహన కల్పించడం
 • వీధినాటకాలు, లఘు చిత్రాలు
 • కమ్యూనిటీ రేడియో
 • జాతీయ ఆరోగ్య మిషన్

పథకాలు

 • సమగ్ర బాలల అభివృద్ధి పథకం
 • స్వచ్చభారత్

ఫ్రతిఫలాలు

 • యువజన కార్యకర్తలతో ఆరోగ్య పరిరక్షణ బృందాలు ఏర్పాటు చేయుట
 • గృహ సందర్శనాలు
 • ముందుగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించిన వారిని ప్రోత్సహించడం, పాటించని వారిని పాటించేలా చేయడం

ఫలితాలు

 • అతిసారం మరియు ఇతర అంటు వ్యాధులను అరికట్టడం
 • ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడం
 • ఆరోగ్యము మరియు సంక్షేమాన్ని పెంపొందించడం

క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేసే అలవాటును నేర్చుకొనేలా యడం

లక్ష్యం: వయస్సు మరియు లింగ బేధం అనుసారంగా ప్రతి రోజు వ్యాయామ చేయడం

వ్యూహం

 • వ్యాయామశాలకు వెళ్లడం, నడక, పరుగెత్తడం, క్రీడలు వంటి వాటిని అభిరుచికి అనుసారంగా లభించేలా చేయడం
 • పై వాటిని ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రోత్సహించడం

కాలు

 • ఎమ్. పి లాడ్స్
 • నెహ్రూ యువ కేంద్రాలు
 • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పధకం
 • రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పధకాలు

ప్రతిఫలాలు

 • క్రీడా మైదానాలు మరియు పార్కుల అభివృద్ధి
 • శారీరక శ్రమ చేయడానికి కావలిసిన అవకాశాలను కలుగజేయడం
 • గ్రామాలలో ప్రతి దినం వ్యాయామ నియమావళిని ఆచరించడం

ఫలితాలు

 • ఆనారోగ్య నివారణ
 • ఆరోగ్య పరిరక్షణ
 • మధ్యపానం, ధూమపానం మరియు మత్తు మందులకు బానిసలు కాకుండా నివారించడం. మరియు పై వాటికి బానిసలు అయిన వారిని గుర్తించడం.
 • స్వయం శక్తి బృందాలలో పై విషయాల పై అవగాహన కలిగించడం
 • పాఠశాలలు, యువజన సంఘాలు, స్వయం శక్తి బృందాల ద్వారా ప్రచారం చేయడం

కాలు

 • జాతీయ ఆరోగ్య మిషన్
 • ఎమ్ లాడ్ నిథులు
 • ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ పథకాలు

ప్రతిఫలాలు

 • ప్రమాదకరమైన ప్రవర్తన మరియు మాదక మరియు మత్తు పదార్ధాలకు బానిసలైన వారిని గుర్తించడం.
 • పైన పేర్కొన్న ప్రవర్తన తగ్గేలా సామాజిక కట్టుబాట్లు చేయడం
 • పై అలవాట్లు ప్రోత్సహిస్తున్న మార్గాలు మరియు సంస్థలను నివారించడం
 • మత్తు పదార్ధాలకు బానిసలైన వారిని వాటి నుండి కాపాడటం

ఫలితాలు

 • కుటుంబ మరియు సమాజ శ్రేయస్సు
 • ఆరోగ్య పరిరక్షణ
 • సమాజం మరియు కుటుంబంలో శాంతిని నెలకొల్పటం
 • స్త్రీల పట్ల జరిగే దురాగతాలను నివారించడం

ఆరోగ్యం మరియు పోషణ

లక్ష్యాలు

 • ఆరోగ్య కార్డు, వైద్య సదుపాయాలు వంటి మౌళిక ఆరోగ్య సదుపాయాల సార్వత్రిక అందుబాటు
 • సమగ్ర వ్యాధి నిరోధక టీకాలు వేయించడం
 • సమతుల్య పోషణ
 • సమతుల లింగ నిష్పత్తి

వ్యూహం

 • ఆరోగ్య మౌళిక సదుపాయాలు మరియు వస్తువుల లోపాన్ని గుర్తించడం
 • శిక్షణ పొందిన ఆరోగ్య మరియు పారా హెల్త్ నిపుణుల ఖాళీలను గుర్తించడం
 • ఆరోగ్య మరియు పారా హెల్త్ నిపుణులకు కావలిసిన నైపుణ్యాలను గుర్తించడం
 • వ్యాధి నిరోధక టీకాల శిబిరాలను ఏర్పాటు చేయుట
 • ఆరోగ్య కార్డును అందచేయడం
 • వీధి నాటకాలు మరియు తోలుబొమ్మలాట వంటి ప్రదర్శన ద్వారా ఆరోగ్య అవగాహన పై కాలెండర్ తయారు చేయుట
 • రక్తహీనత, ఆరోగ్యం మరియు పరిశుభ్రత వంటి విషయాలపై అవగాహన కలుగజేయుట
 • మధ్యాహ్న భోజన పధకము మరియు పోషకాహార పథకమును పాఠశాలలు మరియు అంగన్ వాడీలలో సక్రమంగా అమలు జరిగేలా చూడటం

పథకాలు

 • జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)
 • సమగ్ర బాలల అభివృద్ధి పథకం (ICDS)

ప్రతిఫలాలు

 • మాతృ, శిశు మరణాల రేటు తగ్గటం
 • వ్యాధి నిరోధక టీకాలు వేయడం
 • ఆసుపత్రిలో ప్రసవం జరిగేటట్లు చేయడం
 • గ్రేడు III మరియు గ్రేడు IV రక్త హీనతను తగ్గించడం
 • పిల్లలలో పోషకాహార లోపాలను నివారించడం అదేవిధంగా రక్తహీనతను స్త్రీలు, గర్బిణీలు మరియు కిశోర బాలికలలో నివారించడం

ఫలితాలు

 • వందశాతం వ్యాధి నిరోధకత
 • వందశాతం ఆసుపత్రిలో ప్రసవం
 • స్త్రీలు, గర్బిణులు, పిల్లలు మరియు కిశోర బాలికలలో పోషకాహార లోపాలను నివారించడం
 • ఆరోగ్య నిపుణులు యొక్క నైపుణ్యాలను పెంపొందించడం
 • ఆరోగ్య మరియు పరిశుభ్రత పై సానుకూల వైఖరి మరియు ప్రవర్తనను పెంపొందించుట

అందరికి విద్య

లక్ష్యాలు

 • పదవ తరగతి వరకు అందరికీ విద్య
 • పాఠశాలను స్మార్ట్ స్కూలులుగా అభివృద్ధి చేయుట
 • నిపుణులు మరియు ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించడం
 • ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయుట
 • స్మార్ట్ స్కూలు అనగా ఈ- గ్రంధాలయం మరియు ఐటీ వసతులు కలిగి ఉండటం
 • ప్రయోజనాత్మక విద్యను వయోజన విద్య ప్రచారాల ద్వారా ప్రోత్సహించడం
 • వీధి నాటకాలు, తోలు బొమ్మలాట వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యను ప్రోత్సహించడం
 • స్థానిక వార్తల వార్త పత్రికను యువజనులచే నడిపించడం
 • సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి skype ద్వారా నిష్ణాతులైన వారిచే బోదన
 • ప్రాంతీయ చరిత్ర పై ప్రదర్శనలు మరియు విజ్ఞులచే శిక్షణ
 • సమగ్ర సాంకేతిక సదుపాయాలతో గ్రంధలయం ఏర్పాటు
 • ఆసక్తి కలిగిన వారికి ఈ-శిక్షణ పై శిక్షణను ఇవ్వడం
 • అందరికి విద్య ముఖ్యంగా బాలికలకు విద్య కొరకు యువజన సంఘాలు ఏర్పాటు

పథకాలు

 • సర్వ శిక్ష అభయాన్
 • రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభయాన్
 • జాతీయ సాక్షరతా మిషన్
 • జాతీయ బాలకార్మికుల నిర్మూలన ప్రాజెక్టు
 • ఎమ్.పి.లాడ్ నిధులు

ప్రతిఫలాలు

 • పదవతరగతి వరకు పాఠశాలలో పిల్లల చేరిక, హాజరు గణణీయంగా పెరగడం
 • తరగతులలో పిల్లల గైర్హాజరు తగ్గించడం
 • ప్రాధమిక తరగతులలో కనీస విద్య ప్రమాణాలు ఉండేలా చూడటం
 • మౌళిక సదుపాయాల కల్పన మరియు సామర్ధాల పెంపుదల దిశగా కృషి చేయుట
 • మన ఊరిగీతాన్ని ప్రజలలో సంఘీభావం మరియు గౌరవం పెంపోందించేలా పాడుకోవడం
 • మన గ్రామ దినాన్ని జరుపుకోవడం

వ్యూహం

 • వయోజన విద్య కార్యక్రమాల ఏర్పటు
 • ఆరోగ్య శిబిరాలలో యువజనులకు భాగస్వామ్యులుగా చేయుట
 • గ్రామ పెద్దలు ప్రాంతీయ నాయకులు,స్వాతంత్ర సమర యోదులు,అమరవీరులు మరియు స్త్రీలను గ్రామ దినోత్సవం రోజు గౌరవించడం
 • ప్రాంతీయ దేశ భక్తి గీతాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం
 • గేయరచన పై పోటీలను నిర్వహించడం
 • ప్రాంతీయ జానపద సంగీతము మరియు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించడం
 • నేర చరిత్ర లేని ప్రశాంత గ్రామాల కొరకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయుట
 • లింగ వివక్షతను రూపుమాపుట కొరకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయుట
 • ప్రాంతీయ ఉత్పాదకత మరియు ఉత్పత్తి పెరిగేందుకుగాను చర్చలు ఏర్పాటు చేయుట

పథకాలు

 • భారత్ నిర్మాణ్ కార్యకర్తలు
 • యువజన సంఘాల పధకాలు
 • ఎమ్ పి లాడ్స్
 • సమాచార విద్య ప్రచార పధకాలు

ప్రతిఫలాలు

 • సంఘ అభివృద్ధి కొరకు సంవత్సర కార్యాచరణ ప్రణాళిక ద్వారా యువజన సంఘాల ఏర్పాటు మరియు బలోపేతం చేయడం
 • పౌరుల కమిటీలను ఏర్పాటు చేయుట
 • నేరాలు మరియు తగాదాలను తగ్గించడం
 • ప్రస్తుత ఖాళీలను భర్తీ చేయడం
 • వయోజన విద్యకు హాజరవుతున్న వయోజనుల సంఖ్య మరియు విద్య ప్రమాణాలను అంచనా వేయుట
 • కనీసం ఒక కుటుంబం నుండి ఒకరికైనా కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పై అవగాహన ఉండేటట్లు చూడటం
 • ప్రజల పఠనా శక్తి మరియు అలవాట్లు పెంచడం ద్వారా సంఘం మరియు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొనేలా ప్రోత్సహించడం
 • స్వశక్తి మరియు పరస్పర గౌరవం
 • నిర్ణయాలు తీసుకొనే సామర్ధ్యం
 • మన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన
 • సాంకేతికతను సరిగ్గా వినియోగించుకొని, ప్రస్తుత ప్రపంచంకు అవసరమయ్యే సామర్ధ్యాలను పెంపొందించుకొనుట

సాంఘీకాభివృద్ధి

లక్ష్యాలు

 • స్వచ్ఛంద భారత్ నిర్మాణ్ వాలంటీరులను తయారు చేయడం
 • ప్రజల సామర్ధ్యాల పెంపుదల ద్వారా ప్రాంతీయాభివృద్ధి
 • పెద్దలు, స్వాతంత్ర సమరయోధులు, అమరా వీరులు మరియు స్త్రీలను గౌరవించే కార్యక్రమాలు
 • నేరాలు మరియు ఘోరాలు లేని ప్రశాంత గ్రామీణ వాతావారణం ఏర్పరచే కార్యక్రమాలు
 • సమాజంలోని వ్యక్తుల సంఘాలు ఏర్పాటు
 • యువజనులకు అవగాహనా కల్పించుట
 • గ్రామీణ క్రీడలు మరియు సాంప్రదాయ పండగలు నిర్వహించడం

ఫలితాలు

 • సమైక్య మరియు ప్రశాంతమైన గ్రామాలు
 • నేర రహిత సంఘం
 • అవగాహన, జ్ఞానం మరియు అవకాశాల పెంపుదల

పరిశుభ్రమైన గ్రామాలు

లక్ష్యాలు

 • అందరికీ పరిశుభ్రమైన వాతావరణం అందించుట కొరకు
 • ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం
 • ప్రజా సంస్థలలో మరుగుదొడ్ల నిర్మాణం
 • మురుగు మరియు మురుగు నీరు యాజమాన్యం
 • బయోగ్యాస్ ప్లాంట్ లను మరుగుదొడ్లకు అనుసంధానం చేయడం

వ్యూహం

 • మరుగుదొడ్లు లేని గృహాలను గుర్తించి మరుగుదొడ్ల నిర్మాణానికై ప్రోత్సహించడం
 • మరుగుదొడ్లు లేని ప్రజాసంస్థలు (పంచాయితీ, భవనాలు, పాఠశాలలు..) గుర్తించి వాటి నిర్మాణానికి ప్రోత్సహించడం
 • సమాచార, విద్య, ప్రచార మాధ్యమాల ద్వారా మరుగుదొడ్ల ఆవశ్యకతను తెలియజేయుట
 • ఇంకుడు కుంతలు ఏర్పాటు
 • చెత్త సేకరణ, వేరు చేయుట మరియు పారబోయుట
 • యువజనులతో

పథకాలు

 • మహాత్మ గాంధీ ఉపాధి హామీ పధకం
 • స్వఛ్చ భారత్ అభియాన్
 • ఎమ్ పి లాడ్స్
 • నిర్మల గ్రామం నిర్మాణం
 • మరుగుదొడ్ల నిర్మాణం
 • మురుగు నీరు మరియు చెత్త యాజమాన్యం

ఫలితాలు: బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన నివారణ పరిశుభ్రమైన వీధులు మరియు ప్రజాస్థలాలు

వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల అభివృద్ధి

లక్ష్యాలు

 • సుస్థిర వ్యవసాయం మరియు సేంద్రీయ వ్యవసాయం
 • సేంద్రీయ వ్యవసాయ రైతు సంఘాల ఏర్పాటు
 • భూసార పరీక్ష కార్డులు తయారీ
 • ప్రాంతీయ విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయుట
 • శ్రీ సాగు మొదలగు పద్ధతులను ప్రోత్సహించుట
 • బిందు మరియు తుంపర సేద్యం
 • సౌర శక్తి

పథకాలు

 • వ్యవసాయ సేవాకేంద్రం
 • వ్యవసాయ శాఖ పథకాలు
 • జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్
 • మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం

ప్రతిఫలాలు

 • మహిళా కిసాన్ స్వ శక్తి కరణ్ పరియోజన
 • భూసార మరియు ఆరోగ్య కార్డులు తయారీ
 • విత్తన బ్యాంకు ఏర్పాటు
 • శ్రీ సాగం
 • బిందు సేద్యం

ఫలితాలు

 • రసాయన ఎరువు వాడకం తగ్గించడం
 • రసాయన పురుగు మందుల వాడకం తగ్గించడం
 • సేంద్రీయ ఎరువులు మరియు పురుగు మందుల వాడకం
 • వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందుబాటులో ఉంచడం

గ్రామీణ పారిశ్రామీకరణ

లక్ష్యాలు

 • పశు సంపదను పెంచడం (గోబర్ బ్యాంకు మరియు పశు సదనాలను ఏర్పాటు చేయుట)
 • కోత అనంతరం చేయు పనులు
 • ఆహార సంబంధ మరియు పాల ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు
 • కుటీర పరిశ్రమ ఏర్పాటు

వ్యూహం

 • గ్రామీణ ప్రాంతాలలో పశు సంబంధిత జీవనోపాదుల ఏర్పాటు
 • పశు ఆరోగ్యం గురించి ప్రచారం మరియు ప్రదర్శనలు
 • సేంద్రీయ ఎరువుల తయారీ కొరకు గోబర్ బ్యాంకుల నిర్వహణ
 • పశు పోషణ మరియు సంరక్షణ కొరకు పశువుల హాస్టల్ ను గ్రామస్థాయిలో నిర్వహించడం
 • కోత అనంతరం జరిగే నష్టం నివారించుటకై గ్రామంలో గిడ్డంగులను ఏర్పాటు చేయుట
 • చిన్న తరహా పాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు మరియు మార్కెటింగ్
 • గ్రామ స్థాయిలో నాణ్యత ప్రమాణాలను అనుసరించి గ్రేడింగ్
 • ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు
 • చేనేత, కుమ్మరి వంటి కుల వృత్తులను ఆధునికంగా తీర్చిదిద్ది చిన్న తరహా పరిశ్రమలుగా తీర్చిదిద్దడం
 • గ్రామీణ పర్యాటక మరియు ప్రాకృతిక పర్యాటక కార్యక్రమాలను ప్రోత్సహించడం

పథకాలు

 • వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు
 • గ్రామీణ ఉపాధి హామీ పథకం
 • పాడి మరియు పశు సంవర్ధక శాఖ అమలు చేయు కార్యక్రమాలు
 • జౌళి మంత్రిత్వ శాఖ మరియు మాధ్యమిక చిన్నతరహా మరియు సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేయు కార్యక్రమాలు

ఫలితాలు

 • పశు సంబంధిత ఆదాయం పెరగడం
 • వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధరలు
 • వ్యవసాయ మరియు పాడి ఉత్పత్తుల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయుట
 • ఉపాధి మరియు ఆదాయం పెరిగే అవకాశాలు పెరగడం

యువకులకు నైపుణ్యాల అభివృద్ధి

లక్ష్యాలు: జీవనోపాదులు పెంపొందించుటకు యువకుల నైపుణ్యాలను అభివృద్ధి చేయుట

వ్యూహాలు

 • కావలిసిన నైపుణ్యాలు మరియు నైపుణ్యాల కొరతను గుర్తించడం
 • శిక్షణా సంస్థలు మరియు సర్టిఫికేషన్ సంస్థలను గుర్తించడం
 • స్వయం ఉపాధి కొరకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు
 • వృత్తి విద్య కోర్సులను పాఠశాలలో ప్రవేశపెట్టుట
 • ఉపాధి అవకాశాలను మరియు సంస్థలను గుర్తించుట
 • నిరంతర నైపుణ్యాల శిక్షణ ద్వారా సుస్థిర అభివృద్ధి
 • మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నైపుణ్యాలను మెరుగు పరచడం
 • మేనేజ్ మెంట్ ఇంఫర్మేషన్ సిస్టం ద్వారా శిక్షణ పొందిన వారి వివరాలను పొందుపరుచుట

పథకాలు

 • జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్
 • ఆజీవిక నైపుణ్యాలు
 • RESTI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు
 • సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహ పరిశ్రమల శాఖ అమలు చేయు కార్యక్రమాలు

ప్రతిఫలం: శిక్షణ పొందిన యువజనులు

ఫలితాలు

 • నైపుణ్యాలను మెరుగుపరచడం
 • మెరుగైన జీవనోపాదుల మరియు ఉపాధి అవకాశాలు
 • మహిళా స్వయం శక్తి సంఘాల ఏర్పాటు ద్వారా మహిళల సాధికారత

వ్యూహాలు

 • భాగస్వామ్య పద్ధతి ద్వారా పేదలను గుర్తించడం
 • గ్రామ పంచాయితీ/క్లస్టర్ స్థాయిలో స్వయం శక్తి సంఘాలు మరియు సమాఖ్యల ఏర్పాటు
 • బ్యాంకు లింకేజీలు
 • స్వయం శక్తి సంఘ మహిళలు అందరికీ ప్రధాన మంత్రి జనధన్ యోజన్ ద్వారా బ్యాంకు అకౌంట్లు ఉండే విధంగా చూడటం

పథకాలు: జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ ప్రధాన మంత్రి జనధన్ యోజన

ప్రతిఫలాలు

 • స్వయం శక్తి సంఘాల ఏర్పాటు మరియు పనితీరు మెరుగు పరచడం
 • వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం
 • బ్యాంకు లింకేజీలు ఉండేటట్లు చూచుట
 • కుటీర లేక సంఘటిత పరిశ్రమల ఏర్పాటు

ఫలితాలు

 • మెరుగైన జీవనోపాదుల ద్వారా ఆదాయం పెంపు
 • పొదుపును అలవాటు చేయుట

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం

లక్ష్యాలు: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం అమలు

వ్యూహాలు

 • సరైన అవసరాలను ఉపాధి రోజు (రోజ్ గారీ దివస్)ను గుర్తించడం
 • భాగస్వామ్య పద్ధతిలో ప్రణళికను సిద్ధం చేయడం
 • అవసరంనకు అనుగుణంగా పనులను నిర్ణయించడం
 • నాణ్యమైన ఆస్తులను గుర్తించడం మరియు సృష్టించడం

పథకాలు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

ప్రతిఫలాలు

 • అవసరమైన ఉపాధిని కల్పించడం
 • నాణ్యమైన ఆస్తులను సృష్టించడం

ఫలితాలు:

మెరుగైన ఆదాయం మరియు పేదరిక నిర్మూలన

పర్యావరణ పరిరక్షణ

కార్యాచరణ: రోడ్లకు ఇరువైపుల చెట్ల పెంపకం, పెరటిలో చెట్ల పెంపకం, పాఠశాలలు మరియు ప్రజాస్థలాలలో చెట్ల పెంపకం మరియు సామాజిక అడవుల పెంపకం

లక్ష్యాలు

 • గ్రామీణ ప్రాంతాలలో వృక్ష సంపద అభివృద్ధి ఆర్ధిక,పర్యావరణ,సాంఘీక మరియు సాంసృతిక ప్రాముఖ్యత గల చెట్లను ప్రజా స్థలాలు, రోడ్లు, చెరువు గట్లు, పొలాల గట్ల పై పెంచడం
 • గ్రామంలో మరియు గ్రామం చుట్టూ ఆకు పచ్చ నడక మార్గాలను అభివృద్ధి చేయడం
 • నిరుపేద కుటుంబాలకు కేటాయించిన, ప్రజా స్థలాలలోని చెట్ల పై అనుభవ అధికార హక్కులు పొందేలా చేయుట
 • స్థానిక నర్సరీలు అభివృద్ధి చేయుట
 • వ్యయాలు మరియు చెల్లింపులను సులభతరం చేయుట

పథకాలు

 • మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
 • జాతీయ ఉద్యానవన మిషన్
 • పర్యావరణ మంత్రిత్వ శాఖ అమలు చేయుచున్న పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల పై చేపట్టే పథకాలు

ప్రతిఫలాలు

 • వివిధ రకాల చెట్లు నాటడం మరియు నర్సరీల అభివృద్ధి
 • గ్రామీణ నర్సరీలు వృద్ధులకు మరియు వికలాంగులకు ఉపాధి కల్పిస్తాయి
 • చెట్ల నుండి ఆదాయం మరియు ఉపాధి కల్పన
 • నేల కోత నివారణ
 • పచ్చదనం పెంపొందించుట
 • వాతావరణంలో పెను మార్పులను నివారించుట

సాంప్రదాయ జలవనరుల పునర్జీవం ద్వారా నీటి యాజమాన్యం

లక్ష్యాలు

 • వాటర్ షెడ్ సూత్రాలను అనుసరించి జీవనోపాదుల అభివృద్ధి నీటి పారుదల, డ్రైనేజీ, భూమి కోత నివారణ ద్వారా గ్రామ అభివృద్ధి
 • భాగస్వామ్య పద్ధతుల ద్వారా వాటర్ షెడ్ యాజమాన్యం
 • సమీకృత నీటి యాజమాన్య పద్ధతులు
 • మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం
 • నీటి పారుదల యాజమాన్యం
 • డ్రైనేజీ సదుపాయం
 • భూగర్భ జలాల అభివృద్ధి

వాయు, నీటి మరియు భూ కాలుష్యం తగ్గించుట

లక్ష్యాలు: గాలి, నీరు మరియు భూ కాలుష్య నివారణ

వ్యూహం

 • వాటర్ షెడ్ యాజమాన్య పద్ధతులను శాస్త్రీయ మరియు భాగస్వామ్య పద్ధతి ద్వారా అంచనా వేయుట
 • బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన గ్రామీణ ప్రాంతాలలో లేకుండా చేయుట
 • భూసార పరీక్ష మరియు భూ ఆరోగ్య కార్డుల నిర్వహణ
 • సేంద్రియ ఎరువు తయారీ, బయోగ్యాస్ తయారీ
 • హానికరమైన కాలుష్య పదార్ధాలైనటువంటి పాలిథీన్ బ్యాగులను నిషేదించడం
 • వంటకు ఉన్నతి పోయ్యిలకు ప్రోత్సహించడం

పథకాలు

 • సహజ వనరులు మరియు ఇంధనముల మంత్రిత్వ శాఖ అమలు చేయు కార్యక్రమాలు
 • వ్యవసాయ శాఖ అమలు చేయు పధకాలు
 • సామాజిక మరియు భౌతిక మౌళిక సదుపాయాలను సృష్టించడం ద్వారా చెత్త మరియు కాలుష్య నివారణ

ఫలితాలు

 • కాలుష్య నివారణ
 • ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
 • అందమైన పరిశుభ్రమైన పరిసరాలు

వాన నీటి వినియోగం - ఇంటి పై కప్పు నీటిని భధ్రపరచడం

లక్ష్యాలు

 • వాన నీటి పరిరక్షణనను ఒక సాంప్రదాయ పద్ధతిగా గ్రామాలలో ప్రోత్సహించడం
 • ఇంటి కప్పు పైన నీటిని భద్రపరచి టాయిలెట్లకు ఇంటి అవసరాలకు వాడుకోవడం
 • నీటి పరిరక్షణకు అవసరమైన కట్టడాలను నిర్మించడం

పథకాలు

 • జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం
 • మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

ప్రతిఫలాలు: సమగ్ర నీటి యాజమాన్య పద్ధతుల కట్టడాలు నిర్మిచడం

మౌళిక సదుపాయాలు

పేదవారికి అందరికీ పక్కా ఇళ్లు

లక్ష్యాలు: పేదవారికి అందరికీ పక్కా ఇళ్లు

వ్యూహం: పక్కా ఇళ్లు లేని పేద వారిని గుర్తించడం

పథకం: ఇందిరా ఆవాస యోజన

ప్రతిఫలాలు: సుస్థిరమైన పక్కా ఇళ్లు

ఫలితం: అందరికీ గౌరవ ప్రదమైన జీవితం

సురక్షితమైన త్రాగునీరు

లక్ష్యాలు: కుళాయిలు ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు

వ్యూహం

 • త్రాగు నీరు వనరులను గుర్తించడం
 • త్రాగు నీటి భవిష్యత్ అవసరాలను గుర్తించడం
 • గ్రామం యొక్క త్రాగు నీటి అవసరాలను గుర్తించడం
 • నీటి వనరుల పరిశుభ్రత, పునర్జీవం మరియు ఎల్ల వేళలా ఉండేలా చూడటం

పథకాలు: జాతీయ గ్రామీణ త్రాగు నీరు పథకం

ప్రతిఫలాలు: మంచినీటి పైపుల ద్వారా అందరికీ త్రాగు నీరు

ఫలితాలు: ఆరోగ్యం మెరుగుపరచడం అదే విధంగా కలుషిత నీటి వలన వచ్చే డయేరియా వంటి రోగాలను అరికట్టడం

రోడ్లు సదుపాయం

లక్ష్యాలు: మూసి ఉన్న కాలువలు ఉండేలా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు సదుపాయం

వ్యూహం: కచ్చా రోడ్లను గుర్తించి పక్కా రోడ్లు వేయడం

పథకాలు

 • ప్రధాన మంత్రి గ్రామ్ నడక్ యోజన
 • మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
 • వెనుక బడిన ప్రాంతానికి ఇచ్చే గ్రాంట్లు

ప్రతిఫలాలు: అన్ని కాలాలకు అణుగుణంగా ఉండే రోడ్లను అవసరాలను గుర్తించి వేయుట

ఫలితాలు: మార్కెట్లు మరియు ఇతర సేవలు అందుబాటులోనికి వచ్చి ఆర్ధికాభివృద్ధి పెంచేలా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయుట

ప్రతి ఇంటికీ విద్యుత్ సదుపాయం, ఇతర ప్రత్యామ్నాయ వనరుల (సౌరశక్తి )ద్వారా విద్యుత్ సదుపాయం

లక్ష్యాలు: ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా

వ్యూహలు

 • వాయు, సౌర మరియు చిన్న తరహా జల విద్యుత్ ఉత్పాదక వనరులను గుర్తించడం
 • విద్యుధీకరణ లేని ఇళ్లను బేస్ లైన్ సర్వే ద్వారా గుర్తించడం

పథకాలు: రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుధీకరణ యోజన ఎం.ఎన్.ఆర్.స్కీము

ప్రతిఫలాలు

 • గ్రామాలలో వందశాతం ఇళ్లను విద్యుత్ సదుపాయం
 • వీధి దీపాలు

ఫలితం: ఆదాయం పెంపుదల మరియు ఆర్ధికాభివృద్ధి

ప్రజా సంస్థలైనటు వంటి అంగన్ వాడీలు, స్కూలులు, ఆసుపత్రులు మరియు గ్రామ పంచాయితీలు మరియు గ్రంధాలయాలకు మౌళిక సదుపాయాల రూపకల్పన

లక్ష్యాలు: అంగన్ వాడీలు, స్కూలులు, ఆసుపత్రులు మరియు గ్రామ పంచాయితీలకు మౌళిక సదుపాయాల కల్పించుట

వ్యూహలు

 • పర్యవరణానికి హాని చేయని, లోకల్ మెటీరియల్ పాఠశాలలు మరియు ఇతర ప్రజా సంస్థలను నిర్మిచటం
 • పాత భవనాల మరమత్తులు చేపట్టుట లేదా పునర్మిణం

పథకాలు

 • ఎన్.జి నరౌగా
 • వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధి
 • ఆర్.జి.పి.ఎస్ ఎ
 • సర్వ శిక్ష అభియాన్
 • ఐ.సి.డి.ఎస్.
 • ప్రజా సంస్థల మరమత్తులు లేదా పునర్నిర్మాణం
 • నాణ్యంమైన దృఢమైన అంగన్ వాడీలు, స్కూలు, ఆసుపత్రులు, గ్రామపంచాయితీ ఆఫీసు, గ్రంధాలయాలను నిర్మించడం

ప్రతిఫలాలు

 • ప్రజా సంస్థల సేవల నాణ్యతా ప్రమాణాలను పెంచడం
 • గ్రామ పంచాయితీల సేవలను మెరుగుపరుచుట
 • పఠనా శక్తిని పెంచడం

స్వయం శక్తి సంఘాలు, క్రీడా మైదానాలు, పౌర సరఫరా, స్మశాన వాటికలకు మౌళిక సదుపాయాలు

లక్ష్యాలు: మౌళిక సదుపాయాలు రూపకల్పన

వ్యూహాలు

 • ప్రజలు భాగస్వామ్య పద్ధతుల ద్వారా గ్రామంలో మౌళిక సదుపాయాల రూపకల్పనకు కృషిచేయుట
 • మౌళిక సదుపాయాల రూపకల్పనకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం

పథకాలు

 • మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
 • బలహీన వర్గాల గ్రాంటు
 • సర్వ శిక్షా అభియాన్

ప్రతిఫలాలు: నాణ్యమైన ప్రజా ఆస్తులను నిర్మిచడం

ఫలితం: స్వయం శక్తి సంఘాలు, పౌర సరఫరా, క్రీడలు, యువజనుల అభివృద్ధి

గ్రామీణ మార్కెట్లు

లక్ష్యాలు: గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్లను అభివృద్ధి చేయుట

వ్యూహం

 • రైతులు, ఉత్పత్తి చేస్తున్న వారిని సంప్రదించి స్థలం, సైజు మరియు కావలిసిన మార్కెట్ సదుపాయాన్ని గుర్తించడం
 • టెండరు విధానం, అంచనా వేయుట మరియు పనితీరును పరిశీలించుటకు సాంకేతిక సహాయాన్ని అందజేయుట

పథకాలు

 • జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్
 • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

ప్రతిఫలం: గ్రామీణ మార్కెట్లను నిర్మిచడం

ఫలితం: వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా ఆర్ధికాభివృద్ధిని సాధించడం

సూక్ష్మ బ్యాంకులు / పోస్ట్ ఆఫీస్ /ఎటి మ్ మరియు UIDAI కార్డులు

లక్ష్యాలు: గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులను అనుసంధానం చేసేలా భరోసా ఇవ్వడం

 

వ్యూహం

 • స్థానికంగా ఉన్న బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసు ఎన్ని ఉన్నాయో వాటిని గూర్చి సర్వే చేయడం
 • బ్యాంకులు లేని ప్రాంతాలలో చిన్న స్థాయి ఎటిం ల ఏర్పాటుకు కృషి చేయుట
 • ఆధార్ కార్డులు నమోదు చేయుటకు ప్రతి ఇంటికీ తిరగడం

పథకాలు: ప్రధాన మంత్రి ధన్ జన్ యోజన

ప్రతిఫలాలు

 • 100% ఆర్ధిక చౌరిక
 • 100% ఆధార్ నమోదు

ఫలితాలు: పోదుపును అభివృద్ధి చేయుట

బ్రాడ్ బ్యాండు టెలికం కనెక్టివిటీ మరియు కామన్ సర్వీసు సెంటర్ లను ఏర్పాటు చేయుట

లక్ష్యాలు: బ్రాడ్ బ్యాండు, టెలికం కనెక్టివిటీ మరియు సాధారణ సేవల కేంద్రం ఏర్పాటు చేయుట

వ్యూహాలు

 • ప్రజలకు అవసరమయ్యే సేవల కేంద్రం ను గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేయుట
 • ఈ- అక్ష్యరాస్యతను పెంచడానికి శిక్షణా తరగతులను నిర్వహించడం

పథకాలు

 • సాధారణ సేవా కేంద్రాలు
 • నేషనల్ ఆప్టికల్ మరియు ఫైబర్ నెట్ వర్క్
 • టెలీకం డిపార్టుమెంట్ పధకాలు

ప్రతిఫలం: 100% ఇంటర్ నెట్ మరియు మొబైల్ కనెక్టివిటీ

ఫలితం: కంప్యూటర్ సేవలను గ్రామీణ ప్రాంతాల వారికి అందించుట

సాంఘీక భద్రత

లక్ష్యాలు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సాంఘీక భద్రత పధకాలు అందుబాటులోనికి వచ్చేలా చూడటం

వ్యూహం

 • ప్రతి ఇంటికీ తిరిగి అర్హులైన వారికి అందరికీ ఫించను అందేలా చూడటం
 • తగు సమయంలో పించను అందేలా చూడటం
 • బ్యాంకు ఎకౌంట్ తెరవటం
 • ఎటిమ్ ల ఫించను తగు సమయంలో అందేలా చూడటం

పథకాలు

 • IGNOSAP
 • IGNWPS
 • IGNDPS
 • మరియు ఇతర రాష్ట్ర సాంఘీక పించను పథకాలు

ప్రతిఫలాలు: అర్హులైన వారికి తగు సమయంలో పించను అందేలా చూడటం

ఫలితం: వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులకు గౌరవప్రదమైన జీవితం అందించడం

భీమా పధకాలు

లక్ష్యాలు: భీమా పథకాలను సార్వత్రికంగా అమలు జరిగేలా చూడటం

వ్యూహం

 • ఇంటింటా సర్వే ద్వారా అర్హులైన లభ్ధిదారులను గుర్తించడం
 • స్వయం శక్తి సంఘాల ద్వారా భీమా అర్జీలను తయారు చేయటం

పథకాలు

 • ఆమ్ ఆద్మీ భీమా యోజన
 • రాష్ట్రీయ ఆరోగ్య భీమా పథకాలు
 • ప్రధాన మంత్రి జన ధన్ యోజన

ప్రతిఫలాలు

 • జాతీయ భీమా పధకాల అమలును మెరుగు పరచడం
 • ప్రధాన మంత్రి జన ధన్ యోజన పథకం అమలు

ఫలితాలు: మెరుగైన సాంఘీక భద్రత ద్వారా ఆరోగ్య మరియు ఆర్ధిక ఇబ్బందులను తొలగించుట

పౌర సరఫరాలు - అర్హులైన వారి అందరికీ పౌర సరఫరా పథకం అందేలా చూడటం

లక్ష్యాలు: ఇంటింటా సర్వే ద్వారా అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డులు అందేలా చూచుట. సరైన సమయంలో ఆహర ధాన్యాలు అర్హులైన కుటుంబాలకు అందించడం ద్వారా జాతీయ ఆహర భద్రతా కార్యక్రం సక్రమంగా అమలు జరిగేలా చూడటం

పథకాలు: జాతీయ ఆహర భద్రతా చట్టం రాష్ట్ర పౌర సరఫరాల పథకం

ప్రతిఫలం: జాతీయ ఆహర భద్రతా చట్టం సక్రమంగా అమలు జరిగేలా చూడటం

ఫలితం: ఆహర భద్రత మరియు పోషకాహర భద్రతను మెరుగుపరచడం

గ్రామ పంచాయితీలను బలోపేతం చేయడం

లక్ష్యాలు:

 • ప్రజా సేవాలు మెరుగు పరచుటకై గ్రామ పంచాయితీని మరియు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం
 • ప్రజ సంస్థలకు సరైన మౌళిక సదుపాయాలు సమకూర్చడం
 • ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరియు స్థానికా సంస్థలలో పనిచేయుచున్న అధికారుల సామర్ధ్యాల పెంపుదల
 • పంచాయితీలలో కమిటీలు చురుకుగా పని చేసేటట్లు చేయుట
 • ప్రజా భాగస్వామ్యం ద్వారా వాటర్ షెడ్ కమీటీలు మరియు గ్రామ ఆరోగ్య మరియు పరిశుభ్రత కమిటీలను ఏర్పాటు చేయుట

పథకాలు:

 • BRGF
 • RGPSA
 • మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

ప్రతిఫలాలు:

 • గ్రామ పంచాయితీ మౌళిక సదుపాయాల మెరుగు
 • కమిటీల పని తీరును మెరుగు పరచడం
 • అధికారుల సామర్ధ్యాల పెంపుదల

ఫలితం: సమగ్రమైన స్థానిక ప్రజాస్వామ్యం

సోషల్ ఆడిట్

లక్ష్యాలు:

 • అర్ధ సంవత్సర సోషల్ ఆడిట్ను అన్ని విషయాల పై గ్రామ సభ ద్వారా చేపట్టటం
 • సోషల్ ఆడిట్ యొక్క వివరములు గ్రామంలో అందరికీ, స్వయం శక్తి సంఘ సభ్యులకు, గ్రామ రిసోర్స్ పర్సన్ లకు, జిల్లారి సోర్స్ పర్సన్ లకు 15 రోజుల ముందుగా తెలియబరచడం
 • వ్యక్తి గత వివరాలు కొరకు 100 శాతం ఇంటింటా సర్వే నిర్వహించడం
 • ఈ సర్వే వ్యక్తి గత వివరము మరియు వ్రాతపూర్వక ఆర్జీలను సమగ్రంగా పరిశీలించడం
 • సోషల్ ఆడిట్ ను నిర్వహించడం ద్వారా సంబంధిత అధికారులకు గ్రామ సభ ఆడిట్ వివరాలను చదివి వినిపించడం

పథకాలు: అన్ని పథకాలు

ప్రతిఫలం: గ్రామ పంచాయితీ పరిధిలో అమలు చేయబడుతున్న అన్ని కార్యక్రమాల సోషల్ ఆడిట్ ను నిర్వహించడం

ఫలితం: ప్రజా మరియు సమాజ నిధులను ఖర్చు చేయటంలో సమగ్ర పారదర్శకతను సాధించడం

ముందస్తు సమాచారం

లక్ష్యాలు:

 • ప్రజా సంస్థలు అమలు చేయు అన్ని పథకాలను గూర్చి ప్రజలకు ముందస్తు సమాచారం అందజేయుట
 • గ్రామ పంచాయితీ పరిధిలో అమలు జరుగుతున్న కార్యక్రమాలలో ఈ క్రింది విషయాలలో సమాచారం సేకరించడం
 • వివిధ విధులను నిర్వహిస్తున్న సిబ్బంది హోదా మరియు వ్యక్తిగత వివరములు
 • వివిధ పధకములకు లబ్ధిదారులుగా ఉండటానికి కావలసిన అర్హతల వివరములు
 • సేవా వివరములు మరియు కట్టు బాట్ల వివరములు
 • గ్రామ పంచాయితీ పరిధిలోని లబ్ధిదారుల వివరములు
 • లబ్ధిదారుల గుర్తింపు మరియు ప్రాధన్యతనివ్వడం లోని కీలక అంశాల వివరములు
 • గ్రామ పంచాయితీ స్థాయిలోని ఆమోదం పొందిన బడ్జెట్ వివరములు
 • ప్రతి ఒక్క లబ్ధిదారునికి మంజురైన బడ్జెట్ వివరములు
 • ప్రతి ఒక్క అంశం క్రింద ఆమోదం పొంది బడ్జెట్ మరియు ఖర్చు వివరములు
 • బ్లాకు మరియు జిల్లా పరిధిలోని వివిధ సంస్థల రికార్డుల వివరాలు
 • ప్రోజెక్టు అమలు చేయుచున్న సంస్థ వివరములు
 • పై విషయాల పైన సమగ్ర సమాచారం సేకరించకి గోడల మీద, నోటీస్ బోర్డులు మరియు బహిరంగ ప్రదేశాలలో వ్రాయడం

పథకాలు: సమాచార హక్కు చట్టం, 2005

ప్రతిఫలం: సమాచార హక్కు చట్టం, 2005 సెక్షన్ క్రింద గ్రామ పంచాయితీ సమ్మతీ లోనికి తీసుకురావడం

ఫలితాలు: ప్రజా ధనం వినియోగం విషయంలో పరిపూర్ణమైన పారదర్శకత

సరైన సమయంలో సమస్యల పరిష్కారం

లక్ష్యాలు: ప్రజల సమస్యల పరిష్కారం

వ్యూహం:

 • రాత పూర్వకంగా సమస్యలను నివేదించిన
 • సభ్యులందరూ తేదీతో కూడిన రశీదుకు అర్హులుగా చేయుట
 • ప్రతిరోజు ప్రజల సమస్యలను స్వీకరించుటకుగాను గ్రామ పంచాయితీ తలుపులు ఎల్లప్పుడూ తెరచి ఉంచడం
 • గ్రామ పంచాయితీ స్వీకరించిన రాతపూర్వక సమస్యలను సంబంధిత సంస్థలకు అందజేయుట
 • గ్రామ పంచాయితీ నుండి స్వీకరించిన రాతపూర్వక సమస్యల వినతులను సంబంధిత సంస్థలు 21 రోజులలోగా పరిష్కరించుట

పథకాలు: అన్ని పథకాలు

ప్రతిఫలం: ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం

ఫలితాలు: గ్రామ పంచాయితీ పరిధిలోని అభివృద్ధి పధకాల అమలులోని సమస్యలను సకాలంలో పరిష్కరించటం

సకాలంలో సేవలను అందించడం

లక్ష్యాలు:

 • సకాలంలో ప్రజలకు అవసరమయ్యే సేవలను అందించడం
 • ఈ - గవర్నెన్స్ - నాణ్యమైన సేవలను అందించుట కొరకు

వ్యూహం:

 • పౌరుల చార్టర్ లోని అంశాలను అందరికీ తెలియజేయుట
 • ప్రభుత్వ మరియు పంచాయితీ సిబ్బంది యొక్క హాజరును గమనించడం
 • గ్రామ పంచాయితీలకు కంప్యూటర్ సదుపాయం కలిగించడం
 • సమస్యల పరిష్కారం మరియు పధకాల మూల్యాకనం కొరకు ఈ - గవర్నెన్స్ దరఖాస్తులను ప్రవేశపెట్టుట

పథకాలు:

 • RGPSA - రాజీవ్ గాంధీ పంచాయిత్ స్వశక్తి కరన్ అభయాన్
 • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
 • ఎమ్ పి లాడ్స్
 • BRGF

ప్రతిఫలాలు:

 • పౌరులకు సకాలంలో ముఖ్యమైన అవసరమైన సేవలు అందించడం
 • ముఖ్యమైన పథకాలు పరివేక్షణ

ఫలితం:

 • సకాలంలో భధ్యతాయుతమైన సేవలను పౌరులకు అందించడం
 • స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం

గ్రామ సభ, మహిళా సభ మరియు బాలల సభను ఏర్పాటు చేయుట

లక్ష్యాలు: క్రమం తప్ప కుండా గ్రామ సభ, మహిళా సభ మరియు బాలల సభను నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకొనుట

వ్యూహం:

 • ప్రజా భాగస్వామ్యం వలన కలిగే ప్రయోజనాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం
 • మహిళకు ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా స్త్రీలు మరియు బాలలకు సంబంధిత విషయాలు చర్చించడం
 • విద్య, వినోదం మరియు సురక్షిత పద్ధతుల పై బాలలకు ప్రత్యేక సభ నిర్వహించడం
 • ప్రజా ప్రతినిధులు (రాజ్యసభ మరియు శాశన సభ సభ్యులు ) గ్రామ సభకు హాజరు అయ్యేలా చూడటం
 • స్వయం శక్తి సంఘం సభ్యులకు ప్రత్యేక మహిళా మరియు బాలల గ్రామ సభ నిర్వహించేలా ప్రోత్సహించడం

పథకాలు: రాష్ట్ర పంచాయితీ రాజ్ చట్టం

ప్రతిఫలాలు: గ్రామంలో వనరుల వినియోగం పై చేసే నిర్ణయాలను ప్రజల అవసరాలు మరియు మనోభావాలకు అనుగుణంగా గ్రామసభలో తీసుకోవడం

ఫలితం: గ్రామ స్థాయిలో ప్రజాస్యామ్యం వికసించేలా చేయుట

ఆధారము: డా. భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇ.ఇ.ఐ, పి.జె.టి.ఎస్.ఎ.యు, హైదరాబాద్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate