# | ప్రశ్న | సమాధానం |
---|---|---|
1 | ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఎలా ఒక "స్టార్టప్"ను గుర్తిస్తారు? | ఒక ఎంటిటీని (ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా రిజిస్టర్డ్ పార్టనర్షిప్ ఫర్మ్ లేదా పరిమిత బాధ్యత భాగస్వామ్యం) "స్టార్టప్"గా కింది విధంగా గుర్తిస్తారు.
ఒక వ్యాపారం చీల్చి లేదా పునర్నిర్మాణం ద్వారా ఏర్పడినది అయి ఉండకూడదు. యజమాని లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్టార్టప్ కు అర్హుత లేదు. ఒక వ్యక్తి కంపెనీ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 'స్టార్టప్' గుర్తింపు పొందుతుంది. అదనపు సమాచారం కోసం, నోటిఫికేషన్ G.S.R. 180 (ఇ) ఫిబ్రవరి 17, 2016 తేదీని చూడండి. |
2 | ఒక స్టార్టప్ జనవరి 16, 2016 న ప్రకిటించిన కార్యాచరణ ప్రణాళిక తో సహా వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలను ఎలా పొందుతుంది? | పలు ప్రయోజనాలను (పన్ను IPR సంబంధించిన ప్రయోజనాలు తప్ప) వినియోగించు కోవడానికి, ఒక ఎంటిటీ స్టార్టప్ గా భారత స్టార్టప్ పోర్టల్/మొబైల్ అనువర్తనం ద్వారా స్టార్టప్ గా గుర్తింపు పొందటం అవసరం అవుతుంది.
పన్ను మరియు IPR సంబంధించిన ప్రయోజనాలను పొందడానికి గాను, ఇంటర్ మినిస్టీరియల్ బోర్డు సర్టిఫికేషన్ నుండి అర్హుత వ్యాపార గుర్తింపును పొందవలసి ఉంటుంది. |
3 | ఎంతకాలం ఒక "స్టార్టప్" గా గుర్తింపు చెల్లుబాటు ఉంటుంది? | ఎంటిటీ స్టార్టప్ గుర్తింపు కింది సమయాలలో ముగుస్తుంది:
|
4 | ప్రస్తుతం నడుస్తున్న సంస్థ స్టార్టప్ భారత పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనంలో "స్టార్టప్" గా నమోదు చేసుకోవచ్చా? | అవును, ప్రశ్న 1కి సమాధానంగా సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లైతే, పలు ప్రయోజనాలు పొందటానికి, స్టార్టప్ భారత పోర్టల్ మరియు మొబైల్ ఆప్ ద్వారా గుర్తింపు పొందవచ్చు. ప్రతిపాదిత పన్ను ప్రయోజనాల ఆర్థిక బిల్లు 2016 క్రింద 01-04-2016 నుండి అందుబాటులో ఉంటుంది. |
5 | ఎంటిటీ ఇప్పటికే ఉంటే "స్టార్టప్" గా గుర్తింపు ధ్రువపత్రం తీసుకోవటానికి ప్రాతిపదిత సమయం ఏమిటి? | అలాంటి సందర్భాలలో నమోదు ప్రక్రియ నిజ సమయంలో ఉంటుంది మరియు గుర్తింపు ధ్రువపత్రం అప్లికేషన్ సమర్పించిన వెంటనే జారీ అవుతుంది. |
6 | ఎంటిటీ ఇంకా నమోదు/కలపవలసి ఉంది. నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా రిజిస్టర్డ్ పార్టనర్షిప్ ఫర్మ్ లేదా పరిమిత బాధ్యత భాగస్వామ్యంగా చేరడానికి స్టార్టప్ భారత పోర్టల్ మరియు మొబైల్ ఉపయోగించవచ్చా? | అలాంటి సందర్భాలలో అందుబాటులో రెండు ఆప్షనులు ఉన్నాయి.
|
7 | "స్టార్టప్" గా నమోదు దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరమవుతాయి? | కింది పత్రాలలో ఒకటి స్టార్టప్ భారత్ పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనంలో స్టార్టప్ నమోదు దరఖాస్తుతో పాటు అప్ లోడు చేయవలసి ఉంటుంది:
దీనికోసం ఇంక్యుబేటర్లలో జాబితా (1), (2) మరియు (3)లు స్టార్టప్ భారత్ పోర్టల్ లో ప్రచురించబడుతున్నాయి. సెబి నమోదు నిధులు జాబితా (4) కూడా స్టార్టప్ భారత్ పోర్టల్ లో అందుబాటులో ఉంది. |
8 | నేను స్టార్టప్ నమోదు ప్రక్రియ పూర్తి అయిన అప్లికేషన్ ప్రింటు కాపీని సమర్పించాలా? | లేదు. ఆన్ లైను అప్లికేషను మాత్రమే సమర్పించాలి. |
9 | నా నమోదు విజయవంతమైన తర్వాత, నేను సర్టిఫికెట్ పొందడానికి ఉంటుందా? అవును అయితే, నేను ప్రమాణ పత్రాన్ని డౌన్లోడ్ అనుకోవచ్చా? | అవును. విజయవంతమైన నమోదును సిస్టం తయారు చేసిన గుర్తింపు పరిశీలనా సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
10 | ఒక ఇంక్యుబేటర్ ఒక అప్లికేషన్ తిరస్కరించి ఉంటే, అదే ఇంక్యుబేటర్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా లేదా వేరే ఇంక్యుబేటర్ వద్ద దరఖాస్తు చేయాల్సి ఉంటుందా? | అవును. అటువంటప్పుడు, ఎంటిటీ అప్లికేషన్ తిరస్కరించిన ఇంక్యుబేటరుకు లేదా ఏదైనా ఇతర ఇంక్యుబేటరుకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. |
11 | నమోదు ప్రక్రియ సమయంలో "మీరు పన్ను మరియు IPR ప్రయోజనాలు పొందాలను కుంటున్నారా?' ను "లేదు" అని ఎంచకొని దానిని తర్వాత సమయంలో "అవును"కు మార్చుకోవచ్చా? | అవును. ఎంపిక తరువాత దశలో కూడా ఉంటుంది. వినియోగదారు ప్రయోజనాలు పొందాలనుకుంటే ఒకసారి, అతని/ఆమె అప్లికేషన్ ఇంటర్ మినిస్టీరియల్ బోర్డు ద్వారా పరీక్షించబడుతుంది. బోర్డు ద్వారా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ప్రయోజనాలను వాడుకోవచ్చు. |
12 | ఒక ఎంటిటీకి పాన్ లేదు. "స్టార్టప్" నమోదుకు అనుమతి ఉంటుందా? | అవును. పాన్ లేనప్పుడ కూడా స్టార్టప్ నమోదు చేయవచ్చు. అయితే, రిజిస్ట్రేషన్ సమయంలో అందచేస్తే మంచిది. ప్రతి ఎంటిటి పన్ను పరిధిలోకి వస్తుంది. |
13 | నేను నమోదు రూపంలో రెండు మొబైల్ సంఖ్యలు అందిచవచ్చా? | ఒక మొబైల్ నెంబరును మాత్రమే నమోదు సమయంలో అందచేసిన ఉంటుంది. పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనం ప్రమాణీకరణ మరియు నమోదు ప్రక్రియ పూర్తి అవడానికి మీరు ఇచ్చిన మొబైల్ సంఖ్య పై ఒక OTPని పంపడం జరుగుతుంది. |
14 | సిఫార్సు లేఖ తీసుకోవటానికి ఏదైనా పేర్కొన్న ఫార్మాట్ ఉందా? | అవును. సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ ఉత్తరాలు సూచించబడే ఫార్మాట్లలో స్టార్టప్ భారత్ పోర్టల్ లో ప్రచురించబడుతున్నాయి. |
15 | ఎంటిటీ ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది మరియు అది ప్రచురితం అయ్యింది. అలాంటప్పుడు ఏ డాక్యుమెంటు "స్టార్టప్" గా నమోదు సహాయక పత్రంగా ఇవ్వవచ్చు? | అటువంటప్పుడు, ప్రచురించిన పేటెంటు చెల్లుబాటు కాపీని సహాయక పత్రంగా ఇవ్వవచ్చు. |
16 | అంతర్గత మంత్రుల బోర్డు యొక్క రాజ్యాంగంగా ఏది ఉంటుంది? | సర్టిఫికేషన్ అంతర్ మంత్రివర్గ బోర్డు కిందివారిని కలిగి ఉంటుంది:
|
17 | పన్ను/IPR ప్రయోజనాల కోసం ఇచ్చిన అప్లికేషన్లను అంతర్గత మంత్రుల బోర్డు ఎలా సమీక్ష చేస్తుంది? | పన్ను/IPR ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన వ్యాపారాలను నిర్ధారించేందుకు బోర్డు అందించిన మద్దతు పత్రం (లు)ను సమీక్ష చేస్తుంది. |
18 | ఇప్పటికే ఉన్నఎంటిటీలో పన్ను/IPR ప్రయోజనాలు పొందేందుకు ఇంటర్ -మినిస్టీరియల్ బోర్డు సర్టిఫికేషన్ పొందడానికి సమయం ఏమిటి? | మంత్రివర్గ బోర్డ్ నుండి సర్టిఫికెటు కోసం ఒక అప్లికేషన్ 10-25 పని రోజుల వ్యవధిలో ప్రాసెస్ జరుగుతుంది |
19 | ఇంక్యుబేటర్ సర్టిఫికెట్, రిజిస్టర్డ్ VCS నిధులు, లేదా పేటెంట్లు ఇంకా అప్లైచేయని ఎంటిటీలు కూడా పన్ను మినహాయింపులకు ఇంటర్ మినిస్టీరియల్ బోర్డుకు అప్లై చేసుకోవచ్చా? | లేదు. (6) నిర్ణయించిన సహాయ సామగ్రి లో ఒకటి (1) ఇంటర్ మినిస్టీరియల్ బోర్డు అప్లికేషన్ చేయడానికి తప్పనిసరి. |
# | ప్రశ్న | సమాధానం |
---|---|---|
1 | ఏ ఇంక్యుబేటర్లకు సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ అందించే అధికారం ఉంది? | నం. G.S.R 180 (ఇ) ఫిబ్రవరి 17, 2016 తేదీ నోటిఫికేషన్ ప్రకారం, ఒక ఇంక్యుబేటర్ సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంటు లేఖ ఒక ఎంటిటీకీ అందించడానికి అధికారం కింది విభాగాల్లో ఏదో ఒకదాని పరిధిలోకి వస్తుంది:
|
2 | మా ఇంక్యుబేటర్ స్టార్టప్ భారత్ పోర్టల్ లో ప్రచురించిన ఇంక్యుబేటర్లలో జాబితా (లు) లో లేదు. ఎలా మేము దానిని జాబితా (లు) లో పొందుపరచవచ్చు? | అటువంటప్పుడు, మీరు స్టార్టప్ భారత్ పోర్టల్ లోఒక అప్లికేషన్ ఇవ్వవచ్చు. ఒకసారి ఇంక్యుబేటర్ అప్లికేషన్ అర్హత పొందితే, ఇంక్యుబేటర్ పేరు డిఐపిపి ద్వారా జాబితాలో చేర్చబడుతుంది. |
3 | ఒక సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ జారీ ముందు సమీక్షించాల్సిన అంశాలు ఏమిటి? | ఇంక్యుబేటర్ ఒక ఆవిష్కరణ, అభివృద్ధి, విస్తరణ లేదా సాంకేతిక లేదా అభివృద్ధి మరియు వ్యాపారాత్మక లక్ష్యంతో మేధో సంపత్తిని ఉపయోగించి కొత్త ఉత్పత్తులు, ప్రక్రియల లేదా సేవల వ్యాపారీకరణ దిశగా పని చేస్తున్నాయని ధ్రువీకరించబడాలి:
క్రింది కార్యకలాపాలు సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ జారీ కోసం చెల్లుబాటుకు పరిగణించబడవు:
|
4 | ఇంక్యుబేటర్ సిఫార్సు అందించడానికి ఏదైనా నిర్దిష్ట ఫార్మాట్ ఉందా? | అవును. సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లెటరు ఫార్మాటు స్టార్టప్ భారత్ పోర్టల్ లో ప్రచురించబడుతుంది. |
5 | సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ అందించడానికి ఏదైనా సూచించిన ఫీజు (లు) ను స్టార్టప్ నుండి వసూలు చేస్తారా? | ప్రభుత్వం ఎలాంటి రుసుము సూచించలేదు. అయితే, ఇంక్యుబేటర్లు ప్రక్రియ ప్రయత్నాలుకు రుసుము వసూలును పరిగణలోకి తీసుకోవచ్చు. |
6 | మేము మా ఇంక్యుబేటర్ వద్ద చేయలేని ఒక ఆలోచను సిఫార్సు చేయవచ్చా/ బలపరచవచ్చా | అవును. ఒక ఇంక్యుబేటర్ స్టార్టప్ భారత్ పోర్టల్ జాబితాలో ఉన్న ఆలోచన/స్టార్టప్ సిఫార్సు బలపరచవచ్చు. స్టార్టప్ సరైన వ్యాపారం చేయగలగాలి. |
7 | మేము ఎవరినైనా సిఫార్సు/ఎండార్స్మెంట్ లేఖ కేటాయించడానికి పేరు ఇవ్వాలా? | సంతకం/సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ ఉత్తరాలు కోసం ఇంక్యుబేటర్ ఒక ఆఫీసరును కేటాయించాలి. దానిని DIPPకి తెలియ చేయాలి. |
8 | మా ఇంక్యుబేటర్ వద్ద లేని ఇంక్యుబేటర్ అప్లికేషన్లు తీసుకోవడానికి అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి? | దరఖాస్తు స్వీకరించటానికి ఎటువంటి విధానం లేదు. ఇంక్యుబేటర్ ఒక సిఫార్సు చేసే ముందు ప్రక్రియ మరియు వ్యాపార వినూత్న స్వభావం తెలుసు కుంటుందని భావిస్తున్నారు. |
9 | సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ లను స్టార్టప్ భారత్ పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనంలో ఎవరు అప్లోడ్ చేస్తారు? | సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖలను గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొనే సమయంలో సంబంధిత పత్రాలు అప్లోడ్ చేస్తారు. |
10 | ఒక రికమెండర్/ఇంక్యుబేటరుకు ఏదైనా బాధ్యత ఉంటుందా? | సరైన పరీక్ష లేకుండా లేదా స్వయంగా సంతృప్తి పడకుండా ఒక సిఫార్సు చేస్తే భవిష్యత్తులో సిఫార్సు ఇవ్వడం లేదా ప్రభుత్వం నుండి ప్రయోజనాలను పొందటం నుండి బహిష్కరిస్తారు. అయితే, ఏదైనా అటువంటి చర్య తీసుకునేముందు, ఒక అవకాశం ఇంక్యుబేటరుకు ఇవ్వబడుతుంది. |
# | ప్రశ్న | సమాధానం |
---|---|---|
1 | "ఫండింగ్ బాడీస్" విభాగంలోకి ఏ సంస్థలు మరియు బాడీలు వస్తాయి? | నోటిఫికేషన్ నం. GSR 180 (E) ఫిబ్రవరి 17, 2016, ప్రకారం ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వెంచర్ కాపిటల్ నిధులు, ఏంజెల్ ఫండ్ మరియు సెబీతో రిజిస్టరైన సీడ్ ఫండ్స్ సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ అందించడానికి అర్హత కలిగి ఉంటాయి. వాటిలో 20 శాతం కంటే ఎక్కువ ఈక్విటీ తీసుకోబడుతుంది. సెబి నిధులు (VCFs మరియు AIFs)ల జాబితాను స్టార్టప్ భారత్ పోర్టల్ లో ప్రచురించబడింది. |
2 | ఒక ఫండింగు బాడీ సిఫార్సు చేయడానికి ఏదైనా నిర్దిష్ట ఫార్మాట్ ఉందా? | అవును. సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ ఉత్తరాన్ని సూచించే ఫార్మాట్లు స్టార్టప్ భారత్ పోర్టల్ లో ప్రచురించబడుతున్నాయి |
3 | ఒక సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ జారీ ముందు సమీక్షించాల్సిన అంశాలు ఏమిటి? | ఒక నిధుల సంస్థ తన సమీక్షలో ఒక స్టార్టప్ ఆవిష్కరణ, అభివృద్ధి, విస్తరణ లేదా సాంకేతిక లేదా అభివృద్ధి మరియు వ్యాపారాత్మక లక్ష్యంతో మేధో సంపత్తితో నడుపబడుతోంది అని మరియు కొత్త ఉత్పత్తులు, ప్రక్రియల లేదా సేవల వ్యాపారీకరణ దిశగా పని చేస్తుందిని తన పరిధిలో ధ్రువీకరించవలసి ఉంటుంది:
క్రింది కార్యకలాపాలు సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ జారీ కోసం చెల్లుబాటుకు పరిగణించబడవు:
|
4 | మేము మా ఫండింగు బాడీ ద్వారా నిధులు ఇవ్వని ఒక ఆలోచనను సిఫార్సు /బలపరచ వచ్చా? | లేదు. కేవలం 20 శాతం కంటే ఎక్కువ ఈక్విటీ ఫండ్ చేసే ఆలోచనలు/స్టార్టప్ సిఫార్సు చేయవచ్చు |
5 | మేము మా సిబ్బంది నుంచి ఒకరిని రికమెండరుగా ఉంచాలా లేక ఎవరైనా మా స్టాఫ్ నుంచి రికమెండరుగా ఉండవచ్చా? | ఒక నిధుల సంస్థ సైన్/సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంటుల కొరకు నిర్దిష్టంగా అధికారి (లు)ను ప్రోత్సహించాలి. మరియు దానిని డిఐపిపి కి తెలియచేయాని. |
6 | సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంటులను స్టార్టప్ భారత్ పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనంలో ఎవరు అప్లోడ్ చేస్తారు? | సిఫార్సు/మద్దతు/ఎండార్స్మెంట్ లేఖ గుర్తింపు కోసం దరఖాస్తు అందుకునే సమయంలో సంబంధిత పత్రాలు అప్లోడ్ చేస్తారు. |
7 | ఒక రికమండెరుకు ఏ బాధ్యత ఉంది? | సరైన పరీక్ష లేకుండా లేదా స్వయంగా సంతృప్తి పడకుండా ఒక సిఫార్సు చేస్తే భవిష్యత్తులో సిఫార్సు ఇవ్వడం లేదా ప్రభుత్వం నుండి ప్రయోజనాలను పొందటం నుండి బహిష్కరిస్తారు. ఒక సిఫార్సు స్టార్టప్ నిధుల ఈక్విటీ ( 20 శాతం ఈక్విటీ కంటే తక్కువ) ఉన్నప్పుడు ఇస్తే, డిఐపిపి తప్పుడు సమాచారం అందించినందుకు ఫండ్ యొక్క ప్రధాన అధికారులకు వ్యతిరేకంగా నేరారోపణలను ఆరంభం చేయవచ్చు. |
మూలం: Startup India
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/10/2020