తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణా ప్రభుత్వం “షి టీమ్స్” పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ పోలీసులు అక్టోబరు 24 న “షి టీమ్స్” ను ప్రారంభించారు. నగరంలో ఈవ్ టీసింగ్ ను నియంత్రించడానికి మొత్తం 100 బృందాలను ఏర్పాటు చేసారు. ఈ “షి టీమ్స్”అంతా మహిళా పోలీసులే ఉండటం గమనార్హం. నగరంలోని మహిళలను ఈవ్ టీసింగ్ నుండి రక్షించడానికి, మరియు మహిళలకు ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి “షి టీమ్స్”ను ప్రారంభించారు.
మహిళా భద్రతే ముఖ్య లక్ష్యంగా, హైదరాబాద్ సిటీ అదనపు పోలీసు కమీషనర్(crime & C.I.T.) “స్వాతిలక్రా” పర్యవేక్షణలో ఈ “షి టీమ్స్” పని చేస్తాయి. ప్రతి బృందంలో ఐదుగురు మహిళా పోలీసు సిబ్బంది ఉంటారు. నేరస్తుల కదలికలను రికార్డు చేయటానికి వీరికి చిన్న కెమెరాలను అందించారు.
బస్ స్టాపులు, సినిమా హాళ్ళు, పార్కుల వంటి పబ్లిక్ ప్రాంతాలలో ఈవ్ టీసింగ్ చేసే వారిని, అనుమానితులను గుర్తించి వారిని CCS (సెంట్రల్ క్రైం స్టేషన్) కు తీసుకువెళ్తారు. వీరికి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యున్నత స్థాయి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది.
నిందితులకు సంబంధించిన వివరాలు సెంట్రల్ డేటాబేస్ లో గోప్యంగా ఉంచి వారి రోజువారీ కార్యకలాపాల మీద నిఘా ఉంచుతారు. మళ్ళీ మళ్ళీ అతని మీద ఫిర్యాదులు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు.
బాధితుల పేరు మరియు ఇతర వివరాలు రహస్యంగా ఉంచుతారు. “షి టీమ్స్” ద్వారా అరెస్టైనవారి గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో యాంటీ ర్యాగింగ్ చట్టం మరియు తమిళనాడులో ఈవ్ టీసింగ్ నిషేధ చట్టం వంటివి తెలంగాణాలో ఏర్పాటు చేయాలని “షి టీమ్స్” తెలంగాణా ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీసువారిచే ఏర్పాటు చేయబడిన “షి టీమ్స్”కు భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
హైదరాబాద్ “షి టీమ్స్” ఫోను నంబరు: 100.
హైదరాబాద్ “షి టీమ్స్” ఫేస్ బుక్ అక్కౌంట్: https://www.facebook.com/SheTeamOnline
హైదరాబాద్ “షి టీమ్స్” మొబైల్ అప్లికేషన్: HAWK EYE Hyderabad
అదనపు పోలీస్ కమీషనర్ కార్యాలయం (క్రైం & ఇన్వెస్టిగేషన్),
ట్రాఫిక్ కంట్రోల్ రూం 3వ అంతస్థు,
లక్దీకాపూల్,
హైదరాబాద్-01.
ఆధారము: విషయ రచన భాగస్వామ్యులు - సౌమ్య ఏనేపల్లి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020