অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం

ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం

  1. ఋతుస్రావం
    1. ఋతుచక్రం
    2. ఋతుచక్రం - దశలు
    3. ఫాలిక్యులర్ దశ :
    4. ఓవ్యులేటరీ దశ
    5. ల్యుటియల్ ఫేజ్
  2. ఋతు సంబంధ రుగ్మతలు
    1. డిస్మెనోరియ (ఋతు శూల)
    2. ఎమెనోరియ (బహిష్టు రాకపోవడం)
    3. మెనోర్రాజియా (అధిక ఋతుస్రావం)
    4. ఎండోమెట్రియల్ కాన్సర్
    5. ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో గడ్డలు)
    6. పెల్విక్ ఇన్ఫ్లమ్మేటరీ డిసీజ్ (కటివలయ వాపు వ్యాధి)
    7. ప్రీమెనుస్ట్రల్ సిండ్రోమ్ ( ఋతు సమయం ముందు కనిపించే లక్షణాలు)
    8. ఋతు సంబంధ వ్యాధుల శీఘ్ర నిర్ధారణ
    9. ఋతు సంబంధ వ్యాధులను ఎలా నివారించాలి
  3. గర్భ స్రావము
    1. గర్భస్రావం లేక ఆకస్మిక లేక అనన్య ప్రేరేపిత గర్భస్రావం
    2. గర్భస్రావానికి గల కారణాలు ఏవి ?
    3. గర్భస్రావం యొక్క సంకేతాలు
    4. న్యాయ చట్టము
    5. గర్భస్రావానికి ముందు తీసుకోలసిన జాగ్రత్తలు
    6. గర్భాశయ బహిర్గ ద్వారము యొక్క కణ శాస్త్రము
    7. గర్భస్రావం చేసే పద్ధతులు మరియు సమాచారం
    8. గర్భస్రావం చేయునప్పుడు, తదనంతరం ఉత్పన్నమయ్యే చిక్కులను అదుపులో వుంచడం మరియు సవరించడం.
    9. దీర్ఘకాలిక సమస్యలు లేక పరిణామాలు
    10. గర్భస్రావం చేసే విధానంలో రకాలు మరియు వాటిని నిర్వహించ గలిగే ప్రదేశాలు
  4. స్త్రీ ఆరోగ్య సమస్యలు – వధ్యత్వము / సంతాన ప్రాప్తి లేకుండుట.
    1. 1. వంధ్యత్వము అనగా నేమి ?
    2. 2. వంధ్యత్వము కలుగడానికి కారణాలు ఏవి ?
    3. 3. విట్రో ఫలధీకరణం లేదా టెస్ట్ ట్యుబ్ ద్వారా పిల్లలు పుట్టడం అంటే ఎమిటి ?
  5. కుటుంబ నియంత్రణ పద్ధతులు
    1. కుటుంబ నియంత్రణ పద్ధతులు
  6. సంక్రమణ వ్యాధులు
    1. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది
    2. హెచ్.ఐ.వి./ఎయిడ్స్ ఎలా వ్యాపించదు
    3. ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్.ఐ.వి. ఏ విధంగా సంక్రమించదు
    4. హెచ్.ఐ.వి. /ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ...
    5. సుఖవ్యాధులను గుర్తించడం ఎలా...
    6. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకితే ఏమవుతుంది ?
    7. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వారు ఏం చెయ్యాలి ?
    8. ప్రపంచ ఎయిడ్స్‌ దినం
    9. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌.. ఆధునిక ఉపద్రవం!
    10. అరక్షిత లైంగిక సంబంధాలు
    11. తల్లిదండ్రుల నుంచి బిడ్డకు
    12. కలుషిత సూదులు, సిరంజీలు
    13. రక్త మార్పిడి
    14. హెచ్‌ఐవీ నుంచి ఎయిడ్స్‌కు!
    15. ఎయిడ్స్‌ దశలో
    16. ఇలా వ్యాపించదు!
    17. సంక్రమించేదెలా?
    18. సుఖరోగము, లైంగిక వ్యభిచార రోగము – సిఫిలిస్
    19. క్లమీడియా
    20. గొనోరియా (సెగవ్యాధి)
    21. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు వచ్చే సూక్ష్మ క్రిమి సంపర్కం
    22. గర్భిణి లో సుఖరోగాలు గర్భిణి లో లైంగిక వ్యాధులు
    23. సర్పి, విపర్పిణి
  7. గర్భ నిరోధానికి సురక్షితమైన కాపర్టీ

ఋతుస్రావం

గర్భాశయం లోపలి పొర కరిగి కారి పోవడమే ఋతుస్రావం. ఇది పునరోత్పాదక దశలో ఉన్న స్త్రీలలో, ఒక్క గర్భధారణ సమయం లో తప్పనించి, ఇంచు మించు నెల నెలా జరుగుతుంది. యుక్త వయస్సు వచ్చాక రజస్వల అయినప్పటి నుండీ ఋతుస్రావం మొదలై మెనోపాజ్ (ఋతు నివృత్తి) దశ లో పూర్తిగా ఆగిపోతుంది.

ఋతుచక్రం

ఋతుస్రావం మొదలైన రోజు నుండీ ఋతు చక్రం మొదలౌతుంది. ఇది ఒకటవ రోజుగా లెక్కిస్తారు. ఇది తదుపరి బహిష్టు కాలం మొదలయ్యే ముందు ముగుస్తుంది. సాధారణంగా ఋతు చక్రం 25 నుండి 36 రోజులు ఉంటుంది. ఒక్క 10-15 శాతం స్త్రీలలో మాత్రమే ఋతు చక్రం సరిగ్గా 28 రోజులు ఉంటుంది. మామూలుగా రజస్వల అయిన వెంటనే మరియు మెనోపాజ్ ముందు ఈ చక్రం లో తేడాలు అధికంగా ఉండి బహిష్టుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటుంది.

ఋతుస్రావం 3 నుండి 7 రోజుల వరకూ ఉంటుంది. అంటే సగటున 5 రోజులు ఉంటుంది. ఒక్కొక్క బహిష్టులో ½ నుండి 2 ½ ఔన్సుల రక్తం పోతుంది. రకాన్ని బట్టి ఒక్కొక్క సానిటరీ నాప్ కిన్ లేదా టాంపూన్ ఒక ఔన్స్ వరకూ రక్తాన్ని పీల్చుకో గలదు. దెబ్బ తగిలినప్పుడు వచ్చే రక్తం లాగ ఈ రక్తం సాధారణంగా గడ్డకట్టుకోదు (రక్త స్రావం అధికంగా ఉన్నప్పుడు తప్పనిచ్చి).

ఋతుచక్రాన్ని హార్మోన్లు నియంత్రిస్తూ ఉంటాయి. పిట్యూటరీ గ్రంధి (పీయుష గ్రంధి) ఉత్పన్నం చేసే ల్యుటినైజినంగ్ హార్మోన్ మరియు ఫాలికిల్ స్టిములేటింగ్ హార్మోన్ ఓవ్యులేషన్ (అండోత్సర్గం) ను వృధ్ధి చేసి, ఒవరీలు (అండకోశాలు) ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టరోన్ ఉత్పత్తి చేసేలాగ ప్రేరేపిస్తాయి. ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టరోన్ యుటెరస్ (గర్భాశయం లేక గర్భ సంచి) నీ, వక్షోజాలనూ జరగబోయే ఫెర్టిలైజేషన్ (ఫలదీకరణ) కి సిధ్ధం చేస్తాయి.

ఋతుచక్రం - దశలు

ఋతుచక్రంలో మూడు దశలు ఉంటాయి:

  1. ఫాలికులర్ (అండం విడుదల ముందు)
  2. ఓవ్యులేటరీ (అండం విడుదల)
  3. ల్యుటియల్ (అండం విడుదల తరువాత)
ఫాలిక్యులర్ దశ :

ఈ దశ బహిష్టు మొదటి రోజుతో మొదలౌతుంది. కానీ ఈ దశలో ముఖ్యమైన ఘట్టం ఒవరీలలో (అండాశయాలలో) ఫాలికల్స్ ఏర్పడడం..
ఫాలిక్యులర్ దశ మొదట్లో గర్భాశయపు లోపలి పొర (ఎండోమెట్రియం) మందం గా ఉండి పిండాన్ని పోషించడానికి అవసరమయ్యే పోషకాలనూ, ద్రవాలనూ కలిగి ఉంటుంది. అండం ఫలదీకరణ చెందకపోతే ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టరోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎండోమెట్రియం పై పొరలు కరిగి పోయి రక్త స్రావం జరుగుతుంది. ఈ సమయంలోనే పిట్యూటరీ గ్రంధి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ స్థాయిని కొద్దిగా పెంచుతుంది. అప్పుడు ఈ హార్మోన్ 3 నుంచి 30 దాకా ఫాలికల్స్ ఏర్పడేలా చేస్తుంది. ఒక్కొక్క ఫాలికల్ లో ఒక్కొక్క అండం ఉంటుంది. ఈ దశ చివరలో ఈ హార్మోన్ స్థాయి తగ్గిపోయి, ఉన్న ఫాలికల్స్ లో ఒక్క ఫాలికల్ (డామినేటింగ్ ఫాలికల్ – ప్రబలమైనది) మాత్రం పెరిగి ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చెయ్యడం మొదలు పెడ్తుంది. క్రమంగా తక్కిన ప్రేరేపిత ఫాలికల్స్ విఛ్ఛిన్న మవడం మొదలు పెడ్తాయి.

ఈ ఫాలిక్యులార్ దశ సగటున 13 లేక 14 రోజులు ఉంటుంది. ఈ మూడు దశలలో, నిడివి పరంగా అధికంగా మార్పులకు గురయ్యేది ఈ దశే. మెనోపాజ్ దశలో ఈ దశ యొక్క కాలం కుంచించుకుపోతుంది. ల్యుటినైజింగ్ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ పూర్తవుతుంది. ఈ ఆకస్మిక పెరుగుదల అండం విడుదలయ్యే లా చేస్తుంది. (ఓవ్యులేషన్ – అండోత్సర్గం)

ఓవ్యులేటరీ దశ

ల్యుటినైజింగ్ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ మొదలౌతుంది. ల్యుటినైజింగ్ హార్మోన్, డామినెంట్ (ప్రబలమైన) ఫాలికల్ అండకోశం ఉపరితలం నుంచి వుబికి వచ్చి, పగిలి, అండం విడుదల చేసేలాగ ప్రేరేపిస్తుంది. ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ స్థాయి కొద్దిగా మాత్రమే పెరుగుతుంది. ఈ పెరుగుదల వల్ల వుపయోగమేమిటొ ఇంకా తెలియ లేదు.
ఈ ఓవ్యులేటరీ దశ సాధారణంగా 16 నుండి 32 గంటల వరకూ ఉంటుంది. అండం విడుదలతో ఈ దశ పూర్తవుతుంది.

అండం విడుదలైన 12 నుంచి 24 దంటల తరువాత, ల్యుటినైజింగ్ హార్మోన్ యొక్క ఆకస్మిక పెరుగుదల ను మూత్ర పరీక్ష ద్వారా కనిపెట్టవచ్చు. దీని ద్వారా స్త్రీలలో గర్భధారణకు అనుకూలంగా ఉండే సమయాన్ని గుర్తించ వచ్చు. అండం విడుదలైన 12 గంటల వరకూ మాత్రమే ఫలదీకరణ చెంద బడుతుంది. అండం విడుదలవడానికి ముందే పునరుత్పత్తి నాళిక లో వీర్యం ఉన్నట్లైతే ఫలదీకరణ జరిగే అవకాశం ఎక్కువ.
ఓవ్యులేషన్ (అండోత్సర్గం) జరిగే సమయంలో కొంత మంది మహిళలకు పొత్తి కడుపులో ఒక పక్కన నొప్పిగా ఉంటుంది. దీనిని మిడిల్ పెయిన్ అంటారు. ఇది కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల పాటు ఉంటుంది. ఈ నొప్పి అండాశయం ఎటు వైపు అండాన్ని విడుదల చేసిందో అటువైపునే వస్తుంది. కానీ దీనికి కారణమేమిటో ఖచ్చితంగా తెలియదు. ఈ నొప్పి ఫాలికల్ పగిలే ముందు కానీ తరువాత కానీ ఉంటుంది. కానీ ఇది ప్రతి సారీ ఉండక పోవచ్చు. అండం విడుదల ఒకసారి ఒక ఓవరీ నుండి తరువాత సారి రెండో ఓవరీ నుండీ కాక ఎదో ఒక వైపు విడుదలౌతుంది. ఒక ఓవరీ కనుక తీసివేస్తే రెండో ఓవరీ నెల కొక అండాన్ని విడుదల చేస్తుంది.

ల్యుటియల్ ఫేజ్

ఈ దశ ఓవ్యులేషన్ (అండోత్సర్గం) తరువాత మొదలౌతుంది. ఇది 14 రోజుల వరకూ ఉండి (ఫలదీకరణ జరుగక పోతే) బహిష్టు ముందు పూర్తవుతుంది. ఈ దశలో, అండం విడుదల చేశాక ఫాలికల్ మూసుకొని పోయి కార్పస్ ల్యుటియం అనే ఆకారం గా మారుతుంది. ఒక వేళ ఫలదీకరణ జరిగితే అందుకు అనుగుణంగా ఇది గర్భాశయాన్ని సిధ్ధం చేస్తుంది. ఈ కార్పస్ ల్యుటియం ఎక్కువ మోతాదులో ప్రోజెస్టరోన్ ను ఉత్పన్నం చేసి రాబోయే పిండం కోసం గర్భాశయపు లోపలి పొరను (ఎండోమెట్రియం) ద్రవాలతోనూ, పోషకాలతోనూ నింపి దళసరిగా తయారు చేస్తుంది. ఈ ప్రోజెస్టరోన్, గర్భాశయం లోనికి వీర్యం కానీ, బాక్టీరియా కానీ ప్రవేశించ కుండా సెర్విక్స్ (గర్భాశయ ద్వారం) లోని మ్యూకస్ (బంక లాంటి పదార్ధం) గట్టి పడేటట్లు చేస్తుంది. ఈ ల్యుటియల్ దశలో ప్రోజెస్టరోన్ శరీర ఉష్ణోగ్రత ను కొద్దిగా పెంచి బహిష్టు మొదలయ్యే వరకూ అలాగే ఉంచుతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రత కూడా ఓవ్యులషన్ (అండోత్సర్గం) జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ల్యుటియల్ దశలో చాలా వరకూ ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ కూడా ఎండోమెట్రియం ను మందంగా చేస్తుంది.

పెరిగిన ఈస్ట్రోజన్ మరియు ప్రోజెస్టరోన్ స్థాయిలు వక్షోజాలలోని క్షీర వాహికలను (మిల్క్ డక్ట్స) వ్యాకోపింప చేస్తాయి. ఫలితంగా స్తనాలు ఉబ్బి నొప్పిగా అని పిస్తాయి.
అండం ఫలదీకరణ చెందక పోతే 14 రోజుల తరువాత కార్పస్ ల్యుటియం శిధిల మై పోయి మళ్ళీ కొత్త ఋతు చక్రం మొదలౌతుంది. ఒక వేళ అండం కనుక ఫలదీకరణ చెందితే పెరుగుతున్న అండం చుట్టూ ఉన్న కణాలు వృధ్ధి చెంది హ్యూమన్ కోరియన్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చెయ్యడం మొదలు పెడ్తాయి. ఈ

హార్మోన్ కార్పస్ ల్యుటియం ను కాపాడుతూ ఉంటే, కార్పస్ ల్యుటియం పిండం తన హార్మోన్లు తాను తయారు చేసుకొనే వరకూ ప్రోజెస్టరోన్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఈ హ్యూమన్ కోరియన్ గొనాడోట్రోపిన్ పెరుగుదలను గుర్తించడం మీదే గర్భధారణ పరీక్షలు ఆధార పడి ఉన్నాయి.

ఋతు సంబంధ రుగ్మతలు

స్త్రీలలో ఎన్నో రకాల ఋతు సంబంధ వ్యాధులుంటాయి. కొన్ని కొద్ది కాలం ఉండే చిన్నా చితకా సమస్యలైతే, కొన్ని రకాలు దీర్ఘకాలం బాధిస్తాయి. మరికొన్ని ప్రమాదకరమైనవి కూడా. వివిధ రకాల రుతు సంబంధ వ్యాధులను గుర్తించడానికి ఈ వ్యాధుల గురించి ఇచ్చిన వివరణ ఉపయోగపడుతుంది.

డిస్మెనోరియ (ఋతు శూల)

ఋతు సమయంలో ఉండేనొప్పిని ఋతు శూల అంటారు. ఇది రెండు రకాలు – ప్రైమరీ డిస్మెనోరియ, రెండవది సెకండరీ డిస్మెనోరియా. సాధారణంగా బహిష్టు సమయంలో వచ్చేది ప్రైమరీ డిస్మెనోరియా. ఇది స్త్రీలలో తరచుగా కనిపించే సమస్య.
పొత్తికడుపులో ఎలాంటి సమస్యాలేకుండా, బహిష్టు వచ్చేముందు పొత్తికడుపులో వచ్చేనొప్పిని ప్రైమిరీ డిస్మెనోరియాగా వ్యవహరిస్తారు. సెకండరీ దిస్మెనొరియా అంటే పొత్తికడుపులో ఎండోమెట్రియాసిస్ వంటి వ్యాధి కారణంగా వచ్చే బహిష్టు నొప్పి.

ప్రైమరీ డిస్మెనోరియ దాదాపు 90% మంది స్త్రీలలో కనిపిస్తూ వుంటుంది. ఈ నొప్పితీవ్రంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి: చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం. ఎక్కువరోజులు బహిష్టు కావడం, పొగత్రాగడం, ఊబకాయం మరియు మద్యం సేవించడం. బహిష్టు నొప్పి అధికంగా ఉండడానికి బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు కూడా ఒక కారణం. పని పాటలకూ నొప్పికీ అంత సంబంధంలేదు. చాలా మంది అనుకొనేటట్లు పిల్లలు పుట్టాక బహిష్టు నొప్పి తగ్గుతుందనడం పూర్తిగా నిజంకాదు ఈ విషయాన్ని ఏ అధ్యయనాలు సమర్ధించలేదు.
సెకండరీ డిస్మెనొరియా ప్రోస్టగ్లాండిన్స్ అధికమ్వడం వలన, గర్భాశయం ఎక్కువగా ముడుచుకోవడంవలన లేక ఇతర వ్యాధుల వలన కానీ సంభవించవచ్చు.

ఎమెనోరియ (బహిష్టు రాకపోవడం)

ఎమెనోరియ (బహిష్టు రాకపోవడం) రెండు రకాలు. ప్రైమరి ఎమెనోరియ మరియు సెకండరీ ఎమెనోరియ ప్రైమరరీ ఎమెనోరియ అంటే స్త్రీలలో ఒక్కసారి కూడా బహిష్టు రాకపోవదం. సెకండరీ ఎమెనోరియ అంటే కనీసం ఆరు నెలల పాటు బహిష్టు రాకపోవదం. ఇది సాధారణంగా గర్భధారణ వల్ల వస్తుంది.

మెనోర్రాజియా (అధిక ఋతుస్రావం)

మెనోర్రాజియా అంటే అధికంగా లేక ఎక్కువ కాలం ఋతుస్రావం జరగడం. మెనోర్రాజియా ను హైపర్మెనోరియా అని కూడా అంటారు. చాలా అధికంగా అయ్యే రక్తస్రావాన్ని. లేక ఏడు రోజులు దాటి ఉండే రక్తస్రావాన్ని మాత్రమే మెనోర్రాజియా అంటారు. ఒక్కోసారి ఈ ఋతుస్రావం పెద్ద రక్తపు గడ్డలను కూడా కలిగి ఉండవచ్చు. సర్వ సాధారణంగా ఇది హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన కానీ గర్భసంచిలో ఏర్పడిన ఫైబ్రాయిడ్ల వలన కానీ సంభవిస్తుంది.

ఎండోమెట్రియల్ కాన్సర్

గర్భాశయపు లోపలి పొరకు వచ్చే కాన్సర్ ను ఎండోమెట్రియల్ కాన్సర్ అంటారు. సాధారణంగా ఎండోమెట్రియల్ కాన్సర్ ఉన్నప్పుడు యోని నుండి అసాధారణ రక్త స్రావం జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనదే కానీ ప్రారంభ దశలో కనుగొన్నట్లైతే చాలా వరకు నయంచేయవచ్చు. యాభై ఏళ్ళు పైబడిన స్త్రీలలోనూ, प्रोప్రోజెస్టరోన్ స్థాయిలు అధికంగా గల స్త్రీలల్లోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో గడ్డలు)

గర్భాశయపు కండరాలలో వచ్చే గడ్డలను ఫైబ్రాయిడ్లు అంటారు. ఇవి వివిధ పరిమాణాల్లో ఉంటాయి. చాలా చిన్నవిగా కానీ లేక చాలా పెద్దవి గా కానీ ఉండచ్చు . కొంతమంది స్త్రీలలో ఫైబ్రాయిడ్లు ఉన్నప్పటికీ పైకి ఏ విధమైన లక్షణాలూ కనిపించవు. తక్కిన మహిళల్లో రక్త స్రావం అధికంగానూ మామూలు కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. ఫైబ్రాయిడ్ల వలన పొత్తి కడుపు లోనూ, సంభోగ సమయంలోనూ నొప్పిగా ఉంటుంది. తరుచుగ మూత్రం వస్తున్నట్లంటుంది . పేగుల్లో ఒత్తిడి మరియు మలబధ్ధకం కలుగుతుంది. ముఫైఐదేళ్ళ వయస్సు పైబడిన స్త్రీలకు, ఎక్కువ కాన్పులు అయిన స్త్రీలకు ఫైబ్రాయిడ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.

పెల్విక్ ఇన్ఫ్లమ్మేటరీ డిసీజ్ (కటివలయ వాపు వ్యాధి)

స్త్రీ జననేంద్రియాలలో ఏదో ఒకభాగంలొ ఇన్ఫెక్షన్ రావడాన్ని పెల్విక్ ఇన్ఫ్లమ్మేటరీ డిసీజ్ (పి.ఐ.డి) అంటారు. యోని నుండి దుర్వాసనతో కూడిన ద్రవం స్రవించడంఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. దీనితోబాటు నెలసరి క్రమంగా రాకపోవడం , సంభోగ సమయంలో నొప్పి కలగడం కూడా ఉంటాయి. సుఖ వ్యాధులు సోకడం పి.ఐ.డి. కి ప్రధానమైన కారణం. ఈ వ్యాధి ప్రమాదకరమైనది. ఫల్లోపియన్ ట్యూబులకు హాని చేసి ముందు ముందు గర్భధారణకి అవరోధం కలిగించ వచ్చు.

ప్రీమెనుస్ట్రల్ సిండ్రోమ్ ( ఋతు సమయం ముందు కనిపించే లక్షణాలు)

నెలసరి కి ఏడు నుంచి పధ్నాలుగు రోజులు ముందు నుంచీ కనిపించే లక్షణాలను ప్రీమెనుస్ట్రల్ సిండ్రోమ్ అంటారు. ఒక్కోసారి నెలసరి మొదలయ్యాక కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది స్త్రీలలో ఇది కనిపించినప్పటికీ దీని తీవ్రత కొంత మంది లో ఎక్కువగానూ, కొంత మందిలో తక్కువగానూ ఉంటుంది. ఈ ఋతు సమయంలో కొంతమంది స్త్రీలకి తీవ్రమైన కడుపు నొప్పి, ఉద్రేకం కలుగుతాయి.

ఋతు సంబంధ వ్యాధుల శీఘ్ర నిర్ధారణ

ఋతు సంబంధ వ్యాధులను నిర్ధారించడానికి డాక్టర్లు వరుసగా కొన్ని పరీక్ష లు జరిపించ వలసి ఉంటుంది - కటి వలయ పరీక్ష, రక్త పరీక్ష, అల్ట్రా సౌండ్ పరీక్షలు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కనిపించిన లేక చాలా కాలం కనిపించని ఋతు సంబంధ సమస్యలు, తరువాత ఎప్పుడో కానీ, దీర్ఘ కాల సమస్యలుగా మారే వరకూ గుర్తించలేక పోవడానికి ఆస్కారం ఉంది.

ఋతు సంబంధ వ్యాధులను ఎలా నివారించాలి

ఋతు సంబంధ వ్యాధుల చికిత్స ఆ యా సమస్యలను బట్టి, ఎన్నాళ్ళుగా అది సమస్యగా ఉందో దాన్ని బట్టి ఉంటంది. చిన్న చిన్న సమస్యలకూ, ఆరు నెలల లోపుగా బాధిస్తున్న సమస్యలకు కూ డాక్ట ర్లు జీవన విధానంలో మార్పులను కానీ కొన్ని చిట్కాలను కానీ సూచిస్తారు.

  • క్రమం తప్పని వ్యాయామం
  • సమతుల్యమైన ఆహారం
  • ఆహారంలో ఇనుము, కాల్షియం, విటమిన్ బి అధికంగా ఉండేటట్లు చూసుకోవడం లేదా మందుల రూపం లో తీసుకోవడం
  • నొప్పి తగ్గడానికి పారాసిట్మాల్ మాత్ర పుచ్చుకోవడం
  • వేడి నీళ్ళ కాపడం


ఋతు సంబంధ సమస్యలు తీవ్రతరంగా ఉన్నా, దీర్ఘ కాలంగా బాధిస్తున్నా, డాక్టర్లు సమస్యను నయం చేయడానికి ఈ మందులను ఇస్తారు:

  • నొప్పి నయం చేయడానికి వాపును తగ్గించే మందులు
  • హార్మోన్లను తిరిగి తిరిగి సమకూర్చే చికిత్స
  • బహిష్టులను క్రమపరచడానికి బిళ్ళలు వాడడం

ఫైబ్రాయిడ్లు లేక కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులున్నట్లు నిర్ధారణ ఐతే శస్త్రచిక్త్స అవసరం. ఐతే చాలావరకూ ఋతు సంబంధమైన సమస్యలు సాధారణంగా ఉండేవే. వాటి గురించి అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఋతు చక్రాన్ని అనేకమైన విషయాలు ప్రభావితం చేయవచ్చు. బహిష్టు
అయిన కొత్తల్లో కనిపించే సమస్యలు కూడా శరీరం ఈ కొత్త మార్పులకు అలవాటు పడడం లో భాగమే. అయినప్పటికీ ఏదైనా సమస్య ఉంటే , అనగా ఎక్కువ రోజులు రక్త స్రావం జరుగుతున్నా, అధికంగా ఉన్నా, లేదా రక్తం గడ్డలుగా పడుతున్నా డాక్టర్ను సంప్రదించాలి.

గర్భ స్రావము

పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.

  • సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణా లున్నాయి. అందులో ముఖ్య మైనవి .

కారణాలు

  • తల్లి వయసు : 19 నుంచి 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది.
  • జన్యుపరమైనవి : కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇవే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్‌.
  • గర్భసంచిలో లోపాలు : పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్‌ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్‌ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్‌ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.
  • కంతులు : ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.
  • ఇతర కారణాలు : అవాంఛిత గర్భం తీసివేయడానికి అనేసార్లు క్యూరుటు చేయించుకోవడం వల్ల గర్భకోశంలో అనవసరమైన పొరలు ఏర్పడే అవకాశముంది. క్షయ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. ఈ పొరలు రక్తప్రసరణను అడ్టుకుంటాయి. వీటిని హిస్టిరోస్కోపి ఆపరేషను ద్వారా తొలగించొచ్చు. పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోం, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో గర్భస్రావాలు జరగొచ్చు.
  • రక్తం గడ్డకట్టడంలో లేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.

చికిత్స :

  • రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్‌ చేయొచ్చు. అబార్షన్‌ అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.

గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించొచ్చు.

  • గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనొవ్వొచ్చు.

ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్

అందరి స్త్రీలలో, అన్ని గర్భిణీలు తొమ్మిది నెలలు (40 వారలు) నిండే వరకు వుండి కాన్పు సంభవించదు. కొన్ని సందర్భాలలో గర్భస్రావం దానంతట అదే జరిగి పోతుంది. దీనినే గర్భస్రావం లేదా ఆకస్మిక గర్భస్రావం అంటారు. సాధారణంగా గర్భస్రావాలు 26 వారాలకు ముందు అవుతాయి. కొంత మంది మహిళలకు శస్త్ర చికిత్స ద్వారా గర్భస్రావం చేయబడుతుంది. దీనినే ప్రేరేపించిన గర్భస్రావం అంటారు.

గర్భస్రావం లేక ఆకస్మిక లేక అనన్య ప్రేరేపిత గర్భస్రావం

నూటికి పది లేక 20 శాతం గర్భిణులు, గర్భస్రావంగా అంత మొందుతాయి. శిశువు జీవం పొందక మునుపే గర్భస్రావం జరిగిపోతూ వుంటుంది. సాధారణంగా మొదటి 12 వారాలలో గర్భస్రావాలు జరుగుతూ వుంటాయి.

గర్భస్రావానికి గల కారణాలు ఏవి ?

సర్వ సాధారణంగా ఫలదీకరింపబడిన అండంలోని లోపాలు గర్భస్రావానికి దారి తీస్తూఉంటాయి ఒకవేళ ఇట్టి లోప భూహిష్టమైన అండాలు అభివృద్ధి చెంది ప్రసవం వరకు పొడగింపబడి శిశువు జన్మించినచో వారిలో తీవ్రమైన అంగవైకల్యాలు లేక కొన్ని అంగాలు పూర్తిగా ఏర్పడకపోవడం వంటి సమస్యలు కనబడుతాయి. కావున గర్భస్రావం అనేది కొన్ని సందర్భాలలో ప్రకృతి ప్రసాదించిన వరం తద్వారా ఇటువంటి అసాదారణమైన పుట్టుకల అవరోధం గర్భస్రావం ఈ క్రింది కారణాలు వలన కూడా జరగవచ్చు. గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన సుఖవ్యాధులు ఎత్తయిన ప్రదేశం నుంచి క్రింద పడడం, జననేంద్రియ వ్యవస్థ లో లోపాలు. కొన్ని సందర్భాలలో ఫలధీకరణ చెందిన అండము గర్భాశయమునకు బదులు గర్భాశయంకు ఇరువైపులా వుండే నాళాలలో నాటుకోవడం. ఇటువంటి సందర్భంలో కూడా సర్వ సాధారణంగా గర్భస్రావం జరిగిపోతుంది. మరియు ఇది ప్రమాదకరమైనది.

గర్భస్రావం యొక్క సంకేతాలు

ముఖ్యంగా రెండు సంకేతాలు

  1. యోని గుండా రక్తస్రావం.
  2. క్రింది కడుపు లేదా పొత్తి కడుపులో నొప్పి.

ఆ రంధ్రంలో కొద్దిగా వున్న రక్తస్రావం పోనుపోను అధికమవుతూ పెద్ద గడ్డల్లాగా పడడం మొదలవుతుంది. మొదటి మూడు నెలలలోపు గర్భస్రావం జరిగినపుడు సంభవించే రక్తస్రావం , పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు, బహిష్ఠుతను
పోలి వుంటాయి. కాబట్టి గర్భిణి నిర్ధారణ జరగని సందర్భాలలో గర్భస్రావానికి, బహిష్ఠుకు తేడా తెలుసుకోవడం చాలా కష్టం.

సంపూర్ణ గర్భస్రావం: - ఎప్పుడైతే గర్భస్రావం లో పిండము లేక భ్రూణము మరియు భ్రూణానికి సంభందిన కణజాలం, మాయ మొత్తంగా యోని ద్వారా బయల్పడి పోతాయో దానిని సంపూర్ణ గర్భస్రావం అంటారు. ఇట్టి పరిస్ధితిలో రక్తస్రావం కొద్ది రోజులలో తగ్గిపోతుంది. రక్తస్రావం తరువాత స్త్రీ కొంతకాలం వరకూ విశ్రాంతి తీసుకోవాలి. బరువులు ఎత్త కూడదు. మరియు శారీరక పరిశుభ్రత పాటించాలి. కొంత కాలం సంభోగానికి దూరంగా ఉండాలి.

అసంపూర్ణ గర్భస్రావం :-

కొన్ని మార్లు పిండంలో కొంత భాగం గర్భాశయంలో ఉండిపోతాయి. దీనిని అసంపూర్ణ గర్భస్రావం అంటారు. సాధారణంగా ఈ విధంగా గర్భస్రావం 10 నుండి 12 వారాల మధ్యలో జరిగిన సందర్భం లో జరుగుతుంది. రక్తస్రావం ఆగకుండా కొంత కొంత అవుతూ వుంటుంది. గర్భాశయంలో వుండి పోయిన కణజాలం, పిండం యొక్క మిగులు భాగాలు లేక మాయ వీటికి చీము పోసే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా రోగికి జ్వరం, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. ఈ విధంగా అసంపూర్ణ గర్భస్రావం జరిగి రక్తస్రావం ఆగని పక్షంలో వెంటనే వైద్యులను సంప్రదించి వారి ద్వారా గర్భసంచి శుభ్రం చేయించుకోవాలి. ఆరోగ్య కార్యకర్త తో గానీ, వైద్యులు తో గానీ, ఏదైనా ఆసుపత్రిలో కానీ, (వైద్య శాల) లో గానీ చేయించు వచ్చును. ఈ విధంగా చేయించుకోని పక్షంలో గర్భసంచిలో మిగిలిపోయిన కణజాలం, మాయ, పిండం అవశేషాలకు చీము పోసి రోగికి జ్వరం కడుపులో నొప్పి, జననేంద్రియాలలో వస్తాయి. తగు సమయములో చికిత్స చేయనిచో సూక్ష్మజీవుల జననేంద్రియాలను వీడి పోవు. ఉన్న నాళాలు లోని కణజాలం దెబ్బతిని అవి మూసుకొని పోతాయి. తద్వారా రోగిలో వంధ్యత్వము లేక సంతానప్రాప్తి లేకుండా పోతుంది. కాబట్టి స్త్రీలు అసంపూర్ణ గర్భస్రావం తరువాత రక్తస్రావం, జ్వరం , పొత్తి కడుపులో నొప్పి వంటి సంకేతాలు కనపడితే ఆలస్యం చేయక వెంటవెంటనే వైద్యుని సంప్రదించాలి.

గర్భస్రావం తరువాత మళ్ళీ గర్భధారణ కోసం ప్రయత్నించే ముందు కొన్ని నెలలు వేచి ఉండవలసి వుంటుంది. ఈ మధ్యకాలంలో కుటుంబ నియంత్రణ పాటించడం శ్రేయస్కరం.

పలుమార్లు జరిగే గర్భస్రావం కొందరు స్త్రీలలో గర్భస్రావం మరల మరల జరుగుతూ వుంటుంది. ఒకటికి రెండు సార్లు తొలి నెలల్లో గర్భస్రావం జరిగినపుడు వారికి బెంగపడనవసరం లేదని ధైర్యం చెప్పాలి. రెండవసారి మూడవ సారి కూడా 6 నెలలు దాటాక గర్భస్రావాలు జరుగుతుంటే స్త్రీ వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. దీనిద్వారా కారణం తెలిసే అవకాశం తద్వారా చికిత్స పొందడం చేయవచ్చును.

ప్రేరేపిత గర్భస్రావం : - కొన్ని సందర్భాలలో గర్భస్రావాలు అనన్య ప్రేరేపితమవుతాయి. దీని అర్ధం అవివాటంతట అవే మొదలవుతాయి. కొన్ని సందర్భాలలో గర్భిణీ స్త్రీలు ఇష్టాను పూర్వంగా గర్భస్రావం చేయించుకుంటారు. ముఖ్యంగా ఇది మొదట 3 నెలలలోపు చేస్తారు. దీనిని ప్రేరేపిత గర్భస్రావం అంటారు. గర్భిణి స్త్రీకి నొప్పి నివారించడానికి, సూది ఇవ్వబడుతుంది. తరువాత పరిశుభ్రమైన వాతావరణంలో సరియైన క్రిమిరాహిత్యమైన పరికరములతో యోని ద్వారా గర్భసంచిని శుభ్రపరుస్తారు. ఈ విధంగా శిక్షణపొందిన వ్యక్తి చేసిన యెడల ఈ విధానము అపాయకరముకాదు. దీనికి 15 నిముషములు సమయం పడుతుంది.

గర్భస్రావమునకు అసురక్షితమైన పద్ధతులు వినియోగిస్తే గర్భిణి స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో సూక్ష్మక్రిములతో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన వలసి ఉంటుంది. గర్భిణి స్త్రీ ఏ కారణం గానైనా గర్భస్రావం చేయించుకున్న తరువాత ఈ దిగువ చూపిన లక్షణాలు కనబడితే వెంటనే స్త్రీ వైద్య నిపుణుల లేక వైద్యుని సంప్రదించాలి.

  • జ్వరం
  • చలి, వణుకుతో కూడిన జ్వరం
  • పొత్తి కడుపులో నొప్పి
  • పొత్తి కడుపు తొడ కండరాలు గుంజినట్టువడం
  • నడుము నొప్పి
  • యోని ద్వారా ఆగని రక్త స్రావం
  • అధికంగా, గడ్డలు గడ్డలుగా పోయే రక్త స్రావం.
  • యోని గుండా దుర్వాసన కూడిన మైల లేక చీము లేక మైలతో మిళితమైన తెల్లబట్ట
  • ఋతుక్రమం రావడంలో 6 వారాలకంటే అధిక సమయం పట్టడం.

అలక్ష్యం, అలస్యం చేసిన యొడల ఈ సమస్య ప్రాణాంతకం కావచ్చును.

న్యాయ చట్టము

స్వదేశీ జనాభా తంత్రము 2000 లో జనాభా నియంత్రణకు కొన్ని కార్యక్రమాలు నిర్ధేశింపబడినవి. వీటిని నిర్భయంగా, సమర్ధవంతంగా అమలు చేయునట్టు కొన్ని ముఖ్యమయిన, తగిన చట్టం వుండడం ఎంతో ముఖ్యమయిన విషయం. దీనిలో రెండు ప్రత్యేకమయిన న్యాయశాసనములు ఉన్నాయి. ఇవి కొన్ని ప్రత్యేకమయిన పనులకు ఉద్దేశింపబడతాయి. అవి

  1. గర్భస్థ శిశువుగా వున్నప్పుడే చేసే పరీక్షలు : లోపాలను నిర్ధారించడానికి సవరించడం మరియు నివారించే చట్టము.1994
  2. దీని కారకత నిర్దేశింపబడిన న్యాయశాసనము, మరియూ సూత్రాలు 1వ జనవరి 1996 నుంచి

అమలులోకి వచ్చినవి ఈ శాసనం గర్భస్ధ శిశువులో వున్నలోపాలు పరీక్షలు చేయుటకు తగు
పరిస్ధితుల నిర్దేశిస్తుంది. గర్భస్ధ శిశువు లింగ నిర్ధారణ నిషేధించడమైనది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికై
తగు చర్యలు తీసుకోవడం నిర్దేశించడమైనది.
శిశు మృత్య సంఖ్య వ్యాధి గ్రస్తమైన వ్యాధి ప్రబలత వైద్య పరంగా అనుమతించిన గర్భస్రావం చట్టబధ్దమైన
గర్భస్రావం గర్భస్రావాలకు సంభంధించి శిశు మృత్యుల సంఖ్య మరియు వ్యాధి ప్రబలతను నివారించడానికి నియంత్రించడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్ధితులో వైద్యపరంగా గర్భస్రావాల అనుమతించే చట్టం 1971 న శాసన సభలో ఆమోదించటం, 1972 ఏప్రిల్ నెలలో భారతదేశమంతటా అమలులోనికి వచ్చినది. జమ్మూ, కాశ్మీరు లో మాత్రము 1976 నవంబరులో అమలులోనికి వచ్చినది.

చట్టబద్ధమైన గర్భస్రావ శాసనము తో కొన్ని నిబందనలు పొందు పరచడమైనది. దీని ప్రకారము గర్భస్రావము చేయు స్ధలము, చేయు వారి అర్హతలు, చేయ వలసిన పరిస్థితి పొందు పరచడమైనది. గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్ధితి, గర్భిణీ స్త్రీకు శారీరిక లేక మానసిక సమస్యలున్నప్పుడు, ఒకవేళ కాన్పుజరిగే లోపు గర్భిణీ స్త్రీకు ఏదైనా సమస్య తలెత్తే ప్రమాదమున్నప్పుడు గర్భిణీ పొడిగించడం మూలాన తల్లికి ప్రాణానికి ముప్పు అని తలచినప్పుడు లేక తల్లి శారీరిక మానసిక ఆరోగ్యానికి ముప్పు అని తలచినప్పుడు చట్టబధ్ధమైన గర్భస్రావం చేయడం జరుగుతుంది.
మానవతా దృక్పధం :- మానభంగం తరువాత కలిగిన గర్భం.

గర్భం :గర్భధారణకు కారణం గర్భనీరోధక సాధనంలో లోపం వలన కలిగినప్పుడు అటువంటి స్త్రీలు విన్నపము మీద గర్భస్రావం చేయబడుతుంది.

గర్భిణీ స్త్రీ యొక్క ఆర్ధిక పరిస్ధితి సరిగాలేని పక్షంలో పరోక్షంగా ఇది తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న పక్షంలో గర్భస్రావం విన్నపంపై చేయడానికి అవకాశాలు ఎక్కువ వుంటాయి.
గర్భస్రావ చట్టం ప్రకారం కేవలం ఆమోదం పొందిన, అనుభవఘ్నలైన స్త్రీ వైద్య నిపుణులు మాత్రమే చేయవలసి వుంటుంది. ఒకవేళ గుర్తించిన , గర్భం 12 వారముల లోపలేవున్నచో తత్సంభంధమైన వైద్యులు నేరుగా గర్భస్రావం చేయవచ్చును. ఒకవేళ గర్భం 12 వారాలకు మించి ఉన్నచో మరియొక వైద్యునితో గర్భస్రావం చేయవలసిన అవసరాన్ని సంప్రదించ వలసి ఉంటుంది. వీరిరువురిలో గర్భస్రావం ఏ ఒక్కరైననూ చేయవచ్చును.

అత్యవసర పరిస్ధితులలో గర్భం 20 వారాలు లేక మించి ఉన్నచో ఒక వైద్యుడే స్వతంత్రంగా గర్భస్రావం గుర్తింపులేని లేక అనుమతి లేని ఆసుపత్రిలో గాని నిర్వహించ వచ్చును.

గర్భణి స్త్రీ యొక్క అనుమతి రాత పూర్వకంగా తీసుకొనడం చాలా ముఖ్యం కొన్ని పరిస్ధతిలలో ఒకవేళ గర్భిణీ స్త్రీ అఘాత పరిస్థితిలో వున్నా లేక ఉన్యాదములో ఉన్నా లేక గర్భిణి వెంట వున్న ఆమె తరుపు పూచీ వహించే వ్యక్తి సంతకం చాలా అవసరము. (గర్భిణి స్త్రీ మైనరైనచో తండ్రి యొక్క సంతకం లేక రక్త సంబందీకులు) సంతకం అవసరం.
వైద్య పరమైన గర్భస్రావం
వైద్యులు నిర్దేశించిన గర్భస్రావ చట్టం 1971 స్వీయమైనదిగా లేక స్వవిషయంగా పరిగణింపబడుతుంది.

కాబట్టి గర్భస్రావ నిర్వహించే వ్యక్తులు గర్భస్రావం చేయించుకునే వ్యక్తుల పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచవలసిన బాధ్యత వహించాలి.

గర్భస్రావం నిర్వహించే సమయంలో ఏదైనా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కాబట్టి గర్భస్రావం నిర్వహించే సిబ్బంది అన్నీ విధాలైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకున్న తరువాత కూడా ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తుతే చట్టపరంగా కానీ లేక వైద్యపరంగా కానీ) దానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.

సిబ్బంది ఒకవేళ పైన నిర్దేశించిన సిబ్బంది సూత్రాల ఉల్లంఘించి పక్షంలో చట్ట ప్రకారం గర్భస్రావం నిర్వహించిన సిబ్బంది శిక్షార్హులవుతారు. 1000 రూ జరిమాన కూడా కట్టవలసి వుంటుంది.

గర్భిణి స్త్రీలకు వైద్యపరంగా సమస్యలు ఉన్నప్పుడు, శిశు సంభందమైన జన్యు సమస్యలు ఉన్నప్పుడు గర్భస్రావం తల్లికీ బిడ్డకీ శ్రేయస్కరం. కానీ వేరే కారణాల వల్ల శిశుజననం వద్ధనుకున్నప్పుడు లింగనిర్ధారణ చేయించుకొని ఆడ శిశువు వద్ధనుకున్నప్పుడు గర్భస్రావం చేయించుకోవడం అనైతికం, ఆసమాజకం కాబట్టి ఇలాంటివి జరగకుండా గర్భిణి స్త్రీలను నిరుత్సాహ పరచాలి. గర్భస్రావ చట్టం 1975 వ సం. లో సవరించడమైనది. క్రింద చూపిన సవరణను చేయడమైనది.

గర్భస్రావం చేసే సిబ్బందికి తగు అర్హతలు ఉన్నదీ లేనిదీ నిర్ధారించే హక్కు జిల్లా ముఖ్య వైద్యాధికారి ఇవ్వబడ్డాయి. పూర్వము ఈ పని అర్హతా పత్ర ఇచ్చే సంస్ధ చేతుల్లో ఉండేది.

గర్భస్రావం చేయుటకు ఉండవలసిన అర్హతలు :

  1. 25 వరకు గర్భస్రావముల వరకు వైద్య సిబ్బంది చేయునప్పుడు వారకి సాయంగా ఉన్నట్టయితే వారు వైద్యవృత్తి నడపడానికి అర్హత పొందిన వారై ఉండాలి.
  2. (RMP) వైద్యులు 6 నెలలు ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల విభాగంలో నిపుణుల క్రింద పనిచేసి వుండాలి.
  3. గర్భస్రావం నిర్వహించే వైద్యులు ప్రసూతి మరియు - స్త్రీ వ్యాధులలో నిపుణత పట్టభద్రులై వున్నచో
  4. 1971 సం. ముందు పట్టభద్రులైనవారు ( ఈ చట్టము రాక మునుపు) ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల విభాగంలో 3 సం. పాటు పనిచేసి వుండాలి.
  5. ఈ చట్టం ఏర్పరిచిన తరువాత పట్టభద్దులైనవారు. ఈ విభాగంలో 1 సం. పాటు పనిచేసి వుండాలి.
  6. జిల్లా ముఖ్య వైద్యాధికారి వద్ద అనుమతి పొందిన ప్రైవేటు (ప్రభుత్వం).

సంస్థలు కూడా గర్భస్రావాలు నిర్వహించవచ్చును గర్భస్రావం సవరణ (1975) జరిగిన పిమ్మట చట్టం 1971 లో ఏర్పరిచిన గర్భస్రావ చట్టం (సవరించిన 1975 చట్టం) మరియూ తద్వారా కూడా ఈ సేవలోంచే సౌకర్యం కల్పించిన పిదప కూడా గర్భస్రావాలు నిపుణత లేక, అవగహాన కానీ అర్హత గానీ లేని వాళ్ళు
నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా ఈ విధంగా జరుతూ వున్నది. ఈ విధంగా జరగడానికి ప్రధాన మైన కారణాలుగా ఈ దిగువ చూపిన అంశాలు గుర్తించబడ్డాయి.

  1. గ్రామీణ మరియు సంచార కొండ చరియల్లో నివసించే గర్భిణీస్త్రీలు గర్భస్రావం చేసే ఆసుప్రతులకు వెళ్ళే అవకాశం కానీ మార్గము గానీ అరుదుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాలుకు వెళ్ళి గర్భస్రావం చేయుంచుకొనడానికి ఆర్ధికంగా భరించలేరు.
  2. వీరికి సురక్షితమైన గర్భస్రావం జరిగే చికిత్సాలయాలు వున్నట్టు కూడా అవగాహన వుండదు.
  3. గర్భస్రావం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రులు లేక చికిత్సాలయాలలో రోగికి సంభందించిన విషయం గోప్యంగా ఉంచే ప్రయత్నం సరిగా జరగదు.
  4. కన్యలు మరియు భర్త చనిపోయినవారు గర్భం ధరించిప్పుడు గర్భస్రావం నలుగురుకి తెలిసేటట్టు చేయించకొనడానికి నిరాసక్తంగా ఉంటారు.
గర్భస్రావానికి ముందు తీసుకోలసిన జాగ్రత్తలు

మొట్టమొదట గర్భస్రావం చేయవలసిన స్త్రీ గర్భిణి ఎన్ని నెలలు మరియు గర్భధారణ గర్భ సంచిలోనే వున్నదా ? అన్న విషయం నిర్ధారించడం.

గర్భస్రావం నిర్వహించేప్పుడు మొదట ఉండే 3 నెలలో ప్రమాదాలు నెలలు పెరిగే కొద్దీ పెరుగుతాయి.
గర్భస్రావం చేసేటప్పుడు మొదట మూడు నెలలలో సరియైన పద్ధతిలో చేసినప్పుడు ప్రమాదాల కొద్దిగానే జరిగినా నెలలు పెరిగే కొద్దీ ఇవి అధికం అవుతూ వుంటాయి. కాబట్టి గర్భస్రావం ఏ పద్ధతిలో చేయడం అన్నది. ఎన్ని నెలల గర్భిణి ఎన్ని నెలలు అని నిర్దారించడమైనదే కీలకమైన అంశం అన్ని ప్రసూతి కేంద్రాలలో గర్భిణి స్త్రీలయొక్క సమాచారం తీసుకోవడంలో మరియూ లోపలి పరీక్ష చేయించడంలో తర్ఫీదు పొందిన సిబ్బంది మరియు అవసరమైన పరికరాలు పరిసరాలు లేవో అటువంటి ఆరోగ్య కేంద్రాలు గర్భస్రావాలు చేయడానికి వెంటనే తగు ఆసుపత్రులకు వారిని పంపించేయాలి. గర్భిణి స్త్రీ అవసరాల మేరకు వీరికి తగు సలహా ఇవ్వగలిగే అనుభవజ్ఞులైన సిబ్బంది వుండాలి.

గర్భిణి స్త్రీని పరీక్షించేటప్పుడు ఆరోగ్య కార్యకర్త - గర్భసంచి యొక్క స్థానం (ముందుకు వున్నాదా ? వెనుకకు ఒరిగి ఉన్నదా లేక వేరొక రకంగా వున్నాదా) నిర్ధారించుకోవాలి. ఇదికాక ఆమెకు లైంగిక సంబంధమైన వ్యాధులు కానీ, జననేంద్రియ వ్యవస్ధ తో పాటు కానీ, జబ్బులు కానీ ఉన్నాదా పరిక్షించవలసి వుంటుంది. రక్తహీనత, మలేరియా (చలిజ్వరం) వంటి జబ్బుల కోసం కూడా చూడాలి. అటువంటి రోగులను నిపుణుల సలహాకోసం పెద్ద ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం వెంటనే పంపివేయాలి. గర్భసంచి సంబంధించిన జబ్బులు లేక అవయవలోపం గమనించినట్టయితే వారిని తదుపరి పరీక్షల కోసం అటువంటి సౌకర్యాలు వున్న ఆసుపత్రికి తరలించాలి.

సున్నితమైన అతిద్వని అలలు శరీరంలోని అవయవాలకు తాకి తనిఖీ చేసే వాటి యొక్క ప్రతిధ్వనిని ఛాయా చిత్రము ద్వారా నయోదు చేయడం)
తక్కువ వారాల గర్భిణిలో గర్భస్రావం చేయడానికి ఈ పరీక్ష అవసరం లేదు. ఈ సౌకర్యం వున్న చోట గర్భం గర్భ సంచిలో కాక వేరొక చోట ఏర్పడినప్పుడు కనుగొనడానికి పనికి వస్తుంది. 6 వారాల కంటే పైబడ్డ గర్భంలో ఇది పనిచేస్తుంది. కొద్దిగా ఎక్కువ వారాలు పై బడ్డ గర్భిణి స్త్రీలలో గర్భస్రావం చేసేటప్పుడు ఈ విధానం సహాయకరంగా ఉంటుందని కొందరు గర్భస్రావం నిర్వహించే సిబ్బంది అభిప్రాయం.

గర్భిణీ ఛాయాచిత్రం తీసే అవకాశం వున్న ఆసుపత్రులు లేక కేంద్రాలలో గర్భస్రావం చేయుంచదలచునున్న స్త్రీలకు ప్రత్యేకంగా వేరొక చోటున, అంటే సాధారణంగా గర్భిణి పరీక్ష చేయించుకొవడానికి, కాన్పు చేయించుకోడానికి వచ్చిన వారితో పాటు కాకుండా , విడిగా వేరొక సౌకర్యంవంతమైన చోటు అందచేస్తే అనువుగా వుంటుంది.

గర్భస్రావమునకు ముందు వుండవలసిన షరతులు :-

గర్భం ఉన్నది లేనిది దరహత ఎన్ని నెలలు గర్భిణి అనే అంశాలు నిర్ధారించిన పిదప ఆరోగ్య కార్యకర్త గర్భిణి స్త్రీ యొక్క వైద్యపరమైన సమాచారం. సంపూర్ణంగా తీసుకొనవలసి వుంటుంది. గర్భిణి స్త్రీ ఏమైనా ఇతర జబ్బులతో బాధపడుతున్నదా ? తద్వారా గర్భస్రావం ద్వారా ఆమెకు హాని కలిగే అవకాశం వున్నదా మరియు గర్భిణి స్త్రీ ఉపయోగిస్తున్న మందు గర్భస్రావం చేసేటప్పుడు ఉపయోగించే మందులకు సమస్య కాగలవా అన్న విషయం తెలుసుకోవాలి.

ఎయిడ్స్ వ్యాధి పీడితురాలైన స్త్రీ గర్భస్రావం చేయించుకున్నప్పుడు వైద్య పరంగా, ఇతర గర్భిణీ స్త్రీలకు తీసుకొనే జాగ్రత్తలన్నీ అదే విధంగా తీసుకోవాలి. వీరికి ఆరోగ్య కార్యకర్తచే తగు సలహా సూచనలు ఇప్పించ కలిగితే మంచిది.

జననేంద్రియ వ్యవస్థ యొక్క క్రిమి సంపర్కము (జననేంద్రియ వ్యవస్థ దిగువ భాగంలో ( సూక్ష్మజీవి సంపర్కము, (క్రిమి సంపర్కము) క్రిమి సంపర్కము ఉన్నయెడల గర్భస్రావము చేయునప్పుడు మరియు చేసిన తరువాత గర్భిణీ స్త్రీకు హాని కలుగవచ్చును. గర్భస్రావమే నిర్వహించునప్పుడు సూక్ష్మక్రిమి సంహారక మందులు వాడడం మూలంగా గర్భస్రావం తరువాత వచ్చే సూక్ష్మక్రిమి సంపర్కము వంటి జబ్బులకు సగం వరకూ నివారించవచ్చును. మందు జాగ్రత్తగా ఉపయోగించే సూక్ష్మక్రిమి సంహారక మందులు లబించని చోట కూడా గర్భస్రావాలు చేయవచ్చును. కానీ గర్భస్రావము చేయు పరికరాలు, పరిసరాలు, శుభ్రముగా సుక్ష్మక్రిమి రాహిత్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి గర్భస్రావం చేసిన పిమ్మట వచ్చే సూక్ష్మక్రిమి సంపర్కంన్ని చాలా శాతం వరకూ నివారిస్తుంది.

వైద్యపరంగా గర్భస్రావం చేయవలసిన స్త్రీలో క్రిమి సంపర్కం యొక్క లక్షణాలు కనబడితే వెంటనే చికిత్సచేసి ఆ తర్వాత గర్భస్రావం చేయాలి. జననేంద్రియ వ్యవస్థ క్రిమి సంపర్కంలో సాధారణంగా చేయవలసిన పరీక్షలు చేయించాలి. తీవ్రమైన లక్షణాలు లేకున్నచో గర్భస్రావం వెంటనే నిర్వహించాలి. ప్రయోగశాల నివేదికల కోసం ఎదురు చూడనవసరం లేదు.

ఫలధీకరణం చెందిన అండము గర్భాశయంలో కాక గర్భాశయం బయట కటివలయంలో వేరొకచోట పిండం పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని గర్భాశయేతర గర్భం అంటారు. సర్వసాధారణంగా ఇది గర్భకోశ నాళాలు అండాశయాలు, గర్భ సంచి వెనుక ఉండే డగేలాస్ అను ఖాళీ సంచి వంటి ప్రదేశంలో పెరుగుతుంది.

గర్భాశయేతర గర్భం ఒక్కసారి ప్రాణాంతకం అవుతుంది. గర్భాశయేతర గర్భిణిలో క్రింది లక్షణాలు గోచరించవచ్చును.

  • ఉండ వలసిన దానికంతా గర్భసంచి యొక్క పరిమాణం చిన్నగా ఉండడం. (బహిష్ఠు రాని నెలలకు తగ్గట్టుగా ఉండక పోవడం)
  • క్రింద లేక పొత్తి కడుపు నొప్పి
  • పొత్తి కడుపులో నొప్పితో పాటు యోని ద్వారా రక్తస్రావం లేక రక్తం చుక్కలుగా కనబడడం.
  • తల త్రిప్పడం, పాలిపోవడం, కళ్ళు తిరగడం, గర్భసంచికి ఇరువైపులా గడ్డలు.

గర్భాశయేతర గర్భం అని అనుమానం కలిగినప్పుడు దానిని అత్యవసరంగా నిర్దారించడం వెంటనే చికిత్స మొదట పెట్టడం చాలా ముఖ్యం. చికిత్స చేయలేని పక్షంలో అటువంటి గర్భిణి స్త్రీని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇటువంటి వసతులు వున్న ఆసుపత్రికి తరలించాలి.

గర్భాశయ బహిర్గ ద్వారము యొక్క కణ శాస్త్రము

గర్భస్రావం కొసం వచ్చిన గర్భిణి స్త్రీలకు ఇదొక అవకాశంగా తీసుకొని వారియొక్క గర్భాశయ బహిర్ఘ ద్వారం యొక్క కణజాల పరిస్థితి గురించి పరీక్షలు చేయ వచ్చును. దీనివల్ల ఆ స్త్రీకు మునుముందు క్యాన్సరు వచ్చే అవకాశం వున్నదీ, లేనిదీ నిర్ధారించవచ్చును. కానీ ఈ పరీక్ష చేయించుకోమని వారికి బలవంత పెట్టకూడదు. గర్భాస్రావం చేయించుకోవడానికి ఈ పరీక్ష అవసరం లేదు.

సమాచారం మరియు సలహా సంప్రదింపులు :-
గర్భాస్రావం చేయించుకోవడానికి వచ్చిన స్త్రీకు ఆమె పరిస్థితి గురించి పూర్తి సమాచారం, అవగాహన, గర్భాస్రావం చేసే పధ్ధతి అందులో కూడుకున్న సమస్యలు వారికి అర్ధమయ్యేలా గోప్యంగా ఉంచే బాధ్యత వహిస్తూ ఆ విధంగా నమ్మకం కలిగిస్తూ సలహా ఇవ్వాలి.

తీర్మానించుకునే విధంగా సలహా ఇవ్వడం :-

గర్భాస్రావం చేయించుకోవాలనుకున్న స్త్రీకు సలహా సంప్రదింపులు చాలా ముఖ్యం. ఆమె వీలు ను బట్టి, ఆమెపై ఏ ఒత్తిడులు తేకుండా నిర్ణయం తీసుకునేటట్టు సాయపడాలి. ఈ సలహా సంప్రదింపులనేవి తమంతటతాము లేక, స్వతహాగా ఇవ్వవచ్చును లేదా తర్ఫీదు పొందిన సిబ్బందితో ఇప్పించవచ్చును.

గర్భిణీ స్త్రీ గర్భస్రావం చేయించుకోడానికే నిర్దారించుకున్నప్పుడు ఆరోగ్య కార్యకర్త ఆమెకు న్యాయపరమైన సమ్మతికి అవసరమైన అంశాలు విశదీకరించాలి. ఆమెకు నిర్ణయం తీసుకొనడానికి తగిన వ్యవధిని ఇవ్వాలి. తక్షణ నిర్ణయం తీసుకోలేక పోయినా ఇంటికి పోయి ఆలోచించుకొని తిరిగి రావడానికి అనుమతినివ్వాలి.

అదే సమయములో నెలలు మించి పోకుండా గర్భస్రావం చేయించుకోవడం వల్ల ఉన్న లాభాలు మరియు సౌకర్యం గురించి తెలియచెప్పాలి.

ఒకవేళ గర్భిణి స్త్రీ కాన్పువరకూ ఆగడానికి నిశ్చయించు కొన్న పక్షంలో శిశువును పెంపకానికి ఇచ్చే వసతి గురించి మరియు దత్తు తీసుకునే సంస్థల సమాచారం తగిన విధంగా ఇవ్వాలి.

కొన్ని సందర్భాలలో గర్భిణి స్త్రీ పై గర్భస్రావం కోసం ఆమె భాగస్వామి మరియు తల్లిదండ్రుల ఒత్తిడి ఉండవచ్చును. అవివాహిత కన్యలు మరియు సుఖవ్యాధుల బారిన పడినవారి పై ముఖ్యంగా ఇటువంటి ఒత్తిడి వుంటుంది.

ఎయిడ్స్ వ్యాధి సోకిన అందరు స్త్రీలకు కూడా ఒకవేళ గర్భం కాన్పు వరకూ పొడిగించబడితే ఆమె ఆరోగ్యానికి కలిగే హాని ముందు ఎయిడ్స్ వ్యాధి బిడ్డకు సోకే ప్రమాదం ఆమెకు తెలియజేయాలి. తరువాత కాన్పు వరకూ వారు తీసుకోవలసిన మందుల గురించి, ఈ విధంగా పుట్టే బిడ్డకు వ్యాధి తెలియపరచాలి. దీని తరువాత వారు ఏ విధంగా గర్భిణీ కాన్పు వరకూ పొడిగించడమే లేక గర్భస్రావం చేయించు కొవటమా చట్ట సమస్యమైన నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది. వారు అధిక సమాచారం కోసం అర్ధించ వచ్చను. ఆరోగ్య కార్యకర్త లేక సిబ్బంది గర్భిణి స్త్రీ లైంగిక వేధింపులకు గురియై ఉండవచ్చునని అనుమాన పడినప్పుడు అటువంటి స్త్రీలను మరికొంత సలహా సంప్రదింపులు మరియు మానసిక చికిత్సకోసం అటువంటి వసతులు వున్న చోటుకు పంపవలసి వుంటుంది. ఆసుపత్రివోని కార్యనిర్వాహకులు అక్కడి సిబ్బందికి సమాజంలో ఆరోగ్య సంస్థలలో ఇటువంటి సౌకర్యముల గురించి అవగాహన వుండేటట్టు చూపాలి.

గర్భస్రావం చేసే పద్ధతులు మరియు సమాచారం
  1. గర్భస్రావం చేసేటప్పుడు, పిదప ఏం జరుగుతుంది.
  2. గర్భస్రావం జరుపుతున్నపుడు కలిగే అనుభవం (ఉదా:- బహిష్ఠు సమయంలో వచ్చే ఈడుపు నొప్పుడు నొప్పుల, రక్తస్రావం)
  3. గర్భస్రావం చేయడానికి పట్టే సమయం
  4. నొప్పి కలగకుండా తీసుకునే చర్యలు
  5. గర్భస్రావం చేయించుకోవడంలో కలిగే పరిణామాలు మరియు అపాయాలు.
  6. గర్భస్రావనంతరం తనపనుల తాను చేసుకోవడానికి పట్టే సమయం. మరియు సంభోగంలోపాల్గొనడానికి ఎంత వ్యవధి అవసరం.
  7. గర్భస్రావానంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు.

గర్భస్రావం చేసే పద్ధతులలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతులు అందుబాటులో వున్న యెడల ఆరోగ్య కార్యకర్త గర్భిణి స్త్రీకు వాటి సమాచారం, వాటి యోగ్యత, ఎన్ని నెలలు గర్భిణీకి ఏ పద్ధతైతే శ్రేయస్కరమో తెలియచెప్పాలి. పద్ధతి నిర్ధారించే ముందు గర్భిణికి ఎన్ని నెలలో, గర్భిణి స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి, తదుపరి జరగడానికి అవకాశం వుండే ప్రమాదాలు విశదంగా తెలియపరచాలి.

గర్భనిరోధక సాధనాలు మరియు వాటి సమాచారం :-

గర్భస్రావం చేయించుకునే స్త్రీకు గర్భనిరోధక సాధనాల సమాచారం అందించడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇక మీదట అవాంఛిత గర్భం రాకుండా వారు జాగ్రత్తపడే అవకాశం వుంటుంది.

గర్భస్రావం చేయించుకున్న ప్రతి స్త్రీకి గర్భస్రావం చేసిన రెండు వారాల తరువాత అండం విడుదలయ్యే అవకాశం తద్వారా వెంటనే గర్భం వచ్చే అవకాశం వుంటుందని తెలియపరచాలి. అందుకని సరియైన గర్భనిరోధక పద్ధతులు పాటించాలి. గర్భస్రావం చేయించుకునే స్త్రీకి గర్భనిరోధక సాధనాల గురించి ఖచ్చితమైన సమాచారం మరియు ఏ పద్ధతైతే ఆవిడ అవసరాలకు తదనుగుణంగా పని చేస్తాయో వివరించాలి. గర్భధారణకు కారణం గర్భ నిరోధక సాధనం వైఫల్యం వలన కలిగినవైతే ఆమేకు గర్భం రావడానికి కారణం గర్భ నిరోధక సాధనం సరియైన పద్ధతిలో వాడక పోవడం వలన వచ్చివుండవచ్చునని వివరించాలి. వాటికి సరియైన పద్ధతిలో వాడే విధానం వివరించాలి. గర్భనిరోధక సాధనం మార్చడం గురించి ఆమెతో సంప్రదించాలి.

ఏ గర్భనిరోధక సాధనం ఉపయోగించుకోవాలి. అనే తుది నిర్ణయం ఆమెకే వదినివేయాలి.

గర్భస్రావం చేయునప్పుడు, తదనంతరం ఉత్పన్నమయ్యే చిక్కులను అదుపులో వుంచడం మరియు సవరించడం.

తగురీతిగా తర్ఫీదు పొందిన సిబ్బంది గర్భస్రావం చేసిన చిక్కులు కలగడం చాలా అరుదు. ప్రతీ ప్రసూతి కేంద్రాలలో మరియు ఆరోగ్య కేంద్రాలలో గర్భస్రావం వల్ల కలిగే అపాయాలను గుర్తించడానికి, వెంటనే తగు చికిత్స అందించగలిగి లేక రోగిని అటువంటి చికిత్స లభ్యమయే కేంద్రాలకు తరలించడానికి తగిన తర్ఫీదు పొందిన సిబ్బంది. ఉపకరాలు, వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉండాలి. గర్భస్రావం వల్ల ఉత్పన్నమయే చిక్కులు లేదా అపాయాలు లేదా ప్రమాదాలు తమంతటతామే అయిపోయే లేక అనన్య ప్రేరేపితమైన గర్భస్రావంలో ఉత్పన్నమయే ప్రమాదాలను పోలి ఉంటాయి. కాబట్టి దీనిని అదుపుచేయడానికి ఉండలసిన ఉపకరణాలు, తర్ఫీదు పొందిన సిబ్బంది ఉంటే సరిపోతుంది.

అసంపూర్ణ గర్భస్రావం :-

నిపుణులైన లేక తర్ఫీదు పొందిన సిబ్బంది గర్భసంచి లోన కింది గర్భానికి సంబందించి కణజాలాన్నంతటనే బయటకీ గుంజి మేసే వంటి ఉపకరణం ఉపయోగించి చేసినట్టయితే చిక్కులు రావడం చాలా అరుదు. ఇవి సాధారణంగా వైద్యపరంగా చేసే గర్భస్రావంలో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సంకేతాలు లక్షణాలు క్రింది విధంగా వుంటాయి.

  1. యోని ద్వారా రక్తస్రావం
  2. పొత్తి కడుపు నొప్పి
  3. చీముపోసినట్టు సంకేతాలు ఉదా,, జ్వరం, వాసనతో కూడిన ద్రవాలు యోని గుండా స్రవించడం, నొప్పి వంటివి.

శస్త్ర చికిత్స ద్వారా గర్భస్రావం చేసిన తరువాత సంగ్రహించిన గర్భిణికి సంబంధించిన కణజాలం ఒకవేళ గర్భిణి నెలలకు సరితూగకపోతే గర్భస్రావం అసంపూర్ణ మయిందని అనుమాన పడవలసి వుంటుంది.

ప్రతి ఆరోగ్య కేంద్రాలలోని సిబ్బందికి సంపూర్ణ గర్భస్రావాలకు చికిత్స చేయడం తర్ఫీదు పొంది ఉండాలి. వీటిలో గర్భసంచిని మరలా శుభ్రపరచడం. రక్తస్రావం మరియు చీము పోయడం వంటి అంశాలను నియంత్రించ గలిగి వుండాలి. లేదా ఇటుంవంటి వసతులు మరియు నిపుణులు వున్న కేంద్రానికి రోగిని తరలించే వసతులు కలిగి వుండాలి.

విఫలమైన గర్భస్రావం:- గర్భిణీ స్త్రీలో ఇటువంటి పరిస్థితి గర్భస్రావం శస్త్ర చికిత్స లేక వైద్య పరంగా చేసినప్పుడు రావచ్చును.

ఏ పద్ధతిలో చేసినా గర్భస్రావం చేయుంచుకున్న స్త్రీ మారు పరీక్షకు వచ్చినప్పుడు పరీక్షలో గర్భం సాగుతున్నట్టు తెలిస్తే మరల శస్త్ర చికిత్స (గర్భసంచి కుహరంలోకి గొట్టాన్ని పంపి శూన్యత ఏర్పరచి పీడనం ద్వారా శుభ్రపరచడం) లేదా గర్భసంచి ద్వారాన్ని వెడల్పుచేసి తగు పరికరాలు వినియోగించి శుభ్రపరచడం. దీనిని సాధారణంగా రెండవ త్రైమాసిక భాగం లో ఉపయోగిస్తారు.

రక్తస్రావానికి కారణాలు క్రింది విధంగా ఉండవచ్చును.

  1. పిండము దాని చుట్టు ఉన్న కణజాలం గర్భసంచిలో మిగిలి ఉండి పోయినప్పుడు
  2. గర్భసంచికి లేక గర్భసంచి మూతికి గాయం అయినప్పుడు లేదా చిల్లుపడినప్పుడు.

కారణానుసారంగా గర్భసంచిని తిరిగి శుభ్ర పరచడం. మరియు రక్తస్రావాన్ని నియంత్రించేటట్టు సంచిపై పనిచేసే మందులు ఇవ్వడం. రక్తస్రావం రక్తనాళాల ద్వారా ద్రవాలు ఎక్కించడం, రక్త ప్రవేశనము చేయడం, ఉదర కుహరములో ఉన్న అవయవములను క్షుణ్ణంగా పరిశీలించడం రక్తస్రావాన్ని నిరోధించడానికి ఆక్సిటోసిన్స్ అను మందులు తరుచుగా వాడడం మంచిది. రక్తస్రావం తీవ్రంగా ఉన్నయెడల దీనిని అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. కాబట్టి ప్రతి ఆరోగ్య లేక ప్రసూతి కేంద్రంలో రోగిని అటువంటి పరిస్థితిలో చికిత్స అందించడానికి తరువాత రోగిని నిపుణులున్న కేంద్రానికి వీలయినంత త్వరగా తరలించడానికి తగిన వసతులు కలిగి ఉండాలి.

సూక్ష్మజీవి సంపర్కము:- తగురీతిగా గర్భస్రావం చేసినప్పుడు ఈ సమస్య అరుదుగా కలుగుతుంది. సాధారణంగా జర్వం, చలి, యోని గుండా లేక గర్భసంచి ముఖం ద్వారా దుర్గంధపూరిత స్రావాలు రావడం, కడుపులేక పొత్తి కడుపు నొప్పి చాలా రోజుల వరకూ రక్తస్రావం జరగడం, రక్తం చుక్కలుగా కనబడుతూ ఉండడం. గర్భసంచి పచ్చిగా ముట్టుకుంటే నొప్పిచేయడం, తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడం వంటి లక్షణాలు కనబడుతాయి.
సూక్ష్మజీవి సంపర్కము వున్నదని అనుమానం కలిగినా, నిర్ధారింపబడినా వెంటనే ఆరోగ్య కార్యకర్తల సూక్ష్మజీవి నాశకములను ఇవ్వడం, సూక్ష్మజీవి సంపర్కమునకు కారణం గర్భసంచిలో మిగిలిపోయిన పిండము దానికి సంబంధించిన కణజాలం అయినచో గర్భసంచిని తిరిగి శుభ్రపరచాలి. సూక్ష్మజీవి సంపర్కము తీవ్రంగా ఉన్నచో రోగిని ఆసుపత్రిలో చేర్పించాలి. గర్భస్రావానికి ముందే సూక్ష్మజీవి నాశక ముందులు ఇచ్చినచో గర్భస్రావం తరువాత సూక్ష్మజీవి సంపర్కము వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి. కాబట్టి వీటిని ముందే ఇవ్వడం శ్రేయస్కరం.

గర్భసంచికి చిల్లుపడుట:-
సాధారణంగా ఇది గుర్తించకుండానే దానంతట అవే మాని పోతాయి. మొదటి త్రైమాస గర్భంలో గర్భస్రావం మరియు లాప్రోస్కోప్ పద్ధతి ద్వారా పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్స చేసినప్పుడు.

700 మంది మొదట త్రైమాస గర్భంతో వున్న వారికి గర్భస్రావం మరియు పిల్లలు కలగకుండా చేసే శస్త్ర చికిత్స సమయంలో 14 మంది స్త్రీలలో 15, 12, మంది స్త్రీలలోనే గర్భసంచికి చిల్లు పడడం గమనించడం జరిగింది. ఈ చిల్లుల ఉదరకుహరం నేరుగా చూస్తూ ఉండడం వల్ల గమనించడం జరిగింది. లేకపోతే తెలిపే అవకాశం లేకుండానే అవి వాటంతట అవే మానిపోతాయి. గర్భసంచికి చిల్లు పట్టలేదని కనుగొనడానికి ఈ పద్ధతి సరియైనది. ఈ విధానంలో ఒకవేళ పేగులకు గానీ, రక్తనాళాలకు గానీ లేక ఇతర అవయవాలకు గానీ చిల్లు పడ్డట్టు అనుమానం కలిగితే లేదా రోగి పరిస్థితి విషమిస్తున్నట్టు అనుమానం కలిగినా అంత్ర వేష్టన కుహరాంత దర్శిని తో చిల్లిపడిన భాగాన్ని మర్మత్తు చేయవలసి వుంటుంది.

మత్తు మందుకు సంభందించిన సమస్యలు లేదా చిక్కులు శస్త్ర చికిత్సలో మత్తు కలిగించడం వల్ల తలెత్తే సమస్యలు
రోగికి స్ప్రహ లేకుండా చేయడం కన్నా స్థానికంగా నొప్పితెలియకుండా మొద్దు బారేటట్లు చేయడం శ్రేయస్కరం. ఇది మొదటి త్రైమాస గర్భంలో చేసే శూన్యత ఏర్పరిచి పిండ భాగాలకు సంచి వేసే పద్ధతి మరియు రెండవ త్రైమాస గర్భంలో ఉపయోగించే గర్భం కోసం పదార్థాలను తీసివేసే శస్త్ర చికిత్సకు కూడా వర్తిస్తుంది. రోగికి పూర్తి మత్తు ఇచ్చినప్పుడు అక్కడ పనిచేసే సిబ్బంది రోగి పరిస్థితి స్థిరంగా ఉంచడం, గుండె ఊపిరితిత్తుల పనితీరులో మార్పులు లేక దిగజారే పరిస్థితి, మూర్ఛవంటి పరిస్థితుల ఉత్పన్నమయితే వాటిని నియంత్రించగలిగే తర్ఫీదు పొంది వుండాలి. వీలుంటే తిరిగి మార్చే ముందుల కూడా అక్కడ లభించేటట్టు చూడాలి.

దీర్ఘకాలిక సమస్యలు లేక పరిణామాలు

ఎక్కువ శాతం వరకూ సరియైన పద్ధతిలా గర్భస్రావం చేయించుకున్న స్త్రీ అలా వారి శారీరక లేక జననేంద్రియ వ్యవస్థపై సమస్యలు తలెత్తవు. చాలా తక్కువ మంది స్త్రీలలో ఎవరిలో నైతే గర్భస్రావ సమయంలో తీవ్రమైన సమస్యలు తలెత్తి వున్నచో వారిలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది.

మొదట త్రైమాస గర్భం అన్ని జాగ్రత్తలలో నిపుణులైన వారితో గర్భస్రావం చేయించుకున్నప్పుడు దీని ప్రభావం తరువాత గర్భిణుల మీద ఎంత వరకూ ఉండదు స్థనాల క్యాన్సరుకు గర్భస్రావాలకు ఎటువంట సంబంధం లేదని నిరూపించడం జరిగింది. వారు గర్భస్రావానికి ముందు నుంచే ఈ జబ్బులతో భాధ పడుతూ వుండి వుంటారు. గర్భస్రావం తరువాత కూడా అవి పొడిగింపబడుతూ ఉంటాయి.

గర్భస్రావం తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భస్రావం చేయించుకోబోయే స్త్రీలకు గర్భస్రావం తరువాత వారు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం వుండేది, వాటిని గుర్తించడం ఎలా అనే అంశాలు వారికి అర్ధమయ్యే వాడుక భాషలో లేక వ్రాత పూర్వకంగా తెలియచేయాలి. గర్భస్రావం పూర్తి అయ్యే లోపు గర్భిణీ స్త్రీకి అవసరమైతే తాను కలువ వలసి న వైద్యుడు లేక ఆరోగ్య కార్యకర్త ఎవరు అనే సమాచారం తెలియాలి. వారి ద్వారా తను ఏ ప్రశ్నలకైనా సమాధానం మరియు సహకారం పొందవచ్చును.

ప్రస్తుత పరిస్థితి అంచనా వేయగలగడం :-

కొన్ని సందర్భాలలో గర్భిణీ స్త్రీ మనవి తరువాత గర్భస్రావం చేయడం చట్ట సమ్మతమైనా కూడా కొంత మంది ఆరోగ్య కార్యకర్తలే గర్భస్రావానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వుండవచ్చు. ఇటువంటి సమయంలో ఈ కార్యక్రమాలను అమలు చేసేవారు ఎవరైతే సరియైన రీతిలో సేవలను అందించి అమలు చేయగలరో, అటువంటి వారిని ఎంపిక చేసి వినియోగించుకోవాలి. కావున ఇటువంటి కార్యక్రమాల గురించి ఎప్పుటికప్పుడు సమాచారం తీసుకోవడం ఎంతైనా అవసరం.

జాతీయ ప్రమాణాలను స్థాపించడం పరమైన :-
చట్ట సమ్మతమైన పరిధిలో నాణ్యమైన గర్భస్రావ సేవలు ఉపలభ్యమయ్యోటట్టు అవసరమైన ప్రమాణాలను తయారు చేయాలి. ఈ ప్రమాణాలు గర్భస్రావానంతరం అందించే సేవలు నాణ్యమైనవి అత్యవసరమైన ప్రధాన అంశాలతో కూడా ఉండాలి.

ఈ ప్రమాణాలు ప్రభ్యుత్వ, ప్రభుత్వేతర మరియు ప్రజలు అందించగలిగేట్టు వుండాలి. ఈ ప్రమాణాలలో ఈ క్రింది అంశాలు కూడా జత పరచాలి.

  • గర్భస్రావాలలో రకాలు, వీటిని ఏయే ప్రదేశాలలో నిర్వహించ వచ్చును.
  • అవసరమైన పరికరాలు, సామాగ్రి, మందులు సదుపాయాలు.
  • అవసరమైన పరిస్థితులలో రోగిని నిపుణుల వద్దకు చికిత్సకై తరలించుటకు అవసరమయ్యే ఏర్పాట్లు.
  • గర్భిణీ స్త్రీ యొక్క గర్భస్రావం గురించి ఆమె తీసుకునే నిర్ణయాన్ని గౌరవించడం రహస్యంగావుంచడం. ముఖ్యంగా కౌమార దశలో (యౌవ్వనం) లో వున్న అమ్మాయిల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం.
  • మానభంగం వల్లకలిగిన గర్భవతి యైన స్త్రీల గురించి ప్రత్యేక సదుపాయాలు.
గర్భస్రావం చేసే విధానంలో రకాలు మరియు వాటిని నిర్వహించ గలిగే ప్రదేశాలు

మొదటి త్రైమాస గర్భంలోనే గర్భస్రావ సదుపాయాలు అందించగలిగితే అమ్మలైన వారికి చాలా సౌకర్యంగా వుంటుంది.

ప్రాధమిక కేంద్రాలలో గణనీయమైన (శ్రేష్ఠమైన) ప్రసూతి ఆరోగ్య వసతులు లేని పక్షంలో కనీసం అవసరం మేరకు వారిని నిపుణుల వద్దకు తరలించగలిగే వసతులైనా కల్పించాలి.

సంఘపరమైన:- చిన్నచిన్న సంఘాలలో వుండే ఆరోగ్య కార్యకర్తలు స్త్రీలకు అవాంఛనీయ గర్భాల గురించి, గర్భనిరోధక సాధనాల గురించి మరియూ అసురక్షితమైన గర్భస్రావాలు మరియు గురించి సమాచారం అందించాలి.

ఆరోగ్య కార్యకర్తలు గర్భిణి స్త్రీలకు ఏ విధంగా ఆలస్యం చేయకుండా సురక్షితమైన, చట్టబద్ధమైన గర్భస్రావం చేయించుకొనవచ్చునో మరియు, ఒకవేళ అను రక్షిత గర్భస్రావం వలన అపాయాలు దుష్పరిణామాలు తలెత్తి వుంటే వాటిని తగురీతిలో చికిత్స పొందేందుకు నిపుణుల వద్దకు బదిలీ చేయించగలగాలి.

ప్రాధమిక ఆరోగ్య సదుపాయం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణంగా తర్ఫీదు పొందిన ఆరోగ్య కార్యకర్తలు, మరియు కనీస సదుపాయాలు కల్పించబడి ఉంటాయి. గర్భ కుహరం నుంచి గొట్టాల ద్వారా గర్భస్థ పిండం మరియు తత్సంభంధమైన పదార్థాలు శూన్యత ఏర్పరిచి గుంజి వేసే పద్ధతి, మరియు వైద్యపరంగా గర్భస్రావం చేసే పద్ధతులు ఈ ఆసుపత్రిలనీ నిర్వహించవచ్చును. వీటికి రోగి ఆసుపత్రిలో చేరి ఉండ వలసిన అవసరం రాదు.

జాతీయ ప్రమాణాలు, నియమాలు ఏర్పరచ డం

ఆరోగ్య సిబ్బందిలో దాది, దాయాలు, ఆరోగ్య సహాయ కార్యకర్తలు, వైద్య నిపుణులు ఉండాలి. ముందు నుంచి తర్ఫీదు పొందిన ఆరోగ్య కార్యకర్తలు గర్భిణీ స్త్రీలను యోని ద్వారా పరీక్ష చేసి గర్భిణీ నిర్ధారించగలిగి వుండి మరియు లూపు వంటి గర్భనిరోధక సాధనాలను వేయగలిగి ఉంటే వారికి మొదట త్రైమాస గర్భిణీలలో చేసే శూన్యత ఏర్పడి గర్భకుహరం నుంచి గర్భానికి సంబంధించిన పదార్దాలు గొట్టం ద్వారా గుంజి వేసే పద్ధతిని చేయగలిగేటట్టు తర్ఫీదు ఇవ్వవచ్చును. వైద్య పద్దతి (మాత్రల ద్వారా) గర్భస్రావం చట్టపరంగా అనుమతిపొందిన, మరియు ఉపలభ్ధమైన చోటకూడా సిబ్బంది గర్భస్రావం మాత్రలు ఇవ్వడం మరియు పరిణామాలు తనిఖీ చేస్తూ చికిత్స చేయ వచ్చును.

సాధారణంగా జరిగే కాన్పులు మరియు ఆకస్మిక గర్భస్రావాలకు చికిత్సఇచ్చే చోట అత్యవసర పరిస్థితులలో రోగిని నిపుణుల వరకు వెంటనే తరలించడానికి వసతులు కలిగి ఉండాలి. అవసరానుసారం ఆరోగ్య కేంద్రాలు పనిచేయు వేళల అనంతరం కూడా తర్ఫీదు పొందిన సిబ్బంది పిలిచిన వెంటనే పలికేటట్టు అందుబాటులో ఉండాలి.

జిల్లా ఆసుపత్రి ప్రాధమిక పరిధి

జిల్లా ఆరోగ్య కేంద్రాలలో కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భస్రావాలకు నిబందనముల అనుసారం ఆరోగ్య సేవలదించే అన్ని వసతులు కలిగి ఉండాలి. నిపుణులచే అందించవలసిన సేవల అవసరం చాలా అరుదుగా అవసరం మేరకు వినియోగించుకోవాలి తప్పితే అన్ని సమయాలలో కాదు. ఉదాహరణకు స్కానింగు ( అల్ట్రా సౌండ్ పద్దతి లోపలి అవయవాలకు తనిఖీచేసి ఫోటో తీయాలి స్కానింగు చేయు అవయమును అడ్డముగా విభజించు తువక ఫోటోలు) అనే ప్రత్యేకమైన పరికరాలు ప్రాధమిక త్రైమాసపు గర్భస్రావములకు అనవసరం లేదా దీనివలన ఆరోగ్య కేంద్రాలపై ఆర్ధిక భారం పడుతుంది. రోగికి పూర్తిగా మత్తు కలిగించే పద్ధతి అన్ని వేళలా వాడరాదు. దీనివలన ఆర్ధికంగా భారం మరియు రోగికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భస్రావాలు (ముఖ్యంగా ప్రాధమిక త్తైమాసపు గర్భంలో) ఆసుపత్రిలో వుండే అసవసరం లేకుండా గర్భస్రావానంతరం అదే రోజు ఇంటికి వెళ్ళిపోయేలా చేయడం శ్రేయస్కరం. దీనిమూలాన గర్భిణి స్త్రీలకు సౌకర్యంగా వుండడమేకాకుండా ఆర్ధికపరంగా కూడా అనుకూలంగా వుంటుంది.

ద్వితీయ మరియు తృతీయ పరిధి ఆసుపత్రులు

ఈ ఆసుపత్రులు అన్ని సంధర్బాలలో చట్టపరిధిలో వున్న అన్ని గర్భస్రావాలు చేయగలిగే సదుపాయాలు వుండాలి. అసురక్షితమైన గర్భస్రావానంతరం తలెత్తే అన్ని రకాలైన ఊహించని సమస్యలు అపాయాలకు చికిత్స చేయగలిగి వుండాలి.

వైద్యకళాశాలలో గర్భస్రావం గర్భస్రావానంతరం తీసుకోవలసిన జాగ్రత్తల అపాయాలకు గుర్తించే అంశాల వంటి వాటిలో ఆరోగ్యసిబ్బందికి తర్ఫీదు. వీటిలో నిపుణత సాధించే విధంగా ఏర్పాట్లు ఉండాలి. ఆరోగ్యసిబ్బందికి నిపుణులు తర్ఫీదునివ్వాలి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వారికి తలెత్తే సమస్యలు వాటినెలా ఎదుర్కోవాలి ఏ విధంగా చికిత్స చేయాలి వంటి అంశాలలో క్షుణ్ణంగా అవగాహన కలిగించాలి. అవసరం మేరకు ఏవిధంగా రోగిని నిపుణులు వరకు తరలించాలి.

స్త్రీ ఆరోగ్య సమస్యలు – వధ్యత్వము / సంతాన ప్రాప్తి లేకుండుట.

1. వంధ్యత్వము అనగా నేమి ?

వంధ్యత్వము అనేది జననేంద్రియ వ్యవస్ధకు వచ్చే వ్యాధి దీనివల్ల మానవ శరీరము యొక్క ముఖ్యమైన కార్యమైన గర్భధారణ బలహీనపడుతుంది.

గర్భధారణ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ మరియు ఇది చాలా అంశాలపై ఆధారపడి వుంటుంది. ఇది పురుషుని ఉత్పత్తి చేయబడిన ఆరోగ్యమైన శుక్రకణము (బీజకణము) మరియు స్త్రీ చే ఉత్పత్తి చేయబడు ఆరోగ్యకారమైన అండము పై ఆధారపడి ఉంటుంది. శుక్రకణము అండమును చేరుటకు అండనాళములు (గర్భాశయానికి ఇరువైపులా వుండే నాళములు) తెరుచుకుని వుండాలి. శుక్రకణము అండమును కలిసినప్పుడు దానిని ఫలదీకరించే యోగ్యత కలిగి వుండాలి. ఫలదీకరణం చెందిన అండము స్త్రీ యొక్క గర్భాశయంలో నాటుకొనగలుగుట ఫలదీకరణం చెందిన అండము నాణ్యత కలిగి వుండడం పురుషునకు సంభోగ దుర్భలత్వము లేకుండుట తుదిగా గర్భము సంపూర్ణంగా ప్రసూతి వరకూ వృద్ధి చెందడానికి , పిండము ఆరోగ్యంగా వుండాలి. మరియు స్త్రీ యొక్క జననేంద్రియ హార్మానులు పిండము అభివృద్ధి చెందడానికి సరిపడే వాతావరణాన్ని కల్పించడానికి సరిపడా వుండాలి. వీటిలో ఏ ఒక్క అంశంలో నైనా లోపాలు వున్నట్టయితే వంధ్యత్వము కలుగవచ్చును.

2. వంధ్యత్వము కలుగడానికి కారణాలు ఏవి ?

పురుషులలో వంధ్యత్వానికి కారణం శుక్రకణాలు అంత తక్కువగా లేక పూర్తిగా ఉత్పత్తి కాక పోవడమే. కొన్ని సందర్భాలలో శుక్రకణాలు వైకల్యంతో ఉంటాయి. ఇవి అండాన్ని చేరేలోపే మృతి పొందుతాయి. స్త్రీలలో వంధ్యత్వానికి ముఖ్య కారణం అండోత్పత్తి కి సంబంధించిన సమస్యలు.

ఇతరకారణాలు అండాశయ నాళీలు ఇతర కారణాల వలన మూసుకొని పోవడం. పుట్టుకతో వచ్చే గర్భసంచి నిర్మాణ లోపాలు గర్భ సంచికి వచ్చే గడ్డలు, పదేపదే కలిగే గర్భస్రావాలు.

3. విట్రో ఫలధీకరణం లేదా టెస్ట్ ట్యుబ్ ద్వారా పిల్లలు పుట్టడం అంటే ఎమిటి ?

జ. స్త్రీ గర్భకుహరంలో కాక అండం వేరొక చోట ఫలధీకరణం చెందడాన్ని విట్రో ఫలధీకరణం అంటారు.
ఈ విట్రో ఫలధీకరణం లో శస్త్ర చికిత్స ద్వారా అండాలను అండాశయం నుంచి వేరు చేసి శుక్రకణంతో శరీరం వెలుపల వేరే పాత్రలో కలుపుతారు. 40 గంటల తరువాత, అండము శుక్రకణంతో ఫరదీకరణం విభజన చెందుతూ వుందా లేదా పరీక్షించుతారు. ఈ ఫలదీకరణం చెందిన అండాన్ని యొక్క గర్భకుహరంలో నాటుతారు. దీనిలో అండాశయ నాళాల పాత్ర వుండదు. ఈ పక్రియ ముఖ్యంగా ఏ ఇతర కారణాల వల్లనైనా అండాశయ నాళాలు చెడిపోయినప్పుడు పని చేస్తుంది.

కుటుంబ నియంత్రణ పద్ధతులు

కుటుంబ నియంత్రణ పద్ధతులు

దీనికి సంబంధించిన సమాచారం
మన దేశంలో చాలామందికి కుటుంబనియంత్రణ అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ అమి మాత్రమే తెలుసు. అందుకే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని ఆపరేషన్ చేయించుకుంటారు. కొద్దిమందికి మాత్రం మాత్రల గురించి తెలుసు. ఒకవేళ ఎన్నోరకాల పద్ధతుల గురించి తెలిసినా వాటిపల్ల ఉండే సాధకబాధకాలు చాలామందికి తెలియదు. పత్రికలో, టివీలో నిరోధ్ గురించి ప్రకటనలు చేసే వాళ్ళుంటారు. కానీ, ఎలా వాడాలో ఎవరు చెప్తారు? మిగతా అన్ని సాధనాలు కూడా ఇలాగే ఏమీ అర్థం కాని విషయాలుగా ఉంటాయి. ఒకవైపు టివి, రేడియోలు, వ్యాపార ప్రకటనలు అన్నీ కుటుంబ నియంత్రణ గురించి తెలియచేస్తున్నాయి.

పద్ధతులు
ఇందులో మూడు రకాలున్నాయి.

  1. మాత్రలు
  2. గర్భాశయంలో అమర్చే లూప్ (ఐ.యు.డి. లేదా కాపర్ టి)
  3. వీర్యకణాలకు అడ్డుపడే సాధనాలు (నిరోధ్)

మాత్రలు (పిల్స్)
మాత్రలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అన్ని నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలలోను ఉచితంగా ఈ మాత్రల్ని పంచి పెట్టడం జరుగుతోంది. టి.వీ.లో మాలా.డి. ప్రకటల్ని అందరూ చూసే ఉంటారు. అయితే అసలు ఈ మీత్రలు ఏమిటి ఎలా పని చేస్తాయి వాటితో వచ్చే ఇబ్బందులు, ఫలితాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. ఇవి వాడాలని నిర్ణయించుకున్నవాళ్ళు అనుభవం ఉన్న డాక్టరు దగ్గర మొత్తం సమాచారం తీసుకోవాలి.

మాత్రల వలన కొన్ని సాధారణ ఫలితాలు
మాత్రలు కొన్ని రకాలు ఇబ్బంది, బాధ కలిగించేవి ఉంటాయి. కొంతమందికి కడుపులో తిప్పటం తప్ప వేరే సమస్యలుండవు. మాత్రలు మానేయగానే ఇబ్బందులు పోతాయి. కొన్నిసార్లు బ్రాండ్ మారిస్తే (డాక్టరు సలహాతో మాత్రమే) సమస్యలు తగ్గచ్చు. తలనొప్పి, వికారం, తల తిరగడం, రొమ్ముల్లో నొప్పి, కాళ్ళనొప్పులు, వంటి లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. అందరికి ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. కొన్ని సార్లు చికాకు, నిస్పృహ కలిగించే గుణం మాత్రలకుంది. మాత్రలు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత డాక్టరుతో పూర్తి పరీక్ష చేయించుకోవటం అవసరం. డాక్టరు ప్రిస్ర్కిప్షన్ తోటి మందులు కొనాలే గాని, మన ఇష్ట ప్రకారం కొనకూడదు.

రక్తపోటు, డయాబెటిస్, రక్తం గడ్డ కట్టే సమస్యలున్న వాళ్ళు ఏ మాత్రం మాత్రలు వేసుకోకూడదు.

మాత్రలలో ఎన్నోరకాలున్నాయి. డాక్టర్ని అడిగి మన శరీరానికి సరిపడే పద్ధతిని ఎన్నుకోవటం మంచిది. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రలు మానేసి రెండు మూడు నెలలు గర్భం రాకుండా నిరోధ్ వంటి పద్ధతులు వాడి తరువాత గర్భం వచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పిండం మీద మాత్రల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

పాలిచ్చే తల్లులు ఈ మాత్రల్ని వాడకూడదు. పాలతో మందు పిల్లల శరీరాలకు వెళ్తుంది.

ఇక్కడ సాధారణంగా దొరికే మాత్రలు కొన్ని ప్యాకెట్లలో 21 ఉంటాయి. రోజుకి ఒకటి చొప్పున 21 రోజులు వాడి చివరి 7 రోజులూ మానేయాలి. ఈ 7 రోజుల తరువాత బహిష్టు వస్తుంది. 28 మాత్రలున్నా 21 రోజులు వాడి చివరి 7 రోజుల మాత్రలు వేరే రంగులో ఉంటాయి. అవి ఐరన్ గోలీలుంటాయి. బహిస్టు వచ్చిన అయిదవ రోజు నుంచీ మాత్రలు మొదలు పెట్టమని చెప్తారు. చాలా రకాలు ప్రతి రోజూ ఒకే టైముకి వేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు వేసుకుంటే గుర్తుగా ఉంటుంది. ఒక రోజు మాత్ర మర్చిపోతే తరువాత రోజు రెండు మాత్రలు వాడాలి. కాని మూడు రోజులు మర్చిపోయారనుకోండి మూడు మాత్రలు వేసుకోవద్దు. పూర్తిగా మానేసి ఒక వారమైన తర్వాత కొత్త ప్యాకెట్ మొదలు పెట్టడం మంచిది. ఆ వారం రోజులు నిరేధ్ వంటివి వాడాలి.

కాపర్ టీ
ఇది అతి సన్నని రాగి తీగతో చేసిన (T) ఆకారంలో ఉండే సాధనం. శిక్షణ పొందిన నర్సుకానీ, డాక్టరుకానీ దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. దీనికి రెండు దారాల వంటివి ఉంటాయి. అవి యోనిలోకి వేళ్ళాడతాయి. మనం వేలితో తడిమి చూసి సరైన స్థానంలో ఉందా లేదా అని చూడొచ్చు. సాధారణంగా దీన్ని లూప్ అని పిలుస్తారు.

దీనివల్ల కలిగే ఫలితాలు
ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాషయపు గోడలకు అంటుకోకుండా చేస్తుంది. ఇది ఉన్నంతకాలం సంతానం కలుగదు. మీరు ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు, సాధనాన్ని తేలికగా తీసివేయించుకోవచ్చు. ఇది 3 నుండి 5 సం.ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

దీనితో వచ్చే ఇబ్బందులు
చాలామందికి దీనితో సమస్యలుండకపోవచ్చు. కొందరికి పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. వేసిన కొత్తలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నొప్పి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. నూచికి ఎనబైమందికి ఏ బాధా ఉండదని డాక్టర్లు చెప్తారు. కొంతమందికి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువ రావచ్చు. ఈ లక్షణాలన్ని మొదటినెలల్లో ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం డాక్టరుతో పరీక్ష చేయించుకొని లూప్ సరైన స్థానంలో ఉందా లేదా తెలుసుకోవాలి. నూచికి పదిమందిలో ఇది వదులై గర్భాశయం నుంచి బయటకు వచ్చే ప్రమాదముంది. అందుకే స్నానం సమయంలో దారాల్ని తడిపి చూడాలి. బహిష్టయినప్పడు కూడా పరీక్షచేయాలి. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఇది మార్పించుకుంటే మంచిది. యోనిలో, గర్భాషయంలో ఇన్ ఫెక్షన్ ఉంటే ఇది వాడకూడదు. పొత్తికడుపులో నొప్పి, కడుపు తిప్పడం, నీరసంగా అనిపించడం, కలైక జరిగినప్పుడల్లా నొప్పి రావటం జరిగితే డాక్టర్ని సంప్రదించాలి.

ఇది ఎక్కడ దొరుకుతుంది
నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాపర్ టీ ఉచితంగా దొరుకుతుంది. బయట కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చవుతుంది. డాక్టరుకి కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అత్యంత నమ్మకమైన గర్భనిరోధక సాధనాలలో ఒకటి అని పరిశోధనలు చెప్తున్నాయి.

నిరోధ్ / కాండోమ్
ఇది లేటెక్స్ రబ్బరుతో చేసిన తొడుగు. పురుషాంగం స్తంభించి నిటారుగా అయినప్పుడు మాత్రమే ఇది తొడగటానికి వీలవుతుంది. కలయికలో పురుషాంగం నుంచి వచ్చే వీర్యం యోనిలో పడకుండా ఇది ఆపి ఉంచుతుంది.
సెక్స్ కలయిక సమయంలో అంగం నిటారుగా అయిన వెంటనే నిరోధ్ను తొడగాలి. తొడుగు చివర కొద్ది భాగం వదులుగా వదిలేయాలి. వీర్యం అందులో పడ్డప్పుడు స్థలం లేకపోతే అది పగిలిపోయే ప్రమాదముంది. అంగాన్ని బయటకి తేసేటప్పుడు, నిరోధ్ని చేత్తో పట్టుకోవాలి. లేకపోతే తొడుగు జారిపోయి వీర్యం యోనిలో పడే ప్రమాదముంది.

దీనివల్ల ఉపయోగాలి
అన్ని సాధనాల కంటే ఇది చవక. సులభంగా దొరుకుతుంది. వాడటం తేలిక. మనమే అన్ని బాధలూ పడాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతిలో బాధ్యత మగవాళ్ళదే. కాకపోతే మనం వాళ్ళమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన కంట్రోలులో ఉండే సాధనం కాదు. దీనివల్ల ఇన్ ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఎయిడ్స్ రాకుండా కూడా కాపాడ్తుంది.

అందుబాటు
ఏ మందుల దుకాణంలోనైనా, జనరల్ స్టోర్స్ లోనైనా కొన్ని పాన్ ఫాషులలో కూడా దొరుకుతుంది. సూపర్ బజారులో దొరకవచ్చు. కుటుంబ సంక్షేమ కేంద్రాలలో, నగర ఆరోగ్య కేంద్రాలలో ఇది ఉచితంగా ఇస్తారు.

సమర్ధత
నూచికి 97 శాతం ఇది పనిచేస్తుంది. చాలాసార్లు ఎలా వాడాలో తెలియక పొరపాటు చేస్తే అది 80-85 శాతం వరకు తగ్గచ్చు. పొరపాట్లు జరగకుండా చూసుకుంటే నూచికి నూరు సాతం ఫలితం ఉండే సాధనం ఇది.

శాశ్వత పద్ధతులు
ఈ పద్ధతులే కాకుండా పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చేసే ఆపరేషన్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చేస్తే ట్యూబెక్టమీ, మగవాళ్ళకి చేస్తే వేసెక్టమీ అంటారు. నో స్కాల్ పెల్ వాసక్టమీ (కత్తిగాటులేని), డబుల్ పంక్చర్ లేప్రొస్కోపి. ఈ ఆపరేషన్లు సాధారణంగా ప్రసవం కాగానే ఆడవాళ్ళకు చేయడం జరుగుతుంది. మగవాళ్ళెప్పుడైనా చేయించుకోవచ్చు. ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి చేయటం సులభం.

అనుకోని పరిస్థితులలో అక్కరలేని గర్భం వస్తే తీసేయించుకోవటం ఎలా ?
(మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్నీ)
చాలాసార్లు విషయం తెలీక, లేదా జరిగిపోయిన దాన్ని కప్పి పెట్టే ప్రయత్నంలో, లేక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దండనను ఎదుర్కొనే ధైర్యం లేక అన్నింటికీ మించి చేతిలో చాలినంత డబ్బు లేక చాలా మంది నా వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుని ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. గర్భం రాకుండా చూసుకునే పద్ధతుల గురించి తెలియక పోవటం దీనికి సగం కారణం. అందుకే గర్భస్రావాన్ని చాలామంది ఒక కుటుంబ నియంత్రణగా వాడటం ఇప్పటికి జరుగుతోంది.
మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయిన వైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థతి కులం, జాతి, వర్గం అని విదాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం.
గర్భం తీసేయించుకోవటానికి ఒక చట్టం అనేది ఉన్నా చాలామంది అవమానాల పాలవుతామ్మన భయం కొద్ది, అక్రమ గర్భం అని ఎగతాళి చేస్తారన్నభయం కొద్ది నాటు వైద్యుల దగ్గరకు పోతారు.

ఈ చట్టం ఏమిటో తెల్సుకుందాం

ఆరోగ్యానికి సమస్యలుంటే గర్భం వస్తే, డాక్టర్లు తీసేయమని సలహా ఇవ్వచ్చు.
ఇబ్బుడొచ్చే కొత్త సంకేతిక పరిజ్ఞానంతో పుట్టబోయే బిడ్డకు లోపాలుండే అవకాశం ఉందని తెలిస్తే
బలాత్కారానికి గురైన అమ్మాయికి గర్భం వస్తే
పెరుగుతున్న గర్భం తల్లి మానసిక క్షోభకు గరి అయేలా చేస్తే
సాంఘిక పరిస్థితులు పెరుగుతున్న గర్భానికి అనుకూలించక పోతే
కుటుంబ నియంత్రణ పద్ధతి పనిచేయక గర్భం వస్తే, 18 సం. రాకముందే గర్భం వస్తే కూడా తీసేయించుకోవచ్చు.

ఈ పరిస్థితులలో ఉన్న వారెవరైనా గర్భం తీసేయించుకునే హక్కు ఉంది. గర్భం వచ్చిన మొదటి దశలో ఉంటే నాలుగున్నర వారాల నుంచి 12 వారాల వరకు చేయించుకోవటం సులభం. అతి చిన్న వయస్సులో శరీరం సరిగా ఎదగని పరిస్థితిలో గర్భం వస్తే పిల్లల్ని కనటం కంటే గర్భం తీసేయించుకోవటం మంచిది.
చాలా మంది గర్భం తీసేయించుకుంటే మళ్ళీ రాదని ఇతరులు భయ పెట్టడం జరుగుతుంది. అర్హత గల వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటే ప్రమాదాలు ఎదురుకావు. గర్భస్రావం చేయించుకోగానే పిల్లల్ని కనకుండా మన శరీరానికనువుగా ఉండే సాధనం వాడాలి.

అసలు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి
సౌకర్యాలు సరిగ్గా అందుబాటులో లేవని అనుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళి బోలేడు ఖర్చు చేసుకుంటారు. నిర్దేశించిన నగర వైద్యశాలలో ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుందని ఇప్పటికి చాలా మందికి తెలియదు.

ఏం చెయ్యాలో ఎప్పుడు నిర్ణయించాలి ?
మనకు నెల తప్పిందని అనుమానం రాగానే ముందు తేదీలు లెక్కలు కట్టాలి. డాక్టర్లు ఆఖరి ముట్టు ఎప్పుడు మొదలైందని ఆ రోజు నుంచి లెక్కలు కడతారు. చివరిసారి అయి నెల మీద రెండు వారాలయిందనుకుంటే డాక్టర్ల లెక్కలో ఆరువారాలైనట్లు లెక్క. గర్భం తేసేయాలనుకుంటే తొందరగా నిర్ణయించుకోవాలి. తొందరగా చేయించుకొనటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం గడిచే కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి, మనసుకు బాధ కూడా.

అట్లా అని ఆరువారాలలోపు తొందరపడి చేయించుకుంటే లోపల పిండం తగినంత సైజుకు పెరిగక శుభ్రం చేసినప్పుడు పూర్తిగా బయటికి రాకపోయే అవకాశం ఉంది. మిగిలిపోయిన ముక్కలు, కుళ్ళి, ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

అందుబాటులో ఉన్న గర్భ స్రావ పద్ధతులు
ఇంతకు ముందే గర్భం రావటం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఫలదీకరణ జరిగిన అండం గర్భం లోపల పొరకు అంటుకుని పెరగటం మొదలవుతుంది. చివరి బహిష్టు అయిన ఆరు వారాలకు దాని సైజు ఒక బఠాణీ గింజ అంత ఉంటుంది. దీనితో పాటు మాయ కూడా పెరుగుతుంది.

ఆధునిక పద్ధతులలో గర్భ స్రావం
పదినిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మనం కంగారు పడకుండా రిలాక్సవటం పనిని సులభం చేస్తుంది.
అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచ ిఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.

సంక్రమణ వ్యాధులు

హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది
  • హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వ్యక్తితో, లైంగిక సంబంధం వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో, నూటికి 85 మంది లైంగిక సంబంధం ద్వారా తెచ్చుకున్న వారే.
  • హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే ఈ వ్యాధి వారికి సోకుతుంది.
  • హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన తల్లి నుండి పుట్టే బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
  • ఈ విధంగానే కాక హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వ్యక్తికి వాడిన సూది సరిగా మరగ బెట్టకుండా ఇతరులకు వాడితే, వారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది.
హెచ్.ఐ.వి./ఎయిడ్స్ ఎలా వ్యాపించదు
  • తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా లేదా పీల్చే గాలి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి రాదు.
  • కలసి భోజనం చేయడం, కలసి నివాసం ఉండడం వలన ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి రాదు.
  • దోమ కాటు ద్వారా వ్యాపించదు.
ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్.ఐ.వి. ఏ విధంగా సంక్రమించదు
  • కలిసి జీవించడం వల్ల
  • కలిసి పనిచేయడం వల్ల
  • కలిసి కూర్చోవడం వల్ల
  • కలిసి ఆడడం వల్ల
  • కలిసి తినడం వల్ల
  • కరచాలనం (షేక్ హ్యాండ్) వల్ల
  • ఒకే – మూత్రశాలలను (టాయిలెట్లను) ఉపయోగించడం వల్ల హెచ్.ఐ.వి. సంక్రమణం జరుగదు.
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ...
  • జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి.
  • వివాహానికి ముందుగాని, వివాహం తర్వాతగాని విచ్చల విడి శృంగారం అత్యంత ప్రమాదం, సుఖవ్యాధులకు దారి తీయవచ్చును.
  • ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే, గుర్తించబడిన బ్లడ్ బ్యాంకులలో నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి.
  • క్షౌరశాలలో ప్రతి ఒక్కరికి కొత్త బ్లేడు వాడటం మంచిది.
  • సుఖవ్యాధులు ఉన్నవారు హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ కు గురి అయ్యే అవకాశం పదిరెట్లు ఎక్కువ అని తెలుసుకోండి
సుఖవ్యాధులను గుర్తించడం ఎలా...
  • యోని లేక అంగం నుండి రసికారుట, అంగంపై పుండ్లు, గజ్జలలో వాపు మరియు మూత్రం పోయునప్పుడు మంట ఉన్నచో సుఖవ్యాధి అని అనుమానించి డాక్టరును సంప్రదించండి.
  • ఆడవాళ్లలో పొత్తికడుపు నొప్పి ఉన్నచో అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకొనవలెను.
  • సుఖవ్యాధులను మందులతో నయం చేయవచ్చును మరియు నిరోధ్ తో నివారించవచ్చునని తెలుసుకోండి.
హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకితే ఏమవుతుంది ?
  • హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ వ్యాధి మన శరీరంలోని రోగాలను నిరోధించే శక్తిని నాశనం చేస్తుంది.
  • శరీరంలో, రోగాలను నిరోధించే శక్తి (వ్యాధి నిరోధక శక్తి) బాగా తగ్గినప్పుడు. మామూలుగా వచ్చే వ్యాధులు కూడా తగ్గకుండా, బాగా ముదిరి ప్రాణాపాయం కలుగుతుంది.
హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వారు ఏం చెయ్యాలి ?
  • ఈ వ్యాధి సోకిన వారు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు, అలవాట్లు పాటిస్తే వ్యాధి వేగంగా ముదరకుండా చూసుకోవచ్చు.
  • ఆందోళన పడకుండా, ప్రశాంతంగా ఉండడం, ధ్యానం, యోగాసనాలు చేయడం.
  • వేళకు మంచి ఆహారం తీసుకోవడం.
  • కనీస శారీరక వ్యాయామం చేయడం.
  • క్షయ, సుఖ వ్యాధులు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం.
  • సారా, మత్తు పదార్థాలు పూర్తిగా మానివేయడం.
  • ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడానికి తప్పనిసరి అయితే, సంభోగ సమయంలో (వ్యాధి సోకినది స్త్రీకైనా, పురుషునికైనా) మగవారు నిరోధ్ ధరించడం చేయాలి.
ప్రపంచ ఎయిడ్స్‌ దినం

అవగాహనే అసలైన అస్త్రం

డా|| రాజా ప్రసన్నకుమార్‌

అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌.. ఆధునిక ఉపద్రవం!

ఇది వ్యక్తులనూ, కుటుంబాలనే కాదు.. ఏకంగా దేశాలనే కబళించేస్తోంది. ఎన్నో జీవితాలు కావికలమైపోతున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే దీనికి సరైన, అసలైన పరిష్కారం.

అరక్షిత లైంగిక సంబంధాలు

మన రాష్ట్రంలో ప్రధానంగా హెచ్‌ఐవీ వ్యాప్తి ఈ అరక్షిత లైంగిక సంబంధాల ద్వారానే జరుగుతోంది. నిజానికి ఈ మార్గంలో హెచ్‌ఐవీ సంక్రమిచే రిస్కు 0.1-0.3% మాత్రమే. అయినా అదే మన దగ్గర పెను శాపంగా పరిణమిస్తోందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అరక్షిత శృంగారంలో ఇది పురుషుల నుంచి స్త్రీలకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. కారణం: స్త్రీలలో యోని మార్గం అతి పల్చటి జిగురు పొరతో కప్పి ఉండటం, స్త్రీ జననాగంలో హెచ్‌ఐవీకి అనువైన కణాలు ఎక్కువగా ఉండటం, లైంగిక చర్య సమయంలో స్త్రీ జననాంగాల్లో సూక్ష్మమైన గాయాలవుతుండటం, వీర్యం స్త్రీశరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండటం.. వీటన్నింటి వల్లా స్త్రీలకు హెచ్‌ఐవీ ముప్పు మరింత ఎక్కువ. వీటికి జననాంగ, సుఖవ్యాధులు కూడా తోడైతే హెచ్‌ఐవీ రిస్కు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జననాంగాల్లో పుండ్లు, స్రావాలు, తెల్లమైల, పొత్తికడుపు నొప్పి, గజ్జల్లో గడ్డలు, పులిపిరులు ఇలాంటివి ఉన్నప్పుడు అరక్షిత శృంగారం ద్వారా హెచ్‌ఐవీ సోకే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే సుఖవ్యాధులకు చికిత్స తీసుకోవటం, భాగస్వామిని కూడా చికిత్సలో భాగం చెయ్యటం చాలా అవసరం. వీటికి చికిత్స అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా కూడా లభిస్తుంది. కండోమ్‌ వాడకం, వ్యక్తి అలవాట్లు, ప్రవర్తనల్లో మార్పుతేవటం.. ఈ రెండూ ముఖ్యమైన నివారణ చర్యలు!

తల్లిదండ్రుల నుంచి బిడ్డకు

తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ మూడు రకాలుగా సంక్రమించవచ్చు. 1. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు 2. ప్రసవ సమయంలో 3. తల్లిపాల ద్వారా. వాస్తవానికి 100 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ తల్లులకు 70 మంది బిడ్డలు హెచ్‌ఐవీ లేకుండానే పుడుతున్నారు. 30 మందికి మాత్రం హెచ్‌ఐవీ సంక్రమించే అవకాశం ఉంటోంది. ఈ ముప్పును మరింతగా తగ్గించేందుకు గర్భిణులకు 'నివిరపిన్‌ ప్రొఫైలాక్సిస్‌' విధానం మరింత మేలు చేస్తుంది. హెచ్‌ఐవీ పాజిటివ్‌ గర్భిణులకు ప్రసవ సమయంలో నివిరపిన్‌ 200 ఎంజీ మాత్ర ఒకటి ఇస్తారు. పుట్టిన బిడ్డకు 72 గంటల్లోపు నివిరపిన్‌ టానిక్‌ ఒక్కసారి తాగిస్తారు. ఇలా చేస్తే హెచ్‌ఐవీ సంక్రమించే అవకాశం 30 శాతం నుంచి 9-11 శాతానికి పడిపోతుంది. ఇక తల్లిపాలు ఇవ్వవచ్చా? లేదా? అన్నది చాలా వరకూ తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేస్తారు.

కలుషిత సూదులు, సిరంజీలు

మన రాష్ట్రంలో కలుషిత సూదులు, సిరంజీల ద్వారా హెచ్‌ఐవీ సోకటమన్నది 0.32 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకూ సూదులు/సూదిమందులు కాకుండా వీలైనంత వరకూ వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడుకోవటం ఉత్తమం. ఇంజక్షన్లు తప్పనిసరి అయినట్లయితే.. కొత్త సూదులే వాడటం, వాడిపారెయ్యటానికి వీలైన సిరంజీలను ఎంచుకోవటం అవసరం. రక్తపరీక్షలకు వెళ్లినప్పుడు కూడా కొత్త సూదులే వాడేలా చూసుకోవటం మంచిది.

రక్త మార్పిడి

హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి రక్తాన్ని పరీక్ష చెయ్యకుండా ఆపద సమయంలో మరొక వ్యక్తికి మార్పిడి చేసిన పక్షంలో వారికి హెచ్‌ఐవీ సోకే అవకాశం నూరు శాతం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు, లైసెన్సింగ్‌ విధానం, తప్పనిసరి హెచ్‌ఐవీ+ పరీక్షల వల్ల ఈ మార్గం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే అవకాశం బాగా తగ్గింది. రక్తం దానం చేసే ప్రతి దాత రక్తాన్నీ ముందుగా- హెచ్‌ఐవీ, హెచ్‌బీవీ, మలేరియా, సిఫిలిస్‌, హిమోగ్లోబిన్‌ శాతం పరీక్షలు చేసిన తర్వాతే మార్పిడి చెయ్యాలి.

హెచ్‌ఐవీ నుంచి ఎయిడ్స్‌కు!

హెచ్‌ఐవీ క్రిమి ఒంట్లో చేరగానే జరిగే పరిణామాలు చాలా కీలకం. మన శరీరంలో రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైనవి 'సీడీ4' అనే కణాలు! హెచ్‌ఐవీ ఒంట్లో చేరగానే ముందుగా ఈ కణాలను లోబరుచుకుంటుంది. ఆ తర్వాత.. ప్రతి సీడీ4 కణం నుంచీ దాదాపు 250-500 వరకూ కొత్త వైరస్‌లను తయారుచేస్తుంది.. ఈ క్రమంలో సీడీ4 కణం చనిపోతుంది. ఇలా సుమారు 10-15 సంవత్సరాల కాలంలో సీడీ4 కణాలు తీవ్రంగా దెబ్బతిని, వాటి సంఖ్య తగ్గిపోయి, వైరస్‌ పెరిగిపోయి.. హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి.. ఎయిడ్స్‌ దశలోకి వెళ్లిపోతారు.

తొలిదశలో హెచ్‌ఐవీ యాంటీబోడీ పరీక్షలు చెయ్యటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్షలో కచ్చితంగా ఫలితం తెలియాలంటే 6 వారాల నుంచి 6 నెలల 'విండో పీరియడ్‌' కాలం ఆగాల్సి ఉంటుంది. 'పీసీఆర్‌' పరీక్ష ద్వారా హెచ్‌ఐవీ ఉనికి ఇంకా ముందే గుర్తించవచ్చు.

ఎయిడ్స్‌ దశలో
  • పదిశాతం బరువు తగ్గిపోవటం
  • తరచూ విరేచనాలు కావటం
  • తరచూ జ్వరం రావటం ముఖ్య లక్షణాలు!

ఇవే కాకుండా ఇంకా రకరకాల 'అవకాశ వ్యాధులు' వచ్చే ముప్పు కూడా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో ఊపిరితిత్తుల్లో క్షయ వ్యాధి చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తులంతా తరచూ కళ్లె పరీక్ష చేయించుకోవటం ద్వారా క్షయ రాకుండావెంటనే జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. అలాగే క్షయ వ్యాధిగ్రస్తులు కూడా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవటం వల్ల ఈ వ్యాధులు ముదరకుండా చూసుకోవచ్చు.

  • హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తులు 6 నెలలకు ఒకసారి సీడీ4 పరీక్ష చేయించుకోవటం ద్వారా సమస్య ఎయిడ్స్‌కు దారితీస్తోందేమో తెలుసుకోవచ్చు. సాధారణ ఆరోగ్యవంతుల్లో సీడీ4 కణాల సంఖ్య 800-1500 వరకూ ఉంటుంది. హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తిలో ఈ సంఖ్య 250 కన్నా తగ్గినట్లయితే ఎయిడ్స్‌ దశలోకి వెళుతున్నట్టుగా గుర్తించాలి.
  • ఎయిడ్స్‌ దశలోని వ్యక్తి ఆయుర్దాయాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 'ఏఆర్‌టీ సెంటర్ల' ద్వారా ఉచితంగా మందులు అందజేస్తోంది. వీటిని ఎయిడ్స్‌ బాధితులు కచ్చితంగా వాడటం ద్వారా ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవచ్చు.
ఇలా వ్యాపించదు!
  • హెచ్‌ఐవీ క్రిమి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, స్పర్శ ద్వారా, వస్తువుల ద్వారా, దోమల ద్వారా వ్యాప్తి చెందదు!
  • చాలామంది దోమల ద్వారా హెచ్‌ఐవీ ఎందుకు వ్యాపించదని ప్రశ్నిస్తుంటారు. హెచ్‌ఐవీ క్రిమి మనుషుల్లోనూ, చింపాంజీల్లోనూ తప్పించి మరే జీవిలోనూ బతకలేదు. కాబట్టి ఇది దోమల ద్వారా వ్యాపించే అవకాశం లేదు.
  • హెచ్‌ఐవీ ఉన్న శారీరక ద్రవం ఏదైనా- బయటి వాతావరణంలో ఎండిపోయినట్త్లెతే.. ఆ ద్రవంలో ఉన్న హెచ్‌ఐవీ కూడా చనిపోతుంది
సంక్రమించేదెలా?

ఎయిడ్స్‌ కారక వైరస్‌.. ప్రధానంగా 'హెచ్‌ఐవీ పాజిటివ్‌' వ్యక్తుల శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ శారీరక ద్రవాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 1. పురుషుల వీర్యం 2. స్త్రీల యోని ద్రవాలు 3. రక్తం 4. ఉమ్మనీరు 5. మస్తిష్క నీరు 6. తల్లిపాలు 7. ఊపిరితిత్తుల నీరు 8. పొట్ట నీరు. కాబట్టి పాజిటివ్‌ వ్యక్తుల శారీరక ద్రవాలు తమకుసోకకుండా, తగలకుండా చూసుకోవటం ముఖ్యం. సాధారణంగా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతోందంటే:

  • అరక్షిత లైంగిక సంబంధాలు (94.69%)
  • తల్లిదండ్రుల నుంచి బిడ్డకు (4.13%)
  • కలుషిత సూదులు/సిరంజిలు (0.32%)
  • కలుషిత రక్త మార్పిడి (0.3%)

ఆధారం: ఈనాడు

సుఖరోగము, లైంగిక వ్యభిచార రోగము – సిఫిలిస్

సుఖరోగము అనగా నేమి ?

సుఖరోగము అనేది అసురక్షిత లైంగిక సంపర్కం వలన ట్రపనీమా పారిడమ్ అను సూక్ష్మజీవి వల్ల సంక్రమించే జబ్బు.

ప్రజలకు ఇది ఏ విధంగా సోకుతుంది ?

ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సుఖవ్యాధి పుండుతో నేరుగా సంపర్కం కలగడం మూలంగా వ్యాపిస్తుంది. ఈ పుండ్లు ముఖ్యంగా పురుషాగం, బాహ్య జననేంద్రియాలు, యోని మరియు మూత్రాశయం పై ఏర్పడుతాయి. ఈ పుండ్లు పెదవులమీద మరియు నోటి లోపలి భాగంలో కూడా ఏర్పడవచ్చు. సూక్ష్మజీవి యోని, ఆసనము లేదా నోటి సంభోగం ద్వారా వ్యాప్తి చెందుతుంది. గర్భస్ధశిశువుకు వ్యాప్తి చేసే అవకాశం వుంటుంది. ఈ సుఖరోగం ఈ క్రింది కారణాల వల్ల వ్యాప్తి చెందదు.

  • ఒకే మల మూత్రవిసర్జన స్థలం ఉపయోగించడం మూలంగా
  • తలుపు గడియలు
  • ఈత కొలనులు
  • భోజనానికి ఒకే కంచాలు వాడడం. స్నానాల తొట్టి, బట్టలు వంటివి వ్యాధి గ్రస్తులైన వారితో పంచుకొన్నప్పుడు వ్యాధి సొకే ప్రమాదం వుండదు.

యౌవనంలో వున్న వారిలో కనపడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి ?

ఈ వ్యాధి గ్రస్థులైన వారిలో చాలా సం,, వరకూ లక్షణాలు కనబడవు.
ప్రాధమిక దశ : సుఖ రోగం యొక్క ప్రాధమిక దశలో ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ పుండ్లు ఎక్కువ శాతం జననేంద్రియాలు పై కనబడుతాయి. రోగి వ్యాధి ,సంక్రమించిన దినం నుంచే మొదట లక్షణం అంటే పుండ్లు వంటివి బయటబడడానికి ముందు సాధారణంగా చిన్నగా, గుండ్రంగా గట్టిగా నొప్పి లేనిదిగా వుంటుంది. ఇవి సుఖరోగం శరీరంలో ప్రవేశించిన కేంద్రంలో ఏర్పడుతాయి. ఇవి 3 నుంచి 6 వారాల వరకూ వుండి వాటంతటవే మానిపోతాయి. కానీ కొన్ని సందర్భాలలో రోగ నిరోధక శక్తిని బట్టి ఒకవేళ తగు విధంగా చికిత్స తీసుకోని పక్షంలో సోకిన వ్యాధి రెండవ దశకు చేరుకుంటుంది.
రెండవ దశ : చర్మంపైన దద్దుర్లు, శ్లేష్మపొర పై ఏర్పడే పుండ్లు లేక దద్దర్లుతో ఈ రెండవ దశ గుర్తింపబడుతుంది. దద్దర్ల లో సాధారణంగా దురద వుండదు. ఈ దద్దర్లు ఎఱ్ఱగా, ఎరుపు తో కూడిన గోధుమ వర్గంలో మచ్చలలాగా అరికాళ్ళలో అరచేతులలో కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలలో శరీరంలో వేరే భాగంలో వేరే వ్యాధులలో కనిపించే దద్దుర్ల వంటివి కూడా కనిపించవచ్చు. దద్దుర్లులే కాకుండా సుఖరోగం రెండవ దశలో జ్వరం, శోషరస గ్రంధుల వాపు, గొంతులోని శ్లేష్మపొర మీద క్షతము లేదా రాపిడి (వాడుక భాష గొంతు పూయడం) తలపై అక్కడక్కడా మచ్చలగా జుట్టురాలిపోవడం, తలనొప్పి, బరువుతగ్గడం, కండరాల నొప్పి మరియు అలసత్వం వంటి లక్షణాలు కూడా కనబడుతాయి.

అంతర్గతంగా వున్నదశ: రెండవ దశ లక్షణాలు కనుమరుగయిన తరువాత అంతర్గతదశ మొదలవుతుంది. అవసాన దశలో ఈ సుఖరోగం క్రమక్రమంగా అంతర్గతంగా మెదడు, నరాలు, కళ్ళు, గుండె, రక్తనాళాలు, కాలేయము, ఎముకలు మరియు కీళ్ళు, మొదలగు అవయవాలకు అపాయం (హాని) కలిగిస్తుంది. ఈ అంతర్గతంగా జరిగే హాని కొన్ని సం. తరువాత బయట పడవచ్చు. అంతర్గత దశలోని చిహ్నాలు లక్షణాలు ఈ క్రింది విధంగా వుంటాయి.

  • వివిధ కండరాల కదలికలలో సమన్వయ లోపం
  • పక్షవాతం
  • తిమ్మిరులు
  • క్రమంగా వృధిచెందే అంధత్వం
  • మతిభ్రంశము

ఈ మార్పులు ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకం అవుతాయి.

సుఖరోగం గర్భిణి స్త్రీని గర్భస్థశిశువును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది.?

సుఖరోగం యొక్క ప్రభావం గర్భిణి స్త్రీపై ఎంత కాలంగా ఆమె ఈ వ్యాధి పీడతురాలిగా వున్నదీ దానిని బట్టి పరిణామాలు వుంటాయి. ఈ కాలం అధికంగా వుంటే మృత శిశువు జన్మించేంతట తీవ్రపరిణామం కూడా జరుగవచ్చు. లేదా పుట్టిన కొద్ది సమయం లోనే శిశువు మృతి చెందవచ్చు. వ్యాధి సంక్రమించి శిశువులో ఏ సంకేతాలు, లక్షణాలు లేక పోవచ్చును. తక్షణమే చికిత్స అందించని యొడల శిశువులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది చికిత్స అందని శిశువులకు పెరుగుదలలో మైలురాయిలు ఆలస్యం కావచ్చును. కొన్ని సార్లు మూర్ఛరోగం, మరణం కూడా సంభవించవచ్చును.

సుఖరోగానికి హెచ్.ఐ.వి.కు ఉన్న సంభంధం ఏమిటి?

జననేంద్రియాలపై వచ్చే సుఖరోగం పుండ్లు ద్వారా సుఖరోగం మూలంగా కలిగే జననేంద్రియాలపై వచ్చే పుండ్లు ద్వారా హెచ్.ఐ.వి. సంపర్కం సంభోగం ద్వారా తేలికగా వ్యాప్తి చెందుతుంది. సుఖరోగం వున్నవారికి 2 నుంచి 5 ఇంతలు హెచ్.ఐ.వి. సూక్ష్మజీవి సంపర్క సోకే అవకాశం వుంటుంది.

సుఖరోగం తిరగబెడుతుందా ?

సుఖరోగానికి పూర్తిగా చికిత్స తీసుకున్న తరువాత కూడా మరల వ్యాధి సోకే అవకాశం వుంటుంది. ఒకసారి వ్యాధి సంక్రమించిన తరువాత తిరిగి సంక్రమించకుండా వుండేటట్టు వ్యాధి నిరోధకశక్తి శరీరం ఏర్పడదు.

సుఖరోగాన్ని ఏ విధంగా నివారించవచ్చును ?

వివాహేతర సంబందాలకు దూరంగా వుండడం. ఖచ్చితంగా ఈ వ్యాధి సోకకుండా కాపాడుతుంది. అసురక్షిత సంభోదాలకు దూరంగా వుండాలి. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు కూడా లైంగిక ప్రేరేపణలకు కారణమవుతాయి. కాబట్టి దీనికి కూడా దూరంగా వుండడం ఎంతైనా ఉవసరం.

క్లమీడియా

క్లమీడియా అనగా నేమి ?

క్లమీడియా అనే వ్యాధి క్లమీడియా ట్రకోమాటాస్ అనే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి ఇది సంభోగం ద్వారా వ్యాప్తి చెంది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు హానికలుగచేస్తుంది.

జనులకు ఈ క్లమీడియా వ్యాధి ఏ విధంగా సోకుతుంది.
క్లమీడియా యోనిద్వారా లేదా ఆసనం మరియు నోటి ద్వారా సంభోగం జరుపునప్పుడు వ్యాప్తి చెందే అవకాశం వుంటుంది. యోని ద్వారా ప్రసవం జరుగుతున్నప్పుడు తల్లి నుండి శిశువు సోకే అవకాశం వుంటుంది.

లైంగికపరంగా ఉత్తేజితంగా వున్న తరచు సంభోగంలో పాల్గొంటున్న ఏ వ్యక్తినైనా క్లమీడియా వ్యాధి సోకవచ్చు.

క్లమీడియా వ్యక్తి యొక్క లక్షణాలు ఏవి ?

ప్రధమంగా క్లమీడియా స్త్రీ యొక్క గర్భశయ బహిర్గ ద్వారం మరియు మూత్రమార్గము లకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వున్న స్త్రీలకు యోని ద్వారా ద్రవాలు స్రవించడం మరియు మూత్రము పోయునప్పుడు మంట వంటి సమస్యలు కనబడుతాయి. గర్బాశయ బహిర్గ ద్వారం నుంచి వ్యాధి గర్భకోశ నాళములకు సోకవచ్చును. ఇంతవరకూ కూడా కొంత మంది స్త్రీలలో లక్షణాలు కానీ చిహ్నాలు కానీ కనపడక పోవచ్చును. కొంతమందిలో పొత్తి కడుపు నొప్పి , నడుంనొప్పి , కడుపులో త్రిప్పడం, సంభోగం సమయంలో నొప్పి, రుతుక్రమం మధ్యలో రక్తస్రావం కనబడడం వంటి లక్షణాలు వుంటాయి. పురుషులలో పురుషాగం నుంచి ద్రవాలు స్రవించడం, మూత్రం పోయునప్పుడు మంట, వంటి సమస్యలు కనబడుతాయి.
పురుషాగం మొనచుట్టూ దురద మంట కూడా వుండవచ్చును.

క్లమీడియా వ్యాధి చికిత్స తీసుకొని పక్షంలో ఏ సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. దుష్పరిణామాలు (చిక్కులు)

చికిత్స తీసుకోని పక్షంలో క్లమీడియా వ్యాధి ప్రత్యుత్పత్తి వ్యాధి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు ఇతర ఆరోగ్య సమస్యలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. దీని పర్యవసానంగా ధీర్ఘకాలిక సమస్యలు మరియు స్వల్పకాలిక సమస్యలు తలెత్తవచ్చును. స్త్రీలలో చికిత్స తీసుకోని పక్షంలో వ్యాధి గర్భ సంచికి చికిత్స తరువాత గర్భకోశ నాళాలకు తరువాత అండాశయములకు సోకే అవకాశం వుంటుంది. ఇవన్నీ కటకుహారంలో వుండే అవయవాలు కటి కుహరంలో వున్న గర్భసంచి ఫెల్లోపియన్ నాళము మరియు అండాశయమపలకు సోకే సూక్ష్మక్రిమి సంపర్కము ఈ వ్యాధి సోకిన స్త్రీలకు అసురక్షిత సంభోగం లో పాల్గోంటే హెచ్.ఐ.వి. సోకే అవకాశం అయిదింతలు ఎక్కువగా వుంటుంది.
పురుషులలో అవాంఛిత పరిణామాలు అరుదు.

క్లమీడియా వ్యాధిని ఏ విధంగా నివరించవచ్చు ?

అసురక్షిత సంభోగాలకు దూరంగా ఉండడమెక్కటే ఖచ్చితమైన నివారణోపాయం లేదా ఈ వ్యాధి సోకలేదని నిర్ధారింప బడిన స్త్రీతోనే దీర్ఘకాలం లైంగిక సంబందం కొనసాగించడం.

గొనోరియా (సెగవ్యాధి)

గొనోరియా (సెగవ్యాధి)-స్త్రీ బీజకోశము సుఖరోగము

సెగవ్యాధి అనగా నేమి ?
సెగవ్యాధి (గొనోరియా) లైంగిక సంపర్కం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నిస్సిరియే గొనేరుయే అనే సూక్ష్మజీవి తడిగా వెచ్చగా ఉండే స్త్రీ పురుషుల యొక్క ప్రత్యుత్పత్తి, వ్యవస్థలో వుండే స్థలాలలో తేలికగా పెరిగి వృద్ధి చెందుతుంది. ఈ సూక్ష్మజీవి నోరు, గొంతు మరియు కళ్ళలో కూడా పెరగ గలుగుతుంది.

జనులకు సెగవ్యాధి ఏవిధంగా సోకుతుంది. ?

సెగవ్యాధి పురుషాంగం, యోని, నోరు, ఆసనము తో సంపర్కమ మూలాన వ్యాప్తి చెందుతుంది. ప్రసవ సమయంలో తల్లి మంచి శిశువుకు సంప్రాప్తింపవచ్చు.

సెగవ్యాధి యొక్క చిహ్నాల మరియు లక్షణాలు ఏవి ?

లైంగికంగా చురుకుగా వున్న ఏ వ్యక్తికైనా, ఈ వ్యాధి సోకవచ్చు. చాలా మంది వ్యాధి సోకిన పురుషులలో ఏ లక్షణాలు కనపడక పోవచ్చుకానీ కొందరిలో వ్యాధి సోకిన రెండు నుండి 5 రోజులతరువాత కొన్ని లక్షణాలు కనపడవచ్చు. కొన్ని మార్లు లక్షణాలు బయటపడటానికి 30 రోజుకూడా పట్టవచ్చు. మూత్రంలో మంట, తెలుపు లేక ఆకుపచ్చ లేక పసుపుపచ్చ ద్రవాలు పురుషాంగం లేదా యోని నుంచి స్రవించవచ్చు. సెగవ్యాధి సోకిన పురుషులలో అప్పుడప్పుడు వృషణాల నొప్పితో వాయడం జరుగుతుంది. స్త్రీలలో లక్షణాలు తీక్షణత తక్కువగా వుంటుంది. స్త్రీలలో తొలుత మూత్రంలో మంట, యోని స్రావాలు ఎక్కువగా స్రవించడం, యోని ద్వారా బహిష్ఠుల మధ్యలో రక్తస్రావం వంటి లక్షణాలు కనుబడుతాయి.

సెగవ్యాధి ఏ విధంగా గర్భిణిని, గర్భస్థ శిశువుకు ప్రభావితం చేస్తుంది ?

ఒకవేళ గర్భిణీ స్త్రీలో సెగ వ్యాధి వుంటే ప్రసూతి సమయంలో ఇది శిశువుకు యోని ద్వారా బయటకు వచ్చేటప్పుడు సోకవచ్చు. దీనివల్ల అంధత్వం, కీళ్ళలో సూక్ష్మజీవి సంపర్కం, మరియు రక్తంలో సూక్ష్మజీవి సంపర్కం వల్ల శిశువుకు ప్రాణహాని కూడా కలుగవచ్చు. గర్భిణి స్త్రీకు సోకిన సెగవ్యాధి ని అందించినట్టయితే తీవ్రమైన పరిణామాలను తగ్గించవచ్చు.
గర్భిణి స్త్రీలు ఆరోగ్య కార్యకర్తలకు సంప్రదించి తగువిధంగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి.

సెగవ్యాధి ఏ విధంగా నివారించాలి ?

అసురక్షిత లైంగిక సంబంధాలకు దూరంగా వుండడమే ఖచ్చితమైన నివారణోపాయము లేదా ఈ వ్యాధి సోకలేదని నిర్ధారించబడిన ఒకే స్త్రీతో దీర్ఘకాల సంబంధం కొనసాగించడం శ్రేయస్కరం.

స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు వచ్చే సూక్ష్మ క్రిమి సంపర్కం

పి.ఐ.డి (PID)అనగా నేమి ?

కటి కుహరము ( స్త్రీలలో పోట్ట క్రింది భాగం ) లో వుండే స్త్రీ ప్రత్యుత్పత్తి (PELVIS)అవయవాలకు వచ్చే అంటు (ఇన్ ఫెక్షన్) ను పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీస్ అంటారు.
స్త్రీ కటి కుహరము లో వుండే అవయవాలు - గర్భసంచి, ఫెల్లో పియాన్ నాళాలు, అండాశయములు. కొన్ని సుఖవ్యాధుల (STD అసురక్షిత లైంగిక సంబంధాలతో వచ్చే జబ్బులు) లో ముఖ్యంగా క్లమీడియా, గానోరియా తరువాత కలుగు దుశ్ఛలితాలలో ఈ పి.ఐ.డి. ఒకటి. దీనికి వెంటనే చికిత్స తీసుకోక పోయినచో గర్భాశయమునకు, అండాశయమునకు చుట్టు పక్కలా ఉండే కణజాలాలలో మరియూ వీటిని రెండిటినీ కలిపే నాళాలు (ఫెల్లోపియన్ ట్యూబ్స్ ) లో పి.ఐ.డి వ్యాధి మూలాన హాని కలిగే అవకాశం వుంటుంది.
-U/S (ఉల్ట్రాసౌండ స్కానింగ్) వలన ఫాలిపియన్ నాళం వాచిందా/పెద్దగా మారిందా ? కణితలు ఎమైనా ఉన్నాయా ? తెలుసు కోవాలి. తరువాత ల్యాప్రోస్కోపి ద్వారా కటి కుహరంలోని అవయవాలను చూడవచ్చు. అవసరమైతే దీని ద్వారా అవయవాల కణజాలంను తీసి ల్యాబ్ పరీక్షకు పంపుతారు
చికిత్స

  • యాంటి బయోటిక్స్ / మందులు డాక్టరును సంప్రదించి వాడడం .
  • ముందుజాగ్రత్త తీసుకొంటూ సోకకుండా చూసుకోని – లైంగిక సంపర్కం ద్వారా సోకే వ్యాధులు (STD) ని అరికట్టాలి. సురక్షిత లైంగిక సంపర్కం, తొడుగులు (కాన్ డోమ్లు) వాడడం వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు.

పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీస్ అనే వ్యాధి ఎంత సాధాణంగా సోకుతుంది ?

  • దీని వలన 100,000 మంది మహిళలకు గర్బదారణ లేకుండా పోవుచున్నది. మరియు పిండం పెరుగుదల గర్బాశయంలో కాకుండా మరోచోట అభివృద్ధి చెందుతుంది.
  • దీని వలన సంవత్సరానికి 150 మంది కంటే ఎక్కువ మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు

స్త్రీలకు ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుంది ?

  • ఈ బ్యాక్టీరియా యోని మార్గం ద్వారా ప్రవేశించి ఆ మహిళ యొక్క ప్రత్యుత్పతి అవయవాలకు చేరుకుంటుంది.
  • ఈ వ్యాధి చాలా రకాల సూక్ష్మజీవుల ద్వారా కూడా కలుగుతుంది కాని ఇవి గొనొరియా, (Gonorrnea), క్లమీడియా(clamydia) అనే రెండు సుఖవ్యాధులతో కలిసి వస్తాయి.
  • మొదటి సారి సోకిన దాని కంటే మరలా రెండవసారి వ్యాధి సోకినవారిలో వ్యాధి లక్షణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవయవాలు మొదట్లోనే పాడైపోయి వుంటాయి.
  • 25 సం. వయసు లోపు ఉండి శృంగారంలో పాల్గొంటూ, పిల్లలకు జన్మనిచ్చే మహిళలకు ఇది చాలా ప్రమాదకరం. మరియు మహిళ వయస్సు 25 సం లోపు వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతారు. 50 సం. పై బడిన వారికి కొద్దిగా తక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
  • ఎందుకంటే యవ్వనపు మహిళలలో, బాలికలలో, గర్భాశయం యొక్క ముందు భాగము (సర్విక్స) అంతగా అభివృద్ధి చెంది ఉండదు. అందువల్ల ఎక్కువగా సుఖవ్యాధులు (STD) వచ్చుటకు ఆస్కారం ఉంది. వీటితో PID - పి ఐ డి కూడా ముడిపడి ఉంటుంది.
  • ఒకరు లేదా ఎక్కువ మంది తో అసురక్షిత లైంగిక సంపర్కం ఉన్న స్త్రీలకు ఈ వ్యాధి PID - పి ఐ డి ఎక్కువగా సోకే అవకాశం ఉంది . ఎందుకంటే ఎక్కువ వ్యాధికారక సూక్ష్మజీవులు సోకుతాయి.
  • యోనిని గొట్టంలోని నీటితో శుభ్ర పరుచు (యోనిలోకి నీటిధార పంపి శుభ్ర పరచుట) మహిళకు ఈ వ్యాధి ఎక్కువుగా సోకుతుంది. సాధారణ పద్ధతి లో శుభ్రం చేసుకొనే మహిళకు ఈ వ్యాధి సోకడం తక్కువ.
  • దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించబడినది. గొట్టంతో కడుగుట వల్లన సూక్ష్మ జీవులు యోని ద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలైన అండాశయం పై భాగానికి చేరుకుంటాయి.
  • గర్భనిరోధక పద్ధతి కాపర్ టీ లేదా లూపులు (IUD) అవలంబించే మహిళలలో PID - పి ఐ డి ఎక్కువ గాను, అది కూడా (IUD) అమర్చిన మొదట్లో వచ్చే అవకాశం ఉన్నది.
  • కాపర్ టీ లేదా లూపులు (IUD) అమర్చే ముందు STD పరీక్షలు చేయడం మ

క్లమీడియా (Climidia infection) కారణంగా PID - పి ఐ డి .

ఈ వ్యాధి శోకిన తరువాత, స్త్రీకి ఈ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు లేదా గుర్తించలేకపోవచ్చు, ముఖ్యంగా ఎక్కువ ప్రత్యుత్పత్తి భాగాలు పాడైపోయే టప్పుడు, PID - పి ఐ డి వ్యాధి లక్షణాలు ఆరోగ్య కార్యకర్త కూడా గుర్తించలేరు.
వ్యాధి లక్షణాలు
- బొడ్డు క్రింద భాగంలో కడుపు నొప్పి.
- జ్వరము
- యోని నుండి ద్రవాలు స్రవించడం (రావడం) ఇది దుర్వాసనతో కూడి ఉండటం.
- లైంగిక చర్యలో నొప్పి
- మూత్ర విసర్జన సమయంలో నొప్పి
- ఋతుచక్రం క్రమం తప్పడం రక్రస్రావం జరగడం
- అరుదుగా కుడివైపు కడుపు పై భాగాన నొప్పి రావడం (Upper Abdomen)

క్లిష్టమైన/ అపాయకరమైన పరిణామాలు

సరైన వైద్యం చేత PID - పి ఐ డి వ్యాధి లక్షణాలను నయం చేయవచ్చు. ఒకవేళ వైద్యం చేయకపోతే మహిళ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు శ్యాస్వతంగా నాశనం అవుతాయి.

వ్యాధి కారక బ్యాక్టీరియా నెమ్మదిగా ఫాలోపియన్ నాళములలోకి ప్రవేశిస్తాయి. తరువాత సాధారణ
కణజాలంను గట్టి కణజాలంగా మార్చి వేస్తాయి.

  1. ఈ గట్టి కణజాలం వల్లన అండము గర్భాశయంకు చేరకుండా ఈ నాళంలోనే ఆగిపోతుంది.
  2. ఒకవేళ ఫాలోపియన్ నాళము పూర్తిగా గట్టి కళజాలంతో నిండిపోయిన ఎడల, శుక్రకణము, అండంతో కలవదు, అప్పుడు ఆ మహిళకు పిల్లలు కలగరు.
  3. వంద్యత్వము ఫాలోపియన్ నాళము కొద్దిగా మూసిక పొయినా, కొద్దిగా పాడైపాయినా వంద్యత్వము కలగవచ్చు.
  4. PID - పి ఐ డి సోకిన 8 మంది మహిళలో ఒకరు వంద్యత్వంకు లోనవుతున్నారు. ఎక్కువ సార్లు PID - పి ఐ డి వచ్చిన ఎడల అది వంద్యత్వము (గొడ్రాలు) వచ్చే అవకాశం ఎక్కువ.
  5. ఒక్కొక్కసారి కొద్దిగా మూసుకుపోయి, లేదా కొద్దిగా పాడైపోయిన ఫాలోపియన్ నాళం కాకుండా మిగిలిన ఫాలోపియన్ నాళంలో పిండోత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా గర్భాశయంలో కాకుండా ఫాలోపియన్ నాళంలో పిండోత్పత్తి జరగడాన్ని Ectopic Pregnancy అంటారు.
  6. ఈ Ectopic Pregnancy వలన ఫాలోపియన్ నాళం లోనే అండం అభివృద్ది చెంది పెద్దదవుతుంది పిండం. దీని వలన ఫాలోపియన్ నాళం పగిలి ఎక్కువ నొప్పి, లోపల రక్తస్రావం జరగడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది.
  7. కింది కడుపు భాగము (కటి కుహరము) , ఫాలోపియన్ నాళపు కణజాలం గట్టిపడడం వలన ఎక్కువ కాలం కటి కుహరపు నొప్పి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి లాగా ఉండును. పదే పదే ఈ వ్యాధికి గురికావటం వలన వంద్యత్వముతో బాధ పడతారు.

నిర్ధారణ చేయడం

  1. PID - పి ఐ డి వ్యాధి నిర్ధారణ చేయడం కష్టం ఎందుకంటే వ్యాధి లక్షణాలు తక్కువగాను, ఒక్కొక్క సారి లక్షణాలులేక పోవడం వలన ప్రత్యేక పరిక్షలు ద్వారానే ఈ వ్యాధిని నిర్ధారించవలసి ఉంటుంది.
  2. ఒకవేళ వ్యాధి లక్షణం బొడ్డు కింద బాగంలో కడుపు నొప్పి వస్తే ఆరోగ్య అధికారులు, శారీరక పరీక్షలు చేసి, ఎటువంటి నొప్పి, ఏ ప్రదేశంలో నొప్పి, జ్వరము, యోని స్రవాలను పరీక్షించాలి. మరియు గోనోరియల్ (Gonorrheal) , క్లమీడియల్ (chlamydial) అంటు/ ఇన్ఫేక్షన్ కోసం కూడా పరీక్షించాలి.
  3. వ్యాధి నిర్ధారణ అయినచో వైద్యం తప్పని సరి చేయించుకోవాలి.
  4. ఆరోగ్య సహాయకాదికారులు సూక్ష్మజీవుల పరీక్షలు నిర్వహించాలి. ఒపెల్నిక్ అల్ట్రాసౌండ్ (Opelnic ultnosoond) PID - పి ఐ డి - పి ఐ డి కనుగొనుటకు ఉపయోగ పడుతుంది.
గర్భిణి లో సుఖరోగాలు గర్భిణి లో లైంగిక వ్యాధులు

గర్బిణి స్త్రీలలో లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం వుంటుందా ?

అవును గర్భం దాల్చని స్త్రీలలో లైంగిక వ్యాధులు వచ్చినట్టే. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం వుంటుంది.

లైంగిక వ్యాధులు ఏ విధంగా గర్భిణీ స్త్రీని మరియూ గర్భస్థ శిశువును ప్రభావితం చేస్తాయి ?

గర్భిణీ కాని స్త్రీలలో లైంగిక వ్యాధుల వల్ల వచ్చే సమస్యలు వాటి పరిణామాలు ఎలా ఐతే వుంటాయొ, అలాగే గర్భిం దాల్చిన స్త్రీలలో కూడా లైంగిక వ్యాధుల వల్ల అదే మాదిరి సమస్యలు వస్తాయి. లైంగిక వ్యాధుల వల్ల గర్భసంచి మూతి క్యాన్సరు (కంతులు) వేరే అవయవాల దూరణ కంతులు (cencers) దీర్ఘకాలిక కాలేయ శోధము, శ్రోణి అవయవాల శోధము (శోధము -Infection), మరియు కటవలయంలోని అవయవాల సూక్ష్మక్రిమి సంపర్కము, వంద్యత్వము మరియు ఇతర దుష్పరిణామాలు కూడా కలుగవచ్చును. చాలా మందిలో లైంగిక వ్యాధులు ఏ లక్షణాలు బయట పడక నిశ్శబ్దంగా వుంటాయి. ఏ లక్షణాలు, సంకేతాలు పైకి కనపడవు.

లైంగిక వ్యాధి వున్న గర్భిణీ కాన్పు నెలలు నిండకమునుపే రావచ్చు లేదా, గర్భస్థ శిశువు చుట్టూ వున్న ఉమ్మినీరు పొరలు నెలలు నిండకమునుపే పగిలి పోవచ్చు లేదా, గర్భసంచికి సూక్ష్మక్రిమి, సంపర్కము కలుగు వచ్చును. లైంగిక వ్యాధి తల్లి నుంచి శిశువుకు గర్భంలో వుండగా లేదా కాన్పు జరుగునప్పుడు లేదా కాన్పు తరువాత పాలద్వారా వ్యాపించవచ్చును. సిఫిలిస్ అనే లైంగిక వ్యభిచార రోగములో రోగక్రిములు తల్లినుండి మాయను దాటి బిడ్డకు సంక్రమించవచ్చు. ఇతర లైంగిక వ్యాధుల (గొనోరియా - సెగవ్యాధి, కాలేయ శోధము - B, జననేంద్రియాలకు సోకే విసర్పిణి , క్లమీడియా) లో తల్లి నుండి బిడ్డకు ప్రసవ మార్గం గుండా ప్రయోగించునప్పుడు సోకవచ్చు. H.I.V (ఎయిడ్స్) వ్యాధి మాయను దాటి గర్భంలో వుండగానే బిడ్డకు సోకవచ్చు లేదా ప్రసవ సమయంలో సోకవచ్చు లేదా ఇతర లైంగిక వ్యాధులవలెకాక పుట్టిన తరువాత తల్లిపాల నుంచి కూడా బిడ్డకు వ్యాపించవచ్చును.

లైంగిక వ్యాధుల దుష్ప్రభావాలుః - తక్కువ బరువున్న బిడ్డపుట్టడం (5 పౌండ్ల కంటే తక్కువ) కండ్లకలక (కళ్ళలో కలిగే సూక్ష్మక్రిమి సంపర్కము ఊపిరితిత్తుల నిమ్ము , శిశువుల రక్తస్రావంలో సూక్ష్మక్రిమి సంపర్కము లేక చీము పోయడం), నరాలకు హనికలగడం (మొదడుకు హాని, కదలికలలో సమన్వయం లేకపోవడం, గ్రుడ్టితనం, చెముడు, ఆకస్మిక కాలేయ శోధము మొదడు పొరల శోధము లేక సూక్ష్మక్రిమి సంపర్కము, దీర్ఘకాలిక జబ్బులు, కాలేయంలో అధికంగా నార పదార్థము చేరే జబ్బు.

గర్భిణి స్త్రీలలో లైంగిక వ్యాదులకు సంబంధించిన పరీక్షలు జరపాలా ?

లైంగిక వ్యాధుల చికిత్సలో భాగంగా గర్భిణి స్త్రీలు పరీక్షకు వచ్చిన మొదట సారే వీటి గురించి పరిశోధనలు, పరీక్షలు చేయించాలి.

పరీక్ష చేయించవలసిన లైంగిక వ్యాధులుః -

  • క్లామీడియా
  • సెగవ్యాధి
  • కాలేక సూక్ష్మక్రిమి సంపర్కము లేక కాలేయ శోధము- బి (హెపటైటిస్ - బి)
  • కాలేయ శోధము -సి (హెపటైటిస్ - సి)
  • ఎయిడ్స్ (HIV)
  • సిఫలిక్ లేక సుఖరోగము

గర్భంతో వున్నస్త్రీలకు లైంగిక వ్యాధుల చికిత్స చేయవచ్చునా ?

క్లామీడియా, సెగవ్యాధి, సుఖరోగము ట్రైకోమోనాస్ (తెల్ల బట్ట), సూక్ష్మజీవుల వల్ల కలిగే యోని యొక్క శోధము వంటి సుఖ వ్యాధులకు సూక్ష్మ చికిత్స చేయవచ్చును. వైరస్ల వల్ల కలిగే ఎయిడ్స్ మరియు జననేంద్రియాల మొదలగు వ్యాధుల లక్షణాలు కొంతవరకు పూర్తిగా నయం చేయలేము. జననేంద్రియాల నొప్పి తీవ్రంగా వున్న గర్భిణి స్త్రీలకు యోని ద్వారా ప్రసవం కాకుండా కడుపు గర్భసంచి శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు బయటకు తీయడం వలన బిడ్డకు ప్రసవ మార్గం నుండి వచ్చే సూక్ష్మక్రిమి సంపర్కాన్ని నివారించవచ్చును. కాలేయ శోధము -బి వ్యాధి లేదని నిర్ధారింపబడిన వారికి ఆ వ్యాధి టీకాలు ఇవ్వవచ్చును.

గర్భిణీ స్త్రీలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఏ విధంగా రక్షణ పొందవచ్చును ?

సుఖవ్యాధుల బారిన పడకుండా వుండాలంటే ఈ వ్యాధి సోకిన వారితో లైంగిక సంపర్కంలో పాల్గొనకుండా వుండడం ఒకటే శ్రేయస్కరమైన మార్గం. ఒకే వ్యక్తితో సంసారిక జీవనం గడపడం లేదా కనీసం లైంగిక సంపర్కంలో పాల్గొనే వ్యక్తి వ్యాధి సోకిన వారా అని నిర్థారించుకొన్న తరువాతే పాల్గొనడం వంటి జాగ్రత్తలు తీసుకొనడం ఎంతైనా ముఖ్యం.

సర్పి, విపర్పిణి

సర్పి, విపర్పిణి అంటే ఎమిటి ?
జననేంద్రియాల సర్పి లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధి దీనికి కారణం హెర్పిస్- సంప్లెక్స్ అనే వైరస్ 1వ రకం (హెచ్ ఎస్ వి -1) మరియు 2వ రకం (హెచ్ ఎస్ వి -2) .

జననేంద్రియాల సర్పి ఏ విధంగా వ్యాపిస్తుంది ?

హెచ్.ఎస్.వి. -2 రకం సర్పి ఈ వ్యాధి సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం మూలాన వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తికి ఈ వ్యాధి తనకు సోకి వుందన్న విషయం తెలిసి వుండక పోవచ్చును. ననేంద్రియాలపై పుండ్లు కూడా కనబడకపోవచ్చును.

సర్పియొక్క లక్షణాలు మరియు సంకేతాలు
చాలా మంది ఈ వ్యాధి సోకిన వారికి, ఈ వ్యాధి తమకు సంక్రమించిందన్న విషయం తెలియదు. వ్యాధి సంక్రమించి రెండు వారాలకు మొట్టమొదటి జననేంద్రియాలపై పుండ్లు బయపడి అవి రెండు నుంచి నాలుగు వారాలలో మానిపోతాయి. లక్షణాలు లేక సంకేతాలు కనబడడం. మొదలయినప్పుడు అవి జననేంద్రియాలు లేక ఆసనము పై చిన్న బొబ్బలు లాగా బయటపడుతాయి. ఈ బొబ్బలు పగిలి అవి పుండ్లు పడి (వ్రణాలు) పోతాయి అవి మానడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. మొదటి సారి ఇంత సమయం పడుతుంది. రెండవసారి మళ్ళీ బొబ్బలు కొన్ని వారాలు లేక నెలలు తరువాత కనబడతాయి. కానీ మొదట సారికంటే తక్కువ తీవ్రతతో వుంటే తక్కువ సమయంలో మానిపోతాయి. ఈ వైరస్ లు శరీరంలో ఎంత కాలం వుంటాయో చెప్పలేము కానీ లక్షణాలు సమయం గడిచే కొద్దీ తీవ్రత తగ్గుతూ పోతుంది. లక్షణాలు సంకేతాలు. ఫ్లూను పోలి వుంటాయి. జ్వరము, గ్రంధులు వాపు వంటివి కనబడుతాయి.

సర్పికి చికిత్స ఉన్నాదా ?
శాశ్వతమైన చికిత్స లేదు. కానీ వైరస్ కు విరుద్ధంగా వేసుకునే మందులు మూలంగా మందులు తీసుకుంటున్నంత కాలం పుండ్లు బాధించే కాలాన్ని తక్కువ చేసుకోవచ్చు. మళ్ళీమళ్ళీ బొబ్బలు లేవకుండా నివారించుకొనవచ్చు. ప్రతి రోజూ, బొబ్బలను, లక్షణాలను అణచే మందులు వాడడం మూలాన లైంగిక సంపర్కంలో పాల్గొనే వాళ్ళకు వ్యాప్తి చెందకుండా వుంటుంది.

సర్పి వ్యాధికి నివారించడం ఎలా ?
లైంగిక వ్యాధుల బారిన పడకుండా వుండాలంటే వివాహేతర లైంగిక సంపర్కాలకు దూరంగా వుండడం ఉత్తమమైన మార్గం. ఒకే జీవిత భాగస్వామితో ఎక్కువకాలం కలిసి వుండడం. లేదా వ్యాధి లేదని నిర్థారింపబడిన వారితోనే లైంగిక సంబంధం పెట్టుకోవడం వంటి మార్గాలు అనుసరించాలి.

గర్భ నిరోధానికి సురక్షితమైన కాపర్టీ

కాన్పు, కాన్పుకు మధ్య కనీసం రెండు, మూడు సంవత్సరాల గ్యాప్‌ ఉన్నప్పుడే మహిళలు ఆరోగ్యంగా ఉండగల్గుతారు. ఇందుకోసం వారు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఫ్యామిలీ ప్లానింగ్‌ పద్ధతుల్లో అన్నింటికంటే సురక్షితమైనది ఇంట్రా యుటిరిన్‌ కాంట్రాసిప్ట్‌ డివైజ్‌ (ఐయుసిడి). దీన్నే కాపర్టీ లేదా లూప్‌ అని కూడా అంటారు. స్ర్తీలు కాపర్టీ వేయించుకోవడం వల్ల దాదాపు పది సంవత్సరాల వరకు గర్భం దాల్చకుండా ఉండవచ్చు.

కాపర్టీలో నేడు ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో మెడికేటెడ్‌, మల్టీలోడ్‌, హార్మోన్‌ రిలీజ్‌ రకాలు నేడు అందుబాటులో ఉన్నాయి.

ఉపయోగాలు..

కాపర్టీ వేయించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం దీన్ని సాధారణంగా అందరూ ఉపయోగిస్తున్నారు. కాన్పు, కాన్పుకు మధ్య గ్యాప్‌ కోసం ఎంతో మంచిది. ఒకటి, రెండు, మూడు, అయిదు, పది సంవత్సరాల వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసుకోవచుఏ్చ. దీనివల్ల సీరియస్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు. ఒకసారి కాపర్టీ వేస్తే చాలు పది సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు. దీన్ని తీసిన తర్వాత సులభంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫెయిల్యూర్‌ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని వేయించుకోవడానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. ఒకసారి వేస్తే లోపలే ఉంటుంది కాబట్టి టాబ్లెట్ల అవసరం ఉండదు.

సమస్యలు...

సీనియర్‌ గైనకాలజిస్ట్‌ వద్ద కాపర్టీని వేయించుకోవాలి. తరచుగా దీన్ని చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి. దీన్ని వేయించుకున్న 10 శాతం మందిలో మాత్రమే సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావచ్చు. ఒక కాన్పు తర్వాత నార్మల్‌ డెలివరీ అయితే ఒకటిన్నర నెలకు, సిజేరియన్‌ అయితే మూడు నెలల తర్వాత వేయించుకోవచ్చు. పీరియడ్స్‌ వచ్చిన తర్వాత 5 రోజుల నుంచి 8 రోజుల లోపు దీన్ని వేయించుకోవాలి. కాపర్టీ అనేది ఓ పరి కరం మాదిరిగా ఉంటుంది. యుటెరస్‌లో దీన్ని అమరుస్తారు. దీనికి దారాలు బయటకు కనిపిస్తుంటాయి. దారాల అమరికను బట్టి కాపర్టీ లోపల ఎలా ఉందో తెలుసు కోవచ్చు. వేసిన తర్వాత నెల రోజులకు చెకప్‌ చేయించుకోవాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డాక్టర్‌కు చూపించుకోవాలి. ఇన్ఫెక్షన్స్‌ ఏమైనా అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఎవరికి వేయకూడదు.?

గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారికి కాపర్టీని వేయకూడదు. ప్రెగ్నెన్సీ సమయంలో వేయరాదు. యుటెరస్‌లో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నవారికి, యుటెరస్‌లో ఎండ్రోమెట్రియసిస్‌, యుట్రెయిన్‌ క్యాన్సర్‌ ఉంటే దీన్ని వేయకూడదు. అబ్‌నార్మల్‌ బ్లీడింగ్‌, సిజేరియన్‌ అయినవాళ్లకు, గతంలో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వారికి చాలా జాగ్రత్తగా కాపర్టీ వేయాలి.

సైడ్‌ ఎఫెక్ట్స్‌...

కాపర్టీ వేసిన తర్వాత కడుపులో నొప్పి వస్తుంది. కొంత మందికి బ్లీడింగ్‌ అవ్వచ్చు. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గి అనీమియా రావచ్చు. పెయి న్‌, బ్లీడింగ్‌ కొద్దిగా ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. నొప్పి తీవ్రంగా ఉంటే లూప్‌ తీయించకో వాల్సి ఉంటుంది. ఒక్కోసారి లూప్‌ జారీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ మందిలో లూప్‌ ఫెయిలై ప్రెగ్నెన్సీ రావచ్చు. ట్యూబ ్‌లో ప్రెగ్నెన్సీ రావచ్చు. గర్భసంచిలో ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలుంటాయి. లూప్‌ పెట్టేటప్పుడు ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. చాలా రోజుల తర్వాత కూడా ఇన్‌ఫె క్షన్‌లు సోకవచ్చు. ఇటువంటి సమయంలో తరచుగా చెకప్‌గా చేయించు కోవాలి. చాలా తక్కువగా యుటెరస్‌ నుంచి పొట్టలోకి కాపర్టీ వెళ్లవచ్చు.

ఎలా పనిచేస్తుంది...

యుటెరస్‌ లోపల ఏర్పాటుచేసే కాపర్టీ ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుపడుతుంది. పక్కకు, కిందికి జరిగినప్పుడు ప్రెగ్నెన్నీ రావచ్చు. కాపర్టీ అనేది ఈస్ట్రోజన్‌ను ఆపుతుంది. దీంతో గర్భం రాదు.

ఎప్పుడు తొలగించాలి...

ఇబ్బందులు ఎదురైతే కాపర్టీని తొలగించాలి. ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకుంటే లూప్‌ను తొలగించాలి. బ్లీడింగ్‌ ఆగకుండా వస్తుంటే కాపర్టీని తీసివేయాలి. పీరియడ్స్‌లో నొప్పి బాగా ఉన్నప్పుడు మందులు వాడిన తగ్గకపోతే, గర్భాశయం ఇన్‌ఫెక్షన్‌ సోకితే దీన్ని తొలగించాలి. దారం కనబడకుండే ఉండే బయటకు తీయాలి. యుటెరస్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వస్తే దీన్ని తొలగించాలి.

కాపర్టీ లోపలికి వెళ్తే స్కానింగ్‌, ఎక్స్‌రే చేసి తొలగించాలి. లూప్‌ యుటెరస్‌ నుంచి పొట్టలోకి వస్తే తీసివేయాలి. ఇక కాపర్టీని వేయించే ముందు పేషెంట్‌ను ఎడ్యుకేట్‌ చేయాలి. ఎన్ని సంవత్సరాల పాటు ఉంచుకో వచ్చు, దాని ఉపయోగాలు వివరించాలి. దీనిపట్ల పేషెంట్‌కు ఉన్న అపోహలు తొలగించాలి. కొందరిలో లూప్‌ అంటే కడుపునొప్పి, బ్లీడింగ్‌ అని భయపడు తుంటారు. అటువంటిదేమీ ఉండదని ధైర్యం చెప్పాలి. 10 శాతం కేసులను తప్పించితే అందరికీ లూప్‌ సరిపోతుంది. ఫ్యామిలీ ప్లానింగ్‌కు దీనికంటే సులభమైన, సురక్షితమైన పద్దతి మరొకటి లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate