మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం- 1971
గర్భస్రావం మనదేశంలో చాలా సామాన్య మైపోయింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటిపి)గా పరిగణించే దీనిని 1971 జూన్లో మనదేశంలో చట్టబద్ధం చేశారు. జమ్ము- కాశ్మీర్ లో తప్ప భారత దేశమంతటా ఈ చట్టాం అమల్లో ఉంది. అయితే ఐదు నెలలలోపు గర్భం వరకే ఇది పరిమితం. అయిదు నెలల తర్వాత గర్భస్రావ ప్రయత్నం ప్రమాదకరం. ఎంటిపి అనేది గల్ఫ్ దేశాల్లో చట్టరీత్యా నేరం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గర్భం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదమయితేనే లేదా బిడ్డ సరిగ్గా రూపొందక పోతేనే గర్భస్రావం చేస్తారు. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీతో స్కానింగ్ ద్వారా పిండం ఎదుగుదల తెలుస్తుంది. అందుకే ప్రతి స్ర్తీ గర్భం ధరించిన దగ్గర నుండి రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్, అవసరమైన పరీక్షలు చేసుకుంటూ ఉండాలి.
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ వైద్యులు మాత్రమే అబార్షన్ చేయడానికి అర్హులు
అబార్షన్ చేయడానికి గర్భం 12 వారాలు దాటకూడదు.
ఒకవేళ గర్భాన్ని తీసేయాలన్న అవసరాన్ని ఇద్దరు ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే పిండం వయస్సు 20 వారాలు దాటకుండా అబార్షన్ చేయాలి.
గర్భాన్ని కొనసాగించడం వల్ల మహిళ మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని వైద్యులు భావించినపుడు అబార్షన్ చేయొచ్చు.
పుట్టబోయే బిడ్డకి శారీరక, మానసిక అవలక్షణాలు వ్యక్తమయ్యే పరిస్థితిని వైద్యులు నిర్ధారించినపుడు, అంగవైకల్యం ఏర్పడేస్థితి వున్నపుడు అబార్షన్ చేయొచ్చు.
మహిళ అత్యాచార బాధితురాలై, గర్భం ధరించినపుడు ఆ గర్భం వల్ల ఆ స్త్రీ తీవ్ర మానసిక ఆందోళనకి గురైనపుడు ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయొచ్చు.
కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నపుడు ఆ పద్ధతులు విఫలమై మహిళ గర్భం దాల్చినపుడు తమ కుటుంబ ప్లానింగ్ దెబ్బతినడం, అవాంఛిత గర్భంవల్ల మహిళ మానసికంగా కుంగిపోయినపుడు అబార్షన్ చేయవచ్చు.
18 సంవత్సరాలు నిండని బాలిక గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించొచ్చు. అలాగే మానసికంగా బాధపడే బాలిక గర్భాన్ని ఆమె సంరక్షకుల అనుమతితో తొలగించొచ్చు.
అబార్షన్ నిర్వహించాల్సిన ఆసుపత్రులు
ప్రభుత్వ నిర్వహణలో వుండే ఆసుపత్రుల్లోనే అబార్షన్లు నిర్వహించాలి.
ప్రభుత్వ అనుమతితో ఎప్పటికప్పుడు ఎంపిక చేసిన ఆసుపత్రులలో మాత్రమే ఎం.టి.పి చేయాలి
ఆధారము: ఆంధ్ర ప్రభ లో ప్రచురితమైన కథనం ఆధారంగా
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి