కిశోర లేక కౌమార దశలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. పెద్దయ్యాక ఉండే బరువులో 50%, ఎత్తులో 20% ఇప్పుడే పెరుగుతారు. జీవితంలోని అన్ని దశల్లో కంటే ఈ దశలో చలాకీగా ఆడుతూ, పాడుతూ, పరుగులు తీస్తూ, గంతులు వేస్తూ చురుకుగా ఉంటారు. కనుక పోషక పదార్థాల అవసరం కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే పోషక పదార్థాలు మనం తినే ఆహారం ద్వారా వస్తాయి. కాబట్టి అన్ని పోషక పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.
ప్రధానం గా పోషక పదార్థాలు శరీరంలో మూడు ముఖ్య విధులు నిర్వహిస్తాయి .
కాబట్టి ఏ ఏ రకమైన ఆహార పదార్ధం ఏ విధిని నిర్వహిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
విధి |
శక్తినివ్వడం |
పెరుగుదలనివ్వడం |
రక్షణనివ్వడం |
ఆహార పదార్థాలు |
ధాన్యాలు , చిరు ధాన్యాలు, నూనెలు, నెయ్యి , పంచదార, బెల్లం |
పప్పులు, పాలు, మాంసం |
ఆకుకూరలు , కూరగాయలు, పండ్లు . |
పోషక పదార్థాలు |
పిండి పదార్థాలు, క్రొవ్వులు . |
మాంస కృత్తులు |
ఖనిజ లవణములు , విటమినులు. |
శరీరానికి అవసరమైన మొత్తం శక్తి పిండి పదార్థాల నుండి 60-70% వరకు, మాంస కృత్తుల నుండి 15% వరకు, మిగిలిన 10% క్రొవ్వు పదార్థాల నుండి వస్తుంది . శరీరానికి కావలసిన పోషకాలు పై మూడు వర్గాల ఆహార పదార్థాలను సమ పాళ్ళలో తీసుకున్నపుడే లభ్యమవుతాయి. దీనినే సమతుల ఆహారం అంటారు.
కౌమార దశ ఆడ పిల్లల సమతుల ఆహార నమూనా పట్టిక |
|||
ఆహర పదార్థం |
వయస్సు |
||
10-12 |
13-15 |
16-18 |
|
ధాన్యాలు |
300 గ్రా |
400 గ్రా |
350 గ్రా |
పప్పు ధాన్యాలు |
60 గ్రా |
70 గ్రా |
150 గ్రా |
ఆకుకూరలు |
100 గ్రా |
100 గ్రా |
150 గ్రా |
దుంపలు |
75 గ్రా |
150 గ్రా |
150 గ్రా |
పండ్లు |
50 గ్రా |
30 గ్రా |
30 గ్రా |
పాలు |
250 మీ.లి |
250 గ్రా |
40 గ్రా |
పంచదార , బెల్లం |
50 గ్రా |
40 గ్రా |
40 గ్రా |
పల్లీలు |
30 గ్రా |
40 గ్రా |
30 గ్రా |
ముఖ్యమైన పోషక పదార్థాలు - విధులు
పోషక పదార్థాలు |
విధులు |
పిండి పదార్థాలు |
|
మాంస కృత్తులు |
|
క్రొవ్వు పదార్థాలు |
|
ఖనిజ లవణములు |
|
ఇనుము |
|
కాల్షియం |
|
అయోడిన్ |
|
విటమిన్లు |
విధులు |
విటమిను ఎ |
|
విటమిను బి |
|
విటమిను సి |
|
విటమిను డి |
|
విటమిను ఇ |
|
విటమిను కె |
|
కార్బోహైడ్రేట్లు, తగినన్ని కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ అందించే ఆహారం తీసుకోవడంవల్ల యుక్త వయసులో ఎదుగుదల, దృఢమైన శరీరం, రోగ నిరోధక శక్తి చక్కగా ఉంటాయి. ఎముకల బలానికి క్యాల్షియం రక్తహీనత రాకుండా ఐరన్ కాపాడుతుంది. కాబట్టి వీరి భోజనంలో అన్నంతో పాటు పప్పు, ఆకు కూరలు, కూరగాయలు, గుడ్లు, మితంగా మాంసాహారం, పాలు, పెరుగు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. పరిమితంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బయట జంక్ఫుడ్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఈ తిండివల్ల అధిక బరువు, దానితో పాటు రుతుక్రమంలో తేడాలు వస్తాయి. కొంతమంది ఆడపిల్లలు సన్నగా నాజూగ్గా కనబడాలని, తిండి తినడం చాలా తగ్గించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ప్రతి అవయవం బలహీనంగా తయారవుతాయి. యోగ, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల వీరిలో శారీరక, మానసిక వృద్ధి కలుగుతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం పెరిగి, పాజిటివ్ ధృక్పథంతో ముందుకు వెళతారు.
కౌమార దశలో సాధారణంగా వచ్చే పౌష్టిక లోపవ్యాధి రక్త హీనత. దీనిని హీమోగ్లోబిను తక్కువగా ఉండడాన్ని బట్టి గుర్తిస్తారు. మన శరీరానికి ఇనుము అత్యంత అవసరమైన ధాతువు. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ తయారికి ఇనుము వినియోగమవుతుంది. హిమోగ్లోబిన్ మనం పీల్చే గాలిలోని ప్రాణవాయువును ఉపిరి తిత్తుల నుండి శరీరం లోకి ప్రతి కణానికి చేర వేస్తుంది. శరీరం లోని ఏ భాగం పని చేయాలన్నా ఆక్సిజన్ చాల అవసరం.
పురుషులకు ఉండవలసిన నార్మల్ హిమోగ్లోబిన్ స్థాయి 14.4-16.5 గ్రాముల శాతం. స్త్రీలకు ఉండవలసిన నార్మల్ హిమోగ్లోబిన్ స్థాయి 12.5-14.5 గ్రాముల శాతం |
రక్త హీనతకు కారణాలు
రక్త హీనత లక్షణాలు
తీవ్ర రక్త హీనత లక్షణాలు
పై లక్షణాలతో పాటు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని రక్త పరీక్ష ద్వా రా తెలుసుకొని రక్త హీనత ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేయవచ్చు .
రక్త హీనతను నివారించటం
ముఖ్యంగా ఇంట్లో మరుగు దొడ్డి సౌకర్యం లేక బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయవలసిన పరిస్థితి వున్నపుడు కొంకి పురుగులు పాదాలకు అంటుకుని జీర్ణ వ్యవస్థ లోకి చేరతాయి. తప్పకుండా చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు గోళ్ళను కత్తిరించుకోవడం ద్వార గోళ్ళ క్రింద మట్టి, కొంకి పురుగుల గ్రుడ్లు చేరి ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్లడాన్ని నివారించవచ్చు.
మొదటి అపరాధం
కొందరు అమ్మాయిలు తమ శరీరం లో అధిక క్రొవ్వులు ఉన్నట్లుగా తప్పు అంచనాలు వేసుకుని, తమ శరీర సౌష్టవం అందంగా వుండడానికి ఉన్న శరీరాకృతిని సవరించుకోవడానికి నియమాలతో భోజనాన్ని మానెయ్యడం లేదా తగ్గించడం చేస్తుంటారు. తిన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా విరోచనాలు కలిగించే మందులను వాడి బయటికి పంపే ప్రయత్నం చేస్తారు. దీనినే అనేరోక్సియా నేర్వోసా అంటారు.
రెండవ అపరాధం
తాము చాలా బరువెక్కుతున్నట్లుగా భావించుకుంటారు. అధిక ఆకలి వలన తీసుకున్న ఆహారాన్ని వాంతి చేసుకోవడం లేదా విరోచనం చేసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవాలని చేస్తుంటారు. దీనిని బులీమియా నెర్వోసా అంటాం.
ఇందువలన శరీర సహజ పోషకాహార స్థితి దెబ్బతిని వివిధ రకాల పోషణ లోపాలు ప్రారంభమౌతాయి. అందులో ముఖ్యమైనవి,
లక్షణాలు
ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న కిశోర బాలికలకు వైద్యపరమైన ,ఆహారపరమైన సూచనలివ్వడమే మంచి చికిత్స. పై లోపాలను గుర్తించిన వెంటనే నిపుణులను సంప్రదించడం మరచిపోకండి.
ఇతర సమస్యలు
అధికంగా తినటం
ఆకలిగా లేక పొయినప్పటికీ అధికంగా ఆహారాన్ని భుజించడం, అందువలన ఉత్పన్నమయ్యే అధికబరువు (లేదా) ఊబకాయాన్ని తగ్గించుటానికి అధికంగా వ్యాయామం చేయడం వంటివి చేస్తారు. దీనివలన మధుమేహం, రక్తపోటు, ఎముకలు గుల్లబారటం మొదలైన ప్రధాన సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ఎముకలు గుల్లబారుట
అతిగా వ్యాయామము చేయటము ,అధికమైన పిచు పదార్థాలు ,అతి తక్కువ నూనెలు మరియు పాలు తీసుకోవటం. వలన శరీరం లోని ఈ స్ట్రోజెను హార్మోను తక్కువ అవుతుంది. దీనివలన, అసంబద్దమైన ఋతు చక్రం కలుగుతుంది, ఎముకలలోని కాల్షియం తగ్గి గుల్లబారుతాయి.
ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం
బహిష్టుమొదలయ్యే 6-7 రోజుల ముందు శరీరబరువుపెరుగుట, కడుపు ఉబ్బరంగా ఉండటం, రొమ్ములోనొప్పి, మలబద్దకం, కాళ్ళు, చేతులువాపు,తలనొప్పి,చిరాకు, ఆత్మానూన్యతాభావం, అలసట, ఏకాగ్రతలోపం, అతిగాఆకలి, తీపి (లేదా) ఉప్పుతోకూడిన ఆహారము పట్ల మక్కువ మొదలగులక్షణాలు కల్గిఉండడం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020