నిర్లక్ష్యంతోనే నీరు వృధా అవుతుంది.
లక్ష్యం:
- మనం నిర్లక్ష్యంగా నీటిని వృథా చేస్తున్న రోజువారీ కార్యకలాపాలను గుర్తిద్దాం.
- నీటిని తెలివితో, బాధ్యతతో వినియోగించడం పట్ల అవగాహన పొందుదాం.
నేపథ్యం:
ప్రతివ్యక్తి, ప్రతిరోజు తాగడానికి, వంటకు, స్నానానికి, దుస్తుల పరిశుభ్రతకు మరియు ఇతర అవసరాల నిమిత్తం దాదాపుగా 2 1/2 పెద్ద బక్కెట్ల నీటిని వినియోగిస్తారు. కాని కనీసం తాగడానికి సరిపోయే నీరు లేక కొన్ని లక్షలమంది అష్టకష్టాలు పడుతున్నారు. నీరు అందుబాటులో ఉన్నవారేమో విచక్షణారహితంగా ఉపయోగించడం, నల్లాల లీకేజీలు పట్టించుకోకపోవటం, బిందెల నిండా పట్టి, ఏ అవసరానికీ వాడకుండా పారబోసి మళ్ళీ పట్టడం, బ్రష్ చేసుకొంటున్నంత సేపు నల్లా కట్టేయకపోవటం, ఎక్కువసార్లు బట్టలు జాడించడం వంటి పనులతో నీరు వృథా చేస్తుండటం శోచనీయం. ఈ విధమైన నీటి వృథాను అరికట్టడం ద్వారా ఎంతో నీటిని సంరక్షించిన వారమవుతాం. నీటిని అతి జాగ్రత్తగా అవసరం మేరకే వినియోగించడం అత్యవసరం.
పద్ధతి
- మీ పాఠశాలలో, ఇండ్లలో లీకవుతున్న నల్లాలున్నాయేమో గమనించండి. ఏదేని నల్లా లీకవుతుంటే దాని క్రింద బకెట్‌ను పెట్టి, ఆనీటిని సేకరించి ఉపయోగించండి.
- వరుసగా ఒక వారంరోజులు నిర్లక్ష్యంతో నీరు వృధా అవుతున్న సందర్భాలను (ఉదాహరణకు పాత్రలలో నీరు నింపుతున్నపుడు,బట్టలుతికే సమయంలో, పాత్రలు, వాహనాలు శు భ్రపరిచేటపుడు గుర్తించి, అలా ఎంత నీరు వృథా అవుతుందో నమోదు చేసుకోండి.
- మీఇంట్లో లేదా ఎవరింట్లోనైనా నీరు కారి పోతున్న నల్లాను (కొళాయి) ఎంచుకోండి. ఒక కొలజాడీని తీసుకొని 5 నిమిషాలలో కారిపోయిన నీటిని సేకరించండి. ఎంత నీరు కారిందో నమోదు చేయండి. మరో 5 నిమిషాలు కూడా మళ్ళీ పరిశీలించి 5 నిమిషాలలో కారుతున్ననీటి పరిమాణాన్ని నిర్ధారించుకోండి.
- అ ఒక 5 నిమిషాలలోనే అంతనీరు కారితే, ఒక గంటకు ఎంత నీరు వృధా అవుతుందో లెక్క కట్టండి.
- అలాగే ఒక రోజుకు, ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఆ నల్లా నుండి కారిపోయే నీటి మొత్తాన్ని లెక్కించండి.
- పోనీలే ఒక చుక్కే కదా అని నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది ఉన్నారో, వారి నిర్లక్ష్యం ఎంత నీటి వృథాకు కారణమవుతుందో మీ గణాంకాల ప్రకారం అంచనా వేయండి.
ముగింపు:
- గ్లాసును ఎత్తిపట్టి తాగే అలవాటు చేసుకుందాం. నోటిని తాకించి తాగితే తాగడానికి ఒక గ్లాసు కడగడానికి ఇంకొక గ్లాసు నీరు ఖర్చవుతుంది. ఇలాంటి చిన్నచిన్న అలవాట్లే నీటి పొదపును నేర్పుతాయి.
- నేరుగా నల్లా (కొళాయి) కింద కాకుండా బక్కేట్టుతో నీళ్ళు పట్టి ఉంచి చెంబుతో వాడుకుందాం. (2, 3 కృత్యాలు చేసాక) నిర్లక్ష్యం కారణంగా వృధా అవుతున్న నీటిని గురించిన మీ పరిశీలనలు, గణాంకాలతో ఒక నివేదిక తయారుచేయండి.
- నీటి వృథాకు కారణమైన నిర్లక్ష్య ధోరణులను పేర్కొనండి.వాటి గురించి చర్చించండి.
- నీటి వృథాను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలును తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
తదుపరి చర్యలు:
- నీటి వృథాను అరికట్టాల్సిన అవసరం ఏమిటో చర్చించండి. నినాదాలను రాసి ప్రదర్శించండి.
- నీటిని వృథా చేయరాదన్న అంశం గురించి ప్రార్ధనా సమావేశంలో మాట్లాడండి.
- మీ పాఠశాల, ఇల్లు, కాలనీ, ఊరు ఎక్కడైనా నల్లాల లీకేజీ చూసినా, నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టండి.
ఆధారము: http://apscert.gov.in/
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.