పోషకాలు | పుదీన | తోటకూర | పాలకూర | మునగ | కొత్తిమీర | గోంగూర |
---|---|---|---|---|---|---|
కాలరీలు
|
48
|
45
|
26
|
92
|
44
|
56
|
మాంసకృత్తులు.(గ్రా)
|
4.8
|
4.0
|
2.0
|
6.7
|
3.3
|
1.7
|
కాల్షియం (మి.గ్రా)
|
200
|
397
|
73
|
440
|
184
|
1720
|
ఇనుము(మి.గ్రా)
|
15.6
|
25.5
|
10.9
|
7.0
|
18.5
|
2.28
|
కెరోటిన్(మై.గ్రా)
|
1620
|
5520
|
5580
|
6780
|
6918
|
2898
|
థైమిన్(మి.గ్రా)
|
0.05
|
0.03
|
0.03
|
0.06
|
0.05
|
0.07
|
రిబోఫ్లేవిన్(మి.గ్రా)
|
0.26
|
0.30
|
0.26
|
0.06
|
0.06
|
0.39
|
విటమిన్ సి (మి.గ్రా)
|
27.0
|
99
|
28
|
220
|
135
|
20.2
|
మధుమేహం (షుగర్ వ్యాధి), గుండె జబ్బులు మనలో చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు. శరీరంలో కొలెస్ట్రాల్ గాని, రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి. ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాద్) చేసిన ఒక పరిశోదనలో తేలింది. ఈ వ్యాధి గ్రస్తులకు ఇచ్చే మందులు,చికిత్సతో పాటు మెంతులు కూడా ఇస్తే రోగికి మరింత ఆసరా ఉంటుంది. మెంతులను ఎంత మోతాదులో, ఏరూపంలో ఇవ్వాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈకింది విధంగా ఉన్నాయి.
ఆధారము : జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాదు - 500007.
సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సంస్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్నిఅందరకు తెలియజేయడమే దీని ముఖ్యవుద్దేశముగా కలదు. మన తీసుకునే ఆహారము వలనే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చును.అనే ఉద్దేశంతో 1977 లో వరల్డ్ వెజిటేరియన్ డే గా ప్రకటించారు. శాకాహారము యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయటం కోసం ఏర్పాటు అయ్యింది. పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు. చెట్టు, మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము. పుట్టిన ప్రతి జీవికి జీవించడానికి అవసరమైనది ఆహారం. ఇది శాఖాహారము, మంసాహారము అనేది ఆజీవి పుట్టుక, అలవాట్లు, పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.
1977 లో నార్త్ అమెరికన్ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది. సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకుకూరలు , కాయకూరలు, గింజలు, పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది. మాంసాహారమువల్ల ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది. శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది. అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుందని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసులవారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహారం.’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతాన్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అందించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు.
ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకి వస్తాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి. పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడటం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి. పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. అందువల్ల శాఖాహారాన్నిమాత్రమే స్వీకరించటం అన్నివిదాలా అందరికి మంచిది. పర్యావరణానికి మంచిది అని తెలుస్తోంది.
ఆధారము: లహరి బ్లాగ్
ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థం. ఆనుదిన ఆహారంలో దాదాపు 20% వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటివలన అపారమైన లాభాలున్నాయి.
ఎక్కువగా దొరికే ఆకుకూరలు, వాటి పొషక విలువలు:
పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, సొయ్యకూర, గంగవల్లి కూర, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటి కూర, కోత్తిమీర, కరివేపాకు, పుదీన.
పేరు |
పోషక విలువ |
గోంగూర |
విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. |
పాలకూర |
విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రతకు ఉపయోగపడుతుంది |
బచ్చలి కూర |
విటమిన్ ఎ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. |
పొన్నగంటి |
విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. |
చుక్కకూర |
విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల గుండె ఆరోగ్యానికి మంచిది |
తోటకూర |
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాల ఆరోగ్యానికి ఉపయోగకరం. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల రక్తహీనతను నివారిస్తుంది ఎముకలకు బలాన్నిస్తుంది |
మెంతికూర |
పీచుపదార్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువుకు, గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులొ సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. |
సొయ్యకూర |
ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తకణాలు ఎర్పడడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఎ,సి ఎక్కువ ఉండడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది. |
మునగాకు |
అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్నిస్తుంది. |
కోత్తిమీర |
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. |
కరివేపాకు |
బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సమ్రక్షణకు మంచిది.అరుగుదల శక్తిని పెంచుతుంది. |
పుదీన |
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. |
గంగవల్లి |
ఒమేగ-3 ఫాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికి రానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా యాంటి ఆక్సిడెంట్లు ఉండడం వలన ముఖం పై ముడతలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. |
క్యాబేజి |
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కొలైన్ ఎక్కువ ఉండడం వల్ల నరాల బలహీనతలను నివారిస్తుంది. |
కాలీ ఫ్లవర్ |
కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువలన ఎముకలకు, పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. |
ఆకుకూరలు వండడం:
ముందుగా కడిగి తరువాత కోయాలి. కోసాక నీళ్ళలో వేస్తే వాటిలొ ఉండే నీటిలో కరిగే బి విటమిన్లు వృధా అయిపోతాయి.
తక్కువ నూనేతొ వండాలి. నూనెలో కరిగే కె విటమిన్ ఉండడం వలన ఎక్కువ నూనె వాడితే అది వృధా అయిపోతుంది.
నీళ్ళు పోయకుండానే , వాటిలో ఊరే నీళ్ళతో ఉడికించాలి.
ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వలన పోషకపదార్థాల సమతుల్యత లభిస్తుంది.
రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి వండటం వలన అన్నిరకాల ఖనిజలవణాలు విటమినులు పొందవచ్చు.
రోగాల బారి నుండి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి కాబట్టి వీటిని రక్షిత ఆహార పదార్థాలు అంటారు.
ఆధారము: విజ్ఞాన సాధిత.కం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూర...
సేంద్రియ ఎరువులద్వారా వ్యవసాయసాగు విధానము
మధుమేహ వ్యాధిని - చెక్కర వ్యాధి, షుగర్ వ్యాధి అని ...
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి లోను సాధారణంగా...