జనాభా పెరుగుదల మరియు ఆహారావసరాలు ఎప్పుడూ కూడా సమాంతరంగానే సాగుతుంటాయి. సాంప్రదాయబద్ధంగా మనం వివిధ రకాల ముతక ధాన్యాన్ని వినియోగిస్తూ ఉంటాము. పట్టణ జీవితంలో మనం సంతులిత ఆహారం అన్న మాట అర్ధాన్ని, విలువను కుదించివేసి, నిత్యజీవితంలో మనం తీసుకునే ఆహారం నుండి, ఈ ముతక ధాన్యాన్ని మినహాయిస్తూ ఉంటాము. ముతక ధాన్యం యొక్క వినియోగపు విధానం మన దేశంలో కాలరీ అవసరాలకనుగుణంగా సవరించబడింది. ఈ ముతక ధాన్యం ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఇది ఇతర తృణ ధాన్యాల స్ధాయిని అందుకోలేకపోతోంది. ఇవి విలువైన సూక్ష్మ, మరియు స్ధూల పోషక పదార్ధాలను కలిగివున్నప్పటికీ, వీటికి ద్వితీయ ప్రాముఖ్యతే వుంది. భారతదేశంలో తలసరి ముతక ధాన్యం వినియోగం 1951-55లో ఉన్న 44.6 కి.గ్రా. నుండి 1970-74 కాలం నాటికి 38.5 కి.గ్రా. కు తగ్గిపోయింది. ఇటీవలే విడుదలైన నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో యొక్క నివేదిక సగటు తృణ ధాన్యాల మరియు చిరు ధాన్యాల వినియోగం తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నా, ఇది సిఫార్సు చేయబడిన ఆహారపు పరిమితులకు మించి, లేక సమానంగానే ఉందని తెలియజేస్తోంది.
రాగులకు భారతదేశం పుట్టినిల్లుగా పరిగణింపబడుతోంది. ఇది 344 మి.గ్రా/100 గ్రా కాల్షియమ్ తో అత్యంత పోషక విలువగల సర్వతోముఖమైన చిరుధాన్యం. ఇంత స్ధాయిలో కాల్షియమ్ మరే తృణ ధాన్యంలోను లేదు. రాగిలో వుండే ఐరన్ పదార్ధం 3.9 మి.గ్రా/100 గ్రా. గా వుంటుంది. ఇది కేవలం ఒక బాజ్రా (సజ్జల) లో తప్ప ఇతర తృణ ధాన్యాలన్నింటి కన్నా అధికంగానే ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది పూర్తి ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేయబడుతోంది. సాంప్రదాయబధ్దంగా రాగి పాలకు బదులుగా, ఒక పాయసంగా గానీ, లేక అంబలిగా గాని వినియోగింపబడుతున్నది. ప్రస్తుతం రాగి వెర్మిసిల్లి అప్పటికప్పుడు తయారుచేసుకునే ఆహారంగా మార్కెట్లో లభిస్తోంది.
సజ్జలు వివిధ పారిశ్రామిక ఉత్పత్తులలో వాడబడుతున్నాయి. వీటిలో 100 గ్రా. తినదగిన భాగంలో 11.6 గ్రా. ప్రోటీన్ (మాంసకృత్తులు), 67.5 గ్రా. పిండి పదార్ధాలు, ఐరన్ 8 మి.గ్రా. ఉంటాయి. కంటికి అత్యంత భధ్రత, రక్షణ కలిగించే 132 మై.గ్రా కెరోటిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది కొన్ని ప్రతి-పోషక (యాంటి-న్యూట్రియెంట్) పదార్ధాలను కలిగివున్నా- అనగా పైటిక్ యాసిడ్, పోలీఫినాల్ మరియు ఎమైలేజ్ (జీవరసాయన శాస్త్రంలో జంతువుల కండలనుండి తీసిన చెక్కరను సాధారణ చెక్కరగా మార్చు ఒక ఎంజైమ్ – ఒక ఆమ్లద్రవం వంటిది)ను ఆటంకపరిచేటటువంటివి, నీటిలో బాగా నానబెట్టినప్పుడు, మొలకెత్తినప్పుడు మరియు ఇతర వంటచేసే పధ్దతులు ప్రతి-పోషకాలను తగ్గిస్తాయి. దేశంలో ఇది ఎక్కడ సాగుబడి చేయబడినా, ఈ సజ్జలను (పెరల్ మిల్లెట్)ను ఒక ముఖ్యమైన ఆహారంగా, దాణాగా, మేతగా కూడా ఉపయోగించడం జరుగుతోంది.
జొన్న నైజీరియాలో ఎక్కువమంది తినే ప్రధానమైన ఆహారం. ఇతర ముతక ధాన్యం కంటే ఈ జొన్న పారిశ్రామిక వాడకంలో ప్రధానమైనటువంటిది. ఇది సారాయి, మద్యం వంటి పానీయాల తయారీలతో పాటుగా రొట్టెలు తయారు చేసే పరిశ్రమలలో కూడా గోధుమను జొన్నతో కలిపి వాడడం జరుగుతోంది. పసిపిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ఆహారాన్ని పారిశ్రామికంగా తయారుచేయడంలో జొన్న అలసంద మిశ్రమాన్ని, మరియు జొన్న- సొయాబీన్సు మిశ్రమాన్ని వాడతారు. ఇది 10.4 గ్రా. ప్రొటీన్, 66.2 గ్రా. పిండి పదార్ధం, 2.7 గ్రా. పీచు పదార్ధం మరియు ఇతర సూక్ష్మ మరియు స్థూల పోషక పదార్ధాలను కూడా కలిగి వుంటుంది.
మనం తీసుకునే ఆహారంలో మొక్క జీవకణ భాగం పీచు పదార్ధంగా భావించబడుతోంది. పీచుపదార్ధంతో కలిసి వుండే ఆహారం వల్ల ఆరోగ్యపరంగా అనేక లాభాలున్నాయి. ఇటువంటి పీచుపదార్ధంతో వుండే ఆహారం తనలో నీటిని ఇముడ్చుకొనగలిగే గుణంతో ఆహారాన్ని ఘనంగా చెయ్యడంలో తోడ్పడుతుంది. ఇది ఆహారం పేగులలో సులభంగా జరిగే వీలును కలిగిస్తుంది, అలాగే, పెద్ద ప్రేగులలో జీర్ణమైన తరువాత మిగిలిపోయన వ్యర్ధ పదార్ధాన్ని అలాగే అక్కడే ఎక్కువ సేపు నిలిచివుండే కాలాన్ని తగ్గిస్తుంది. ఒక హైపో కోలెస్టర్ లిమిక్ ఏజెంట్ గా పనిచేస్తూ పిత్తరస లవణాన్ని (బైల్ సాల్ట్) బంధించి కొలెస్ట్రాల్ తగ్గుదలను మెరుగుపరుస్తుంది. అందుచేత, గుండె సంబంధిత వ్యాధులలోఆహార నియమాలను, నిర్వహణను పాటిస్తూ వుండడంలో సహాయపడుతుంది. ఇతర తృణ ధాన్యాలకంటే బియ్యంలో పీచు పదార్ధాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయి. జొన్నలలో ఈ పీచుపదార్ధం 89.2 శాతం, సజ్జలలో 122.3 శాతం మరియు రాగులలో 113.5 శాతం ఉంటుంది.
ఆసియా, ఆఫ్రికా దేశాలలో వుండే స్త్రీలు తీసుకునే కాల్షియం సిఫార్సు చేయబడిన స్ధాయి కేంటే చాలా తక్కువ స్ధాయిలో ఉంది. కాల్షియం తక్కువ స్ధాయిలో ఉండడం వల్ల గర్భందాల్చిన సమయంలోను, అటుతర్వాత బిడ్డకు పాలిచ్చే కాలంలనూ బిడ్డలో ఎముకల పెరుగుదల కుంటుపడుతుంది. అంతేకాక గర్భంతో ఉన్న సమయంలో కాల్షియం సరిపోవునంతగా తీసుకోకపోవడంతో తల్లి ఆరోగ్యంతో రాజీపడవలసి ఉండడమే కాకుండా తల్లి యొక్క అస్ధిపంజరం నుండి కాల్షియం గర్భస్ధ శిశువు పెరుగుదలకు పాలు తయారుకావడానికి సహకరిస్తూ, ఉపయోగపడుతుంది. ఈ కాల్షియం లోపం వల్ల తల్లి రక్తనాళ సంబంధిత వ్యవస్ధకు హాని కలగవచ్చు. అలాగే, ఆమె అధికరక్తపు పోటుకు కూడా గురికావచ్చు.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
జొన్న
విహారంలో ఆహారంతో జాగ్రత్త
బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆహారంలో రాగులు తప్పక చేర్...