మహిళలు సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు అందిస్తున్న 5 సూత్రాలు.
భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యం మీద చూపుతుంది. ఇలాంటి సమయాల్లో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, లేదా అసలు తీసుకోకపోవడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి అదుపులో లేకపోతే ఆహారం మీద అదుపు ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం మరింత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇదొక విషవలయంగా మనిషిని వేధిస్తూనే ఉంటుంది.
మనిషి తన అవసరాలకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారపదార్థాలు సరియైనపాళ్ళలో వుండాలి. అవి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన శక్తినీ, అమినో ఆమ్లాలనీ, విటమిన్లనీ, లవణాలనీ, కొవ్వునీ, పిండి పదార్థాలనీ ఇవ్వగలిగి వుండాలి. ఇటు వంటి ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటాం. ఆహారపదార్థాలు సరియైన పాళ్ళలో లేక పోతే... అంటే- కొన్ని పదార్థాలు ఎక్కువైనా, తక్కువైనా అందులోని సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అయితే మనం రోజూ తినే ఆహారాన్నే కొద్దిగా మార్పులు, చేర్పులతో సమతుల్యంగా మలచుకోవచ్చు. సమ తుల్య ఆహారం కన్నా ఆరోగ్యకరమైనదీ, పుష్టికరమైనదీ సాధారణ శ్రమ చేస్తూ జీవనం సాగించే వారికి ఈ విధమైన ఆహారం సమతుల్యంగా ఉండవచ్చు.ఇందుకోసం నిపుణులు అందిస్తున్న పంచ సూత్రాలను చూద్దామా...
డైట్ ప్లాన్ సరిగ్గా ఉండాలి కదా అని ఒకే తరహా ఆహారంతో సరిపెట్టేయకూడదు. దీని వల్ల ఆ ప్రణాళిక సవ్యంగా నడవదు. కొన్ని రకాల పదార్థాలు మరికొన్నింటితో కలిపితే రుచిగానే కాదు, ఆరోగ్యానికీ మేలు కలుగుతుంది. అయితే, ఏ పదార్థాలు కలిపితే శరీరానికి మంచిది అనేవి తెలిసుండటం ముఖ్యం. ఉదాహరణకి- చేపలు ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. అయితే, చేపలను కూరల రూపకంగానే కాకుండా ఆవిరి మీద ఉడికించి, గ్రిల్ చేసి, ఇతర కూరగాయల సలాడ్స్‌తో తీసుకోవచ్చు.
లక్ష్యం వైపుగానే ఆహారపు అలవాట్లు ఉండాలి. మనకు నచ్చనిదైనా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కూడా మెల్ల మెల్లగా మొదలుపెట్టి శరీరానికి అలవాటు చేయవచ్చు. దీని వల్ల లక్ష్యానికి త్వరగా చేరువకావచ్చు.
కుటుంబంలోనో, స్నేహితుల్లోనో, సహోద్యోగుల్లోనూ.. మీలాగే ఆహారనియమాలు పాటించే వ్యక్తిని ఈ నియమాల్లో భాగస్వామిగా ఎంచుకోండి. దీని వల్ల ఆహార నియమాలను పాటించడంలో ప్రోత్సాహం ఉంటుంది. వాయిదా వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాయిదా వేసినా తిరిగి కొనసాగించే ధోరణి ఈ పద్ధతిలో ఎక్కువ.
మీకు మీరుగా నేను చాలా బాగా ఆహార నియమాలు పాటించగలనుఅనే కితాబు ముందే ఇచ్చుకోకండి. ఎప్పుడైనా నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల మీ ప్రణాళిక కూడా పూర్తిగా మూలన పడే అవకాశమూ ఉంది. అందుకే, ప్రతి రోజూ ఈరోజును కొత్తగా, ఇంకా మరింత ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో ప్రారంభిస్తాను అనుకోండి.
భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యం మీద చూపుతుంది. ఇలాంటి సమయాల్లో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, లేదా అసలు తీసుకోకపోవడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి అదుపులో లేకపోతే ఆహారం మీద అదుపు ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం మరింత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇదొక విషవలయంగా మనిషిని వేధిస్తూనే ఉంటుంది. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొని, నియమాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలి.
అయితే -న్యూట్రీషన్ మన ఆరోగ్యానికి సరిపోయే సమగ్ర ఆహారం సూచిస్తారు.
పప్పు ధాన్యాలకు బదులుగా రెండుకోడి గ్రుడ్లు లేదా 50 గ్రాముల మాంసం, చేప సమానపోషక విలువలు కలిగి వుంటాయి. కొద్దిగా మార్పులతో ఈ రకమైన పాళ్ళఆహారం తీసుకుంటే అది సమతుల్య ఆహారానికి దగ్గరగా వుంటుంది. సమతుల్య ఆహారంలోకి వివిధ అంశాల పోషక విలువలు తెలుసుకోవలసిన అవసరం చాలా వుంది.
సమతుల్యఆహారంలో ఇవి అత్యంత విలువైన భాగాలు. పచ్చ టి తాజా ఆకుకూరల్లో, కూరగాయల్లో బి, సి, కె. విటమిన్లు, ఇను ము, కాల్షియం తదితరాలు పుష్కలంగా వుంటాయి. వీటి లో ప్రోటీన్లు, పిండి పదార్థాలూ, కొవ్వులు ఉండవు. అ యితే ఆకుకూరల్లో వుండే పీచుపదార్థం ఆరోగ్య పరిరక్షణలో ము ఖ్యమైన పాత్ర వహిస్తుంది. అవసరానికి మించి లావుగా వున్నవాళ్లు తమ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల్ని ఎక్కువచేయడం ద్వారా ఆహారాన్ని క్రమబద్ధం చేసుకోవచ్చు.
ఆధారము: సూర్య
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/22/2020