పశుపోషణలో సాంప్రదాయేతర పంటల వినియెగం:
సాంప్రదాయ పశుగ్రాసాలే కాక, సాంప్రదాయం కానీ కొన్ని పశుగ్రాసాలు, వ్యవసాయ పంటలు నుండి, పరిశ్రమల నుండి ఉత్పత్తులుగా లభించేవి ఉన్నాయి. వీటిలో పోషక విలువలు సరైన మేతదుల్లో లేనందున పశువులకు పరిమితంగా వాడాలి. కొన్ని ఉప ఉత్పత్తులను మిశ్రమ దాణా కూడా కలిపి వాడవచ్చు. ఇలా వాడుట వలన మేపు ఖర్చు తగ్గి లాభసాటిగా ఉంటుంది. మన రాష్ర్టంలో లభ్యమగు కొన్ని పశుగ్రాసాల గురించి తెలుసుకుందాం.
పత్తి మొక్కలు
ఆంధ్రప్రదేశ్ లో పత్తిపంట చాలా వైశాల్యంలో పండిసైరు. జొన్న సాగు విస్తీర్ణం తగ్గటంతో కొన్ని ప్రాంతాల్లో జొన్న చొప్ప లభ్యం కావడం లేదు. పత్తిపంట చివరిసారిగా ఏరిన తర్వాత పత్తి మొక్కలు ఇంకా పచ్చగానే ఉంచాయి. ఈ సమయంలో ఆకులు, పూయని పత్తికాయలు కూడా ఉంటాయి. సాధారణంగా పైరును అలాగే వదిలేసాయిరూ. ఎండిపోయిన మొక్కలను తీసిపారేసేరు. లేదా వంటచెరుకుగా వాడతారు. లక్షల టన్నుల పత్తిసట్ఠే ఈ విధంగా వదలగా పోతోంది. పత్తిపంట పూర్తిగా ఏరిన తర్వాత మొక్కల్లో పై మూడు వంతుల భాగాన్ని కోసి నీడలో ఆరబెట్టినా తర్వాత పొడిచేసి ఎండు మేతగా పశువులకు మేపవచ్చు. ఈ విధంగా చేసే పశువులు తేలికగా జీర్ణించుకుంటాయి. పచ్చని ఆకులు, పూయని కాయలు ఉండటంచేత దీనిలో మసకత్తులు, శక్తినిచ్చు పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకులు పచ్చగా ఉన్నప్పడే మూడువంతులు భాగాన్ని కోసి పైన చెప్పిన విధంగా ఎండమేతల బదులు వాడవచ్చు.
ప్రొద్దు తిరుగుడు మొక్కలు, పూలు:
రాష్ట్రలో ప్రొద్దుతిరుగుడు పంటసాగు అధికమువుతోంది. పంట తీసుకున్న తర్వాతద మిగిలిన మొక్కలను కోసి వధగా పారేస్తున్నారు.అలాకాక పంట కోసిన తర్వాత మొక్కలను కోసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వావుగ్రాసంగా వాడవచ్చు. పశువులు ఆసక్తితో తినవు కాబట్టి ప్రతిరోజు ఒకటి రెండు కిలోలు ఇవ్వవచ్చు. పూల నుండి గింజలు తీసిన తర్వాత పూల బరువు మొత్తం బరువుకు సమానంగా ఉంటుంది. మనం సాధారణంగా వాడే ఎమ్దుమెతలకన్నా ఎండిన పూలలో ఎక్కువ పోషక విలువలున్నాయి. కాబట్టి ఈ పూలను కత్తిరించి పశుగ్రాసంగా వాడవచ్చు. ఈ పూలు బరువుగా గట్టిగా ఉండటం చేత దీనిలోని తేమ త్వరగా ఆరిపోదు. కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడే పూలను కత్తిరించి ఆరబెట్టి నిలువ చేయవచ్చు.
చింతగింజలను మరపట్టించి పొడిచేసి వాడవచ్చు. ఈ పొడిని పశువుల దాణాలో 20 - 30 శాతం కలపవచ్చు. ఇందిలో జీర్ణమగు మాంసకత్తులు 12 %, శక్తినిచ్చు పోషకాలు 65 % ఉన్నాయి. దీనిని అన్ని రకాలైన పశువుల దాణా వాడవచ్చు. చింతగింజలు దొరుకు ప్రదేశాలలో వీటిని పశువుల దాణాలో వాడినచో ఖర్చు కూడా తగ్గుతుంది.
చెరకు ఆకులు, గడలు:
చెరకు కోయు మాసాల్లో అనగా అక్టోబర్ నుండి మార్చ్ వరకు చెరుకు ఆకులను కొంత మాత్రమే పశువులకు మేపుతున్నారు. చాలావరకు వద్ద అవుతుంది. కొన్ని చోట్ల దీనిని ఎండబెట్టి గుడిసె కప్పులుగా వాడుకొంటున్నారు. ఈ పచ్చి ఆకుల్లో 12.7 శాతం జీర్ణముగ మాంసకత్తులు, 45.7 శాతం శక్తినిచ్చి పోషకాలు మరియు 0.4 శాతం సున్నం ఉంది. కావున ఇది లభ్యమగు మాసాల్లో దీంతో లెగ్యుమ్ జాతి పశుగ్రాసాలువాది మంచి లాభాలు పొందవచ్చు. పచ్చి ఆకులు పాతరేసి మొగుడు గడ్డి తాయారు చేసి, ఎండాకాలంలో పశువులను మేపవచ్చు. ఈ ఆకుల్లో శక్తినిచ్చు పోషకాలు తగిన మేతదులో లేనందున బెల్లం మడ్డ కలిపి పాతర వేసుకోవాలి. పచ్చి ఆకులను కత్తిరించి వాడాలి. ఈ ఆకులను ఎండబెట్టినచో పశువులు ఏ మాత్రం తినవు. కావున పచ్చిగా వున్నప్పుడే ఆకులు ఎండబెట్టినచో పశువులు ఏమాత్రం తినవు. కావున పచ్చిగా వున్నప్పుడే పశుగ్రాసంగా వాడాలి. మిగిలిన దానిని మగడు కత్తిరించి పశుగ్రాసంగా వాడుకొనవచ్చును. చెరుకు గడలాలో మాంసకత్తులు లేనందున వీటితోబాటు రోజుకు ఓ కిలో వాకితాడ్ 4-5 కిలోలు పప్పుజాతి గ్రాసాలు, సుబాబుల్ ఆకులైనా ఇవ్వాలి. పత్తిగింజలు చెక్క మిశ్రమంలో ఖనిజలవణాలు కలిపినా దాణాలో కత్తిరించి చెరుకు గడలను కలిపి మేపుకోవచ్చు.
చెరుకు పిప్పి (బాగాసి):
చెరుకు గడల నుండివ రసం తీసని తర్వాత మిగిలిన పిప్పిని బాగాసి అంటారు. ఇందులో పోషక విలువలు తక్కువ, యూరియా, బెల్లాపు మడ్డి ద్రావణం చల్లి చెరకు పిప్పిని పశుగ్రాసంగా వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువ పీచుపదార్థం ఉంటుంది. బరువు చాలా తక్కువ మాంసకత్తిలు లేవు. పశువులు ఆసక్తితో తినవు. యూరియా, బెల్లపు మడ్డి చల్లిన తర్వాతా దీనిలోని పోషక విలువలు ఎమ్దుచొప్పులకు సమానంగా ఉంటాయి. కావున దీనిని వాడినప్పుడు ఎక్కువ మేతదుల్లో పప్పుజాతి పశుగ్రాసాలు లేదా మిశ్రమ దాణా కలిపి వాడాలి.
అరటి ఆకులు:
అరటి ఆకుల్లో 5 శాతం జీర్ణముగ మాంసకత్తులు, 45% శక్తినిచ్చు పోషకాలు ఉన్నాయి. అరటి ఆకులను కత్తిరించి గడ్డితో కలిపి వాడుకోవచ్చు. దీనిలో పోషక విలువలు సరిపడలేవు. కాబట్టి పప్పు జాతి మెతలకతో కలిపి ఇవ్వాలి. అరటి కాండంలో ఎక్కువ నీరు ( 90 శాతం ) పైన ఉండటంచేత దీనిని కత్తిరించి వాడినప్పుటికి ఎక్కువ లాభం ఉండదు.
పశువుల దాణా:
దాణా దినుసులు ఖరీదు ఎక్కువ. పశుగ్రాసాలు, వాటి నుండి తయారైన ఎండుగడ్డి, మాగుడు గడ్డి వగైరా ఉత్పత్తుల ఖర్చు తక్కువ. ధాన్యపు జాతి గ్రాసాలు (జొన్న, మొక్కజొన్న, నేపియర్, పారా వగైరా) కంటే కాయజాతి గ్రాసాలలో (అలసంద, జనము, లూసర్న్, బార్సిం, సుబాబుల్, స్టాయిలో వగైరా) మాంసకత్తులు అధికంగా ఉంటాయి. దాణాలు మేసినా, కడుపు నిండడానికి గడ్డి అవసరం. అందుచేత పశువులకు ధాన్యపుజాతి గ్రాసాలు కాస్త కాయజాతి గ్రాసాలు మేసినా తర్వాత మిగతా పోషకాలకు, వాటి ఉత్పాదక శక్తి ఆధారంగా సరైన మేతదులో దాణా మిశ్రమం ఇవ్వాలి. శరీర పోషణ నాలుగైదు లీటర్ల పలుత్పత్తి వరకు పురిగా గ్రాసాలు మేపి పోషించవచ్చును. ప్రతి రెండున్నర లీటర్ల ఆవుపాలకు లేదు ప్రతి రెండు లీటర్ల గేదెపాలు ఒక కిలో మిశ్రమదాణా మేపితే పాల ఉత్పత్తికి సరిపడా పోషక విలువలు లభించి పాల దిగుబడులు పెరుగుతాయి. దాణా దినుసులతో పశువుల ఉత్పాదనకు కావాల్సిన అన్ని పోషక విలువలు సరైన పెళ్ళిలో ఉండవు. కొందరు తమ వద్దనున్న వారితాడు లేక వేరుశనగ చెక్క ఎదో ఒక్కదానిని మాత్రమే పశువులకు మేపుతారు. ఈ పద్ధతి మంచిది కాదు. తప్పని సరిగా అందుబాటులో ఉండే దాణా దినుసులతో మిశ్రమం తాయారు చేసుకుని వాడాలి.
దాణా మిశ్రమం ఎలా ఉండాలి:
మిశ్రమ దాణా ఎలా తయారు చేసుకోవాలి?
దాణా మిశ్రమము స్ధానికంగా చావుకగా లభ్యముగు ధాన్యపు గింజలు, చిరుధాన్యాలు, ధాన్యపు ఉత్తత్తులు, పప్పుదినుసులు, నూనెగింజలు, వాటి ఉత్తత్తులతో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొనే దాణాలో పశువులకు సరిపడు అన్ని పోషక పదార్దాలు, విటమినులు, ఖనిజ లవణములు తగు పాళిలో లభ్యమగునట్లు జాగ్రత్త వహించాలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020