- మధుమేహం శరీరానికి ప్రధాన ఇంధన వనరు అయిన గ్లూకోజును ఎలా ప్రభావితం చేస్తుందన్న వ్యాధి.
- సాధారణముగా ఇన్సులిన్ అనే హార్మొను శరీర కణాలు గ్లూకోజును తీసుకునేందుకు తద్వారా అదిశక్తిగా ఉపయోగపడేలా సహాయము చేస్తుంది.
- అయితే మధుమేహం ఉన్నవ్యక్తిలో అవసరంమేరకు ఇన్సులిన్ ఉత్పత్తికాకపోవటమో లేదా ఇన్సులిన్ ను శరీరకణాలు గుర్తించలేకపోవటమో లేదా రెండిటికలయిక.
- దీనివల్ల శరీరకణాలు లభిస్తున్న చక్కెరను గ్రహించలేకపోతాయి,తద్వారా రక్తములో చక్కెరస్థాయిపెరిగేందుకు దారితీస్తుంది.
- మూత్రములో చక్కెర ఉన్నప్పుడు లేదా ఉపవాసం తర్వాత లేదా మామూలు భోజనముఅయ్యాక 2గంటలతర్వాత రక్తములో చక్కెర 100మిల్లీలీటర్లకు 120మిల్లీగ్రాములకన్నా అధికంగా ఉంటే ఆవ్యక్తికి మధుమేహం ఉన్నట్లు.
మధుమేహం లక్షణాలు
- మితి మీరిన మూత్రం ఉత్పత్తి (పాలియురియా) ఎందుకనగా మితి మీరిన రక్త చక్కెరను శరీరం మూత్రము ద్వారా వదిలించుకోవటానికి ప్రయత్నిస్తుంది.
- మూత్రములో కోల్పోయిన ద్రవాల నష్టాలను పూడ్చుకునేందుకు గాను విపరీతమైన దప్పిక మరియు ద్రవాలను అధికంగా తీసుకోవటం(పాలిడిప్సియా)
- అధిక రక్త గ్లూకోజు కంటిని ప్రభావితం చెయ్యటం వల్ల దృష్టి మసకబారటం,కంటిఅద్దాలను తరచూ మార్చాల్సిరావటం జరుగుతుంది.
- శక్తి లేక పోవటం వల్ల ఆకలి పెరుగుతుంది
- చక్కెరను మామూలుగా ఉపయోగించుకొలేకపోవటం వల్ల శరీరం కొవ్వును కండరాలను ఇంధనంగా వాడటం వల్ల వివరించలేని విధంగా బరువు తగ్గుతుంది
- లభ్యమయ్యే చక్కెరను ఉపయోగించుకోలేకపోవటం వల్ల సోమరితనం లేదా అలసట
- తెగిన గాయాలు త్వరగా మానక పోవటం
- ఈ లక్షణాలు రక్తచక్కెర కొద్దిగా పెరగినట్లయితే తక్కువగానే కనిపిస్తాయి.
మధుమేహం రూపాలు
మధుమేహానికి మూడు ప్రధాన రూపాలున్నాయి
- వర్గం1
- వర్గం2మరియు
- గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహం
వర్గం1మధుమేహం లేదా ఇన్సులిన్ మీద ఆధారపడ్డ మధుమేహం
- చాలా చిన్నవయసులో మొదలవుతుంది
- ఇన్సులిన్ లోపము వల్ల కలుగుతుంది
- దీనికి చికిత్శ ఉందికానీ పూర్తిగా నయము కాదు. ఇంజక్షన్ల వల్ల ఇన్సులిన్ ను అందించటం ప్రధాన చికిత్శా మార్గము.
- ఆహారములో మార్పులు మరియు శారీరక వ్యాయామాలు ఇన్సులిన్ ఇంజక్షన్లు రక్తములో చక్కెర స్థాయిని నియంత్రించటములో సహాయం చేస్తాయి మరియు చిక్కులను పరిమితం చేస్తాయి
వర్గము2 మధుమేహం లేదా ఇన్సులిన్ మీద ఆధారపడని మధుమేహం
- మెల్లగా మొదలవుతుంది, వాడుకగా చేయించే రక్తపరీక్షలలో బయటపడుతుంది
- సాధారణంగా స్థూలకాయం వారిని లేదా బరువు ఎక్కువగా ఉన్నవారిని ప్రభావితులను చేస్తుంది.
- మధ్య ఊబకాయం (నడుము చుట్టూ ఉండే కొవ్వు), వ్యక్తులకు ఇన్సులిన్ నిరోధకాన్ని కలిగించటంలో ప్రేరకంగా ఉంటుందని తెలుస్తూ ఉంది.
- మందులు, నియమిత అహారం, బరువు తగ్గేందుకు మరియు రక్తములో చక్కెరస్థాయి పెరిగేందుకు వ్యాయామాలు చెయ్యటం వంటి జీవనశైలిలో మార్పులు అన్నీ చికిత్సలో భాగాలు
గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహం
- అన్ని గర్భధారణల లోను 1-2 శాతం ఇది సంభవిస్తుంది మరియు ప్రసవానంతరం మెరుగుపడటం కానీ పూర్తిగా నయమవటం కానీ జరుగుతుంది. దీనితో ప్రభావితులైన వారిలో 1-2శాతము మహిళలు తదనంతర జీవితములో వర్గము2 మధుమేహానికి గురవచ్చు.
- గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహంకు పూర్తిగా చికిత్శచేయవచ్చు కానీ గర్భధారణ సమయం మొత్తమూ తల్లికీ బిడ్డకూ మధుమేహ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా వైద్యపర్యవేక్షణ శ్రద్ద అవసరం.
- తల్లి అదుపులేని రక్తచక్కెర వల్ల బాధ పడవచ్చు. ఇలాంటి మహిళలకు సహజ ప్రసవం సాధారణంగా కష్టమవుతుంది.
- భారీ పరిమాణములోని శిశువు మరియు ఇతరచిక్కులు మరణానికి దారితీయటంతో సహా బిడ్డకు ప్రమాదాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నతల్లికి జన్మించిన పిల్లల వారు పెద్దయ్యాక మధుమేహానికి గురికావచ్చు.
మధుమేహానికి సంబంధిత చిక్కులు
తీవ్రమైన చిక్కులు
రక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లై సెమియా)
- మధుమేహాన్ని నయం చేసేందుకు మందులు వాడుతున్నదశలో శీఘ్రంగా. తీవ్రంగా రక్త చక్కెర స్థాయి తగ్గటాన్నిరక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లైసెమియా) అని అంటారు.
- అధిక మోతాదులో ఇన్సులిన్ వాడటం,ఆహారములో పిండిపదార్ధములు చాలినంత లేక పోవటం, నోటి ద్వారా తీసుకునే యాంటీ బయాటిక్ మందులతో పాటు మద్యం తీసుకోవటం, లేదా మితి మీరిన వ్యాయాయం వల్ల కలగవచ్చు.
- సాధారణ రోగలక్షణాలు నీరసం, చెమటలుపట్టటం, కలత చెందటం, గుండె దడ, తలతిప్పటం
- మధుమేహ వ్యాధిగ్రస్తులెవరన్నా రక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లైసెమియా) బారిన పడితే వారికి తక్షణం చక్కెరకానీ గ్లూకోజుకానీ ఇవ్వాలి మరియు వైద్యుడిని సంప్రదించాలి.
కెటొఎసిడోసిస్
- అదుపులేని మధుమేహం కెటొఎసిడోసిస్ కి దారితీస్తుంది ఇదొక తీవ్రమైన స్థితి మరియు అపస్మారకానికి దారి తీయవచ్చు.
- ప్రారంభదశలో రోగికి తీవ్రమైన దప్పిక, నీరసం మరియు వాంతులతో కూడిన లేక వాంతులు లేని నిదుర మత్తు. ఇది ఒత్తిడికి మరియు తీవ్ర అంటువ్యాధులకు గురయినప్పుడు సంభవిస్తుంది.
- ఇది వచ్చిందని అనుమానం కలిగినప్పుడు తక్షణం ఆసుపత్రికిరోగిని తీసుకువెళ్ళాలి
అంటువ్యాధులు
మధుమేహము గలవారు క్షయ,చర్మ మూత్రాశయద్వారము మరియు పాదాలఅంటువ్యాధులకు గురవుతారు.
ఆలస్యముగా నయమయే ప్రక్రియవల్ల అదుపులేనిపాదాల అంటువ్యాధుల వల్ల కణజాలము యొక్కమృతికి(గాంగ్రిన్) దారితీయవచ్చు తద్వారా ఆ పాదము యొక్క భాగాన్నితొలగించవలసిరావచ్చు.
చిన్నా పెద్దా రక్తవాహికలు దెబ్బతినవచ్చు(ఆంజియోపతి)తో సహా దీర్ఘకాలపు చిక్కులుఉన్నాయి. చిన్నరక్తవాహికలు దెబ్బతినటం మైక్రోఆంజియోపతికి దారితీయవచ్చు.అది ఈ క్రిందివాటిలోఒకదానికికానీ ఎక్కువవాటికి కానీ కారణమవవచ్చు:
- మధుమేహనేత్రాంతఃపటలవైకల్యం ఇందులోనేత్రాంతఃపటలం దెబ్బతిని తీవ్రదృష్టిలోపానికి లేదాఅంధత్వానికి దారితీయవచ్చు.
- మధుమేహనరాలవ్యాధి ఇది అసాధారణమైన,తగ్గిపోయిన స్పర్శకు దారితీస్తుంది,పాదాలతో మొదలై చేతివేళ్ళకు చేతులకు పాకుతుంది.
- మధుమేహకండరాలవ్యాధి అనేది నరాలవ్యాధి వల్ల కలిగే బలహీనత
- మధుమేహమూత్రపిండాలవ్యాధి,మూత్రపిండాలు దెబ్బతినటంవల్ల తీవ్రమైనమూత్రపిండాల వైఫల్యానికి గురిచేస్తుంది తదనంతరం రక్తశుద్ధి అవసరమవుతుంది. వయోజనులలో మూత్రపిండాలు విఫలమవ్వటానికి మధుమేహం అన్నది ఒకసాధారణకారణం
- స్థూలరక్తనాళమయవ్యాధి హృదయకోశరక్తనాళమయవ్యాధికి దారితీస్తుంది దానికి వేగంగారక్తనాళాలు గట్టిపడడటమొకకారణం.
మధుమేహనిర్వహణ
మధుమేహానికి చికిత్శ ఉంది కానీ పూర్తిగా నయం కాదు మందులుకాకుండా ఆహారము మరియు వ్యాయాయము మంచిచికిత్సాప్రణాళికలు
ఆహారము
- సాధారణ భారతీయ ఆహారము మధుమేహానికి తగినది.అయినప్పటికీ పోషకాహారము ఎంతతీసుకోవాలనేది వ్యక్తి యొక్క వయసు,లింగము,బరువు,పొడవు,శారీరకశ్రమ మరియు శరీరధర్మసంబంధమైన అవసరాలను బట్టి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది
- ఉండాల్సిన దానికన్నా పదిశాతము తక్కువ శరీరబరువు ఉండేలా చూసుకోవాలి
- మొత్తము కాలరీలలో 60-65%శాతము పిండిపదార్ధాల నుంచి, 15 -20శాతము మాంసకృత్తులనుంచి, 15 -20శాతము కొవ్వునుంచి.
- రక్తచక్కెరమీద పిండిపదార్ధాల ప్రభావంగురించితెలిపే గ్లిసెమిల్ ఇండెక్స్ తక్కువగా ఉండే తృణధాన్యాలను పైన పొట్టుతో లేదా కాయధాన్యాలను తీసుకోవటం అభిలషణీయం.
- సరైన పరిమాణాల్లో ఫలాలను తీసుకోవచ్చు.
- మాంసకృత్తులను శాఖాహారవనరుల నుండిస్వీకరించటం మంచిది ఎందుకనగా అవి ఆహారానికి వినియోగము లేనిపదార్ధాన్ని అందిస్తాయి మరియు జంతుమాంసకృత్తులు కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడతాయి.
- వ్యాధితీవ్రత తక్కువగా ఉంటే కాలరీలు తక్కువగా కలిగియున్న ఆహారము మరియు చక్కెరవినియోగమున్న మిఠాయిలను,జాములు జల్లీలను తీసుకోకపోతే సరిపోతుంది.
- తీవ్రత పెరుగుతున్నప్పుడు వైద్యుని లేదా ఆహారశాస్త్రజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం.వారికి రక్తచక్కెర అంచనా దానితోపాటు మందులమోతాదులో హెచ్చింపులు తగ్గింపులు మరియు ఆహారపుసలహాలు తప్పనిసరి
- గర్భధారణ సమయములోని మధుమేహం వైద్యపర్యవేక్షణ జాగ్రత్తగా జరగాలి.ఆమెప్రతి కిలోగ్రాముకు 30-35కిలో కాలరీలశరీరబరువును తీసుకొనితీరాలి.ఆమె ఆహారములో శరీరబరువుకు తగ్గట్టుగా ప్రతి కిలోగ్రాముకు 1.5 -2 .5 గ్రాముల మాంస కృత్తులు ఉండాలి.గర్భధారణ మొత్తము సమయములో బరువులో 12కిలోగ్రాములకు మించకూడదు.తల్లీబిడ్దలకు చిక్కులెదురవ్వకుండా ఉండేందుకుగాను రక్తచక్కెర స్థాయిని గర్భిణీగా ఉన్నంతకాలము సాధారణస్థాయిలోనే కొనసాగించాలి.
వ్యాయాయము
- వ్యాయాయము ఎవరికైనా మంచిదే ముఖ్యంగా మధుమేహముతో ఉన్నవారికి.మధుమేహం ఉన్నవారిలో క్రమంగా వ్యాయామం చేసేవారిలో మందుల అవసరం తక్కువగా ఉంటుంది.
- వ్యాయామ పద్ధతులను తీసుకునే ఆహరము మరియు ఇన్సులిన్/నోటిమందులమోతాదు వంటివాటి మీద ఆధారపడి ఎంపికచెసుకోవాలి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.