অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పౌష్టికాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత

పౌష్టికాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత

  1. రక్తహీనత ఏర్పడడానికి గల కారణాలు - కారకాలు
    1. ఇనుము లోపంవలన వచ్చే రక్తహీనత
    2. మనం తీసుకునే ఆహారం నుంచి అతితక్కువ ఇనుమును శోషించుకోవడం
    3. విటమిన్‌ బి12 లోపం వలన వచ్చే రక్తహీనత ( పెరినిషియస్‌ ఎనీమియ)
    4. ఫోలిక్‌ ఆమ్లం  లోపం
  2. శరీరధర్మ దశలలో సాధారణంగా కన్పించే ఇనుము లోపం
    1. శిశుదశలో
    2. కౌమారదశ  ( ఎదుగుతున్న దశ )
    3. బహిష్టు దశలోగల స్త్రీలలో
    4. గర్భిణీ  స్త్రీలు
    5. బహిష్టు ఆగిపోయిన స్త్రీలు, వృద్ధులు, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న పురుషులు
  3. రక్తహీనత లక్షణాలు
    1. ఇనుము లోపం
    2. బి12 లోపం
    3. ఫోలిక్‌ ఆమ్లం లోపం
  4. రక్త హీనత వలన చేసే విధుల నిర్వహణ పర్యవసానాలు
  5. రక్తహీనత -వ్యాధి నిర్ధారణ
  6. రక్తహీనతకు చికిత్స
    1. ఇనుములోప రక్తహీనత
    2. రక్తహీనతను అరికట్టడం
  • మనశరీరంలో రక్తకణాలు తగినంతగా లేకపోవడం, హిమోగ్లోబిన్‌ సరిపడినంతగా లేకపోవడం వల్లగాని రక్తహీనత ఏర్పడుతుంది.
  • హిమోగ్లోబిన్‌ అనేది  ఆమ్లజనిని సరఫరా చేసే వర్ణద్రవ్యం. ఇది ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. రక్తహీనత ఏర్పడితే ప్రాణానికే అపాయం ఏర్పడవచ్చు.
  • 400 విభిన్న విధాలైన రక్తహీనతలు ఉన్నప్పటికినీ ఇనుపధాతులోపం వల్ల, విటమిన్‌ బి12, ఫోలిక్‌ ఆమ్లంలోపం వల్ల వచ్చే సామాన్యమైన రక్తహీనతల గురించి మనం చర్చించుకుందాం.
  • శరీరం వెలుపలికి రక్తం కారడం, దీర్ఘకాలిక వ్యాధి, గర్భిణీ సమయంలో, మద్యపానం వల్ల, ఋతు కాలంలో రక్త స్రావంలో అపక్రమత, అంటువ్యాధి, మరియు ఆనువంశికతా పరిస్థితుల కారణంగా కూడా రక్తహీనత ఏర్పడవచ్చు.

రక్తహీనత ఏర్పడడానికి గల కారణాలు - కారకాలు

ఇనుము లోపంవలన వచ్చే రక్తహీనత

అతి తక్కువ ఇనుము మాత్రమే శరీరానికి చేరడం వలన తగినంతగా హిమోగ్లోబిన్‌ ఉండకపోవడం, ఇనుము లోపంవలన వచ్చే రక్తహీనతకు మూడురకాల కారణాలున్నాయి. అవి ఏవంటే :
  • తక్కువ పరిమాణంలో ఇనుప ధాతువు గల ఆహారపదార్ధాలను తీసుకోవడం
  • పండ్లు, సంపూర్ణ గింజధాన్యాలు , రొట్టెలు, చిక్కుళ్ళు,  పలుచని(లీన్‌) మాంసం, ఆకు కూరలు వంటి
  • ఇనుము సమృద్ధిగాగల ఆహారపదార్ధాలను తగినంతగా తీసుకోకపోవడమనేది భారతదేశంలో అతి సామాన్యంగా ఉండే ఇనుప ధాతులోప కారణంగా వచ్చే రక్తహీనతకు కారణమౌతున్నది.
  • కౌమార దశలోనే గర్భవతులు కావడం, వెంట వెంటనే చూలింతలు కావడం కూడ ప్రధాన మైనది.
  • దీర్ఘకాలంగా రక్తాన్ని కోల్పోవడం: బహిష్టు కాలంలో అధిక రక్తస్రావం జరగడం వంటి శరీరం లోపల విడవకుండా రక్త స్రావం జరగడం. కడుపునొప్పి, పెప్టిక్‌ అల్సర్‌  (జీర్ణాశయంలో పుండు), అల్సరేటివ్‌ కోలైటిస్‌, పేగు వాపు వ్యాధి, పాలిప్స్‌, ఉదర మరియు చిన్నప్రేవు సంబంధిత పుండ్లు( జీర్ణాశయంలేదా ప్రేవుసంబంధిత కేన్సర్‌ ), మూల వ్యాధి (మొలల వ్యాధి). దీనితోబాటు తరచుగా ఏస్పిరిన్‌, ఇబుప్రోఫెన్‌, లేదా ఉద్రేకాన్ని, పొట్టలో మంటను  తగ్గించే (నాన్‌ స్టీరాయిడ్‌ ఏంటి –  ఇన్‌ఫ్లెమేటరి)మందులు, అంతేగాకుండ దీర్ఘకాలంగా మద్యాన్నిసేవించే అలవాటు కల్గి ఉండడం వంటి కారణాల వలన ఇనుము   లోపంవలన వచ్చే రక్తహీనత ఏర్పడుతోంది.

మనం తీసుకునే ఆహారం నుంచి అతితక్కువ ఇనుమును శోషించుకోవడం

  • శస్త్రచికిత్సద్వారా  శరీరంలోపలగల జీర్ణాశయ భాగాన్నిలేదా జీర్ణాశయం మొత్తాన్ని లేదా సీలియాక్‌
  • స్ప్రూని( గోధుమ లేదా రై లో ఉండే గ్లూటిన్‌ అనే ప్రోటీన్‌ వల్ల చిన్నప్రేవు గోడల అంచులు దెబ్బతినే స్థితి ఏర్పడుతుంది) తొలగించడం  వల్ల ఇనుము శోషణం అతితక్కువగా జరుగుతుంది.

విటమిన్‌ బి12 లోపం వలన వచ్చే రక్తహీనత ( పెరినిషియస్‌ ఎనీమియ)

విటమిన్‌ బి12 లోపం  ఉంటే సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌ బి12 ను  జీర్ణమండలం   శోషించుకోలేదు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ నిర్వహణకు బి12 ఆవశ్యకత గలదు.  జంతువుల నుండి లభించే మాంసం, చేపలు, పాల ఉత్పత్తుల లో విటమిన్‌ బి12 ఉంటుంది. పెరినీషియస్‌ ఎనీమియాకు నాలుగు రకాల కారణాలున్నాయి.

  • జీర్ణాశయపు గోడల వెంబడి ఉత్పత్తి అయ్యే సహజ కారకం దెబ్బ తినడం కారణంగా,
  • బి12 శోషణం అయ్యే చిన్న ప్రేవు ను తొలగించడం వల్ల,
  • క్రొహన్స్‌ జబ్బు - దీర్ఘకాలంగా  ఉంటున్న కడుపులో మంటవలన జీర్ణ నాళంలో ఏ భాగం    పైనైనా ప్రభావం చూపిస్తుంది,
  • గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు లేని శాకాహార భోజనం వలన

ఫోలిక్‌ ఆమ్లం  లోపం

  • ఫోలిక్‌ ఆమ్లం లోపం ఏర్పడడానికి ముఖ్య కారణం ఫోలిక్‌ ఆమ్లం సరిపడినంతగా తీసుకోలేక  పోవడం, తాజా ఆకుకూరలు, పుట్టగొడుగులు,  లీమా చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళ నుండి ఈ విటమిన్‌ ప్రధానంగా అందుతుంది.
  • బీదవారిలోను వృద్ధులలోను (అల్ప స్థాయిలో ఆహారం తీసుకునే అలవాటుగల వారిలో) మద్యం అతిగా సేవించేవారు, ఎదుగుతున్న దశలోనే గర్భిణులైన వారిలో, వెంట వెంటనే గర్భవతులు కావడం మరియు క్రోహన్స్‌ జబ్బులేదా సీలియాక్‌ స్ప్రూ వంటి ప్రేవులలో రుగ్మత గల వారికి సామాన్యంగా  ఫోలిక్‌ ఆమ్ల లోపం ఏర్పడుతుంది.

శరీరధర్మ దశలలో సాధారణంగా కన్పించే ఇనుము లోపం

శిశుదశలో

  • అప్పుడే పుట్టిన శిశువులో హిమో గ్లోబిన్‌ స్థాయి అధికంగా ఉండి శిశువు దేహం ఇనుమును నిల్వచేసుకునే విధంగా ఉంటుంది. 4 - 6 నెలల వరకు శిశువుకు కావలసిన ఇనుము  కాలేయంలో నిల్వ ఉంటుంది. పాలల్లో చాలా తక్కువగా ఇనుము ఉండడం వల్ల  కొంత కాలం తర్వాత, శిశువులో  తక్కువ స్థాయిలో ఇనుము లోపం కన్పిస్తుంది.
  • తల్లి పాల  నుండి బిడ్డను తప్పించడానికి ఇచ్చే అదనపు ఆహారం ద్వారా ఇనుమును అందించి  ఈ   లోపాన్ని సరిదిద్దవచ్చు .
  • నెలలు నిండకుండానే పుట్టిన, లేదా పురుడైన వెంటనే రక్తస్రావం జరిగి ఇనుము సామాన్య నిల్వలు తగ్గిపోవడమనే కారణంగా  ముందుగానే కన్పించిన ఇనుములోప ప్రభావం తీవ్రంగానే ఉంటుంది.

కౌమారదశ  ( ఎదుగుతున్న దశ )

  • ఈ దశలో వేగవంతమైన పెరుగుదల ఉంటుంది.వెలుపలిపొరల శోషణానికి ఇనుము అవసరముంటుంది.
  • ఆహార అలవాట్ల వలన సాధారణంగా పెరుగుదలలో  సమస్యలు రావచ్చు.

బహిష్టు దశలోగల స్త్రీలలో

  • స్త్రీలు  ప్రతీ నెల బహిష్టు కాలంలో సగటున 30 మిల్లీగ్రాముల ఇనుమును కోల్పోతారు. రోజు వారి అవసరంతోబాటు అదనంగా రోజుకి ఒక మిల్లీగ్రామ్‌ ఇనుము వారి ఆహారంలో ఉండేటట్లు చూడాలి.

గర్భిణీ  స్త్రీలు

  • పిండం పెరుగుదలకు కావలసిన ఇనుమును, ప్రసవంలో నష్టపోయిన రక్తాన్ని భర్తీచేయడంలో ఉండే ఇనుము నిల్వలను మెరుగు పరచడం.
  • గర్భవతులైన స్త్రీలకు ప్రతిరోజు 4-6 మిల్లీ గ్రాముల ఇనుము అవసరమౌతుంది.
  • వారు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు 30-40 మిల్లీగ్రాముల ఇనుప ధాతువు ఉండే ఆహారం ఇవ్వాలి. ఇలాంటి ఆహారం  ఇవ్వకపోతే రక్తంలో ఇనుము లోపం కన్పించడం తప్పనిసరి.

బహిష్టు ఆగిపోయిన స్త్రీలు, వృద్ధులు, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న పురుషులు

  • ప్రతీరోజు  తీసుకునే ఆహారంలో ఇనుము సరిపడినంతగా లేకపోవడం, జీర్ణనాళం నుండి రక్త స్రావం   జరగడం ఫలితంగా ఇనుము లోపం ఏర్పడుతుంది.

రక్తహీనత లక్షణాలు

ఇనుము లోపం

ఇనుము లోపం వల్ల వచ్చే రక్తహీనత (ఉంటే గనుక )లో కన్పించే లక్షణాలు

  • కొన్నిసార్లు అకస్మాత్తుగా కూడ లక్షణాలు కన్పించకుండానే ఈ రక్తహీనత ఉంటుంది.
  • పాలిపోవడం
  • బలహీనత
  • అలసట
  • చాతినొప్పి( తీవ్రస్థాయిలో లోపం ఉన్న సందర్భాలలో)
  • శ్వాసక్రియ వేగం తగ్గడం( తీవ్రస్థాయిలో లోపం ఉన్న సందర్భాలలో)
  • వేగవంతమైన హృదయ స్పందనలు
  • అధిక శ్రమ వలన గుండె కొట్టుకునే వేగం పెరగడం ( తీవ్రస్థాయిలో లోపం ఉన్న సందర్భాలలో)
  • శీఘ్రగతిలో శ్వాసక్రియ జరపడం
  • అల్ప రక్త పీడనం
  • ఏకాగ్రత లోపించడం

బి12 లోపం

బి12 లోపం వల్ల వచ్చే రక్త హీనతలో కూడ ఇనుము లోపం వల్ల వచ్చే రక్తహీనత లక్షణాలే కన్పించి    నప్పటికినీ   వాటి కారణంగా క్రింది ఫలితాలు ఏర్పడతాయి.

  • కామెర్లు
  • స్పర్శ జ్ఞానం లోపించడం (తిమ్మిరెక్కడం) మరియు చేతులు, పాదాలు లేత రంగు లోకి మారడం
  • సమతుల్యతా సమస్యలు
  • గాబరా (చికాకు) కల్గడం
  • వ్యక్తిత్వంలో మార్పులు, నిరుత్సాహం కల్గడం

ఫోలిక్‌ ఆమ్లం లోపం

ఫోలిక్‌ ఆమ్లం లోపం వలన వచ్చే రక్తహీనతలో కూడ బి12 లోపం వల్ల వచ్చే రక్త హీనతలో ఉండే లక్షణాలే కన్పించినప్పటికినీ మరికొన్ని క్రింది లక్షణాలు కన్పిస్తాయిః

  • జీర్ణకోశనాళం నుండి రక్తస్రావం అయితే నల్లగా, గాఢమైన ఎరుపు లేదా రక్తవర్ణంతో విసర్జింపబడుతుంది.
  • కడుపులో నొప్పి
  • బరువు తగ్గడం
  • అలసట
  • ఛాతి నొప్పి
  • చర్మం,  నాలుక, అరచేతులు, చేతుల వేళ్ల కణుపుల మధ్య పాలిపోవడం సామాన్యంగా కన్పిస్తుంది.

రక్త హీనత వలన చేసే విధుల నిర్వహణ పర్యవసానాలు

  • నరాల సంబంధిత మరియు ప్రవర్తన సరళిలో ఉండే లక్షణాలు:  అలసట, మందత్వం, ఏకాగ్రత లేకపోవడం, చురుకుదనం  క్షీణించడం వంటి లక్షణాల ప్రభావంతో చాల తక్కువ స్థాయి లో ప్రవర్తన, పనితీరు ఉంటుంది. ఎదుగుతున్నదశలోగల బాలలలో ఇనుము లోపం ఉన్నట్లయితే విద్యాభ్యసన పరీక్షలలో  తక్కువ స్థాయిని మాత్రమే సాధించగలరు.
  • ఉదర సంబంధం, చిన్నప్రేవులలో కన్పించే ప్రభావం:  చిన్న ప్రేవుల గోడల అంచులకు అంటి పెట్టుకునే జిగురు  (మ్యూకస్‌) పదార్ధము వివిధ మార్పులు చెందడంవల్ల గ్జైలోజ్‌ , కొవ్వు వంటి కొన్ని పోషకాల శోషణం పై ప్రభావం చూపుతుంది.
  • వ్యాధి నిరోధక సామర్ధ్యం, అంటు వ్యాధి సోకడం : వ్యాధి నిరోధక సామర్ధ్యం తగ్గి, అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.
  • ప్రత్యుత్పత్తి లో వచ్చే ఫలితాలుః గర్భధారణ సమయంలో ఫోలేట్‌ , బి12 ల తోబాటు ఇనుము లోపం ఉంటే పిండం పెరుగుదల సరిగా లేకపోవడం( తక్కువ బరువు గల శిశువు పుట్టడం) తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న వారికి నెలల తక్కువ బిడ్డపుట్టడం, గర్భంలోనే పిండం చనిపోవడం వంటివి జరుగుతాయి. గర్భస్థ పిండానికి ఇనుము, ఫోలేట్‌లు  చాలినంతగా లేక పోవడంతో పుట్టిన వెంటనే శిశువుకి  తల్లి పాల నుండి లభించే ఇనుము, ఫోలేట్‌లు అతి తక్కువ స్థాయిలో ఉండడంతో చాల బాధపడడం జరుగుతుంది. భారత దేశంలో సర్వసాధారణంగా తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలలో గుండె ఆగిపోయి హఠాన్మరణాలు సంభవిస్తాయి. రక్తహీనతగల తల్లులకు సులభంగా  అంటువ్యాధులు సోకుతాయి. అంతే గాకుండా త్రాంబో ఎమ్‌ బోలిక్‌ ఎపిసోడ్స్‌ (రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం) కు ఎక్కువగా గురౌతారు.
  • ·పనిసామర్ధ్యంలో తగ్గుదలః   పెద్దవారైన స్త్రీ, పురుషులలో రక్తహీనతగనుక ఉంటే కండరాల అలసటతో పని సామర్ధ్యం తగ్గుతుంది. ఏకాగ్రత లోపించడంవలన చేసేపనిలో పొరపాట్లు దొర్లుతాయి. దీనివలన ముఖ్యంగా పరిశ్రమలు వ్యవసాయరంగాలలోని ఉత్పత్తులపై అధిక ప్రభావం ఉంటుంది.

రక్తహీనత -వ్యాధి నిర్ధారణ

రోగిలో కనబడే లక్షణాలను అనుసరించి రక్త పరీక్షల ద్వారా రక్తంలో ఉండే హిమోగ్లోబిన్‌ స్థాయిని   అంచనా వేయడం వలన రక్తహీనతను నిర్ధారణ చేస్తారు.

రక్త హీనత - తెలుసుకునే అంశాలు:

  • పురుషులలో- 13గ్రాములు/ డిఎల్‌ కన్నా తక్కువ
  • సామాన్యస్త్రీలలో( గర్భవతి కానిస్త్రీలలో)- 12గ్రాములు/ డిఎల్‌ కన్నాతక్కువ
  • గర్భవతులలో- 11గ్రాములు/ డిఎల్‌ కన్నా తక్కువ
  • 6నెలలనుండి 6సంవత్సరాల వయస్సుగల పిల్లలలో- 11గ్రాములు/డిఎల్‌ కన్నా తక్కువ
  • 6 సం|| నుండి 14 సం|| వయస్సుగల పిల్లలలో- 12గ్రాములు/డిఎల్‌ కన్నాతక్కువ
  • ఇంకను  ఎర్రరక్త కణాల పరిమాణాన్నిబట్టి అది ఏ రకపు రక్తహీనతో గుర్తించగలం.
  • ఇతర నిర్ధారణ విధానాలను ఉపయోగించుతారు. అందులో భాగంగా ఎముక మజ్జను సూక్ష్మదర్శిని ద్వారా   పరీక్షించడం. దీనినే బోన్‌ మేరో బయాప్సి అంటారు.బి12 రక్తహీనతను గుర్తుపట్టడానికి ఇది సహాయపడుతుంది.
  • కొన్ని సార్లు వైద్యులు ముందస్తు గా బహిష్టులాగిపోయే  స్త్రీలకు  రక్త పరీక్షలు జరిపి  ఫెర్టిన్‌ స్థాయిలను పరిశీలిస్తారు. రక్త ప్రవాహమలో ఖనిజ లవణాలు ప్రసరించడానికి ముందుగా ఇనుపధాతువు లో ఈ ఫెర్టిన్‌ అనే ప్రోటీన్‌ ఉంటుంది.

రక్తహీనతకు చికిత్స

ఇనుములోప రక్తహీనత

  • రక్తహీనతతో బాధపడుతున్నవారి వయస్సు, రక్తహీనతకు గల కారణం, దాని తీవ్రతను బట్టి చికిత్స జరుగుతుంది.
  • వైద్యులు తరచుగా ఇనుము సమృద్ధిగా  లభించే ఆహారాలను (కాలేయం, సముద్రంనుంచి లభించే ఆహార పదార్ధాలు, ఎండు ఫలాలు, లీమా చిక్కుళ్ళు, అన్ని గింజ ధాన్యాలు, ఆకుకూరలు వంటివి) లేదా ఇనుము కల్గిన మాత్రలు (ఐరన్‌ మాత్రలు) తీసుకోవాలని సూచిస్తారు.
  • తగుమాత్రంగా లేదా తీవ్రమైన రక్తహీనతకు కారణమైన ఆహారంలో ఏర్పడే లోపాన్ని సరిచేయడానికి ఫెర్రస్‌ సల్ఫేట్‌ వంటి ఇనుము కల్గిన మాత్రలను నోటి ద్వారా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • నోటి మాత్రల ద్వారా రోగికి వాంతులు కావచ్చును. కొంత జిఐ (జీర్ణనాళం- గాస్ట్రో ఇన్‌టస్టైన్‌ ) అపక్రమత వలన కూడ మాత్రల ద్వారా తీసుకోవడం మంచిదికాదు. అటువంటి వారికి, (అతను/ఆమెకు) ఇంజక్షన్‌ రూపంలో ఇనుమును అందించడం జరుగుతుంది.  ఈ రెండు చికిత్సలలో కూడ 12 రోజులలో రోగిపై (ఔషధ) మందు ప్రభావం కన్పిస్తుంది.
  • ఇనుముతో బాటు విటమిన్‌ బి12 , ఫోలిక్‌ ఆమ్లం ఇవ్వడం అవసరం.
  • రక్తం కోల్పోవడం లేదా శస్త్ర చికిత్సలో రక్తం కోల్పోవడం కారణంగా అతి తీవ్రమైన రక్తహీనతతో బాధపడ్తున్న రోగులకు రక్తాన్ని ఎక్కించడం ద్వారా లేదా హార్మోన్‌ ఇంజక్షన్లను ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు.

రక్తహీనతను అరికట్టడం

  • ఆరోగ్యకరమైన , ఇనుము సమృద్ధిగా కల్గిన ఆహార పదార్ధాలను తీసుకోవాలి. రక్తకణాల సంఖ్య సంతృప్తికరంగా ఉండి, వాటి అభి వృద్ధి ,నిర్వహణకు బి కాంప్లెక్స్‌ విటమిన్‌ అవసరమౌతుంది.
  • గింజ ధాన్యాలు(అపరాలు) ఆకుకూరలు , ఇతర కాయగూరలు మరియు మాంస ఉత్పత్తులను మనం భుజించే ఆహారంలో తీసుకుంటే  రక్తకణాల అభివృద్ధి బాగుంటుంది.
  • తల్లి పాలకు బదులుగా శిశువుకు అందించే ఆహారంలో ఇనుము సమృ ద్ధిగా  ఉండాలి.
  • నారింజ, జామ, ఉసిరి మొదలగు విటమిన్‌ సి ఎక్కువగా గల  పండ్లను  మనం రోజువారి ఆహారంలో వినియోగిస్తే మన శరీరంలో ఇనుము శోషణం బాగా జరుగుతుంది.
  • ఇనుము శోషణాన్ని ఆటంకపరచే తేనీరు (టీ) వంటి పానీయాలు, చింత పండువంటి ఆహారాలను, ముఖ్యంగా  వ్యాధినిరోధక రక్షణ తక్కువగాగల గర్భిణీ స్త్రీలు, పిల్లలు తీసుకోకుండా చూడాలి.
  • పెరటి తోట పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఇనుము సమృద్ధిగాగల ఆకుకూరలను అందుబాటులోకి తెచ్చుకోవాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate